వజ్రాభరణాలు : షైనింగ్‌ పోకుండా ఉండాలంటే ఎలా? పాలిష్‌ చేయించొచ్చా?! | How to Protect and Maintain diamond jewellery tips | Sakshi
Sakshi News home page

వజ్రాభరణాలు : షైనింగ్‌ పోకుండా ఉండాలంటే ఎలా? పాలిష్‌ చేయించొచ్చా?!

Published Sat, Nov 2 2024 5:08 PM | Last Updated on Sat, Nov 2 2024 6:30 PM

How to Protect and Maintain diamond jewellery tips

పండుగలు పెళ్లిళ్లలో అందమైన పట్టుచీరకు, డైమండ్‌ నగలు మరింత అందాన్ని తెస్తాయి. ఒకసారి వేసుకొని మర్చిపోయేవుకాదు డైమండ్‌ ఆభరణాలు అంటే. చాలా ఖరీదైనవి కూడా.  ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప  చేసే డైమండ్‌ నగలు మెరుపు పోకుండా షైనింగ్‌ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్‌ మీకోసం!

  • స్నానం చేసేటప్పుడు డైమండ్‌ ఆర్నమెంట్స్‌ను తీయాలి. మైల్డ్‌ సోప్, మైల్డ్‌ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.

  • రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్‌లెట్‌లు ఎక్కువగా సొల్యూషన్‌ బారిన పడుతుంటాయి. వాతావరణంలో  సొల్యూషన్‌ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్‌ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్‌ మెరుపు తగ్గుతుంది. 

  • వేడి నీటిలో లిక్విడ్‌ సోప్‌ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. 

  • బేకింగ్‌ సోడా మంచి క్లీనింగ్‌ ఎలిమెంట్‌. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్‌ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్‌ సోడా వాడకూడదు. 

  • పైన చెప్పుకున్నవి కట్‌ డైమండ్స్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్‌కట్‌ డైమండ్స్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. 

  • ఆభరణం తయారీలో అన్‌కట్‌ డైమండ్‌ వెనుక సిల్వర్‌ ఫాయిల్‌ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్‌కట్‌ డైమండ్‌ ఆర్నమెంట్స్‌ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.

  • ఇటీవల వేడుకల్లో ఎయిర్‌కూలర్‌లో పెర్‌ఫ్యూమ్‌ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్‌కట్‌ డైమండ్‌ ఆర్నమెంట్స్‌ నల్లబడే ప్రమాదముంది. అన్‌కట్‌ డైమండ్‌ ఆర్నమెంట్‌ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్‌ చేయించుకోవాలి.

  • ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్‌ బాక్సులకు ముఖమల్‌ క్లాత్‌ని గమ్‌తో అతికిస్తారు. డైమండ్‌ ఆర్నమెంట్స్‌ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్‌ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్‌ మీద అమర్చి భద్రపరుచుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement