scrub
-
బాడీ స్క్రబ్ : మీ శరీరానికి ఏది మంచిదో గుర్తించండి!
వాతావరణ పరిస్థితులు ,మారుతున్న జీవనశైలి కారణంగా శరీరం, ముఖ్యంగా ముఖం ట్యాన్‌కు గురవుతుంది. యూవీ కిరణాల ప్రభావంతో పాటు, ఫ్రీ రాడికల్స్ , కాలుష్యం కూడా దీనికి కారణం. కాబట్టి, ముఖంతో పాటు శరీరానికి కూడా సమానమైన శ్రద్ధ ,రక్షణ అవసరం. దీనికి క్రమం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అవసరం. కేవలం సబ్బు బార్ లేదా షవర్ జెల్ లాంటివాటికి మాత్రమే పరిమితం కాకుండా, సహజమైన ,యవ్వన రూపాన్ని తిరిగి పొందడానికి, శరీరానికి తగ్గట్టు బాడీ పాలిష్, బాడీ స్క్రబ్, ఎక్స్ఫోలియేషన్ లాంటి వాటిని ఎంచుకోవాలి.బాడీ పాలిషర్ లేదా బాడీ ఎక్స్ఫోలియేట్ ద్వారా రక్త ప్రసరణపెరుగుతుంది. బాడీ స్క్రబ్ డెడ్ స్కిన్ కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని శుభ్రపర్చి మెరిసేలా చేస్తుంది. కొల్లాజెన్‌ను ప్రేరేపిస్తుంది, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఎలా చేసుకోవాలి?అయితే చర్మం మీద మృతకణాలను తొలగించి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్క్రబ్‌ను ప్రతిసారీ మార్కెట్లో కొనాల్సిన పనిలేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ ఓట్స్, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ పాలు, అర కప్పు నీరు తీసుకోవాలి. ఓట్స్‌ను నీటిలో ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత మిగిలిన అన్నింటినీ వేసి కలిపితే స్క్రబ్ రెడీ. ఈ ప్యాక్ వేసుకునే ముందు సబ్బుతో ముఖం, చేతులను కడిగి తుడుచుకోవాలి. ప్యాక్‌ను సమంగా పట్టించి పది లేదా పదిహేను నిమిషాల నాటు అలాగే ఉంచాలి. చర్మానికి పట్టినట్లు బిగుసుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా మర్దన చేయాలి. అలా పది నిమిషాల సేపు మర్దన చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి మార్కెట్లో దొరికే స్క్రబ్లాగ ఫ్రూట్ ఫ్లేవర్లతో కావాలనుకుంటే ఇష్టమైన పండ్ల గుజ్జును కూడా కలుపుకోవచ్చు. ఎలాంటి స్కిన్‌కు ఎలాంటి స్క్రబ్ వాడాలి?పొడిచర్మం వాళ్లు పుల్లటి పండ్ల జోలికి వెళ్లవకూడదు. పొడి (లేదా ఫ్లాకీ) చర్మానికి గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు తప్పనిసరిగా రెగ్యులర్ స్క్రబ్బింగ్ స్కిన్‌కేర్ రొటీన్‌కు దూరంగా ఉండాలి. వారానికి ఒకసారి, తేలికపాటి కెమికల్ ఎక్స్‌ఫోలియేటర్‌ను ప్రయత్నించవచ్చు. మెత్తగా, లాక్టిక్ యాసిడ్‌తో ఉండేలా చూసుకోవాలి.జిడ్డు చర్మం ఉన్నవారికి బాడీ స్క్రబ్ వలన ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్, బాంబూచార్కోల్ బెటర్. ఇవి కఠినమైన మచ్చల్న తొలగించి, మృదువైన వెల్వెట్ ఫీలింగ్ నిస్తాయి. ఇక సమస్య లేని, సాధారణమైన చర్మం ఉన్నవారికి pH బ్యాలెన్స్డ్ క్లెన్సర్ , స్క్రబ్‌ని ఉత్తమం. -
Beauty Tips In Telugu: ఆల్మండ్ స్క్రబ్‌తో నిగారింపు
ఐదు బాదం పప్పులను తీసుకుని బరకగా దంచుకోవాలి. కప్పు పెరుగుని బట్టలో వడగట్టి వచ్చిన నీటిని.. టీస్పూను, బాదం నూనె ఐదు చుక్కలు వేసి వీటన్నింటిని పేస్టులా కలిపితే ఆల్మండ్ స్క్రబ్ రెడీ. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆల్మండ్ స్క్రబ్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. కాసేపు అలాగే ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేయడం వల్ల ముఖచర్మంపై ఉన్న మృతకణాలు తొలగి, చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. చదవండి: Sudha Reddy: మెట్ గాలాలో మెరిసిన సుధారెడ్డి -
కళ్లు చెదిరే అందం
ముఖం కాంతివంతంగా మెరవాలంటే... మార్కెట్లో వందలకు వందలు పోసి కొన్న ఫేస్‌క్రీమ్స్ అవసరం లేదు. కాస్త తీరిక చేసుకుని క్లీనప్, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకుని, ఇరవై నిమిషాల పాటు మాస్క్ వేసుకుంటే చాలు. సహజసిద్ధమైన అందం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఇలాంటి సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే అంటున్నారునిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : కొబ్బరిపాలు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, చిక్కటి పాలు – అర టేబుల్ స్పూన్ మాస్క్: క్యారెట్ గుజ్జు – అర టేబుల్ స్పూన్, టమాటా గుజ్జు – పావు టేబుల్ స్పూన్, గడ్డపెరుగు – 1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – అర టేబుల్ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరిపాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, టమాటా గుజ్జు, గడ్డపెరుగు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మచ్చలను పోగొట్టే మెరుపు
మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ కేవలం ఆయా సమయాల్లో మాత్రమే మెరుపునిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : ఆలివ్ నూనె – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్, నిమ్మరసం – 5 లేదా 6 చుక్కలు స్క్రబ్ : మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, నీళ్లు – కొద్దిగా మాస్క్: తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పసుపు – చిటికెడు, గడ్డపెరుగు – పావు టీ స్పూన్, శనగపిండి – పావు టీ స్పూన్ తయారీ : ముందుగా ఆలివ్ నూనె, తేనె, నిమ్మరసం ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, సరిపడా నీళ్లు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, పసుపు, గడ్డపెరుగు, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
పట్టులాంటి మృదుత్వం
సౌందర్యవంతమైన ముఖ కాంతికి సహజమైన చిట్కాలే సరైనవంటున్నారు నిపుణులు. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యంతో ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా మారిపోతుంది. అలాంటప్పుడు కొంత సమయం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కేటాయిస్తే చాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం మృదువుగా పట్టులా మెరుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు మీగడ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: చిక్కటి పాలు–1 టీ స్పూన్, శనగపిండి – అర టీ స్పూన్, తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పచ్చి పసుపు – చిటికెడు తయారీ : ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం ఒక చిన్న బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, శనగపిండి, పసుపు, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
తళుక్కుమనే మెరుపు!
ముఖ సౌందర్యానికి కాసింత సమయాన్ని వెచ్చిస్తే చాలు... తళుక్కుమనే మెరుపు మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ముఖంపైన ఉండే మృతకణాలు, మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోవాలంటే... శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతం మారుతుంది. మచ్చ లేని మృదువైన అందం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, కలబంద గుజ్జు – 1 టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి నూనె – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు –1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 2 టీ స్పూన్లు, దానిమ్మ రసం – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కలబంద గుజ్జు ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు, కొబ్బరి నూనె ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, ముల్తానీ మట్టి, అరటిపండు గుజ్జు, దానిమ్మ రసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
మృదువదనం కోసం...
ఫేస్‌క్రీమ్స్, లోషన్స్ ముఖానికి అప్లై చేసుకోవడం నిమిషాల పని. అవి అప్లై చేసుకున్నంతసేపే ఆ అందం నిలుస్తుంది. కానీ ఈ చిట్కాలను పాటిస్తే ఆ అందమే శాశ్వతమవుతుంది. కాకపోతే కాస్త సమయాన్ని వెచ్చించాలి. ఖర్చులేని చిట్కాలతో కాంతివంతమైన అందం సొంతమవుతుందంటే... అంతకన్నా ఏం కావాలి? ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : స్క్రబ్ : బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్, కీరదోశ జ్యూస్ – 2 టీ స్పూన్లు, మాస్క్ : ఖర్జూరం గుజ్జు – 2 టీ స్పూన్లు, శనగపిండి – 2 టీ స్పూన్లు, చిక్కటి పచ్చిపాలు – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా రోజ్‌వాటర్ లేదా కొబ్బరి నూనె రెండు నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసుకుని మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, తేనె, కీరదోశ జ్యూస్ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం గుజ్జు, శనగపిండి, చిక్కటి పచ్చిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వెంటనే సబ్బు అప్లై చెయ్యకపోవడమే మంచిది. -
ఫేస్‌క్రీమ్స్‌తో పనిలేదు!
మేకప్‌తో వచ్చే అందం కంటే.. మేకప్ వేయకుండా మెరిసే అందానికే ఓటేస్తుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఖర్చులేని ఈ చిట్కాలను పాటించడానికి మాత్రం కాసింత సమయం వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు పూర్తిగా మాయమవుతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆలీవ్ నూనె – పావు టీ స్పూన్, దానిమ్మ జ్యూస్ – 2 టీ స్పూన్లు(చెత్త తొలగించి), బాదం పాలు – 1 టీ స్పూన్ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి. వాటిని ఫ్రిజ్‌లో నిలువ చేసుకోవచ్చు.) స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పచ్చిపసుపు – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు – 2 టీ స్పూన్లు, యాపిల్ గుజ్జు – 3 టీ స్పూన్లు, పెసరు పిండి – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్ తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్, బాదం పాలు, ఆలీవ్ నూనె ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, బియ్యప్పిండి, ఆరెంజ్ జ్యూస్, పచ్చి పసుపు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, యాపిల్ గుజ్జు, పెసరు పిండి, నిమ్మరసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. వెంటనే సబ్బు ముఖానికి రాసుకోకపోవడమే మంచిది. -
తళుక్కున మెరిసేందుకు
క్రీమ్స్, లోషన్స్ రాసుకోవడం వల్ల వచ్చే అందంకంటే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ల వల్ల నిలిచే అందానికే ఓటేస్తుంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఇంటిపట్టున దొరికే... వాటితోనే ఫేస్‌ప్యాక్‌లు సిద్ధం చేసుకోవచ్చు. అయితే ఫేస్ప్యాక్కు ముందు క్లీనప్, స్క్రబ్ వంటివి తప్పని సరిగా చేసుకుంటే చర్మంపైన పేరుకుపోయిన మృతకణాలు పూర్తిగా తొలిగిపోయి మృదువుగా, మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా అందంగా తయారవుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు – పావు టీ స్పూన్, ఆరెంజ్ జ్యూస్ – 1 టీ స్పూన్ స్క్రబ్ : ఆరెంజ్ తొక్కల పొడి – 2 టీ స్పూన్లు, అరటి పండు గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు మాస్క్ : కిస్మిస్ గుజ్జు – అర టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు, కొబ్బరిపాలు – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా పెరుగు, ఆరెంజ్ జ్యూస్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ తొక్కల పొడి, అరటి పండు గుజ్జు, చిక్కటిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కొబ్బరిపాలు, కిస్మిస్ గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మచ్చలు మటుమాయం
నున్నటి మృదువైన మోముపైన చిన్నపాటి మొటిమ వస్తే చాలు.. అది పూర్తిగా తగ్గించుకునేంతవరకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు మగువలు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్, లోషన్స్ వంటివి ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : నిమ్మరసం – పావు టీ స్పూన్, రోజ్ వాటర్ – పావు టీ స్పూన్, బాదంపాలు – 1 టీ స్పూన్ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి) స్క్రబ్ : బ్రౌన్ సుగర్ – 2 టీ స్పూన్లు, అరటి గుజ్జు – 2 టీ స్పూన్ల గంధం – అర టీ స్పూన్ (గంధం చెక్క నుంచి నూరి తీసుకోవాలి) మాస్క్ : శనగ పిండి – 1 టీ స్పూన్, కిస్మిస్ గుజ్జు – అర టేబుల్ స్పూన్కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా నిమ్మరసం, బాదంపాలు, రోజ్‌వాటర్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ సుగర్, అరటి గుజ్జు, గంధం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కిస్మిస్ గుజ్జు, కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
కాంతివంతమైన మెరుపు
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మసంరక్షణ కష్టంగా మారుతోందా? మార్కెట్లో దొరికే లోషన్స్, ఫేస్‌క్రీమ్స్ రాసుకుంటున్నా సమస్య తాత్కాలికంగానే అనిపిస్తోందా? అయితే సహజసిద్ధమైన చిట్కాలని ప్రయత్నించి చూడండి. కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. స్క్రబ్, క్లీనప్ చేసుకుంటే జిడ్డు, మృతకణాలు వంటివి పూర్తిగా తొలగిపోతాయి. ఆవిరి పట్టించడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇక ఫేస్‌ప్యాక్ వేçసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారి మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి. కావల్సినవి : క్లీనప్ : ఎగ్ – 1(తెల్లసొన), పాలు – 2 టీ స్పూన్లు స్క్రబ్ : ఆలీవ్ నూనె – 2 టీ స్పూన్లు, పంచదార – అర టీ స్పూన్లు ఓట్స్ – 2 టీ స్పూన్లు, బాదం గుజ్జు – అర టీ స్పూన్ మాస్క్ : జామకాయ గుజ్జు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్ టమాటా జ్యూస్ – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా గుడ్డు తెల్లసొన, పాలు ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలివ్ నూనె, పంచదార, ఓట్స్, బాదం గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జామకాయ గుజ్జు, టమాటా జ్యూస్, తేనె ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ప్రకృతిలోని మెరుపు
ముఖ చర్మం జీవం లేనట్టు కనపడుతుంటే మృతకణాల సంఖ్య పెరిగిందని అర్ధం చేసుకోవాలి. మృతకణాలు తగ్గి, స్వేదరంధ్రాలలోని మురికి వదిలితే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. ఇందుకు కొన్ని టిప్స్ ఫాలో అవొచ్చు. ∙కలబంద (అలొవెరా) ఆకు నుంచి తీసిన జెల్‌లాంటి పదార్ధం మృతకణాలను తొలగించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. కలబంద రసాన్ని వేళ్లతో అద్దుకొని, ముఖానికి పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత ఓ పది నిమిషాలు వదిలేసి, నీళ్లతో కడిగేయాలి. గరుకుగా తయారైన చర్మం మృదువుగా అవుతుంది. ఈ అలొవెరా జ్యూస్‌తో చేసిన స్క్రబ్, మసాజ్‌లకు వాడాలి. ∙సబ్బు, మేకప్ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు చర్మంలోనికి ఇంకిపోవడం వల్ల కూడా జీవకళ తగ్గుతుంది. ఇలాంటప్పుడు చర్మతత్వాన్ని బట్టి ఏది ఉపయోగమో దానితో క్లెన్సింగ్ చేయించాలి. ∙మృతకణాల తొలగింపులో బొప్పాయి, పైనాపిల్లోని సహజ ఔషధాలు బాగా పనిచేస్తాయి. బొప్పాయి, పైనాపిల్ పండ్లను రోజూ ఒక కప్పు తిన్నా, వీటి గుజ్జును మసాజ్, ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగించినా మృతకణాలు తగ్గుతాయి. బొప్పాయి, పైనాపిల్ గుణాలు ఉన్న సౌందర్య ఉత్పత్తులను కూడా మృతకణాల తొలగింపుకు వాడచ్చు. అయితే అవి మన చర్మానికి సరిపడాలి. వెచ్చని నీరు.. చల్లని నీరు మృతకణాల తొలగింపుకు ముందు.. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. మసాజ్‌కి ఏదైతే ఉపయోగిస్తారో దానిని రాస్తూ వేళ్లతో వలయాకారంలో మర్దనా చేయాలి. ఎక్కువ ఒత్తిడి చేస్తే ముఖచర్మంపై గీతలు పడే అవకాశం ఉంది. తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు ముఖాన్ని స్క్రబ్ చేయకపోవడం మంచిది. -
రాయితో రుద్దితే తెల్లగా మారతాడని..
