polish
-
వజ్రాభరణాలు : షైనింగ్ పోకుండా ఉండాలంటే ఎలా? పాలిష్ చేయించొచ్చా?!
పండుగలు పెళ్లిళ్లలో అందమైన పట్టుచీరకు, డైమండ్ నగలు మరింత అందాన్ని తెస్తాయి. ఒకసారి వేసుకొని మర్చిపోయేవుకాదు డైమండ్ ఆభరణాలు అంటే. చాలా ఖరీదైనవి కూడా. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్‌ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్‌కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్‌కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్‌కూలర్‌లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్‌ని గమ్‌తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్‌ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
150 మిలియన్ ఏళ్ల నాటి జీవికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు
150 million-year-old marine invertebrate Named after Ukraine President: పోలాండ్లోని పాలియోంటాలజిస్టులు 150 మిలియన్ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరు పెట్టారు. ఆఫ్రికాలోని ఇథియోపియాలోని అంటలో సున్నపురాయి నిర్మాణంలో ఈ వింత జీవి పూర్తి శిలాజం సురక్షితంగా ఉంది. ఇది ఒక రకమైన ఈక నక్షత్రం అని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. సముద్రగర్భాంలో ఉండేలా సుమారు 10 పొడవాటి చేతులు, పదునైన టెన్టకిల్ లాంటి పంజాలను కలిగి ఉందని పరోశోధకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ కోసం పోరాడటమే కాకుండా ఉక్రెయిన్‌ని కాపాడుకునేందుకు శాయశక్తుల కృషి చేసి ప్రపంచ దేశాల ప్రశంసలందుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్స్కీ. మాతృభూమి రక్షణకై జెలన్స్కీ కనబర్చిన తెగువ ధైర్యసాహసాలకు గౌరవార్థంగా ఈ వింతజీవికి అతని పేరుని సూచించారు. ఈ మేరకు ఆ వింత జీవికి ఆసిచిక్రినైట్స్ జెలెన్ స్కీ గా నామకరణం చేశారు. ఇలాంటి వితజీవులకు సమద్ర అడుగుకు చేరుకుని ఉపరితలాన్ని పట్టుకునేలా భారీగా 10 చేతులు, ఆధారంగా ఒక పంజా ఉంటాయి. ఐతే ప్రస్తుతం ఈ వింత శిలాజం మాత్రం ఒక చేతిని కోల్పోయింది. నిజానికి ఈ వింతజీవులు చనిపోయినప్పుడూ మృదుజాలం క్షీణించి ఎముకలు, చేతులు వంటి అవయవాల సాధారణం విడిపోతాయి. కానీ ఈ శిలాజం మాత్ర విడిపోకుండా పూర్తి నమూన సురక్షితంగా భద్రపరచబడిందని పోలాండ్ శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజ జీవి ఇతర జంతుకుల దాడి నుంచి బయటపడి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ జీవులు మానవులకు విషపూరితం కాదు గానీ ఇతర జీవులకు విషపూరితమే అయ్యిండొచ్చని భావిస్తున్నారు. (చదవండి: పాపం యాన్ యాన్.. తిండి మానేసి మరీ కన్నుమూసింది) -
నేను బిక్షగాడిని కాదు సార్ .. బూట్ పాలిష్ చేస్తాను!
