సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీకి చెందిన అత్యాధునిక ప్రీమియం ఫర్నిచర్ బ్రాండ్ ‘ఫర్నెస్ట్రీ’ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. బంజారాహిల్స్‌లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి ఎక్స్‌పీరియన్స్ స్టూడియోను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫర్నెస్ట్రీ ఫౌండర్ మాన్సీ అలెన్ మాట్లాడుతూ.. కస్టమర్లు కోరుకున్న విధంగా ప్రీమియం ఫర్నీచర్, వాల్ ఆర్ట్ వంటి గృహాలంకరణలను తయారు చేసి ఇస్తామని తెలిపారు.
కస్టమర్లకు డిజైన్ కాన్సెప్‌్టలను విజువలైజ్ చేయడానికి ప్రత్యేకమైన కాంప్లిమెంటరీ మూడ్ బోర్డ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టూడియోలో ఆధునిక, సంప్రదాయ హస్తకళను మిళితం చేస్తూ డైనింగ్ టేబుల్స్, స్థానిక కళాకారుల వాల్ ఆర్ట్, స్కాండినేవియన్ డిజైన్‌తో జపనీస్ సౌందర్యాన్ని మిళితం చేసే జపాండీ ఫ్యూజన్ ఫర్నిచర్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇవి చదవండి: సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు..
Comments
Please login to add a commentAdd a comment