
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేకమైన ఆరెంజ్ థీమ్‌తో వినూత్నంగా అనిపించే ఆరెంజ్ థియరీ ఫిట్‌నెస్ ఇండియా.. నగరంలో తన సెంటర్‌ను నెలకొల్పింది. బంజారాహిల్స్ రోడ్ నెం–7లో ఏర్పాటైన ఈ ఫిట్‌నెస్ సెంటర్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆదివారం బ్రాండ్ చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ దృష్టి చాబ్రియా తెలిపారు. దాదాపు 2,700 చదరపు అడుగులపైగా విస్తీర్ణంలో ఈ విశాలమైన అత్యాధునిక వ్యాయామ కేంద్రం నెలకొల్పామని, శాస్త్రీయ నేపథ్యం కలిగిన వర్కవుట్స్‌కి తమ బ్రాండ్ పేరొందిందని వివరించారు. మితిమీరిన శిక్షణ అవసరం లేకుండా తమ సభ్యులు ఫిట్‌నెస్ లక్ష్యాలు చేరుకునేలా తమ వర్కవుట్ రొటీన్ డిజైన్ చేశామన్నారు. అంతర్జాతీయ జీవన ప్రమాణాలకు నిలయమైన హైదరాబాద్‌లో స్థానికులకు నచ్చే వ్యక్తిగతీకరించిన వర్కవుట్ అనుభవాలను అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment