మంత్రి కేటీఆర్ (పాత చిత్రం), కుడివైపు గుండెపోటుకు గురైన వ్యక్తికి చికిత్స చేస్తున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్ : గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులపై ప్రశంసలు కురుస్తున్నాయి. మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలుపుతూ గురువారం ఉదయం ట్వీటర్‌లో ఓ సందేశం ఉంచారు.
బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్‌లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. నగరంలో మరింత మంది కానిస్టేబుల సీపీఆర్ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి సమయాల్లో అది పనికొస్తుంది అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ వీడియోను కూడా మంత్రి పోస్టు చేశారు. బహుదూర్‌పుర ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఏ శ్రీనివాస్, నగర ట్రాఫిక్ డీసీపీ రఘనాథ్ కూడా వారిపై ప్రశంసలు కురిపించారు.
బుధవారం ఉదయం పురానాపూల్ మీదుగా జహనుమా వైపు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోయాడు. ఇది గమనించిన చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్‌లు వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు పరిగెత్తారు. ఆ వ్యక్తి ఛాతిపై సీపీఆర్(కార్డియోపల్మనరి రెససిటేషన్) పద్ధతి ద్వారా ఛాతీపై మసాస్ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.
Yesterday Homeguards K. Chandan & Inayathulla Khan of Bahadurpura PS saved the life of a person who had suddenly undergone a cardiac arrest at Puranapul Darwaja in Old City🙏🙏
— KTR (@KTRTRS) 1 February 2018
Many Constables & Homeguards in Hyderabad have undergone CPR (cardio pulmonary resuscitation) training pic.twitter.com/k7D13RwqHL
Comments
Please login to add a commentAdd a comment