భోపాల్ : తెలుపు అంటే చాలామందికి విపరీతమైన పిచ్చి. ఈ పిచ్చి బాగా ముదిరితే ఎలా ఉంటుందో ఈ మహిళని చూస్తే అర్థం అవుతుంది. రాయితో రుద్దితే తెల్లగా మారతారని నమ్మి తన అయిదేళ్ల కొడుకుని తీవ్రంగా హింసించింది. చివరకు బాలల సంరక్షణ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి, బాలుడిని కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం... నిషత్‌పూర్ ప్రాంతంలో నివాసం ఉండే సుధా తివారి పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె భర్త ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కాంట్రక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో సుధా తివారి ఏడాదిన్నర క్రితం ఉత్తరాఖండ్‌లోని ‘మాతృచ్ఛాయ’ ఆశ్రమం నుంచి ఒక బాలుడిని దత్తత తీసుకుంది. బాలుడు నల్లగా ఉండటంతో సుధా అత్తగారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో సుధా ఆ పిల్లవాడిని తెల్లగా మార్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా రాయితో రుద్దితే తెల్లగా అవుతారని ఎవరో చెప్పిన సలహ విని పసివాడిని రాయితో రుద్దడం ప్రారంభించింది. దీంతో ఆ చిన్నారికి ఛాతీ, భుజం, వీపు, కాళ్ల మీద గాయాలయ్యాయి. పసివాడిని అలా హింసించవద్దంటూ సుధా సోదరి కూతురు శోభన శర్మ ఆమెకు ఎన్నోసార్లు చెప్పింది. అయినా సుధ వినకపోవడంతో శోభన శర్మ ఆదివారం బాలల సంరక్షణ అధికారులకు ఫోన్ చేసింది. సమాచారం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు, నిషత్‌పూర్ పోలీసులు... సుధ ఇంటి నుంచి బాలుడిని విడిపించి... హమిదియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం తదుపరి విచారణ నిమిత్తం ఆ చిన్నారిని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు. తన సుధా తివారి తనను ఆమె పనిచేసే పాఠశాలకు తీసుకెళ్లేదని... అయితే చదివించడానికి కాదంటూ విచారణలో తెలిపాడు. (ఇవాళ) బాలుడిని బాలల సంరక్షణ కమిషన్ సభ్యుల ముందు హజరుపరచనున్నారు. కాగా నిబంధనల ప్రకారం దత్తత తర్వాత ఆశ్రమం వారు ఆ పిల్లల బాగోగుల గురించి ఆరా తీయాలి. కానీ ‘మాతృచ్ఛాయ’ ఆశ్రమం వారు ఆ పని చేయలేదని శోభన ఆరోపించారు. దీని గురించి ‘మాతృచ్ఛాయ’ జాయింట్ సెక్రటరీ అమిత్ జైన్‌ను విచారించగా ‘మేము పిల్లలను దత్తత ఇచ్చిన అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లల క్షేమ సమాచారం తెలుసుకుంటాము. మేము సుధకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఆమె మాకు దీని గురించి చెప్పలేదు’ అన్నారు. మధ్యప్రదేశ్ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్మన్ రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ ‘ఈ విషయం గురించి నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. కానీ దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటానని’ తెలిపారు. -
వర్షాకాలం... స్క్రబ్ నాణ్యమైనదిగా ఉండాలి
బ్యూటిప్స్ వర్షాకాలం దుమ్ము కణాలు చర్మం మీద పేరుకుపోయే అవకాశం ఉంది. శుభ్రపరచకపోతే మృతకణాలు పెరిగి చర్మం తన మృదుత్వాన్ని, కాంతిమంతాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమస్యకు విరుగుడుగా... నాణ్యమైన స్క్రబ్‌ను ఉపయోగించి మృదువుగా చర్మంపై రుద్దాలి. దీని వల్ల స్వేదరంధ్రాల్లో మృతకణాలు తొలగిపోయి, సహజమైన మాయిశ్చరైజర్‌ని తగినంతగా ఉత్పత్తి చేస్తుంది. చర్మం మృదుత్వం దెబ్బతినదు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో చాలామంది సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం ఆపేస్తారు. వాతావరణం మబ్బుగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవాలి. వర్షా కాలం హెవీ మేకప్‌కి వెళ్లకపోవడమే మంచిది. అంతగా ఉపయోగించాలనుకుంటే వాటర్‌ప్రూఫ్ మేకప్ మేలు. బ్లీచింగ్, ఫేసియల్స్ ఈ కాలం అంతగా అవసరం ఉండదు. వీటి వల్ల చర్మం గరకుగా తయారవుతుంది.రాత్రిపూట పెదవులకు పాల మీగడ, లేదా కొబ్బరి నూనె వంటివి రాసుకుంటే పగుళ్ల సమస్య బాధించదు. వాక్సింగ్, పెడిక్యూర్, మానిక్యూర్లు చేయించుకోవడం వల్ల పాదాలు, చేతుల సంరక్షణ బాగుంటుంది. -
రైస్‌ఫ్లోర్ ప్యాక్...
న్యూ ఫేస్ కావలసినవి: బియ్యంపిండి - 1 టేబుల్ స్పూన్, పెరుగు - 1 టీ స్పూన్, తేనె - 1 టీ స్పూన్ తయారీ: ముందుగా ఓ బౌల్లో బియ్య పిండి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తేనెను కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకొని ఈ బియ్యం పిండి మిశ్రమంతో ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక, గోరువెచ్చని నీటితో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. దాంతో ముఖం క్లీన్‌గా సాఫ్ట్‌గా మారుతుంది. * బియ్యంపిండి మంచి స్క్రబ్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెరుగు, తేనె ముఖకాంతిని మెరుగుపరుస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు కచ్చితంగా వేసుకుంటే మృతకణాలు తొలగిపోయి.. ముఖం తళతళా మెరిసిపోతుంది. కావాలంటే ఈ ప్యాక్‌లో కొద్దిగా శనగపిండిని కూడా కలుపుకోవచ్చు. -
చాక్లెట్...తినడానికే కాదు..!
