banjarahills
-
HYD: బంజారాహిల్స్‌లో పోర్షే కారు బీభత్సం
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం -
ప్రాణం తీసిన మోమోస్..
-
Hyderabad: పటోలా ఆర్ట్స్.. వస్త్ర ప్రదర్శన ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌లోని లేబుల్స్ పాప్–అప్ స్పేస్ వేదికగా కొలువుదీరిన ’డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన’ను ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ప్రారంభించారు. విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతోపాటు పటోలా ఆర్ట్ చీరలు, డిజైనర్ వేర్ వ్రస్తోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. వస్త్ర ఉత్పత్తులను ఫ్యాషన్‌ప్రియులకు నేరుగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు.డి సన్స్ పటోలా ఆర్ట్స్ ఎక్స్పో నిర్వాహకులు భవిన్ మక్వానా మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు మంచి మార్కెట్‌ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యమని వివరించారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో రాజ్‌కోట, పటోలా దుపట్టా, పటోలా శాలువాలు, సింగిల్ పటాన్ చీరలు, సింగిల్ పటోలా దుప్పట, పటాన్ పటోలా చీరలు, సిల్క్ టిష్యూ పటోలా వంటి 2 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.35 మంది కళాకారులు.. 70 చిత్రాలు!– ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైన చిత్రప్రదర్శనమాదాపూర్: కళాకారులు వేసిన చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నాయని తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ అన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో సోమవారం ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను ఆమె ప్రారంభించారు.మున్ముందు చిత్రకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 35 మంది కళాకారులు వేసిన 70 పెయింటింగ్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ నెల 25వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్షి్మ, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. ప్రకాశ్‌రెడ్డి, టూరిజం డైరెక్టర్ ఇలా త్రిపాఠి, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు. -
జిమ్.. ఆరెంజ్ థీమ్..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేకమైన ఆరెంజ్ థీమ్‌తో వినూత్నంగా అనిపించే ఆరెంజ్ థియరీ ఫిట్నెస్ ఇండియా.. నగరంలో తన సెంటర్‌ను నెలకొల్పింది. బంజారాహిల్స్ రోడ్ నెం–7లో ఏర్పాటైన ఈ ఫిట్నెస్ సెంటర్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆదివారం బ్రాండ్ చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ దృష్టి చాబ్రియా తెలిపారు. దాదాపు 2,700 చదరపు అడుగులపైగా విస్తీర్ణంలో ఈ విశాలమైన అత్యాధునిక వ్యాయామ కేంద్రం నెలకొల్పామని, శాస్త్రీయ నేపథ్యం కలిగిన వర్కవుట్స్‌కి తమ బ్రాండ్ పేరొందిందని వివరించారు. మితిమీరిన శిక్షణ అవసరం లేకుండా తమ సభ్యులు ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా తమ వర్కవుట్ రొటీన్ డిజైన్ చేశామన్నారు. అంతర్జాతీయ జీవన ప్రమాణాలకు నిలయమైన హైదరాబాద్‌లో స్థానికులకు నచ్చే వ్యక్తిగతీకరించిన వర్కవుట్ అనుభవాలను అందిస్తామన్నారు. -
బంజారాహిల్స్‌లో ఫర్నెస్ట్రీ..
