shining
-
వజ్రాభరణాలు : షైనింగ్ పోకుండా ఉండాలంటే ఎలా? పాలిష్ చేయించొచ్చా?!
పండుగలు పెళ్లిళ్లలో అందమైన పట్టుచీరకు, డైమండ్ నగలు మరింత అందాన్ని తెస్తాయి. ఒకసారి వేసుకొని మర్చిపోయేవుకాదు డైమండ్ ఆభరణాలు అంటే. చాలా ఖరీదైనవి కూడా. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్‌ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్‌కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్‌కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్‌కూలర్‌లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్‌ని గమ్‌తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్‌ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
పసుపు చీరలో ముద్దబంతిలా మెరిసిపోతున్న కావ్య థాపర్ (ఫొటోలు)
-
బాడీ స్క్రబ్ : మీ శరీరానికి ఏది మంచిదో గుర్తించండి!
వాతావరణ పరిస్థితులు ,మారుతున్న జీవనశైలి కారణంగా శరీరం, ముఖ్యంగా ముఖం ట్యాన్‌కు గురవుతుంది. యూవీ కిరణాల ప్రభావంతో పాటు, ఫ్రీ రాడికల్స్ , కాలుష్యం కూడా దీనికి కారణం. కాబట్టి, ముఖంతో పాటు శరీరానికి కూడా సమానమైన శ్రద్ధ ,రక్షణ అవసరం. దీనికి క్రమం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అవసరం. కేవలం సబ్బు బార్ లేదా షవర్ జెల్ లాంటివాటికి మాత్రమే పరిమితం కాకుండా, సహజమైన ,యవ్వన రూపాన్ని తిరిగి పొందడానికి, శరీరానికి తగ్గట్టు బాడీ పాలిష్, బాడీ స్క్రబ్, ఎక్స్ఫోలియేషన్ లాంటి వాటిని ఎంచుకోవాలి.బాడీ పాలిషర్ లేదా బాడీ ఎక్స్ఫోలియేట్ ద్వారా రక్త ప్రసరణపెరుగుతుంది. బాడీ స్క్రబ్ డెడ్ స్కిన్ కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని శుభ్రపర్చి మెరిసేలా చేస్తుంది. కొల్లాజెన్‌ను ప్రేరేపిస్తుంది, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఎలా చేసుకోవాలి?అయితే చర్మం మీద మృతకణాలను తొలగించి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్క్రబ్‌ను ప్రతిసారీ మార్కెట్లో కొనాల్సిన పనిలేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ ఓట్స్, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ పాలు, అర కప్పు నీరు తీసుకోవాలి. ఓట్స్‌ను నీటిలో ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత మిగిలిన అన్నింటినీ వేసి కలిపితే స్క్రబ్ రెడీ. ఈ ప్యాక్ వేసుకునే ముందు సబ్బుతో ముఖం, చేతులను కడిగి తుడుచుకోవాలి. ప్యాక్‌ను సమంగా పట్టించి పది లేదా పదిహేను నిమిషాల నాటు అలాగే ఉంచాలి. చర్మానికి పట్టినట్లు బిగుసుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా మర్దన చేయాలి. అలా పది నిమిషాల సేపు మర్దన చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి మార్కెట్లో దొరికే స్క్రబ్లాగ ఫ్రూట్ ఫ్లేవర్లతో కావాలనుకుంటే ఇష్టమైన పండ్ల గుజ్జును కూడా కలుపుకోవచ్చు. ఎలాంటి స్కిన్‌కు ఎలాంటి స్క్రబ్ వాడాలి?పొడిచర్మం వాళ్లు పుల్లటి పండ్ల జోలికి వెళ్లవకూడదు. పొడి (లేదా ఫ్లాకీ) చర్మానికి గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు తప్పనిసరిగా రెగ్యులర్ స్క్రబ్బింగ్ స్కిన్‌కేర్ రొటీన్‌కు దూరంగా ఉండాలి. వారానికి ఒకసారి, తేలికపాటి కెమికల్ ఎక్స్‌ఫోలియేటర్‌ను ప్రయత్నించవచ్చు. మెత్తగా, లాక్టిక్ యాసిడ్‌తో ఉండేలా చూసుకోవాలి.జిడ్డు చర్మం ఉన్నవారికి బాడీ స్క్రబ్ వలన ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్, బాంబూచార్కోల్ బెటర్. ఇవి కఠినమైన మచ్చల్న తొలగించి, మృదువైన వెల్వెట్ ఫీలింగ్ నిస్తాయి. ఇక సమస్య లేని, సాధారణమైన చర్మం ఉన్నవారికి pH బ్యాలెన్స్డ్ క్లెన్సర్ , స్క్రబ్‌ని ఉత్తమం. -
నేచురల్‌గా ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోండిలా!
సీజన్ ఏదైనా పెదవుల రక్షణకు లిప్ బామ్ వాడటం తప్పనిసరి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పొడిబారిపోకుండా ఉండాలన్నా అంతా వాటి సంరక్షణ అవసరం. పెదవుల్ని హైడ్రేటెడ్‌గా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేందుకు లిప్ బామ్ తోడ్పడుతుంది. పెదాలు పగిలిపోవడం లాంటి సమస్యల నివారణతోపాటు, యూవీ కిరణాల నుంచిరక్షణ కల్పిస్తాయి. కానీ మార్కెట్లో దొరికే ఖరీదైన, రసాయన బామ్‌లకు బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకొని, ఇంట్లోనే వాటిని తయారు చేసుకొని సరైన పోషణ లభించేలా చేయవచ్చు.లిప్ బామ్ తయారీరెండు టీ స్పూన్ల మైనం, టీ స్పూన్ కోక్ పౌడర్, రెండు టీ స్పూన్లు బాదం నూనె, 5–6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మైనాన్ని కరిగించాలి. దీంట్లో కోక్ పౌడర్ వేసి బాగా కలపాలి. కోక్ పౌడర్ బాగా కలిసిపోయాక బాదం నూనె, ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని ఒక చిన్న బాటిల్లో భద్రపరుచుకొని రోజుకు రెండు మూడుసార్లు పెదవులకు రాసుకోవాలి. ఈ బామ్ పెదవుల పగుళ్ల సమస్యను నివారిస్తుంది. ఇంట్లో లిప్ బామ్‌ను తయారు చేసుకోవడం వల్ల హానికరమైన రసాయన పదార్థాలను నియంత్రించవచ్చు. అలాగే కృత్రిమ సువాసనలను లేదా ఇతర హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండవచ్చు. -
అనంత్ అంబానీ పెళ్లిలో ధగధగ మెరిసిపోతున్న దేవర భామ.. పోటోలు
-
నీలం బంగారు గౌనులో మెరిసిపోతున్న శ్లోకా మెహతా..! (ఫొటోలు)
-
Healthy and Shiny Hair: జుట్టు వేగంగా పెరగాలంటే ఈ విత్తనాలు తప్పక తినాలి..!
నల్లని ఒత్తైన జుట్టు అందరికీ ఇష్టమే! ఐతే రోజువారీ పనుల్లో పడి కేశ సౌందర్యానికి తగినంత శ్రద్ధ తీసుకోవడం కుదరట్లేదనేది ఎక్కువ మంది చెప్పే కారణం. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం ఆరోగ్య ఆహారం మాత్రమే తీసుకుంటే జుట్టు సంబంధిత సమస్యలు దూరం కావు. అవసరమైన నూట్రీషన్లు, ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు కూడా అందుతున్నాయో లేదో గమనించుకోవాలి. ఇవన్నీ కేవలం పండ్లలో మాత్రమే దొరుకుతాయని అనుకుంటే పొరపాటే. రకరకాల విత్తనాల్లో కూడా ఈ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని పచ్చిగా లేదా ఉడికించి ఎలా తిన్నా మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడతాయి. వెంట్రుకల ఆరోగ్యనికి మేలు చేసే విత్తనాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. అవిసె గింజలు ఈ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని నివారించి, మాడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వీటిల్లో ప్రొటీన్లు, మ్యాగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. నువ్వులు నల్లని లేదా తెల్లని నువ్వుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించి, సహజంగా మెరిసేలా చేస్తుంది. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! పొద్దు తిరిగుడు గింజలు పొద్దు తిరిగుడు గింజల్లో విటమిన్ ‘ఇ’తోపాటు ఇతర పోషకాలు చర్మ, జుట్టు సంబంధిత సమస్యల నివారణలో కీలకంగా వ్యవహరిస్తాయి. గుమ్మడి విత్తనాలు జుట్టు సమస్యలను ఎదుర్కొవడంలో గుమ్మడి విత్తనాల తర్వతే ఏదైనా అని చెప్పవచ్చు. గుమ్మడి విత్తనాలను పోషకాల గని అనికూడా అంటారు. దీనిలో జింక్, మాగ్నీషియం, కాల్షియం, ఐరన్.. వంటి ఎన్నోఖనిజాలు ఉంటాయి. వెంట్రుకలు చిట్లడాన్ని, ఊడటాన్ని నివారిస్తుంది కూడా. చియా విత్తనాలు వీటిల్లో ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లతోపాటు ముఖ్యమైన ఖనిజాలు జుట్టు ఆరోగ్యం పెరగడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా చియా విత్తనాలల్లోని ఐరన్, సెలీనియం వెంట్రుకల కుదుళ్లను బలపరచి, వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. చదవండి: Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్! -
ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది..
చర్మ సౌందర్యానికి అతివలు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు. చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి, ముడతలు రాకుండా ఉండటానికి ఫేస్‌మాస్కులు వేసుకోవడం, క్రీములు, లోషన్లు పూసుకోవడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య తగ్గకపోగా, మరింత పెరుగుతుంది. చర్మాన్ని మృదువుగా, ముడతలు రాకుండా చూసుకోవడానికి ఇప్పుడు అంత కసరత్తు అవసరం లేదు. ప్రత్యామ్నాయ పరిష్కారంగా సరికొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వచ్చింది. అదే ఈ ‘క్లినికల్ మైక్రోడెర్మాబ్రేషన్ మెషిన్’. క్లినికల్ పరీక్షల్లో ఈ గాడ్జెట్ పనితీరు సమర్థంగా నిరూపితమైంది. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా, టోనింగ్ చేస్తుంది. ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం ‘స్పా’ చేసినట్లుగా తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందులోని మైక్రోడెర్మ్ గ్లో సిస్టమ్ ముఖ చర్మానికి అధునాతన హోమ్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అత్యంత సులభంగా మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసి, వయసు ప్రభావాన్ని వెనక్కు నెట్టేస్తుంది. త్రీడీ టెక్నాలజీతో రూపొందిన ఈ గాడ్జెట్ అన్ని రకాల చర్మాలకూ సురక్షితమైనదే. ఇది పూర్తిగా వైర్లెస్,రీఛార్జబుల్. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు. వారానికి ఒకసారి నాలుగు నిమిషాలసేపు ముఖానికి దీంతో ట్రీట్మెంట్ ఇస్తే, మంచి ఫలితం ఉంటుంది. ఈ గాడ్జెట్ ముందు భాగంలోని డిస్ప్లేలో స్పీడ్, మోడ్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. డిస్ప్లే కింద పవర్ బటన్, స్పీడ్ పెంచుకునే బటన్, స్పీడ్ తగ్గించుకునే బటన్ వరుసగా ఉంటాయి. దీనిని ముఖంతో పాటు మెడ, చేతులు, కాళ్లు వంటి ఇతర భాగాలలోనూ ఉపయోగించుకోవచ్చు. దీని ధర 200 డాలర్లు (సుమారు రూ.15,000). -
ఈ నాణేలు ప్రకాశిస్తాయి..
అమలాపురం టౌన్: పసిఫిక్ మహా సముద్రంలో ఫ్రెంచి పాలినేషియా, కిరిబాటి, కెయిర్న్ ద్వీపాల మధ్య ఉన్న అందమైన దీవి క్రెసెంట్. ఈ దీవి ప్రభుత్వం విడుదల చేసిన చీకట్లో మెరిసే నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ఈ దీవి ప్రజలు చాలా కాలం డబ్బుకు బదులుగా ముత్యాలనే వాడేవారు. క్రెసెంటీస్ భాషలో ‘పోవా’ అంటే ముత్యమని అర్థం. 2006లో 500, 1,000, 5,000 పోవా ముఖ విలువ కలిగిన నాణేలను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నాణేలను యాక్రిలిక్ పదార్థంతో తయారు చేశారు. వీటి తయారీలో ఫ్లోరోసెంట్ పదార్థం వాడడంవల్ల అవి చీకట్లో మెరుస్తాయి. నాణేలను 39 మిల్లీమీటర్ల వ్యాసంతో, 5 మిల్లీమీటర్ల మందంతో గుండ్రని ఆకారంలో రూపాందించారు. వీటిపై ఉదయిస్నున్న సూర్యుడు, కొబ్బరి చెట్టు ముద్రించారు. ఇవి నీలం, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో పారదర్శకంగా ఉండి అక్కడి ప్రజల జీవన శైలిని ప్రతిబింబిస్తాయని కామేశ్వర్ చెప్పారు. -
మెరిసిన ‘మేడిన్ ఇండియా’
‘నీ పేరు గూగుల్ అయినట్టూ, అన్నీ తెలిసినట్టూ మాట్లాడుతున్నావే...’ కుర్రకారులో చమత్కారంగా దొర్లే సంభాషణల్లో ఇదొకటి. నిజమే... ఇరవైయ్యేళ్ల క్రితం గూగుల్ ఆవిర్భవించి ఉండకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవి కాదని, మన అవగాహనకు ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వసిస్తున్నారు. అందులోని నిజానిజాల సంగతలా ఉంచి చాలా స్వల్ప కాలంలోనే అంతటి విశ్వసనీయతను సాధించడం అసాధారణం...అపూర్వం. సృజనాత్మకత లోనూ, ఉన్నత సాంకేతికతలోనూ అనునిత్యం ఆధిక్యతను సాధించాలన్న తపనే ఆ రంగంలో గూగుల్ సంస్థను అత్యున్నత శిఖరాగ్రంపై నిలబెట్టింది. అదిప్పుడు 1,600 కోట్ల డాలర్ల లాభాలతో ప్రపంచంలో ఉన్నతశ్రేణి టెక్నాలజీ కంపెనీగా వెలుగులీనుతోంది. అలాంటి సంస్థకు ఒక భారతీయుడూ, అందునా దక్షిణాదివాడూ అయిన సుందర్ పిచాయ్ సీఈఓ కాబోతున్నాడంటే సహజంగానే అందరూ గర్వపడతారు. ఇప్పటికే మరో రెండు పెద్ద సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. నిరుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల సారథ్యాన్ని స్వీకరించారు. అలాగే హ్యాండ్సెట్ల వ్యాపారంలో ఉన్న ప్రముఖ సంస్థ నోకియాకు రాజీవ్ సూరి సీఈఓగా ఎంపికయ్యారు. ఈ మూడు కార్పొరేట్ సంస్థలూ నిరుడు ఆర్జించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకుంటే అది ప్రపంచంలోని 140 దేశాల జీడీపీల కంటే ఎక్కువని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. నిరుడు ఈ మూడు సంస్థల ఆదాయాల మొత్తం 15,960 కోట్ల డాలర్లు! సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌ల ఎంపికతో సిలికాన్ వ్యాలీ ఏలుబడి భారతీయుల చేతుల్లోకి వచ్చినట్టయింది. భిన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎదిగిన యువత మెరుగైన చదువులకూ, ఉద్యోగాలకూ ఖండాంతరాలకు వెళ్లి తమ ప్రతిభాపాటవాలతో ఎదుగుతున్న వైనం ఎందరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. పరిధి చిన్నది కావొచ్చు, ఎన్నో పరిమితులుండవచ్చు...కానీ ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు దాన్ని అధికారంగా, ఇంకా చెప్పాలంటే పెత్తనంగా భ్రమించి ప్రవర్తించేవారు చాలాచోట్ల కనిపిస్తారు. సహోద్యోగుల్లో స్ఫూర్తిని నింపి, ఉత్సాహం కలిగించి, కొత్త ఆలోచనలకు వారిని ప్రోత్సహించి, సృజనాత్మక ఆవిష్కరణలకు దోహదకారులుగా నిలవడం, నిజమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం అరుదుగా చూస్తాం. నిరుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల అయినా, గూగుల్ సీఈఓ కాబోతున్న సుందర్ పిచాయ్ అయినా ఇలా అంకితభావంతో పనిచేయడంవల్లే ఎదగ గలిగారని వారి సన్నిహితులు చెబుతున్న మాటల్లో నిజం ఉంది. మెకిన్సీ కంపెనీలో కొంతకాలం పనిచేసి గూగుల్ ఆవిర్భవించినప్పుడు చేరిన సుందర్ పిచాయ్ గూగుల్‌కు పేరు తెచ్చిన వెబ్ బ్రౌజర్ క్రోమ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోసహా పలు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్‌లను రూపొందించడంలో, వాటిని జనావళికి చేరేయడంలో కీలక పాత్ర పోషించారు. గూగుల్ ప్రొడక్ట్‌లను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా జనం నిత్యమూ ఉపయోగిస్తున్నారంటేనే వాటి ప్రయోజనం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ఇలా కోట్లాదిమంది వినియోగంలో ఉన్న సాంకేతికతను అభివృద్ధి చేయడం దిశగా నిరంతరం ఆలోచిస్తూ పోతే తప్ప ఆ పనిలో నిమగ్నమై ఉండే సంస్థ మనుగడ సాధించలేదు. అపరిమితమైన పోటీ పెరిగిన వర్తమాన వాతావరణంలో ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా అట్టడుగుకు దిగజారే ప్రమాదం ఉంటుంది. గూగుల్‌కు చాలా ముందే వచ్చిన సంస్థలు అందుకు ఉదాహరణ. కేవలం ఇంటర్నెట్ దిగ్గజంగా ఉండటంతో సరిపెట్టుకోక, ఆ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ, ప్రపంచంలో ఏమూల ప్రతిభ కనబడినా సొంతం చేసుకుని, దాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు గూగుల్ కృషి చేస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో సైతం తనదైన ముద్రను చూపడంలో ముందుంది. ఏ వయసువారైనా, సాంకేతికత వినియోగంలో అంతగా ప్రవేశం లేకపోయినా ఎవరైనా సులభంగా వినియోగించేలా అప్లికేషన్లు రూపొందించడం గూగుల్ సాధించిన విజయం. ఐడియా చెబితే కోటి రూపాయలిస్తామని పోటీ పెట్టడం మొదలుకొని ఈ రెండు దశాబ్దాల్లోనూ గూగుల్ చేసిన పనులు చాలా ఉన్నాయి. గ్లోబల్ ఇంపాక్ట్ పేరుతో స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడమైనా...‘గూగుల్ ఉమన్ ఇన్ ఇంజనీరింగ్’ పేరిట అవార్డు నెలకొల్పడమైనా...మృత భాషలకు ప్రాణం పోసి అవి వర్థిల్లేందుకు భాషా నిపుణులనూ, పండితులనూ ఒకచోట చేర్చినా...గూగుల్ సైన్స్ ఫెయిర్ పేరుతో బాలబాలికల్లో సృజనాత్మకతను ప్రోత్సహించినా...గూగుల్‌ది విలక్షణ మార్గం. అవిచ్ఛిన్నంగా సాగే ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్న ముఖ్యుల్లో సుందర్ ఒకరు. వాస్తవానికి నిరుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సారథయ్యే ముందు ఆ పదవికి ఎంపిక కావొచ్చునని వినిపించిన పేర్లలో సుందర్ పిచాయ్ పేరూ ఉందంటే ఆయన నాయకత్వ పటిమపై మార్కెట్లో ఉన్న విశ్వాసం ఎటువంటిదో అర్థమవుతుంది. ఇన్నాళ్లూ తానే ఒక భారీ సంస్థగా, టెక్ దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు గడించిన గూగుల్... ఇకపై కొత్తగా ఏర్పడబోతున్న ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘అల్ఫాబెట్’ లోని పలు సంస్థల్లో ఒకటిగా ఒదిగి చిన్నబోతున్న తరుణంలో మనవాడు సీఈఓ అయ్యాడన్న అసంతృప్తి కొంతమందిలో ఉంది. కానీ సంస్థ పునర్వ్యవస్థీకరణ సమయంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో సుందర్ నియామకం కూడా ఒకటని గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీ పేజ్ చెబుతున్నారు. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలకు ఎందరో సృజనశీలురను, సత్తా ఉన్నవారిని అందించగలుగుతున్న మన దేశం అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉంటున్నది. సామాజిక వివక్ష, ఆర్ధిక అసమానతలవంటివి మాయమై...అందరికీ సమానావకాశాలు లభించినప్పుడే ఈ స్థితి మారుతుంది. అప్పుడు సుందర్ బహువచనమవుతుంది.