Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Director General Of Military Operations Press Meet Over Operation Sindoor1
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్‌ ఆర్మీ వార్నింగ్‌

ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్‌ చేశాంఉగ్రవాద ట్రైనింగ్‌ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్‌ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్‌ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్‌ కసబ్‌,డేవిడ్‌ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్‌ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్‌ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్‌ స్ట్రైక్‌ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్‌ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్‌ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్‌ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్‌ చేశాంలాహోర్‌ నుంచి డ్రోన్‌,యూఏవీలతో భారత ఎయిర్‌ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌ చేసింది.గైడెడ్‌ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను నాశనం చేశాం లాహోర్‌ నుంచి డ్రోన్‌,యూఏవీలతో భారత ఎయిర్‌ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌ చేసింది.గైడెడ్‌ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్‌ నుంచి నలియా వరకు డ్రోన్‌లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు మరోసారి ​కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్‌ డీజీఎంవో మాకు ఫోన్‌ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్‌ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్‌ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్‌ మెసేజ్‌ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్‌ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్‌ అంతు చూస్తాంపాక్‌ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్‌ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్‌ చేస్తున్నాం​

US Vice President JD Vance Called To PM Narendra Modi2
ప్రధాని మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌

న్యూఢిల్లీ: -అగ్రరాజ్యం అమెరికా సాక్షిగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఎస్‌ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడారు జేడీ వాన్స్‌. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జేడీ వాన్స్‌. అయితే పాక్‌ దాడి చేస్తే తాము దాడికి దిగుతామంటూ జేడీ వాన్స్‌కు మోదీ స్పష్టం చేశారు. తమ సంయమనం బలహీనత కాదని, దేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పారు నరేంద్ర మోదీ. రేపు(సోమవారం) పాకిస్తాన్‌ తో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్‌ ఫోన్‌ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ నేతృత్వంలో భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అంశంపై చర్చలు జరుగునున్న తరుణంలో జేడీ వాన్స్‌ ముందగా పోన్‌ చేసి మోదీతో మాట్లాడారు. అయితే అంతకమునుపే కశ్మీర్‌ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీవోకే విషయంలో భారత్‌ రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. దీనికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా చెప్పేశారు మోదీ. పీవోకే తమదేనని, ఇందులో ఎవరు జోక్యం అవసరం లేదన్నారు. పీవోకేను తమకు అప్పగించడం ఒక్కటే పాకిస్తాన్‌ కు ఉన్న ఆప్షన్‌ అని మోదీ తెగేసి చెప్పేశారు. కాగా, భారత్, పాకిస్తాన్‌ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి. పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్‌.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్‌ కాదా?. అందుకు పహల్గామ్‌ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్‌ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్‌ సిందూర్‌ సిద్ధంగానే ఉందనే సంకేతాలు పంపింది భారత ప్రభుత్వం.

Talks with Pak only on return of PoK says PM Modi3
పీవోకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: మోదీ

ఢిల్లీ: పీవోకేపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ విషయంలో తమ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు.. పీవోకేను మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదన్నారు మోదీ. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియ లేదని, పాక్‌ కాల్పులు జరిపితే భారత్‌ దాడులు చేయడం ఖాయమన్నారు.. ‘వాళ్లు (పాక్‌) ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో దాడి చేయండి’ అంటూ త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. రేపు పాకిస్తాన్‌తో చర్చల వేళ భారత్‌ వైఖరి ఏమిటో ప్రధాని మోదీ ఒక్కరోజు ముందుగానే ప్రపంచానికి తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, దానిని పాక్‌ తమకు అప్పగించడం తప్పితే మరో మార్గం లేదని మోదీ వ్యాఖ్యానిండంతో ట్రంప్‌ దీనికి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదనే విషయాన్ని మోదీ సూటిగా చెప్పేశారు.ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్,సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాదిపతులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రధాని మోదీ పీవోకే విషయంలో ప్రపంచ దేశాలకు ఓ సందేశాన్ని పంపించారు. అదే సమయంలో పాక్‌కు గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాలకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది #WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025కాగా, భారత్, పాకిస్తాన్‌ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్‌.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్‌ కాదా?. అందుకు పహల్గామ్‌ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్‌ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్‌ సిందూర్‌ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్‌.

Baloch fighters Sensational Comments On Pakistan4
పాక్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ కీలక ప్రకటన

మాంగోచార్‌ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్న బలూచ్‌ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్‌ చేశారు. అదే సమయంలో పాక్‌ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్‌ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్‌ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Mukesh Ambani World Largest Mango Farm Details5
అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?

భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 200 కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?మామిడి తోట పెట్టడానికి కారణం1997లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవలసి వచ్చింది. అలాంటి సమయంలో అక్కడ మామిడి తోటను ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా గుర్తింపు తెచ్చింది. ఈ మామిడి తోట ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం.

Rahul Gandhi Writes To PM Narendra Modi6
మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్‌.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్‌ కాదా?. అందుకు పహల్గామ్‌ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్‌ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్‌ సిందూర్‌ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్‌.ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్‌ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండిపాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను. కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025

Targeting of Mr Misri was very very sad: Salman Khurshid7
‘ఇది చాలా బాధాకరం.. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన తర్వాత ఆయన ట్రోలింగ్ బారిన పడ్డారు. విక్రమ్ మిస్రీని ఆయన కుటుంబంపై కొంతమంది పనిగట్టుకుని విమర్శలకు దిగారు. దీన్ని ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి. ప్రజాస్వామ్య యుత దేశంలో ఉన్న మనం ఈ రకంగా ఓ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, కీలక ఆపరేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించిన క్రమంలో విక్రమ్ మిస్రీని విమర్శించడం తగదంటూ పలువురు నేతలు ఖండించారు.విక్రమ్ మిస్రీపై విమర్శల చేయడాన్నిభారత మాజీ విదేశాంగశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. ‘ మిస్రీని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లది ఆపరేషన్ సిందూర్ లో ఓ కీలక పాత్ర. అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. ఇందులో ఆయన తప్పేముంది. నాగరిక సమాజంలో ఉన్న మనం ఇలా ఓ వ్యక్తిని ఎలా ట్రోల్ చేస్తాం. విక్రమ్ మిస్రీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇది చాలా చాలా బాధాకరం. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?, మన హక్కుల్ని కాపాడుకునే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఈ రకంగా ట్రోలింగ్ చేసి అధికారులపై మానసికంగా ఒత్తిడి కలిగేలా చేయడం సరైంది కాదు’ అంటూ సల్మాల్ ఖుర్షీద్ ధ్వజమెత్తారు.థాంక్స్ చెప్పడం రాకపోతే..నోరు మూసుకుని కూర్చోండిఅంతకుముం‍దు మరొక కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ అనీస్ సోజ్ కూడా విక్రమ్ మిస్రీని కొంతమంది ట్రోల్ చేయడాన్ని తప్పుబట్టారు. కశ్మీర్ కు చెందిన విక్రమ్ మిస్రీ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం విమర్శలా?, చేసిన దానికి కృతజ్ఞత చెప్పే సంస్కృతి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచిది’ అంటూ హితవు పలికారు.Vikram Misri, a Kashmiri, has done India proud. No amount of trolling can diminish his service to the country. If you can't say thank you, learn to shut up.— Salman Anees Soz (@SalmanSoz) May 11, 2025 నిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీనిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీ అంటూ ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆ తరహా వ్యక్తిని ట్రోల్ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని విమర్శలకునుద్దేశించి ట్వీట్ చేశారు. కార్యనిర్వహక వ్యవస్థలో సేవ చేసే వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వహక వ్యవస్థలో ఉన్న వారిని విమర్శించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు ఓవైసీ. Mr Vikram Misri is a decent and an Honest Hard working Diplomat working tirelessly for our Nation.Our Civil Servants work under the Executive this must be remembered & they shouldn’t be blamed for the decisions taken by The Executive /or any Political leadership running Watan E… https://t.co/yfM3ygfiyt— Asaduddin Owaisi (@asadowaisi) May 11, 2025

India wins Women's ODI Tri-Series, beats Sri Lanka by 97 runs in final8
ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్.. ఫైన‌ల్లో శ్రీలంక చిత్తు

మ‌హిళ‌ల ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆదివారం కొలంబో వేదిక‌గా ఆతిథ్య శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్‌లో 97 ప‌రుగుల తేడాతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఈ తుది పోరులో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.భార‌త బ్యాట‌ర్ల‌లో స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగింది. మంధాన క్రీజులో ఉన్నంతసేపు బౌండ‌రీల వర్షం కురిపించింది. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. ఆమెతో పాటు హ‌ర్లీన్ డియోల్‌(47), రోడ్రిగ్స్‌(44), హర్మ‌న్ ప్రీత్ కౌర్‌(41) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌల‌ర్ల‌లో మల్కీ మదార, విహంగా, కుమారి త‌లా వికెట్ సాధించారు.అమ‌న్ అదుర్స్‌.. నాలుగేసిన రాణాఅనంత‌రం 343 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీలంక అమ్మాయిల జ‌ట్టు భార‌త బౌల‌ర్ల దాటికి 48.2 ఓవ‌ర్ల‌లో 245 ప‌రుగులకు కుప్ప‌కూలింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ చ‌మీరా ఆత‌ప‌ట్టు(51), నీలాక్షి డి సిల్వా(48), విష్మి గుణరత్నే(36) రాణించారు. మిగితా బ్యాట‌ర్లంతా నామమాత్ర‌పు స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.భార‌త బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు సాధించారు. కాగా భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన హ‌ర్మ‌న్ సేన‌... 6 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది.

BrahMos Missile Unit Started In Lucknow9
బ్రహ్మోస్‌ పనీతీరు ఎలా ఉంటుందో పాక్‌కు తెలుసు: సీఎం యోగి

లక్నో: భారత్‌ (India), పాకిస్థాన్‌ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) యూపీ (Uttarpradesh)లోని లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘ఉత్తరప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వర్చువల్‌ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. ఈ యూనిట్‌కు 80 హెక్టార్ల భూమిని యూపీ సర్కార్‌ ఉచితంగా ఇచ్చింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణు పరీక్షలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. నేను లక్నో ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్‌ సిద్ధం చేసిన వారికి అభినందనలు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను పూర్తి చేశారు అని ప్రశంసించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చాం. ​కేవలం పాక్‌ సరిహద్దే కాదు, రావల్పిండిపైనా దాడి చేశాం. బ్రహ్మోస్‌ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశాం. ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రజలను ఎక్కడా టార్గెట్‌ చేయలేదు. ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆలయాలు, గురుద్వారాలపై పాక్‌ సైన్యం దాడి చేస్తే.. మన సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. యూరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత ప్రతీసారి మన శక్తిని ప్రపంచానికి చూపించాం’ అని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh says, "At the inauguration of BrahMos Integration & Testing Facility Center today, I feel delighted to speak with you. I wanted to attend in person. But you know why I couldn't come. Looking at the situation we are facing, it was important… pic.twitter.com/rlRSOXXfQZ— ANI (@ANI) May 11, 2025అంతకుముందు.. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణిని ఒకసారి చూసి ఉంటారు. పాకిస్తాన్‌పై బ్రహ్మోస్‌ను ప్రయోగించాం. బ్రహ్మోస్‌ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్‌ను అడగండి. బ్రహ్మోస్‌ పనితీరును ప్రపంచమంతా చూసింది. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలి. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయనంత వరకు ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే, మనమందరం ప్రధాని మోదీ నాయకత్వంలో ఏకగ్రీవంగా పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అంగీకరించదు. దానికి దాని స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని అన్నారు.#WATCH | Lucknow | UP CM Yogi Adityanath says, "You must have seen a glimpse of the BrahMos missile during Operation Sindoor. If you didn't, then just ask the people of Pakistan about the power of the BrahMos missile. PM Narendra Modi has announced that any act of terrorism going… pic.twitter.com/lv2LzYNcXs— ANI (@ANI) May 11, 2025ఇక, ఇక్కడ.. ఏడాది నుంచి 100 బ్రహ్మోస్‌ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను డిజైన్‌ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్‌, రష్యాల సంయుక్త వెంచర్‌ అయిన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్‌ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ గైడెన్స్‌ సిస్టమ్‌తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్‌ బ్రహ్మోస్‌ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్‌ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్‌ క్షిపణి బరువు 1290 కిలోలు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో​ ఇది ప్రయాణించగలదు.

Sumanth Comments On Mrunal Thakur Relation10
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్‌

హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సుమంత్‌ (Sumanth) పెళ్లి.. కొద్దిరోజులుగా వస్తున్న ఈ వార్తలపై తాజాగా సుమంత్‌ రియాక్ట్‌ అయ్యాడు. ఆయన నటించిన కొత్త సినిమా ‘అనగనగా’ (Anaganaga) ఓటీటీలో డైరెక్టగా మే 15న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మృణాల్ ఠాకూర్‌, సుమంత్‌ కలిసి దిగిన ఫోటో వెనుక ఉన్న అసలు విషయం చెప్పాడు.అక్కినేని కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోందని, హీరోయిన్‌ మృణాల్ ఠాకూర్‌ను సుమంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటిపై ఇద్దరూ మౌనంగా ఉండటంతో నెటిజన్లలో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే, ఎట్టకేలకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. మృణాల్‌తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కుండ బద్దలు కొట్టేశాడు. ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫోటో కొద్దిరోజులుగా వైరల్‌ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనను ఎక్కడా కూడా కలిసింది లేదన్నాడు. 'సీతా రామం' సినిమాలో మృణాల్ ఠాకూర్‌, సుమంత్‌ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ టైమ్‌లోనే వారిద్దరిలో స్నేహం మొదలైంది.పెళ్లి గురించి క్లారిటీపెళ్లి మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని సుమంత్‌ చెప్పాడు. ఇలా సింగిల్‌గా ఉండడమే లైఫ్‌ బాగుందని తెలిపాడు. ఈ క్రమంలో తానెప్పుడు ఒంటరితనాన్ని ఫీలవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు. జీవితంలో ఒక తోడు కావాలని కూడా ఎప్పుడూ అనిపించలేదని చెప్పుకొచ్చాడు. అసలు లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని సుమంత్‌ హింట్ ఇచ్చేశాడు. సుమంత్‌కు గతంలో పెళ్లి అయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ఆయన సింగిల్‌గానే ఉంటున్నాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement