
ఐదు బాదం పప్పులను తీసుకుని బరకగా దంచుకోవాలి. కప్పు పెరుగుని బట్టలో వడగట్టి వచ్చిన నీటిని.. టీస్పూను, బాదం నూనె ఐదు చుక్కలు వేసి వీటన్నింటిని పేస్టులా కలిపితే ఆల్మండ్ స్క్రబ్ రెడీ. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆల్మండ్ స్క్రబ్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దనా చేయాలి.
కాసేపు అలాగే ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేయడం వల్ల ముఖచర్మంపై ఉన్న మృతకణాలు తొలగి, చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment