ఇటు ఆరోగ్యం.. అటు ఉపాధి..
రెండు విధాలా లాభదాయకం
బౌన్సర్లు, బాడీగార్డులుగా ప్రత్యేక గుర్తింపు
నిత్యం వ్యాయామంతో రోగాలు దూరం
పార్ట్ టైం, ఫుల్ టైమ్ ఉద్యోగావకాశాలు
యువతను ఆకర్షిస్తున్న జిమ్‌లు
సాక్షి, సిటీబ్యూరో: జిమ్‌కు వెళ్లడం అనేది శారీరక వ్యాయామం, ఆరోగ్యం కోసం అనేది అందరికీ తెలిసిన విషయం. నాణేనికి మరో వైపు ఆదాయ మార్గం ఉంది. శరీర సౌష్టవం కలిగిన వారికి పార్ట్‌టైం, ఫుల్ టైం ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నగరంలో వందలాది కుటుంబాలు ఈ రకంగా ఉపాధి పొందుతున్నాయి. కండలు తిరిగిన యువత బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనడం, ఉన్నత శ్రేణి కుటుంబాలకు బాడీగార్డులుగా, ఈవెంట్స్, ప్రముఖ వ్యాపార సంస్థలకు బౌన్సర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరికి ఉపాధితో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.
నిత్యం జిమ్ చేస్తూ ఆరోగ్యంగా, బలంగా ఉన్న వారికి మార్కెట్‌లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న వారికి పార్ట్ టైం, ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలూ లభిస్తున్నాయి. భాగ్యనగరంలో రాజకీయ నాయకులు తమ రక్షణ కోసం ప్రైవేటుగా బాడీగార్డులను నియమించుకుంటున్నారు. ఏవైనా జన సమీకరణ కార్యక్రమాలు ఉన్నపుడు బౌన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఉన్నత శ్రేణి కుటుంబాలు, సినిమా, ఇతర సెలబ్రిటీలు బయటకు రావాలన్నా, ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా బౌన్సర్లను పెట్టడం అలవాటుగా మారిపోయింది. కొన్ని వర్గాలకు బౌన్సర్లను పెట్టుకోవడం స్టేటస్‌గానూ భావిస్తున్నారు. దీంతో నగరంలో బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది.
ఈవెంట్స్‌ను బట్టి..
ఒక్కో ఈవెంట్‌కు అక్కడ పరిస్థితులను బట్టి 8 గంటలు, 12 గంటలు, 24 గంటలు ఇలా సమయాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. బౌన్సర్లకు 8 గంటలకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. 12 గంటలు, ఆపై సమయాన్ని బట్టి లెక్కలు ఉంటాయి. మరోవైపు పబ్‌లు, పేరొందిన రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, ప్రముఖ దుకాణాల్లోనూ నెలవారీ వేతనాలకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బాడీగార్డు, బౌన్సర్లకు నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తున్నారు.
17 ఏళ్ల వయసు నుంచి..
నాకు 17 ఏళ్ల వయసు నుంచి జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాను. ఇపుడు 30 ఏళ్లు. తొలి రోజుల్లో ఆరోగ్యం, శరీర సౌష్టవం కోసం వెళ్లాను. అందరిలోనూ మనం ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించాను. శరీరం ఆకర్షణీయమైన ఆకృతిలో తయారయ్యింది. తదుపరి రోజుల్లో బౌన్సర్‌గా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ల తరువాత సొంతంగా బిజినెస్ ప్రారంభించాను. ప్రస్తుతం పార్ట్ టైం బౌన్సర్‌గా పనిచేస్తున్నాను. ఈవెంట్స్ ఉన్నపుడు వెళుతున్నా. 8 గంటలకు కనీసం రూ.1500 ఆపైన వస్తాయి. 12 గంటలు అయితే రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. ఈ ఆదాయం ఆర్థిక వెసులుబాటు కలి్పస్తుంది. – అమోల్, బౌన్సర్, బంజారాహిల్స్
పర్సనల్ బాడీగార్డుగా..
గత పదేళ్ల నుంచి జిమ్‌కు వెళుతున్నాను. డైట్ పాటిస్తాను. ఆరోగ్యంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటాను. నాకు తెలిసిన వారి రిఫరెన్స్ ద్వారా పర్సనల్ బాడీగార్డుగా చేరాను. నమ్మకంగా పనిచేసుకుంటున్నాను. మంచి వేతనం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తికరమైన జీవితం సాగిస్తున్నాను. – ఆదిల్, జూబ్లీహిల్స్
ఇవి చదవండి: Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది!
Comments
Please login to add a commentAdd a comment