► చాక్లెట్ తినడానికే కాదు... ముఖారవిందానికి కూడా బాగా పనికొస్తాయి. అదెలాగో చూడండి! ► చాక్లెట్ పొడిలో తగినన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. బయట నుంచి ఇంటికి చేరుకున్న వెంటనే ఈ మిశ్రమం తో స్క్రబ్ చేసుకుంటే ముఖం, మెడ, చేతులు, పాదాలు కాంతివంతంగా తయారవుతాయి. ఉప్పు మృతకణాలను తొలగిస్తుంది. మిగతా పదార్థాలు ముఖాన్ని అందంగా మారుస్తాయి. ► మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలతో బాధపడేవారు టీ ట్రీ ఆయిల్‌తో మంచి ఫలితం పొందవచ్చు. రోజు విడిచి రోజు ముఖానికి ఆ ఆయిల్ రాసుకొని రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోండి. ఇది వాడేటప్పుడు వేరే క్రీములు వాడకపోవడం మంచిది. ఇలా చేస్తే మచ్చలను దూరం చేయడంతో పాటు మొటిమలు రావడాన్నే అరికడుతుంది. -
మేని మెరుపులకు...
చర్మసౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు చాలా మంది. అయితే కొన్ని సార్లు చర్మాన్ని మెరుగు పెట్టే సౌందర్య ఉత్పాదనలు, ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా హాని జరుగుతుంటుంది. అవగాహన లేమి దీనికి ప్రధాన కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఏమేం చేయకూడదంటే... Right: చర్మం తెల్లగా అవ్వాలని, మృదువుగా అవ్వాలని స్క్రబ్(మార్కెట్లో రకరకాల స్క్రబ్‌లు అందుబాటులో ఉన్నాయి) తో అతిగా రుద్దుతుంటారు. దీని వల్ల చర్మం ఎర్రబడడమే కాకుండా పొడిబారుతుంది. మొటిమలు ఉంటే సమస్య మరింతగా పెరుగుతుంది. Wrong: రెండు వారాలకు ఒకసారి చర్మతత్త్వానికి సరిపడే స్క్రబ్ (మార్కెట్లో లభిస్తుంది) తో 2-3 నిమిషాలు మృదువుగా రుద్ది, శుభ్రపరుచుకోవాలి. మెటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ వాడకూడదు. వేపాకులను రుబ్బి, ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరచాలి. Right: చాలామంది తమ చర్మతత్వానికి సరిపడిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోరు. దీని వల్ల సేదగ్రంథులు మూసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు, పొక్కులు రావడం జరుగుతుంటాయి. Wrong: ఏదైనా కొత్త సౌందర్య ఉత్పత్తిని చర్మానికి ఉపయోగించే ముందు మోచేతిపై లేదా చెవి వెనకాల కొద్దిగా రాసి, 2-3 గంటల సేపు అలాగే ఉంచాలి. ఎరుపు దనం, దద్దుర్లు లేవని నిర్ధారించుకున్నాకే ఆ ఉత్పత్తిని వాడుకోవాలి. అలాగే, మాయిశ్చరైజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ చర్మానికి రాసిన 60 సెకండ్లలో ఇంకిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్‌ను వాడవచ్చు. మొటిమలను గిల్లడం, లోపలి పస్(చీము) తీయడం వంటివి చేస్తే ఆ ప్రాంతంలో మచ్చలు పడే అవకాశం ఉంది. Right: జిడ్డు చర్మం గలవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు రోజులో 2-3 సార్లు ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకోవడం, నిమ్మ గుణాలున్న పేస్ప్యాక్లు వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది. Wrong: చాలామంది దుస్తులు ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు. దుస్తుల మీద స్ప్రే చేయడం వల్ల అందులోని ఫైబర్ లక్షణాలతో కలిసి పెర్ఫ్యూమ్ సువాసన మారే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ తరహా ప్రయోగాలు చర్మానికి హాని కలిగించవచ్చు. Right: వస్త్రధారణకు ముందు దూది ఉండకు స్ప్రే చేసి గొంతు, ముంజేతులు, భుజాల కింద... పెర్ఫ్యూమ్ను అద్దాలి. దీని వల్ల చర్మానికి హాని కలగదు.