Face Beauty
-
Hot Summer చర్మానికి కావాలి చల్లదనం, ఈ మాస్క్‌లు ట్రై చేయండి!
వేసవి ఎండలు మండిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తగినన్ని నీళ్లు తాగుతూ బాడీకి చల్లదనాన్ని ఇచ్చే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ముఖ్యం. అలాగే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువ వస్తాయి. చెమట పొక్కులు, దురదలు లాంటి రాకుండా ఉండాలంటే చర్మానికి సాంత్వన కలిగేలాకొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాంటి కొన్ని జాగ్రత్తలు మీకోసం ముఖ్యంగా ఎండ వేడినుంచి ఉపశమనం కలిగేలా అందుబాటులో ఉన్న సహజమైన పదార్థాల ద్వారా కొన్ని ఫేస్ మాస్క్‌లను చూద్దాం. హనీ-యోగర్ట్ మాస్క్ : ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులకు రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడగాలి. వాటర్ మెలన్ మాస్క్: పుచ్చకాయ ముక్కలు అర కప్పు తీసుకుని చిదిమి గుజ్జు చేయాలి. ఆ గుజ్జును, నీటిని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోకోనట్ ఆయిల్-టర్మరిక్ మాస్క్: టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో అర టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖం, మెడ, చేతులు, ΄ాదాలకు పట్టించాలి. కొంత ఆరిన తర్వాత (పూర్తిగా ఎండిపోకముందు) వేళ్లతో వలయా కారంగా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. నూనె జిడ్డు పూర్తిగా వదలక΄ోయినప్పటికీ నీటితో కడిగి టిష్యూతో తుడవాలి తప్ప సబ్బు వాడరాదు. పపయా– హనీ మాస్క్: బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు అర కప్పు తీసుకుని బాగా చిదమాలి. అందులో టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. మింట్-కుకుంబర్ మాస్క్: కీరదోస కాయ చెక్కు తీసి అర కప్పు ముక్కలు తీసుకోవాలి. అందులో గుప్పెడు పుదీన ఆకులు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి చర్మానికి పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నోట్: ఎండలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా లభించే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. -
ఇది ఉంటే మేకప్ అవసరం లేదు. ఇంట్లోనే సెలూన్ లాంటి గ్లో
ఆరోగ్యవంతమైన మేని కాంతే అసలైన అందం. అందుకే చాలామంది మేకప్ ఇచ్చే మెరుపు కంటే .. సహజంగా వచ్చే గ్లోకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. చిత్రంలోని ఫేస్ రోలర్.. అలాంటి సౌందర్య సంరక్షణతో పాటు కండరాల నొప్పులనూ తగ్గిస్తుంది. బుగ్గలు, మెడ, నుదురు, కళ్లు, ముక్కు ఇలా ముఖంలోని అన్ని భాగాలను మసాజ్ చేసుకోవడంతో పాటు నిగారింపునూ పొందొచ్చు. అలాగే మెడ చుట్టు పేరుకుకున్న కొవ్వు తగ్గించి.. ముఖాన్ని V షేప్‌లోకి మార్చుకోవచ్చు.ఈ టూల్ ఇంట్లో ఉంటే.. బ్యూటీ సెలూన్‌కి వెళ్లాల్సిన పనిలేదు. అంతేకాదు దీన్ని జిమ్కీ వెంట తీసుకెళ్లి.. మసాజ్ చేసుకోవచ్చు. టీవీ చూస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వినియోగించుకోవచ్చు. అవసరాన్ని బట్టి, ట్రీట్మెంట్ని బట్టి.. ఈ టూల్ చక్కగా యూజ్ అవుతుందని ఈ చిత్రాలను చూస్తే తెలిసిపోతుంది. వీల్స్, కొనలు, వంపులు ఇలా ఈ టూల్ అన్ని కోణాలతో .. చిత్రంలో చూపించిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. ధర సుమారు 16 డాలర్లు. అంటే 1,330 రూపాయలు. -
క్లెన్సింగ్ నుంచి ఫేషియల్ వరకు.. ఇదొక్క బ్యూటీ ప్రొడక్ట్ ఉంటే చాలు
ఇప్పుడు టెక్నాలజీ అందిస్తున్న సౌందర్య సాధనాలకు కొదవలేదు. అలాంటి వాటిల్లో ఒకటే.. త్రీడీ వైబ్రేషన్‌తో ఎల్ఈడీ థెరపీ.. స్లైడ్ టచ్ పాడ్‌తో రూపొందిన ఈ అత్యాధునిక ఫేషియల్ మసాజర్. ఇది ఆరు రకాల స్కిన్ కేర్ మోడ్స్‌ని అందిస్తోంది.ఇందులోని ఎల్ఈడీ లైట్స్ 5 కలర్స్‌లో వైబ్రేషన్స్‌ను ఇస్తాయి. దీనిలోని క్లీనప్ మోడ్‌తో మేకప్ తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది మూడు నిమిషాల పాటు పనిచేస్తుంది. ఐ జోన్ మోడ్‌తో కళ్ల చుట్టూ ఉండే ముడతలను, నల్ల మచ్చలను తొలగించుకోవచ్చు. ఇది 2 నిమిషాల పాటు పనిచేస్తుంది. మాయిశ్చర్ మోడ్‌తో చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనికి మూడు నిమిషాల సమయం పడుతుంది. లిఫ్టింగ్ మోడ్‌తో వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీనికి కూడా మూడు నిమిషాల సమయం పడుతుంది. మాస్క్ మోడ్‌తో ఫేషియల్ మాస్క్ షీట్స్‌పై మసాజ్ చేయడంతో.. చర్మానికి అదనపు సౌందర్యం వస్తుంది. దీనికి 5 నిమిషాల సమయం పడుతుంది. విటమిన్ సి మోడ్‌తో చర్మం కాంతిమంతంగా వెలిగిపోతుంది. దీనికి సుమారు 6 నిమిషాలు పడుతుంది. ఈ త్రీడీ వైబ్రేషన్ మసాజర్‌ని వినియోగించడం చాలా సులువు. చార్జింగ్‌కి బేస్ డివైస్ వేరేగా ఉంటుంది. ఈ మసాజర్‌ని అందులో పెట్టి.. ముందుగానే చార్జింగ్ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఈ మెషిన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ టూల్‌తో పాటు అదనంగా రెండు ఫేషియల్ షీట్స్ కూడా లభిస్తాయి. అదనపు సౌకర్యాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఈ చిన్న సర్జరీతో ఆంటీలను అందంగా మార్చవచ్చు
-
ముఖానికి గాయాలు అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
-
మొటిమలు, మచ్చల నివారణ.. ఈ ప్యాక్స్ ప్రయత్నించండి
బీట్రూట్ ఆరోగ్య పరిరక్షణకే కాదు, మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, జింక్ పింపుల్స్, వాటి మచ్చలను తొలగించడానికి చాలా సమర్థంగా పనిచేస్తాయి. మీకు పింపుల్స్ సమస్య ఉంటే.. ఈ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి. రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి. బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. (క్లిక్ చేయండి: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌తో లాభాలివే!) -
మొహంపై బ్లాక్‌హెడ్స్ ఉన్నాయా? గోళ్లతో గిల్లుతూ.. నొక్కుతున్నారా?
ముఖంపై బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వల్ల ఇబ్బంది పడుతుంటారు చాలా మంది! ఈ సులువైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించేయొచ్చు! ► కనీసం వారానికొకసారయినా ఏదో ఒకరకం ఫేస్‌ప్యాక్ వేస్తుంటే చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటివి రావు. ► ముఖానికి నాణ్యమైన ఆస్ట్రింజెంట్ అప్లయ్ చేసి తర్వాత పన్నీటిని అద్దాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలి శుభ్రపడుతుంది. పన్నీటితో చర్మం సాంత్వన పొందుతుంది. దీంతో బ్లాక్‌హెడ్స్ రావడానికి అవకాశం ఉండదు. ► ఫేషియల్ క్రీమ్‌ల వాడకం కూడా బ్లాక్‌హెడ్స్ రావడానికి కారణమవుతుంటుంది. అందుకని, వీటి వాడకాన్ని తగ్గించాలి. ► ప్రతిరోజూ మైల్డ్ స్క్రబ్ వాడుతుంటే మృతకణాలు తొలగడంతోపాటు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ ఏర్పడవు. గోళ్లతో గిల్లవద్దు ► బ్లాక్‌హెడ్స్‌ను గోళ్లతో గిల్లడం కాని, నొక్కడంకాని చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మకణాలు సున్నితత్త్వాన్ని కోల్పోతాయి. దీంతో నునుపుదనం పోయి చర్మం గరుకుగా మారుతుంది. మచ్చలు, గీతలు పడడానికి అవకాశం ఎక్కువ. ►ముఖానికి ఆవిరి పట్టిన తర్వాత ముఖమంతటినీ లేదా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ ఉన్న ప్రదేశాన్ని మునివేళ్లతో మెల్లగా నొక్కడం ద్వారా సులువుగా తొలగించవచ్చు. ► మార్కెట్లో దొరికే బ్లాక్‌హెడ్స్ రిమూవర్ వాడడం కూడా సులువైన మార్గమే. కాని వాటిని వాడినప్పుడు చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి. -
ఇన్స్టంట్ గ్లో కోసం ఇలా చేయండి..
అరటిపండుని తొక్కతీసి గిన్నెలో వేసి మెత్తగా చిదుముకోవాలి. దీనిలో టీస్పూను తేనె, మూడు టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి వేసి పేస్టులా కలపాలి. శుభ్రంగా కడిగిన ముఖంపైన ఈ పేస్టుని పూతలా వేసుకుని ఆరనివ్వాలి. పదిహేను నిమిషాల తరువాత చేతులు తడి చేసుకుని ముఖాన్ని ఐదు నిమిషాలపాటు కిందనుంచి పైకి మర్దన చేసి కడిగేయాలి. ఈ ప్యాక్‌లోని బియ్యప్పిండి ముఖం మీద పేరుకుపోయిన జిడ్డుని తీసేస్తుంది. అరటిపండులోని విటమిన్ ఎ చర్మాన్ని మృదువుగా మారిస్తే, తేనె ముఖానికి తేమనందిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో ముఖానికి అందడం వల్ల ఇన్స్టంట్ గ్లోతో ముఖం మరింత కాంతిమంతంగా కనిపిస్తుంది. -
పచ్చిపాలతో ఇలా చేస్తే ముఖానికి సహజ సిద్ధ నిగారింపు
పచ్చిపాలు, రోజ్ వాటర్‌ను సమానంగా తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మర్దనా చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్ బాల్‌తో తుడిచేయాలి. పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఈ పాలను ముఖానికి రాసి ఐదు నిమిషాలపాటు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి. ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో పచ్చిపాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా పై రెండింటిలో ఏదైనా ఒక పద్దతిని అనుసరిస్తే ముఖానికి సహజ సిద్ధ నిగారింపు సంతరించుకుంటుంది. -
చూడటానికి పుట్టగొడుగులా ఉన్నా..ఈ గాడ్జెట్‌లో చాలా విషయం ఉందే!
నాజూకుగా ఉండటమే అసలైన అందంగా నిర్వచిస్తున్న కాలం ఇది. అందుకు ప్రయత్నించని అమ్మాయి లేదంటే అంత అతిశయోక్తి కాదేమో! గడ్డం కింద కనిపించే డబుల్ చిన్, బూరెల్లాంటి బుగ్గలు, మెడ చుట్టూ పేరుకున్న కొవ్వుని కప్పిపుచ్చడానికి ప్రయాస పడని పిల్ల లేదంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ ప్రయత్న, ప్రయాసలకు చెక్ పెడుతుంది ఈ డివైజ్. దీన్ని ఠి లైన్ ఫేషియల్ స్లిమ్మింగ్ టూల్ అని కూడా అంటారు. ఇది చూడటానికి పుట్టగొడుగులా ఉంటుంది. చిత్రంలో చూపించినట్టుగా పెదవుల మధ్య ఉంచి.. గాలిని లోపలికి పీలుస్తూ.. బయటికి వదిలిపెడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల ముఖం, మెడ, గడ్డం వంటి భాగాల్లో సరైన వ్యాయామం జరిగి.. అందమైన షేప్ వస్తుంది. ఈ టూల్ చాలా మన్నికైనది. పునర్వినియోగించదగినది. ఫుడ్–గ్రేడ్, హీట్–రెసిస్టెంట్ సిలికాన్ మెటీరియల్‌తో రూపొందిన ఈ టూల్‌ను.. ముక్కు, నోరు భాగాలకు దగ్గరగా ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి వాసనా ఉండదు. ఎవ్వరైనా వినియోగించొచ్చు. దవడలు, మెడ, గడ్డం ఇలా మొహంలో పేరుకున్న కొవ్వును ఈ స్లిమ్మర్ చాలా చక్కగా కరిగిస్తుంది. ఇందులో రకరకాల సైజులేం ఉండవు. ఒకే సైజ్‌లో లభిస్తుంది. ముఖ కండరాలకు మంచి వ్యాయామాన్నిచ్చి.. వయసుని తగ్గిస్తూ.. ముడతల్ని పోగొడుతుంది. రోజువారి వ్యాయామంలో దీన్ని భాగం చేసుకోవాలి. మూడు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపు రోజువారిగా కొంచెం కొంచెం పెంచుకుంటూ 8 వారాల పాటు స్వతహాగా ఈ ట్రీట్మెంట్ పొందితే..ముఖం స్లిమ్‌గా మారుతుంది. -
పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి..
టేబుల్ స్పూను తేనెలో, టీస్పూను పెరుగు, అరటీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఇన్స్టంట్ నిగారింపుని సంతరించుకుంటుంది. ఈ ప్యాక్ పొడిచర్మానికి బాగా పనిచేస్తుంది జిడ్డు చర్మతత్వం గలవారు ఈ ప్యాక్‌లో తేనెను తక్కువగా వేయాలి తేనె, పెరుగు ముఖచర్మానికి చల్లదనం ఇవ్వడంతోపాటు తేమను అందిస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచి, తాజాదనంతో కూడిన వర్ఛస్సునిస్తుంది. -
Beauty Tips In Telugu: ఆల్మండ్ స్క్రబ్‌తో నిగారింపు
ఐదు బాదం పప్పులను తీసుకుని బరకగా దంచుకోవాలి. కప్పు పెరుగుని బట్టలో వడగట్టి వచ్చిన నీటిని.. టీస్పూను, బాదం నూనె ఐదు చుక్కలు వేసి వీటన్నింటిని పేస్టులా కలిపితే ఆల్మండ్ స్క్రబ్ రెడీ. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆల్మండ్ స్క్రబ్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. కాసేపు అలాగే ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేయడం వల్ల ముఖచర్మంపై ఉన్న మృతకణాలు తొలగి, చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. చదవండి: Sudha Reddy: మెట్ గాలాలో మెరిసిన సుధారెడ్డి -
గంధంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. ముఖ్యంగా అవి
►గంధం పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్టులా కలుపుకుని మొటిమలపై రాయాలి. ఈ పేస్టుని క్రమం తప్పకుండా మొటిమలపై అప్లై చేయడం వల్ల ముఖంపై అసహ్యంగా ఉన్న మొటిమలు పోతాయి. ►ముల్తాని మట్టి, గంధం పొడిని సమపాళ్లల్లో తీసుకుని రోజ్ వాటర్‌తో పేస్టులా కలపాలి. దీనిని ముఖంపై ప్యాక్‌లా అప్లై చేసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుకారుతున్న చర్మం తాజాగా మారడంతోపాటు నిగారింపును సంతరించుకుంటుంది. ►శరీరం వేడిగా అనిపిస్తే.. గంధం నూనెను నీటిలో వేసి స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. ►చర్మ తత్వం ఎటువంటిదైనా తాజాగా ఉండాలంటే 50 ఎమ్ఎల్ రోజ్ వాటర్‌లో పది చుక్కల గంధం నూనె వేసి కలిపి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తాజాదనంతోపాటు, రక్షణ కలుగుతుంది. ► బాగా ఒత్తిడికి గురైనప్పుడు మూడు చుక్కల గంధం నూనెను టీ లో వేసుకుని తాగితే ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. -
రొమాంటిక్ సింబల్స్
ఎన్ని ట్రెండ్స్ మారిపోతున్నా లవ్ సింబల్‌కి ఉన్న క్రేజే వేరు. అది ఎప్పటికీ హృదయాలను దోచే ఎవర్గ్రీన్ ట్రెండ్ అనే చెప్పుకోవాలి. చూడగానే వావ్ అనిపించే లవ్ సింబల్స్ ఏ కలర్లో ఉన్నా కళ్లను కట్టిపడేస్తాయి. ఇక ఆ సింబల్స్ రెడ్ కలర్లో ఉంటే వాటికి రొమాంటిక్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ట్రై చెయ్యండి. మీ నాజూకైన గోళ్లకు మరింత అందాన్ని ఇవ్వండి. ముందుగా నెయిల్స్ క్లీన్ చేసుకుని.. షేప్ చేసుకోవాలి. తర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్పరెంట్ కలర్ వేసుకుని ఆరనివ్వాలి. ఇప్పుడు రెడ్ గ్లిట్టర్ నెయిల్ పాలిష్ తీసుకుని.. కుడి చేతి చూపుడు వేలు, ఉంగరపు వేలుతో పాటూ ఎడమ చేతి మధ్యవేలు, ఉంగరపు వేలు గోళ్లకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని.. కుడి చేతి మధ్య వేలుకి, బొటన వేలుకి, ఎడమ చేతి చూపుడు వేలుకి అప్లై చేసుకుని ఆరనివ్వాలి. ఇప్పుడు వైట్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని సన్నని బ్రష్‌తో.. కుడి చేతి మధ్యవేలు, ఎడమ చేతి చూపుడు వేలు గోళ్లపైన చిత్రంలో ఉన్న విధంగా లవ్ సింబల్స్ అప్లై చేసుకోవాలి. వాటి పక్కనే రెడ్ స్టోన్ అతికించుకోవాలి. తర్వాత కుడి చేతి చిటికెన వేలు గోరుతో పాటూ ఎడమ చేతి చిటికెన వేలు గోరుకి, బొటన వేలుకీ పింక్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. మరింత క్రేజీ లుక్ కోసం.. కుడి చేతి మధ్యవేలు గోరు కింద ఉండే చర్మానికి.. ఎడమ చేతి చూపుడు వేలు గోరు కింద ఉండే చర్మానికి లవ్ సింబల్ స్టోన్స్ అతికించుకుంటే అదిరే లుక్ మీ సొంతమవుతుంది. న్యూ ఫేస్ ముఖం కాంతివంతంగా మారాలన్నా... మచ్చలు, మొటిమలు లేకుండా మృదువుగా మారాలన్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. బయటికి వెళ్లి రాగానే చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, మేకప్ తొలగించి నిద్రపోవడం వంటివి చేయడంతో పాటు.. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి. న్యాచురల్ బ్యూటీ కావల్సినవి: క్లీనప్ : పచ్చిపాలు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, తేనె – 1 టీ స్పూన్, బియ్యప్పిండి – 1 టీ స్పూన్ మాస్క్: ఆరెంజ్ జ్యూస్ – 2 టీ స్పూన్లు, శనగపిండి – 1 టీ స్పూన్, ఖర్జూరం గుజ్జు – 1 టీ స్పూన్, అరటి పండు గుజ్జు – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా పచ్చిపాలు, తేనె కలిపి.. ఆ మిశ్రమంతో ముఖంపై క్లీనప్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, తేనె, బియ్యప్పిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్‌లో శనగపిండి వేసుకుని బాగా కలుపుకుని.. అందులో ఖర్జూరం గుజ్జు, అరటిపండు గుజ్జు వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి అపై్ల చేసుకోవాలి. ఇరవై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్ వేసుకున్న తర్వాత ముఖానికి సబ్బు పెట్టకపోవడమే మంచిది. -
ఇలా ఉంటా!
వృద్ధాప్యంలో మనం ఎలా కనిపిస్తాం? అనే ఆలోచనతో ఫేస్‌యాప్ అనే యాప్ తయారైంది. ఈ యాప్ సాయంతో ప్రతి ఒక్కరు టైమ్ మిషన్ అవసరం లేకుండా భవిష్యత్తులో తాము ఎలా ఉంటామో సరదాగా చూసుకుంటున్నారు. ఫేస్‌యాప్ చాలెంజ్ ద్వారా ముడుతలు నిండిన ముఖాలను చూసుకొని మురిసిపోతున్నారు. ఇప్పుడు ఈ చాలెంజ్‌లో శ్రుతీహాసన్ కూడా పాల్గొన్నారు. వృద్ధాప్యంలో తాను ఎలా ఉంటారో చూపించడమే కాకుండా తన ఓల్డ్ ఏజ్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా శ్రుతీహాసన్ సరదాగా పంచుకున్నారు. ‘‘జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా పదిమంది మనవళ్లు, మనవరాళ్లు, వివిధ దేశాల్లో ఉండే నా ఇల్లు, సంతృప్తికర జీవితం వీటన్నింటికీ నేను చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. ‘ఇప్పటికీ మీరు మానసికంగా చిన్నవాళ్లే’ అనే ప్రశ్నకు ఎప్పటిలానే ‘మన శక్తి మేరకు వర్కౌట్ చేయడమే’ అని సమాధానం ఇస్తుంటానేమో?’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్. ఇంతకీ అర్థమైందా? తాను ఓల్డ్ ఏజ్‌లో ఉన్నట్లుగానే ఫీలై, శ్రుతి ఈ విధంగా చెప్పారు. -
తక్కువ ధరకే లావా 4జీ స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లావా బుధవారం మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఏ97 పేరుతో వోల్టీ ఎనాబిల్డ్ 4జీ ఫోన్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ 12 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. రెండు వైపుల ఉన్న 5 ఎంపీ రియర్ కెమెరా ఎల్ ఈడీ ఫ్లాష్ తో పనిచేస్తుంది. తక్కువ కాంతి ఉన్నప్పటికీ మంచి క్వాలిటీ సెల్ఫీలు తీసుకునే వీలుంది. ఫేస్ బ్యూటీ, జిఫ్ మోడ్, వీడియో ఇమేజెస్ కాప్చర్, ఆడియో పిక్చర్లను ఇమేజ్ లుగా సేవ చేసుకునే ఫీచర్లు ఉన్నాయి. 5 ఇంచుల డిస్ ప్లే, 1.3 జీహెచ్ జీ క్వాడ్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ కలిగిన ఏ97 స్మార్ట్ ఫోన్ ఇన్ బిల్ట్ మొమరీ 8 జీబీ. దీన్ని 32 జీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకునే వీలుంది. దీని ధర రూ. 5,949. రిటైల్ అవుట్ లెట్లు, మల్టీ బ్రాండ్ అవుట్ లెట్లలో ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.