ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అరెస్ట్
Published Sat, Sep 16 2017 1:28 PM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM
హైదరాబాద్: హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం అందించడానికి వెళ్తున్న బీజేపీ ఫ్లోర్‌లీడర్ కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హోంగార్డుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన అనంతరం హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం అందివ్వడానికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న పలువురు హోంగార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిర్బంధించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి రాజధానికి వస్తున్న 120 మంది హోంగార్డులను అదుపులోకి తీసుకొని డీఎస్పీ ఆఫీస్‌కు తరలించారు.
Advertisement
Advertisement