నగరంలో పెరుగుతున్న మారథాన్ ట్రెండ్
సామాజిక సేవ కోసం నిర్వహిస్తున్న సంస్థలు
సేకరించిన డబ్బు చారిటీలకు వినియోగం
పోటాపోటీగా కార్పొరేట్ కంపెనీలు, ఆస్పత్రులు
వేల సంఖ్యలో పాల్గొంటున్న భాగ్య నగరవాసులు
పరిగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అంటారు పెద్దలు. అది ఏ సందర్భంలో వాడినప్పటికీ ప్రస్తుతం భాగ్యనగరంలో రన్నింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు రావడం.. శారీరక వ్యాయామం చేయకపోవడంతో అనేక రకాల అరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనీసం వారంలో ఒక్కసారైనా వ్యాయామం చేయడం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్‌తో ఒళ్లు కదిపితే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణుల సూచనలు, ఫిట్‌నెస్ ట్రైనర్స్ సలహాల మేరకు నగర వాసులు పరుగులు పెడుతున్నారు..ఈ నేపథ్యంలో దీని గురించి పలు ఆసక్తికర అంశాలు...
ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి అలసట లేకుండా పోతోంది. బుర్రనిండా ఆలోచనలతో గజిబిజి గందరగోళాల నడుమ ఒత్తిడితో కూడిన జీవనం సాగిస్తున్నారు నగరవాసులు. అలాంటి అలవాట్లను మార్చే ఉద్దేశంతో, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్య విషయాలపై నగర ప్రజల్లో అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ ట్రెండ్ కాస్తా హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో సంస్థ ఒక్కో సమస్యపై అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ నిర్వహించి పలువురిని భాగస్వాములను చేసుకుంటున్నాయి.
సమస్యలపై అవగాహన కలి్పస్తూ..
యువతలో ప్రస్తుతం అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి వాటిపై అవగాహన లేక వాటి బారిన పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి సమస్యలు నగరంలో తీవ్రతరం అవుతున్నాయి. మత్తుకు బానిసలవుతూ యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. సిగరెట్, గుట్కాలు తింటూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో ఇలాంటి సమస్యల గురించి ప్రపంచానికి అవగాహన కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో చర్చ జరుగుతుంది. అందుకోసమే పలు ఆస్పత్రులు, సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో..
సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నైట్ డ్యూటీలు, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్‌తో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో మానసిక సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఒత్తిడి తగ్గించేందుకు పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు మారథాన్ నిర్వహిస్తున్నాయి. దీంతో మానసిక ప్రశాంతతతో పాటు తోటి ఉద్యోగులతో సరదాగా ఉంటూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు.
వ్యాధులపై ప్రచారానికి..
దీర్ఘకాలిక సమస్యలతో పాటు జీవన శైలి వ్యాధులపై అవగాహన కలి ్పంచేందుకుకు నగరంలోని చాలా ఆస్పత్రులు మారథాన్ నిర్వహిస్తున్నాయి. మారథాన్ నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బులను దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నాయి. ఇదే దారిలో చాలా సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ చారిటీ చేస్తున్నాయి. దీంతో రెండు రకాలుగా మారథాన్ ఉపయోగపడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం..
ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వంలోని పలు శాఖలు కూడా అప్పుడప్పుడూ మారథాన్ నిర్వహిస్తూ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి. డ్రగ్స్‌పై అవగాహన కలి ్పంచేందుకు ఇటీవల తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. దీనిద్వారా కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు కాళాశాలలు మారథాన్ నిర్వహిస్తూ విద్యార్థులకు పలు అంశాల గురించి వివరిస్తున్నారు.
రన్నింగ్‌తో ఎన్నో లాభాలు
రన్నింగ్ చేస్తే శారీరక, మానసిక లాభాలు ఎన్నో ఉన్నాయి. 2010లో ఆర్మీలో చేరాను. పుణేలో ఉన్నప్పుడు మా కోచ్ సలహాతో మారథాన్‌లో పాల్గొనాలనే ఆలోచన వచ్చింది. 2013 నుంచి మారథాన్‌లో పాల్గొంటూ వస్తున్నా. దేశ, విదేశాల్లో ఎక్కడ మారథాన్ జరిగినా వెళ్లి పాల్గొంటా. ఇటీవల ముంబైలో జరిగిన మారథాన్‌లో గోల్డ్ మెడల్ సాధించా. ఢిల్లీలో జరిగిన మారథాన్‌లో సిల్వర్ పతకం వచి్చంది. రేపు జరగబోయే హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేందుకు నగరానికి వచ్చాను. మారథాన్‌లో పాల్గొనేందుకు రోజూ కనీసం 30 కిమీ చొప్పున వారానికి 160– 180 కిమీ పరుగెడుతూ సాధన చేస్తుంటాను. రన్నింగ్‌తో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.
– శ్రీను బుగత, బంగారంపేట, విజయనగరం
ఎన్నో పాఠాలు నేరి్పస్తుంది..
మారథాన్ అనేది పరుగు మాత్రమే కాదు. ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. జీవితంలో ఎలా నిలకడగా ఉండాలనే విషయాలు తెలుస్తాయి. సవాళ్లను స్వీకరించడం ఎలాగో తెలియజేస్తుంది. నలుగురితో కలిసి జీవిస్తే వచ్చే ప్రయోజనాలను గురించి నేరి్పస్తుంది. భారత్‌లో గత పది, పదిహేనేళ్ల నుంచి మారథాన్ ట్రెండ్ అవుతోంది. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పట్టణాలు, గ్రామాల్లో కూడా మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దీన్నొక సామాజిక పండుగలా సంబరంగా జరుపుకొంటున్నారు.
– రాజేశ్ వెచ్చా, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఫౌండర్
అద్భుతమైన అనుభూతి..
మారథాన్‌లో పాల్గొంటే అద్భుతమైన అనుభూతి ఉంటుంది. తోటి ఉద్యోగులతో మారథాన్‌లో పాల్గొంటే ఆ ఉత్సాహమే వేరు. ఇప్పటివరకూ దాదాపు 10 మారథాన్లలో పాల్గొన్నాను. రన్నింగ్ చేయడం వల్ల ఫిట్‌నెస్ కూడా వస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది.
– మహేశ్‌రెడ్డి మోదుగు, ఐటీ ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment