బహదూర్‌పురా (హైదరాబాద్): క్రికెట్ బాల్ తగిలి ఓ మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్ బిలాల్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎంఏ ఖయ్యూం కూతురు సబాన్ తస్లీమీన్ (31) గత నెల 26న మధ్యాహ్నం టెర్రాస్ పైకి వెళ్లింది. ఆ సమయంలో కింద కొందరు క్రికెట్ ఆడుతున్నారు.
ఆటగాడు కొట్టిన బంతి టైరాస్‌పై ఉన్న తస్లీమీన్‌కు తగలింది. దీంతో ఆమె గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా నిమ్స్‌కు పంపించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తస్లీమీన్ సోమవారం ఉదయం మృతి చెందింది. తస్లీమీన్ సోదరుడు మహ్మద్ డ్యానీస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
క్రికెట్ బాల్ తగిలి మహిళ మృతి
Published Mon, Jan 4 2016 10:27 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement