furniture
-
కొత్త నగరాలకు ఐకియా
న్యూఢిల్లీ: ఫర్నిచర్ రంగ దిగ్గజం ఐకియా భారీగా విస్తరిస్తోంది. ఢిల్లీ–ఎన్సీఆర్తోపాటు మరో తొమ్మిది మార్కెట్లలో ఆన్లైన్ విక్రయాలను ఈ వారం ప్రారంభిస్తోంది. స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో తదుపరి దశ పెట్టుబడుల కోసం చూస్తోందని, విస్తరణ తర్వాత లాభదాయకతకు చేరుకుంటుందని ఐకియా ఇండియా సీఈవో సుసాన్ పల్వరర్ తెలిపారు. ఢిల్లీ–ఎన్సీఆర్లో 2026లో గురుగ్రామ్ వద్ద, అలాగే 2028లో నోయిడాలో పూర్తి స్థాయిలో స్టోర్లను నెలకొల్పాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. చెన్నై, పుణేలోనూ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. భారీ స్టోర్ ఏర్పాటుకు ముందే చిన్న కేంద్రాలను ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. పుణేలో కంపెనీ ఇప్పటికే ఆన్లైన్లో అమ్మకాలను సాగిస్తోంది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో భారీ స్టోర్లున్నాయి. రూ.10,500 కోట్లతో..: పదేళ్లలో అనుబంధ మౌలిక సదుపాయాలతో ఐకియా ద్వారా 10 స్టోర్లను ఏర్పాటు చేయడానికి రూ.10,500 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంగ్కా గ్రూప్‌లో భాగమైన ఇంగ్కా సెంటర్స్ ఐకియా రిటైల్‌ను నిర్వహిస్తోంది. గురుగ్రామ్, నోయిడాలో లైక్లీ బ్రాండ్ కింద కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ.9,136 కోట్ల పెట్టుబడి పెడుతోంది. పెట్టుబడుల విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఆమె చెప్పారు. మెట్రోల్లో విస్తరించిన తర్వాత తదుపరి దశలో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు సుసాన్ తెలిపారు. కాగా, 2023–24లో కంపెనీ టర్నోవర్ భారత్‌లో రూ.1,810 కోట్లు. నష్టాలు రూ.1,299 కోట్లకు చేరాయి. రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో కూడా లాభాలను ఆర్జిస్తామని సుసాన్ వివరించారు. -
సోఫా, ఏసీ, ట్యాప్‌లు ఎత్తుకెళ్లారు: తేజస్వి యాదవ్‌పై బీజేపీ ఆరోపణలు
రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేేసే సమయంలో అందులోని సామాన్లను దొంగిలించారని ఆరోపించింది. అధికారిక బంగ్లాలోని ఏసీ, సోఫాలు, బెడ్, వాషూరూమ్‌లో ట్యాప్స్ వంటి అనేక వస్తువులు మాయమయ్యాయని తెలిపింది. బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యక్తిగత కార్యదర్శి శత్రుధన్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. తాము ఆరోపణలు మాత్రమే చేయడం లేదపి, ఆధారాలు కూడా చూపిస్తున్నామని తెలిపారు. దీనిపై తేజస్వి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుళాయిలు కనుమరుగయ్యేలా చేశారని, ఇక్కడ కూడా అదే జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆర్జేడీ నేత ఇంకా స్పందించలేదు.కాగా ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు.బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఆయనను ప్రతిపక్ష నేత నివాసానికి మార్చాలని కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీకి కేటాయిస్తూ ఇటీవల నీతీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం తేజస్వీ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. -
ఫర్నీచర్ సంగతి ఏదో ఒకటి తేల్చండి: వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోని ఫర్నీచర్ అంశంపై వైఎస్సార్సీపీ.. మూడు నెలల వ్యవధితో ఇప్పుడు ఐదోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఫర్నీచర్ వీలైనంత త్వరగా వచ్చి తీసుకెళ్లాలని ఆ లేఖలో సాధారణ పరిపాలన విభాగాన్ని(GAD) కోరింది.‘‘గతంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్నది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారింది. కాబట్టి.. వెంటనే ఫర్నీచర్‌ను తీసుకెళ్లండి. ఎప్పుడు తీసుకెళ్తారో సమయం చెప్పండి. ఒకవేళ తీసుకుని వెళ్లకపోతే గనుక ఆ ఫర్నీచర్ ఖర్చులు చెబితే.. వాటిని చెల్లిస్తాం’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు ఐదుసార్లు విషయాన్ని జీఏడీ దృష్టికి తీసుకెళ్లిన అంశాన్ని తేదీలతో సహా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సీఎంగా పని చేసిన క్యాంప్ ఆఫీస్‌లోని ఫర్నీచర్ అంశంపై అనుకూల మీడియాతో రాద్ధాంతం చేయాలని ప్రయత్నించింది. అయితే అప్పటికే జీఏడీకి వైస్సార్సీపీ లేఖ రాసింది. ఇప్పటిదాకా నాలుగుసార్లు లేఖ, మెయిల్ ద్వారా కబురు పంపినా జీడీఏ నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో కేవలం నిందలు మోపడానికే దీనిపై స్పందించడం లేదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐకియా 365 రోజుల ఎక్స్చేంజ్ పాలసీ
న్యూఢిల్లీ: కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో హోమ్ ఫర్నిషింగ్స్ సంస్థ ఐకియా ఇండియా తాజాగా 365 రోజుల వరకు వర్తించే ఎక్స్చేంజ్, రిటర్న్ పాలసీని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం ఐకియాలో హోమ్ ఫర్నిచర్, ఫర్నిషింగ్ యాక్సెసరీలను కొనుగోలు చేసిన కస్టమర్లు తమ మనస్సు మార్చుకున్న పక్షంలో వాటిని ఒరిజినల్ ప్యాకేజింగ్ స్థితిలోనైనా లేదా అసెంబుల్ చేసిన స్థితిలోనైనా స్టోర్‌లో వాపసు చేయొచ్చు లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం హోమ్ కలెక్షన్ సర్వీసును కూడా అందిస్తున్నట్లు సంస్థ కంట్రీ కస్టమర్ మేనేజర్ అలెక్జాండ్రా షెస్టాకోవా తెలిపారు. -
ఫర్నిచర్ పరిశ్రమ వరదార్పణం
సాక్షి, అమరావతి: విజయవాడ వరదల్లో తడిసి ముద్దయిన ఫర్నిచర్ పరిశ్రమకు కోలుకోలేని నష్టం ఏర్పడింది. దాదాపు 15రోజులపాటు ప్లైవుడ్, ఇతర ఫర్నిచర్ సామగ్రి నీటిలో నానిపోయి రూ.కోట్ల నష్టం మిగిలి్చంది. ఉత్పత్తి అయిన ఫర్నిచర్ అమ్మకానికి పనికిరాకుండా తయారైంది. సామగ్రి సైతం ఫర్నిచర్ తయారీకి పనికిరాకుండా పోయింది. దీంతో ఫర్నిచర్ పరిశ్రమలు, వర్క్‌షాప్‌ల రోజువారీ పనులు ఇప్పటికీ మొదలయ్యేలా లేవు. ముంపుబారిన 310కి పైగా వర్క్‌షాపులు విజయవాడ నగరంలో వరద ముంపునకు గురైన అజిత్‌సింగ్‌నగర్, రాజరాజేశ్వరీపేట, అంబాపురం, రాజీవ్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, పైపుల రోడ్డు, కండ్రిక తదితర ప్రాంతాల్లో 310పైగా ఫర్నిచర్ తయారు చేసే వర్క్‌షాప్‌లు ఉన్నాయి. వాటితోపాటు భవానీపురం, అజిత్‌సింగ్ నగర్ ప్రాంతాల్లో 45కు పైగా ప్లైవుడ్ పరిశ్రమలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ప్రత్యేక గోదాములు కూడా ఉన్నాయి. వాటన్నింటిలోను వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోవడంతో ప్లెవుడ్ చెక్కలతోపాటు వాటితో తయారు చేసిన వస్తువులు సైతం నానిపోయి ఉబ్బిపోయాయి. ముడిసరుకు, తయారీ సామగ్రి వరద నీటిలో దెబ్బతిని వాటి యజమానులు నష్టపోయారు. ఫర్నిచర్ షాపులు, వర్క్‌షాపుల్లోని బీరువాలు, సోఫా సెట్లు, ఇనుప సామగ్రి, యంత్రాలు, పనిముట్లు దెబ్బతినడంతో ఒక్కో యజమానికి కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ఒక్క ప్లైవుడ్ ఫర్నిచర్, వర్క్‌షాపులు, పరిశ్రమలకు వచ్చిన నష్టమే మొత్తంగా కనీసం రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఫర్నిచర్ షాపులు, పరిశ్రమలపై ఆధారపడిన జీవిస్తున్న సుమారు 12 వేల మంది ఉపా«ధికి సైతం పెద్ద దెబ్బ తగిలింది.ఇనుముకు తుప్పు విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్‌కు వరద తీవ్ర నష్టం తెచ్చింది. 60 ఎకరాల్లో విస్తరించిన ఐరన్ యార్డ్‌లో 430కి పైగా హోల్‌సెల్ ఐరన్ వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఈ యార్డ్‌లో రోజుకు రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఐరన్ హోల్‌సేల్ షాపులతోపాటు రిటైల్ షాపులు, శానిటరీ, పైపులు, ప్లైవుడ్, ఎలక్ట్రికల్స్, హార్ట్‌వేర్, ఆగ్రో, కెమికల్, నిత్యావసర వస్తువుల షాపులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వరద నీరు ముంచెత్తడంతో అవన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి నీటిలో నానిపోయిన ఐరన్ నిల్వలు తుప్పుపట్టి రంగు మారడంతో వ్యాపారులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. రంగు మారిన ఐరన్ సామగ్రిని తుక్కుకు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. వరద సమయంలో 15 రోజులపాటు వ్యాపారం చేసే అవకాశం లేకపోగా, ఇప్పుడు పాడైన ఐరన్, ఇతర సామగ్రిని అయినకాడికి అమ్ముకోవాల్సి రావడంతో నష్టాల్లో మునిగిపోతామని చెబుతున్నారు. -
బంజారాహిల్స్‌లో ఫర్నెస్ట్రీ..
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీకి చెందిన అత్యాధునిక ప్రీమియం ఫర్నిచర్ బ్రాండ్ ‘ఫర్నెస్ట్రీ’ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. బంజారాహిల్స్‌లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి ఎక్స్పీరియన్స్ స్టూడియోను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫర్నెస్ట్రీ ఫౌండర్ మాన్సీ అలెన్ మాట్లాడుతూ.. కస్టమర్లు కోరుకున్న విధంగా ప్రీమియం ఫర్నీచర్, వాల్ ఆర్ట్ వంటి గృహాలంకరణలను తయారు చేసి ఇస్తామని తెలిపారు.కస్టమర్లకు డిజైన్ కాన్సెప్్టలను విజువలైజ్ చేయడానికి ప్రత్యేకమైన కాంప్లిమెంటరీ మూడ్ బోర్డ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టూడియోలో ఆధునిక, సంప్రదాయ హస్తకళను మిళితం చేస్తూ డైనింగ్ టేబుల్స్, స్థానిక కళాకారుల వాల్ ఆర్ట్, స్కాండినేవియన్ డిజైన్‌తో జపనీస్ సౌందర్యాన్ని మిళితం చేసే జపాండీ ఫ్యూజన్ ఫర్నిచర్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఇవి చదవండి: సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు.. -
టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, గుంటూరు: అధికార మత్తులో టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.‘‘ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంప్ కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.‘‘వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైఎస్ జగన్‌ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి.’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. -
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్‌గా ప్రచారం చేసే ప్లైవుడ్‌కు ఆ మేరకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్‌కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. -
మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో మంటలు
భోపాల్: మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్రటేరియట్ భవన సముదాయం ‘వల్లభ భవన్’లోని మూడో అంతస్తులో మొదలైన మంటలు 4, 5 అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఆయా అంతస్తుల్లోని ఫైళ్లు, ఇతర ఫరి్నచర్ పూర్తిగా కాలిపోయాయి. నీళ్ల ట్యాంకర్లతోపాటు సుమారు 50 అగ్ని మాపక శకటాలతో వచ్చిన సిబ్బంది దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి మంటలను సాయంత్రం 4 గంటల సమయానికి అదుపులోకి తెచ్చారు. శనివారం సెలవు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతబడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవన సముదాయంలో దాదాపుగా ఎవరూ లేరని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై సవివర దర్యాప్తు కోసం సీఎం మోహన్ యాదవ్ అదనపు చీఫ్ సెక్రటరీ మహ్మద్ సులెమాన్ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. 15 రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు. 2003లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వల్లభ్ భవన్ జరిగిన అయిదో అగ్ని ప్రమాదమని కాంగ్రెస్ ఆరోపించింది. అవినీతి సాక్ష్యాలు బయటపడకుండా చేసేందుకే సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం అంటూ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీ నేతలు సెక్రటేరియట్ వెలుపల రెండు గంటలపాటు నిరసన చేపట్టారు. -
పాత ఫర్నిచర్ మినియేచర్
కాలంతో పాటు ఫర్నిచర్లో కూడా మార్పు వస్తోంది. పాత ఫర్నిచర్ ఇప్పుడు అపురూపంగా అనిపిస్తుంది. అలనాటి ఫర్నిచర్‌ను కళ్లముందుంచేలా వశిష్ట్ రజని తయారుచేసిన పాత ఫర్నిచర్ మినియేచర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. చికాగాలోని ఆర్ట్ మ్యూజిక్యంకు వెళ్లి వచ్చిన తరువాత వశిష్ట్‌కు పాత ఫర్నిచర్ మినియేచర్లు తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. 30 సంవత్సరాల వశిష్ట్ చికాగోలో ఇండస్ట్రియల్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. -
స్థిరాస్తి, ఫర్నిచర్ రంగాల్లో అపార అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థిరాస్తి, ఫర్నిచర్, వినియోగదారుల ఉత్పత్తుల రంగాల్లో ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను పరిశీలించాల్సిందిగా గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంసింగ్ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అగ్రోవెట్ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన ఆయిల్ పామ్, పాడి వ్యాపారాన్ని విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా ఈ కంపెనీ.. మలేసియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సరీ్వసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
-
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఈరోజు (గురువారం) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిమ్స్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో చెలరేగిన మంటలకు సంబంధించిన సమాచారం అందగానే అగ్నిమాపకదళం ఏడు అగ్నిమాపక యంత్రాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 5:58 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలివెళ్లాయి. ఎయిమ్స్‌లోని ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. డైరక్టర్ బిల్డింగ్ రెండో అంతస్తులోని ఆఫీసు రికార్డులు, ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. #WATCH | A fire broke out in the Teaching Block of AIIMS Delhi today, which led to damage to furniture and office records; no casualty was reported, says Delhi Fire Services (Video source: Delhi Fire Services) pic.twitter.com/UmCYs7tXkQ — ANI (@ANI) January 4, 2024 -
తెలంగాణలో మాజీ మంత్రుల కార్యాలయాల్లో మిస్సవుతున్న ఫర్నీచర్
-
హైదరాబాద్ గచ్చిబౌలిలో లగ్జరీ బ్రాండ్ రెస్ట్లీ ఫర్నిచర్ ప్రారంభం (ఫొటోలు)
-
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం..
గుజరాత్ : రాజ్ కోట్ లోని ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారమందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. రాజ్ కోట్ లోని ఆనంద్ బంగ్లా చౌక్ సమీపంలో ఉన్న ఒక ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి అగ్నికీలలు ఎగిసిపడటంతో ఒక్కసారిగా దట్టమైన పొగ మేఘాల్లా ఆకాశంలో అలుముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోగా సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు గాని ఆస్తినష్టం ఎంత వరకు జరిగి ఉండవచ్చన్న వివరాలు తెలియాల్సి ఉంది. Fire breaks out at furniture godown near Anand Bangla Chowk in Rajkot. Fire tenders are at the spot. More details are awaited. pic.twitter.com/d9aA1x7sgF — Press Trust of India (@PTI_News) June 22, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
ఇలా చేస్తే ఇల్లంతా శుభ్రమే!
ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ సోఫా, మ్యాట్రెసెస్, టేబుల్స్, చైర్స్ ఇలా చాలా రకాల ఫర్నీచర్ ఉంటుంది. వీటిని శుభ్రం చేయకపోతే దుమ్ము, ధూళీ పేరుకుని పోయి చాలా అపరిశుభ్రంగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటివల్ల డస్ట్ అలర్జీ ఉన్న వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వీటిలో దాగి ఉండే సూక్ష్మక్రిముల వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తుంటాయి. వీటిని క్లీన్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. దీనివల్ల ఫర్నీచర్ శుభ్రంగా కనిపించడంతోపాటు ఎక్కువకాలం మన్నుతుంది కూడా. ఫర్నీచర్‌ను శుభ్రం చేసేందుకు ఏం చేయాలో చూద్దాం. సోఫా: ఆరు టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. ఈ పొడికి కప్పు వేడి నీరు కలపండి. సబ్బు నురగ వచ్చిన తర్వాత దానికి రెండు టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఈ ద్రావణం చల్లబడిన తర్వాత దానిని బాగా కలపండి. దీంతో నురగ వస్తుంది. ఒక క్లాత్ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురగతో సోఫా పై భాగంలో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తగా కనిపిస్తుంది. లెదర్ సోఫా: లెదర్ సోఫాను క్లీన్ చేసే ఏకైక మార్గం మైల్డ్ క్లీనర్‌తో శుభ్రం చేయడమే. ఇందు కోసం ఎప్పుడూ మృదువైన బ్రష్.. వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించాలి. శుభ్రం చేయడానికి నీటితో కలిపిన వెనిగర్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. డైనింగ్ టేబుళ్లు, చెక్క కుర్చీలు తదితర ఉడెన్ ఫర్నీచర్‌ని తుడిచేందుకు పొడి వస్త్రాన్ని వాడండి. వీటిని మరింతగా మెరిసేలా చేయాలంటే వ్యాక్స్, పాలిష్ కూడా చేయొచ్చు. అదే విధంగా దుమ్ముని క్లీన్ చేయాలంటే డిష్ వాష్‌ని నీటిలో కలిపి అందులో మెత్తటి బట్టను ముంచి బయటికి తీసి పిండి దానితో ఫర్నీచర్‌ని రుద్దాలి. తర్వాత పొడిబట్టతో చక్కగా తుడవండి. ఇలా క్లీన్ అయిన ఫర్నీచర్‌ని పూర్తిగా ఆరబెట్టండి. కొన్ని వస్తువులు పాత పాలిష్‌తో చూడ్డానికి అంత బాగుండవు. వీటిని క్లీన్ చేయాలంటే.. ముందుగా కొద్దిగా టీ బ్యాగ్స్ తీసుకుని వేడినీటిలో వేసి డికాషన్ చేయాలి. ఇది గోరువెచ్చగా అయ్యే వరకూ ఉంచి గుడ్డపై దీనిని పోస్తూ కొద్దికొద్దిగా తుడవాలి. టీ డికాక్షన్లోని యాసిడ్ ఉడ్ని క్లీన్ చేస్తుంది. మరకలు దూరమవ్వాలంటే.. కొన్నిసార్లు డైనింగ్ టేబుల్‌పై ఫుడ్ ఐటెమ్స్ మూలాన మరకలు పడుతుంటాయి. వాటిని తొలగించాలంటే... మరకలు పడ్డ చోట కాస్తంత టూత్‌పేస్ట్ అప్లై చేసి దానితో రుద్దాలి. ఆరిన తర్వాత ఒక తడిబట్టతో శుభ్రంగా తుడిచెయ్యండి. మరకలు మొండిగా ఉంటే బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్‌లను సమానంగా కలిపి వాటితో రుద్దండి. కాసేపయ్యాక తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టండి. గోడలపై ఇంక్ మరకలు, పెన్ను గీతలు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ని మరకలపై పట్టించి రుద్ది తడిగుడ్డతో తుడిచెయ్యాలి.దీనికి మరో పద్ధతి ఉంది. అదేంటంటే... గిన్నెలో కాసిన వేడినీళ్లు తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల షాంపూ వేసి బాగా కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిలో ఒక క్లాత్‌ను ముంచి మరకలు పడ్డ చోట రుద్దండి. ఆరిన తర్వాత తడిబట్టతో తుడవండి. మరకలు పలచబడతాయి. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. ఇలా ఒకటి రెండుసార్లు చేయడం మంచిది. ఉడెన్ ఫర్నిచర్: చెక్కతో చేసిన గృహోపకరణాలు పాడు కాకుండా ఉండాలంటే టీ డికాషన్‌లో మెత్తటి క్లాత్‌ను నానబెట్టి పిండి దాంతో తుడవండి. ఇలా చేస్తే రంగు వెలిసిన ఫర్నీచర్‌కు కూడా తిరిగి మెరుపు వస్తుంది. చెక్కపై నీటి మరకలు దాని అందాన్ని పాడు చేస్తాయి. నీటి మరకలు పడినచోట వైట్ టూత్ పేస్ట్ (జెల్ పేస్ట్ కాదు) రాయండి. తర్వాత మెత్తని బట్టతో రుద్దాలి. అప్పుడు టూత్‌పేస్ట్‌ను తీసివేసి.. తడిబట్టతో తుడిచేయాలి. చెక్క ఫర్నిచర్‌పై మసి ఉంటే.. టీస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో వేసి కరిగించండి. మసి ఉన్న ప్రాంతంపై దీన్ని అప్లై చేయండి. తర్వాత మెత్తని పొడిబట్టతో తుడవండి. సీలింగ్ ఫ్యాన్లు సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లు ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల ముందుగా మీరు టేబుల్ పైకి ఎక్కి ఫ్యాన్‌ను తీసేయండి. ఆ తర్వాత ఫ్యాన్ బ్లేడ్‌ని తీసి విడిగా శుభ్రం చేయండి. రెక్కలను కూడా సబ్బుతో రుద్ది శుభ్రంగా కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. రెండో విధానం.. పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఒకదానిని కవర్ చేయాలి. ఇప్పుడు కవర్ పైనుంచి చేతులతో రుద్దాలి. అదేవిధంగా మూడు రెక్కలను శుభ్రం చేయాలి. రెక్కలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, బూజు అంతా కవర్ లోపల పడిపోతుంది. తర్వాత దాన్ని పారవేసి పిల్లో కవర్‌ను ఉతుక్కుంటే సరిపోతుంది. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్‌ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరవాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు కళ్లకి ప్లెయిన్ గ్లాసెస్ లేదా సన్ గ్లాసెస్ ధరిస్తే కంట్లో దుమ్ము పడకుండా ఉంటుంది. అలాగే ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి లేదంటే డస్ట్ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాన్‌ని క్లీన్ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. -
Hyderabad: పాత మంచం ఇచ్చారని పెళ్లి రద్దు చేసిన వరుడు..
మరికొద్ది గంటల్లో మూడుముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెడతాడనుకునే వరుడు ఉన్నట్టుండి పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మండపం వద్దకు వచ్చేది లేదని తెగేసి చెప్పాడు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 13న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. 19వ తేదీన(ఆదివారం) పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కాగా వధూవరులిద్దరికి ఇది రెండో పెళ్లి. అయితే అమ్మాయికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులనే వరుడికి పెట్టుపోతలు కింద ఇస్తామని వధువు తండ్రి చెప్పారు. అయితే మంచం మాత్రం కొత్తది ఇవ్వాలని వరుడు షరతు పెట్టాడు. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో మంచం విడి భాగాలు బిగిస్తుండగా విరిగిపోయింది. దీంతో పాత మంచాలు పంపించారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకేముంది ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మరికాసేపట్లో పెళ్లనగా వరుడు మండపం వద్దకు రాలేదు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. వధువు తరపు బంధువులు అంతా వచ్చేశారు. ఎంతసేపటికి పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లారు. అక్కడ వారితో పాత మంచం పెట్టారని, విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని వరుడు మండిపడ్డాడు. కోపంతో అతని కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా.. ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు. పెళ్లి రోజు వివాహాన్ని రద్దు చేస్తే ఎలా అని వధువు వారు బతిమాలినా వరుడు వినలేదు. దీంతో చేసేదేం లేక పెళ్లికూతురు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో వరుడిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. -
ఫర్నిచర్ మాటున గంజాయి రవాణా
కాకినాడ క్రైం: వ్యాన్‌లో ఫర్నిచర్ మాటున దాచి భారీ మొత్తంలో రవాణా చేస్తున్న గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని చింతూరు పరిధిలో ఏఎస్పీ కృష్ణకాంత్ పర్యవేక్షణలో శనివారం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాన్‌ను తనిఖీ చేయగా ఫర్నిచర్ కనిపించింది. వ్యాన్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, ఫర్నిచర్ అడుగున 1,500 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి కూలీలు కాలినడకన సుకుమామిడి ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి వ్యాన్‌లో ఫర్నిచర్ మాటున దాచి, అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ సరుకును ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరాబాద్‌కు తరలిస్తున్నట్లు తేల్చారు. నిందితులు గౌరవ్ రాణా (23), నౌశద్ (19), ఆరిఫ్ (23)లను అరెస్టు చేశారు. గంజాయితో పాటు, వ్యాన్, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
దీపావళికి గృహ శోభ.. బాంటియాలో ఫర్నివాల్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గత 65 ఏళ్లుగా ఫర్నిచర్ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగిన బాంటియా... దీపావళి పండుగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్లతో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. ‘బాంటియా ఫర్నిచర్’ పేరిట ఫర్నిచర్ కార్నివాల్‌ను ప్రారంభించింది. గృహ, ఆఫీస్ ఫర్నిచర్ల కొనుగోళ్ల మీద ఆఫర్లను, డిస్కౌంట్ సేల్‌ను అందిస్తుంది. ఈనెల 20వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణలోని అన్ని బాంటియా స్టోర్లతో పాటు ఆన్లైన్ (బాంటియా.ఇన్)లో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్, బుక్‌షెల్ఫ్, బెడ్రూమ్ సెట్స్, ఆఫీస్ కురీ్చలు, టేబుల్స్ వంటి అన్ని రకాల ఫర్నిచర్లు, అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. నెలవారి వాయిదా (ఈఎంఐ) రూపంలో బాంటియా ఫర్నిచర్‌ను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు మరింత సులువుగా, ఆర్థిక భారం లేకుండా ఫర్నిచర్‌ను కొనుగోలు చేసేందుకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి చెల్లించి మిగిలిన మొత్తానికి 36 నెలల ఈఐఎం ఆప్షన్ ఉంది. ఈఎంఐ కోసం పలు ఫైనాన్షియల్ కంపెనీలతో భాగస్వామ్యమైంది. 60 సెకన్లలోపు ఈఎంఐ తక్షణ అనుమతి వస్తుంది. ఎక్స్ఛేంజ్పై 20–30 శాతం రాయితీ.. బాంటియాలో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 20–30 శాతం రాయితీపై సరికొత్త ఫరి్నచర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫరి్నచర్ల ధరలు రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకున్నాయి. సోఫాల ధరలు రూ.15 వేల నుంచి రూ.4 లక్షల వరకు, డైనింగ్ టేబుల్స్ రూ.7 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు, బెడ్ల ధరలు రూ. 8 వేల నుంచి రూ.4.5 లక్షల వరకు, ఔట్‌డోర్ ఫర్నిచర్ల ధరలు రూ.12 వేల నుంచి రూ. లక్ష వరకున్నాయి. విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగాం బహుమతులు అందిస్తూ కస్టమర్ల పండుగ ఆనందాలను రెట్టింపుమయం చేస్తున్నాం. అందు కే బాంటియా విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగింది. పండుగ షాపింగ్‌లో మేము కూడా భాగస్వామ్యమయ్యాం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వినియోగదారుల కోసం ఫరి్నచర్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. – సురేందర్ బాంటియా, ఎండీ, బాంటియా బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ నాణ్యమైన ఫర్నిచర్‌కు బాంటియా పెట్టింది పేరు. ఫర్నిచర్‌ను బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ చేస్తాం. ఫెస్టివల్ షాపింగ్ సీజన్ ఆనందాన్ని రెండితలు చేసుకునేలా ఆఫర్లను అందిస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట లోపు ఫర్నిచర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్‌లను కూడా అందిస్తాం. – అమిత్ బాంటియా, డైరెక్టర్, బాంటియా -
మీ అభిరుచికి తగిన గృహాలంకరణ డిజైన్లు
ఉల్లాసరకమైన ఇంటి అలంకరణ ఆ గృహస్తుల అభిరుచిని తెలియజేస్తుంది. కానీ, ‘మరీ ఇంతటి అలంకరణా’ ఆశ్చర్యపోయే ఇంటి లోపలి డిజైన్లు ఇవి. లిథువేనియా వెబ్సైట్ బోర్డ్పాండా ప్రపంచంలో ఉన్న కొన్ని విచిత్రమైన గృహాలంకరణ డిజైన్లను ఇటీవల మన ముందుంచింది. వంటగదిలో కంచె ఇంటి చుట్టూ కంచె వేసినట్టుగా వంటగది అలంకరణ వింతగానే అనిపిస్తుంది. పొయ్యి గట్టును కూడా అలాగే డిజైన్ చేయడం వరకు బాగానే ఉంది. కానీ, ఎంత శుభ్రం చేసినా వంటగది గజిబిజిగా ఉన్నట్టు కలలోకి వస్తే మాత్రం ఎవరూ బాధ్యులు కారండోయ్. ఇంతకీ ఈ కిచెన్ ఎక్కడ అనేది మీ సందేహమా అమెరికాలోని ఓ గృహస్తుడి ఐడియా ఇది. బాస్కెట్ బాల్ నెట్ ఇంటి హాలులో అందమైన షాండ్లియర్‌ని వేలాడదీయడం ఒక హంగుగా చూస్తూనే ఉంటాం. అరుదైన క్రిస్టల్స్‌తో బాస్కెట్‌బాల్ నెట్‌ను రూపొందించి, ఇలా హ్యాంగ్ చేశారు. ఇది నిజంగానే అరుదైన షాండ్లియర్‌గా మార్కులు కొట్టేసింది. ఇంట్లో జూ పార్క్ సెంటర్ టేబుల్ పక్కనే మూలన అలంకరించిన షో పీస్ చూస్తే ఆ ఇంటి యజమాని గుండె ఎంత గట్టిదో ఇట్టే తెలిసిపోతుంది. మొసలి తన బలాన్నంతా ఉపయోగించి కూర్మాన్ని నోట కరచుకున్నట్టుగా ఉన్న ఈ షో పీస్ జూ పార్క్‌లో ఉంటే ఉండచ్చు గాక. కానీ, ఇంటి అలంకరణలో చోటు ఇవ్వడం అనేది అతి పెద్ద విశేషమే. కమోడ్‌పై పెయింటింగ్ కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రతీది సృజనాత్మకంగా ఉండాలనుకుంటారు. ఓ ఇంటి యజమాని తన టాయిలెట్ కమోడ్‌పైన క్రాకరీ ఐటమ్స్‌పై ఎలా అయితే డిజైన్ చేస్తారో ఆ విధంగా చేయించాడు. ఆ పెయింటింగ్ పట్ల డిజైనర్ ఎంత శ్రద్ధ కనబరచారో చూస్తుంటే ఇంటి యజమాని అభిరుచి ఎంతటి ఘనమైనదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. స్నానపు తొట్టె కుర్చీలు పాత బాత్‌టబ్‌ను తీసుకొని, దానిని రెండు కుర్చీలు, ఒక సెంటర్ టేబుల్ చేయడం అనేది ఒక సృజనాత్మక డిజైన్‌గా మెచ్చుకోకుండా ఉండలేం. అంత సౌకర్యంగా లేకపోవచ్చు కానీ, ఈ డిజైనర్‌కి మాత్రం పర్యావరణం పట్ల అమితమైన ప్రేమ ఉన్నట్టు తెలుస్తోంది. పాడైపోయిన వస్తువులను తిరిగి వాడుకునేలా ఎలా చేయచ్చో ఈ డిజై¯Œ చూస్తే తెలిసిపోతుంది. గడ్డి కుర్చీలు పార్కులో గడ్డిలో కూర్చోవడం మనందరికీ అనుభవమే. కానీ, ఇంటి లాన్లో పచ్చటి గడ్డి పరచుకున్న కుర్చీల మీద కూర్చోవడం ఒకింత తెలియని అనుభూతే. టేబుల్, కుర్చీల మీద ఇలా గడ్డిని అందంగా రూపు కట్టారు. ప్రకృతి అంటే ఎంత ప్రేమ ఇలా చాటి చెప్పారు. గగుర్పాటు కప్పులు టీ తాగడానికి అందమైన కప్పుల సేకరణ అందరూ చేస్తారు. కానీ, గగుర్పాటు కలిగించే విధంగా ఉన్న కాఫీ కప్పుల డిజైన్ మాత్రం చూస్తే జడుసుకోకుండా ఉండలేరు. స్పైన్ క్యాండిల్స్ వివిధ రకాల షేపుల్లో ఉన్న క్యాండిల్స్, రంగుల్లో ఉన్న క్యాండిల్స్ గురించి మనకు తెలుసు. కానీ, ఇలా మానవ శరీర వెన్నెముకను పోలి ఉండే క్యాండిల్ ను సృష్టించారు. శరీర నిర్మాణ శైలితో ఉన్న రూపకల్పనల అలంకారాలను ఇష్టపడతున్నారట. అందుకే, స్పైన్‌ను కూడా నైస్‌గా క్రియేటివ్‌గా చేస్తున్నారు. కమోడ్‌పై పెయింటింగ్ కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రతీది సృజనాత్మకంగా ఉండాలనుకుంటారు. ఓ ఇంటి యజమాని తన టాయిలెట్ కమోడ్‌పైన క్రాకరీ ఐటమ్స్‌పై ఎలా అయితే డిజైన్ చేస్తారో ఆ విధంగా చేయించాడు. ఆ పెయింటింగ్ పట్ల డిజైనర్ ఎంత శ్రద్ధ కనబరచారో చూస్తుంటే ఇంటి యజమాని అభిరుచి ఎంతటి ఘనమైనదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. కాళ్ల కుండీలు ఎక్కడా లేని విధంగా ప్రత్యేక ఇంటి అలంకరణ కోసం చూస్తున్నారా? అయితే, ఇలా ప్రయత్నించవచ్చు. ఇళ్లలో మొక్కల కుండీలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈ కుండీ మానవ శరీరం నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేసింది. మానవ కాళ్ల రూపాలతో తయారుచేసిన కుండీల కంటైనర్ ఇది. రాక్షస మంచం భారీ కోరలతో రాక్షస నోరును పోలి ఉన్నట్టు ఉన్న మంచం ఇది. ఈ మంచంలో గాఢమైన నిద్ర కోసం ప్రయత్నించడం అసాధారణ వ్యక్తులకే సాధ్యం అనుకుంటే పొరపాటేమీ కాదు. స్పైన్ క్యాండిల్స్ వివిధ రకాల షేపుల్లో ఉన్న క్యాండిల్స్, రంగుల్లో ఉన్న క్యాండిల్స్ గురించి మనకు తెలుసు. కానీ, ఇలా మానవ శరీర వెన్నెముకను పోలి ఉండే క్యాండిల్ ను సృష్టించారు. శరీర నిర్మాణ శైలితో ఉన్న రూపకల్పనల అలంకారాలను ఇష్టపడతున్నారట. అందుకే, స్పైన్‌ను కూడా నైస్‌గా క్రియేటివ్‌గా చేస్తున్నారు. చదవండి: World Alzheimer's Day: మతిమరుపు వల్ల మెదడు బరువు కోల్పోయి.. క్రమంగా.. -
కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ!
మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు.. ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్‌ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. వైఢూర్యాలు కాదు.. వజ్రాలే! భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్‌తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు. ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్‌లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది. పాలు, పెరుగు కూడా.. పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా. పెర్ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్‌క్రీమ్‌గా మార్చి అందరికీ అందించేందుకు పెర్ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా! కృత్రిమ మాంసం.. భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్‌తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు. తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్‌లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్‌లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఆఖరికి రక్తం కూడా.. మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప.. గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి! -
1,500 ఎకరాల్లో భారీ ఫర్నిచర్ పార్కు
సాక్షి, అమరావతి: దేశీయ అవసరాలకు తోడు ఎగుమతులే లక్ష్యంగా రాష్ట్రంలో భారీ ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కానుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, శ్రీ సిటీకి సమీపంలో 1,500 ఎకరాల్లో ఫర్నిచర్ పార్కును నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా సుమారు 20 రకాల వస్తువులకు సంబంధించి దిగుమతులను తగ్గించుకుని ఎగుమతి చేసే విధంగా స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా ఏపీలో ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కానుంది. అంతర్జాతీయంగా ఏటా రూ. 20 లక్షల కోట్ల విలువైన ఫర్నిచర్ విక్రయాలు జరుగుతుండగా ఇందులో కనీసం రూ.3–4 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ను భారత్ దక్కించుకుంటే 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేసింది. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపైఐఐటీ) దేశవ్యాప్తంగా ఫర్నిచర్ తయారీకి సంబంధించి పార్కుల ఏర్పాటుకు మార్గదర్శకాలను జారీ చేయడంతోపాటు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఫర్నిచర్ తయారీకి అవసరమైన దుంగలు, ఇతర కలపపై దిగుమతి సుంకం ఎత్తివేయడంతో పాటు మరిన్ని అనుబంధ యూనిట్లకు రాయితీలు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పోర్టులకు దగ్గర్లో ఫర్నిచర్ తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై, కృష్ణపట్నం రేవులకు చేరువలో ఉన్నందున నెల్లూరు జిల్లాలో భారీ యూనిట్ ప్రతిపాదనకు డీపీఐఐటీ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. డీపీఐఐటీ అధికారులు ఇప్పటికే స్థలాన్ని కూడా పరిశీలించారు. (‘మేక్ ఇన్ ఇండియా’.. అదే మన బ్రాండ్) ప్రధాన భాగస్వామిగా గోద్రేజ్! రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఫర్నిచర్ పార్కులో ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు ప్రముఖ దేశీయ ఫర్నిచర్ తయారీ సంస్థ గోద్రేజ్ ఆసక్తి వ్యక్తం చేసింది. మరో రెండు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో గుర్తించిన 20 రంగాలు ఇవే.. ఏసీలు, చర్మ పాదరక్షల తయారీ, ఆటో విడిభాగాలు, ఫర్నిచర్, సముద్ర ఉత్పత్తులు, స్టీల్, అల్యూమినియం, ఆగ్రో క్లస్టర్, ఆహార పదార్థాలు, వ్యవసాయ కెమికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, వైద్య చికిత్స ఉత్పత్తులు, టెలివిజన్, కెమెరాలు, బొమ్మలు, ఇథనాల్, ఎలక్ట్రానిక్ వెహికిల్ కాంపోనెంట్, స్పోర్ట్స్, జిమ్ పరికరాలు. -
గ్రేటర్ గృహాలంకరణ
కొబ్బరి, కొన్ని కాయగూరలు తురమడానికి వంటింట్లో తురుము పీటను ఉపయోగిస్తాం. వీటిల్లో హ్యాండిల్ ఉన్నవి, గుండ్రటి, పొడవాటి, డబ్బా పరిమాణంలో ఉన్న గ్రేటర్స్ (తురుమేవి) మార్కెట్లో రకరకాల మోడల్స్‌లో లభిస్తుంటాయి. ముచ్చటపడో, అవసరానికో తెచ్చుకున్నా ఇవి పదును పోయి సరిగ్గా తురమకపోతే పాతసామాన్లలో పడేయాల్సిందే. అయితే అలా కాకుండా వీటిని గృహాలంకరణకు ఉపయోగించుకోవచ్చు! ఇంటికి వచ్చిన వారు.. రూపు మారిన ఈ గ్రేటర్స్ని అబ్బురంగా చూసి మిమ్మల్ని ‘గ్రేట్’ అనాల్సిందే. ►కరెంట్ పోయినప్పుడో.. క్యాండిలైట్ డిన్నర్‌కో గాలికి కొవ్వుత్తులు ఆరిపోతుంటే డబ్బా రూపంలో ఉండే గ్రేటర్‌ను లాంతరుబుడ్డీలా ఉపయోగించాలి. బాల్కనీలో విద్యుద్దీపాలను అందంగా అలంకరించడానికి ఇదో చక్కని మార్గం. ►చిన్న డబ్బాలా ఉండే చీజ్ గ్రేటర్లో రకరకాల పువ్వులను అమర్చి టేబుల్ మీద పెడితే అందమైన వేజ్ సిద్ధం. ►గ్రేటర్ డబ్బాను పెయింటింగ్‌తో అందంగా అలంకరించి.. దానికి చెవి రింగులు, హ్యాంగింగ్స్ సెట్ చేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద అమర్చుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. ►ఉడెన్ స్పూన్లు వేయడానికి సరైన హోల్డర్ లేకపోతేనేం.. తురుము డబ్బాను ఉపయోగించుకోవచ్చు. ►బోసిపోయిన వాల్‌ను ముచ్చటైన ఫ్రేమ్‌తో అలంకరించాలంటే.. నలు చదరంగా ఉండే ప్లేట్ లాంటి గ్రేటర్పైన చిన్న పెయింట్ వేసి అమర్చాలి. -
ఫర్నీచర్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు
‘అందరికీ ఇచి్చనట్లే క్యాంపు కార్యాలయం కోసం అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫర్నీచర్ ఇచ్చారు. వాటిని ఆయన తన కార్యాలయంలో వాడుకున్నారు. తన పదవి ముగిసిన తర్వాత ఆ ఫర్నీచర్‌ను తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శికి రెండు లేఖలు రాశారు. వాటిని పక్కనపడేసి ఫర్నీచర్ దొంగతనం చేశారని కేసు పెట్టడం ఏమిటి? రెండు లక్షలు విలువచేసే ఫర్నీచర్ కోసం అంత సీనియర్ నేతపై కేసు పెడతారా?’.. – రెండ్రోజులుగా చంద్రబాబు మీడియా సమావేశాల్లో వల్లెవేస్తున్న మాటలివి. హైదరాబాద్ నుంచి అమరావతికి ఏపీ అసెంబ్లీని తరలించేటప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఫర్నీచర్‌ను భద్రత కోసం మా ఇంటికి తీసుకెళ్లాం. అమరావతిలో నిరి్మంచిన అసెంబ్లీలో కొత్త ఫరి్నచర్ ఏర్పాటుచేశామని సీఆర్డీఏ అధికారులు చెప్పడంతో అక్కడ ఆ ఫర్నిచర్‌కు భద్రత ఉండదని మా ఇంటికి తీసుకెళ్లాం. నా టర్మ్ పూర్తయ్యాక దాన్ని తీసుకెళ్లాలని లేకపోతే దాని విలువ ఎంతో చెబితే చెల్లిస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను. – ఆగస్టు 20న నరసరావుపేటలో మీడియాతో కోడెల శివప్రసాదరావు సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫరి్నచర్‌ను తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన విషయాన్ని చంద్రబాబు పూర్తిగా వక్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు చెబుతుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ అసెంబ్లీ నుంచి కోడెల తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన ఫరి్నచర్ అసెంబ్లీకి సంబంధించినది కాగా.. చంద్రబాబు దాన్ని కోడెల క్యాంపు కార్యాలయం ఫర్నీచర్‌గా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసెంబ్లీలో వినియోగించే ఫర్నీచర్, స్పీకర్ క్యాంపు కార్యాలయం కోసం వినియోగించే ఫర్నీచర్‌కు మధ్య తేడాను ప్రజలు గమనించలేరనే భావనతో ఆయన పూర్తిగా పక్కదారి పట్టించేలా మాట్లాడుతుండడంపై టీడీపీ నాయకుల్లోనే అసహనం కనిపిస్తోంది. గత నెలలో ఈ ఫర్నిచర్ గురించి కోడెల స్వయంగా మీడియా సమావేశం పెట్టి వెలగపూడి అసెంబ్లీలో భద్రత ఉండదని తన ఇంటికి తీసుకెళ్లినట్లు స్పష్టంచేసినప్పటికీ చంద్రబాబు వితండవాదం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి నాలుగేళ్ల క్రితం ఈ ఫరి్నచర్‌ను తరలించిన కోడెల దాన్ని గుంటూరులోని తన కుమారుడి హీరో షోరూంలో వినియోగించారు. స్పీకర్‌గా కోడెల పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన అసెంబ్లీ కార్యదర్శి ఫర్నీచర్ గురించి వివరాలు సేకరిస్తున్న సమయంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్ మాయమైన విషయం బయటపడింది. దీనిపై అసెంబ్లీలో అంతర్గతంగా విచారణ జరుగుతున్న విషయం తెలిసి కోడెల హడావుడిగా మీడియా సమావేశం పెట్టి అది తన వద్ద ఉందని తెలిపారు. ఆగస్టు 27న అసెంబ్లీకి కార్యదర్శికి ఒక లేఖ పాత తేదీతో పంపించి ముందే తాను ఇచి్చనట్లు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఈ విషయంపై గుంటూరు జిల్లా పోలీసులు, అసెంబ్లీ యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీని అమరావతికి మార్చిన సమయంలో అక్కడి ఫర్నీచర్‌ను కోడెల సత్తెనపల్లి, నర్సరావుపేటలోని తన ఇళ్లు, వ్యాపార సంస్థలకు తరలించారు. ఇందుకు అప్పటి అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ సహకరించినట్టు తేలడంతో ఇటీవలే ఆయన్ని ఆ పోస్టు నుంచి తప్పించారు. మాయమైన ఫర్నీచర్ ఇదే.. బర్మా టేకుతో చేయించిన నిజాం కాలం నాటి టేబుళ్లు, డిజైనర్ కురీ్చలు, సోఫాలు తరలించారు. నెమలి ఆకారంలోని 14 సందర్శకుల కురీ్చలు, ఒక సెంటర్ టేబుల్, ఐదు కురీ్చలు, 27 ప్లాస్టిక్ కురీ్చలు, సభ్యుల లాంజిలోని 80 తెల్ల కురీ్చలు, స్పీకర్ యాంటి రూమ్‌లోని మూడు కుర్చీలు, మూడు సింగిల్ సీటర్ సోఫాలు, ఒక త్రీ సీటర్ సోఫా, పది చెక్క కుర్చీలు, రెండు స్లి్పట్ ఏసీలు, ఎగ్జిక్యూటివ్ కురీ్చలు, సందర్శకుల కురీ్చలు, బీఏసీ మీటింగ్ హాలులోని టేబుల్, ఎగ్జిక్యూటివ్, సాధారణ కురీ్చలు, డైనింగ్ హాలులోని టేబుల్, కురీ్చలు, కప్బోర్డు తదితర వస్తువులు తరలించారు. ఇవికాక.. స్పీకర్ ఛాంబర్, ఇతర ప్రదేశాల్లో ఉన్న ఫరి్నచర్, టవర్ ఏసీలు, కంప్యూటరు సైతం మాయమయ్యాయి. ఇవన్నీ కోడెల క్యాంపు కార్యాలయం కోసం వాడినవని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. వీటి విలువ కూడా తక్కువ చేసి చూపిస్తుండడం గమనార్హం. -
ప్లాస్టిక్ కుర్చీలను వదల్లేదు..
-
కోడెల.. ఇంత కక్కుర్తా?
శాసన సభ మాజీ స్పీకర్ కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తోపుడుబండిపై ఆధారపడిన చిరువ్యాపారి నుంచి బడా కాంట్రాక్టర్ వరకు కే–ట్యాక్స్ వసూలు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకుంది. పేదల ఆకలి తీర్చాల్సిన అన్న క్యాంటీన్ భోజనాలను కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ కంపెనీ కార్మికులకు విక్రయించి సొమ్ముచేసుకుంది. చివరికి మూగజీవాల ఆకలి తీర్చాల్సిన గడ్డినీ వదల్లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తరలించి కుమారుడి షోరూమ్‌లో వాడుకున్నారు. రూ.లక్షల విలువచేసే డైనింగ్ టేబుల్ నుంచి నాలుగైదు వందల రూపాయల విలువ కూడా చేయని ప్లాస్టిక్ కుర్చీ వరకూ వదలకుండా అక్రమంగా తరలించుకున్నారు. అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశాక, ఫర్నిచర్ అప్పగిస్తానంటూ కోర్టును ఆశ్రయించిన కోడెల శివప్రసాద్ తీరును చూసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. సాక్షి, గుంటూరు: శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబ సభ్యుల కక్కుర్తిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పేదల నుంచి బడా కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరి నుంచి కే–ట్యాక్స్ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. కోడెల కుటుంబం అక్రమాలు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజవకర్గాలను దాటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తన కుమారుడి షోరూమ్‌కు తరలించిన విషయం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంలో తుళ్లూరు పోలీసులు కోడెల శివప్రసారావుపై సెక్షన్ ఐపీసీ సెక్షన్ 409, ఆయన కుమారుడు శివరామకృష్ణ (శివరామ్)పై 414 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుంటూరు నగరంలోని శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్ చేశారు. అసెంబ్లీ అధికారుల అనుమతి మేరకే పాత అసెంబ్లీలో ఫర్నిచర్‌కు భద్రత దృష్ట్యా తన కార్యాలయాలకు తరలించానని కోడెల బుకాయిస్తూ వచ్చారు. అయితే కోడెల కుమారుడి షోరూమ్‌లో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ అనధికారికంగా తరలించారని అధికారులు నిగ్గు తేల్చారు. ప్లాస్టిక్ కుర్చీలను వదల్లేదు.. అప్పనంగా వస్తున్నాయనే ఉద్దేశంతో రూ.70 లక్షల ఖరీదైన డైనింగ్ టేబుల్ నుంచి వందల రూపాయల విలువసేజే ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలకుండా కుమారుడి షోరూమ్‌కు కోడెల తరలించారు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల శివరామ్ దర్జాగా షోరూమ్‌లో రెండేళ్లు వినియోగించుకున్నారు. ఆఖరికి అసెంబ్లీ నుంచి తెచ్చిన పెన్నూ పేపర్లు కూడా శివరామ్ షోరూమ్‌లో వినియోగించారని అక్కడ పనిచేసిన ఉద్యోగులే చెబుతున్నారు. ప్లాస్టిక్ కుర్చీలను వదలకుండా షోరూమ్‌లో తెచ్చిపెట్టుకున్న కోడెల కక్కుర్తిని తలుచుకుని వారి సిబ్బందే నవ్వుకుంటున్నారు. గతంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి అన్నా క్యాంటీన్లో పేదల ఆకలి తీర్చాల్సిన భోజనాన్ని తన సేఫ్ కంపెనీకి తరలించి అక్కడ పనిచేసే కార్మికులకు విక్రయించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గడ్డిలోనూ ఆమె అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాలను మర్చిపోకముందే అసెంబ్లీలోని ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలకుండా తెచ్చుకున్నారన్న విషయం తెలిసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. రాబోయే రోజుల్లో కోడెల కుటుంబం కక్కుర్తి వ్యవహారాలు ఇంకెన్ని వెలుగు చూస్తాయోనని చర్చించుకుంటున్నారు. అధికారులు ఇంకా కోడెల కార్యాలయాలు, నివాసాల్లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్ చేయలేదు. కొంత ఫర్నిచర్ గుంటూరులోని కోడెల కుమార్తె నివాసంలోనూ ఉందని వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. -
కోడెల అడ్డంగా దొరికిపోయిన దొంగ..
సాక్షి, తాడేపల్లి: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆరోపణలను ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తానేదో కుట్ర చేసినట్లు అవాస్తవాలు మాట్లాడటం సరికాదని, కోడెలే పెద్ద గజదొంగ అని ఆయన విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ర్పచారం జరుగుతుందని... పెద్ద దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. కోడెల చెబుతున్న అర్జున్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆరా తీస్తే అతడు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా తేలిందన్నారు. చోరీ చేసిన సొత్తును తిరిగి ఇచ్చినంత మాత్రాన నేరం కాకుండా పోదని, కోడెల శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఎవరు దొంగలో తేలిపోతారని హెచ్చరించారు. కోడెల శివప్రసాద్ దొరికిపోయిన దొంగ అన్నారు. తాను చిత్తశుద్ధితో ఉన్నానని, దొంగతనాలు చేయించడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు. కోడెలకు సంబంధించిన హీరో హోండా షోరూమ్‌ను ఆ కంపెనీ సీజ్ చేసిందని, అక్కడ అసెంబ్లీ ఫర్నీచర్ ఉందని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. షోరూమ్ తన క్యాంపు ఆఫీస్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఫర్నిచర్ దొంగతనం చేసి కోడెల కార్యాలయంలో దాచుకున్నారని, అసెంబ్లీకి సంబంధించిన 30 కంప్యూటర్లు కోడెల శివప్రసాదరావు కొడుకు, కూతురు కలిసి అమ్ముకున్నారన్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారికి ఈ నెల 9వ తేదీన ఫిర్యాదు చేశానని చెప్పారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు చెప్పారు. దొంగతనం కోడెల ప్రమేయంతోనే జరిగిందన్నారు. తానేదో కుట్ర చేసి దొంగతనం చేయించినట్లు దుష్ర్పచారం జరుగుతుందన్నారు. ఇది ఒక కంప్యూటర్ కొత్త కుంభకోణమని అభివర్ణించారు. కోడెల సరికొత్త డ్రామా... కాగా సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో డ్రామా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు. శుక్రవారం ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి... ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పగా.... ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు కంపూటర్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని పక్కాగా తేలిపోయింది. -
కోడెల కక్కుర్తి కేసు; మరో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్ తెలిపారు. కరెంటు పనిచేయాలంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని చెప్పారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసంలోని ఫర్నీచర్‌ను పరిశీలించేందుకు నేడు అసెంబ్లీ అధికారులు రాబోతున్న సమయంలో దొంగతనం జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారన్న ఊహాగానాలు రేగుతున్నాయి. దుండగులు పడేసిన కంప్యూటర్ మానిటర్‌ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలను దుండగులు ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ నుంచి విలువైన వస్తువులను సత్తెనపల్లిలోని తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టు కోడెల ఇప్పటికే ఒప్పుకున్నారు. ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని, లేకుంటే ఆ ఫర్నీచర్ ధర ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానంటూ వితండ వాదనకు దిగారు. కోడెల కక్కుర్తిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. (చదవండి: ‘కే’ మాయ) -
కోడెల కక్కుర్తికి చీఫ్ మార్షల్‌పై వేటు
సాక్షి, అమరావతి : శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కక్కుర్తి అసెంబ్లీ చీఫ్ మార్షల్‌పై వేటుకు దారి తీసింది. అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించుకున్న సంగతి తెలిసిందే. తీరా ఈ విషయం గుప్పుమనడంతో పోలీసు ఫిర్యాదు వరకు వెళ్లింది. దీంతో తాను ఆ ఫర్నీచర్ ఇచ్చేస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాసినట్టు కోడెల తప్పించుకునే మార్గాలు వెతికారు. అత్యంత భద్రత కలిగిన గౌరవప్రదమైన అసెంబ్లీ నుంచి ఫర్నీచర్‌ను కోడెల ఎలా తీసుకెళ్లారనే దానిపై పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ చీఫ్ మార్షల్ వేలూరు గణేష్‌బాబు విధి నిర్వహణలో వైఫల్యం వెలుగు చూసింది. పోలీసులు ఆయన్ను గురువారం విచారించారు. కోడెల, అసెంబ్లీ అధికారుల ఆదేశాల మేరకు తాను సహకరించానని గణేష్‌బాబు అంగీకరించినట్టు సమాచారం. తానే దగ్గరుండి కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్‌ను తరలించేలా వాహనాల్లోకి ఎక్కించినట్టు ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై చీఫ్ మార్షల్ నుంచి అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా తీసుకున్న పోలీసు అధికారులు క్రమశిక్షణ వేటు వేశారు. ఆక్టోపస్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న గణేష్‌బాబు డిప్యుటేషన్‌పై అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఆయన్ను చీఫ్ మార్షల్ విధుల నుంచి తప్పించి పాత పోస్టింగ్‌కు వెళ్లాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి కోడెల ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో పోలీసు అధికారిపై వేటు పడటంతో అందుకు సహకరించిన మిగిలిన అధికారుల్లోనూ కలవరపాటు మొదలైంది. -
‘కే’ మాయ
సాక్షి, అమరావతి : కంచే చేను మేస్తే.. అన్న సామెత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అతికినట్లు సరిపోతుంది. ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా ఈ చిలక్కొట్టుడు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీని 2017 మార్చిలో హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చారు. ఆ సమయంలో స్పీకర్ చాంబర్, పేషీకి సంబంధించిన ఫర్నీచర్‌ను మాత్రం సత్తెనపల్లి, నర్సరావుపేటలోని కోడెల ఇంటికి తరలించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్‌గా ఉన్న సమయంలో తన చాంబర్, పేషీ కోసం మలేషియా నుంచి ప్రత్యేకంగా ఫర్నీచర్‌ను కొనుగోలు చేయించారు. వీటిని 2017లో అమరావతికి తరలించాల్సి ఉండగా కోడెల మాత్రం తన ఇంటికి చేరవేశారు. ఫర్నీచర్‌తోపాటు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సైతం తన నివాసానికి చేర్చడం గమనార్హం. ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఎన్ని తరలించాలనే లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారం వ్యవహరించి కొన్నింటిని స్క్రాప్ కింద విక్రయించేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అసెంబ్లీ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు విషయాలు బయటపడ్డాయి. సీసీ కెమేరాలు ఆపివేసి.. హైదరాబాద్ నుంచి అమరావతి అసెంబ్లీకి తెచ్చిన ఫర్నీచర్‌ను గదుల్లో ఉంచగా అనంతరం వాటిని సైతం కోడెల తన ఇంటికి లారీల్లో తరలించారు. ఈ వ్యవహారానికి అసెంబ్లీ చీఫ్ మార్షల్ సహకరించి సీసీ కెమెరాలను ఆపి వేసినట్లు సమాచారం. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు కూడా కంప్యూటర్లు, కొంత ఫర్నీచర్‌ను కోడెల మనుషులు భారీగా తరలించారు. కోడెల వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఉద్యోగి ఇందులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. బాగున్న వాటిని తన ఇంటికి పంపాలని కోడెల ఆదేశించడం, ఆ ఉద్యోగి లారీలు తెప్పించి లోడ్ చేయించడం, చీఫ్ మార్షల్ అందుకు సహకరించడం అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ అధికారులు, సిబ్బంది ఇదంతా చూసినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. కొనసాగుతున్న విచారణ.. అసెంబ్లీ కాలపరిమితి ముగిసిన తరువాత నూతన స్పీకర్ కార్యాలయానికి ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ సహా అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీ అధికారులు సరిచూసుకుని నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చిన తర్వాతే సిబ్బందిని రిలీవ్ చేస్తారు. కానీ లెక్కలు తేలకుండానే కోడెల సిబ్బందికి ఎన్ఓసీలిచ్చి రిలీవ్ చేయడంతోపాటు భారీ ఎత్తున ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మాయమైనట్లు స్పష్టమైంది. దీనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తీసుకెళ్లడం నిజమే: కోడెల నరసరావుపేట: పాత అసెంబ్లీ హాలు స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్‌కు భద్రత లేనందున తన దగ్గర ఉంచుకున్న మాట నిజమేనని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. వాటిని తీసుకెళ్లాలని లేదా విలువ కడితే నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే లేఖలు రాశానని చెప్పారు. నరసరావుపేటలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను ఉంచామన్నారు. ఎన్నికల అనంతరం తనపై కేసులు నమోదు కావటంతో ఆలస్యమైందన్నారు. తాను వినియోగించుకున్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌కు లెక్క చెప్పాలని కోరడంతో అసెంబ్లీ కార్యదర్శికి రెండు ఉత్తరాలు రాసినట్లు చెప్పారు. తాను వాడుకున్న ఫర్నిచర్‌కు విలువ కడితే డబ్బులు చెల్లిస్తానని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి మరోసారి లేఖ రాస్తానని తెలిపారు. ఇందులో తాను దుర్వినియోగం చేసిందేమీ లేదన్నారు. భద్రత లేని కారణంగా వాటిని తన వద్ద ఉంచుకున్న మాట నిజం అని స్పష్టంగా చెబుతున్నానన్నారు. -
నరసరావుపేట పరువు తీసేశారు...
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించడం సిగ్గు చేటు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ...‘ కోడెల వ్యవహారం కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెట్టినట్లు ఉంది. ఏకంగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను దోచుకున్న ఘనుడు. అసెంబ్లీ ఫర్నిచర్ ప్రజల ఆస్తి, దాన్ని ఎలా తీసుకువెళతారు?. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచమైన పనులు చేశారు. అవసరం అయితే మేం చందాలు వేసుకొని కొనిస్తాం. కోడెల.. నరసరావుపేట నియోజకవర్గం పరువు తీసేశారు. చదవండి: చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..! నరసరావుపేట వాసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కోడెల వల్ల నరసరావుపేట ఎమ్మెల్యేగా నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. ఇప్పటికే కే ట్యాక్స్ పేరుతో దారుణమైన అక్రమాలకు పాల్పడ్డారు. కోడెల కుమారుడు వెయ్యి బైక్‌లకు ట్యాక్స్ కట్టకుండా రిజిస్టర్ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు లేఖ రాసినట్లు బుకాయిస్తున్నారు. తప్పుడు తేదీలతో హడావుడిగా లేఖ రాశారు. వందల ఏళ్ల నాటి వారసత్వ సంపదను షోరూంలో పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఇంకా ఘోరమైన దోపిడీలకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులు కూడా అమ్ముకున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఐ ఫోన్లు కూడా అమ్ముకున్నారు. అన్న క్యాంటీన్లలో భోజనాలు తన ఫార్మా కంపెనీ వర్కర్లకు అమ్ముకున్నారు. విచారణలో అన్నీ బయటకు వస్తాయి. అవినీతికి పాల్పడ్డ కోడెలపై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ?. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపుపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి: కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా? -
శిశిరానికి సెలవిచ్చా...
‘‘నేను వెడుతున్నాను...’’ కాఫీ తాగేసి లేచాడు మనోజ్.‘‘సరే... మంచిది!’’ ముభావంగా చెప్పింది సంహిత.‘‘అయామ్ సారీ, నా వల్ల నీవు హర్ట్ అయినట్టయితే...’’ ఫార్మల్గా చెప్పాడు.అభావంగా చూసింది. అతను వెళ్ళిపోయాడు వాకిట్లో వేసిన ముగ్గుతో పాటుగా, ఆమె హృదయాన్ని తొక్కుకుంటూ. అప్పటివరకూ కంటి చివరలో నిలిచిన కన్నీటి కణం ఇక ఆగలేనట్టు జారిపడింది ఆమె చెక్కిలి పైకి...గుండెల్లో ఘనీభవించిన దుఃఖం కరిగి వెల్లువై ఒక్కసారిగా ఎగసింది... అంతే... రెండు చేతుల్లో తల దాచుకొని వెక్కి వెక్కి రోదించసాగింది సంహిత. ‘అయిపోయింది... ఒక అధ్యాయం ముగిసింది... ఇక నాకోసం నేను బ్రతకాల్సిందే...’ తనకు తానే సమాధానం చెప్పుకుంది. స్టవ్ మీద టీ పెట్టి, సిమ్ చేసి, ముఖం కడుక్కోవటానికి ఉపక్రమించింది. ‘‘ఏయ్, నీకేమైనాపిచ్చా? అతనలా తెగేసిచెప్పి నిన్ను వదిలి వెళ్ళిపోతే చేతకాని దానిలాగా ఎందుకు ఊరుకుంటావు? ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత, ఇప్పుడు నువ్వు పనికిరానిదానివయ్యావా? నీలో ఉన్న లోపాలు ఇప్పుడు మీరు విడిపోవటానికి కారణం అయ్యాయటనా? అసలు పెళ్లి చేసుకున్నది ఎందుకట, ఇలా మధ్యలో విడిపోవటానికా? ఆ కాగితాలపై ఎందుకు సంతకాలు పెట్టావు?’’ కోపంగా అడిగింది వాసంతి.‘‘నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మగవాడితో సిగ్గు విడిచి ‘నువ్వే కావాలి, నన్ను వదిలేయకు’ అని ఎలా చెప్పమంటావు వాసూ? నేనూ మనిషినే కదా, అంత అవమానాన్ని ఎలా సహించగలనే?’’ ‘‘సంహీ... నేను వెళ్లి అడుగుతాను... పెళ్ళంటే ఏమైనా బొమ్మలాటా, కాసేపు ఆడుకుని బోర్ కొట్టగానే మానేయటానికి? నీ జీవితం ఏమైపోవాలి?’’‘‘ఏమీ అయిపోలేదు, అవ్వదు...’’ కూల్ గా చెప్పింది సంహిత. ‘‘అతను రాకముందు నా జీవితం ఉంది, ఇప్పుడూ ఉంది, ఇకపై కూడా ఉంటుంది. అంతే...’’‘‘అసలు ఏం జరిగింది చెప్పు?’’గతమనే గవాక్షపు తలుపులు తెరిచింది సంహిత. ‘‘జీవితంలో నాకు చాలా కలలున్నాయి... వాటిని నెరవేర్చుకోవాలి... నాతో పాటుగా మీరు కూడా ఆ పథంలో అడుగేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు...’’ పెళ్లి చూపుల్లో మనోజ్ కి టీ కప్పు అందిస్తూ అన్నది సంహిత.‘‘కలలా? ఏమిటవి?’’ కాజువల్‌గా అడిగాడు, గాలికి ఎగిరే ఆమె చీర కొంగును చూస్తూ...ఆమె ఒక్కోటీ చెబుతూ ఉంటే ముఖం అదోలా పెట్టాడు. ఆ తర్వాత అనాసక్తిగా విన్నాడు. ‘‘సంహితా, ఆర్యూ సీరియస్?’’‘‘యస్... అయామ్...’’‘‘కలలంటే ఇవా? చక్కగా ఒక పెద్ద స్థలం కొనుక్కుని, మంచి ఇల్లు కట్టుకోవాలి...పెద్ద కారు కొనుక్కోవాలి. మనకి ఇద్దరు పిల్లలు ఉండాలి. వాళ్లకి చాలా ఖరీదైన స్కూల్లో చదువు చెప్పించాలి. ఖరీదైన ఫర్నిచర్, పెయింటింగ్స్ మన ఇంట్లో ఉండాలి. రిచ్ లైఫ్ కావాలి మనకి...అవీ కలలంటే...తెలుసా?’’‘‘అదికాదు మనోజ్, నేను చెప్పేది విన్నారు కదా, అర్థం అయిందా మీకు?’’ కంగారుగా అన్నది సంహిత.‘‘చక్కగా అర్థమైంది. నువ్వు చాలా తరచుగా రక్తదానం చేస్తావు. ఎవరైనా ఆపదలో ఉంటే వెళ్లి ఆదుకుంటావు. అనాథ పిల్లలకూ, వృద్ధులకూ సాయం చేస్తావు. ఇవే కదా... నేను వీటిని అభ్యంతర పరచను. వీటిని కలలంటే ఎలా? ఇవి నీ నిత్యకృత్యాలు. కాకపోతే నా కలలు ఇప్పుడే చెప్పాను కదా, వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం ఇద్దరమూ చేద్దాము... సరేనా?’’‘అభ్యంతర పరచను’ అనగానే పొంగిపోయింది సంహిత. ‘‘మరి, ఇప్పుడు చెప్పు, నేను నీకు నచ్చానా?’’ నవ్వుతూ ఆమె చేయి పట్టుకున్నాడు, మనోజ్.క్రీగంట సిగ్గుతో అతన్ని చూస్తూ చేయి విడిపించుకుని లోపలి గదిలోనికి వెళ్ళిపోయింది, సంహిత. మిగిలిన విషయాలు అన్నీ పెద్దవాళ్ళే నిశ్చయించారు. మనోజ్ ఒక్క రూపాయి కూడా కట్నం వద్దనటంతో, ఆ వ్యక్తిత్వానికి దాసోహం అయిపొయింది సంహిత మనసు. ‘‘చక్కగా ఇద్దరం మంచి ఉద్యోగాల్లో ఉన్నాం...ఐదు లక్షల రూపాయల చిట్ మొదలు పెడదాం...’’ పెళ్ళయిన వారం రోజులకు చెప్పాడు మనోజ్.‘‘ఉహు కుదరదండీ... నాకు కమిట్ మెంట్స్ ఉన్నాయి...’’ ‘‘కమిట్ మెంట్స్? అవేమిటి?’’‘‘నేను ‘సత్య’ అనే పాపను అడాప్ట్ చేసుకున్నాను. హోమ్లోఉంటుంది. ఆ పాపకి నెలకి చదువుకు అయ్యే ఖర్చు నేనే భరిస్తున్నాను...’’ చెప్పింది.‘‘సరి సర్లే, ఇప్పటివరకూ భరించావుగా ... ఇక మానేయ్...’’ తేలికగా చెప్పాడు మనోజ్.‘‘అలా ఎలా వీలవుతుంది?’’‘‘అవుతుందోయ్... రేపు మనకే పిల్లలు పుడతారు... అలాంటప్పుడు పరాయి పిల్లలు, వాళ్ళ ఖర్చులు మనకెందుకు చెప్పు?’’ ఆమెను మాట్లాడనీయకుండా చేతుల్లో బంధించాడు. మరో రోజు ఇద్దరూ ప్రగాఢ ప్రణయావేశంలో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ కాల్ రాగానే బయలుదేరుతూ ఉంటే వద్దన్నాడు. ‘‘లేదండి, యాక్సిడెంట్... చాలా ప్రమాదంలో ఉన్నాడు పేషెంట్... నేను వెళ్లి బ్లడ్ ఇవ్వాలి... ప్లీజ్...’’ చెబుతూనే త్వరగా రెడీ అయి, తన బైక్ మీద వెళ్ళిపోయింది సంహిత. ఇంకో రోజు అతను వద్దని అంటున్నా, ఒక అంధురాలైన విద్యార్థినికి పరీక్ష వ్రాయటానికని స్క్రయిబ్గా వెళ్ళింది... ఈ రెండు సంఘటనలూ ఇద్దరి మధ్యా వాగ్యుద్ధాన్ని ప్రారంభింప జేసి, మనసులమధ్య దూరాన్ని ఎక్కువచేసాయి.అతనిదంతా డబ్బు జాగ్రత్త, విపరీతమైన పొదుపు. ఆమె పాత డ్రెస్సులు, చీరలు ఎవరికీ ఉచితంగా ఇవ్వనీయడు. ‘సెకెండ్ హాండ్ లో అమ్మేస్తే బోలెడు డబ్బు కదా!’ అంటాడు. పుస్తకాలు, పత్రికలూ కొనుక్కోనీయడు. లైబ్రరీలో సభ్యత్వం తీసుకోవచ్చు కదా అంటాడు... అలసిపోయి ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత సంహిత మొత్తం ఇంటి పనీ, వంట పనీ తానే చేయాలి. ఇటు చెంచా తీసి అటు పెట్టడు. ఏదైనా తనకి ఇష్టమైన మూవీ గురించి కాని, పుస్తకం గురించి కానీ చర్చించుదామంటే అతనికి ఆసక్తి ఉండదు. ‘ఊ..ఊ..’ అంటూ అటు తిరిగి పడుకుంటాడు. నిరాశగా నిట్టూర్పులు విడవటం తప్ప ఏమీ మిగల్లేదు సంహితకు. గొడవలు పడటం ఇష్టం లేని సంహిత, అతను అడిగిన డబ్బు ఇచ్చేసి, మిగిలిన దాంతో కష్టపడి సర్దుకుంటోంది. ఈలోగా సంహిత తండ్రికి ఆరోగ్యం పాడై, ఏవో టెస్టులు చేయించుకోవలసి వచ్చి, సంహిత దగ్గరకు వస్తే తానే ఆయన్ని లాబ్ కి తీసుకుపోయి పరీక్షలు జరిపించింది. వాటికీ, డాక్టర్ ఫీజుకీ, మందులకీ ఇంచుమించు ఐదారువేల దాకా ఖర్చయింది. తనకు చెప్పకుండా ఆ డబ్బు ఖర్చు చేసినందుకు చాలా రాద్ధాంతం చేసాడు మనోజ్. అతను డబ్బు మనిషి అనీ, ‘డబ్బు’ ను తప్ప మనుషులను ప్రేమించడనీ అర్థమైంది సంహితకు... ‘పిల్లలు పుడితే అతనే మారతాడమ్మా...’ అనునయంగా చెప్పింది తల్లి. అదే ఆశతో కాలం గడుపుతోంది సంహిత... ఎంతకాలం ఎదురు చూసినా తాను తల్లీ కావటం లేదు, మనోజ్ కూడా మారలేదు. పైగా సంహిత తనకు అనుకూలంగా మారలేదని అతనికి అంతులేని కోపం. ‘‘ఇలా ఎంతకాలం? మనకి పిల్లలు పుట్టే సూచనలేవీ కనపడటం లేదు... సంహితా, నీతో నేను ఆనందంగా ఉండలేను... మనం విడిపోదాం’’ ఒకరోజు చెప్పాడు మనోజ్.‘‘మనో... ఏమిటంటున్నారు? చాలా తప్పు. మనం విడిపోవటానికా పెళ్లి చేసుకున్నది?’’ ‘‘కాదు కానీ, నీ తెంపరితనం నేను భరించలేకపోతున్నాను. నువ్వు నాకు అనుకూలంగా ఉండవు... నీకు ఖర్చులెక్కువ. నాకన్నా అనాథలూ, దిక్కు లేని వాళ్ళూ ప్రాణం...ఏదో పెళ్ళికి ముందు సరదా పడ్డావు, నన్నడిగితే నువ్వు పెళ్లి తర్వాత మారతావని అనుకుని మాటిచ్చాను... కాని నువ్వు మారలేదు, మారవు కూడా... అందుకే నాకు నీమీద ఇష్టం పోయింది...యస్... ఐ హేట్ యూ...’’‘‘ఇష్టం అనేది ఒకసారి కలిగాక పోతుందా మనోజ్? మీరు ఏకపక్షంగా ఆలోచిస్తున్నారు... నా వైపు నుంచి మీరు సానుకూలంగా ఆలోంచించవచ్చు కదా.. మీ పాటికి మీరు నా మీద ఇష్టాన్నే చంపేసుకున్నారు. కానీ మీరంటే నాకు మాత్రం చాలా ప్రేమ!’’ ఆవేదనగా చెప్పింది సంహిత.‘‘హు...ప్రేమ! నీ ఆశయాల మీదా, నీ ఆదర్శాల మీదా మాత్రమే నీకు ప్రేమ... అందుకే వాటిని వదులుకోలేవు నీవు నాకోసం.. అలాంటప్పుడు నేనే నిన్ను వాటికి వదిలేసి వెళ్ళిపోవటం న్యాయం... మ్యూచువల్ కన్సెంట్ మీద విడాకులు తీసుకుందాం...’’ స్థిరంగా చెప్పాడు మనోజ్. ‘‘అది వాసూ నా పెళ్లి కథ...నువ్వు చాలా కాలంగా ఇక్కడ లేకపోవటం వలన, నీ కాంటాక్ట్ నంబర్ నా దగ్గర లేకపోవటం వలన నా విషయాలు ఏవీ నీకు ఇప్పటివరకూ తెలియవు. అతనికి నా వ్యాపకాలు మైనస్ చేసుకుని, నా డబ్బును ప్లస్ చేసిన తర్వాత అతనికే మిగిలిన నేను కావాలి... అతని కన్నా ముందుగా నా జీవితంలోకి వచ్చిన వాటిని, వారిని నేను వదులుకోలేను కదా...’’ ముగించింది, సంహిత. ఆమె మొబైల్ మ్రోగింది... అవతలి వాళ్ళు చెబుతున్నది వింటున్నంత సేపూ సంహిత ముఖంలో ఆందోళన... ఫోన్ కాల్ ముగించి చెప్పింది... ‘‘పాప సత్యకి ఆరోగ్యం బాగాలేదు... అర్జెంట్ గా నేను ఆర్ఫనేజ్ కి వెళ్ళాలి... ఇక సత్యను అక్కడ ఉంచలేను, ఇంటికి తీసుకు వచ్చేస్తాను...’’ దృఢంగా అన్నది లేస్తూ.‘‘వీళ్ళకోసం నీ కాపురం వదులుకున్నావా?’’‘‘కాపురం కోసం ‘వీళ్ళని’ వదులుకోలేను... అలా చేస్తే నన్ను నేను చంపుకున్నట్టే... నాకు జీవించాలని ఉంది వాసూ... లెటజ్ గో...’’ సంహిత ముఖంలో కొత్తవెలుగు గోచరించింది వాసంతికి. నండూరి సుందరీ నాగమణి -
నగరంలో ఒకరోజు...
ఆయన పేరు బంక సంగీతం కుమార్. వీరి నాన్న పేరు బంక అప్పారావు. ఈయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడు. ఈ క్రమంలో రెండుసార్లు చెవికి సర్జరీ కూడా అయింది. సంగీతంపై తనకున్న వీరాభిమానానికి గుర్తుగా కొడుక్కి ‘సంగీత కుమార్’ అని పేరు పెట్టి మురిసిపోయేవాడు.‘‘నీకు అక్షరాలు రాకపోయినా ఫరవాలేదు. సరిగమలు వస్తే చాలు’’ అంటుండేవాడు కొడుకుతో.సంగీతంకుమార్కి మాత్రం ‘సంగీతం’ తప్ప ప్రపంచంలోని ప్రతి విషయమూ ఆసక్తికరమే.కొడుకు అనాసక్తిని గమనించిన తండ్రి....‘‘నువ్వు సంగీతం నేర్చుకొని కచేరి ఇవ్వకపోయావా...నా శవాన్ని కళ్ల జూస్తావు’’ అని ఒక ఫైన్‌మార్నింగ్ వార్నింగ్ ఇచ్చాడు.దీంతో...‘30 రోజుల్లో సంగీతం’ క్లాసులకు వెళ్లాడు సంగీతం కుమార్. ఆ మరుసటిరోజు నగరంలో ‘కళాతృష్ణ’ ఆడిటోరియంలో అరంగేట్రానికి పూనుకున్నాడు.రసజ్ఞులైన ప్రేక్షకులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది.కచేరి మొదలైన పావుగంటలోనే...టీవీలో బ్రేకింగ్ న్యూస్...‘కళాతృష్ణ ఆడిటోరియంలో ఉగ్రవాదుల బాంబుదాడి’పూర్తి వివరాలు ఇంకా తెలియకముందే టీవీలో మరోవైపు చర్చాకార్యక్రమం మొదలైంది.‘‘ఈ ఉగ్రవాదం ఉంది చూశారు...’’ అని ఒకాయన అందుకున్నారు.‘‘ఏం చూడమంటారు నా బొంద....ఇన్ని రోజులు కళ్లు మూసుకున్నారా! పట్టపగలు నట్టనడివీధిలో ఆడిటోరియంలో ఉగ్రవాదులు బాంబు దాడి చేస్తే...చట్టం ఏం చేస్తుంది? అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? గుర్రు పెట్టి నిద్రపోతున్నాయా!’’‘‘నిద్రపోవడం మీ పార్టీ వాళ్ల పేటెంట్.. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ప్రశాంతంగా ఉందా? మా పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే శాంతిభద్రతలు సవ్యంగా లేవని పాత న్యూస్పేపర్లను తిరిగేస్తే అర్థమవుతుంది’’ ‘‘మిమ్మల్ని వాళ్లు, వాళ్లని మీరు తిట్టడం సమస్యకు పరిష్కారం కాదు. అందరం కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం వెదకాలి ఈలోపు బ్రేకింగ్ న్యూస్...‘కళాతృష్ణ బాంబుదాడి ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. ఒక్కరిద్దరూ మాత్రం తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయింది’ బాంబుస్క్వాడ్ రంగంలోకి దిగింది. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ వాడారా? ఇతర పేలుడు పదార్థాలు వాడారా? అనేదాని గురించి లోతుగా దర్యాప్తు జరిగింది. కానీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. మిస్టరీ వీడలేదు. దీంతో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిది ప్రభుత్వం. రెండు రోజులు తరువాత జరిగిన ప్రెస్మీట్లో దర్యాప్తు అధికారులు ప్రకటించిన విషయాలు ఇలా ఉన్నాయి...‘‘అందరూ అనుకున్నట్లు కళాతృష్ణలో ఉగ్రవాదుల బాంబుదాడి జరగలేదు. ఏ ఉగ్రవాద కుట్ర కూడా ఇందులో లేదు. ఈ విధ్వంసానికి మూలకారణం ఎవరో తెలుసా? సంగీత కుమార్...సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తే విద్వాంసుడు అవుతాడు...పైపైన నేర్చుకొని కచేరీలు ఇస్తే విధ్వంసుడు అవుతాడని చరిత్ర మరోసారి నిరూపించింది. తన తండ్రి బలవంతం మేరకు హడావుడిగా సంగీతం నేర్చుకొని, అంతకంటే హడావుడిగా కచేరి ఏర్పాటు చేశాడు కుమార్. ఈయన సంగీతం ధాటికి ప్రేక్షకులు తాళలేకపోయారు. ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయపడ్డారు.సంగీతానికి రాళ్లు కరుగుతాయని అంటారు... దీనిసంగతేమిటోగానీ... కుమార్ సంగీతం ధాటికీ హాలు పూర్తిగా దెబ్బతింది. పైనున్న ఫ్యానులు ఊడిపడి ప్రేక్షకుల తలలకు గాయాలయ్యాయి....’’టీవీలో దర్యాప్తు అధికారుల ప్రెస్‌మీట్‌ను చూసి కుప్పకూలిపోయాడు బంక అప్పారావు.‘‘పదితరాలకు సరిపడే ఆస్తులు సంపాదించాను. కానీ ఏంలాభం? నా కోరికను నెరవేర్చుకోలేకపోతున్నాను.నా కొడుకు కచేరి చేయాలనేది నా చిరకాల కోరిక.ఇక ఇప్పుడు వాడి కచేరి చూడడానికి ఎవరు వస్తారు? ప్రాణాలు ఎవరు పణంగా పెడతారు. అయ్యో దేవుడా...నాకు ఎంత పెద్ద శిక్ష విధించావయ్యా’’ అని మంచం పట్టాడు అప్పారావు.మంచానా పడ్డ అప్పారావును తిరిగి మామూలు మనిషిని చేయడానికి దేశవిదేశాలనుంచి పెద్ద పెద్ద డాక్టర్లను రప్పించారు. ఏవేవో వైద్యాలు చేశారుగానీ ఏవీ వర్కవుట్ కాలేదు. చైనా వైద్యుడు డా.కుంపె డాంగ్ ఇలా అన్నాడు...‘‘నాయనా కుమారూ...మనోవ్యాధికి మందులేదు. నువ్వు కచేరి చేయాలనేది ఆయన కోరిక. అది చేస్తేగానీ మీ నాయిన మళ్లీ మామూలు మనిషి కాలేడు’’అప్పుడు కుమార్ అసిస్టెంట్ ఇలా ఆందోళనగా అరిచాడు...‘‘అయ్యగారు కచేరి చేయకపోతే...పోయేది పెద్ద అయ్యగారు మాత్రమే.చేస్తే...పోతారు....అందరూ పోతారు...నాతో సహా’’ ‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు. మంచం పట్టిన అప్పారావు...చచ్చి శ్మశానానికి వెళ్లాడా? లేక కోలుకున్నాడా? సంగీతకుమార్ కచేరి చేశాడా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో...’’ హెచ్చరించాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు గొంతు విప్పాడు....వారం తిరగకముందే అప్పారావు భేషుగ్గా కోలుకున్నాడు.దీనికి కారణం కుమార్ సంగీత కచేరి చేయడం. విశేషం ఏమిటంటే...కచేరి పూర్తయేంత వరకు పిన్‌డ్రాప్ సైలెన్స్. ఒక్కరూ సీట్లో నుంచి లేవలేదు. కచేరి బ్రహ్మాండంగా విజయవంతమైంది’’‘‘అంటే...సంగీత కుమార్ సంగీతంలో ప్రావీణ్యం సాధించాడా?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘ప్రావీణ్యమా పాడా!’’‘‘మరి ఎలా?’’‘‘చెబుతావిను. సంగీతకుమార్కి టెక్ నాగలింగం అని ఒక మిత్రుడు ఉన్నాడు. అతనికి టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది. సైన్స్ పత్రికలు రెగ్యులర్‌గా చదువుతుంటాడు. ఆమధ్య ఒక ఆర్టికల్ చదివాడు. బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కర్ణకఠోర శబ్దాలను నిరోధించే త్రీడి టెక్నాలజీని తయారుచేశారు. ఈ టెక్నాలజీ సహాయంతో విమాన,హెలికాప్టర్లు, డ్రోన్లు...మొదలైన వాటి నుంచి భీకరశబ్దాలు వినిపించకుండా నిరోధించవచ్చు. ఈ ఆర్టికల్ చదివిన వెంటనే ‘లడ్డూ కావాలా నాయనా’ అని నాగలింగం మెదడులో ఒక ఐడియా ఫ్లాష్ అయింది. అంతే...బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలను సంప్రదించి వారి టెక్నాలజీని కళాతృష్ణ ఆడిటోరియంలో వాడారు. దీంతో...కుమార్ కచేరి ఇస్తున్న మాటేగాని...అతని నోటి నుంచి ఒక్క శబ్దం కూడా ప్రేక్షకమహాశయులకు వినిపించలేదు. అలా కథ సుఖాంతమైంది’’ అని చెప్పాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
ఈసారీ నేలరాతలేనా?
‘‘జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం. పరీక్షలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా చర్యలు చేపట్టాం’’ ఇదీ ఈనెల 21న కలెక్టరేట్లో జేసీ–2 కమలకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో సంభాషణ. ఇంటర్మీడియట్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియట్ ఆర్ఐవో కృష్ణయ్య వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే పరిస్థితి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ఇంటర్మీ డియట్ పరీక్షల ప్రారంభానికి ఇక రెండు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో వసతులు ఏమాత్రమూ కల్పించని దుస్థితి. దీంతో ఈసారి కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు అసౌకర్యాల నడుమే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి’ ఇస్తున్న కథనం.. చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో వసతులపై అధికారుల మాటలు, ఏర్పాట్లు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్ల కొరత నెలకొంది. చీకటి గదులు అసౌకర్యంగా మారనున్నాయి. విద్యార్థులు పరీక్ష రాసే డ్యూయల్ డెస్కు లు కరువయ్యాయి. బెంచీలు కూడా అరకొరగా ఉన్నాయి. గదుల్లో ఫ్యాన్లు లేక ఉక్కపోతతో పరీక్షలు రాసే పరిస్థితి దాపురించబోతోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 27 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. విద్యార్థుల ఉత్తమ ఫలి తాలను సాధించేందుకు కొన్ని నెలలుగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా రాయాలంటే కేంద్రాల్లో తగిన వసతులు, వాతావరణం ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయి. జిల్లాలో ఇంటర్మీడియట్ అధికారులు ఎంపిక చేసిన కేంద్రాల్లో చాలావరకు అసౌకర్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేయకపోతుండడంతో సమస్యలు అధికమవుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. మండలాల్లో ఉన్న కళాశాలలకు కొళాయిల ద్వారా తాగునీరు అందడం లేదు. ట్యాంకర్ల గురించి పట్టించుకోవడం లేదు. అరకొర ఫర్నీచర్ జిల్లాలో 290 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో 133 పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం నుంచి 52,975 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 54,742 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆ కేంద్రాల్లో ఫర్నీచర్, ఫ్యాన్లు అరకొరగా ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో అయిదారు గదుల్లో పరీక్షలు నిర్వహించబోతున్నారు. అక్కడ విద్యార్థుల సంఖ్యకు సరిపడ బెంచీలు, ఫ్యాన్లు లేవు. డ్యూయల్ డెస్కులు లేక బెంచీలపై పరీక్షలు రాయించడం ప్రతి ఏటా పరిపాటిగా మారిపోయింది. ఇంటర్మీడియట్ అధికారులు ఎంపిక చేసిన కేంద్రాల్లో చాలా వరకు గాలి వచ్చేలా గదులు లేవు. మరికొన్నింట్లో గదులు శిథిలావస్థలోకి మారాయి. కొన్ని కేంద్రాలు ప్రహరీ గోడలు లేని కారణంగా మాస్ కాపీయింగ్ జరిగే అవకాశాలున్నాయి. మారుమూల విద్యార్థులకు కష్టాలే ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రతి ఏటా ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదు అనే నిబంధన పెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో గత ఏడాది జరిగిన పబ్లిక్ పరీక్షల్లో ప్రిన్సిపాళ్లు అత్యుత్సాహం చూపడంతో దూరప్రాంతాల నుంచి 5నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు నష్టపోయారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ప్రయాణం నరకంగా మారే అవకాశం ఉంది. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా గంటముందు కేంద్రాలకు చేరాల్సి ఉంది. సాధారణ రోజుల్లోనే అష్టకష్టాలు పడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలలకు వెళ్తుంటారు. పరీక్షల వేళ సమయానికి కేంద్రాలకు వెళ్లడం వారికి పరీక్షగానే నిలువనుంది. జిల్లాలోని బి.కొత్తకోట, తంబళ్లపల్లి, సత్యవేడు, నిండ్ర, పాలసముద్రం, ఎస్.ఆర్ పురం, విజయపురం, వాల్మీకిపురం, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో 10 నుంచి 20 కి.మీల దూరం విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ప్రయాణించాల్సిన పరిస్థితులున్నాయి. బస్సుల్లో కిక్కిరిసిన జనం మధ్య ప్రయాణం వారిలో సహనాన్ని పరీక్షించనుంది. అధికారులు ఇలాంటి కేంద్రాలను గుర్తించి సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపిస్తే మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
వినసొంపైన సోఫా
సాక్షి, హైదరాబాద్: సోఫాలంటే మనకు తెలిసింది కూర్చోవటానికి, పడుకోవటానికి పనికొచ్చేవే. కానీ, మార్కెట్లో ఆధునికమైన, విలాసవంతమైన సోఫాలు కూడా లభ్యమవుతున్నాయి.ముఖ్యంగా ఇటాలియన్ రకాల సోఫాలకు ఆదరణ పెరుగుతోంది. ►ఆధునిక ఫర్నిచర్‌ను నగరవాసులు అక్కున చేర్చుకుంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ సోఫాల్లో లైట్లు వెలుగుతాయి. స్పీకర్లుంటాయి. దీంతో చక్కని సంగీతాన్ని వినొచ్చు. సెల్ఫోన్లను చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న బార్ కౌంటర్ కూడా ఉంటుంది. మీట నొక్కితే చాలు సోఫా వెనక భాగమంతా వెనక్కి వెళుతుంది. మన అవసరాలకు తగ్గట్టుగా వీటిని ఎంచుకోవచ్చు. అవసరమైతే ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు విడివిడిగా కొనుక్కోవచ్చు కూడా. ► ఉన్నత వర్ణాలు, ఐటీ నిపుణులతో బాటు ఇతర నగరాల్లో నివసించేవారంతా ఇటాలియన్ సోఫాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. మాడ్యులర్, రిక్లయినర్, సీక్రెట్ వంటి రకాలకు చక్కటి ఆదరణ వస్తుంది. -
చమురు మంట తగ్గినా... గృహోపకరణాలు చల్లారలేదు
న్యూఢిల్లీ: చమురు ధరలు శాంతించాయి... డాలర్‌తో రూపాయి కొంచెం బలం పుంజుకుంది. అయినా, గృహోపకరణాల ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఇటీవలి కాలంలో బ్యారెల్‌కు 80 డాలర్ల వరకు వెళ్లి తిరిగి 60 డాలర్ల లోపునకు పడిపోగా... డాలర్‌తో 74కు పైగా దిగజారిన రూపాయి తిరిగి 71 లోపునకు వచ్చేసింది. డాలర్ మారకంలో రూపాయి పతనం వల్ల ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాల తయారీ సంస్థలకు ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అవి ధరల్ని పెంచటం మొదలెట్టాయి. కానీ, రూపాయి రివకరీతో వినియోగదారులకు లాభించిందేమీ లేదు. ఎఫ్ఎంసీజీ కంపెనీలు రెండో విడత ధరల పెంపును నిలిపివేసినప్పటకీ, గృహోపకరణాల తయారీ సంస్థలు మాత్రం ధరల్ని పెంచుతూనే ఉన్నాయి. దీనికి కారణం అధిక కస్టమ్స్ డ్యూటీయేనని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. రూపాయి డాలర్‌తో 67–68 స్థాయి పైనే ఉందని, తమ తయారీ వ్యయాలన్నీ గతంలో ఈ స్థాయి ఆధారంగానే అంచనా వేసినవని వారు చెబుతున్నారు. దీంతో తమ మార్జిన్లపై ఒత్తిడి ఉందంటున్నారు. ‘‘దిగుమతి చేసుకునే ఖరీదైన ఉత్పత్తుల ఎంఆర్పీలను 7– 10 శాతం మధ్యలో పెంచడం జరిగింది. మధ్య స్థాయి ఉత్పత్తులపై ఈ పెంపు 4–5 శాతం మధ్యనే ఉంది’’ అని హేయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రజంగ తెలిపారు. మరోవైపు శామ్సంగ్, ఎల్జీ కంపెనీలు రానున్న వారాల్లో ధరల పెంపును అమలు చేయనున్నట్లు తెలిసింది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు తదితర ఉత్పత్తులపై 3–5 శాతం మేర పెంపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏసీలపై త్వరలోనే బాదుడు ఇక ఏసీ తయారీ కంపెనీలు 2019 సీజన్‌కు ముందు తయారయ్యే నూతన స్టాక్‌పై వచ్చే నెలలో రేట్లు పెంచొచ్చని అంచనా. దిగుమతి చేసుకునే వాటి ధరలు పెరగడమే దీనికి కారణం. దేశీయ ఏసీ పరిశ్రమలో 30% దిగుమతి ఆధారితంగా తయారయ్యేవేనని ఎడెల్వీజ్ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లతో పోలిస్తే ఏసీల్లో ఎక్కువ విడి భాగాలు దిగుమతుల ద్వారానే వస్తున్నాయి. చైనా, థాయిలాండ్, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ నుంచి ఇవి దిగుమతవుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లపై (10 కిలోల కంటే తక్కువ లోడ్) బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10% కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో పెంచింది. దీంతో ఈ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ 20 శాతానికి చేరింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో వాడే కంప్రెషర్లపై కస్టమ్స్ సుంకం 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత చాలా వరకు కంపెనీలు ఉత్పత్తులపై రేట్లను పెంచాయి. అయితే, ఆ వెంటనే పండుగలు ఉండడంతో ధరల పెంపును మాత్రం వెంటనే అమలు చేయలేదు. ఆ పెంపును ఇప్పుడు అమల్లో పెడుతున్నట్టు గోద్రేజ్ అప్లయన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్‌నంది తెలిపారు. పండుగల సందర్భంగా వ్యాపారులకిచ్చిన తగ్గింపులు, సబ్సిడీలను కూడా ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారు. రూపాయి మారకం విలువలో ఆటుపోట్ల కారణంగా గత ఏడాది కాలంలో కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు ఉత్పత్తుల ధరలను మూడు సార్లు పెంచాయి. గతేడాది డిసెంబర్లో, ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో మూడు సార్లు కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. -
పొందికగా సొంతిల్లు
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరాల్లో విశాలమైన విస్తీర్ణాల్లోని ఇల్లు కొనాలంటే మధ్య తరగతివాసులకు కష్టమే. చిన్న ఫ్లాట్లనూ కొనుగోలు చేసినా సరే.. కాస్త పొందికగా ఇంటీరియర్‌ను అమర్చుకుంటే చాలు! ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నీచర్ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్ సేవింగ్ ఫర్నీచర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్ ఉడ్‌తో తయారు చేసే స్పేస్ సేవింగ్ ఫర్నీచర్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇది వాటర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్. అలాగే ఈ ఫర్నీచర్‌ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నీచర్‌కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి. వంటగది వంటగది లేదా లివింగ్ రూమ్‌లో సెరామిక్ లేదా గ్లాస్‌వేర్‌ను అలంకరిం టానికి వాల్ క్యాబినెట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్ సేవింగ్ వాల్ క్యాబినెట్స్‌లో క్రాకరీ డిస్ప్లేకు వీలుగా గ్లాస్ షెల్ఫ్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్ క్యాబినెట్ టేబుల్‌గా కూడా ఉపయోగపడుతుంది. లివింగ్ రూమ్‌లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులుంచుకోవచ్చు. డ్రెస్సింగ్ అద్దం ఇంట్లోని మొత్తం ఫర్నీ చర్లో డ్రెసింగ్ మిర్రర్ది ప్రత్యేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెస్సింగ్ మిర్రర్ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుకుగా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంలో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్ చేసేలా వీలుండే డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్‌ను ఉంచి వాడుకోవచ్చు. డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కోసం ఇంట్లో డైనింగ్ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుగుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్‌ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు. డెకరేషన్ గోడవారగా వేసుకునే సైడ్ టేబుల్స్ వేర్వేరు అవసరాల కోసం ఉప యోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్ లు కలిసి ఉండే ఈ సైడ్ టేబుల్‌ను పుస్తకాలు, అరు దుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం విని యోగించుకోవచ్చు. ఈ టేబుల్ బోసిగా కనిపించకుండా పెద్దవిగా ఉండే డెకరేటివ్ ఐటమ్స్ ను అమర్చుకోవచ్చు. -
ఐకియా ‘లెట్స్ ప్లే ఫర్ చేంజ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్వీడిష్ ఫర్నిచర్, ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా... ‘లెట్స్ ప్లే ఫర్ చేంజ్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు, పెద్దలకు ఆటల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఐకియా స్టోర్లలో పలు చోట్ల ఆటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఫర్నిచర్‌లోనూ ‘ఫలహారం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లు వంటి ఫర్నిచర్ కొనుగోలులో కూడా కమీషన్లు మింగేస్తున్నారు. విద్యార్థుల కోసం కేటాయిస్తున్న కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పడుతోంది. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి వాటాలు పంచుకుంటున్నారు. గతంలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు దాదాపు రూ.20 కోట్లతో బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వీటిని పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలు సరఫరా చేసిన బెంచీలు, కుర్చీలు, టేబుళ్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉండడంతో అవి నాలుగు రోజులకే మూలకు చేరాయి. ఈ ఫర్నిచర్ కొనుగోలుకు సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) రూ.10 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) రూ.10 కోట్లు భరించాల్సి ఉంది. ఎస్ఎస్ఏ ఇప్పటికే సగానికి పైగా నిధులు విడుదల చేసింది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు విడుదల చేయలేదు. నాసిరకం ఫర్నిచర్ సరఫరా చేసిన ప్రైవేట్ ఏజెన్సీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. పాత ఫర్నిచర్ స్థానంలో నాణ్యమైన ఫర్నీచర్‌ను సర ఫరా చేయాలని ఎస్ఎస్ఏ పేర్కొంది. అప్పటివరకు బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఈలోగా ఉన్నతాధికారులు ఆర్ఎం ఎస్ఏ నుంచి రూ.10 కోట్ల నిధులను విడుదల చేయించారు. మరో రూ.20 కోట్లకు ఎసరు! గతంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఫర్నిచర్ వృథాగా పడి ఉండగా, మళ్లీ 630 హైస్కూళ్లకు అవసరమైన ఫర్నీచర్ కొనుగోలుకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20.88 కోట్లతో ఈ ఫర్నీచర్ కొనాలని నిర్ణయించారు. ఎస్ఎస్ ఇంజనీర్స్, సాయి డేటా క్రియేషన్, లక్ష్మీ ప్రసన్న ఎంటర్ప్రైజెస్, శ్రీ సిద్ధివినాయక ఇండస్ట్రీస్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల ద్వారా ఈ ఫర్నిచర్ కొనుగోలుకు ఉత్తర్వులిచ్చారు. డెమో టేబుళ్లు, స్లాటెడ్ యాంగిల్ రాక్స్, స్టీల్ టూల్స్, టీచర్లకు ఛైర్లు, టేబుళ్లు, డ్యూయెల్ డెస్కులు, అల్మరాలు, కంప్యూటర్ టేబుళ్లు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలోని పాఠశాలల్లో రూ.4,800 కోట్లతో పూర్తిస్థాయిలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, కంప్యూటర్లు, తరగతి గదులు, మంచినీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అయినా మళ్లీ కొత్తగా రూ.20.88 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు వెనుక లోగుట్టు ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అంతా హడావుడే!
కర్నూలు(అర్బన్): పనులు పూర్తి కాకుండానే నూతన భవనం నుంచి జిల్లా పరిషత్ పాలన ప్రారంభమైంది. చైర్మన్ మెప్పు పొందేందుకు ఓ అధికారి చేసిన హడావుడి కారణంగా అధికారులు, సిబ్బంది అవస్థ పడాల్సి వచ్చింది. రూ.3.67 కోట్లతో జెడ్పీ నూతన భవనం నిర్మించారు. దీన్ని గత నెల తొమ్మిదిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అయితే.. ఈ భవనంలో అధికారులు, ఉద్యోగులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నీచర్, పాలన నిర్వహణకు తగినన్ని కంప్యూటర్లు ఏర్పాటు చేయలేదు. కంప్యూటర్ల నిర్వహణకు సంబంధించి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు కూడా ఇంకా తీసుకోలేదు. జెడ్పీ చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఏఓ చాంబర్లతో పాటు సందర్శకుల గదిలో ఫ్యాన్లు, ఏసీలు బిగించలేదు. సందర్శకులు కూర్చుకునేందుకు అవసరమైన కుర్చీలు లేవు. ఈ భవనంలోనే మినీ మీటింగ్ హాలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్క కుర్చీ కూడా లేదు. భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణం పెండింగ్‌లో ఉంది. మొత్తమ్మీద దాదాపు 40 శాతం పనులు పెండింగ్‌లో ఉండగానే సోమవారం నుంచి ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఈ నెల 13 (సోమవారం) జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ఓ అధికారి ఆయన మెప్పు పొందేందుకు ఇదే రోజు నూతన భవనంలోకి మారాలని పట్టుబట్టి సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించినట్లు విమర్శలొస్తున్నాయి. సొంత ఖర్చుతో సరంజామా తరలింపు పాత భవనంలోని కంప్యూటర్లు, బీరువాలు, ఫైళ్లు, ఫర్నీచర్‌ను నూతన భవనంలోకి తరలించేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. అయితే.. ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోగా, కచ్చితంగా 13వ తేదీన నూతన భవనంలోకి షిఫ్ట్ కావాలని ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత సెక్షన్లకు చెందిన ఉద్యోగులు రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాల్లో కూడా పనిచేశారు. తమ సొంత ఖర్చులతో ఫర్నీచర్, బీరువాలు, ఫైళ్లను నూతన భవనంలోకి మార్చుకున్నట్లు తెలుస్తోంది. పాలనకు వారం రోజుల విరామం! నూతన భవనంలో ఇంకా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు తీసుకోకపోవడం, కంప్యూటర్లు అమర్చకపోవడం వల్ల మరో వారం రోజుల వరకు జెడ్పీ పాలనకు అనధికార విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఎఫ్, ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్ తదితర విభాగాల్లో విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ పాలన అంతా ప్రస్తుతం ఆన్లైన్లోనే సాగుతున్న నేపథ్యంలో నూతన భవనం నుంచి జెడ్పీ పాలన సజావుగా సాగేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెడ్పీలో అన్ని సెక్షన్లలో 72 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్లు లేకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు వెచ్చిస్తే తప్ప పూర్తి స్థాయిలో వసతులు కల్పించలేమనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఫర్నీచర్ వచ్చేస్తోంది ఫర్నీచర్ రెండు రోజుల్లో వచ్చేస్తుంది. ప్రస్తుతం పలు విభాగాల్లో విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఇస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన కంప్యూటర్ల కొనుగోలకు చర్యలు చేపట్టాం. – ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా పరిషత్ సీఈఓ -
ఐకియా స్టోర్ ఆరంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఐకియా గ్రూప్ తొలి స్టోర్ గురువారం ఆరంభమయింది. తొలిరోజు కొనుగోలుదారులు, ఔత్సాహికులు విపరీతంగా పోటెత్తారు. స్టోర్‌ను ఆరంభించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ... ఐకియా సంస్థ హైదరాబాద్‌కు రావటం తమ ప్రభుత్వ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాల ఫలితమన్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలున్న ఐకియా.. అందుబాటు ధరల్లో హోమ్ ఫర్నిషింగ్‌ను అందిస్తుందన్నారు. ‘‘ఈ సంస్థ స్థానికంగా సమీకరిస్తున్న వస్తువుల్లో 30 శాతం తెలంగాణవే. ఇక్కడి చేనేత ఉత్పత్తులు, నిర్మల్ పెయింటింగ్స్, గ్లాస్ వర్క్స్‌ను ఐకియాలో విక్రయానికి పెడతారు. దీంతో ప్రావీణ్యం గల కార్పెంటర్లకూ ఉపాధి కలుగుతోంది’’ అని వివరించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి సంస్థలు మరెన్నో రానున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని స్వీడన్ రాయబారి క్లాస్ మోలిన్తో పాటు తెలంగాణ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ , ఐకియా గ్రూప్ సీఈఓ జాస్పర్ బ్రాడిన్, గ్రూప్ డిప్యూటీ సీఈఓ జువెన్సియో మాజు, ఐకియా ఇండియా సీఈఓ పీటర్ బెజెల్, తెలంగాణ ఎండీ జాస్ అచిలియా తదితరులు పాల్గొన్నారు. -
బంపర్ ఆఫర్‌తో ఐకియా స్టోర్ వద్ద తోపులాట
సాక్షి, హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో పాటు దాదాపు 1000 రకాల ఉత్పత్తుల ధర రూ. 200లోపు విక్రయించడంతో జనాలు విపరీతంగా తరలి వచ్చారు. ఓకే సారి భారీ జనం తరలిరావడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపుచేయలేక పోయారు. బారికేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో స్టోర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. హైటెక్ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకియా ఇండియాలో తన తొలి స్టోర్ ఏర్పాటు చేసింది. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ ఐకియా స్టోర్ వద్ద తోపులాట
-
వెల్కమ్ టు ఐకియా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా... ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. గురువారం ఈ స్టోర్ ప్రారంభం కానుంది. హైటెక్ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. ప్రత్యక్షంగా ఈ స్టోర్‌లో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా పాలసీ ప్రకారం వీరిలో సగం మంది మహిళలున్నారని ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ బెజెల్ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ స్టోర్ ద్వారా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. భారత్‌లో 40 నగరాల్లో.. దేశంలో 40 నగరాల్లో ఔట్లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక. 2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ముంబై స్టోర్ 2019 వేసవిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత బెంగళూరు, గురుగ్రామ్‌లో సైతం ఐకియా కేంద్రాలు రానున్నాయి. అహ్మదాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లోనూ ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్ తెలిపారు. 20 కోట్ల మంది కస్టమర్లను మూడేళ్లలో చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. పన్నులు సరికాదు..: దిగుమతి చేసుకునే ఫర్నిచర్‌పై అధిక పన్నులకు బదులు దేశీయంగా తయారీని ప్రోత్సహించాలని ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్ సూచించారు. ‘ఎక్కువ పన్నులతో కస్టమర్లకే భారం. తయారీ మెరుగుపడదు. భారత్‌లో స్థలం కొనుగోలు, హక్కుల బదిలీ క్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇక్కడ స్టోర్ల ప్రారంభం ఆలస్యం అయింది. రిటైల్‌లో తరచూ మారే విధానపర నిర్ణయాలు ఆందోళన కలిగించే విషయం. పాలసీలు ఆకట్టకునేలా ఉండాలి. దీర్ఘకాలిక వ్యూహంతోనే ఇక్కడ అడుగుపెట్టాం’ అని వివరించారు. -
నిర్ణయం
హక్కుల కోసం పోరాడాల్సి వస్తే మనసే కాదు దేహం కూడా ప్రధానాంశమే! ఆ పోరాటం యుద్ధంగా మారితే? తెగిపోయేవీ ఉంటాయి. తెగ్గొట్టుకునేవీ ఉంటాయి. తెగిపోయేముందే బంధం గట్టిదనం తెలుస్తుంది. మరి తెగ్గొట్టుకోవాలనుకుంటే? ఆ గట్టిదనం ఎవరికుండాలి? వాసంతి మనసులో భయంకర అంతర్యుద్ధం! ఓ నిర్ణయాన్ని చుట్టేసుకున్న చిక్కుముళ్లెన్నో. మూడుముళ్లు పడ్డాక గానీ తనకు ఈ విషయం తెలిసిరాలేదు. ఎలాగైతేనేం చివరికి నిర్ణయం తీసుకుంది, చాలా ఊగిసలాట తర్వాత. మనసు బెలూన్లా నింగిలో ఈదుతున్న ఫీలింగ్. చాలా కాలం తర్వాత మళ్లీ స్వేచ్ఛ. సమీర్ వాసంతి జీవితంలోకి చాలా అనూహ్యంగా వచ్చాడు. ఓ ఫ్రెండ్ మ్యారేజీలో పరిచయం, పెళ్లి దాకా తీసుకెళ్లింది. సమీర్ పరిచయం అయిన కొత్తలో తన టెండర్ ఫీలింగ్స్‌ని అక్షరాల్లో బంధించి, గులాబీ కాయితంలో అందంగా రాసి కొరియర్ చేసింది. ఆ పని చేసేదాకా నిద్రపోలేదు. ఎఫ్బీ దాటేసి వాట్సాప్... ట్విటర్... ఇన్స్టాగ్రాం దిశగా కమ్యూనికేషన్ రాకెట్లా పరిగెడుతుంటే... ఈ లెటర్ గోలేంటీ? నేషనల్ హైవేలో ఎడ్లబండిలా అనుకుంటాడేమో? అని డౌట్ పడినా, కొన్ని ఇలా ఉంటేనే అందం అని చాలా అందంగా సమర్థించుకుంది. ‘వాసంత సమీరం నువ్వయితే... హేమంత తుషారం నేనవుతా...’ అంటూ పొయటిక్‌గా రాసుకున్న ఆ లెటర్ తన జీవితంలో వసంతాన్ని మోసుకుకొస్తుందని కలగంది. వాస్తవం వసంతం అంత అందంగా ఉండదని చాలా త్వరగా అర్థమైంది. అది తెలిసేలోగా గుండెకు బోలెడన్ని గాయాలు. రక్తసిక్తమైన భావాలు! సమీర్ తన లైఫ్‌లోకి వచ్చినపుడు బ్యూటిఫుల్ అనుకుంది. వచ్చినపుడు అని ఎందుకంటే ఇప్పుడా ఫీలింగ్ లేదు కాబట్టి. పెళ్లి లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అనుకుంది. సమీర్ తప్ప తనకెవరూ కరెక్టు కాదని అమ్మతో వాదించి మరీ ఒప్పించుకుంది. జీవితాంతం తోడుంటాడని, ఉండాలని అనుకుంది. కానీ ఆరునెలల్లోపే ఆశలన్నీ ఆవిరవుతాయని, కలలు కరిగి కన్నీరవుతుందని తను మాత్రం ఊహించిందా ఏంటి? జీవితం అనూహ్యంగా ఉంటుందని కథల్లో చదవడమే కానీ ఇంతలా ఉంటుందని వాసంతి అస్సలు ఊహించలేదు. ‘‘ఏమైందే నీకు. మైండ్ దొబ్బిందా?’’.వాసంతి ఇరానీ చాయ్‌లో తడిసి మెరుస్తున్న బిస్కెట్‌ను శ్రద్ధగా తింటోంది.స్నేహకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏంటే... నేనిక్కడ వాగుతుంటే తమాషాగా ఉందా? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా?’’‘‘ఏం చేస్తున్నాను?’’‘‘చెప్పవే ఏం చేస్తున్నాను. ఓ నరకం నుంచి బైటకు రావాలనుకుంటున్నాను. తప్పా?’’‘‘అది కాదే బాబూ. లైఫ్‌లో కాసింత అడ్జెస్ట్మెంట్ ఉండాలి. అన్నీ మనం అనకున్నట్టుండవు..’’‘‘ఇంకాపుతావా సోది. చూడు... నా బాధేంటో నాకు తెలుసు. నేనెంతగా నలిగానో నాకు తెలుసు. నేనెంతగా చెప్పినా మీకర్థం కాదని మాత్రం ఇప్పుడే తెలుస్తోంది.’’‘...కాదే! సమీర్‌ను ఇష్టపడి చేసుకున్నావుగా ఏం ప్రాబ్లెమ్..’’‘‘డామిట్. ఏం చెప్పాలే! హీఈజ్ సెక్సువలీ పర్వర్టెడ్. నాట్ గుడ్ అట్ బెడ్. నన్ను నంజుకు తిన్నాడు...చాలా ఇంకా పచ్చిగా చెప్పాలా’’‘‘హే... లైట్ తీస్కో. కొందరలా ఉంటారం...’’‘‘ఇంకెక్కువ వాగితే చంపేస్తానంతే. ఇంత ఓపెన్‌గా చెప్పినా నీకర్థం కాలేదా?’’‘‘ఓకే బాబా. పోనీ సమీర్‌తో మాట్లాడనా...’’‘‘మన ఫ్రెండ్షిప్ ఉండాలంటే కాస్త మూసుకునుండు...’’‘‘అలాగే ఉంటా! కానీ మీ మమ్మీ గురించి ఆలోచించవా? నిన్ను ప్రాణంలా పెంచుకుంది. ఆంటీని అలా చూడలేకున్నారా!’’‘‘స్నేహా! గాయం తగిలింది. మందేస్తున్నాం. మానాలంటే టైం పడుతుంది కదా! చూద్దాం...’’ లేచింది.‘‘వాసూ వన్ మినిట్...’’ స్నేహæగట్టిగా హగ్ చేసుకుంది. ఇద్దరి కళ్లల్లో చివ్వున ఎగసిన కన్నీరు. గాలికి రెపరెపలాడే దీపం లాంటి నవ్వును పెదాలపై నిలుపుకుంటూ వాసంతి, ‘‘హే... డోంట్ బీ సిల్లీ.నన్ను డౌన్ చేయొద్దు ప్లీజ్...’’ అంటూ ముందుకు కదిలింది. అమెరికా నుంచి మూటాముల్లె సర్దేసుకొచ్చిందని తెలీని మణి, కూతురికి తనపై బెంగయిందనుకుంది. రెండ్రోజులయ్యాక అది బెంగ కాదని అర్థమైంది. ఏమైందని తను అడగలేదు. ఏం వినాల్సి వస్తుందోనని భయం వల్ల. పదిహేనేళ్లుగా మణి చాలా విషయాల్లో భయపడుతూనే ఉంది. భర్త పోయాక జీవితంలో ఒంటరితనం ఒంటరిగా రాలేదు. భయాన్ని వెంటబెట్టుకొచ్చింది. ఈ విషయం వాసంతికి తెల్సు. అందుకే వచ్చి రెండ్రోజులవుతున్నా ఏం చెప్పలేదు. తనేం చెబుతుందా అని మణి ఎదురుచూస్తోంది. రాత్రి పదకొండు గంటలు. గదిలో చిన్నలైట్. బెడ్‌పై మణి, వాసంతి.‘‘మమ్మీ నాపై కోపంగా ఉందా?’’‘‘.....’’ఒకరి గుండెలో ఆవేశం. ఒకరి గుండెలో ఆవేదన. ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తున్నాయి.‘‘రాగానే చెబుదామనుకున్నా. బట్ మొదట నేను సెట్ కావాలి కదా!’’మణి తలెత్తింది. చెక్కిళ్లపై జారిపోతున్న కన్నీళ్లు. మొహంలో చెప్పలేనంత ఆందోళన.‘‘మమ్మీ! కూల్...’’ వాసంతి గొంతు వణుకుతోంది. ‘‘ఎందుకిలా. మనకే ఎందుకిలా? ఇంకా ఎంత కాలం పోరాడాలి? నా ఒంట్లో ఓపిక చచ్చిపోయింది. ఇప్పుడెలా?’’ వెక్కిళ్ల మధ్య మణి మాటలు అస్పష్టంగా వస్తున్నాయి.వాసంతికిలాంటి సందర్భం వస్తుందని తెలుసు. కానీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. తనేం చెప్పినా మళ్లీ విషయం ‘అడ్జస్ట్’ అన్న పదం వద్దే ఆగుతుంది. అయితే అదెంత నరకమో ఆర్నెల్ల అమెరికా జీవితం చాలా ప్రాక్టికల్‌గా చూపింది. అసలు ‘దాడి’ అనేదే ఇన్‌హ్యూమన్! మానసికమైనా, దైహికమైనా. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అన్బేరబుల్గా ఉంటుంది. అసలు ఎవరు ఎవర్నైనా టేకిట్ గ్రాంట్‌గా తీసుకోవడం కన్నా విషాదం మరొకటి ఉండదేమో! వద్దన్నారంటే వద్దనేగా. ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కాదని మొదట్లో అనుకున్నా, అర్థం కాకపోవడం కాదు అహంకారమని అర్థమైంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడో కొత్త సమస్య. అసలు ఎవరు ఎవరిని ఓదార్చాలి?గాయం తనకే. నష్టమూ తనకే. కానీ ఇబ్బంది మాత్రం ఇద్దరిదీ!‘‘అమ్మా బాధ పడకు. అన్నీ మనమంచికే...’’‘‘ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? అయినా నువ్వుండగా నేను ఒంటరినెలా అవుతా?’’‘‘నాకదంతా తెలీదే. నాకోసం... కేవలం నాకోసం ఒక్కసారి ఆలోచించు ప్లీజ్...’’ తల్లి మాటలు గుండెలో మంటలు రేపుతున్నాయి. ఏం మాట్లాడలేక రూం నుంచి భారంగా కదలింది. వెనకాల వెక్కిళ్లు వినిపిస్తునే ఉన్నాయి. వాసంతి మనసు నిర్వికార స్థితిలో ఉంది. అమ్మ కోసం, స్నేహ కోసం, ఆ వెధవ సమీర్ కోసం, సమాజం కోసం, ఇంకా ఇంకా... ఎంతమంది కోసం నన్ను నేను మార్చుకోవాలి, రాజీ పడాలి? పోనీ అలా చేస్తే నెమ్మది దొరికి ఛస్తుందన్న గ్యారెంటీ ఉందా? ఛీఛీ. వెధవ జీవితం! ఒక్కసారిగా తలవిదల్చుకుంది. హాల్లో సోఫాపై నీరసంగా వాలిపోయింది. కళ్లు మూతబడుతున్నాయి. అనుపమారావు. సిటీలో చాలా పేరున్న లాయర్. ఫ్యామిలీ కౌన్సెలర్. ఆఫీస్ ఫర్నిచర్, యాంబియన్స్ చాలా హైఫైగా ఉంది. కన్సల్టెన్సీ ఫీజు కూడా అదే లెవెల్లో ఉంటుంది. వెయిటింగ్ లాంజ్‌లో పదిమంది దాకా ఉన్నారు. మణి బలవంతం మీద ఇష్టం లేకున్నా వాసంతి వచ్చింది. గదిలో అందరినీ నిశితంగా గమనిస్తోంది. అందరూ ఏదో ఓ సమస్యతో పోరాడుతున్నట్టే ఉన్నారు. ‘నా మొహం. సమస్య లేకుంటే ఇక్కడికెందుకు వస్తారు?’ అనుకుంది. పక్కనే ఓ ఆంటీ. తెల్లగా చందమామలా మెరుస్తోంది. పొందిగ్గా కట్టుకున్న బ్లాక్ శారీలో మరింత అందంగా కనిపిస్తోంది. మొహంలో ప్రశాంతత! మరి ఇక్కడికెందుకొచ్చిందో? వాసంతిని చూసి మెల్లగా నవ్వింది. అసలు మనుషుల్తో మాట కలపాలంటేనే విసుగ్గా ఫీలవుతున్న వాసంతికి చల్లని గాలి తాకినట్టు హాయి అనిపించింది. ఆంటీతో మాట్లాడితే బావుణ్ను అనుకుంటుండగానే ఆమే ‘‘హాయ్’’ అంది. దాదాపు పది నిమిషాల ఆత్మీయ సంభాషణలో వాసంతి చాలా అసంకల్పితంగా తన సమస్య ప్రస్తావించింది. ‘‘డోంట్ వర్రీ బేబీ! ఇదే లైఫ్. లోపల నా కూతురుంది. తనకూ సేమ్ ప్రాబ్లమ్. నేను క్లియర్‌గా చెప్పా. ఎవరి కోసమో మన ఇష్టాలను, లైఫ్‌నూ మార్చుకోవాల్సిన అవసరం లేదని. స్త్రీగా తన సమస్య నాకు అర్థమవుతోంది. డివోర్స్‌కు లీగల్‌గా ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. అయామ్ విత్ హర్’’ ఆంటీ మాటలు బూస్ట్‌లా పనిచేశాయి. ఇంతలో ఆంటీ కూతురు బైటికి వచ్చింది. తనకు కనీసం నలభై ఏళ్ల పై చిలుకుంటాయి. పరిచయం చేసింది. ఆమెకు అయిదేళ్ల బాబు. ఈ స్టేజీలో ఈ సమస్యేంటి అని వాసంతికి ఆశ్చర్యమేసింది. ‘‘రెండేళ్లుగా తనలో ఈ విపరీత ధోరణి పెరిగింది. ఎంత ఓపిక పట్టినా, మార్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. సైకాలజిస్టులు, ఫ్యామిలీ కౌన్సెలర్లు చాలా మందిని కలిశాం. ఎవరైనా చివర్లో చెబుతున్న మాట ‘కాస్త ఓపిక పట్టండి. తనలో మార్పు రావచ్చు.’ అని. కానీ ఆ కొన్నేళ్లు ఎన్నేళ్లు? అప్పటిదాకా ఈ హింసను నిబ్బరించుకోవడం ఎలా? ఒకసారి నేనే అడిగా ఎందుకిలా? అని. ‘నాయిష్టం. నా స్ట్రెస్ బరస్ట్‌కు అదొక్కటే దారి.’ అన్నాడు. అప్పుడే నేను డిసైడ్ అయ్యా. ఈ సమస్యకు పరిష్కారం నిరీక్షణ కాదు. మరో దారి వెతుక్కోవడమేనని. ఆరునెలలుగా పోరాడితే, ఇదిగో ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది.’’ ఆమె మాటలు విన్నప్పుడు వాసంతికి తను నడుస్తున్నది సరైన దారేనని మరోసారి అనిపించింది. ఆంటీ తన కూతురు భుజంపై చేయి వేసుకువెళుతుంటే. దెబ్బతిన్న పిట్టను తల్లి తన రెక్కలతో జాగ్రత్తగా కాపాడుతున్నట్టుగా ఉంది. తనెంత అదృష్టవంతురాలో కదా అనిపించింది. అదే సమయంలో తన యుద్ధం సరైనదే అనిపించింది. ‘‘వాసంతీ...’’ అటెండర్ పిలుపు విని లేచింది, స్థిరచిత్తంతో.గతాన్ని వదిలించుకునేందుకు, కొత్త బతుకును వెతుక్కునేందుకు వాసంతి సరికొత్తగా ప్రయత్నిస్తోంది.అనుకోకుండా ఓరోజు సమీర్ ప్రత్యక్షమయ్యాడు. వాసంతి నివ్వెరపోయింది. అదీ క్షణం పాటే. వెంటనే ఎలా వచ్చాడో అర్థమై మనసు నిబ్బరం చేసుకుంది. గదిలో ఇద్దరే. వారిని ఆవరించుకున్న నిశ్శబ్దం. ‘‘సారీ చెబుతున్నానుగా... ఇంకేం చేయమంటావో చెప్పు’’ సమీర్ తీయని స్వరం వాసంతికి చేదుగా అనిపిస్తోంది. అసలు తన ముందు కూర్చోడానికే ఇబ్బందిగా ఉంటోంది.‘‘...ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు లేకుండా నేను ఉండలేనురా.’’‘‘చచ్చిపో. వెంటనే చచ్చిపో. ఆపితే ఒట్టు!’’ మాట గొంతు వద్ద ఆగింది.‘‘ఏదో బ్యాడ్ టైమ్. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. నువ్వెలా ఉండమంటే అలా ఉంటా! నవ్వు పర్మిషన్ ఇవ్వందే టచ్ కూడా చేయను. సరేనా!’’అసహ్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇంతలో అమ్మ కాఫీ తీసుకొచ్చింది.‘‘ఆంటీ మీరుండండి. మరో కప్పు నేను తీసుకొస్తా. ముగ్గురం తాగుదాం’’ అంటూ లేచాడు. అల్లుడి మాటలకు మురిసిపోయింది. ‘‘వద్దులే సమీర్. కాసేపు రెస్టు తీసుకో! మళ్లీ రేపు ప్రయాణం అంటున్నావుగా. వాసంతి ఈసారైనా పచ్చళ్లు పట్టుకెళ్లు’’‘ఓహ్. అంటే ఈయనగారు వాలిపోయి నా ప్రయాణానికి కూడా రంగం సిద్ధం చేశారన్నమాట’. అమ్మపైన కోపం వచ్చేస్తోంది. కనీసం సమీర్ వస్తున్నట్టు చెప్పలేదు. ఎందుకిలా? తను తల్లే కావచ్చు. కానీ ప్రాబ్లం స్పష్టంగా చెప్పాక కూడా ఎందుకీ నాటకాలు. ఎవర్ని మెప్పించడానికి. నాన్న చిన్నప్పుడే పోయాడు. చాలా కేర్‌తో పెంచింది. నిజమే! కానీ మళ్లీ ఆ నరకంలో పంపడానికి సిద్ధమైందంటే సమీర్ సెంటిమెంట్ మాటలకి కరిగిపోయి ఉండొచ్చు. లేదా కన్నతల్లిగా నన్ను కాపురానికి పంపడమే జీవిత పరమావధి అనుకుంటుందేమో. నాకైతే ఈ రెండూ తప్పే! ముసురుకుంటున్న ఆలోచనల్లో ఈదుతున్న వాసంతి ఉక్కిరిబిక్కిరవుతోంది. ‘‘రేపటికి ఫ్లైట్ టికెట్లు తీశా. సరేనా?’’ సమీర్ మాటల్ని మధ్యలోనే తుంచింది – ‘‘...సమీర్ నీతో ఎక్కువ మాట్లాడ్డం నాకిష్టం లేదు. ఒకటే చెబుతున్నా. మన పెళ్లి, కాపురం ఓ పీడకల అనుకో. నేనూ అలానే అనుకుంటున్నా! ఎవరికి వారు హాయిగా ఉందాం’’.అతని మొహం జేవురించింది. అయినా నవ్వు పులుముకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.‘‘ప్లీజ్ వాసంతి. డోంట్ మేక్ ఎ బిగ్ ఇష్యూ...’’‘‘డామిట్. బిగ్ ఇష్యూ కాదా! రాత్రంతా ఒంటిపై బట్టల్లేకుండా నిలబెట్టడం, సిగరెట్లతో కాల్చడం, ఒళ్లంతా పచ్చిపుండు చేస్తూ, నోట్లో డ్రింక్ పోస్తూ, ఇవేవీ బిగ్ ఇష్యూస్ కాదా?’’ తన గొంతు అదురుతోంది. చింతనిప్పుల్లా భగభగమంటున్న కళ్లు. ఉబికి వస్తున్న కన్నీళ్లు. ఆవేశంతో బెడ్‌షీట్‌పై బిగుసుకుంటున్న పిడికిలి. క్లౌడ్ బరస్ట్లా ఉంది వాతావరణం.‘‘అరే! ఇవన్నీ చిన్న చిన్న సరదాలు. అర్థం చేసుకుంటావనుకున్నా. ఓకే నీకిష్టం లేదంటున్నావుగా వదిలేయ్. అయినా పిల్లలయ్యాక ఈ సరదాలు ఎలాగూ ఉండవుగా. పోనీ ఇద్దరం అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అంతేగానీ నిన్న పెళ్లి, ఇవాళ పెటాకులు అంటే ఎలా? నాకూ సొసైటీలో ఓ పరువు ఏడ్చింది కదా!’’‘‘సమీర్ సార్! మీ పరువు మీవద్దే భద్రంగా ఉంచుకోండి. బట్ డోంట్ ఫోర్స్ మీ...’’క్షణకాలం నిశ్శబ్దం. తుపానుకు సూచికలా!‘‘అసలేంటే నీ ప్రాబ్లం?’’ వ్యంగ్యం అహంకారం దట్టించి వదిలిన మాటల తూటా. ఒక్కసారిగా దూసుకొచ్చింది. ‘‘మహా నోరేసుకుని మాట్లాడేస్తున్నావ్? నన్ను కాదని బతికేద్దామనే? ఏంటి ఎవడ్నయినా ఫిక్స్ చేసుకున్నావా? అలా అయితే చెప్పు ఇప్పుడే వెళ్లిపోతా!’’ వాసంతికి నవ్వొచ్చింది. మాటలకు ఎంత మేకప్పు వేసినా కొన్ని సందర్భాల్లో అసల్ రంగు నికల్ గయా అన్నట్టు ఇట్టే బైట పడిపోతుంది. వీడిదీ ఇంతే! ‘‘సమీర్ మైండ్ యువర్ టంగ్. నువ్వు నా ఇంట్లో ఉన్నావు. ముందు బైటికి నడు. వారంలోగా లాయర్ నోటీసు నీ మొహాన కొడ్తా.’’ వాసంతి ధోరణి మరింత రెచ్చగొట్టింది. తట్టుకోలేకపోయాడు. ఎవరికైనా ఓడిపోతున్నప్పుడే బ్యాలెన్స్ తప్పుతుంది. ‘‘నువ్వింత బజారు దానివనుకోలేదు. నిన్ను కట్టుకోడానికి గంతులేశాను చూడు... అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. థూ ఆడదానివేనా?’’ ముక్కుపుటాలదురుతుంటే బూతులు తిడుతూ పైకి లేచాడు.‘‘సమీర్ ఆగు... ఆగు.. ఏమైంది?’’ అప్పుడే వచ్చిన మణి కంగారుగా అడిగింది.‘‘నీ కూతురికి కొవ్వు ఎక్కువైంది. రాక్షసి. నన్ను కాదని ఎవడ్తోనో పడుకుంటుందట! నేనూ చూస్తా.’’ పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ వెళ్లిపోయాడు.‘‘ఏంటే ఇదంతా...’’ మణి ఏడుస్తోంది.‘‘అమ్మా! ఎందుకేడుస్తున్నావ్? ఇప్పుడేమైంది. నా రాత బాగుంది కాబట్టే ఈ వెధవను వదిలించుకోగలిగాను. అయినా ఎందుకమ్మా! ఫోన్ చేసి ఈ చెత్తగాడ్ని ఇండియాకి రప్పించడం అవసరమా? నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెల్సు’’.ఏం చెప్పాలో అర్థం కాకుండా ఆమె నిస్త్రాణంగా బైటికెళ్లిపోయింది.గదిలో నిశ్శబ్దం. యుద్ధం ముగిసిన తర్వాత ఉండే నిశ్శబ్దం. చాలాసేపు వాసంతి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎందుకో తెల్లని ఆంటీ గుర్తొచ్చింది. అమ్మ కూడా అలానే ఉంటే ఎంత బావుణ్ణు అనిపించింది. - రామదుర్గం మధుసూదనరావు -
హైదరాబాద్‌లో ఫర్నిచర్ హబ్!
ఒకటి, రెండు.. కాదండోయ్ ఏకంగా 20 దేశాలకు చెందిన లగ్జరీ ఫర్నిచర్.. అందులోనూ 100కు పైగా బ్రాండ్లతో ఫర్నిచర్ ప్రియులను రా..రమ్మంటోంది ఎలివేట్ ఎక్స్! హైదరాబాద్‌లో లగ్జరీ ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్స్‌కు డిమాండ్ పెరగడంతో ఖజానా గ్రూప్ ఎలివేట్ ఎక్స్ పేరిట ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఏడు అంతస్తుల్లోని ఈ షోరూమ్‌లో ప్రతి ఫ్లోర్నూ ప్రత్యేక కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దారు. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో 50 వేల చ.అ.ల్లో ఎలివేట్ ఎక్స్ షోరూమ్ ఉంది. జర్మనీ, ఇటలీ, ఇండోనేషియా, వియత్నాం, స్పెయిన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా వంటి 20 దేశాలకు చెందిన సుమారు 100కు పైగా బ్రాండ్లున్నాయి. ఇందులో 12 బ్రాండ్లు ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్. పసిఫిక్ గ్రీన్, ఇండిస్ట్రియా ఎడిషన్, కోంటే, గెయిన్స్విల్లీ, డొమెటాలియా, శాంతా లుకియా, ఆర్చ్బోన్ వంటి నేషనల్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్‌తో పాటూ నటుజ్సీ ఇటాలియా, జైపూర్ రగ్స్, లా ఫార్మా, పాపాడాటోస్ వంటి రీజినల్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ సోఫా, బెడ్స్, డైనింగ్ టేబుల్ వంటి ఫిక్స్డ్ ఫర్నిచర్‌తో పాటూ మాడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్స్, టీవీ సెట్స్ వంటి మాడ్యులర్ ఫర్నీచర్ ఉంటాయి. సెలబ్రిటీలే కస్టమర్లు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు ఎలివేట్ ఎక్స్ స్టోర్లున్నాయి. ఇప్పటివరకు సుమారు 10 వేలకు పైగా కస్టమర్లకు లగ్జరీ ఫర్నిచర్, ఇంటీరియర్స్‌ను అందించామని ఎలివేట్ ఎక్స్ డైరెక్టర్ శివానీ ఆనంద్ తెలిపారు. మహేశ్ బాబు, రకుల్ ప్రీత్‌సింగ్, అల్లు అర్జున్, మోహన్ బాబు, రాఘవేంద్ర రావు వంటి సెలబ్రిటీలెందరో మాకు కస్టమర్లున్నారు. ఫార్చూన్ ఎస్మెరాల్డ్, అర్బన్ విల్లా, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, అపర్ణా, ఊర్జితా, డీఎస్ఆర్, ల్యాంకో వంటి నిర్మాణ సంస్థలకు విల్లా ప్రాజెక్ట్‌లకు ఫర్నిచర్ అందించాం. బెడ్ ధర రూ.10 లక్షలు.. హైదరాబాద్‌లో రియల్టీ మార్కెట్‌తో పాటూ లగ్జరీ ఫర్నిచర్‌కు డిమాండ్ పెరిగింది. విదేశాల్లో లభించే ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్స్ కావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కస్టమర్లకు ఫర్నిచర్ గురించి సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా ఒక్కో అంతస్తులో ఒక్కో రకమైన కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దాం. బ్లో, ఇండస్ట్రియల్ ఎడిషన్, ఫ్యూజన్ స్టయిల్, క్లాసికల్ స్టయిల్, ఔట్‌డోర్ ఫర్నిచర్ ఇలా ప్రతి ఫ్లోర్లో 30 వరకు ఉత్పత్తులుంటాయి. ధరలు ఫ్యాబ్రిక్ సోఫా రూ.2.5– రూ.6 లక్షలు, లెదర్ సోఫా రూ.6–17 లక్షలు, బెడ్స్ రూ.2–10 లక్షలు, డైనింగ్ టేబుల్ లక్ష నుంచి రూ.8 లక్షలు, కుర్చీలు ఒక్కదానికి రూ.15 వేలు నుంచి రూ.2.5 లక్షలు వరకున్నాయి. -
అంబులెన్స్‌లో ఫర్నిచర్ తరలింపు
మల్కన్‌గిరి : జిల్లాలోని ఎంవీ 79 గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ స్టోర్‌కు కావలసిన ఫర్నిచర్‌ను అంబులెన్స్‌లో తరలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో మంగళవారం వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న సీడియం అజిత్ కుమార్ మహంతి వెంటనే స్పందించి దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
ఇది ‘భారతీయ’ ఐకియా..!!
ఈ నెల 19న హైదరాబాద్ స్టోర్ ఆరంభంఇక్కడి జనాభాకు తగ్గట్టు భారీ రెస్టారెంట్ వంటకాల్లోనూ ‘భారతీయ’ మార్పులు...ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఐకియా’ డెలివరీ దీనికోసం 150 మంది సిబ్బంది; ‘గతి’తో భాగస్వామ్య ఒప్పందం విక్రయించే వస్తువుల్లోనూ మార్పుచేర్పులుఫర్నిషింగ్, ఫర్నిచర్ విక్రయాలు మాత్రమే... వచ్చే ఏడాది ముంబై స్టోర్‌తో ఆన్‌లైన్‌లోకి కూడా... ఐకియా ఇండియా సీఈఓ పీటర్ బెజెల్ వెల్లడి ఐకియా... ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ స్వీడిష్ కంపెనీ వార్షికాదాయం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు. హోమ్ ఫర్నిషింగ్ రంగంలో తిరుగులేని అంతర్జాతీయ దిగ్గజం ఈ సంస్థ. కాకపోతే 75 ఏళ్ల కిందట చిన్న దుకాణంగా ఆరంభమైన ఈ సంస్థకు.. కొన్ని నియమాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా స్టోర్లన్నీ ఒకేలా ఉంటాయి. ప్రతి స్టోర్‌లోనూ ఉద్యోగుల్లో 50% మగవారు, 50% మహిళలు ఉంటారు. ప్రతి స్టోర్‌లో రెస్టారెంట్ కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు... ఐకియాలో విక్రయించే వస్తువులన్నీ దాదాపుగా అట్టపెట్టెల్లో ప్యాక్ చేసేసుకోవచ్చు. ఎవరికి వారు ఇంటికి తెచ్చుకుని సొంతంగా బిగించేసుకోవచ్చు. అలాంటి ఐకియా... భారత్‌లో అడుగుపెట్టడానికి ఆరేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలెట్టింది. మొట్టమొదటి స్టోర్‌కు హైదరాబాద్‌ను ఎంచుకుంది. అవన్నీ ఫలించి... తొలి స్టోర్ ఈ నెల 19న ఆరంభమవుతోంది. ఈ సందర్భంగా ఐకియా ఇండియా సీఈఓ పీటర్ బెజెల్ బుధవారం కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్ కోసం తమ నియమాలు కొన్నింటిని ఎలా మార్చుకుంటున్నదీ వివరించారు. అవేమిటంటే... భారీ రెస్టారెంట్... ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐకియా స్టోర్‌లో భారీ రెస్టారెంట్ ఉంటుంది. కనిష్ఠంగా 400 నుంచి గరిష్ఠంగా 700 మంది ఒకేసారి కూర్చునే వీలుం టుంది. కానీ హైదరాబాద్ జనాన్ని, ఇక్కడి మార్కె ట్ను చూశాక ఆ మాత్రం సీట్లు సరిపోతాయన్న నమ్మకం ఐకియాకు లేకపోయింది. అందుకే.. ఇక్కడ ఏకంగా ఒకేసారి వెయ్యి మంది కూర్చునేలా భారీ రెస్టారెంట్‌ను నిర్మించారు. అన్నిచోట్లా రెస్టా రెంట్లలో ఫోర్క్‌ను విక్రయిస్తుండగా.. ఇక్కడి ఆచార వ్యవహారాల కారణంగా దాన్ని నిషేధించారు. డెలివరీ కూడా చేస్తారు? ప్రపంచంలో ఎక్కడా ఐకియా తను విక్రయించే వస్తువుల్ని డెలివరీ చెయ్యదు. అదే ఈ సంస్థ ప్రత్యేకత కూడా. ఫర్నిచర్, ఫర్నిషింగ్ వస్తువుల్ని అట్టపెట్టెల్లో పట్టేలా తయారు చెయ్యడం, ఎవరికి వారు రవాణా చేసుకునేందుకు వీలుగా ఉంచటం సంస్థ ప్రత్యేకత. ఈ ఖర్చులన్నీ లేకపోవటం వల్ల ఐకియాలో వస్తువులు తక్కువ ధరకు లభిస్తుంటాయి కూడా. కానీ ఇండియాలో ఈ పద్ధతి పనిచెయ్యదేమోనని సంస్థ సందేహిస్తోంది. అందుకే ఇక్కడ కావాలనుకున్న వారికి కాస్తంత అదనపు ఛార్జీలతో వస్తువుల్ని డెలివరీ చెయ్యడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. వస్తువుల్ని ఇంటివద్దకు తెచ్చి బిగించడానికి 150 మంది సిబ్బందిని అదనంగా నియమించుకుంది. వీరిలో సగం మహిళలే. ఇంకో విశేషమేంటంటే వస్తువుల్ని ఇంటికి డెలివరీ చెయ్యడానికి హైదరాబాద్‌లో ప్రముఖ లాజిస్టిక్ సంస్థ ‘గతి’తో ఒప్పందం చేసుకున్నట్లు కూడా పీటర్ బెజెల్ తెలియజేశారు. అమ్మే వస్తువుల్లోనూ మార్పులు ఐకియాలో ఎక్కడైనా వస్తువులు ఒకేలా ఉంటాయి. కానీ హైదరాబాద్ స్టోర్‌కు వచ్చేసరికి కొన్ని వస్తువుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు చెంచాల సెట్‌ను తీసుకుంటే... అందులో చెంచాలు, ఫోర్క్‌లు మాత్రమే ఉన్నాయి. ఇతర దేశాల్లోని మాదిరిగా చాకు లేదు. ‘‘అది ఇండియాకు అంత ముఖ్యం కాదు. అందుకే దాన్ని సెట్ నుంచి తీసి విడిగా పెట్టాం’’ అని చెప్పారు బెజెల్. మరో విశేషమేంటంటే ఎక్కడైనా ఐకియా స్టోర్లలో బెడ్షీట్లు, లినెన్ వంటివి ప్రింటెడ్ కలర్స్ దొరకవు. ప్లెయిన్‌వి మాత్రమే దొరుకుతాయి. ‘‘భారతీయుల అవసరాలు వేరు. అభిరుచులు వేరు. అందుకే తొలిసారిగా ఇక్కడ ప్రింటెడ్ బెడ్ షీట్లను విక్రయానికి పెడుతున్నాం’’ అని బెజెల్ వివరించారు. గృహోపకరణాలు లేవు? మిగతా దేశాల్లోని ఐకియా స్టోర్లలో టీవీ, ఫ్రిజ్, మిక్సీ వంటి గృహోపకరణాలన్నీ విక్రయిస్తుంటారు. వాటికి వేరేవేరే బ్రాండ్లు కూడా ఉంటాయి. నిజానికి ఈ బ్రాండ్ల టీవీల వంటివి నాణ్యంగా ఉండటంతో పాటు ధర కూడా తక్కువే. కాకపోతే హైదరాబాద్‌తో సహా ఇండియాలో రాబోయే స్టోర్లలో ప్రస్తుతానికి అలాంటి అవకాశమేదీ లేదు. ఎందుకంటే ఐకియా ఇక్కడ అడుగుపెడుతున్నది సింగిల్ బ్రాండ్ రిటైల్ మార్గంలోనే. అంటే.. ఏం విక్రయించినా ఐకియా బ్రాండ్‌తోనే విక్రయించాలి. ‘‘అందుకే ఇక్కడ ఫర్నిచర్, హోమ్ ఫర్నిషింగ్‌తో పాటు లైటింగ్ పరికరాలు, వంటింటి ఉపకరణాలు మాత్రం విక్రయిస్తున్నాం. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర గృహోపకరణాలు విక్రయించటం లేదు’’ అని బెజెల్ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లోకి... ఐకియా తెలంగాణ ఎండీ జాన్ అచిలియాతో కలిసి బెజెల్ మరిన్ని వివరాలు వెల్లడించారు. రెండవ స్టోర్ వచ్చే ఏడాది ముంబైలో ఆరంభమవుతుందని, దాంతో పాటే దేశంలో ఆన్లైన్ విక్రయాలను కూడా ఆరంభిస్తామని తెలియజేశారు. వారంలో ఏడు రోజులూ స్టోర్ తెరిచే ఉంటుందని, రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకూ పనిచేస్తుందని వెల్లడించారు. ‘‘భారతదేశంలో మా వ్యాపారమనేది దీర్ఘకాలిక లక్ష్యం. తొలుత భారీ నగరాలపై దృష్టి పెడతాం. వచ్చే నాలుగేళ్లలో పాతిక స్టోర్లు ఏర్పాటు చేస్తాం. ఆ తరవాత 10 లక్షల జనాభా దాటిన 49 నగరాల్లోనూ స్టోర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉంది. హైదరాబాద్ స్టోర్‌కు దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ముంబైలో ఆన్లైన్ విక్రయాలు ఆరంభించాక.. పరిస్థితిని చూసి వాటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. ఇక మేం విక్రయించే వస్తువుల్లో 20% ఇప్పటికే స్థానికంగా తయారు చేయిస్తున్నాం. మిగతా 80 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. స్థానికంగా తయారు చేసే వస్తువుల్ని 50 శాతానికి చేర్చాలనే దీర్ఘకాలిక లక్ష్యం ఉంది. ఇండియాకు తగ్గట్టుగా ఇప్పటికే కొన్ని మార్పులు చేశాం. మున్ముందు మరిన్ని మార్పులకు సిద్ధం’’ అని వివరించారు. రెండేళ్ల శ్రమ కొలిక్కొచ్చింది... హైదరాబాద్ స్టోర్ ఏర్పాటు చేయడానికి రెండేళ్లు పట్టింది. మావి స్వల్పకాలిక లక్ష్యాలు కావు. రెండేళ్లలో లాభాల్లోకి వచ్చేసి... నాలుగేళ్లలో మొత్తం పెట్టుబడిని రాబట్టుకోవాలని, త్వరత్వరగా దేశమంతా విస్తరించెయ్యాలని మేం అనుకోవటం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మాది వందేళ్ల వ్యూహం. పెట్టుబడులు పెడుతూనే ఉంటాం. విస్తరిస్తూనే ఉంటాం. ఇక్కడి ఉద్యోగులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారికి ఐదురోజుల పనిదినాలు మాత్రమే కాదు. కనీస వేతనాలకన్నా రెట్టింపు ఇస్తున్నాం. కనీస వేతనం అనే మాట పక్కనబెట్టి జీవనానికి అవసరమైన వేతనం చెల్లించాలనేది మా ఉద్దేశం. ఉద్యోగుల్లో సగం మంది మహిళలుండాలనే మా నిబంధనను మాత్రం మేం ఎక్కడ సవరించుకోవటం లేదు. –జాన్ అచిలిస్, హెడ్(తెలంగాణ– ఐకియా) మంథా రమణమూర్తి -
షార్ట్ సర్క్యూట్‌తో కాలిన టీవీలు, ఫ్రిజ్‌లు
మెదక్ మున్సిపాలిటీ : షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సుమారు నాలుగు టీవీలు, రెండు ఫ్రిజ్‌లు కాలిపోయిన సంఘటన మెదక్ పట్టణంలోని బ్రహ్మణ వీధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణంలో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఇదే సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో పలు ఇళ్లలో నాలుగు టీవీలు, రెండు ఫ్రిజ్‌లు, సెటప్‌బాక్స్‌లు, ఫ్యాన్లు, ఫోన్లు, ట్యూబ్‌లైట్లు తదితర వస్తువులు కాలిపోయాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. -
ఫర్నిచర్ కొన్నాక వెంటనే ఇవ్వకపోవడమూ నిర్లక్ష్యమే
సాక్షి, హైదరాబాద్: ఫర్నిచర్ కొన్నాక అవి పాడైనా దెబ్బతిన్నా వాటికి బదులుగా కొత్తవి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన వ్యాపార సంస్థకు రూ.25 వేలు జరిమానా విధిస్తూ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కొత్త ఫర్నిచర్ ఇవ్వడానికి తీరని జాప్యం చేసిన సికింద్రాబాద్‌లోని గోద్రేజ్ అండ్ బోయ్‌సీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా జిల్లా ఫోరం విధించిన రూ.50 వేల జరిమానాను సగానికి తగ్గిస్తూ రాష్ట్ర కమిషన్ తీర్పు చెప్పింది. వినియోగదారుడికి ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని మాత్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బి.ఎన్.రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్‌రావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన కె.చంద్రశేఖర్ రూ.3.49 లక్షలను వెచ్చించి 2015లో ఫర్నిచర్ కొనుగోలు చేశారు. అందులో రూ.41 వేల విలువైన సోఫాలో కొన్నింటిని ఇవ్వలేదు. రూ.12 వేల విలువైన టీపాయ్ కూడా ఇవ్వలేదు. వాటిని గోద్రేజ్ సంస్థ నెలలోగా ఇస్తామని చెప్పి నెలల సమయాన్ని తీసుకుంది. దాంతో జిల్లా వినియోగదారుల ఫోరంలో చంద్రశేఖర్ కేసు వేశారు. రూ.5 లక్షలు పరిహారం కోరారు. దీనిపై రూ.50 వేలు పరిహారంగాను, రూ.5 వేలు ఖర్చులకు ఇవ్వాలని జిల్లా ఫోరం తీర్పు చెప్పింది. దీనిని గోద్రేజ్ సంస్థ రాష్ట్ర కమిషన్‌లో అప్పీల్ చేసింది. 2016 మార్చిలో వినియోగదారునికి కొత్త సామాన్లు ఇచ్చామని చెప్పింది. తీవ్ర జాప్యం చేయడం, ఇ–మెయిల్స్‌కు స్పందించకపోవడాన్ని రాష్ట్ర కమిషన్ కూడా తప్పుపట్టింది. ఇలాంటి వ్యాపారం అనైతికమని కమిషన్ అభిప్రాయపడింది. -
ఫర్నిచర్ పేరిట దోపిడీ!
