వాతావరణ పరిస్థితులు ,మారుతున్న జీవనశైలి కారణంగా శరీరం, ముఖ్యంగా ముఖం ట్యాన్‌కు గురవుతుంది. యూవీ కిరణాల ప్రభావంతో పాటు, ఫ్రీ రాడికల్స్ , కాలుష్యం కూడా దీనికి కారణం. కాబట్టి, ముఖంతో పాటు శరీరానికి కూడా సమానమైన శ్రద్ధ ,రక్షణ అవసరం. దీనికి క్రమం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అవసరం. కేవలం సబ్బు బార్ లేదా షవర్ జెల్ లాంటివాటికి మాత్రమే పరిమితం కాకుండా, సహజమైన ,యవ్వన రూపాన్ని తిరిగి పొందడానికి, శరీరానికి తగ్గట్టు బాడీ పాలిష్, బాడీ స్క్రబ్, ఎక్స్‌ఫోలియేషన్ లాంటి వాటిని ఎంచుకోవాలి.
బాడీ పాలిషర్ లేదా బాడీ ఎక్స్‌ఫోలియేట్ ద్వారా రక్త ప్రసరణపెరుగుతుంది. బాడీ స్క్రబ్ డెడ్ స్కిన్ కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని శుభ్రపర్చి మెరిసేలా చేస్తుంది. కొల్లాజెన్‌ను ప్రేరేపిస్తుంది, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
ఎలా చేసుకోవాలి?
అయితే చర్మం మీద మృతకణాలను తొలగించి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్క్రబ్‌ను ప్రతిసారీ మార్కెట్‌లో కొనాల్సిన పనిలేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ ఓట్స్, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ పాలు, అర కప్పు నీరు తీసుకోవాలి. ఓట్స్‌ను నీటిలో ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత మిగిలిన అన్నింటినీ వేసి కలిపితే స్క్రబ్ రెడీ. ఈ ప్యాక్ వేసుకునే ముందు సబ్బుతో ముఖం, చేతులను కడిగి తుడుచుకోవాలి. ప్యాక్‌ను సమంగా పట్టించి పది లేదా పదిహేను నిమిషాల నాటు అలాగే ఉంచాలి. చర్మానికి పట్టినట్లు బిగుసుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా మర్దన చేయాలి. అలా పది నిమిషాల సేపు మర్దన చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి మార్కెట్‌లో దొరికే స్క్రబ్‌లాగ ఫ్రూట్ ఫ్లేవర్‌లతో కావాలనుకుంటే ఇష్టమైన పండ్ల గుజ్జును కూడా కలుపుకోవచ్చు.
ఎలాంటి స్కిన్‌కు ఎలాంటి స్క్రబ్ వాడాలి?
పొడిచర్మం వాళ్లు పుల్లటి పండ్ల జోలికి వెళ్లవకూడదు. పొడి (లేదా ఫ్లాకీ) చర్మానికి గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు తప్పనిసరిగా రెగ్యులర్ స్క్రబ్బింగ్ స్కిన్‌కేర్ రొటీన్‌కు దూరంగా ఉండాలి. వారానికి ఒకసారి, తేలికపాటి కెమికల్ ఎక్స్‌ఫోలియేటర్‌ను ప్రయత్నించవచ్చు. మెత్తగా, లాక్టిక్ యాసిడ్‌తో ఉండేలా చూసుకోవాలి.
జిడ్డు చర్మం ఉన్నవారికి బాడీ స్క్రబ్ వలన ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్, బాంబూచార్‌కోల్ బెటర్. ఇవి కఠినమైన మచ్చల్న తొలగించి, మృదువైన వెల్వెట్ ఫీలింగ్ నిస్తాయి. ఇక సమస్య లేని, సాధారణమైన చర్మం ఉన్నవారికి pH బ్యాలెన్స్‌డ్ క్లెన్సర్ , స్క్రబ్‌ని ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment