Jim Centers
-
ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..!
సాక్షి, సిటీబ్యూరో: జిమ్‌కు వెళ్లడం అనేది శారీరక వ్యాయామం, ఆరోగ్యం కోసం అనేది అందరికీ తెలిసిన విషయం. నాణేనికి మరో వైపు ఆదాయ మార్గం ఉంది. శరీర సౌష్టవం కలిగిన వారికి పార్ట్‌టైం, ఫుల్ టైం ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నగరంలో వందలాది కుటుంబాలు ఈ రకంగా ఉపాధి పొందుతున్నాయి. కండలు తిరిగిన యువత బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనడం, ఉన్నత శ్రేణి కుటుంబాలకు బాడీగార్డులుగా, ఈవెంట్స్, ప్రముఖ వ్యాపార సంస్థలకు బౌన్సర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరికి ఉపాధితో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.నిత్యం జిమ్ చేస్తూ ఆరోగ్యంగా, బలంగా ఉన్న వారికి మార్కెట్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న వారికి పార్ట్ టైం, ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలూ లభిస్తున్నాయి. భాగ్యనగరంలో రాజకీయ నాయకులు తమ రక్షణ కోసం ప్రైవేటుగా బాడీగార్డులను నియమించుకుంటున్నారు. ఏవైనా జన సమీకరణ కార్యక్రమాలు ఉన్నపుడు బౌన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఉన్నత శ్రేణి కుటుంబాలు, సినిమా, ఇతర సెలబ్రిటీలు బయటకు రావాలన్నా, ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా బౌన్సర్లను పెట్టడం అలవాటుగా మారిపోయింది. కొన్ని వర్గాలకు బౌన్సర్లను పెట్టుకోవడం స్టేటస్‌గానూ భావిస్తున్నారు. దీంతో నగరంలో బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది.ఈవెంట్స్‌ను బట్టి..ఒక్కో ఈవెంట్‌కు అక్కడ పరిస్థితులను బట్టి 8 గంటలు, 12 గంటలు, 24 గంటలు ఇలా సమయాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. బౌన్సర్లకు 8 గంటలకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. 12 గంటలు, ఆపై సమయాన్ని బట్టి లెక్కలు ఉంటాయి. మరోవైపు పబ్‌లు, పేరొందిన రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, ప్రముఖ దుకాణాల్లోనూ నెలవారీ వేతనాలకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బాడీగార్డు, బౌన్సర్లకు నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తున్నారు.17 ఏళ్ల వయసు నుంచి..నాకు 17 ఏళ్ల వయసు నుంచి జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాను. ఇపుడు 30 ఏళ్లు. తొలి రోజుల్లో ఆరోగ్యం, శరీర సౌష్టవం కోసం వెళ్లాను. అందరిలోనూ మనం ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించాను. శరీరం ఆకర్షణీయమైన ఆకృతిలో తయారయ్యింది. తదుపరి రోజుల్లో బౌన్సర్‌గా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ల తరువాత సొంతంగా బిజినెస్ ప్రారంభించాను. ప్రస్తుతం పార్ట్ టైం బౌన్సర్‌గా పనిచేస్తున్నాను. ఈవెంట్స్ ఉన్నపుడు వెళుతున్నా. 8 గంటలకు కనీసం రూ.1500 ఆపైన వస్తాయి. 12 గంటలు అయితే రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. ఈ ఆదాయం ఆర్థిక వెసులుబాటు కలి్పస్తుంది. – అమోల్, బౌన్సర్, బంజారాహిల్స్పర్సనల్ బాడీగార్డుగా..గత పదేళ్ల నుంచి జిమ్‌కు వెళుతున్నాను. డైట్ పాటిస్తాను. ఆరోగ్యంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటాను. నాకు తెలిసిన వారి రిఫరెన్స్ ద్వారా పర్సనల్ బాడీగార్డుగా చేరాను. నమ్మకంగా పనిచేసుకుంటున్నాను. మంచి వేతనం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తికరమైన జీవితం సాగిస్తున్నాను. – ఆదిల్, జూబ్లీహిల్స్ఇవి చదవండి: Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది! -
ఫిట్ టెక్నిక్.. హిట్ ఫిజిక్!
సాక్షి, సిటీబ్యూరో: సరిగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నానా? ఒక చేతితో చేసిన రిపిటీషన్స్ స్థాయిలో రెండో చేతితో చేయలేకపోతున్నానెందుకు? ట్రెడ్మిల్ మీద ఫుట్ వర్క్ సరిగానే ఉందా? డైట్లో మార్పు చేర్పులెలా చేయాలి? ఒకటా రెండా.. జిమ్‌లో ఎక్సర్‌సైజెస్‌తో పాటు ఎన్నో డౌట్స్ కూడా వెంటాడుతాయి. వీటన్నింటికీ సమాధానాలు వర్కవుట్ చేసే మిషన్ చేతే చెప్పిస్తూ.. వినియోగించే టాప్ ఎక్విప్మెంట్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లి నుంచి సూపర్‌స్టార్ మహేష్‌బాబు దాకా అందరూ వినియోగించే ఎక్విప్మెంట్ని దక్షిణాదిలోనే అతిపెద్ద హైటెక్ ఫిట్నెస్ సెంటర్.. ఐ జిమ్‌లో అందుబాటులోకి తెచ్చారు.పరుగు/నడక చేసే క్రమంలో బర్న్ అవుతున్న కేలరీలు, అధిగమిస్తున్న దూరాలు, హార్ట్ బీట్.. వంటివి చూపించే ట్రెడ్మిల్ ఫిట్నెస్ లవర్స్‌కి తెలుసు. కానీ ఆ టైమ్‌లో మనం చేస్తున్న తప్పులేంటి?సరిచేసుకునే చిట్కాలేంటి? అది కూడా ట్రెడ్మిల్ స్వయంగా తానే చెబుతూ మన వాక్, జాగ్, రన్లో లోపాలు చూపించే/సరిచేయించే ట్రెడ్మిల్? తెలుసా? ప్రపంచ ప్రసిద్ధి చెందిన జిమ్ ఎక్విప్మెంట్ తయారీ బ్రాండ్ టెక్నో అందించే అద్భుతాల్లో అదో చిరు ఉదాహరణ మాత్రమే. ఇటీవల నగరంలోని గచ్చిబౌలిలో ఏర్పాటైన అత్యాధునిక ఐజిమ్.. టెక్నో పరికరాల టెక్నికల్ వండర్స్‌కు అద్దం పడుతోంది.ఐ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న మిస్టర్ యూనివర్స్ 2023 బ్రాంకో టియోడోరోవిక్..మరెన్నో అత్యాధునిక ఫీచర్లు..పారిస్ ఒలింపిక్స్‌లో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్ విలేజ్‌లో క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా జిమ్ కూడా సెట్ చేశారు. ఆ జిమ్‌లో అత్యాధునిక హైటెక్ పరికరాలను అందుబాటులో ఉంచారు. పూర్తిగా టెక్నాలజీతో అనుసంధానమైన ఈ జిమ్ దాదాపుగా 15వేల చదరపు అడుగుల్లో దక్షిణాదిలోనే అతిపెద్ద జిమ్ కమ్ కేఫ్ ఇది. ఈ జిమ్‌లో పరికరాలకు ఇంటర్నెట్తో పాటు ఆరి్టఫిíÙయల్ ఇంటలిజెన్స్ కూడా అనుసంధానించారు. వాకింగ్ చేస్తూ ఇష్టమైన వెబ్‌సిరీస్ చూడటం దగ్గర్నుంచి చాట్ చేయడం దాకా అన్నీ వర్కవుట్ మెషిన్లతోనే కానిచ్చేయవచ్చు. దాదాపుగా మెషిన్లన్నీ మన శరీరంతో కనెక్ట్ అవుతాయి. వర్కవుట్‌లో మంచి చెడుల్ని విశ్లేíÙస్తాయి. చేస్తున్న విధానంలోని తప్పొప్పులు చెబుతాయి.. ఉదాహరణకు ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేస్తుంటే.. మన లెఫ్ట్ లెగ్ బాగా పనిచేస్తోందా? లేక రైట్ లెగ్ బాగా పనిచేస్తోందా? నీ స్టెప్ లెంగ్త్ ఎంత? ఫుట్ వర్క్ కరెక్ట్‌గా పడుతుందా లేదా అనే సూక్ష్మస్థాయి అంశాలు కూడా తెలియజేస్తాయి. మిషన్‌కు అమర్చిన స్క్రీన్‌లో ఒక మనిషి వర్కవుట్ చేస్తూ మనతో చేయిస్తాడు. ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే.. మరెన్నో అత్యాధునిక ఫీచర్లు వీటి సొంతం.జిమ్‌లో ఏదైనా వర్కవుట్ కోసం ఒక మిషన్ మీద కూర్చునే ముందు దాన్ని మన హైట్‌కు తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని మిషన్స్ మనం కూర్చోగానే వాటికవే మన హైట్‌కు తగ్గట్టు హెచ్చుతగ్గులు సెట్ చేసుకుంటాయి.మనకు ఓ పార్క్‌లోనో, గ్రౌండ్లోనో రన్నింగ్ వాకింగ్ చేసే అలవాటు ఉంటే.. ఈ జిమ్‌లో ట్రెడ్మిల్ మీద మీరు వాక్, రన్ చేస్తుంటే.. అచ్చం అదే పార్క్ లేదా గ్రౌండ్లో చేసినట్టే ఫీల్ వస్తుంది. అక్కడ ఎత్తు పల్లాలతో సహా ఇక్కడా అదే విధమైన ఫీల్ వస్తుంది.మిషన్స్‌కి మొబైల్ ఫోన్లోని ఒక యాప్‌కి అనుసంధానం చేసి ఉంటుంది. ఆ యాప్‌లో రోజువారీగా మన వర్కవుట్ విశ్లేషణతో పాటు వారానికి, నెలకోసారి కూడా వర్కవుట్ ఎనాలసిస్ మనకు అందుతుంది. తద్వారా మన వ్యాయామ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? మజిల్ స్ట్రెంగ్త్‌లో వచి్చన మార్పులు, లోపాలు, బలాలు అన్నీ తెలుస్తాయి.డైటీషియన్స్ కూడా నిత్యం యాప్ ద్వారా టచ్‌లో ఉంటారు. మనం ఏ టైమ్‌కి ఏం తినాలి ఏం తింటున్నాం అనేది పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ సూచించిన డైట్‌ని మనం ఏ రోజైనా ఏ కారణం చేతనైనా ఫాలో అవలేకపోతే దానికి ప్రత్యామ్నాయం కూడా అందిస్తారు. కంట్రీలోనే బెస్ట్..సిటీలో పెద్ద పెద్ద జిమ్స్‌లో నేను వర్కవుట్ చేశాను. ఆ అనుభవంతోనే అన్నింటికన్నా ది బెస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నా. వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని చాలా టైమ్ తీసుకుని దీన్ని తీర్చిదిద్దాను. బయోమెకానిక్స్, బాడీ మైండ్ కనెక్షన్ వంటి ఫీచర్లతో దేశంలో ఎక్కడా ఇలాంటి జిమ్ లేదని ప్రశంసలు అందుకుంటోంది. ఇండియాలో చూడడానికి కూడా కనపడని ఏఐ ఆధారిత మెషిన్లను ఇటలీలో నెలల తరబడి అన్వేషించి తీసుకొచ్చాం. మిస్టర్ యూనివర్స్ బ్రాంకో మన సిటీకి వచ్చి మా జిమ్‌లో వర్కవుట్ చేసి, మాది బెస్ట్ జిమ్ అని ప్రశంసించారు. – వంశీరెడ్డి, ఐ జిమ్ఇవి చదవండి: Teacher's Day 2024: థ్యాంక్యూ టీచర్..! -
Health: వర్క్లెస్.. మోర్ ఫిట్..!
ఉరుకులు, పరుగుల నగరజీవితంలో శరీరానికి శ్రమలేకుండా పోతోంది. దీంతో శరీరంలో భారీగా కొవ్వులు పేరుకుపోతున్నాయి. వీటిని కరిగించేందుకు రకరకాల ఉత్పత్తులూ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఓ వైపు సహజ సిద్ధమైన వ్యాయామ పరికరాలు, రకరకాల ఫుడ్ అండ్ డైట్ ప్లాన్స్, న్యూట్రిషన్ సెంటర్లు, ఫిట్నెస్ సెంటర్లూ వెలసినా.. వాటిని అనుసరించడానికి తీరిక, ఆరి్థక స్థోమత లేక పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి వారి కోసమే మార్కెట్లోకి ఎలక్రి్టకల్ మజిల్ స్టిమ్యులేటర్స్ వస్తున్నాయి.. వీటిని షార్ట్ కట్లో ఏఎమ్ఎస్ అంటారు. వీటిని నగరంలోని అనేక జిమ్‌లు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఏఎమ్ఎస్ అంటే ఏమిటి? ఇది నిజంగా శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుందా? ఇది సురక్షితమేనా? దీని ద్వారా తక్కువ శ్రమతో కండలు తిరిగిన శరీరాన్ని పొందగలదా? మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.. – సాక్షి, సిటీబ్యూరోఇది సైన్స్.. – ఆధారిత వ్యాయామ పద్ధతి. సాధారణంగా పట్టించుకోని కండరాలను సైతం ఉత్తేజపరిచేందుకు తక్కువ–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని ఉపయోగించడం ద్వారా పూర్తి స్థాయి శిక్షణా సెషన్‌కు ఇది సమానమైంది. స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న వారు మల్టీ్టపుల్ స్క్లెరోసిస్ ఉన్నవారు వారి చలనశీలతను తిరిగి పొందేందుకు అనేక రకాల వైద్యపరమైన రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు సహాయం చేయడానికి వైద్యులు చాలా కాలంగా దీనిని ఉపయోగిస్తున్నారు. అదే కొద్దిపాటి మార్పు చేర్పులతో ప్రస్తుతం జిమ్స్‌లో చేరింది. పర్యవేక్షణ తప్పనిసరి.. వినియోగదారులు ఓ మెషీన్‌కు అనుసంధానించిన పూ ర్తి ఎలక్ట్రోడ్లను తప్పనిసరిగా ధరించాలి. ఆ మెషీన్ విద్యుత్ తరంగాలను వైర్లు ,ఎలక్ట్రోడ్ల ద్వారా శరీరంలోని కండరాల్లోకి పంపుతుంది. దీని కోసం ప్రత్యేకమైన సూట్లు, పొట్టి చేతుల టాప్ షార్ట్‌లు అవసరం అవుతాయి. పూర్తిగా సమర్ధత కలిగిన శిక్షకుడి పర్యవేక్షణలో మాత్రమే ఈ సెషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. లాభాలూ.. జాగ్రత్తలూ... గతంలో ఫిజియోథెరపిస్ట్‌ల వద్ద మాత్రమే ఉండే ఈ పరికరాలు ఇప్పుడు వ్యాయామ ప్రియులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కండర ఉద్దీపనలో సహాయపడే అనేక పోర్టబుల్ పరికరాలు. వర్కవుట్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి, వ్యాయామాల కోసం వేడెక్కడానికి లేదా గాయమైతే పునరావాస దశలో సహాయపడతాయి. ఈ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం. వీటితో అదనపు కండరాల పునరుద్ధరణ లభిస్తుంది. కానీ, అధిక వినియోగం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఆరంభంలో నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.ఐరోపా నుంచే... ఫిట్నెస్ మార్కెట్లో ఎలక్ట్రో కండరాల ప్రేరణ అనే తాజా సాంకేతికత ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందింది. కండరాల సంకోచాలను ప్రేరేపించడానికి వివిధ రకాల విద్యుత్ ప్రవాహాలను ఇది ఉపయోగిస్తుంది. దీని ద్వారా శరీరం అంతటా రక్త ప్రసరణ పెరుగుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. –సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ రామోనా బ్రాగంజాహాలీవుడ్ సెలబ్రిటీలు సైతం.. ఇది కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప మార్గం. హెడీ క్లమ్, ఎలిజబెత్ హర్లీ మడోన్నా వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ టెక్నిక్‌ను ఉపయోగించారు. ఇది చెమట పట్టకుండా కండరాలను నిరి్మంచడానికి సులభమైన మార్గం. – ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా20 నిమిషాల సూట్.. 90 నిమిషాల వర్కవుట్!‘‘ఫిట్నెస్ పరిశ్రమలో ఇదో ఉత్తేజకరమైన మార్పు. దీని సూట్లు ఫిట్నెస్ ఔత్సాహికుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సూట్లో 20 నిమిషాల పాటు వర్కవుట్ 90 నిమిషాల సాంప్రదాయ వర్కవుట్‌కి సమానం. ఈ ఏఎమ్ఎస్ సూట్లు సెకనుకు 85 కండరాల సంకోచాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన కండరాల సమూహాల ద్వారా 98% కంటే ఎక్కువ కండరాలను కదిలేలా చేస్తాయి. కండరాల సడలింపు, పునరుద్ధరణ, చలనశీలతను పెంచడం, స్థిరత్వాన్ని మెరుగుపరచడం, బిగించడం, టోనింగ్ చేయడం, శక్తి స్థాయిలు, రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. ఫిట్‌నెస్‌కు మాత్రమే కాకుండా ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, స్నాయువు, నడుము నొప్పి, దీర్ఘకాలిక కటి నొప్పి, మధుమేహం సంబంధిత నరాలవ్యాధి, పరి«దీయ ధమని వ్యాధి వంటి అనేక సమస్యల చికిత్సలో ఉపయోగించబడుతుంది. – ఫిట్నెస్ నిపుణులు, మీనాక్షి మొహంతి -
జిమ్.. ఆరెంజ్ థీమ్..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేకమైన ఆరెంజ్ థీమ్‌తో వినూత్నంగా అనిపించే ఆరెంజ్ థియరీ ఫిట్నెస్ ఇండియా.. నగరంలో తన సెంటర్‌ను నెలకొల్పింది. బంజారాహిల్స్ రోడ్ నెం–7లో ఏర్పాటైన ఈ ఫిట్నెస్ సెంటర్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆదివారం బ్రాండ్ చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ దృష్టి చాబ్రియా తెలిపారు. దాదాపు 2,700 చదరపు అడుగులపైగా విస్తీర్ణంలో ఈ విశాలమైన అత్యాధునిక వ్యాయామ కేంద్రం నెలకొల్పామని, శాస్త్రీయ నేపథ్యం కలిగిన వర్కవుట్స్‌కి తమ బ్రాండ్ పేరొందిందని వివరించారు. మితిమీరిన శిక్షణ అవసరం లేకుండా తమ సభ్యులు ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా తమ వర్కవుట్ రొటీన్ డిజైన్ చేశామన్నారు. అంతర్జాతీయ జీవన ప్రమాణాలకు నిలయమైన హైదరాబాద్‌లో స్థానికులకు నచ్చే వ్యక్తిగతీకరించిన వర్కవుట్ అనుభవాలను అందిస్తామన్నారు. -
మా అమ్మ పులి
పుట్టిన బిడ్డను ఆకాశంలోకి ఎత్తి గర్వంగా ప్రపంచానికిచూపించుకుంటుంది తల్లి.అలాంటప్పుడు..బిడ్డ పుట్టాక, కడుపు మీద పడిన చారలు మాత్రంగర్వకారణం కాకుండా ఎలా ఉంటాయి?!జీవితంలోని కొన్ని మచ్చలు.. ఒక్కోసారి కొన్ని గాయాలు..అవి వదలే గుర్తులు, ఆనవాళ్లు.. గర్వించదగ్గవే అయి ఉంటాయి.ఒక మొటిమ.. ఒక మచ్చ.. ఒక చార..ఏదైనా మన ఆత్మవిశ్వాసానికే ఆనవాలు కావాలి.బిడ్డ పులిబిడ్డ అయితే.. తల్లి మీద ఉన్న చారలు పులిచారలే కదా!అప్పుడు.. ఏ బిడ్డ అనుకోదూ.. ‘మా అమ్మ పులి’ అని! టీన్స్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయికి ఉదయం నిద్రలోంచి లేవగానే అద్దం చూసుకోవాలంటే భయం! బుగ్గ మీద కొత్త మొటిమ ముత్యంలా మెరుస్తూ ఎక్కడ కనపడ్తుందోనని!ఇరవై ఏళ్ల అమ్మాయి పార్టీకి రెడీ అయ్యి... విరబోసుకున్న జుట్టుతో చెంపల మీది యాక్నేను దాచేందుకు నానా తంటాలు పడ్తూంటుంది!నెలరోజుల్లో మొహాన్ని తెల్లగా మార్చేసే క్రీమ్‌లతో కుస్తీ పడ్తూంటుంది ఓ నల్ల కలువ!చీర కుచ్చిళ్లు దోపుకుంటున్న ఓ బిడ్డ తల్లికి తన నాభి మీది స్ట్రెచ్ మార్క్స్ నిలువుటద్దంలో ప్రస్ఫుటంగా కనిపించేసరికి ఆందోళన ఆవహించేస్తుంది.మొటిమలు.. యాక్నే.. నలుపు రంగు.. స్ట్రెచ్ మార్క్స్.. ఎట్సెట్రా.. స్త్రీకి అవమానాన్ని, ఆత్మన్యూనతను కలిగించేలా తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్ చేస్తుంటాయి. కాస్మోటిక్స్‌ను ఉత్పత్తి సంస్థలు! ఇది ఎవరికి తెలియని విషయమేమీ కాదు.. ‘కాస్మోటిక్ ఇండస్ట్రీస్ మార్కెటింగ్ కాన్సిపరసీస్లో ఇదీ ఒకటి’ అని! అందుకే..క్రీమ్స్ కన్నా అత్యుత్తమ ప్రొడక్ట్ మన ఆత్మవిశ్వాసమే అని చాటిన మహిళల గురించి తెలుసుకోవాలి. సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ కాబట్టి! స్ట్రెచ్ మార్క్స్‌ను పైటతో కప్పేసుకోకుండా.. కుచ్చిళ్లతో దోపేయకుండా.. తన బిడ్డ జ్ఞాపకంగా గర్వంగా భావిస్తూన్న ఓ తల్లిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం! తను సాధించిన విజయంతో ఈ స్ట్రెచ్‌మార్క్స్‌ను ప్రైడ్‌గా భావించే క్యాంపెయిన్లాంటిది ఆ మహిళ మొదలుపెట్టారు. ఆమె పేరు మమతా సనత్‌కుమార్. వయసు 27 ఏళ్లు. బెంగళూరు నివాసి. బాడీ బిల్డర్. ఆమెకు అయిదేళ్ల కూతురు. పూర్విక. బాధ్యతల బరువు మమతది సాధారణ మధ్యతరగతి కుటుంబం. భర్త ఉద్యోగి. తను ఇంటి బాధ్యతలు చూసుకునేది. ప్రెగ్నెన్సీ ఆమెను తొంభై కిలోల బరువుకు చేర్చింది. డెలివరీ తర్వాత కూడా తగ్గలేదు. బిడ్డకు మూడో యేడు వచ్చాక.. పాపను నర్సరీలో జాయిన్ చేసి తను జిమ్‌లో చేరింది. ఆ వర్కవుట్స్‌తో 62 కేజీలకు తగ్గింది. అది ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వర్కవుట్స్‌ను మరింత పెంచింది. ఈ క్రమంలోనే భర్త ఉద్యోగం పోయింది. ఆ కోపం, బాధతో చీటికిమాటికి మమతతో గొడవపడేవాడు. ఇంట్లో అశాంతి బిడ్డ మీద పడకుండా చాలా సహనంగా ఉండేది మమత. తను ఉద్యోగం చేయాలనే నిర్ణయాన్నీ తీసుకుంది. జిమ్‌లో వర్కవుట్లు ఆమెకు కొత్త అవకాశాన్ని చూపించాయి. బాడీబిల్డర్‌గా. కసరత్తు..! బాడీ బిల్డింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది మమత. అయితే ఇంట్లో వాళ్లంతా.. ఆమె తల్లిదండ్రులు సహా మమతను వ్యతిరేకించారు. బయట కూడా సానుకూల వాతావరణమేమీ కనిపించలేదు ఆమెకు. బాడీబిల్డింగ్ పూర్తిగా పురుషుల రంగం అవడం, మమతది గ్రామీణ (బసవపుర గ్రామం) నేపథ్యం కావడం వంటివన్నీ ఆమెకు అడ్డంకులుగానే మారాయి. అయినా పట్టు వీడలేదు. బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరవడం, పాల్గొనడం స్టార్ట్ చేసింది. బాడీ బిల్డర్‌గా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేది. దాంతో ఆ ఫోటోలు తీసేయమని ఇంట్లో వాళ్ల దగ్గర్నుంచి ఒత్తిడి, హెచ్చరికలు కూడా! కాని ఆమె సాహసానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరిగారు. అడ్మైర్ అవుతూ కామెంట్లు పెట్టేవారు. ‘‘గృహిణి నుంచి బాడీబిల్డింగ్కు మళ్లారు.. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తోందా?’’ అని ప్రశ్నలు. ఇంట్లోవాళ్ల సపోర్ట్ లేకుంటే వచ్చేదాన్నే కాను.. వాళ్లు నాకెప్పుడూ నో చెప్పలేదు’’ అంటూ సమాధానాలు ఇచ్చేది. ఇవన్నీ చదివిన భర్త.. వారించడం మానేశాడు. తల్లిదండ్రులూ మిన్నకుండిపోయారు. అదే ఆమె తొలి గెలుపు అయింది. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లింది. బరిలో.. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు స్పాన్సర్స్ దొరకలేదు. అలా అనేకంటే స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు అనడం సబబేమో! ధైర్యం ఆమె గుణం. కాబట్టి బెంబేలెత్తలేదు. సొంతంగా జిమ్ పెట్టుకుంది. ట్రైనర్‌గా కొలువు తీసుకుంది. బాడీబిల్డింగ్‌లో అమ్మాయిలను ట్రైన్ చేయడం మొదలుపెట్టింది. బిడ్డ తల్లులూ రావడం ప్రారంభించారు. అప్పుడే తల్లులు తమ స్ట్రెచ్ మార్క్స్ పట్ల ఇబ్బందిగా ఫీలవడం గమనించింది మమత. ఆ టాబూని తుడిచేయాలనుకుంది. తన బాడీబిల్డింగ్ పోజులను.. స్ట్రెచ్ మార్క్స్ స్పష్టంగా కనపడేలా ఫోటోలు తీసి.. ‘‘స్ట్రెచ్ మార్క్స్.. వట్టి చారలు కావు. ఎక్స్ట్రా స్కిన్ అంతకన్నా కాదు! మనల్ని నిర్వచించే గీతలు! మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విజయం వైపు నెట్టే స్ట్రింగ్స్! ఇంత పాజిటివ్‌గా చూడలేకపోతే.. అవి ఏర్పడ్డానికి పడ్డ కష్టాన్ని, వెంట్ త్రూ అయిన వైనాన్ని గుర్తుపెట్టుకుందాం, మనలో భాగంగా సొంతం చేసుకుందాం! వేలాడే చర్మం మీది చారలుగా చూసి కుంగిపోకుండా.. శారీరక ధృడత్వంతో మానసికంగా బలపడి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే! మనల్ని మనం ప్రేమించుకోవాలి.. సొంతం చేసుకోవాలి.. స్ట్రెచ్మార్క్స్తో సహా!’’ అంటూ కామెంట్ రాసి మరీ ఆ ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించింది మమత. మజిల్ మామ్..! ఈ పోస్ట్‌లు ఎంత ప్రాచుర్యం పొందాయంటే.. స్ట్రెచ్‌మార్క్స్‌ను ఓన్ చేసుకునే ఓ ప్రచారంలా భావించేంతగా! దాంతో మమతా చాలా ఫేమస్ అయిపోయింది ‘‘మజిల్ మామ్’’గా! ఇప్పటికీ రోజుకు పది గంటలు జిమ్‌లో చెమటోడుస్తుంది. ట్రైన్ అవుతూ.. ట్రైన్ చేస్తూ! గుడ్ న్యూస్ ఏంటంటే.. 2017లో ఆరంభమైన ఆమె ఈ ప్రయాణానికి ఇప్పుడు స్పాన్సరర్స్ వచ్చారు. ఓ పోటీలో.. గెలిచి ట్రోఫీ అందుకుంటున్నప్పుడు.. ఆడియెన్స్‌లోంచి తన అయిదేళ్ల (ఇప్పుడు పూర్విక వయసు) కూతురు ‘‘మమ్మీ.. ’’ అంటూ స్టేజ్ మీదకు వచ్చి ఆమె మెడకు అల్లుకుపోతుంటే ఆడియెన్స్ అంతా ‘‘మజిల్ మామ్ (సంతూర్ మామ్ స్టయిల్లో)’’ అంటూ చప్పట్లు కొట్టారట. ‘‘నా ఇన్సిపిరేషన్, నాకు ప్రేరణ లడ్డూ (కూతురి ముద్దు పేరు)నే. నా తపనంతా నేనూ తనకు ఇన్సిపిరేషన్‌గా నిలబడాలనే. నా ప్రొఫెషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఇంట్లో మాత్రం నా బిడ్డకు బానిసనే. తనే నా బలం.. బలహీనత’’ అంటుంది మమత. ఒక్కో గెలుపుతో ఇంట్లో వాళ్ల పూర్తి సపోర్ట్‌ను సాధించింది. ఇప్పుడు భర్తకూ ఉద్యోగం దొరికింది. ట్రైనింగ్.. పోటీలు.. బిడ్డ పెంపకం.. స్ట్రెచ్ మార్క్స్ క్యాంపెయిన్‌తో క్షణం తీరకలేకుండా సాగిపోతోంది ఈ మజిల్ మామ్. – శరాది -
జుంబారే అ జుంబరే..
జాగింగ్ అనగానే రెండ్రోజులు కోడి కూయక ముందే లేస్తాం.. మూడో రోజు ముసుగు తన్ని పడుకుంటాం. సిక్స్ ప్యాక్స్ కోసం జిమ్‌లో జాయిన్ అవుతాం, ఓ నెల రోజులు సిన్సియర్‌గా జిమ్‌కు వెళ్తే గొప్ప. ఒళ్లొంచకుండా స్లిమ్‌గా, ఫిట్‌గా తయారవ్వాలనుకుంటాం. ఇలాంటి వారి కోసం పుట్టిందే జుంబా. ఆడుతూ పాడుతూ చేసే డాన్సింగ్ ఎక్సర్సైజ్. జోష్‌ఫుల్ పాటలకు లయబద్ధంగా స్టెప్పులేస్తే చాలు.. మీ కొవ్వు కరిగించుకోవచ్చు. శ్రమిస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా చెమటలతో తడిసిపోవచ్చు. ఇంతటి ప్రత్యేకత ఉంది కాబట్టే సిటీ వాసులు ‘జుంబారే అ జుంబ రే’ అంటూ జుంబా డాన్స్ క్లాస్‌లకు పరిగెడుతున్నారు. జుంబా అంటే లాటిన్లో ఓ రకమైన ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్. మామూలు డ్యాన్స్‌లా కాకుండా వైవిధ్యమైన నృత్య రీతులతో వేసే ఫిట్నెస్ మంత్రం. కొలంబియాలో బెటో అల్బర్టో పరేస్ అనే ఫిట్నెస్ ట్రైనర్ 12 ఏళ్ల క్రితం ఈ ఫిట్నెస్ ప్రక్రియను కనిపెట్టారు. 2011లో ఇండియాకు పరిచయమైంది. ఇక మన హైదరాబాద్‌లో 2012 నుంచి జుంబాకు ఆదరణ పెరిగింది. వ్యాయామం చేస్తున్నామనే ఫీలింగ్ రాకుండా.. శరీరాన్ని ఫిట్ చేయడం జుంబా ప్రత్యేకత. సరదాగా సాగే శిక్షణలో శ్రమ ఏమాత్రం తెలియదు. నో సైడ్ ఎఫెక్ట్స్.. జుంబా డ్యాన్స్ వల్ల ఫిట్నెస్తో పాటు వెయిట్‌లాస్, పాజిటివ్ మైండ్ వంటి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్ని గంటలు చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగని జుంబా డాన్స్‌లో అప్డేటెడ్ మ్యూజిక్ బోర్ కొట్టనివ్వదు. నో ఏజ్ లిమిట్.. వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగ ప్రతి ఒక్కరూ జుంబా ఫిట్నెస్ క్లాస్‌లకు అటెండ్ అవ్వచ్చు. 4 నుంచి 6 ఏళ్ల మధ్య వయసు వారికి జుంబా కిడ్స్ జూనియర్, 7 నుంచి 11 వయసు వారికి జుంబా కిడ్స్, 12 నుంచి 50 వరకూ జుంబా, 50 ఏళ్ల పైబడిన వారికి జుంబా గోల్డ్ అని ప్రత్యేక కేటగిరీల్లో ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. నగరంలో 60కి పైగా సర్టిఫైడ్, లెసైన్స్డ్ జుంబా ట్రైనింగ్ సెంటర్లు వెలిశాయి. స్పష్టమైన తేడా ‘ఆహ్లాదకరమైన విధానంలో ఫిట్నెస్ పొందే ప్రక్రియ జుంబా. మూడు నెలల్లోనే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దాదాపు 10 వేల మందికి పైగా శిక్షణనిచ్చా. ఒక్కరు కూడా అసంతృప్తి చెందలేదు. జుంబా వల్ల వందలాది మంది ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నా’ -విజయ తూపురాని, జుంబా ట్రైనర్ ఎంజాయ్మెంట్ ఫ్యాక్టర్.. ‘జుంబా క్లాస్‌ల వల్ల స్లిమ్‌గా, ఫిట్‌గా తయారయ్యా. ఇప్పుడు నాకు జుంబా అంటే ఎంజాయ్మెంట్ ఫ్యాక్టర్. ఒక్క రోజు కూడా మిస్సవ్వను. ఎప్పటికప్పుడు హుషారెత్తించే స్టెప్పులు జుంబాను వదిలిపెట్టనివ్వవు.’ - దీప్తి - ఎల్.సుమన్‌రెడ్డి ఫొటోలు: సృజన్ పున్నా -
బ్యూటీ & gym
బాడీ ఫిట్నెస్ అంటే రకరకాల జిమ్ సెంటర్లు గుర్తుకొస్తాయి. వాటిలో ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. మహిళలు ఇలాంటి ఫిట్నెస్ సెంటర్లకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అలాంటి వారికోసం కాలనీలోని ప్రతి బ్యూటీ పార్లర్లలోనూ లేడీస్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చుతో జిమ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచుతున్నారు. బ్యూటీ పార్లర్లలో ఉన్న ఈ జిమ్‌లపై కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులతో పాటు గృహిణులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఫీజు కూడా తక్కువే ఉండటంతో ఈ సెంటర్లకు క్యూ కడుతున్నారు. వీటికి వెళుతున్న మహిళలు ఎక్కువగా ట్రెడ్ మిల్, సిటప్స్, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నట్టు ఓ జిమ్ ఉద్యోగిని స్వప్న తెలిపారు. విజయారెడ్డి