నల్లగొండ : ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. హాస్టళ్లలో వార్డెన్లకు అవసరమయ్యే వీల్ చైర్, ఆఫీసు టేబుల్, కంప్యూటర్ టే బుల్, స్టీల్ బీరువాలు, ఐరన్ టేబుల్స్, విద్యార్థులకు మంచాలు, బెడ్స్, ర్యాక్స్, డైనింగ్ టేబుల్స్ తదితర వస్తువులను కొనుగోలు చేసేందుకు జిల్లాకు రూ.1.13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఫర్నిచర్ కొనుగోలుకు సంబం ధించి అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఫర్నిచర్ కొనాలనే నిబంధన ఉన్నప్పటికీ వస్తువుల ధరలు ఖరారు చేయడం.. నాణ్యత పరిశీలించడంలో అధికారులు తప్పులో కాలేశారు. సాధారణంగా ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగించే క్రమంలో అనేక రకాల నిబంధనలు వర్తింపజేసే అధికారులు ఈ వ్యవహారంలో అవేమీ పాటించలేదు. జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలనే ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలుకు రూ.1.13 కోట్ల ఆర్డర్ ఏకపక్షంగా కట్టబెట్టారు. జైలు అధికారులు ఖరారు చేసిన ధరలనే జిల్లా అధికారులు ఏకగీవ్రంగా ఆమోదించారు. కనీసం వస్తువులకు సంబంధించిన శాంపిళ్లను కూడా ముందుగా పరిశీలించలేదు. ప్రైవేట్ ఏజెన్సీలు సప్లయ్ చేసే వస్తువుల్లో సాంకేతికరమైన లోపాలను గుర్తించడంలో జిల్లా కొనుగోలు కమిటీలో పరిశ్రమల శాఖ ప్రమేయం తప్పనిసరి. కానీ చర్లపల్లి జైలు నుంచి సప్లయ్ చేసిన ఫర్నిచర్ విషయంలో పరిశ్రమల శాఖ ప్రమేయం లేదనే చెప్పాలి. అధికారులు తాము అనుకున్నదే తడవుగా జైలు అధికారులు చెప్పిన ప్రతీదానికీ తలూపారు. దీంతో సప్లయ్ చేసిన వస్తువుల ధరలు, నాణ్యత పరిశీలిస్తే...ఓపెన్ మార్కెట్లో వాటి ధరలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఓపెన్ మార్కెట్లో చూస్తే.. హాస్టళ్లలో ఫర్నిచర్ పరిశీలిస్తే అంత ధర ఉండదని చిన్నతరహా పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. ఫర్నిచర్ వ్యాపారంలో అపార అనుభవం కలిగిన వారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వస్తువుల నాణ్యతలో రాజీపడలేదు కానీ ధరల్లోనే భారీ వ్యత్యాసం ఉందని అంటున్నారు. బయటి మార్కెట్లో ఆఫీసు టేబుల్ ధర రూ.5 వేలకు మించి ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ జైలు అధికారులు ఆ టేబుల్‌ను రూ.14,500లకు సప్లయ్ చేశారు. జిల్లాలోని జనరల్, కాలేజీ హాస్టళ్లకు 61 టేబుల్స్ సరఫరా చేశారు. ఈ లెక్కన 61 టేబుళ్లకు అధికారులు చెల్లించింది రూ.8,84,500. అదే ఓపెన్ మార్కెట్ ధర ప్రకారం చూస్తే 61 టేబుళ్ల ధర కేవలం రూ.3,05,000 మాత్రమే. అంటే ఒక్క ఆఫీసు టేబుల్ ధరలోనే సుమారు రూ. 5,79,500 వ్యత్యాసం కనిపిస్తోంది. సప్లయ్ చేసిన వీల్‌చైర్ కూడా సాధారణ రకానికి చెందినదనే అన్నారు. జైల్ నుంచి సప్లయ్ చేసిన వీల్ చైర్ ధర రూ.6,095. అంతే క్వాలిటీ కలిగిన చైర్ ధర ఓపెన్ మార్కెట్లో రూ.3 వేలకు మించదని పరిశ్రమల అధికారులు తెలిపారు. జిల్లాకు 61 చైర్లు సప్లయ్ చేశారు. ఈ లెక్కన 61 వీల్ చైర్లకు ఎస్సీ సంక్షేమ శాఖ రూ.3,71,795 చెల్లించింది. ఓపెన్ మార్కెట్ ధరలతో పోల్చినప్పుడు 61 చైర్ల ధర కేవలం రూ.1,83,000 మాత్రమే. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం రూ.1,88,795 . ఇదేరకమైన తేడా మిగిలిన వస్తువుల ధరల్లోనూ కనిపిస్తోంది. సాధారణంగా జైలులో తయారు చేసే వస్తువుల పై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. నిరుపయోగంగా ఫర్నిచర్.. సొంత భవనాలు కలిగిన హాస్టళ్లను మినహాయిస్తే అద్దె భవనాల్లోని హాస్టళ్లలో ఫర్నిచర్ నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అద్దెభవనాల్లో స్థల సమస్య వల్ల కొంత మంది వార్డెన్లు ఫర్నిచర్‌ను తిప్పిపంపించారు. నల్లగొండలోని బాయ్స్ హాస్టల్ ‘ఏ’కు స్థలాభావం వల్ల నాలుగు లాంగ్ బేంచీలను తిప్పి పంపారు. హాస్టళ్లకు ఫర్నిచర్ చేరిందా..? లేదా..? అనేది కూడా అధికారులు పట్టించుకోలేదు. మొత్తం ఫర్నిచర్‌కు బిల్లులు మాత్రం చెల్లించారు. ఇక ప్రస్తుతం ఏ హాస్టల్‌కు కూడా కంప్యూటర్లు లేవు. బయోమెట్రిక్ మిషన్లు పనిచేయడం లేదు. సొంత భవనాల్లో కంప్యూటర్ టేబుళ్లు గతంలోనే ఉన్నాయి. కానీ మళ్లీ కొత్తగా టేబుళ్లు కొనుగోలు చేశారు. అద్దె భవనాలకు సప్లయ్ చేసిన టేబుళ్లు వృథాగా పడేశారు. హాస్టళ్లలో ఉన్నటువంటి పరిస్థితులను ముందుగా అంచనా వేయకుండా అడ్డగోలుగా ఫర్నిచర్ కొనుగోలు చేయడంలో లక్షల రూపాయల నిధులు వృథా అయ్యాయి. రెండు రకాల ధరలు.. జైలు అధికారులు ముందుగా నిర్ణయించిన ధరలు కాకుండా రెండో సారి మార్పు చేశారు. ముందుగా ఖరారు చేసిన ధరల ప్రకారం ఆఫీసు టేబుల్ ధర రూ.18 వేలు ఉండగా.. ఆ త ర్వాత సవరించిన ధరల ప్రకారం టేబుల్ ధర రూ.14,500. ఇదేరకంగా స్టీలు అల్మారాల ధర రూ.15 వేలు ఉంటే దానిని రూ.11,900లకు తగ్గించారు. ఇలా అన్ని రకాల వస్తువుల్లోనే జరిగింది. ధరలు పెంచడం, ఆ తర్వాత వాటిని సవరించే అంతిమ నిర్ణయం కూడా జైలు అధికారులదే. అయితే ధరలు సవరించడాని కంటే ముందుగానే పాత ధరల ప్రకారమే చర్లపల్లి జైలుకు రూ.1,37,24,000 బిల్లు చెల్లించారు. ఆ తర్వాత ధరలు సవరించడంతో రూ. 1,13,21, 020ల బడ్జెట్ తగ్గింది. ఈ రెండింటి ధరల మధ్య వ్యత్యాసం రూ.24 లక్షలు. మిగిలిన బ్యాలెన్స్ రూ.24 లక్షలు వెనక్కి తెప్పించుకోవాల్సిన అధికారులు అలా చేయకుండా అదనంగా మరికొంత ఫర్నిచర్ తెప్పించారు. నిజంగానే చర్లపల్లి జైల్లోనే ఫర్నిచర్ తయారు చేస్తున్నారా..? లేదంటే కొనుగోళ్ల పేరిట మధ్య వర్తులను అడ్డంపెట్టుకుని బయటి నుంచి కొనుగోలు చేసి సప్లయ్ చేస్తున్నారా..? అనేది అధికారులకు అంతు చిక్కడం లేదు. ట్రంక్ పెట్టెలు జైల్లో తయారు కావనే విషయం కూడా తెలుసుకోకుండా అధికారులు వర్క్ఆర్డర్ ఇవ్వడం అందుకు నిదర్శనం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డర్ ఇచ్చాం ప్రభుత్వ ఏజెన్సీ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చాం. జైలు నుంచి సప్లయ్ చేసిన వస్తువులు నాణ్యంగానే ఉన్నాయని వార్డెన్లు చెప్పారు. స్వయంగా పరిశీలన కూడా చేశాం. జైలు అధికారుల వద్ద కూడా ప్రైస్ లిస్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తుంటారు. వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ధర ఒకరకంగా ఉంటే ఫర్నిచర్ సప్లయ్ చేసే నాటికి వాటి ధర తగ్గింది. దీంతో తగ్గిన ధర ప్రకారమే సప్లయ్ చేశారు. మిగిలిన బ్యాలెన్స్ నిధులతో అదనంగా ఫర్నిచర్ తెప్పించాం. నేను ఇన్చార్జిగా చేరకముందు నుంచే ఎస్సీ సంక్షేమ శాఖలో ఫర్నిచర్ ఫైల్ పెండింగ్‌లో ఉంది. ట్రెజరీ నుంచి నిధులు వెనక్కి Ððవెళ్లిపోతాయన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఫైల్ తెప్పించి ఫర్నిచర్ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. – నరోత్తమ్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి -
ప్రభుత్వాస్పత్రి ఓపి డిస్పెన్సరీలో అగ్నిప్రమాదం
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపి డిస్పెన్సరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం. ఈ సంఘటనలో మందులు, ఫర్నిచర్, ఏసీ అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆస్పత్రి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటిప్స్
♦ సిరామిక్ టైల్స్ మీద మరకలు పడితే ఆల్కహాల్‌తో రుద్దాలి. కొద్దిగా ఆల్కహాల్ వేసి ఆరిన తర్వాత తుడిస్తే టైల్స్ మెరుస్తాయి. ఇలా చేసేటప్పుడు పిల్లలు ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి. ♦ పిల్లల బట్టలపై స్టిక్కర్లు అంటుకున్నట్టయితే వాటిని వైట్ వెనిగర్‌లో నానబెట్టి రుద్దితే మరకలు మాయమవుతాయి. ♦ ఉడెన్ ఫర్నిచర్‌పై నెయిల్ పాలిష్ చిందితే దానిని వెంటనే తుడవకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత దానిని గట్టి అట్టలాంటి దానితో రుద్ది తీసి వేయాలి. దానిపై మైనం పూస్తే చాలు, నెయిల్ పాలిష్ మరక ఉన్నట్టే అనిపించదు. ఫర్నిచర్ పాలిష్ వేసినా సరిపోతుంది. ♦ ట్యూబ్స్, షవర్స్ క్లీన్ చేసుకోవడానికి ఫాస్ఫారిక్ యాసిడ్‌ని ఉపయోగించవచ్చు. అయితే గీతలు పడేటట్లు రుద్దకూడదు. ♦ షవర్ రంధ్రాలు మూసుకుని పోతే నిమ్మకాయ రసంతో రుద్దాలి. ♦ దుస్తుల మీద పసుపు పడితే వెంటనే అంత వరకే నీళ్లలో ముంచి రుద్ది సబ్బుతో శుభ్రం చేసి ఎండలో ఆరేస్తే మరక గాఢత తగ్గి లేత గులాబీ రంగులోకి మారుతుంది. తర్వాత మామూలుగా నానబెట్టి ఉతికితే పూర్తిగా పోతుంది. -
చెత్త నుంచి కొత్త ఫర్నిచర్
సాక్షి నాలెడ్జ్ సెంటర్: వీధుల్లోకి వెళితే ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెత్త ఏమైనా ఉందీ అంటే అది ప్లాస్టిక్ మాత్రమే. ఇప్పటివరకూ వదిలించుకునే దారి లేదు కాబట్టి నడిచిపోయిందిగానీ ఇకపై మాత్రం అలా కాదు. ఎందుకు అంటారా? సమాధానం ఈ ఫొటోల్లో ఉంది. ప్లాస్టిక్‌తోపాటు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను కూడా అక్కడికక్కడే రీసైకిల్ చేసే యంత్రం ఇది. పేరు ట్రాష్ ప్రెస్సో. పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతోనే ఇది పని చేస్తుంది. పెంటాటోనిక్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో కుర్చీలు, టేబుళ్ల వంటి ఫర్నిచర్ తయారు చేస్తుంది. ఇటీవల లండన్‌లో జరిగిన డిజైన్ ఫెస్టివల్లో దీన్ని సోమర్సెట్ హౌస్ వద్ద ప్రదర్శించారు. అక్కడికొచ్చిన వారందరినీ తమ వద్ద ఉన్న వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తమకివ్వమని కోరి.. అక్కడికక్కడే ఆ బాటిళ్లతో ఫుట్‌పాత్‌లపై వేసుకోగల టైల్స్‌ను తయారు చేశారు. ఎలాంటి ప్రమాదకర రసాయనాలను వాడకుండా తాము ఈ పని చేయగలుగుతున్నామని, దీనివల్ల ఉత్పత్తి అయ్యే టైల్స్ కూడా పెద్దగా ఖరీదు చేయవని పెంటాటోనిక్ వ్యవస్థాపకుడు జొహాన్ బోడెకర్ తెలిపారు. దాదాపు వారం రోజుల పాటు ఈ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తయారైన టైల్స్‌ను నల్లటి గోళాల ఆకారంలో అమర్చి వాటిని అక్కడే అందంగా ఏర్పాటు చేశారు కూడా. అమెరికన్ కంపెనీ స్టార్ బక్స్ యూకే విభాగం ఈమధ్యే పెంటాటోనిక్తో చేతులు కలిపింది. తమ కాఫీ షాపుల్లోని ఫర్నిచర్ మొత్తాన్ని ట్రాష్ ప్రెస్సో లాంటి యంత్రాలు తయారు చేసే రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ప్లాస్టిక్ చెత్తను ఎక్కడో దూరంగా తరలించి రీసైకిల్ చేసే పద్ధతికి ట్రాష్ ప్రెస్సో ఫుల్స్టాప్ పెట్టేయగలదన్నమాట! -
సొంతిల్లు మెరవాలంటే..
సాక్షి, హైదరాబాద్ : పండగొస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రం చేస్తుంటాం. అలా అని ప్రతి పండక్కి ఇంటికి రంగులు వేయించలేం. ఉన్నంతలో ఇంటిని మెరిపించాలంటే కాసింత కళాత్మకత ఉంటే చాలు. ఇందుకోసం ప్రత్యేకంగా షాపింగ్‌లేమీ అవసరం లేదు. గోడలకు మంచి వాల్‌పేపర్స్ అతికించడం, పాత ఫర్నిచర్‌కు మెరుగులు దిద్దటం, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్, డ్రాయింగ్ రూములను చిన్న చిన్న మార్పులతో పొందికగా మలుచుకోవటం లాంటివి చేస్తే చాలు. ఇల్లు ముచ్చటగా.. పొదరిల్లులా మారుతుంది. ⇔ డ్రైనింగ్ రూమ్‌లో పెద్ద టేబుల్ పెట్టి దానిని చైనీస్ పోర్సిలిన్ తరహా వస్తువులతో అలంకరిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఆ వస్తువులు గది రంగుకి మ్యాచ్అవ్వాలనేమీ లేదు. ⇔ వంటింటికి అందమైన లెనిన్ కర్టెన్ అమర్చాలి. ఇలా చేస్తే కిచెన్ లుక్ బాగుండటమే కాదు లోపల మనం ఏం చేస్తున్నది ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు. వంటింటికి స్టీల్ అండ్ గ్లాస్ కేస్మెంట్స్ ఫ్రేమ్స్‌ని పెడితే చూడ్డానికి మరింత అందంగా ఉంటుంది. ఆరు బయట ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పని చేసుకోవచ్చు. ⇔ బెడ్రూమ్లో మంచంపై మిక్స్ అండ్ మ్యాచ్ దుప్పట్లు, దిండు గలేబులు వేస్తే ఆ రూముకి కొత్త అందం వస్తుంది. బెడ్రూమ్లో యాంటిక్ కేజ్లైట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ⇔ బాత్రూమ్లో పెడస్టల్ టబ్, ఫిక్సర్లు అమర్చుకుంటే బాగుంటుంది. ఇల్లు కట్టిన కాలాన్ని గుర్తు చేసేలా ఆ ఇంట్లోని వస్తువుల అమరిక ఉంటే గదులకు యాంటిక్ లుక్ వస్తుంది. ⇔ ఇంట్లో ఉన్న పాత సోఫా, ఇతర ఫర్నిచర్లకు పెయింట్ వేస్తే న్యూలుక్‌తో అవి మెరిసిపోతాయి. హాలులో ఉన్న పెద్ద గోడలకు వెరైటీగా రంగు రంగుల ప్లేట్లను అతికిస్తే చూడ్డానికి ఆర్ట్పీస్లా ఎంతో బాగుంటుంది. ⇔ గెస్ట్ రూమ్‌లో వినైల్ షేడ్స్‌తో వాల్ పేపర్లను అతికిస్తే ఆ గది అందం ద్విగుణీకృతం అవుతుంది. ⇔ హాలు మధ్యలో ఉండే సన్నని దారులపై చిక్కటి రంగు, డిజైన్లు ఉంటే కార్పెట్లు పరిస్తే చూడ్డానికి గ్రాండ్‌గా, డెకొరేటివ్గా ఉంటుంది. ⇔ ఇంట్లో ఉన్న వాలు కుర్చీలపై పాత కర్టెన్లు పరిస్తే వెరైటీగా ఉంటుంది. వాటిపైనున్న పాతకాలం నాటి డిజైన్లు కుర్చీలకు కొత్త అందాన్ని ఇస్తాయి. -
మేకింగ్ ఆఫ్ పొదరిల్లు!
సాక్షి, హైదరాబాద్ : కొన్ని ఇళ్లు చూడ్డానికి చిన్నవిగానే ఉంటాయి. కానీ, పొదరిల్లులా అందంగా కనిపిస్తాయి. ఉన్న చిన్నపాటి స్థలంలో పొందికగా ఫర్నిచర్‌ను సర్దుకుంటేనే అది సాధ్యమవుతుందంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. అదెలాగో ఓసారి చూద్దాం. ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నిచర్ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్ ఉడ్‌తో తయారు చేసే స్పేస్ సేవింగ్ ఫర్నీచర్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇది వాటర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్. అలాగే ఈ ఫర్నిచర్‌ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నిచర్‌కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి. వాల్ క్యాబినెట్స్ వంటగది లేదా లివింగ్ రూమ్‌లో సెరామిక్ లేదా గ్లాస్‌వేర్‌ను అలంకరించటానికి వాల్ క్యాబినెట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్ సేవింగ్ వాల్ క్యాబినెట్స్‌లో క్రాకరీ డిస్ప్లేకు వీలుగా గ్లాస్ షెల్ప్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్ క్యాబినెట్స్ టేబుల్లా కూడా ఉపయోగపడతాయి. లివింగ్ రూమ్‌లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులుంచుకోవచ్చు. మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్.. ఇంట్లోని మొత్తం ఫర్నిచర్లో డ్రెసింగ్ మిర్రర్ది ప్రత్కేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెస్సింగ్ మిర్రర్ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుకుగా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంతో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్ చేసేలా వీలుండే డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్‌ను ఉంచి వాడుకోవచ్చు. కోజీ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కోసం ఇంట్లో డైనింగ్ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుగుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్‌ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు. సైడ్ టేబుల్స్ గోడవారగా వేసుకునే సైడ్ టేబుల్స్ వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్‌లు కలిసి ఉండే ఈ సైడ్ టేబుల్‌ను పుస్తకాలు, అరుదుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం వినియోగించుకోవచ్చు. ఈ టేబుల్ బోసిగా కనిపించకుండా దీని మీద కాస్త పెద్దవిగా ఉండే డెకరేటివ్ ఐటమ్స్‌ను అమర్చుకోవచ్చు. -
ఆత్మీయ నేస్తం – అందమైన ఇల్లు?
సెల్ఫ్ చెక్ పెంపుడు జంతువులు ఇంట్లో తిరుగుతుంటే ముచ్చటగానూ, ఆత్మీయ నేస్తం అంటిపెట్టుకుని ఉన్నట్లు ఉంటుంది. అయితే వాటిని పెంచుకుంటూ ఇంటిని అందంగా ఉంచుకోవడం గృహిణికి పరీక్ష. 1. ఫర్నిచర్‌ను పెంపుడు జంతువులు గోళ్లతో గీరుతుంటాయి కాబట్టి క్రమం తప్పకుండా గోళ్లను కత్తిరిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 2.మొక్కల మొదళ్లను, మట్టిని పెట్ యానిమల్స్ కదిలించి పాడు చేయకుండా కుండీలలో అందంగా కనిపించే రాళ్లను అమరుస్తున్నారు. ఎ. అవును బి. కాదు 3. సోఫాల సందుల్లో ఉండిపోయిన వెంట్రుకలను చేతులకు లేటెక్స్ గ్లవ్స్ వేసుకుని ఫర్నిచర్ మీద ఒకే డైరెక్షన్లో రుద్దినట్లు తుడిస్తే మొత్తం వచ్చేస్తాయి. లేదా క్లాత్‌ను తడిపి తుడవాలి. ఎ. అవును బి. కాదు 4. కార్పెట్ మీద చిక్కుకున్న పెంపుడు జంతువుల బొచ్చును వ్యాక్యూమ్ క్లీనర్‌కు బదులుగా స్పాంజ్‌తో పని పూర్తి చేయవచ్చు. ఎ. అవును బి. కాదు 5. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. ఎ. అవును బి. కాదు 6. నియమిత వేళల్లో ఆహారాన్ని ఇవ్వడం, ప్రకృతి అవసరాలను తీర్చుకోవడంలో క్రమ పద్ధతిని అలవాటు చేశారు. ఎ. అవును బి. కాదు 7. ఇల్లంతా తిరుగుతూ, దూకుతూ కిచెన్‌లో ప్రమాదాలు కలిగించకుండా శిక్షణనిచ్చారు. ప్రమాదకరమైన ఫీట్లు చేసినప్పుడు ముఖం మీద నీటిని స్ప్రే చేస్తే తిరిగి ఆ పనిని చేయవు. ఎ. అవును బి. కాదు 8. పెట్ యానిమల్స్ తడిసినప్పుడు, చెవి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి తడి లేకుండా ఒంటిని తుడవడం, డాక్టర్ సలహా తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరు. ఎ. అవును బి. కాదు సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పెట్ యానిమల్స్‌ను ప్రేమగా పెంచుకుంటూనే ఇంటిని అందంగా ఉంచుకోవడంలో మీకు అవగాహన ఉంది. ‘బి’లు ఎక్కువైతే మీరు మరికొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇవి ఇంటిని కీకారణ్యం చేసేస్తాయి. -
ఫర్నీచర్‌ను లగ్జరీ శ్లాబ్ నుంచి తప్పించాలి
-
సర్దుబాటుతో.. విశాలంగా!
ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నిచర్‌ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కన్పిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి. ⇒ లివింగ్ రూమ్‌కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట. ⇒ సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బావుంటుంది. ⇒ బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది. ⇒ కాఫీ టేబుల్, సెంటర్ టేబుల్ వాడకం లివింగ్ రూమ్‌లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్తా పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్‌రూమ్‌లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరొకటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది. ⇒ గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపల ఉన్న ఆహ్లాదభరిత వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది. ⇒ టేబుల్ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్ క్లాత్ వేయండి. ⇒ గది చిన్నదిగా ఉంటే పార్టిషన్ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది. ⇒ లివింగ్ రూమ్‌లో మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫాకమ్ బెడ్, బీన్ బ్యాగ్‌లు వంటి ఫర్నిచర్ నప్పుతాయి. -
హైదరాబాద్‌లో గ్రాబ్ఆన్రెంట్ సేవలు
• అద్దెకు ఫర్నీచర్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు • ఏడాదిలో మరో 4 నగరాలకు విస్తరణ: సీఈఓ శుభం జైన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ రెంటల్ సర్వీసెస్ సంస్థ గ్రాబ్ఆన్రెంట్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఫర్నీచర్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు వంటి 9 విభాగాల్లో ఉత్పత్తులను అద్దెకిచ్చేందుకు సిద్ధమైంది. నగరంలో 400 మంది వెండర్లతో భాగస్వామ్యమయ్యామని గ్రాబ్ఆన్రెంట్ సీఈఓ శుభం జైన్ సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఏడాది కాలంలో పుణె, ఎన్సీఆర్, ముంబై, చెన్నై నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ మీద దృష్టిపెట్టామని.. సిరీస్–ఏలో భాగంగా రూ.30 కోట్ల సమీకరణ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని పేర్కొన్నారు. పాత ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నామని మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తామన్నారు. గతంలో ఐవీకాప్, యునికార్న్ ఇండియా వెంచర్స్ నుంచి ఫండింగ్‌ను పొందామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన గ్రాబ్ఆన్రెంట్.. ఇప్పటివరకు 8,500 మంది కస్టమర్లకు సేవలందించింది. ప్రతి నెలా 35 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. -
అక్షరాలు నేర్పని సాక్షరభారత్
► కొరవడిన పర్యవేక్షణ ► చెత్తకుప్పల్లో పుస్తకాలు ముత్తారం: వయోజనులను విద్యావంతులుగా చేసి దేశంలో అక్షరాస్యతశాతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పలేకపోతోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది. మండల పరిధిలోని ఏ ఒక్క గ్రామంలో సాక్షరభారత్ కేంద్రాలు పనిచేస్తున్న దాఖలాలు లేవు. గ్రామపంచాయతీకి రెండు చొప్పున 28 సాక్షారభారత్ కేంద్రాలు ఉన్నాయి. ఒక మండల కోఆర్డినేటర్, 28 మంది గ్రామ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్‌కు రూ.8వేలు, గ్రామ కోఆర్డినేటర్‌కు ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలా ప్రతీనెలా కేంద్ర ప్రభుత్వం రూ.78వేలు ఖర్చు చేస్తుంది. 2010 సెప్టెంబర్ నుంచి ప్రారంభించగా ఏడు సంవత్సరాలు గడుస్తుండగా ఇప్పటికి దాదాపు రూ.65 లక్షలు పైగా ఖర్చు చేసింది. కనీసం 65 మంది నిరక్షరాస్యులను పూర్తిస్థాయిలో అక్షరాస్యులను చేయలేదనే విమర్శలున్నాయి. అధికారుల రికార్డుల్లో మాత్రం ప్రతీకేంద్రం నిత్యం నిర్వహిస్తున్నట్లు చూపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం సాక్షరభారత్ కేంద్రాల్లో ఫర్నీచర్ కొనుగోలు కోసం మంజూరైన సుమారు రూ.1.20లక్షలు గోల్మాల్ జరిగినా సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతీ సాక్షరభారత్ కేంద్రానికి కుర్చీలు, జంబుఖానా, క్రీడాసామగ్రి మంజూరు చేయగా వాటిని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉన్నా అవి ఎక్కడికెళ్లాయో ఇప్పటివరకు తెలియడం లేదు. కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అక్కడ పంపిణీ చేసిన పుస్తకాలను అభ్యాసకులు చెత్తకుప్పల్లో పడవేస్తున్నారు. దేశంలో అక్షరాస్యతను పెంపొందించాలని కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సాక్షరభారత్ కేంద్రాలు రోజు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
కొంటే ఏముంది? రెంటే బాగుంది!!
కొనుక్కునే బదులు అద్దెకు తీసుకుంటే మేలు గృహోపకరణాల నుంచి వ్యవసాయ పరికరాలు అందుబాటులో దుస్తులు, పుస్తకాలు, ఆభరణాలు, వాహనాలు, ఫర్నిచర్, బొమ్మలు అద్దెకు అవసరం తీరుతుంది; ఖర్చు ఆదా అవుతుంది తరచూ కొత్తవి మార్చుకోవచ్చు కూడా.. దేశంలో రూ.10,200 కోట్లకు చేరిన అద్దె విపణి ఉద్యోగాల బదిలీ, ప్రీమియం ఉత్పత్తులపై కోరికే వృద్ధికి కారణం: విశ్లేషకులు రమేష్, సునీత భార్యాభర్తలు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ నెల్లో దాదాపు నాలుగు ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలి. అన్నీ దాదాపు బంధువులవే. ఇంట్లో బ్రాండెడ్ నుంచి డిజైనర్ దుస్తులదాకా చాలానే ఉన్నా... అన్నీ ఒకసారైనా వేసుకున్నవి కావటంతో ఫంక్షన్లకు కొత్తవి కొనాల్సిందే అనుకున్నారు. కానీ నాలుగు ఫంక్షన్లకీ కొత్తవి కొనాలంటే..? అమ్మో!! అనుకున్నారు. ఇంతలో రమేష్ స్నేహితుడు శేఖర్ వచ్చాడు. వీళ్ల సమస్య విని... ‘‘మంచి డిజైనర్ వేర్‌ను అద్దెకు తీసుకోవచ్చు కదా?’’ అంటూ సలహా ఇచ్చాడు. ‘‘నిజమా!! కార్లు, బైకులు అద్దెకిస్తారని తెలుసు కానీ... దుస్తులు కూడా ఇస్తారా?’’ అంటూ ఆశ్చర్యపోయాడు రమేష్. ‘‘అవేకాదు. జ్యుయలరీ, ఫర్నిచర్, బొమ్మలు... ఆఖరికి మీరో ఆఫీసు పెట్టి పది రోజులకు ఉద్యోగులు కావాలంటే కూడా పంపిస్తారు’’ అని వివరించాడు శేఖర్. ఇకనేం!! రమేష్, సునీత సమస్యకు పరిష్కారం దొరికింది. మీకూ ఆ పరిష్కారం కావాలా? దుస్తులు, ఆభరణాలు, వంటింటి సామగ్రి... ఇలా కావాల్సిన వస్తువులన్నీ ఎంచక్కా అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక కథనం.. అద్దెకు వస్తువులు తీసుకోవటమంటే ఒకప్పుడు ఇల్లు మాత్రమే. తరవాత కార్లు, బైకులు అద్దె వ్యాపారంలోకి వచ్చాయి. కానీ ఇపుడు వంటింట్లోని సామగ్రి నుంచి వ్యవసాయ పరికరాల వరకూ అన్నీ అద్దె మార్కెట్లోకి వచ్చేశాయి. దీన్నే కాస్త స్టైల్‌గా ‘షేరింగ్ ఎకానమీ’ అని పిలుస్తూ అంతా షేరింగ్ బాట పడుతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలకు దారులు తెరుస్తున్నారు. నిజానికి ఈ రెంటల్ వ్యాపారంలో కస్టమర్ ఒక వస్తువును అద్దెకు తీసుకుని... దాన్ని వినియోగించుకున్నాక తిరిగి కంపెనీకి ఇచ్చేస్తాడు. కంపెనీ దాన్ని రీఫర్బిష్ చేసి తిరిగి కొత్తదానిలా మారుస్తుంది. అద్దెకు సిద్ధం చేస్తుంది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను అద్దెకివ్వటానికి మూడు మార్గాల్ని అనుసరిస్తున్నాయి. అవి... కొన్ని సంస్థలు ముందుగా ఉత్పత్తులను కొనేసి... వాటిని తమ వెబ్సైట్లో లిస్ట్ చేసి కస్టమర్లకు అద్దెకిస్తున్నాయి. ఫర్నీచర్, గృహోపకరణాలు, ఇంటీరియర్ ఈ విభాగంలో ఈ ధోరణి ఎక్కువ. కానీ ఈ వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి. వస్తువుల తయారీ సంస్థలు, వెండర్లు, వ్యక్తులు ఇతరత్రా మార్గాల ద్వారా అగ్రిమెంట్, లీజు మీద ఆయా సంస్థలు ఉత్పత్తులను సమీకరిస్తాయి. వాటిని తమ వెబ్సైట్లలో పెట్టి అద్దెకిస్తున్నాయి. బైకులు, కార్ల వంటివి ఈ విభాగంలో ఎక్కువ. ఈ వ్యాపారానికి మొదటి రకం మాదిరి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. చాలామంది తమ దగ్గరున్న, అప్పటికి అవసరం లేని వస్తువులను ఇతరులకు అద్దెకివ్వాలనుకుంటారు. అలాంటి వారు ఉపయోగించుకోవటానికి రెంటల్ వెబ్‌సైట్లున్నాయి. ఒకరకంగా రెంటల్ అగ్రిగేటర్లన్న మాట. వారు ఈ వెబ్సైట్లలో తమ ఉత్పత్తులను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అవసరమున్న కస్టమర్ నేరుగా వస్తువు యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకుంటాడు. ఈ వ్యాపారంలో వస్తువుల నాణ్యత, బాధ్యత విషయంలో సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. దుస్తులు: 3 గంటల నుంచి 3 రోజుల వరకూ దుస్తుల విషయానికొచ్చేసరికి ఫ్లైరోబ్, స్విష్‌లిస్ట్, వ్రాప్డ్, లైబ్ రెంట్, క్లోజీ, ది క్లాతింగ్ రెంటల్, ది సైటల్ డోర్, స్టేజ్3 వంటి సంస్థలు ఆన్లైన్ లో అద్దెకిస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల నుంచి డిజైనర్ వేర్స్ వరకూ అన్నింటినీ వీటి సాయంతో అద్దెకు తీసుకునే వీలుంది. పిల్లలు, మహిళలు, పురుషులు... ఇలా అన్ని విభాగాల్లోనూ ఇవి దుస్తులను అద్దెకిస్తున్నాయి. అద్దె గరిష్టంగా 3 గంటల నుంచి 3 రోజుల వరకు తీసుకునే వీలుంది. ఎఫ్‌సీయూకే, ఫరెవర్ న్యూ, అసూస్, మ్యాంగో, క్విర్క్బాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు చాలానే ఉన్నాయి. రీతు కుమార్, మసాబా గుప్తా, సమ్మంత్ చౌహాన్, సెహ్లాఖాన్, సురేంద్రి వంటి ప్రముఖ డిజైనర్స్ కలెక్షన్స్ కూడా వీటిలో దొరుకుతున్నాయి. అయితే హైస్ట్రీట్ బ్రాండ్లకు మాత్రం ఎలాంటి ముందస్తు డిపాజిట్ అవసరం లేదు. డిజైనర్ దుస్తులకైతే 20 శాతం సొమ్మును డిపాజిట్‌గా ముందు చెల్లించాల్సి ఉంటుంది. ఫర్నిచర్: ఫ్రీ డెలివరీ, పికప్ ఫర్నిచర్‌ను అద్దెకివ్వటానికి ఫ్యూర్లెన్కో, రెన్టొమొజో, గ్యారెంటెడ్, రెంటల్వాలా తదితర సంస్థలున్నాయి. తరచుగా ఉద్యోగ బదిలీ కారణంగా మారిన ప్రతి చోటా కొత్త ఫర్నిచర్ కొనుక్కోవటమంటే చాలా కష్టం. పోనీ అప్పటికే ఉన్న ఫర్నిచర్‌ను మారిన చోటికి తీసుకెళదామంటే రవాణా ఖర్చులు మామూలుగా ఉండవు. వాటి బదులు కొత్తవి కొనుక్కోవటమే బెటరనిపిస్తుంది. ఫర్నిచర్ రెంటల్ కంపెనీలకు ఊపిరి పోసింది ఈ అంశమే. అయితే ఈ సంస్థలు ఫర్నీచర్‌తో పాటూ హోం అప్లయెన్సెస్, గేమింగ్, కెమెరా, వైఫై, స్మార్ట్ డోర్ లాక్స్ వంటి ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువునూ అద్దెకిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ ఉచితంగా డెలివరీ, పికప్ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిని ఎన్నాళ్లయినా అద్దెకు వాడుకోవచ్చు. కాకపోతే కాలం పెరుగుతున్న కొద్దీ అద్దె కూడా పెరుగుతుంది. అదీ కథ. బొమ్మలు: మెట్రోల్లోనే ఎక్కువ పిల్లల కోసం ఆడుకునే బొమ్మలు ఒకసారి కొంటాం. నాలుగైదు సార్లు ఆడగానే... అది బోర్‌కొట్టి కొత్త బొమ్మ కావాలంటారు వాళ్లు. మరి పాత బొమ్మ సంగతో? అందుకే ఫన్ స్టేషన్, కిలోనేవాలా, రెంట్టాయ్స్, టాయ్ఎక్స్ప్రెస్, ఫ్రెండ్లీటాయ్స్ వంటి సంస్థలు బొమ్మలు అద్దెకిస్తున్నాయి. చాలా కంపెనీల సేవలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, అహ్మదాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బొమ్మల వినియోగం తక్కువని, నాణ్యత కాసింత తక్కువని ఫన్ స్టేషన్ ఫౌండర్ కశ్యప్ షా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. బొమ్మల అద్దెలు వారం రోజుల నుంచి నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. 2014లో ప్రారంభమైన ఫన్స్టేషన్లో 500 మంది రిజిస్టర్ యూజర్లున్నారని.. 400 లెగో సెట్స్ అద్దెకిచ్చామని ఆయన తెలియజేవారు. వ్యవ‘సాయం’: అవసరమైతేనే ట్రాక్టర్ మిగతా ఆన్ లైన్ రెంటల్ కంపెనీలతో పోలిస్తే మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కాస్త డిఫరెంటేనని చెప్పాలి. ఎందుకంటే ఇది ట్రింగో పేరిట సరికొత్త వ్యాపారానికి తెరతీసింది. ఓలా, ఉబెర్ సంస్థలు ఎలాగైతే కార్లను అద్దెకిస్తున్నాయో అదే తరహాలో ట్రింగో వేదికగా ట్రాక్టర్లను, వ్యవసాయ పరికరాలను అద్దెకు తీసుకోవచ్చన్నమాట. ‘‘మనది వ్యవసాయ ఆధారిత దేశం. 80శాతం మంది రైతులకు ట్రాక్టర్లు కొనాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించట్లేదు. దీంతో చాలా మంది రైతులు పశువుల మీద ఆధారపడి పొలాన్ని దున్నిస్తున్నారు. చాలా సమయం వృథా అవుతోంది. దీనికి పరిష్కారం చూపించేందుకే గతేడాది రూ.10 కోట్ల పెట్టుబడితో ట్రింగోను ప్రారంభించాం’’ అని సంస్థ సీఈఓ అరవింద్ కుమార్ చెప్పారు. 3 వేల మంది రైతుల వినియోగం.. ట్రింగో ఫిజికల్, డిజిటల్ ఇలా రెండు విధాలుగా పనిచేస్తుంది. ఫిజికల్ విధానంలో.. ఫ్రాంచైజీ సెంటర్లుంటాయి. ఈ స్టోర్లలో ట్రాక్టర్లు, పరికరాలు ఉంటాయి. వీటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులూ అందుబాటులో ఉంటారు. డిజిటల్ విధానంలో కాల్ సెంటర్, యాప్ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ట్రింగో కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 13 సెంటర్ల ద్వారా సేవలందిస్తుంది. సుమారు 3 వేల మంది రైతులు వినియోగించుకున్నారు. త్వరలోనే రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ట్రింగో సేవలను ప్రారంభించనున్నట్లు అరవింద్ తెలిపారు. బుక్స్: ఆధునిక టెక్నాలజీతో ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో’ అనేది ఒకనాటి మాట. రెంటల్ కంపెనీలిపుడు ‘పుస్తకం కొనుక్కోవడమెందుకు అద్దెకు తీసుకో’ అని దీన్ని మార్చేశాయి. దేశంలో ఇండియారీడ్స్, డోర్‌స్టెప్స్ బుక్స్, లైబ్రరీవాలా, ఐరెంట్ షేర్, జస్ట్బుక్స్ వంటి పలు సంస్థలు పుస్తకాలను అద్దెకిస్తున్నాయి. ఇందులో క్రీడ, ఆధ్యాత్మిక, సామాజిక, కాల్పనిక, సాహిత్యం, టెక్నాలజీ ఇలా అన్ని పుస్తకాలూ అందించటం వీటి ప్రత్యేకత. బెంగళూరు ఐఐఎంలో ఏర్పాౖటెన జస్ట్ బుక్స్ హైదరాబాద్‌లో కూడా పలు బ్రాంచిలు ఏర్పాటు చేసింది. అద్దెకు తీసుకెళ్లిన బుక్స్‌ను గుర్తించడానికి బార్ కోడ్ రీడర్ల వంటి టెక్నాలజీని కూడా ఇది ఉపయోగిస్తోంది. ఆభరణాలు: వారమైతే ఓకే! ఈవ్స్ 24, రెంట్ జ్యుయలరీ, లక్సీపిక్, రెంటల్వాలా, ఫ్లైరోబ్ వంటి సంస్థలు బంగారు, వజ్రాల ఆభరణాలతో ఇమిటేషన్ జ్యుయలరీని అద్దెకు ఇస్తున్నాయి. ఒక రోజు నుంచి 7 రోజుల వరకు అద్దెకు తీసుకోవచ్చు. ముందుగా కస్టమర్ ఆయా సంస్థల కేవైసీని పూర్తి చేసి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. ఈవ్స్24 వంటి కొన్ని సంస్థలైతే అద్దెతో పాటూ కస్టమర్లు కావాలంటే ఆయా నగలను నెలసరి వాయిదా పద్ధతుల్లో విక్రయిస్తాయి కూడా. ఒకసారి కస్టమర్ ఆభరణాలను వినియోగించుకొని తిరిగి ఇచ్చేశాక ఆయా నగలను శుద్ధి చేసి తిరిగి అద్దెకు రెడీగా ఉంచుతారని ఈ పరిశ్రమలోని వర్గాలు పేర్కొన్నాయి. కార్లు, బైకులు, సైకిళ్లు: దూసుకుపో.. సొంత కారైతే నెలవారీ ఈఎంఐ, నిర్వహణ, బీమా వంటివి ఉంటాయి. ఏటా కారు విలువ కూడా తగ్గిపోతుంటుంది. అదే అద్దె కారైతే నచ్చిన కారులో షికారు చేయొచ్చు. ఇదే సెల్ఫ్ డ్రైవ్ కారు పరిశ్రమకు ఊతమిస్తుందనేది రేవ్ కో–ఫౌండర్ కరణ్ జైన్ మాట. ప్రస్తుతం దేశంలో మైల్స్, జూమ్‌కార్, కార్ క్లబ్, మైకార్, ఆటో రైడర్స్, ఈకో, రెంట్ ఏ కార్, లెట్ మి డ్రైవ్, జస్ట్ రైడ్, రేవ్, ఓలర్, డ్రివెన్ వంటి సంస్థలు బైకులు, కార్లు, సైకిళ్లను అద్దెకిస్తున్నాయి. నానో నుంచి మొదలుపెడితే స్విఫ్ట్, హోండా, ఆడి, ఫోర్డ్, బెంజ్, ఫార్చునర్, డస్టర్ వాహనాలన్నీ అద్దెకు తీసుకోవచ్చు. ధరలు రోజుకు సెడన్ వాహనాలైతే రూ.2,000–2,500, ఎస్యూవీ రూ.3,000–4,000 వరకున్నాయి. 25 ఏళ్ల వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నవారే కారు అద్దెకు తీసుకోవటానికి అర్హులు. వీల్స్ట్రీట్లో బైక్స్.. గేర్, గేర్‌లెస్ ద్విచక్ర వాహనాలను మాత్రమే అద్దెకివ్వటం వీల్‌స్ట్రీట్ ప్రత్యేకత. అపాచి, షైన్, యాక్టివా, జూపిటర్, కరిజ్మా, ట్రయంప్, యమహా, హార్లే డేవిడ్సన్ , సుజుకీ హయాబుసా, నింజా, హ్యోసంగ్ వంటి 50కి పైగా సూపర్ బైక్స్ ఉన్నాయి. బైకు అద్దె రోజుకు ప్రారంభ ధర రూ.300. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పుణె, ముంబై నగరాల్లో సేవలందిస్తున్నామని నెలకు 1000 బుకింగ్స్ అవుతున్నాయని వీల్‌స్ట్రీట్ కో–ఫౌండర్ మోక్షా శ్రీవాస్తవ చెప్పారు. సొంత వాహనాలతో పాటు డీలర్ల నుంచి, బైక్ ఓనర్ల నుంచి లీజు రూపంలో బైకులను అద్దెకు తీసుకుంటామని, ఇటీవలే ఆర్అండ్బీ పార్టనర్స్ నుంచి రూ.10 లక్షల నిధులను సమీకరించామని చెప్పారు. వస్తువులే కాదు ఉద్యోగులు కూడా.. వస్తువులే కాదు నిపుణులను కూడా అద్దెకిచ్చే సంస్థ ఒకటుంది. అదే డెవలపర్ ఆన్ రెంట్. ఇది రిటైల్, ఈ–కామర్స్, హెల్త్‌కేర్, టెలికం, రియల్ ఎస్టేట్, ట్రావెల్, అగ్రికల్చర్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ వంటి అన్ని రంగాల్లో నిపుణులను అద్దెకిస్తుంది. పీహెచ్‌పీ, పైథాన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, యాంగ్లర్ జేఎస్, మీన్ స్టాక్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, హెచ్‌టీఎంఎల్ 5, ఐఓటీ, మాజెంటో, వర్డ్ ప్రాసెస్ వంటి అన్ని రకాల టెక్నాలజీల్లోనూ వీరు సేవలందిస్తారని సంస్థ ఫౌండర్ కపిల్ మెహతా తెలిపారు. ఇప్పటివరకు జస్ట్ డయల్, శుభ్‌కార్ట్, ఆటోమోబీ, స్కిల్ స్పీడ్, పిట్టిగ్రూప్, స్లాటర్ కన్సల్టింగ్, సెంతిక్ వంటి 50కి పైగా కంపెనీలు మా నిపుణుల్ని అద్దెకు తీసుకున్నాయని పేర్కొన్నారు. అనుభవం, పని కాలం ప్రాతిపదికన చెల్లింపులుంటాయి. రూ.10,200 కోట్లకు అద్దె పరిశ్రమ.. ప్రస్తుతం దేశంలో 300 వరకు ప్రధానమైన ఆన్ లైన్ రెంటల్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా షేరింగ్ ఎకానమీ రూ.7,82,000 కోట్లుగా ఉందని.. 2025 నాటికి ఇది రూ.22,78,000 కోట్లకు చేరుతుందని ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్ తాజా నివేదికలో వెల్లడించింది. మన దేశంలో విభాగాల వారీగా అద్దె విపణి గణాంకాలను పరిశీలిస్తే.. ఫర్నిచర్ రూ.5,400 కోట్లు, ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ రూ. 3,400 కోట్లు, కార్లు, బైకుల మార్కెట్ రూ. 2,040 కోట్లు, బొమ్మలు రూ.800 కోట్లుగా ఉంటుందని తెలిపింది. మొత్తంగా మన దేశంలో అద్దె విపణి రూ.10,200 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. నిధుల సమీకరణలోనూ జోరే.. నిధుల సమీకరణలోనూ రెంటల్ కంపెనీలు జోరుమీదున్నాయి. ముంబై కేంద్రంగా పనిచేసే ఫర్నిచర్ రెంటల్ సంస్థ ఫ్లైరోబ్ రెండు రౌండ్లలో 46 మిలియ న్ డాలర్లు సమీకరించింది. సెకోయా క్యాపిటల్, ఐడీజీ వెంచర్స్, జీఆర్ఈఈ వెంచర్స్‌తో పాటూ మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. మరో ఫర్నిచర్ కంపెనీ రెన్ టొమొజో.. ఐడీజీ వెంచర్స్, యాక్సెల్ పార్టనర్స్ నుంచి గతేడాది నవంబర్‌లో 2 మిలియన్ డాలర్లను, ఫ్యూర్లెన్ కో సంస్థ లైట్‌బాక్స్ వెంచర్స్ నుంచి 6 మిలియన్ డాలర్లను సేకరించాయి. సెల్ఫ్ డ్రైవ్ కార్ పరిశ్రమలో 70 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకున్న జూమ్‌కార్ ఇప్పటివరకు 45 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. కి.మీ. చొప్పున కాకుండా గంటల వారీగా కార్లను అద్దెకిచ్చే రేవ్ సంస్థలో మెకెన్సీ సంస్థకు చెందిన పలువురు 1.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో అద్దె మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నది విశ్లేషకుల మాట. – సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
కర్మన్‌ఘాట్‌లో పేలుడు.. ఫర్నిచర్ ధ్వంసం
-
కర్మన్‌ఘాట్‌లో పేలుడు.. ఫర్నిచర్ ధ్వంసం
హైదరాబాద్: ఓ ఇంట్లో పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ సాయిరాం నగర్ కాలనీలో ఆయిల్ వ్యాపారి పరశురాంరెడ్డి ఇంట్లో జరిగిన పేలుడు సంఘటనలో ఫర్నిచర్ ధ్వంసమైంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్‌స్కా్వడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. పేలుడుకు కారణమేంటి, సిలిండర్ వంటిది ఏమైనా పేలిందా వంటి సమాచారం తెలియరాలేదు. -
రద్దయిన పెద్ద నోట్లను ఏం చేస్తున్నారు?
దుబాయ్: దేశంలో రద్దు చేసిన పెద్ద నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? మంటల్లో తగులబెడుతుందా, సముద్రంలో పారేస్తుందా? అని అందరీకీ సందేహాలు కలిగిన విషయం తెల్సిందే. అయితే, ఈ రద్దు చేసిన రూ.500, రూ.1000 రూపాయల నోట్లను ఏం చేయబోతున్నారో తెలిసిపోయింది. వాటిని ఫర్నీచర్ రీసైక్లింగ్ కోసం కేరళలోని కన్నూర్ జిల్లాలోవున్న ‘వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్’కు విక్రయిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ పనిమీద దుబాయ్‌కి వచ్చిన యజమాని పీకే మాయన్ మొహమ్మద్ ఇక్కడ మీడియాకు తెలియజేశారు. వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్ కంపెనీ పాత బిల్లు కాగితాలను రీసైక్లింగ్ చేసి హార్డ్‌బోర్డ్, ఫైబర్‌బోర్డ్ పర్నీచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వాటిని దుబాయ్ గుండా యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని పాతిక దేశాలకు విక్రయిస్తోంది. తాము కాగితం రీసైక్లింగ్ ద్వారా చేసే పుస్తకాల సెల్ఫ్‌లు, దుస్తుల కంబోర్డులు, టేబుల్ డ్రాయర్లు అందంగా ఉండడమే కాకుండా నాణ్యతతో ఉంటాయని మాయన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం అక్టోబర్ 20వ తేదీన, అంటే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించడానికి సరిగ్గా 18 రోజుల ముందు తిరువనంతపురంకు చెందిన ఆర్బీఐ అధికారులు ఆయన వద్దకు వచ్చి చెల్లని నోట్లను రీసైక్లింగ్ చేయవచ్చా? అంటూ వాకబు చేశారు. ఆయన తన కంపెనీ గురించి పూర్తి వివరాలను తెలియజేసి ట్రయల్ రన్ కింద చెల్లని నోట్లను తీసుకరమ్మని చెప్పారు. 500, 1000 రూపాయల నోట్లు రెండు ట్రక్కుల నిండారాగా వాటిని మామూలు పద్ధతిలో రద్దీగా మార్చేందుకు ప్రయత్నించారు. ఆ పద్ధతి వల్ల ఆశించిన ఫలితం రాకపోవడంతో ‘థర్మోమెకానికల్ పల్పింగ్ మెథడ్’ ఉపయోగించి వాటిని రద్దీగా మార్చారు. అత్యధిక ఉష్ణోగ్రత, విద్యుత్‌ను ఉపయోగించి నోట్లను రీసైక్లింగ్ చేసే ఈ పద్ధతి భారతదేశంలో ఒక్క తన కంపెనీలో ఉందని మాయన్ తెలిపారు. ఆర్బీఐ అధికారులు తన వద్దకు వచ్చి సంప్రదించే వరకు కూడా పెద్ద నోట్లను రద్దు చేస్తున్న విషయం తనకు తెలియదని, మోదీ ప్రకటన ద్వారానే దేశ ప్రజలతోపాటు తనకూ తెల్సిందని మీడియా ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఆర్బీఐ నుంచి మెట్రిక్ టన్ను రద్దయిన నోట్లను 250 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నానని, నెలకు 60 మెట్రిక్ టన్నుల నోట్లను రీసైక్లింగ్ చేసే సామర్థ్యం తమ కుందని ఆయన తెలిపారు. గత మార్చి నెల నాటికి 2,200 కోట్ల పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ లెక్కలు తెలియజేస్తున్నాయి. వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ కంపెనీ ఫర్నీచర్ ఉత్పత్తులో పది శాతం దేశీయంగా అమ్ముడుపోతున్నాయి. అంటే, ఏదోరోజు మన ఇంటికి కూడా రద్దయిన పెద్ద నోట్లు ఫర్నీచర్ రూపంలో రావచ్చు. -
బంక్ బెడ్స్‌తో హుషారు
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు తమ పిల్లలే లోకం. అందుకే ఇంటి ఎంపికలో, అందులోని ఫర్నీచర్ విషయంలోనూ పిల్లల ఆసక్తి, అభిరుచులను కాదనట్లేదు. ఈమధ్య కాలంలో నగరంలో బంకు బెడ్స హల్చల్ చేస్తున్నారుు. చిన్నారులూ వాటిని ఇష్టపడుతుండటంతో వీటికి గిరాకీ పెరుగుతోంది. ఒక బెడ్ మీద మరొక బెడ్ ఉండటమే ఈ బంక్ బెడ్ ప్రత్యేకత. పెద్దలను విసిగించకుండా పడుకునేందుకు ఈ బెడ్స తోడ్పడుతుండటంతో వీటిని కొనేందుకు తల్లిదండ్రులూ వెనకాడట్లేదు. ఇద్దరు పిల్లలున్న ఇళ్లలో వీటి పాత్ర కాసింత ఎక్కువేనని చెప్పాలి. ఇద్దరికి అతికినట్లు సరిపోయేలా గదిని డిజైన్ చేయటం వల్ల బోలెడు ప్రయోజనాలున్నారుు. ఇద్దరి పిల్లలో ప్రేమానురాగాలు పెరుగుతారుు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. మేమిద్దరం ఒకటేనన్న ఆలోచన వస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. బోలెడు రకాలు.. బంకు బెడ్లలో రకాలకు కొదవేం లేదు. మెట్లు ఉండే ట్విన్ ఓవర్ ట్విన్, ట్విన్ ఓవర్ ఫుల్, మినీ లాఫ్ట్, ఫుల్ ఓవర్ ఫుల్, లాఫ్ట్ కమ్ స్టోరేజ్ బెడ్.. ఇలా రకరకాలున్నారుు. వీటిని ఏర్పాటు చేయడానికి గది విస్తీర్ణం పెద్దగా ఉండాల్సిన అవసరమేమీ లేదు. కనీసం 10/8 చ.అ. గది సైజుంటే చాలు. ⇔ ట్విన్ ఓవర్ బెడ్ల ప్రత్యేకత ఏంటంటే.. చిన్నారులు పెద్దయ్యాక కూడా వీటిని వ్యక్తిగత బెడ్‌గా వినియోగించుకోవచ్చు. టేకుతో తయారయ్యే రకం ధర రూ.30 వేల నుంచి ప్రారంభమవుతుంది. అదే రంగుల్లో కావాలంటే కాసింత ధరెక్కువ. ⇔ ట్విన్ ఓవర్ ఫుల్ రకం 3-6 ఏళ్ల చిన్నారులకు చక్కగా నప్పుతారుు. పైన బెడ్ మూడడుగుల వెడల్పు, కింది బెడ్ నాలుగడుల దాకా ఉంటుంది. మనకు నచ్చిన రంగుల్లో వీటిని ఎంచుకోవచ్చు. వీటి ప్రారంభ ధర రూ.45 వేలుంటుంది. ⇔ ఫుల్ ఓవర్ ఫుల్ రకం కాస్త పెద్దగా కనిపిస్తుంది. కింద, పైన నాలుగు అడుగుల చొప్పున ఉంటుంది. ధర కనీసం రూ.55 వేల నుంచి దొరుకుతారుు. ⇔ పిల్లలు కొంత పెద్దగా ఉంటే తల్లిదండ్రులు బంకు బెడ్లకే పరిమితం కావటం లేదు. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని చదువుకునే బల్ల, వార్డ్రోబ్, వస్తువులు పెట్టుకోవటానికి అరలు వంటివి కల్పిస్తున్నారు. ఇవన్నీ విదేశీ స్థారుులో చూడచక్కగా ఉంటారుు. -
వారెవ్వా.. వాల్స్!
గోడల్లోనే వస్తువుల అమరిక సాక్షి, హైదరాబాద్ : ‘ఇల్లు కట్టి చూడు’ అనేది పాత నానుడి. ‘ఉన్న స్థలంలోనే వస్తువులను అమర్చి చూడు’ అన్నది లేటెస్ట్ సామెత. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో విశాలమైన ఇల్లు కావాలంటే బోలెడంత డబ్బు కావాలి. ఇది అందరికీ కుదరదు. అందుకే ఉన్న కొంచెం స్థలంలోనే ఇంట్లోని ఫర్నీచర్‌ను అమర్చుకోవాలి. దీనికి కావాల్సిందల్లా కొద్దిపాటి సృజనాత్మకతే. సౌకర్యాల ఆలోచనలు.. ఈ రోజుల్లో 600 చ.అ.- 700 చ.అ. విస్తీర్ణంలోనే ఒక హాలు, వంట గది, పడక గది, పూజ గది, వీటిని ఆనుకునే మరుగుదొడ్డినీ నిర్మిస్తున్నారు బిల్డర్లు. హాల్లోనే సోఫాసెట్, టీవీ, డైనింగ్ టేబుల్, దివాన్‌కాట్ అమర్చాలి. వంట గదిలోనే ఉడెన్ కప్ బోర్డు, స్టీల్ బాస్కెట్స్, చిమ్నీ, స్టోరేజీ క్యాబిన్‌తో నిత్యావసర సరుకులతో పాటు బియ్యం వంటి వంట సామాగ్రి ఉండేలా చూసుకోవాలి. పడకగదిలో రెండు మంచాలతో పాటు గోడలకే అమర్చే కప్ బోర్డ్‌లోనే దుస్తులు, నగదు, బంగారం తదితర విలువైన వస్తువులు పెట్టే ఏర్పాటు చేసుకోవాలి. అన్ని గోడల్లోనే.. టీవీ మొదలుకొని బీరువా, మైక్రోఓవెన్‌ను అంతర్గత అలంకరణలో భాగంగా గోడల్లోనే అమర్చుకునేలా ప్రణాళికలున్నాయి. మరోవైపు సోపానే మంచంగా మలుచుకునేలా రెడిమేడ్‌గా తయారైనవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా హాలులో కానీ, పడక గదిలోనే ఒక గూటికి అమర్చుకునేలా నిపుణులు తయారుచే స్తున్నారు. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. ప్రత్యేకించి అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఇల్లు నిర్మించుకునే వారికి అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు. -
అమిత్ షా సభలో రెచ్చిపోయిన పటేదార్లు
-
మూలనపడేశారు..
చాలాపాఠశాలల్లో విరిగిపోయిన ‘స్నేహబాల’ ఫర్నీచర్ పట్టించుకోని అధికారులు విద్యాశాఖాధికారుల ఆదేశాలు పాఠశాలలో అమలుకు నోచుకోవడంలేదు. విద్యార్థులు కోసం ఫర్నీచర్ ఏర్పాటుచేసినా అవి వినియోగంలోలేవు. మూలనపడి విరిగిపోయే స్థితికి చేరుకున్నా క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం వాటి గురించి పట్టించుకోవడంలేదు. పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్‌ను ఫర్నీచర్ మరమ్మతులకు వినియోగించుకునే అవకాశం ఉన్నా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపడంలేదు. కోట : 2004 సంవత్సరంలో వచ్చిన సునామీ వల్ల తీరప్రాంతం అతలాకుతలమైంది. పాఠశాలల భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో తీరప్రాంత మండలాల్లోని పాఠశాలలకు స్నేహబాల కార్యక్రమం ద్వారా ఫర్నిచర్, విద్యాసామగ్రిని అందజేశారు. జర్మనీకి చెందిన యూనిసెఫ్ బందం ఈ కార్యక్రమానికి చేయూతనందించింది. ఈ బందం అన్నీ తీరప్రాంత మండలాల్లోనూ పర్యటించి పాఠశాలల వివరాలు సేకరించి సహాయసహకారాలు అందించింది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని 210 పాఠశాలల్లో విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు వీలుగా ఫర్నిచర్ ఇచ్చారు. కోట మండలంలో 67 పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువుగా ఉన్న నాలుగు పాఠశాలలు మినహా అన్నీ పాఠశాలలకు ఫర్నిచర్‌ను కేటాయించారు. దీనికోసం ఒక్కో పాఠశాలకు రూ.50వేలు వరకు నిధులు వెచ్చించారు. విరిగిన కుర్చీలే దర్శనం.. ఫర్నీచర్ సమకూరినా వినియోగించకపోవడతో కొద్ది సంవత్సరాలుగా పాఠశాలల్లో విరిగిన కూర్చీలే కనబడుతున్నాయి. అనేక పాఠశాలల్లో ఫర్నిచర్ సామగ్రి దెబ్బతిని, మరమ్మతులకు గురయ్యాయి. వీటి మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో ఉపాధ్యాయులు వాటిని మూలనపడేశారు. యూనిసెఫ్ ఫర్నీచర్‌ను వినియోగించాలని ఓసారి ఖచ్చితమైన ఆదేశాలు అందడంతో కొందరు ఉపాధ్యాయులు తమ సొంతనిధులతో మరమ్మతులు జరిపించారు. ఇటీవల మండలంలో పర్యటించిన విద్యాశాఖ మానిటరింగ్ టీం సభ్యులు ఫర్నిచర్ ఉపయోగించని నాలుగు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నివేదిక పంపారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమయ్యారు. మండలంలో 27 పాఠశాలల్లో ఫర్నీచర్‌ను విద్యార్థుల అవసరాల మేరకు వినియోగిస్తున్నారు. మిగతా పాఠశాలల్లో అవి ఎందుకూ పనికిరాకుండా మూలనపడే ఉన్నాయి. -
నయా లుక్
ఆకట్టుకుంటున్న ఫర్నీచర్ అందరికీ అందుబాటు ధరల్లో.. నగరంలో వెలుస్తున్న దుకాణాలు కరీంనగర్ కల్చరల్ : ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. స్వర్గాన్ని తలదన్నేలా ఇంటిని తయారుచేసుకుంటున్నారు నగరవాసులు. ఇంటికి తగ్గ ఫర్నీచర్‌ను అమర్చినప్పుడే దాని అందం రెట్టింపవుతుంది. ఇందుకనుగుణంగానే నగరవాసులు వారికి నచ్చిన ఫర్నీచర్‌ను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ తరహా షోరూమ్‌లు కరీంనగర్లోనూ వెలుస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరల్లోనే ఫర్నీచర్ లభిస్తుండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. స్థాయికి తగ్గట్టుగా ఫర్నీచర్ కొనుగోలు చేస్తూ ఇంటికి మరింత అందాన్ని తెస్తున్నారు. వెరైటీగా ఉండే సోఫాసెట్, డైనింగ్ టేబుళ్లు, వాటికి అనుగుణంగా విభిన్న రకాల టీపాయ్‌లు, ఇంటిని మరింత అందంగా మార్చే కప్‌బోర్డులు, డ్రెస్సింగ్ టేబుళ్లను ఇంట్లో అమర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాణ్యమైన, అందమైన డిజైన్లలో ఫర్నీచర్ కావాలంటే ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు వెళ్లి వలసి వచ్చేది. కానీ ఇప్పుడు అంతశ్రమ తీసుకోనవసరం లేదు. గృహోపకరణాలతోపాటు కార్యాలయాలకు సరిపడా అన్ని రకాల ఫర్నీచర్ కరీంనగర్‌లోనే లభిస్తుంది. దుకాణాలు శ్రీ బాలాజీ ఫర్నీచర్ సెంటర్–సాయినగర్ పవన్ ఫర్నీచర్ సెంటర్–వాల్మీకినగర్ తెలంగాణ ఫర్నీచర్ సెంటర్–సవరన్‌స్ట్రీట్ లైఫ్‌సై్టల్ ఫర్నీచర్ సెంటర్– డైలీ మార్కెట్ హిందూస్థాన్ ఫర్నీచర్ సెంటర్– అస్లమ్ మజీద్ దగ్గర ఆకార్ ఫర్నీచర్ సెంటర్–అస్లమ్ మజీద్ దగ్గర ఏపీ ఫర్నీచర్ సెంటర్–అస్లమ్ మజీద్ దగ్గర స్టార్ ఫర్నీచర్ సెంటర్–డాక్టర్స్ స్ట్రీట్ ఆశా ఫర్నీచర్ సెంటర్–ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్ దగ్గర మధుర ఫర్నీచర్ సెంటర్–టవర్ సర్కిల్ బాలాజీ ఫర్నీచర్ సెంటర్–ఆఫీస్రోడ్ ధరలు(రూ.లలో) డైనింగ్ సెట్స్ 10వేల–35వేల వరకు సోఫాసెట్లు 11వేల–65వేల వరకు ఆఫీస్ ఫర్నీచర్ 15వేల–50వేల వరకు డబుల్ కాట్బెడ్ 5వేల–35వేల వరకు స్టోరేజ్ డ్రెస్సింగ్ టేబుల్ 5వేల–35 వేల వరకు ఇంటి అందాన్ని పెంచుతాయి ఇల్లు ఎంత ఆధునికతతో నిర్మించినప్పటికి అందుకుతగ్గట్లు ఫర్నీచర్ కూడా ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి మరింత అందం వస్తుంది. గతంలో వెరైటీ ఫర్నీచర్ కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని రకాల ఫర్నీచర్ ఇక్కడే లభిస్తుంది. – రతన్‌కుమార్, ప్రభుత్వ ఉద్యోగి వెరైటీలు లభిస్తున్నాయి ఆధునితకు తోడు ఆకర్షణీయ డిజైన్లలో ఫర్నీచర్ లభిస్తుంది. ఇల్లు ఎంత అందంగా కట్టుకున్న అందుకు అనుగుణంగా ఫర్నీచర్ లేకపోతే వృథానే. ఖర్చుతో నిమిత్తంలేకుండా ఇంటి నిర్మాణనికి అనుగుణంగా అవసరమైన ఫర్నీచర్ ఉండాల్సిందే. – డాక్టర్ ఎల్.శేషశైలజ, జనరల్ ఫిజీషియన్ నాణ్యత, మన్నికే ముఖ్యం సంపన్నులతోపాటు మధ్య తరగతివర్గాల వారికి అనువైన రీతిలో ఫర్నీచర్‌తోపాటు అదే తరహా ధరలతో అందించడం మా ప్రత్యేకత. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లతో కూడిన ఫర్నీచర్ అందుబాటులో ఉంటుంది. – శివ బాలజీ, ఫర్నీచర్ సెంటర్ నిర్వాహకుడు -
ఫర్నిచర్‌తో అదిరేటి లుక్
అల్లిపురం : ఇంటిని చూసి ఇల్లాలను చూడాలన్నది నానుడి. ఇంటిని సర్ధడంలో మొట్టమొదటి ఇంటీరియన్ డిజైనర్ స్థానం ఆమెదే. ఎవరింటికైనా వెళ్లగానే ఎవరి చూపులైనా పడేది ఆ ఇంట్లో ఫర్నిచర్‌పైనే. అబ్బా ఎంత బాగుంది... ఎక్కడ చేయించారు అంటూ ముగ్దులైపోవడం పరిపాటి. గతంలో టేకు, రోజువుడ్ వంటి కర్రతో చేసిన వస్తువులకు గిరాకీ బాగా ఉండేది. కాలంతో పాటు ఫర్నిచర్లో కూడా డిస్పోజబుల్ వస్తుండడం విశేషం. అందుకు ఫైబర్, ఐరన్, పీవీసీ, ప్లైవుడ్, మీడియం డెన్సీటీ ఫైబర్ వంటి రడీమేడ్ ఫర్నిచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఫర్నిచర్ తయారు చేయడం చాలా సులభతరమైంది. ఆర్డర్ ఇవ్వడమే తరువాయి మనకు నచ్చిన డిజైన్లు, గ్లాస్ ఫినిషింగ్‌తో ఆద్భుతమైన ఫర్నిచర్ మన కళ్ళముందు ఆవిష్కతమవుతుంది. మోడరన్ కిచెన్.. ఇల్లాలికి వంటిల్లే కార్యాలయం. ఆ కార్యాలయానికి ఆమె మహారాణి. అక్కడ ఆమెకు కావాల్సిన సౌకర్యాలు, వస్తువులు అందుబాటులో ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగిన విధంగా వంటింటిని అలంకరించుకోవడంలో మహిళలు పోటీ పడుతుంటారు. వంటిల్లు ఎంత విశాలంగా ఉంటే అంత బాగా అలంకరించుకోవడానికి వీలుకలుగుతుంది. వారి అభిరుచిలకు తగిన విధంగా మోడరన్ కిచెన్లు తయారు చేయడంలో కంపెనీలు ఇపుడు ఉత్సాహం చూపిస్తున్నాయి. కిచెన్ ప్లాట్‌ఫాంపై గ్యాస్ స్టవ్ మొదలుకొని వారికి కావాల్సిన ఓవెన్లు, మిక్సీ, జ్యూసర్, గ్రైండర్లు కావాల్సిన సమయంలో వాడుకొని తరువాత భద్రపరుచుకోనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బయటకు శుభ్రంగా కనిపిస్తుంది. కావాల్సిన వస్తువులు, పాత్రలు పెట్టుకునేందుకు ర్యాక్‌లతో అలరిస్తున్నాయి. తక్కువలో తక్కువ రూ.1.50 లక్షల నుండి రూ.3 లక్షలు వెచ్చించేందుకు Ðð నుకాడడం లేదు. గదులకు తగ్గ ఫర్నిచర్.. లివింగ్ హాల్, డైనింగ్ హాల్, బెడ్రూంలలో ఒకప్పుడు ఫర్నిచర్ చేయించుకోవాలంటే నెలలు తరబడి చేయాల్సి వచ్చేది. అందుకు ఇంటి నిండా చెత్తా చెదారం, గమ్ములతో పనిచేస్తూ ఉండే వారు. కానీ వాటికి కాలం చెల్లింది. మనకు కావాల్సిన ఫర్నిచర్ సైజులు తీసుకుని ఆర్డన్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. నెల రోజుల్లో మనకు కావాల్సిన ఫర్నిచర్ మౌల్డ్ చేసి తీసుకువచ్చి రెండు రోజుల్లో మనం చూపించిన చోట ఫిక్స్ చేసి వెళ్లిపోతున్నారు. అప్పటి వరకు సాధారణంగా ఉన్న ఇళ్లు మోడరన్ ఫర్నిచర్‌తో కొత్త లుక్ సంతరించుకుంటుంది. కావాల్సిన రంగులు, డిజైన్లతో చూడగానే వావ్ అనిపించేలా చూడగానే కళ్లు చెదిరే డిజైన్లు మార్కెట్లో మురిపిస్తున్నాయి. -
ఇల్లు అందంగా కనిపించాలంటే!
సాక్షి, హైదరాబాద్: ఉన్నంతలో ఇంటిని అందంగా పెట్టుకోవటం కళే. గోడలకు మంచి వాల్ పేపర్స్ అతికించడం, పాత ఫర్నిచర్‌కు మెరుగులు దిద్దటం, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్, డ్రాయింగ్ రూములను చిన్న చిన్న మార్పులతో పొందికగా మలుచుకోవటం లాంటివి చేస్తే చాలు. ఇల్లు పొదరిల్లులా మారుతుంది. ⇔ డ్రైనింగ్ రూమ్‌లో పెద్ద టేబుల్ పెట్టి దానిని చైనీస్ పోర్సిలిన్ తరహా వస్తువులతో అలంకరిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఆ వస్తువులు గది రంగుకి మ్యాచ్అవ్వాలనేమీ లేదు. ⇔ వంటింటికి అందమైన లెనిన్ కర్టెన్ అమర్చాలి. ఇలా చేస్తే కిచెన్ లుక్ బాగుండటమే కాదు లోపల మనం ఏం చేస్తున్నది ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు. వంటింటికి స్టీల్ అండ్ గ్లాస్ కేస్మెంట్స్ ఫ్రేమ్స్‌ని పెడితే చూడ్డానికి మరింత అందంగా ఉంటుంది. ఆరు బయట ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పని చేసుకోవచ్చు. ⇔ బెడ్రూమ్లో మంచంపై మిక్స్ అండ్ మ్యాచ్ దుప్పట్లు, దిండు గలీబులు వేస్తే ఆ రూముకి కొత్త అందం వస్తుంది. బెడ్రూమ్లో యాంటిక్ కేజ్లైట్స్ పెట్టుకుంటే మరింత బాగుంటుంది. ⇔ బాత్రూమ్లో పెడస్టల్ టబ్, ఫిక్సర్లు అమర్చుకుంటే బాగుంటుంది. ఇల్లు కట్టిన కాలాన్ని గుర్తు చేసేలా ఆ ఇంట్లోని వస్తువుల అమరిక ఉంటే గదులకు యాంటిక్ లుక్ వస్తుంది. ⇔ ఇంట్లో ఉన్న పాత సోఫా, ఇతర ఫర్నిచర్లకు పెయింట్ వేస్తే న్యూలుక్‌తో అవి మెరిసిపోతాయి. హాలులో ఉన్న పెద్ద గోడలకు వెరైటీగా రంగు రంగుల ప్లేట్లను అతికిస్తే చూడ్డానికి ఆర్ట్పీస్లా ఎంతో బాగుంటుంది. ⇔ గెస్ట్ రూమ్‌లో వినైల్ షేడ్స్‌తో వాల్ పేపర్లను అతికిస్తే ఆ గది అందం ద్విగుణీకృతం అవుతుంది. ⇔ హాలు మధ్యలో ఉండే సన్నని దారులపై చిక్కటి రంగు, డిజైన్లు ఉంటే కార్పెట్లు పరిస్తే చూడ్డానికి గ్రాండ్‌గా, డెకొరేటివ్గా ఉంటుంది. ⇔ ఇంట్లో ఉన్న వాలు కుర్చీలపై పాతకాలం నాటి డిజైన్లు కుర్చీలకు కొత్త అందాన్ని ఇస్తాయి. -
హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ తరలింపు అవసరంలేదు
-ఉమ్మడి ఫైళ్లు తెలంగాణాతో సమన్వయంతో స్కానింగ్ చేయండి -న్యాయ శాఖలో 20 వేల పుస్తకాలు డిజిటలైజేషన్ -జీఏడీలో 14 వేల పుస్తకాలు డిజిటలై జేషన్ -నేడు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లనున్న నాలుగు శాఖలు -ఉదయం 6 గంటలకు సచివాలయంలో బస్సులు ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ఫర్నీచర్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో కొత్త ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని ఫర్నీచర్, ఎయిర్ కండీషన్స్‌ను అవసరమైతే గుంటూరు, విజయవాడలకు తరలివెళ్లిన శాఖాధిపతుల కార్యాలయాలకు ఇవ్వాలని టక్కర్ సూచించారు. ఈ మేరకు సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉమ్మడి ఫైళ్లను తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయంతో స్కానింగ్ చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఫైళ్ల స్కానింగ్ ఏ ధరకైతే చేయించారో అదే ధరకు స్కానింగ్ చేయించాలని, ఇందుకు ఐటీ శాఖతో సంప్రదింపులు జరపాలని ఆయన స్పష్టం చేశారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ శాఖలను, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలను ఒకే చోట కేటాయింపులు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఇలా ఉండగా హైదరాబాద్ సచివాలయం నుంచి బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయానికి పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, కార్మిక, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య శాఖలు తరలివెళ్లనున్నాయి. ఇందుకోసం బుధవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ సచివాలయంలో ఆరు బస్సులను ఏర్పాటు చేశారు. న్యాయ శాఖలో 20 వేల పుస్తకాలను డిజిటలైజేషన్ చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఒకే పుస్తకం రెండేసి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంపిణీ చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకే పుస్తకం ఉంటే డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రణాళికా శాఖ లైబ్రరీలో ఏడు వేల పుస్తకాలున్నాయి. వీటిని కూడా డిజిటలైజేషన్ చేయాలని ఆయన సూచించారు. సాధారణ పరిపాలన శాఖలో 12,600 ఇంగ్లీషు, 1700 తెలుగు కలిపి మొత్తం 14,300 పుస్తకాలున్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాలు, ఉమ్మడి మద్రాసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా గెజిటీర్స్, జనాభా లెక్కల పుస్తకాలు, నిజాం కాలానికి చెందిన దస్త్రాలున్నాయని, వీటిని డిజిటలైజేషన్ చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. 21వ తేదీ కల్లా సచివాలయ శాఖలన్నీ తరలింపు జూలై 21వ తేదీ నాటికల్లా సచివాలయంలోని అన్ని శాఖలు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లేందుకు వీలుగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. జూలై 6వ తేదీన వెలగపూడిలోని ఐదవ భవనంలోని తొలి అంతస్థులోకి కొన్ని శాఖలు, జూలై 15వ తేదీన ఒకటి నుంచి నాలుగు భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి కొన్ని శాఖలు, జూలై 21వ తేదీన ఒకటి నుంచి నాల్గో భవనంలోని తొలి అంతస్థులోకి కొన్ని శాఖలు తరలివెళ్లాలని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు -
ఇంటిని మెరిపిద్దాం!
సాక్షి, హైదరాబాద్: ఇంటి అందం ద్విగుణీకృతం కావాలంటే ఇల్లే కాదు ఇంట్లోని ఫర్నిచర్, ఫ్లోరింగ్, కర్టెన్లు, కార్పెట్లు, వంటింట్లో సామగ్రి కూడా శుభ్రంగా ఉండాలి. ఇల్లంత మెరుపులు మెరవాలంటే శుభ్రత కోసం కొంత సమయాన్ని కేటాయించకతప్పదు. ప్రణాళికాబద్ధంగా.. ఎలాంటి హడావుడి లేకుండా అలంకరించుకోవాలి సుమీ. ⇒ మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి. ఫ్లోరింగ్ మెరిసిపోతుంది. ⇒ కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి తరచూ వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరక లు తొలగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యూమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. ⇒ గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్లతో శుభ్రం చేయండి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయరాదు. ⇒ కొందరు మైక్రోఓవెన్‌ను అధికంగా వాడుతుంటారు. దీంతో ఇది ఎక్కువగా మురికిపడుతుంటుంది. దీనిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనిగర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడిచేయాలి. గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి. ⇒ బాత్‌ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ల వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయిప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడం తో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్‌పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటింట్లో సింక్ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్‌ను కలిపి ప్రయత్నించండి. -
ఇంటి అందం రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్: ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. అంటే ఇల్లు ఎంత అందం.. శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని దానర్థం. అలా అని ప్రతి పండక్కీ ఇంటికి రంగులు వేయించడం కాసింత కష్టమే. అందుకే ఇంట్లోని ఫర్నిచర్‌ను, సామగ్రిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఇల్లు అందంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అందనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండీ మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది. కార్పెట్లు..: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి తరచూ వాక్యూమ్క్లీనర్తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరక లు తొలిగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యూమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్లతో శుభ్రం చేయండి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయరాదు. మైక్రోఓవెన్: దీనిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడిచేయాలి. గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి. వంటింట్లో..: స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్‌పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటింట్లో సింక్ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్‌ను కలిపి ప్రయత్నించండి. -
ఈ సారీ నేలబారే!
‘పది’ పరీక్షలకు ఫర్నీచర్ కష్టాలు 169 కేంద్రాల్లో కుర్చీలు, బల్లలు కరువు బల్లలు సమకూర్చాలని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ ఒత్తిడి పుత్తూరులో సెల్ఫ్ సెంటర్‌పై దుమారం మాస్ కాపీయింగ్‌కు సన్నాహాలు చేసుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లు మంచులా కరుగుతున్న కాలం.. దగ్గర పడుతున్న పరీక్షల గడువు.. మెజారిటీ పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్ కరువు.. బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని ప్రైవేట్‌కు విద్యాశాఖ హుకుం. చేస్తే ఎలా.. చేయకపోతే ఎదురయ్యే పరిస్థితి ఏమిటని లోలోన మధన. వెరసి ఈ సారీ పది విద్యార్థులకు నేల రాతలు తప్పేలా లేదు. తిరుపతి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కష్టాలు తప్పేలాలేవు. మెజార్టీ కేంద్రాల్లో బల్లలు, కుర్చీలు, కొన్ని చోట్ల తాగునీటి సౌకర్యాలు లేవు. పరీక్ష కేంద్రాల్లో సామగ్రిని ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు సమకూర్చాలని ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. దీంతో తమ పాఠశాలలో ఉన్న సామగ్రిని పరీక్ష కేం ద్రాలకు తరలిస్తే, మిగిలిన తరగతుల వి ద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను కింద కూర్చోబెడితే ఫీజులు చెల్లించే తల్లిదండ్రులు ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు రాసేది మీ పిల్లలే కదా.. ఫర్నీచర్ సమకూర్చకపోతే ఎలా అనే విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల యా జమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచా రం. దీంతో జిల్లాలోని 870కి పైగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. బయట ఫర్నీచ ర్ అద్దెకు తెచ్చినా ఆ అద్దె మేమే చెల్లించాల్సి వస్తుందని ప్రైవేటు స్కూళ్ల కరస్పాండెం ట్లు మధనపడుతున్నారు. జిల్లాలో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 52,539 మొత్తం పరీక్ష కేంద్రాలు: 281 ఫర్నీచర్ పూర్తిగా లేని పాఠశాలలు: 70 పాక్షికంగా లేనివి: 99 మొత్తం: 169 కార్పొరేట్‌కు దాసొహం... జిల్లాలో ఉన్నతాధికారులు సైతం కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. పుత్తూరులో ఓ కార్పొరేట్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖాధికారులు సెల్ఫ్ సెంటర్ కేటాయించడంపై దుమారం రేగుతోంది. ఆ యాజమాన్యం మరో స్కూల్ రిజిస్ట్రేషన్‌పై నడుస్తుందని, ఇప్పుడు అదే సెల్ఫ్ సెంటర్లో పరీక్షలు రాయడం ద్వారా మాస్ కాఫీయింగ్ జరిగే అవకాశం ఉందన్న విమర్శలు వస్తున్నా యి. మరో పేరొందిన కార్పొరేట్ పాఠశాల సైతం వారి పిల్లలు పరీక్షలు రాసే సెంటర్లకు చెందిన డిపార్టుమెంట్ ఆఫీసర్లు, చీఫ్‌ల వద్దకు వెళ్లి .. తమ పాఠశాల కు చెందిన పిల్లలకు పూర్తిగా సహకరించకపోతే, ఇబ్బందులు పడతారని సిబ్బందిని హెచ్చరించినట్లు సమాచారం. మొత్తం మీద పదో తరగతి పరీక్షల్లో ఈ సారి తమ విద్యార్థులను పూర్తి స్థాయిలో గట్టెక్కించి, మంచి మార్కులు సాధించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తాం... పదో తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలకు బల్లలు సమకూరుస్తామన్నారు. ఫర్నీచర్ కోసం ఎవరిని ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. పుత్తూరులోని ఓ పాఠశాలలో సెల్ఫ్ సెంటర్ ఉన్న మాట వాస్తవమేనని, అక్కడ పదేళ్లుగా పరీక్ష కేంద్రం ఉందన్నారు. అక్కడికి సీనియర్ ఉపాధ్యాయులరాలిని చీఫ్‌గా నియమించామన్నారు. ఆ సెంటర్‌పై ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరాలు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం చేసిన విద్యార్థులు
విద్యార్థి ఆత్మహత్య ఘటనపై నిరసన రామచంద్రాపురం: మెదక్ జిల్లా పటాన్చెరు మండలం అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం రాత్రి క్యాంపస్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. తోటి విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన విద్యార్థి సూరజ్ మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయని క్యాంపస్‌లో యాజమాన్యం సూరజ్‌ను వేధించారు. దీంతో అతను జనవరి 29న క్యాంపస్ భవనంపై నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సూరజ్ తల్లిదండ్రులు వసంత్‌రావు, సంగీతలు తమ కుమారుడ్ని సికింద్రాబాద్ సన్‌షైన్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే, పరిస్థితి విషమించడంతో సూరజ్ ఈ నెల 14న మృతి చెందాడు. అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు, కళాశాల యాజమాన్యం రహస్యంగా ఉంచారు. సూరజ్ తల్లి సంగీత తన కుమారుడు ఎలా కింద పడ్డాడని ఆరా తీసేందుకు గురువారం రాత్రి ఘటన స్థలానికి రాగా.. విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు ఆమె నుంచి సూరజ్ మృతి వార్త తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. -
ఇంటిప్స్
లెదర్ చెప్పులు, షూస్, హ్యాండ్ బ్యాగ్‌లు కొత్తవాటిలా మెరవాలంటే... వాటి మీద పట్టిన దుమ్ము తుడిచి ఆ తర్వాత ఉల్లిపాయ తొక్కలతో రుద్దాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కిరోసిన్ వేస్తే ఈగలు, దోమలు రావు. ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు. కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి తర్వాత పేపర్‌తో తుడవాలి. -
స్టాక్స్ వ్యూ
వర్ల్‌పూల్ ఇండియా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.616 టార్గెట్ ధర: రూ.732 ఎందుకంటే: ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు, తదితర ప్రదాన గృహోపకరణాలను తయారు చేసి, మార్కెట్ చేస్తోంది. గుర్గావ్ కేంద్రంంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1980లో భారత్‌లోకి ప్రవేశించిన వర్ల్‌పూల్ 1995లో కెల్వినేటర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా రిఫ్రిజిరేటర్ మార్కెట్లోకి అడుగిడింది. మైక్రోవేవ్ ఓవెన్లు, ఏసీ, వాటర్ ప్యూరిఫయర్స్, బిల్టిన్ అప్లయెన్సెస్, ఇతర ఉత్పత్తులకు విస్తరించింది. ఫరీదాబాద్,పాండిచ్చేరి, పుణేల్లో ప్లాంట్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర లాభం 18 శాతం వృద్ధితో రూ.98 కోట్లకు, నికర అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.1,100 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం 17 శాతం వృద్ధితో రూ.162 కోట్లకు, స్థూల లాభం 18 శాతం పెరుగుదలతో రూ.146 కోట్లకు చేరాయి. షేర్‌వారీ ఆర్జన(ఈపీఎస్) 18 శాతం వృద్ధితో రూ.8కు పెరిగింది. ఇదే జోరు మరికొన్ని క్వార్టర్లు కొనసాగవచ్చు. ఈపీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.22కు పెరుగుతుందని భావిస్తున్నాం రెండేళ్లలో నికర అమ్మకాలు 13 శాతం, నికర లాభం 31 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.. మరో మూడేళ్ల పాటు కంపెనీ మిగులు కొనసాగవచ్చు. గృహోపకరణాల వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా పెరుగుతోంది. ఈ కంపెనీ టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విస్తరిస్తోంది. పుుస్తక ధరకు, మార్కెట్ ధరకు మధ్య నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 7.74గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.79గానూ ఉండొచ్చని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.732 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐషర్ మోటార్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత ధర: రూ.18,892 టార్గెట్ ధర: రూ.22,500 ఎందుకంటే: భారత ప్రీమియమ్ బైక్ మార్కెట్లో ఐషర్ మోటార్స్ కంపెనీకి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్(ఆర్ఈ) బ్రాండ్ మార్కెట్ వాటా 96 శాతంగా ఉంది. ఈ బైక్‌ల అమ్మకాలు మరో మూడేళ్లలో 33 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. పోటీ తక్కువగా ఉండడం, పటిష్టమైన స్థితిలో బ్రాండ్ ఉండడం, కొత్త మోడళ్లు అందుబాటులోకి తేవడం, నెట్వర్క్ విస్తరణ, మార్కెట్ అగ్రస్థానం వంటి అంశాలు దీనికి దోహదపడతాయి. బుల్లెట్, క్లాసిక్, థండర్బర్డ్, కాంటినెంటల్ జీటీలతో మంచి అమ్మకాలు సాధిస్తోంది. రెండేళ్లుగా అమ్మకాల్లేక కుదేలవుతున్న వాణిజ్య వాహనాల(సీవీ) మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకోవడం, కొత్త వాహ నాలను అందుబాటులోకి తీసుకురానుండడం వంటి కారణాల వల్ల వాణిజ్య వాహనాల విక్రయాలు మూడేళ్లలో 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. ఆర్ఈ అమ్మకాలు పుంజుకోవడం, సీవీ మార్జిన్లు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల మూడేళ్లలో కంపెనీ ఆదాయం 30 శాతం, నికర లాభం 50 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. ఈ ఏడాది ఆగస్టు వరకూ ఈ కంపెనీ షేర్ ధర 77 శాతం పెరిగింది. గత నెలలో 20 శాతం తగ్గినప్పటికీ, ఏడాది కాలంలో 50 శాతం వరకూ పెరిగినట్లు లెక్క. గరిష్ట స్థాయి నుంచి చూస్తే 20 శాతం తగ్గి ప్రస్తుతం ఆకర్షణీయ ధరలో లభ్యమవుతోందని భావిస్తున్నాం. ఎలాంటి రుణ భారం లేని కంపెనీ. ఐదేళ్లలో షేర్ ధర రెట్టింపు అవుతుందని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.