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీకి చెందిన అత్యాధునిక ప్రీమియం ఫర్నిచర్ బ్రాండ్ ‘ఫర్నెస్ట్రీ’ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. బంజారాహిల్స్‌లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి ఎక్స్పీరియన్స్ స్టూడియోను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫర్నెస్ట్రీ ఫౌండర్ మాన్సీ అలెన్ మాట్లాడుతూ.. కస్టమర్లు కోరుకున్న విధంగా ప్రీమియం ఫర్నీచర్, వాల్ ఆర్ట్ వంటి గృహాలంకరణలను తయారు చేసి ఇస్తామని తెలిపారు.కస్టమర్లకు డిజైన్ కాన్సెప్్టలను విజువలైజ్ చేయడానికి ప్రత్యేకమైన కాంప్లిమెంటరీ మూడ్ బోర్డ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టూడియోలో ఆధునిక, సంప్రదాయ హస్తకళను మిళితం చేస్తూ డైనింగ్ టేబుల్స్, స్థానిక కళాకారుల వాల్ ఆర్ట్, స్కాండినేవియన్ డిజైన్‌తో జపనీస్ సౌందర్యాన్ని మిళితం చేసే జపాండీ ఫ్యూజన్ ఫర్నిచర్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఇవి చదవండి: సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు.. -
బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు
-
Meenakshi Choudhary: బంజారాహిల్స్‌లో సందడి చేసిన నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
బంజారాహిల్స్‌లో బార్ & కిచెన్‌ని ప్రారంభించిన హీరోయిన్ లక్ష్మీ రాయ్
-
HYD: కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీలపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మాదన్నపేట, శాస్త్రీపురం, బంజారాహిల్స్, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీ అవకతవకలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు ఆరోపించారు. ఏకకాలంలో 30 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే సుమారు 100 వాహనాల్లో ఐటీ అధికారులు సోదాలకు తరలి వెళ్లారు. ఇది కూడా చదవండి: దుబాయ్ కేంద్రంగా చైనీయుల దందా -
ఎమ్మెల్యే కాలనీ దొంగతనం కేసు: వంట మనిషే లాకర్ దొంగ
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే రాజధాని హోటల్ యజమాని అరిహంత్ జైన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు అదే ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిగా గుర్తించారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్, సీఐ నరేందర్, డీఐ ప్రవీణ్ కుమార్, డీఎస్ఐ మల్లికార్జున్‌తో కలిసి దొంగతనం వివరాలు వెల్లడించారు. రాజస్తాన్ నాగోర్ జిల్లా బేగాన మండలం గుండీసన్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్(31) రెండున్నరేళ్ళ క్రితం అరిహంత్ జైన్ ఇంట్లో వంట మనిషిగా కుదిరాడు. పక్కా ప్రణాళికతో ఈ ఇంట్లో వంటవాడిగా చేరిన చంద్రశేఖర్ ఇంటి యజమానుల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ డబ్బు లావాదేవీలు, ఆభరణాలు ఎక్కడెక్కడ దాచి పెడతారు తదితర వివరాలు గమనిస్తూ వచ్చి రాజస్తాన్‌కు చెందిన తన స్నేహితుడు రామకృష్ణ అలియాస్ రామకిషన్‌తో ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే రామకృష్ణకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రా ద్వారా ఇంటి వివరాలను, లొకేషన్, ఆభరణాలు ఎక్కడ దాస్తారు తదితర వివరాలు చెప్పసాగాడు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన జైన్ ఇంటి వాచ్మెన్ సెలవులో ఉండటంతో ఇదే అదునుగా దొంగతనానికి ప్లాన్ వేసిన చంద్రశేఖర్ రామకృష్ణను రాజస్తాన్ నుంచి పిలిపించాడు. సాయంత్రం 6.30 గంటలకు ఆ ఇంటికి చేరుకున్న రామకృష్ణ గోడ దూకి సీసీ కెమెరాల వ్యవస్థను భగ్నం చేసి అవి రికార్డు కాకుండా చూశాడు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తుకు వెళ్ళి కప్‌బోర్డ్‌లో ఉన్న లాకర్‌ను చంద్రశేఖర్ సాయంతో దొంగిలించి మూడో అంతస్తులో సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్న చంద్రశేఖర్ గది ముందు పెట్టి దానిపైన వేరే డబ్బాలు పెట్టి చెప్పుల స్టాండ్ అడ్డుగా పెట్టి కనిపించకుండా చేశారు. అదే రాత్రి 2.30 గంటలకు రామకృష్ణ రాజస్తాన్‌కు ఉడాయించాడు. ఈ నెల 4న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయిదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక సీసీ కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి గోడ దూకి లోనికి వెళ్ళడం అదే వ్యక్తి బయటికి రావడం మాత్రం కనిపించింది. దొంగిలించిన సొత్తు బయటికి తీసుకెళ్ళలేదని నిర్ధారణకు వచ్చిన డీఐ ప్రవీణ్ కుమార్ మరింత లోతుగా విచారణ చేపట్టి అక్కడ పని చేస్తున్న 12 మందిని విచారించారు. మూడు రోజులు విచారించినా ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ మాత్రం పోలీసుల ముందుకు వస్తూనే ఏ మాత్రం బయట పడలేదు. పోలీసులకు గాలిస్తున్న సమయంలోనే లాకర్‌ను తెరిచేందుకు తీసుకొచ్చిన గ్యాస్ కట్టర్, ఇతర సామాగ్రి చంద్రశేఖర్ గది ముందు దొరికాయి. దీంతో ఇంటి పనిమనిషుల సాయంతోనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావించి అనువనువు గాలించగా చంద్రశేఖర్ గది ముందు లాకర్ దొరికింది. తెరిచి చూడగా అందులో నగదుతో పాటు ‘ 25 లక్షల విలువ చేసే ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. తన స్నేహితుడు రామకృష్ణ సాయంతో లాకర్‌ను దొంగిలించిన చంద్రశేఖర్ గ్యాస్ కట్టర్‌తో అది తెరుచుకోకపోవడంతో తన ఇంటి ముందు భద్రపరిచినట్లుగా చెప్పాడు. మరో పది రోజుల్లో రాజస్తాన్‌కు వెళ్ళే ప్లాన్ వేసుకున్న చంద్రశేకర్ ఆ లోపున రామకృష్ణను పిలిపించి ఇద్దరూ కలిసి ఈ లాకర్‌ను తీసుకెళ్ళాలని పథకం వేసి చివరికి పోలీసులకు చిక్కారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ పరారీలో ఉన్నాడని తెలిపారు. (చదవండి: అయ్యో.. ఏమైందో ఏమో!) -
బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే మరో రెండు కార్లను బలంగా ఢీ కొట్టింది. ఈ సమయంలో అటుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీ కొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులను భీమవరకు చెందిన ఈశ్వరి, రావులపాలెంకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ధమాకా సినిమాకు ధమ్కీ.. దర్శకుడు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఉప్పర కులస్తులను ధమాకా సినిమా దర్శకుడు త్రినాథరావు ప్రీ రలీజ్ ఈవెంట్లో అవమానించారని వెంటనే తమ కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్ వద్ద బైఠాయించారు. దర్శకుడు త్రినాథ్‌రావు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సగర ఉప్పర సంఘం ప్రతినిధులు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథ్ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అంటూ హేళన చేశారని ఆరోపించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సాగర్, కోశాధికారి రామస్వామి, ఫిలింనగర్ అధ్యక్షుడు మధుసాగర్, ప్రధాన కార్యదర్శి నాగేష్ సాగర్, డి.రాంచందర్, చెన్నయ్య, సీతారాములు, వెంకటస్వామి, మూసాపేట్ సగర సంఘం అధ్యక్షుడు లోకేష్ సాగర్, రామకృష్ణ సాగర్, అంజయ్య నగర్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, బి.శేఖర్ పాల్గొన్నారు. -
నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..దాదాపు 12 గంటలు తర్వాత...
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ రాసిన అందెశ్రీ ఇది చూసి ఉంటే ‘అసలెక్కడున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ అక్షరాలా ఆవేదన చెందకమానరు.. సాక్షి, బంజారాహిల్స్: సాటి మనిషి శవమై నడిరోడ్డుపై పడుంటే పక్కనుంచే ఏమీ పట్టనట్టు పోతున్న మనుషుల్ని చూస్తే అసలు వీరు..బతికున్నారా? అనిపించకమానదు. ఉసురు పోయినా పట్టక ఉరుకులూ పరుగులు తీస్తున్న మనిషీ ఊపిరి ఉన్నంత వరకే ఈ ‘సిరి’ అని మరిచావా అని అరవాలనిపించకమానదు. ఒక కాకి చనిపోతే వంద కాకులు గుమికూడి విలపించినట్టు హైరానా పడతాయి. కానీ మన నగరవాసి మంత్రం రెండు కిలో మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులు రోడ్ల పైన చచ్చిపడి ఉన్నా పట్టించుకోలేదు. ఎందుకిలా జరిగి ఉంటుందని ఆగి చూసే ఓపిక లేకుండా పోయింది. రోడ్డు పైన పడి ఉన్న శవాల పక్క నుంచే వందలాది మంది వెళ్తున్నారు తప్ప పోలీసులకో, ప్రభుత్వ యంత్రాంగానికో సమాచారం ఇద్దామనే ఆలోచన, ఓపిక కూడా లేదు. సంపన్నులు నివసించే బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రివద్ద, జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద బుధవారం రెండు గుర్తు తెలియని వ్యక్తుల శవాలు పడి ఉన్నాయి. వీరు ఎలా చనిపోయారో..ఎప్పుడు చనిపోయారో తెలియలేదు. రోడ్డుపైన, ఫుట్‌పాత్‌పైన నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు. దాదాపు 12 గంటలు గడిచాక..ఎవరో ఓ వ్యక్తి ఎట్టకేలకు వారు నిద్రించడం లేదు...చనిపోయారని గుర్తించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈలోపే మరొకరెవరో ఆ శవంపై నుంచి వాహనాలు వెళ్లకుండా ఓ రాయిని, ఓ కర్రను అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడు. ఇక వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. కనీసం ఇక్కడ విధులు నిర్వర్తించే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈవిషయాన్ని గుర్తించ లేదు. చివరకు మధ్యాహ్నం వేళ పోలీసులు వచ్చి..అనాథ శవాలుగా కేసు నమోదు చేసి...మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. (చదవండి: ఫాంహౌజ్ కేసు: బెయిల్‌పై విడుదల, ఆ వెంటనే మళ్లీ అదుపులోకి..) -
Hyderabad: రోజుకో రోడ్డు క్లోజ్!.. వాహనదారులకు చుక్కలు
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వారం క్రితం ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రాఫిక్ డైవర్షన్ విమర్శలకు దారి తీస్తోంది. రోజుకొక కొత్త నిర్ణయాన్ని తీసుకొస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ రోజు వెళ్లిన మార్గం తెల్లారేసరికి మూసేస్తున్నారు. ఆ తెల్లవారి అటు నుంచి వెళ్దామనుకుంటే మళ్లీ ‘వన్‌వే’గా మారుస్తున్నారు. సాక్షి, బంజారాహిల్స్: ఇలా ఇష్టానుసారంగా రోడ్లను మూసేస్తుండటం, వన్‌వేలో ఏర్పాటు చేస్తుండటాన్ని కేవలం వాహనదారులే కాకుండా జూబ్లీహిల్స్ కాలనీవాసులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 54 చట్నీస్, ఫర్జీ మీదుగా వాహనాలు రాకపోకలు సాగించాయి. ►గురువారం తెల్లవారుజామున చట్నీస్ ముందు నుంచి రోడ్ నెం. 54 వైపు వాహనాలు అనుమతించకుండా కేవలం రోడ్ నెం. 54 నుంచి రోడ్ నెం. 36 వైపు మాత్రమే వన్‌వేగా మార్చారు. దీంతో ఇటువైపు వెళ్లే వాహనదారులు చుట్టూ తిప్పుకొని రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ►ఇంకోవైపు సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జర్నలిస్టు కాలనీ, బాలకృష్ణ నివాసం చౌరస్తా మీదుగా అటు రోడ్ నెం45 వెళ్లాలన్నా, ఇటు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లాలన్నా గతంలో మాదిరిగానే ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రోడ్ నెం. 45 ఫ్లై ఓవర్ కింద యధాప్రకారం ట్రాఫిక్ స్తంభించిపోతూ వాహనదారులను ప్రత్యక్ష నరకానికి గురి చేస్తున్నది. ►రోడ్ నెం. 45 నుంచి ఫినిక్స్ పక్కన ఉన్న రోడ్డు నుంచి, అల్లు అర్జున్ ఇంటి వైపు రోడ్డు నుంచి వాహనాలను అనుమతించకుండా రోడ్ క్లోజ్ చేశారు. దీంతో ఇక్కడ వాహనాలన్నీ బాలకృష్ణ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తాకు వెళ్లాల్సి రావడంతో ఇక్కడ రోడ్డు ఎత్తుగా ఉండటం, ఇరుకుగా ఉండటం, పుట్‌పాత్ లేకపోవడంతో అటు పెట్రోల్ బంక్ మరో అడ్డంకిగా మారి ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వాహనాలు స్తంభించిపోతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో స్తంభించిన ట్రాఫిక్ ►ట్రాఫిక్ ఉన్నతాధికారులు మాత్రం రోజుకొకరు చొప్పున ఈ రోడ్డును పరిశీలించడం, స్థానిక పోలీసులకు సూచనలు జారీ చేయడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ►ఇప్పటిదాకా ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టిన రోడ్లలో జీహెచ్ఎంసీ ఇంజనీర్లు గుంతలను పూడ్చలేదు. రోడ్డు మరమ్మతులు చేపట్టలేదు. దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లను బాగు చేయలేదు. ►విద్యుత్ అధికారులు రోడ్డుకు అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను, హైటెన్షన్ వైర్ స్తంభాలను తొలగించిన పాపాన పోలేదు. రోడ్లపక్కనే కేబుల్ వైర్లు జారిపడుతూ వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. గతంలో సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వెళ్లడానికి పది నిమిషాల సమయం పడితే ప్రస్తుతం డైవర్షన్ చేపట్టిన తర్వాత 15 నిమిషాలు పడుతున్నదని వాహనదారులే స్వయంగా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ట్రాఫిక్ డైవర్షన్‌పై వాహనదారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రయోగాత్మకం పేరుతో తమను జూబ్లీహిల్స్ వీధులన్నీ తిప్పిస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసుల తీరును ఎండగడుతున్నారు. ►ట్విట్టర్లో ఇప్పటికే వందలాది మంది వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నగర పోలీస్ కమిషనర్‌కు, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్‌కు తమ బహిరంగ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ ప్రయోగం విఫలమైందంటూ ఘాటుగా చెబుతున్నారు. రోడ్లను విస్తరించకుండా... దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకుండా... ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకురాకుండా ట్రాఫిక్ డైవర్షన్ నిర్ణయాలు తీసుకొని వాహనదారుల నెత్తిన రుద్దారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ►ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో చేపట్టిన ట్రాఫిక్ డైవర్షన్లు జూబ్లీహిల్స్‌లోని మిగతా రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రెసిడెన్షియల్ ఏరియాల్లో వాహనాలు స్తంభించిపోతూ అటు శబ్ధ కాలుష్యం, ఇటు వాయు కాలుష్యంతో పాటు తమకు నరకాన్ని చూపిస్తున్నాయంటూ కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు. -
షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని సినీ పరిశ్రమకు చెందిన ఓ హెయిర్ స్టైలిస్ట్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని నంది నగర్లో నివాసం ఉంటున్న మహిళ సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తోంది. 2018 లో ఆమెకు సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తున్న మన్మధ రావు అలియాస్ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. మన్మథ రావు ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో తాను ఇప్పటికే రేప్ కేసులో బాధితురాలిగా ఉన్నానని, తనకు కొద్ది రోజులు గడువు కావాలని కోరింది. ఆ తర్వాత షూటింగ్ నిమిత్తం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒకటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా, మహేష్ ఆమెను దూరంగా పెడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ సైతం బ్లాక్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణానగర్‌లో కనిపించిన మన్మథ రావును పెళ్లి విషయమై ప్రశ్నించగా ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఆరు నెలల క్రితమే పెళ్లి.. పక్కింటి కుర్రాడితో మాట కలిపి..) -
HYD: కరెంట్ షాక్‌తో కుప్పకూలితే.. కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిబద్ధతను, అంతకు మించి సమయస్ఫూర్తిని కనబరిచే ఉద్యోగులను అభినందించకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటనే నగరంలో ఒకటి జరిగింది. కరెంట్ షాక్‌తో కుప్పకూలిన ఓ వ్యక్తి ప్రాణాల్ని.. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్1లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు శంకర్. డ్యూటీలో ఉండగా.. రోడ్ నెంబర్ 1లోని జీవీకే హౌజ్ మెయిన్ గేట్ ముందర ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో పడిపోయాడని సమాచారం అందుకున్నాడు. కరెంట్ బాక్స్‌కి చెయ్యి తగిలి అతను షాక్‌కి గురయ్యాడు.దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసి అతన్ని కాపాడాడు శంకర్. ఆపై ఆంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. ఒక ప్రాణం కాపాడిన శంకర్ అక్కడున్న వాళ్లతో పాటు అధికారులు సైతం అభినందిస్తున్నారు. -
Hyderabad: నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా...
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కోరె నందుకుమార్ అలియాస్ నందుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో చీటింగ్ కేసు నమోదైంది. వ్యవసాయ భూమికి సంబంధించి కమీషన్ కోసం తనను బెదిరించడమే కాకుండా అంతు చూస్తానంటూ హెచ్చరించాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యా పారి ఎస్.సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ భూమి లావాదేవీలకు సంబంధించి రూ.21 లక్షలు నందుకుమార్‌కు ఇచ్చామని ఈ విషయంలోనే పలుమార్లు తనను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలోనే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అప్పుడు తాను డిప్యూటీ చీఫ్ మినిష్టర్‌ను అవుతానని, పరిగి సమీపంలోని దోమ మండలం భూంపల్లి గ్రామంలో 12 ఎకరాల స్థలం తన పేరు మీద రాయకపోతే అంతు చూస్తానని బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు) -
Hyderabad: పవన్ కల్యాణ్ బౌన్సర్లతో గొడవ; యువకుల అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 35లోని తబలారసా హోటల్లో అర్ధరాత్రి విందు ముగించుకొని ఇద్దరు యువకులు కారులో బయల్దేరారు. పక్కనే ఉన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపగా పక్కకు తొలగించాలని చెప్పిన బౌన్సర్లపై దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఆ యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంనగర్‌కు చెందిన చిట్నేని సాయికృష్ణ చౌదరి(32), జవహర్‌నగర్‌కు చెందిన చిట్నేని విజయ్ ఆదిత్య(27)లు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి తబలా రసా హోటల్‌కు విందుకు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు విందు ముగించుకొని బయటికి వచ్చిన వీరు కారును పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఆపారు. ఇదేమిటని బౌన్సర్లు వెంకటేష్, రాకేష్ ప్రశ్నించి అక్కడి నుంచి తొలగించాలని కోరారు. దీంతో సాయికృష్ణ, విజయ్ ఆదిత్య ఇద్దరూ బౌన్సర్లపై గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. చెయ్యి చేసుకునేదాకా వెళ్లడంతో ఉధ్రిక్తత ఏర్పడింది. దీంతో బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలతో పాటు కారు నెంబర్ ఆధారంగా సాయికృష్ణ, విజయ్ ఆదిత్యలను అదుపులోకి తీసుకొని వీరిపై ఐపీసీ సెక్షన్ 341, 323, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చదవండి: (పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు) -
హెచ్ఎం చనువుతో.. టీచర్‌గా మారిన డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: డ్రైవర్‌గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్ హెచ్ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్‌గా మారాడు. ప్రతిరోజూ ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్‌లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం. 14 డీఏవీ పబ్లిక్ స్కూల్లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది. వీరిని బుధవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌గా ఉండాల్సిన నిందితుడు టీచర్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది. -
మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉంటున్న తిరుమారెడ్డి సూర్యనారాయణ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఆతడితో పాటు నటిస్తున్న నాగవర్ధినితో సూర్యనారాయణ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి నాగవర్ధిని తనతో పాటు టీవీ సీరియళ్లలో నటిస్తున్న దాసరి శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్లో మాజీ ప్రియుడు సూర్యనారాయణ ఓ గదిలో ఉంటుండగా నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి మరో గదిలో అద్దెకుండేవారు. తరచూ సూర్యనారాయణతో వీరికి గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం నేరుగా నాగవర్ధిని ఇంట్లోకి వచ్చిన సూర్యనారాయణ ఆమెతో గొడవపడి శ్రీనివాస్‌రెడ్డిని వదిలేయాలని తనతో ఉండాలని వాగ్వాదానికి దిగాడు. తమ ప్రేమకు అడ్డు పడుతున్నాడని భావించిన నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ పథకం ప్రకారం సూర్యనారాయణను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. అతడికి తీవ్ర గాయాలు కాగా పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..
సాక్షి, బంజారాహిల్స్: తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో యువతీ, యువకులను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల్‌రెడ్డి సూర్యనారాయణ(30) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం తనతో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న నాగవర్ధినితో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసేదాకా కొనసాగింది. అదే భవనంలో ఈ ఇద్దరూ కలిసి రెండో అంతస్తులో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. చదవండి: ('నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు') ఎవరికి వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకొని ఈ మేరకు సూర్యనారాయణ అదే భవనంలో ఆమె నుంచి విడిపోయి నాల్గో అంతస్తులో కిరాయికి ఉంటున్నాడు. ఈ లోపు నాగవర్ధిని రాజమండ్రికి చెందిన మరో జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఈ విషయంపై సూర్యనారాయణ ఇటీవల ఆమెను నిలదీశాడు. శ్రీనివాస్‌రెడ్డితో సహజీవనం మానుకోవాలని తనతో పాటే ఉండాలని గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సూర్యనారాయణను ఆమె గదిలోకి వెళ్లగా శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధిని ఇద్దరూ కనిపించడంతో వారితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరగడంతో వారిద్దరూ కలిసి సూర్యనారాయణను అదే అంతస్తు పైనుంచి కిందికి తోసేశారు. పక్కటెముకలు విరిగిపోయి ఓ ఎముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవడంతో అతడి పరిస్థితి విషమించింది. బాధితుడిని పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో బాధితుడిని చేర్నించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధినిలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే నాగవర్ధినికి వివాహం జరిగినట్లు తేలింది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి) -
అరుదైన శస్త్ర చికిత్స.. ప్రసవం జరుగుతుండగా శిశువుకు సర్జరీ.. 11 నిమిషాల్లోనే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు తొలిసారిగా అరుదైన శస్త్ర చికిత్స చేశారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు ఏర్పడిన కణితిని ప్రసవ సమయంలోనే తొలగించారు. బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వరంగల్‌కు చెందిన ఓ మహిళ పలుమార్లు గర్భస్రావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గర్భం దా ఆమె ఈసారి గర్భాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ, గర్భస్థ శిశువుకు మెడపై భారీ కణితి ఉన్నట్టు స్కానింగ్ ద్వారా అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆ దశలో చికిత్స అసాధ్యం కావడంతో మరోసారి గర్భస్రావం చేయించుకుంటేనే మేలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో నగరానికి వచ్చి రెయిన్బో వైద్యులను సంప్రదించారు. అనంతరం రెయిన్బో వైద్యుల పర్యవేక్షణలో 9 నెలలు నిండిన అనంతరం.. వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఓ వైపు ప్రసవం జరుగుతున్న సమయంలోనే మరోవైపు బిడ్డ మెడకు ఉన్న కణితిని కూడా తొలగించారు. అత్యంత సంక్లిష్టమైన ఎక్సూటరో ఇంట్రా పార్టమ్ ట్రీట్మెంట్ (ఎగ్జిట్) ద్వారా ఈ కణితి తొలగింపు ప్రక్రియ నిర్వహించారు. పాక్షిక ప్రసవం సమయంలో తల ఒక్కటే బయట ఉండి మిగిలిన దేహమంతా తల్లి గర్భాన్ని అంటిపెట్టుకుని ఉండగానే 11 నిమిషాల అత్యంత స్వల్ప సమయంలో శస్త్ర చికిత్స జరగడం వైద్యరంగంలో అపూర్వమని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్స కోసం రెయిన్బో ఆస్పత్రికి చెందిన వివిధ విభాగాలకు చెందిన 25 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. (చదవండి: టెన్త్‌లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్సీఈఆర్టీ మొగ్గు ఎటువైపు?) -
ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.. చిరు ఎమోషనల్ ట్వీట్
హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ దారుణం రాజధాని నగరంలో కలకలం రేపింది. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పిల్లల భద్రతపై రాజీ పడవద్దని సూచించారు. తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పసిబిడ్డపై జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ఎమోషనల్ అయ్యారు. దీనికి కారణమైన కఠినాతి కఠినంగా శిక్షించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ వేదికగా కోరారు. (చదవండి: డీఏవీ స్కూల్ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల) మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'బంజారాహిల్స్‌లోని పాఠశాలలో చిన్నారిపై జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను తీవ్రంగా కలిచివేసింది. నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన ఘటన చాలా బాధాకరం. ఇలాంటి ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. అంతే కాకుండా అన్ని విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా.' అంటూ మెగాస్టార్ ఎమోషనలల్ పోస్ట్ చేశారు. Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh — Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022 -
బంజారాహిల్స్ డీఏవీ పాఠాశాల గుర్తింపు రద్దు
-
కులం పేరుతో దూషించారు.. ప్రాణహానీ ఉంది: నిర్మాత ఫిర్యాదు
తాను నిర్మిస్తున్న సినిమాను వివిధ కారణాలతో ఆపేందుకు ప్రయత్నించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ తనను ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిసీ దర్శకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాలు.. నల్లకుంటలో నివసించే మంచాల ప్రమోద్(27) సినిమాలు నిర్మించేందకు గాను శ్రీనగర్ కాలనీకి వచ్చి సొంత బ్యానర్‌పై ‘కంటోన్మెట్ పోస్టాఫీస్’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నీకు ఎందుకంటూ బాల సతీష్, రాజేష్ చిలువురి అనే ఇద్దరు వ్యక్తులు మానసికంగా వేధిస్తూ తనను సినీ పరిశ్రమ నుంచి దూరం చేసేందుకు యత్నించడమే కాకుండా తన సినిమా నిర్మాణాన్ని ఎలాగైనా ఆపాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అలాగే తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తూ ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. గణపతి కాంప్లెక్స్ వద్ద తనతో పాటు సహాయ దర్శకుడు బి. రవితేజపై కూడా కులం పేరుతో దుషించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సతీష్, రాజేష్ చిలువూరిలపై బంజారాహిల్స్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.