వేసవి ఎండలు మండిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తగినన్ని నీళ్లు తాగుతూ బాడీకి చల్లదనాన్ని ఇచ్చే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ముఖ్యం. అలాగే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువ వస్తాయి. చెమట పొక్కులు, దురదలు లాంటి రాకుండా ఉండాలంటే చర్మానికి సాంత్వన కలిగేలాకొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాంటి కొన్ని జాగ్రత్తలు మీకోసం
ముఖ్యంగా ఎండ వేడినుంచి ఉపశమనం కలిగేలా అందుబాటులో ఉన్న సహజమైన పదార్థాల ద్వారా కొన్ని ఫేస్ మాస్క్‌లను చూద్దాం.
హనీ-యోగర్ట్ మాస్క్ : ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులకు రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడగాలి.
వాటర్ మెలన్ మాస్క్: పుచ్చకాయ ముక్కలు అర కప్పు తీసుకుని చిదిమి గుజ్జు చేయాలి. ఆ గుజ్జును, నీటిని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.
కోకోనట్ ఆయిల్-టర్మరిక్ మాస్క్: టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో అర టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖం, మెడ, చేతులు, ΄ాదాలకు పట్టించాలి. కొంత ఆరిన తర్వాత (పూర్తిగా ఎండిపోకముందు) వేళ్లతో వలయా కారంగా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. నూనె జిడ్డు పూర్తిగా వదలక΄ోయినప్పటికీ నీటితో కడిగి టిష్యూతో తుడవాలి తప్ప సబ్బు వాడరాదు.
పపయా– హనీ మాస్క్: బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు అర కప్పు తీసుకుని బాగా చిదమాలి. అందులో టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.
మింట్-కుకుంబర్ మాస్క్: కీరదోస కాయ చెక్కు తీసి అర కప్పు ముక్కలు తీసుకోవాలి. అందులో గుప్పెడు పుదీన ఆకులు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి చర్మానికి పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.
నోట్: ఎండలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా లభించే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment