సర్‌ప్రైజింగ్‌గా మారుతున్న సిటీ ‘ఫిట్’సీన్..
అత్యాధునిక పరికరాల్లో పోటాపోటీ
ఇంటర్నెట్ నుంచి ఏఐ దాకా మేళవింపు
దక్షిణాదిలో అతిపెద్ద హైటెక్ జిమ్ సిటీలో ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో: సరిగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నానా? ఒక చేతితో చేసిన రిపిటీషన్స్ స్థాయిలో రెండో చేతితో చేయలేకపోతున్నానెందుకు? ట్రెడ్‌మిల్ మీద ఫుట్ వర్క్ సరిగానే ఉందా? డైట్‌లో మార్పు చేర్పులెలా చేయాలి? ఒకటా రెండా.. జిమ్‌లో ఎక్సర్‌సైజెస్‌తో పాటు ఎన్నో డౌట్స్ కూడా వెంటాడుతాయి. వీటన్నింటికీ సమాధానాలు వర్కవుట్ చేసే మిషన్ చేతే చెప్పిస్తూ.. వినియోగించే టాప్ ఎక్విప్‌మెంట్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లి నుంచి సూపర్‌స్టార్ మహేష్బాబు దాకా అందరూ వినియోగించే ఎక్విప్‌మెంట్‌ని దక్షిణాదిలోనే అతిపెద్ద హైటెక్ ఫిట్‌నెస్ సెంటర్.. ఐ జిమ్‌లో అందుబాటులోకి తెచ్చారు.
పరుగు/నడక చేసే క్రమంలో బర్న్ అవుతున్న కేలరీలు, అధిగమిస్తున్న దూరాలు, హార్ట్ బీట్.. వంటివి చూపించే ట్రెడ్‌మిల్ ఫిట్‌నెస్ లవర్స్‌కి తెలుసు. కానీ ఆ టైమ్‌లో మనం చేస్తున్న తప్పులేంటి?సరిచేసుకునే చిట్కాలేంటి? అది కూడా ట్రెడ్‌మిల్ స్వయంగా తానే చెబుతూ మన వాక్, జాగ్, రన్‌లో లోపాలు చూపించే/సరిచేయించే ట్రెడ్‌మిల్? తెలుసా? ప్రపంచ ప్రసిద్ధి చెందిన జిమ్ ఎక్విప్‌మెంట్ తయారీ బ్రాండ్ టెక్నో అందించే అద్భుతాల్లో అదో చిరు ఉదాహరణ మాత్రమే. ఇటీవల నగరంలోని గచ్చిబౌలిలో ఏర్పాటైన అత్యాధునిక ఐజిమ్.. టెక్నో పరికరాల టెక్నికల్ వండర్స్‌కు అద్దం పడుతోంది.
ఐ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న మిస్టర్ యూనివర్స్ 2023 బ్రాంకో టియోడోరోవిక్..
మరెన్నో అత్యాధునిక ఫీచర్లు..
పారిస్ ఒలింపిక్స్‌లో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్ విలేజ్‌లో క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా జిమ్ కూడా సెట్ చేశారు. ఆ జిమ్‌లో అత్యాధునిక హైటెక్ పరికరాలను అందుబాటులో ఉంచారు. పూర్తిగా టెక్నాలజీతో అనుసంధానమైన ఈ జిమ్ దాదాపుగా 15వేల చదరపు అడుగుల్లో దక్షిణాదిలోనే అతిపెద్ద జిమ్ కమ్ కేఫ్ ఇది. ఈ జిమ్‌లో పరికరాలకు ఇంటర్నెట్‌తో పాటు ఆరి్టఫిíÙయల్ ఇంటలిజెన్స్ కూడా అనుసంధానించారు. వాకింగ్ చేస్తూ ఇష్టమైన వెబ్‌సిరీస్ చూడటం దగ్గర్నుంచి చాట్ చేయడం దాకా అన్నీ వర్కవుట్ మెషిన్లతోనే కానిచ్చేయవచ్చు. దాదాపుగా మెషిన్లన్నీ మన శరీరంతో కనెక్ట్ అవుతాయి. వర్కవుట్‌లో మంచి చెడుల్ని విశ్లేíÙస్తాయి. చేస్తున్న విధానంలోని తప్పొప్పులు చెబుతాయి.. ఉదాహరణకు ట్రెడ్‌మిల్ మీద జాగింగ్ చేస్తుంటే.. మన లెఫ్ట్ లెగ్ బాగా పనిచేస్తోందా? లేక రైట్ లెగ్ బాగా పనిచేస్తోందా? నీ స్టెప్ లెంగ్త్ ఎంత? ఫుట్ వర్క్ కరెక్ట్‌గా పడుతుందా లేదా అనే సూక్ష్మస్థాయి అంశాలు కూడా తెలియజేస్తాయి. మిషన్‌కు అమర్చిన స్క్రీన్‌లో ఒక మనిషి వర్కవుట్ చేస్తూ మనతో చేయిస్తాడు. ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే.. మరెన్నో అత్యాధునిక ఫీచర్లు వీటి సొంతం.