బెంగళూరు: లాక్‌డౌన్‌తో కార్మికులు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారో తేటతెల్లం చేసే సంఘటన ఇది. జిల్లా ఇన్చార్జి మంత్రి జగదీశ్ శెట్టర్ కారులో వెళ్తుండగా ఓ కార్మికుడు కారు వద్దకు వచ్చి పార్ బూట్ పాలిష్ చేస్తా అంటూ వెట్టర్ను ప్రాధేయపడ్డాడు. నగరంలోని కిమ్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మంత్రి డబ్బులు ఇవ్వపోగా..‘నేను బిక్షగాడిని కాదు.. మిమ్మల్ని బిక్షం అడగడం లేదు.. మాకు ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి సార్’ అని ప్రాధేయపడ్డాడు. చివరకు మంత్రి రూ. 500 నగదు ఇచ్చి ఇతనికి శాంతపరిచి పంపారు. చదవండి: ముఖ్యమంత్రి మార్పు: ‘మా కుటుంబాన్ని లాగొద్దు’ -
బియ్యానికి పాలిష్ దెయ్యం
దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి జనానికి అంటగడుతున్న మిల్లర్లు, వ్యాపారులు - సన్నబియ్యం పేరిట మార్కెట్లో విక్రయాలు - అన్నం ముద్ద్ద కావడం, జీర్ణ సమస్యలతో ‘ప్లాస్టిక్ బియ్యం’అంటున్న జనం - పాలిష్ బియ్యంలో పోషకాలు మృగ్యం.. రోగాలు తప్పవంటున్న వైద్యులు - ప్రభుత్వం ఇచ్చే రూపాయి కిలో బియ్యంలో 30 శాతం దాకా బయటకే.. - వాటినే సన్నగా, నాజూగ్గా చేసి అధిక ధరలకు అమ్మేస్తున్న మాఫియా - ప్రభుత్వానికి కూడా వాటినే అంటగడుతున్న వైనం - ఎక్కడా ప్లాస్టిక్ బియ్యం దొరకలేదన్న పౌరసరఫరాల సంస్థ మహమ్మద్ ఫసియొద్దీన్, బొల్లోజు రవి, మేకల కల్యాణ్ చక్రవర్తి ప్లాస్టిక్ బియ్యం.. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రజలను భయపెడుతున్న దెయ్యం! సన్న బియ్యం వండగానే అన్నం మెత్తగా, ముద్దలు ముద్దలుగా అవుతుండడం, ముద్ద చేసి నేలకు కొడితే బంతిలా ఎగరడం, రుచి లేకపోవడం, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తడంతో అంతా ప్లాస్టిక్ బియ్యంగా అనుమానిస్తున్నారు. ఇవన్నీ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆందోళనలూ పెరిగిపోతున్నాయి. కానీ వీటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. దొడ్డు బియ్యాన్ని అనేకసార్లు పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చడం వల్లే జనంలో ‘ప్లాస్టిక్ బియ్యం’ఆందోళనలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు సన్నగా, నాజూగ్గా పాలిష్ చేసిన ఈ దొడ్డు బియ్యాన్ని తింటే ఆరోగ్యం సంగతి అంతేనని, అనేక వ్యాధులు కొనుక్కున్నట్టేనని, జీర్ణకోశ వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జరుగుతోంది ఇదీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద తెల్లరేషన్ కార్డుదారులకు రూపాయికే కిలో చొప్పున విక్రయిస్తున్న బియ్యంలో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు పక్కదారి పట్టి మాఫియా చేతిలోకి వెళ్తోంది. ఈ బియ్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లు, బియ్యం వ్యాపారులు కుమ్మక్కై గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా రీసైక్లింగ్ చేసి నాలుగైదు సార్లు పాలిష్ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు. సన్నబియ్యం పరిమాణానికి తగ్గట్టు 2.5 మి.మీ. పొడవు వచ్చేదాకా పాలిష్ చేసి, స్టీమ్ చేస్తున్నారు. ఈ పాలిష్ బియ్యాన్ని ఆకర్షణీయమైన బ్రాండ్ పేరుతో రంగు రంగుల ప్లాస్టిక్ సంచుల్లో బహిరంగ మార్కెట్లో రిటైల్ వినియోదారులకు అంటగట్టుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో దొడ్డు బియ్యానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ప్రవేశపెట్టినప్పట్నుంచీ ఈ బియ్యం మాఫియా మరింతగా బరితెగించింది. పేదలకు సబ్సిడీపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి మళ్లీ ప్రభుత్వానికే అధిక ధరకు అంటగట్టుతోంది. ఈ వ్యవహారంలో ఏటా రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయి. గతంలో విదేశాలకు.. ఇప్పుడు ఇక్కడే.. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో బియ్యం మాఫియా రూటు మార్చింది. గతంలో మండల స్థాయి స్టాక్(ఎంఎల్ఓస్) పాయింట్ల నుంచే నేరుగా దొడ్డు బియ్యం లారీలను కాకినాడ పోర్టుకు దారిమళ్లించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేది. నిత్యావసర సరుకుల రవాణా కోసం వినియోగించే లారీలకు జీపీఎస్ పరికరాలు అమర్చి వాటి కదలికలను పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తుండడంతో అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కున్నారు. గతంలో మాదిరి దొడ్డు బియ్యాన్ని విదేశాలకు తరలించడాన్ని తగ్గించేశారు. దానికి బదులు రేషన్‌దుకాణాలు, తెల్లకార్డుదారుల నుంచి పెద్దమొత్తంలో సమీకరించిన దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి మార్కెట్లోకి, రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టుతున్నారు.] సన్నబియ్యంగా 30 శాతం దొడ్డు బియ్యం రాష్ట్రంలో 8,50,450 తెల్లరేషన్ కార్డులు ఉండగా, 2.45 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ తెల్లకార్డుల లబ్ధిదారుల కోసం ప్రతి నెలా 1.65 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మిల్లర్ల నుంచి రూ.25 కిలో చొప్పున దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి సబ్సిడీపై రూపాయికి కిలో చొప్పున లబ్ధిదారులకు సరఫరా చేస్తోంది. రవాణా, హమాలీ చార్జీలు కలిపి కిలో బియ్యం వ్యయం రూ.26కు పెరిగిపోతోంది. అయితే ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం తినకుండా దాదాపు 30 నుంచి 40 శాతం లబ్ధిదారులు రూ.10కి కిలో చొప్పున రేషన్ డీలర్లకు, బియ్యం వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇలా పక్కదారిపట్టిన దొడ్డు బియ్యం వ్యాపారులు, డీలర్ల చేతి నుంచి తిరిగి మిల్లర్లకు చేరుతోంది. మిల్లర్లు ఈ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నంబియ్యం పేరుతో మళ్లీ ప్రభుత్వానికి, ప్రజలకు అంటగట్టుతున్నారు. వివిధ బ్రాండ్ల పేరుతో దాదాపు రూ.48 నుంచి రూ.60 కిలో చొప్పున విక్రయిస్తున్న సన్న బియ్యంలో సగానికి పైగా పాలిష్ చేసిన దొడ్డు బియ్యమే ఉంటున్నట్టు సమాచారం. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న మాఫియాపై పౌర సరఫరాల శాఖ సంస్థ గట్టి నిఘా పెట్టింది. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మారుస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే ముగ్గరు రైస్ మిల్లర్లు, మరో 5 మంది వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. త్వరలో మరో 8 మంది నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. పాత నల్లగొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచే రేషన్ బియ్యం ఎక్కువగా పక్కదారి పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. నిగనిగలాడే బియ్యం తయారు చేస్తున్నారిలా.. అప్పుడే కోసిన ధాన్యాన్ని ఉడకబెట్టి, ఆరబెట్టి, మిల్లింగ్ చేసి, ఆపై మిక్సింగ్ చేసి, గులాబీ రంగు పూసి పాత బియ్యంలా నిగనిగలాడేలా తయారు తయారు చేస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది పాత బియ్యం తినడానికే ఇష్టపడుతుంటారు. అన్నం మెత్తగా కాకపోవడం, పొడిపొడిగా ఉండటమే ఇందుకు కారణం. కానీ కొత్త బియ్యాన్ని పాత బియ్యం మాదిరే తయారు చేసి మార్కెట్లోకి పంపి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. కొందరు మిల్లరు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త బియ్యాన్ని పాత బియ్యంగా మారుస్తున్నారిలా.. అప్పుడే కోసిన (నిన్న కోసిన పంటను నేడు) ధాన్యాన్ని ముందుగా ఉడకబెడతారు. అది కూడా పూర్తిగా కాకుండా హాఫ్ బాయిల్ చేస్తారు. తర్వాత ఆరబెడతారు. ధాన్యం ఆరిపోయిన తర్వాత మిల్లింగ్ చేస్తారు. తర్వాత బియ్యానికి సిల్కీ పాలిషింగ్ చేస్తారు. దీంతో బియ్యం నునుపు వస్తుంది. అలా నునుపు వచ్చిన బియ్యం అచ్చం పాత బియ్యంలాగానే ఉంటుంది. ఈ బియ్యాన్ని, అంతకు ముందే పెట్టుకున్న అసలైన పాత బియ్యానికి 50:50 నిష్పత్తిలో కలుపుతారు. ఇలా కలిపిన పాత, కొత్త బియ్యానికి లేత గులాబీ రంగు పూత అద్దుతారు. బియ్యాన్ని ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇంత చేయడానికి మిల్లర్‌కు క్వింటాల్‌కు రూ.100 కన్నా కాస్త ఎక్కువ ఖర్చవుతుంది. ఇక రవాణా ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు పోను పాత బియ్యం పేరుతో కొత్త బియ్యాన్ని అమ్మితే ఇప్పుడున్న మార్కెట్ ధరలో క్వింటాల్‌కు రూ.750 వరకు మిల్లర్లు దండుకుంటున్నారని తెలుస్తోంది. ఎక్కడ చేస్తున్నారు..? బియ్యాన్ని ఉడకబెట్టే పారా బాయిల్డ్ పరిశ్రమ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువగా ఉండడంతో పాటుహైదరాబాద్కు రవాణా చేయడం సులువు కావడంతో అక్కడే ఈ దందా ఎక్కువ జరుగుతోందని సమాచారం. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మార్కెట్లలో కొన్న కొత్త ధాన్యాన్ని హైవే మీద సూర్యాపేట నుంచి చిట్యాల వరకు ఉన్న పారా బాయిల్డ్ మిల్లుల్లో ఉడకబెట్టిస్తున్నారని, నాగార్జునసాగర్ ఆయకట్టులోని ధాన్యాన్ని మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడల్లోని మిల్లులో ఉడకబెట్టిస్తున్నారని తెలుస్తోంది. నల్లగొండతో పాటు కల్వకుర్తిలో కూడా కొంత బాయిల్ చేస్తున్నారు. ఇలా బాయిల్ చేసిన బియ్యాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగలపల్లి, బొంగులూరు సమీపంలో ఉన్న వందలాది మిల్లుల్లో మర పట్టించి, ప్యాక్ చేసే ప్రక్రియ నడుస్తుందనే ఆరోపణలున్నాయి. అక్కడ్నుంచి హైదరాబాద్‌లో ఉన్న కర్మాన్‌ఘాట్ బియ్యం హోల్‌సేల్ మార్కెట్‌కు తరలించి అక్కడ మార్కెట్ చేస్తారని సమాచారం. ఐదు ప్రత్యేక బృందాలతో తనిఖీలు రాష్ట్రంలో రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల సంస్థ ఐదు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులు, రేషన్ షాపుల్లో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిపిన దాడుల్లోనే 1795.32 టన్నుల బియ్యం పట్టుబడింది. ప్లాస్టిక్ బియ్యం వదంతుల నేపథ్యంలో దాడులు మరింత పెంచేందుకు సన్నద్ధమవుతోంది. సన్న బియ్యం కాదు.. దొడ్డు బియ్యం.. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన 35 ఏళ్ల వెంకటేశ్ ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఏ మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం తప్ప తగ్గడం లేదు. దీంతో నగరంలో పేరుపొందిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడిని కలిశాడు. జీర్ణవ్యవస్థ దెబ్బతిందని డాక్టర్ తేల్చారు. జీర్ణకోశ వ్యాధి ముదిరిందని, అల్సర్స్ ఏర్పడుతున్నాయని, తక్షణమే వైద్యం చేయించుకోకపోతే కేన్సర్‌కు దారితీస్తుందని హెచ్చరించారు. తాను వాడుతోంది సన్నబియ్యమని, స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేస్తానని డాక్టర్‌కు వెంకటేశ్ వివరించాడు. చివరకు అతను తినేది దొడ్డుబియ్యాన్ని సన్నబియ్యంగా మార్చిన బియ్యమని తేలింది. జీర్ణవ్యవస్థకు దెబ్బ: డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, హైదరాబాద్ పాలిష్, ఇతరత్రా కల్తీ బియ్యంతో జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అన్నం అరగాలంటే ఎంజైములు అవసరం. అలాంటి ఎంజైములను ప్లాస్టిక్ రైస్ నాశనం చేస్తాయి. అత్యంత విషపూరితమైన యాసిడ్స్ రక్తంలోకి చేరుతాయి. ఇవన్నీ దీర్ఘకాలంలో కేన్సర్‌కు దారితీస్తాయి. రీసైక్లింగ్‌తో ప్రోటీన్లు పోతాయి: డాక్టర్ కె.రాకేశ్, సీనియర్ కన్సల్టెంట్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు, ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ కల్తీ, ప్లాస్టిక్ బియ్యంతో పొట్ట ఉబ్బరం ఏర్పడుతుంది. మలబద్దకం ఏర్పడుతుంది. కేన్సర్‌కు దారితీస్తుంది. దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేయడం వల్ల ప్రొటీన్లు పోతాయి. దీంతో పిల్లలు, పెద్దల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి. ఆస్ట్రియో ఫోరోసిస్కు దారి తీస్తుంది: డాక్టర్ టి.దశరథరామిరెడ్డి, ఛీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద ఆసుపత్రి, హైదరాబాద్ అధికంగా పాలిష్ చేసిన బియ్యంతో ఎముకలకు సరిపడా పోషకాలు అందవు. దీంతో ఆస్ట్రియోఫోరోసిస్ వ్యాధి వస్తుంది. చిన్నచిన్న దెబ్బలకే ఎముకలు విరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ప్లాస్టిక్ బియ్యం ఎక్కడా దొరకలేదు: సీవీ ఆనంద్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ ప్లాస్టిక్ బియ్యాన్ని ఇప్పటివరకు ఎక్కడా కనుగొనలేదు. ఎక్కడా దొరకలేదు. మీర్‌పేటలో దొరికిన ప్లాస్టిక్ బియ్యంగా చెప్పే వాటిని పరీక్షించాం. అందులో ప్లాస్టిక్ బియ్యం లేదని ప్రాథమికంగా నిర్ధారించాం. పాలు, పళ్లు అన్నీ కల్తీ అవుతోన్న నేపథ్యంలో బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కల్తీ అవుతున్నాయన్న వాదనను తోసిపుచ్చలేం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలకు ఆదేశాలిచ్చాం. ప్లాస్టిక్ బియ్యముంటే అవి నీటిలో తేలుతాయి. అవి ప్లాస్టిక్‌వి కావు: మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయన్నది అపోహ. అవి హాఫ్ బాయిల్డ్ బియ్యం. ప్రభుత్వ అధికారుల అలసత్వం కారణంగా ఈ బియ్యం విచ్చలవిడిగా మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. కొందరు మిల్లర్ల దురాశే ఈ పరిస్థితికి కారణం -దేవరకొండ నాన్ ట్రేడింగ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా భువనేశ్వర్ -
పాలిష్ పట్టిన బియ్యంలో లోపించే విటమిన్?
విటమిన్లను మొట్టమొదట ఫంక్ కనుగొన్నాడు. విటమిన్లు రెండు రకాలు అవి.. 1. కొవ్వులో కరిగే విటమిన్లు 2. నీటిలో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో కరుగుతాయి. ఇవి కాలేయంలో నిల్వ ఉంటాయి. నీటిలో కరిగే బి, సి విటమిన్లు దేహంలో నిల్వ ఉండవు. విటమిన్ ఎ రసాయన నామం- రెటినాల్ విటమిన్ ఎకు ఉన్న మరో పేరు యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ విటమిన్ ఎ కంటిలో ఉండే రొడాప్సిన్ అనే వర్ణక పదార్థాన్ని సంశ్లేషణ చేయడానికి తోడ్పడుతుంది. మొక్కల్లో విటమిన్ అ.. ఛ కెరోటిన్ రూపంలో లభ్యమవుతుంది. కాలేయం ఛ కెరోటిన్‌ను విటమిన్ అగా మారుస్తుంది. విటమిన్ అ అధికంగా లభించే మొక్కలు.. ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, మునగ, ఎర్రగుమ్మడి జంతువుల్లో విటమిన్ అ అధికంగా లభించేవి - పాలు, గుడ్లు, మాంసం, లివర్. ముఖ్యంగా షార్‌క లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్ విటమిన్ అ లోపం వల్ల వచ్చే వ్యాధులు: - రేచీకటి (నైక్ట్టాలోపియా) - జిరాఫ్తాల్మియా (పొడికన్ను), కెరటో మలేసియా విటమిన్ అ కాలేయంలో నిల్వ ఉంటుంది రేచీకటి: దీన్నే నైక్ట్టాలోపియా అంటారు. దీని వల్ల కాంతి తక్కువగా ఉన్నప్పుడు సరిగ్గా కనిపించదు. జిరాఫ్తాల్మియా: కంటిలో కన్నీటిని స్రవించే లాక్రిమల్గ్రంథులు ఎండిపోతాయి. ఫలితంగా కను గుడ్లు పొడిగా మారతాయి. విటమిన్ అ ఎపిథీలియల్ కణాలను ఆరోగ్యం గా ఉంచుతుంది. అందువల్లే ఫేస్ క్రీముల్లో విటమిన్ అను కూడా కలుపుతారు. విటమిన్ అ లోపం వల్ల చర్మం గరుకుగా మారుతుంది. విటమిన్ అ లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. విటమిన్ డి రసాయన నామం- కాల్సీఫెరాల్ విటమిన్ ఇ రసాయన నామం- టోకోఫెరాల్ విటమిన్ కె రసాయన నామం - నాఫ్తోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్ విటమిన్ సి రసాయన నామం - ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ బి1 రసాయన నామం - థయమిన్ విటమిన్ బి2 రసాయన నామం - రిబోఫ్లేవిన్ విటమిన్ బి3 రసాయన నామం - నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం విటమిన్ బి5 రసాయన నామం - పాంటోథెనిక్ ఆమ్లం విటమిన్ బి6 రసాయన నామం - పైరిడాక్సిన్ విటమిన్ బి12 రసాయన నామం - సయనోకోబాలమిన్ విటమిన్ బి7 రసాయన నామం - బయోటిన్ విటమిన్ బి9 రసాయన నామం - ఫోలిక్ ఆమ్లం విటమిన్ అకి ఉన్న మరొక పేరు - యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ విటమిన్లు - మారు పేర్లు విటమిన్ డి - సన్‌షైన్ విటమిన్, యాంటీ రికెట్స్ విటమిన్ విటమిన్ ఇ - బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్ విటమిన్ కె - కొయాగ్యులేషన్ విటమిన్, యాంటీ హేమరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్ విటమిన్ బి1 - యాంటీ బెరిబెరి విటమిన్ విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్) - విటమిన్ జి, వోవో ఫ్లేవిన్ (ౌఠిౌ జ్చఠిజీ) విటమిన్ బి3 (నియాసిన్) - యాంటీ పెల్లాగ్రా విటమిన్ విటమిన్ సి - యాంటీ స్కర్వీ విటమిన్ విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు: 1. రికెట్స్ (ఎక్కువగా చిన్న పిల్లల్లో) 2. ఆస్టియో మలేసియా (ఎక్కువగా యువతీ, యువకుల్లో) 3. ఆస్టియోపీనియా (వృద్ధుల్లో కండరాలు, ఎముకలు బలహీనపడటం) విటమిన్ ఇ లోపం వల్ల వచ్చే సమస్యలు 1. మగవారిలో వంధ్యత్వం కలిగి, శుక్ర కణాల ఉత్పాదన జరగదు. 2. ఆడవారిలో గర్భస్రావాలు జరుగుతాయి. 3. వంధ్యత్వం కలుగుతుంది. విటమిన్ కె: రక్తం త్వరగా గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్‌ను శస్త్ర చికిత్సకు ముందు రోగులకు ఇస్తారు. విటమిన్ కె లోపం వల్ల రక్తం గడ్డకట్టదు. దాంతో అధిక రక్తస్రావం జరుగుతుంది. విటమిన్ కె రక్త స్కంధనానికి తోడ్పడుతుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ విటమిన్ సి... వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వేడి చేస్తే విచ్ఛిన్నమయ్యే విటమిన్ - విటమిన్ సి గాయాలు త్వరగా మానేందుకు సహాయపడే విటమిన్ - విటమిన్ సి ఉసిరి, జామకాయ, నిమ్మ, నారింజ వంటి పుల్లగా ఉండే ఫలాల్లో ఎక్కువగా ఉండేది - విటమిన్ సి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ -విటమిన్ సి స్కర్వీ వ్యాధి లక్షణాలు: చిగుళ్లు వాచి రక్తం కారడం విటమిన్ బి1 (థయమిన్) లోపం వల్ల వచ్చే వ్యాధి - బెరిబెరి విటమిన్ బి1 లోపం వల్ల పక్షుల్లో వచ్చే వ్యాధి - పాలీన్యూరైటిస్ బియ్యం పొట్టు తీయడం లేదా పాలిష్ చేయడం వల్ల కోల్పోయే విటమిన్ - థయమిన్ తవుడులో అధికంగా ఉండే విటమిన్ - థయమిన్ చాలా రకాల ధాన్యాల్లో థయమిన్ పైపొరల్లోనే ఉంటుంది. మర పట్టినప్పుడు ఈ పొరలు పోతాయి. అందుకే తెల్లని పాలిష్ పట్టిన బియ్యంతో వండిన అన్నం తినే వాళ్లలో థయమిన్ లోపం ఏర్పడుతుంది. ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం తినే వాళ్లకు ఈ జబ్బులు రావు. థయమిన్ లోపం వల్ల గుండె సామాన్యంగా ఉండే సైజు కంటే పెద్దగా అవుతుంది. దీన్నే కార్డియో మెగాలి అంటారు. గుండె నీరసంగా కొట్టుకొని కాళ్లలో వాపు వస్తుంది. కాఫీలు, టీలు, వక్కపొడి, జర్దా ఎక్కువగా తీసుకుంటే మనం తీసుకొనే ఆహారంలో ఉన్న థయమిన్ శరీరంలోని కణాలకు అందదు. ఆయా పదార్థాల్లో ఉండే రసాయన పదార్థాలు థయమిన్ను పనికి రాకుండా చేస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వారిలో థయమిన్ లోపం ఉంటుంది. విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్) పాలు, గుడ్లు, కాలేయం, ఆకుకూరల్లో లభిస్తుంది. ఈ విటమిన్ నోటిపూతను అరికడుతుంది. విటమిన్ బి7 (బయోటిన్)ను దీన్నే విటమిన్ హెచ్ అని కూడా అంటారు. ఈ విటమిన్‌ను జుట్టు, గోర్లు బాగా పెరగడానికి డాక్టర్లు సిఫార్సు చేస్తారు. బయోటిన్‌ను పలు సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతున్నారు. ఉడకబెట్టని పచ్చి గుడ్డును ఆహారంగా తీసుకునే వారిలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది. బయోటిన్ లోపం వల్ల అలోపేసియా (జుట్టు ఊడిపోవడం) కలుగుతుంది. కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం, గోర్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే వ్యాధి - పెర్నీషియస్ అనీమియా ఫ్రీరాడికల్స్ ప్రభావం నుంచి రక్షించే విటమిన్ - విటమిన్ ఉ విటమిన్ ఉను శిశు జనన కారకం అంటారు. విటమిన్ ఉ-చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. క్రీడా సామర్థ్యాన్ని పెంచుతుంది. విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు: సార్ట్టైన్ చేపలు, పాలు, గుడ్లు, కాడ్‌లివర్ ఆయిల్, ట్యూనా చేపలు, పుట్ట గొడుగులు విటమిన్ ఉ అధికంగా లభించే ఆహార పదార్థాలు: బాదం, నువ్వులు, గుమ్మడి కాయ గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, వేరుశనగ, అవకాడో. విటమిన్ కె అధికంగా లభించే ఆహార పదార్థాలు: ఆకుకూరలు, క్యాబేజి, బ్రకోలి-పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా విటమిన్ కెను ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ బి1 (థయమిన్) అధికంగా లభించే పదార్థాలు: గోధుమ వంటి ధాన్యాలు, నువ్వు గింజలు, పాలు, మాంసం, వేరుశనగ గింజలు, చేపలు, గుడ్లు. విటమిన్ బి2 అధికంగా లభించే పదార్థాలు: పాలు, గుడ్లు, ఆకుకూరలు. విటమిన్ బి12 - సయనోకోబాలమిన్: ఆహార పదార్థాల్లో లభించదు. పేగుల్లోని బ్యాక్టీరియాలు దీన్ని సంశ్లేషణ చేసి శరీరానికి అందిస్తాయి. -
బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి..
హైదరాబాద్ సిటీ: ఎస్ఆర్ నగర్లో బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారంతో ఉడాయించారు. సబీనా సుల్తానా అనే మహిళ దృష్టి మరల్చి 3.8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫర్నిచర్‌ను ఇలా కాపాడుకోండి
ఇంటిప్స్ కలప ఫర్నిచర్‌పై దుమ్ము పేరుకుపోతే, మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే ఫర్నిచర్‌పై గీతలు పడకుండా ఉంటుంది.ఆయిల్‌తో తయారు చేసే పాలిష్‌ను కలప ఫర్నిచర్‌కు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా పూర్తి ఆలివ్ ఆయిల్‌తో కూడిన పాలిష్‌లు ఫర్నిచర్‌కు మెరుపునిస్తాయి గానీ, వాటిపై త్వరగా వేలిముద్రలు, ఇతర మరకలు పడతాయి. అలా కాకుండా, సిలికాన్ ఆయిల్‌తో కూడిన పాలిష్‌లు వాడితే, కలప ఫర్నిచర్‌కు మరింత రక్షణగా ఉంటుంది.పాతబడిన ఫర్నిచర్‌కు మెరుపు తెప్పించాలంటే, ఆలివ్ ఆయిల్, డీనేచర్డ్ ఆల్కహాల్, టర్పంటైన్ మిశ్రమంతో పాలిష్ చేయవచ్చు. -
కుక్కర్ లో వేడి చేస్తే మెరుగవుతాయని..
చెన్నూరు(వైఎస్సార్ జిల్లా): నగలకు మెరుగుపెడతామని చెప్పి ఒక మహిళను మోసం చేసి 12 తులాల బంగారు ఆభరణాలతో ఇద్దరు దుండగులు ఉడాయించారు. ఈ సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని రెడ్డి వారి వీధిలో జరిగింది. వివరాలు.. రెడ్డివారివీధికి చెందిన లక్షమ్మ ఇంటికి ఇద్దరు వ్యక్తులు నగలకు మెరుగుపెడతామని వచ్చారు. దీంతో లక్షమ్మ తన వద్ద ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చింది. కాగా, ఈ ఆభరణాలకు రసాయనాలు వేశాం కుక్కర్లో వేడి చేస్తే మెరుగవుతాయని చెప్పి వెళ్లిపోయారు. మహిళ వారు చెప్పినట్లుగానే వేడి చేసి చూడగా కుక్కర్లో నగలు కనిపించకపోవడంతో లభోదిబోమంది. మోసం పోయానని గ్రహించిన లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
గోరంత అందానికి
నఖ సౌందర్యం దూదితో కొద్దిగా పాలిష్ రిమూవర్‌ని అద్దుకొని అప్పటికే గోర్లకు ఉన్న రంగును రుద్దుతూ తీసేయాలి. నెయిల్ పాలిష్ ఉన్నా లేకపోయినా ఇలాగే చేయాలి. దీని వల్ల కంటికి కనిపించని మలినాలు కూడా తొలగిపోతాయి. వేళ్ల చర్మం భరించగలిగేటంత నీటిని ఒక గిన్నెలోకి , చల్లని నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడినీటి గిన్నెలో 5-8 నిమిషాలు గోళ్లు మునిగేలా వేళ్లను ఉంచాలి. గోళ్లు మెత్తబడినట్టు మీకే తెలుస్తుంది. మెత్తటి పొడి టవల్‌తో నీళ్లు లేకుండా తుడవాలి. నెయిల్ కటర్‌తో మీడియమ్ లెంగ్త్‌లో గోర్లను కట్ చేసుకోవాలి. మెత్తబడిన గోరును సరైన షేప్‌లో కట్చేసుకోవడం చాలా సులువు. నెయిల్ ఫిల్లర్‌తో ఒక్కో గోరు చివర భాగంలో రబ్ చేయాలి. క్యుటికల్ ఆయిల్‌ను గోరుచుట్టూ రాయాలి. ఇందుకోసం ఆలివ్ లేదా జొజొబా నూనెను వాడచ్చు. ఒక్కో వేలికి ఒక్కో డ్రాప్ ఆయిల్ తీసుకొని, క్లాక్‌వైజ్‌గా తరువాత యాంటీ క్లాక్‌వైజ్ డెరైక్షన్‌లో వేలితో మసాజ్ చేయాలి. గోరుచుట్టూ ఉన్న మృత చర్మకణాలు ( క్యుటికల్స్) క్యుటికల్ పుషర్తో తొలగించాలి. (నెయిల్ కిట్‌లోనూ లేదా షాపులో విడిగానూ క్యుటికల్ పుషర్స్ లభిస్తాయి) ఆరోగ్యకరమైన గోర్లకు క్యుటికల్స్ చాలా ముఖ్యమైనవి. ఈ ప్లేస్లోనే బాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశాలు ఉంటాయి. అందుకే చర్మానికి హాని కలగకుండా క్యుటికల్స్ను అత్యంత జాగ్రత్తగా శుభ్రపరచాలి. (ఇందుకోసం మరో 10 నిమిషాల సమయం పడుతుంది) హ్యాండ్ లోషన్‌ని వేళ్లకు, చేతులకు మాత్రమే ఉపయోగించాలి. పారపాటున గోర్ల మీద నూనె, మాయిశ్చరైజర్ ఉంటే తుడిచేయాలి. క్లియర్ బేస్ కోట్ని ప్రతి గోరుకు వేయాలి.