ఫర్నిచర్‌ను ఇలా కాపాడుకోండి
ఇంటిప్స్
కలప ఫర్నిచర్‌పై దుమ్ము పేరుకుపోతే, మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే ఫర్నిచర్‌పై గీతలు పడకుండా ఉంటుంది.ఆయిల్‌తో తయారు చేసే పాలిష్‌ను కలప ఫర్నిచర్‌కు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా పూర్తి ఆలివ్ ఆయిల్‌తో కూడిన పాలిష్‌లు ఫర్నిచర్‌కు మెరుపునిస్తాయి గానీ, వాటిపై త్వరగా వేలిముద్రలు, ఇతర మరకలు పడతాయి.
అలా కాకుండా, సిలికాన్ ఆయిల్‌తో కూడిన పాలిష్‌లు వాడితే, కలప ఫర్నిచర్‌కు మరింత రక్షణగా ఉంటుంది.పాతబడిన ఫర్నిచర్‌కు మెరుపు తెప్పించాలంటే, ఆలివ్ ఆయిల్, డీనేచర్డ్ ఆల్కహాల్, టర్పంటైన్ మిశ్రమంతో పాలిష్ చేయవచ్చు.