జిమ్‌లో ఏదైనా వర్కవుట్ కోసం ఒక మిషన్ మీద కూర్చునే ముందు దాన్ని మన హైట్‌కు తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని మిషన్స్ మనం కూర్చోగానే వాటికవే మన హైట్‌కు తగ్గట్టు హెచ్చుతగ్గులు సెట్ చేసుకుంటాయి.
మనకు ఓ పార్క్‌లోనో, గ్రౌండ్‌లోనో రన్నింగ్ వాకింగ్ చేసే అలవాటు ఉంటే.. ఈ జిమ్‌లో ట్రెడ్‌మిల్ మీద మీరు వాక్, రన్ చేస్తుంటే.. అచ్చం అదే పార్క్ లేదా గ్రౌండ్‌లో చేసినట్టే ఫీల్ వస్తుంది. అక్కడ ఎత్తు పల్లాలతో సహా ఇక్కడా అదే విధమైన ఫీల్ వస్తుంది.
మిషన్స్‌కి మొబైల్ ఫోన్‌లోని ఒక యాప్‌కి అనుసంధానం చేసి ఉంటుంది. ఆ యాప్‌లో రోజువారీగా మన వర్కవుట్ విశ్లేషణతో పాటు వారానికి, నెలకోసారి కూడా వర్కవుట్ ఎనాలసిస్ మనకు అందుతుంది. తద్వారా మన వ్యాయామ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? మజిల్ స్ట్రెంగ్త్‌లో వచి్చన మార్పులు, లోపాలు, బలాలు అన్నీ తెలుస్తాయి.
డైటీషియన్స్ కూడా నిత్యం యాప్ ద్వారా టచ్‌లో ఉంటారు. మనం ఏ టైమ్‌కి ఏం తినాలి ఏం తింటున్నాం అనేది పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ సూచించిన డైట్‌ని మనం ఏ రోజైనా ఏ కారణం చేతనైనా ఫాలో అవలేకపోతే దానికి ప్రత్యామ్నాయం కూడా అందిస్తారు.
కంట్రీలోనే బెస్ట్..
సిటీలో పెద్ద పెద్ద జిమ్స్‌లో నేను వర్కవుట్ చేశాను. ఆ అనుభవంతోనే అన్నింటికన్నా ది బెస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నా. వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని చాలా టైమ్ తీసుకుని దీన్ని తీర్చిదిద్దాను. బయోమెకానిక్స్, బాడీ మైండ్ కనెక్షన్ వంటి ఫీచర్లతో దేశంలో ఎక్కడా ఇలాంటి జిమ్ లేదని ప్రశంసలు అందుకుంటోంది. ఇండియాలో చూడడానికి కూడా కనపడని ఏఐ ఆధారిత మెషిన్లను ఇటలీలో నెలల తరబడి అన్వేషించి తీసుకొచ్చాం. మిస్టర్ యూనివర్స్ బ్రాంకో మన సిటీకి వచ్చి మా జిమ్‌లో వర్కవుట్ చేసి, మాది బెస్ట్ జిమ్ అని ప్రశంసించారు. – వంశీరెడ్డి, ఐ జిమ్
ఇవి చదవండి: Teacher's Day 2024: థ్యాంక్యూ టీచర్..!
Comments
Please login to add a commentAdd a comment