
కుక్కలకు 8 వేలు.. వీళ్లకు 12 వేలా ?
హైదరాబాద్: హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వారిని కానిస్టేబుళ్లుగా గుర్తించాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి ఇందిరాపార్క్ వద్ద శనివారం ఆయన నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పోలీసు కుక్కలకు నెలకు 8వేలు ఖర్చు చేసే ప్రభుత్వం హోంగార్డులకు మాత్రం నెలకు 12 వేలు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. శ్రమ దోపిడీ, వెట్టిచాకిరీ నుంచి హోంగార్డులకు విముక్తి కల్పించాలని కిషన్రెడ్డి కోరారు.