skin beauty
-
అందానికి హై ఫ్రీక్వెన్సీ మెషిన్! ఇదొక మంత్రదండంలా..
అందాన్ని అరచేతుల్లో కోరుకునే ఆడవారికి ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ఓ మంత్రదండంలా పని చేస్తుంది. ఇది మచ్చలు, ముడతలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి లోపాలను మాయం చేసేస్తుంది. చర్మాన్ని బిగుతుగా, నవయవ్వనంగా మారుస్తుంది. దీనిలో మూడు ట్యూబ్స్ లభిస్తాయి.వాటిలో రెండు స్కిన్ ట్యూబ్స్ చర్మానికి, ఒక స్కాల్ప్ ట్యూబ్ తలకు అనువుగా ఉంటాయి. ఒక స్కిన్ ట్యూబ్ మృతకణాలను తొలగించి, ముడతలను దూరం చేస్తుంది. మరో స్కిన్ ట్యూబ్ మొటిమలను, వాటి వల్ల ఏర్పడే మచ్చలను మాయం చేస్తుంది. ఇక స్కాల్ప్ ట్యూబ్ హెయిర్ గ్రోత్‌ను పెంచుతుంది. దీని వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు ఊడటం తగ్గుతుంది.ఈ డివైస్ 90% నియాన్, 10% ఆర్గాన్ తో కూడిన హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ మెషిన్. ఇది అన్ని రకాల చర్మాలకు అనువుగా ఉంటుంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్లను కోరుకునే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఇది చక్కటి బహుమతి అవుతుంది. పైగా దీన్ని వినియోగించడం చాలా తేలిక. దీని ధర 60 డాలర్లు. అంటే నాలుగువేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు.ఇవి చదవండి: ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్‌గా మారిన వాల్‌పేపర్ డిజైన్స్..! -
Hot Summer చర్మానికి కావాలి చల్లదనం, ఈ మాస్క్‌లు ట్రై చేయండి!
వేసవి ఎండలు మండిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తగినన్ని నీళ్లు తాగుతూ బాడీకి చల్లదనాన్ని ఇచ్చే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ముఖ్యం. అలాగే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువ వస్తాయి. చెమట పొక్కులు, దురదలు లాంటి రాకుండా ఉండాలంటే చర్మానికి సాంత్వన కలిగేలాకొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాంటి కొన్ని జాగ్రత్తలు మీకోసం ముఖ్యంగా ఎండ వేడినుంచి ఉపశమనం కలిగేలా అందుబాటులో ఉన్న సహజమైన పదార్థాల ద్వారా కొన్ని ఫేస్ మాస్క్‌లను చూద్దాం. హనీ-యోగర్ట్ మాస్క్ : ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులకు రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడగాలి. వాటర్ మెలన్ మాస్క్: పుచ్చకాయ ముక్కలు అర కప్పు తీసుకుని చిదిమి గుజ్జు చేయాలి. ఆ గుజ్జును, నీటిని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోకోనట్ ఆయిల్-టర్మరిక్ మాస్క్: టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో అర టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖం, మెడ, చేతులు, ΄ాదాలకు పట్టించాలి. కొంత ఆరిన తర్వాత (పూర్తిగా ఎండిపోకముందు) వేళ్లతో వలయా కారంగా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. నూనె జిడ్డు పూర్తిగా వదలక΄ోయినప్పటికీ నీటితో కడిగి టిష్యూతో తుడవాలి తప్ప సబ్బు వాడరాదు. పపయా– హనీ మాస్క్: బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు అర కప్పు తీసుకుని బాగా చిదమాలి. అందులో టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. మింట్-కుకుంబర్ మాస్క్: కీరదోస కాయ చెక్కు తీసి అర కప్పు ముక్కలు తీసుకోవాలి. అందులో గుప్పెడు పుదీన ఆకులు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి చర్మానికి పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నోట్: ఎండలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా లభించే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. -
బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు!
కొంతమంది స్కిన్ చాలా మెరిసిపోతుంది. మరి కొంతమందికి మాత్రం డ్రై స్కిన్, మొటిమలు, టాన్, పిగ్మంటేషన్, మచ్చలు, డల్ స్కిన్ వంటి సమస్యలు ఉంటాయి. వీటి వల్ల చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పతారు. నలుగురిలోకి వెళ్ళలేరు. అయితే, విటమిన్ ఇ చర్మానికి సంబంధించిన అనేక సమస్యల్ని దూరం చేస్తుంది. మరి దీనిని ఎలా అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏయే లాభాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇలా చేయండి.. చర్మ సమస్యలకి విటమిన్ ఇ చక్కటి ఉపశమనం. ఇందుకోసం టీ స్పూన్ బొప్పాయి జ్యూస్, టీ స్పూన్ రోజ్ వాటర్‌ని తీసుకోవాలి. అందులోనే విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్కిన్ టోన్ పెరగడానికి: కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్‌ని అంతే పరిమాణంలో పెరుగు, గుడ్డుతో కలపండి. దీనిని బాగా మిక్స్ చేయండి. దీనిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి. తర్వాత శుభ్రం చేయండి. ముఖం మెరిసిపోతుంది. విటమిన్ ఈ ఆయిల్‌ని కలబందతో కలిపి కూడా వాడొచ్చు. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది. కాంతిమంతంగా మారుతుంది. టీ స్పూన్ పరిమాణంలో గ్రీన్ టీ తీసుకోండి. అందులోనే తేనె కూడా వేయండి. తర్వాత కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ వేయండి. వీటన్నింటిని కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ఇవి చదవండి: చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు -
valentines day: అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా?
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. ఎక్కడ చూసినా ‘వాలంటైన్స్ డే ’ఫీవరే. వాలెంటైన్ వీక్ అంటూ ప్రేమికులు వారం రోజులపాటు సంబరాలు చేసుకుంటారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంతో ఈ సంబరాలు పీక్ అన్నట్టు. మరీ మీ ఫేస్ అందంగా, ఫుల్ వాలెంటైన్ గ్లోతో అచ్చమైన చందమామలా మెరిసిపోవాలిగా? అందుకే... ఈ చిట్కాలు మీ కోసమే...! ♦అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. ఇది ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు దూరం అవుతాయి. ♦ ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి ముఖ చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. ♦ పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కల΄ాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. ♦ రెండు టీస్పూన్ల వేప పొడి, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటిని మెత్తగా చేసి ముఖం, మెడ భాగాలల్లో రాయాలి. పావు గంట తర్వాత చల్లటి నీటితో వలయాకారంలో ముఖాన్ని రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చర్య సౌందర్యానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎప్పుడూ ముఖ్యమైనది. చివరి నిమిషంలో మొటిమలు రాకుండా ఉండటానికి చక్కెర ,పాల ఆహారాలకు దూరంగా ఉండండి. ఒక కప్పు వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే మచింది. ఇలాచే స్తే టాక్సిన్స్ అన్నీ పోయి చర్మానికి మెరుపు వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బ్రోకలీ బచ్చలికూర, క్యారెట్లు, అవకాడోలు, అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయలులాంటి వాటిని డైట్లో చేర్చుకోండి. తగినంత నీరు త్రాగడం మీ చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచుతుందనే మర్చిపోకూడదు. -
గుడ్లు, ఆకుకూరలు తింటున్నారా? మీ చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా?
శరీరానికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనం ఏం తింటామో అదే మన చర్మంపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ఆహారం తీసుకోకపోతే వ్యర్థమే. బ్యాలెన్స్ డైట్లో విటమిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారం చర్మ సంరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుంది. మరి విటమిన్-ఎ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో లభ్యమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. క్యారట్లు: విటమిన్-ఎ కి బెస్ట్ ఛాయిస్ క్యారట్లు. రోజూ కప్పు క్యారెట్ ముక్కలు తింటే రోజువారీ శరీరానికి అవసరమైన విటమన్ ‘ఎ’లో దాదాపుగా 334 శాతం అందుతుందని అధ్యయనంలో వెల్లడైంది. చాలామంది క్యారట్స్ని వండుకొని తింటారు. కానీ క్యారట్స్లోని పోషకాలు సంపూర్తిగా అందాలంటే పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ తీసుకుని తాగచ్చు. చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా బాగుంటాయి. పాలు: పాలల్లో కాల్షియమే కాదు విటమిన్ ఏ కూడా ఉంటుంది. ప్రతిరోజూ గ్లాసెడు పాలు తాగడం వల్ల మీ స్కిన్‌టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గుడ్లు గుడ్లలో విటమిన్ ‘డి’ తోపాటు అధికమోతాదులో విటమిన్ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగవుతుంది. ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమన్ ‘ఎ’ పుష్కలంగా ఉంటుంది. కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. ప్రతిరోజూ వీటిని మీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి టమాటా: విటమిన్ ‘ఎ’ టమాటాల్లో అధికంగా ఉంటుంది. సహజంగానే మనరోజువారీ వంటకాల్లో టమాటా ఉపయోగిస్తాం! వంటలతోపాటు టమాటా సూప్, టమాటా చట్నీ ఇలా కూడా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరానికి సరిపడా అందుతాయి. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ: కెరోటినాయిడ్, ఆల్ఫా-కెరోటిన్ లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్‌కి కూడా సహాయపడుతుంది. -
స్కిన్ కలర్ బెటర్ చేయగలం.. కానీ.. పూర్తిగా మార్చలేం..
-
ఇలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడండి సమ్మర్ లో మీ చర్మం మెరిసిపోతుంది
-
తరుచూ పెరుగు వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!
వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లలో పెరుగు కలిపి వాడడం సర్వసాధారణం. పెరుగు చర్మనిగారింపుని పెంచడంతోపాటు, ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తొలగిస్తుంది. ఈ రెండు కారణాలతోనే ఎక్కువగా ఫేస్ ప్యాక్‌లలో పెరుగుని వాడుతారు. అలాగని తరచూ పెరుగు వాడడం వల్ల చర్మానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జిడ్డు చర్మతత్వం ఉన్న వారు పెరుగుని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గడానికి బదులు పెరుగుతాయి. ఎందుకంటే ముఖం మీద ఉన్న రంధ్రాలు పెరుగు వల్ల మరింత తెరుచుకుని మొటిమలు వస్తాయి. వేసవి, వర్షాకాలంలో పెరుగు వాడకం ఎక్కువగా ఉంటే మొటిమల సమస్య తీవ్రం అవుతుంది. పెరుగులో ప్రోటిన్, ల్యాక్టోజ్, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్నాయని రాత్రి సమయంలో పెరుగు తింటే చర్మసమస్యలు పెరుగుతాయి. శరీరం మొత్తంలో ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇంతటి సున్నితమైన చర్మంపై పుల్లటి పెరుగు అప్లై చేస్తే మంట, దురద, దద్దుర్లు వస్తాయి. పెరుగుని ముఖానికి రాసి ఎక్కువసేపు ఉంచుకోకూడదు. జిడ్డు చర్మంపై పెరుగు రాస్తే చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. కొంతమందికి పాలు, పాల ఉత్పత్తులు సరిపడవు. ల్యాక్టోజ్ అలెర్జీని కలుగజేస్తుంది. ఇటువంటి వారు ఫేస్‌ప్యాక్‌లలో కూడా పెరుగుని వాడకపోవడమే మంచిది. ఫేస్‌ప్యాక్‌లలో పెరుగు వాడితే మరిన్ని చర్మసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. -
నిగనిగలాడే కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేయండి..!
ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పాల పొడి, ఒక టీ స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. వీటితో పాటు పొడిచర్మం అయితే కొద్ది చుక్కల గ్లిజరిన్, ఆయిలీ స్కిన్ అయితే పన్నీరు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లయ్ చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. -
పొటాటో పోషణ
బంగాళ దుంపలను తొక్కతీసి తురుముకుని రెండు టీస్పూన్ల రసం తీసుకోవాలి. ఈ రసంలో టీస్పూను రోజ్ వాటర్, ఐదు చుక్కలు నిమ్మరసం వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి ఆరేంత వరకు మర్దన చేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడగాలి. వారంలో రెండు మూడుసార్లు ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది దీనిలోని కాపర్, జింక్‌లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తాయి పొటాషియం, మెగ్నీషియంలు చర్మానికి పోషకాలను అందిస్తాయి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే చర్మంలో త్వరగా మంచి మార్పు కనిపిస్తుంది. -
Beauty Tip: సోప్ కాని సోప్.. ఈ మిశ్రమం చర్మ నిగారింపు పెంచడంతో పాటు..!
కప్పు శనగపిండిలో, పావు కప్పు పచ్చిపాలు, ఐదు టేబుల్ స్పూన్ల కల్లుప్పు, రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసి బాగా కలపాలి. స్నానం చేసే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి రాసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. శుభ్రంగా తడి తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు వదిలి చర్మం కోమలంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని సబ్బుకు బదులుగా వాడుకోవడం వల్ల చర్మం సహజ సిద్ధమైన నిగారింపుని సంతరించుకుంటుంది. -
అద్భుతమైన సౌందర్య పోషకంగా.. ఉల్లిపాయ
-
Beauty Tips: ముఖారవిందానికి పప్పుల ఫేస్ ప్యాక్స్!
ముఖం అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే రసాయన క్రీములన్నీ వాడేస్తుంటారు. ఇవి కొన్నిసార్లు దుష్ప్రభావాలు చూపించి ఉన్న అందాన్ని కోల్పోయేలా చేస్తాయి. అయితే ఎటువంటి రసాయనాలు వాడకుండా మనింట్లో ఉండే పప్పులతో ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.. శనగపప్పు మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. మసూర్‌దాల్ కప్పు ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. పెసరపప్పు అరకప్పు పెసరపప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్టులా రుబ్బుకోవాలి. దీనికి టేబుల్ స్పూను పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాల తరువాత నీటితో మర్దన చేసి, కడిగేయాలి. ఈ ప్యాక్‌తో విటమిన్ ఏ, సీలు ముఖారవిందాన్ని మరింత మెరిపిస్తాయి. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
Health Tips: ఎండలో ఎంతసేపుంటే సరిపడా విటమిన్ ‘డి’ అందుతుంది?
సుకుమారంగా ఉండే వారిని ఎండ కన్నెరగరని వారంటారు. సౌకుమార్యం విషయంలో చెప్పుకోవడానికి ఈ పోలిక బాగున్నా, నిజానికి శరీరానికి ఎండ తగలకపోతే రకరకాల వ్యాధుల బారిన పడటం ఖాయమని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే శరీరానికి సూర్యరశ్మి తాకితే విటమిన్ డీ ఉత్పత్తవుతుంది. ఇది ఎముకలు గట్టిపడటానికి అవసరమైనది. అలా అని గంటల తరబడి ఎండలో గడపటం, ఎండలో తిరగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి, మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా సూర్యరశ్మి చాలా అవసరం. ఉత్తర భారతదేశానికి చెందిన 69 శాతం మంది మహిళల్లో విటమిన్–డి లోపం ఉంది. వారి శరీరానికి సూర్యరశ్మి సరైన మోతాదులో అందకపోవడం అందుకు ఒక కారణం. ఎండ వల్ల శరీరంలో ఉత్తేజాన్ని పెంచే సెరోటోనిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తవుతుందని ఓ అధ్యయనం తెలిపింది. తగినంత సూర్యరశ్మిని ఎలా పొందాలి? ►ఎంతసేపు ఎండలో ఉండాలి? అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. ఏ కాలం, ఏ రోజు, ఏ సమయం అనేది ఆయా వ్యక్తుల చర్మం తీరు లాంటి అనేక విషయాలపై అది ఆధారపడి ఉంటుంది. ►ఏ ఎండకాగొడుగు అన్నట్టు ఏ ఎండ పడితే ఆ ఎండ వంటికి మంచిది కాదు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఉండే సూర్యరశ్మి ఆరోగ్యకరమంటారు. ►ఒక్కో వ్యక్తికి ఒక్కో మోతాదు సూర్యరశ్మి అవసరమవుతుంది. ఎండతో వచ్చే సమస్యల తీవ్రత కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ►చర్మం పలుచగా ఉంటే, వేసవి కాలంలో రోజూ ఓ 20 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
ముఖంపై ముడతల్ని పోగొట్టే ఈ గాడ్జెట్ గురించి తెలుసా?
అందంగా కనిపించడానికి లేపనాలెన్ని ఉన్నా.. వేగంగా ఫలితాన్నిచ్చే డివైజ్‌లకే మార్కెట్లో డిమాండ్! అలాంటిదే ఇక్కడ కనిపిస్తున్న ఈ మినీ పర్సనల్ స్కిన్ స్క్రబ్బర్. పైపై పూతలు ఎన్ని పూసినా రాని నిగారింపు.. ఈ సాధనంతో సాధ్యమవుతుంది. మాయిశ్చరైజింగ్, యాంటీ–ఏజింగ్, వైటెనింగ్‌తో పాటు మొటిమలు, మచ్చలు పొగొట్టడానికీ ఈ గాడ్జెట్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. 5 మోడ్స్‌తో కూడిన ఈ న్యూయెస్ట్ అల్ట్రాసోనిక్ అయానిక్ క్లీనర్.. ఫేస్ క్లీనర్లా, ఫేస్ స్క్రబ్బర్‌లా, వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవల్‌గా కూడా పని చేస్తుంది. ఈ హై–ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఫేషియల్ డివైజ్.. ముఖాన్ని మృదువుగా, తేమగా ఉంచడంతో పాటు.. చర్మరంధ్రాల్లో ఇరుక్కున్న ధూళిని పూర్తిగా తొలగిస్తుంది. ఈ గాడ్జెట్ ముందు భాగంలో.. అయాన్+, అయాన్, ఫేస్ లిఫ్టింగ్, ప్యాట్ మసాజ్, క్లీనింగ్ వంటి ఆప్షన్స్‌తో పాటు.. ఆన్/ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఆ బటన్ని 2 సెకన్ల పాటు నొక్కి ఉంచితే సందర్భాన్ని బట్టి ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఈ స్కబ్బర్కి.. డేటా కేబుల్, కంప్యూటర్, మొబైల్ ద్వారా కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల చర్మతత్వాలకు ఇది ఉపయోగపడుతుంది. డివైజ్ పై–క్యాప్ తొలగించి, అవసరమైన చోట చర్మానికి ఆనించి, మోడ్స్ ఆన్ చేసుకోవాలి. మోడ్ 1 బ్లాక్ హెడ్స్ రిమూవ్ చెయ్యడానికి, మోడ్ 2 క్లీనింగ్ చేయడానికి, మోడ్ 3 ఫేస్ లిఫ్టింగ్ కోసం (ముడతలు తొలగించేందుకు) ఇలా ఒక్కో మోడ్‌కి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. 45 డిగ్రీల సెంటిగ్రేడ్ థర్మోస్టాటికల్ హైక్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిన ఈ చిన్న పరికరాన్ని.. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. వయసు తెలియనీకుండా ముడతలను తొలగించి, చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు.. కలర్ వచ్చేందుకు, మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గేందుకు ఇది సహాయపడుతుంది. -
Skin Care Tips: అలొవెరా జ్యూస్ తాగితే ఇన్ని ఉపయోగాలా?!
కాలుష్యం, సౌందర్య ఉత్పత్తులు, పని ఒత్తిడి కారణమేదైనా.. మీ చర్మం సహజ కాంతిని కోల్పోతున్నట్లనిపిస్తే వెంటనే తగుజాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మానికి తీరని నష్టం వాటిల్లుతుంది. వీటితోపాటు మీ ఆహార అలవాట్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం ద్వారా అందే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మృదువుగా ఉంచేందుకు ఎంతో తోడ్పడతాయి. ఒకవేళ సహజమైన పద్ధతుల్లో మీ చర్మానికి చికిత్స అందించాలంటే అలోవెరా (కలబంద)కు మించిన ఔషధం మరొకటి లేదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అలొవెరా ఏ విధంగా చర్మకాంతిని మెరుగుపరుస్తుందో తెలుసుకుందాం.. చర్మానికి కలబంద చేసే మేలు.. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు అధికంగా ఉంటాయి. డల్ స్కిన్, ముడతలకు కారణమయ్యేఫ్రీ రాడికల్స్ నివారణకు సహాయపడుతుంది. డీకే పబ్లిషింగ్ హౌస్ వారి ‘హీలింగ్ ఫుడ్స్’బుక్ ప్రకారం బేటా కెరోటిన్, సి, ఇ, బి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, బిలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆయుర్వేదంలో కూడా మొటిమలు, కాలిన గాయాల నివారణకు అలొవెరా ఉపయోగంలో ఉంది. అలొవెరా జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే.. కలబందను జ్యూస్ రూపంలో తాగడం చాలా ఉత్తమమైన మార్గం. మీడియం సైజులో ఉండే ఒక అలొవెరా ఆకును తీసుకుని, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పై తోలును తొలగించి జెల్‌ను ఒక గిన్నెలో వేసి నీళ్లతో శుభ్రం చేయాలి. దీనిలో పైనాపిల్,యాపిల్ ముక్కలను వేపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అంతే! కలబంద జ్యూస్ రెడీ!! ఈ విధంగా తయారుచేసుకున్న జ్యూస్ ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! -
Skin Health: బీట్ రూట్, పెరుగు, పాలకూర, దానిమ్మగింజలు ప్రతిరోజూ తిన్నారంటే..!
ఎండ, కాలుష్యం వల్ల శరీర ఆరోగ్యంతోపాటు చర్మానికి చాలా నష్టం వాటిల్లుతుందని మీకు తెలుసా? చర్మం ఆరోగ్యంగా, తాజాగా మెరవడానికి మానసిక ఆరోగ్యంతోపాటు, ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఐతే మీ రోజువారీ ఆహార అలవాట్లతో చర్మం సహజంగా కాంతులీనాలంటే ఈ కొద్దిపాటి మార్పులు అవసరం అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా.. బీట్ రూట్ బీట్ రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మృతకణాల స్థానంలో కొత్తవి నిలపడంలో, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో, పిగ్మెంటేషన్ తొలగింపులో బీట్ రూట్ రసం కీలకంగా వ్యవహరిస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడమేకాకుండా శరీరంలో రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరచి, చర్మం మెరిసేలా చేస్తుంది. శరీరంలో హానికారక టాక్సిన్స్‌ను తొలగించి మీ ముఖం మీద ఆరోగ్యకరమైన కాంతి నిలిచిఉండేలా ప్రేరేపిస్తుంది. పెరుగు చర్మ సంబంధిత సమస్యలకు పెరుగు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో లాక్టిక్ ఆమ్లం, జింక్, విటమిన్ ‘బి’, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు ఆహారంలో భాగంగా తీసుకుంటే మీ చర్మ కాంతి మరింత మెరుపులీనుతుంది. చదవండి: Period Pain Relief: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి.. పసుపుకలిపిన పాలు ప్రాచీనకాలం నుంచే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఇది ఆచరణలో ఉంది. పసుపుకలిపిన పాలు ప్రతిరోజూ తాగడం వల్ల ముఖంపై పేరుకుపోయిన సన్‌టాన్ తొలగించి, చర్మానికి సహజమైనమెరుపును అందిస్తుంది కూడా. పాలకూర పాలకూరలో విటమిన్లు, మినరల్స్ నిండుగా ఉంటాయి. చర్మంపై మచ్చలను తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండాచేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. నిమ్మ ‘సి, బి’ విటమిన్లు, పాస్ఫరస్ నిమ్మలో పుష్కలంగా ఉంటాయి. సహజమైన చర్మకాంతికి ఇది చక్కని పోషకం. నిమ్మలోని సహజ ఆమ్లాలు మృతకణాలను తొలగించి, వయసు పెరిగేకొద్ది చర్మంపై ఏర్పడే ముడతలను నివారిస్తుంది. అవిసెగింజలు ఒమేగా -3 ఆమ్లాలు అధికంగా ఉండే అవిసె గింజలు మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, తేమగా ఉండేలా చేస్తుంది. అవిసె గింజలు నేరుగా తిన్నా లేదా వంటలలో వాడినా ఏ విధంగా తీసుకున్నా మీ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. దానిమ్మగింజలు దానిమ్మపండు గింజలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి ఉపకరిస్తాయి. వృద్ధాప్య ఛాయలనుంచి రక్షణ కల్పించడమేకాకుండా సూర్య రశ్మి వల్ల దెబ్బతిన్న చర్మానికి చికిత్సనందిస్తుంది. దానిమ్మను జ్యూస్ రూపంలో తాగొచ్చు లేదా గింజలను నేరుగా తిన్నా ఫలితం ఉంటుంది. ఈ ఆహార అలవాట్లతో మీ చర్మం కాంతులీనుతుందనేది నిపుణులు మాట. చదవండి: 7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలిస్తే షాక్!! -
ముఖం తేటగా కనిపించాలంటే.. ఈ కొద్దిపాటి మార్పులు అవసరం..!
ముఖం తేటగా, ఆరోగ్యంగా, ప్రసన్నంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దానికి పాటించాల్సిన కొన్ని తేలికపాటి సూచనలివి. ఆహారపరంగా... ►రోజు క్రమం తప్పకుండా అన్ని రకాల పోషకాలు అందేలా సమతులహారాన్ని నియమిత వేళలకు తీసుకుంటూ ఉండాలి. అందులో ఆకుకూరలు, కూరగాయలూ, మునగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ►ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తీసుకుంటూ ఉండాలి. ►డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్‌ను రోజూ నాలుగు పలుకులు తినడం మంచి ఫలితాలను ఇస్తుంది. ►రోజూ కనీసం నాలుగు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఇతరత్రా జాగ్రత్తలు... ►తీక్షణమైన ఎండ/ చలి/ మంచు లేదా పొగ వంటి కాలుష్య ప్రభావాలకు ముఖం నేరుగా గురికాకూడదు. ►తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది. ►ప్రతిరోజూ ప్రాణాయాయం / ధ్యానం వంటివి చేస్తూ ఉంటే ఆందోళన, మానసిక ఒత్తిడులు దూరమవుతాయి. దాంతో ముఖం ప్రశాంతంగా, ప్రనన్నతతో కనిపిస్తుంది. ప్రస్ఫుటమవుతాయి. ►రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల మర్నాడు ముఖం తేటగా కనపడుతుంది. రాత్రి జాగరణ వల్ల తీవ్రమైన అలసట, నిస్సత్తువలతో ముఖం కళాకాంతులు కోల్పోతుంది. స్నానం... మేకప్... ఇక చర్మానికి హాని కలిగించే గాఢమైన రసాయనాలు ఉండే సబ్బులు, షాంపూలకు బదులు దానికి మైల్డ్ సోప్ వాడటం మేలు. సాధ్యమైనంత వరకు క్రీములు వంటివి వాడకపోవడమే మంచిది. మహిళల విషయంలోనూ తేలికపాటి మేకప్‌తోనే మంచి ఫలితం ఉంటుంది. -
Skin Care Tips: డ్రైఫ్రూట్స్, గుడ్లు, చేపలు తిన్నారంటే..
సీజన్ మారితే మన శరీరంలో కూడా మార్పులు వెంటనే చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పొడి చర్మం మరింతగా వేదిస్తుంది. వాతావరణంలో తేమ స్థాయిలు తక్కువైనా, చలి లేదా వేడిగా ఉన్నా, వేడి నీళ్లతో స్నానం చేస్తున్నా.. చర్మం పొడిబారిపోతుంది. ఐతే మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా సహజమైన పద్ధతుల్లో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మీకు తెసుసా! జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ కాస్మొటాలజీ ప్రకారం ప్రొటీన్లు, తాజా పండ్లు, కూరగాయలు వంటి నీటి శాతం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా సహాయపడతాయని పేర్కొంది. లోపల్నుంచి తగిన పోషకాలను అందిస్తే చర్మానికి మరింత మేలు చేకూరుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వులు డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రేస్ కలిగించే హానికారకాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి ఒక స్పూన్ లేదా గుప్పెడు డ్రైఫ్రూట్స్ ప్రతిరోజూ తినడం వల్ల అధిక క్యాలరీలు అందడమే కాకుండా మీ శరీర కాంతిని మెరుగుపరుస్తుంది. సోయ సోయలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని ఐసోఫ్లేవోన్స్ కొల్జాజెన్ను కాపాడి చర్మ ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. సోయ పాలు లేదా టోఫు ఏ విధంగా తీసుకున్న చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టమాట టమాటాల్లో విటమిన్ ‘సి’, లైకొపీన్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. టమాటాలను ఉడికించి క్రీమీ పేస్ట్‌లా లేదా తక్కువ నూనెలో వేయించి అయినా తినొచ్చు. చేప చేపలో ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఐతే ఇవి సహజంగా శరీరంలో ఉత్పత్తి కావు. కణత్వచం (పై పొర) ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తడిగా ఉంచుతుంది. గుడ్డు సల్ఫర్, లూటీన్ గుడ్డులో అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృధువుగా, చెమ్మగా ఉంచుతుంది. అల్పాహారంలో లేదా ఇతర ఏ పద్దతుల్లో తిన్నా మంచిదే. సిట్రస్ ఫ్రూట్స్ విటమిన్ ‘సి’ ఈ పండ్లలో నిండుగా ఉంటుంది. ఆరెంజ్, కిన్నో, స్వీట్ లెమన్.. వంటి పండ్లలో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా హైడ్రేషన్‌ను అందిస్తుంది. క్యారెట్ బేటా కెరోటిన్, విటమిన్ ‘సి’లకు క్యారెట్ బెస్ట్. ఈ రెండు విటమిన్లు చర్మకాంతిని మెరుగుపరచడంలో, వృద్ధాప్యాన్ని నివారించడంలో తోడ్పడతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ఈ ఆహారపు అలవాట్లు మీ శరీరసోయగాన్ని మరింత పదిలంగా కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే! -
వానాకాలంలో చర్మసమస్యలా.. ఈ డ్రింక్స్ తాగితే..
వర్షాకాలం వచ్చేసింది. వాన జల్లులు హాయిని కలిగించినా ఎన్నోచర్మ, ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో పొంచి ఉంటాయనే విషయం మరచిపోకూడదు. జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం వల్ల వీటినుంచి బయటపడవచ్చు. రోజువారీ ఆహారంలో కొన్ని డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. డిటాక్స్ డ్రింక్స్ అంటే.. యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటే పండ్లు, కూరగాయలతో తయారు చేసిన ద్రావకం. ఇవి శరీరంలో ఉత్పత్తయ్యే హానికర విషపదార్థాలను బయటికి పంపడానికి, రక్త శుద్ధికి, జీవక్రియను క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. తద్వారా మన చర్మకాంతి పెరగడమేకాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే 5 రకాల డిటాక్స్ డ్రింక్స్ మీకోసం.. గ్రీన్ టీ మనకు తెలిసిన ప్రసిద్ధ డిటాక్స్ డ్రింక్స్‌లో గ్రీన్ టీ ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నిమ్మ రసం ఇంట్లో తయారు చేసుకుకోగల నిమ్మరసం శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ డ్రింక్‌లో విటమిన్ ‘సి’ నిండుగా ఉంటుంది. ఇది కేవలం సూక్ష్మజీవులు, శిలీంధ్ర సంబంధిత అంటురోగాల నుంచి కాపాడటమేకాకుండా, చర్మకాంతిని పునరుద్ధరిస్తుంది. పసుపు కలిపిన పాలు పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల చేకూరే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసి టీ ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఔషధ మొక్క తులసి. ప్రాచీనకాలం నుంచే సంప్రదాయ వైద్య పద్ధతుల్లో తులసి వాడుకలో ఉంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలానుగుణంగా సంక్రమించే అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. తులసి ఆకులను నీళ్లలో బాగా మరిగించి, ఒడగట్టి, వేడి వేడిగా తాగాలి. ఈ హెర్బల్ టీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, రోజు మొత్తం ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజమైన డిటాక్స్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ప్రసిద్ధమైనవి. ఇవి హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొబ్బరినీళ్లు చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేకాకుండా, చర్మంపై ముడతలు, గీతలు తగ్గిస్తాయి. రోజువారి పోషకాహారంలో భాగంగా ఈ 5 రకాల డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యమైన, ప్రకాశవంతమైన చర్మసౌందర్యం మీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది! చదవండి: Dandruff Tips: చుండ్రు సమస్యా.. ‘వేప’తో ఇలా చెక్ పెట్టొచ్చు! -
బొప్పాయి గుజ్జుతో మేని కాంతి
బొప్పాయి పండు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పండుకు సులువుగా ఇంట్లో దొరికే ఇతర పదార్థాలను కలిపితే సౌందర్యం ఇనుమడిస్తుంది. ♦ కొద్దిగా బియ్యప్పిండి తీసుకొని అందులో బొప్పాయి గుజ్జుని చేర్చితే ఒక మిశ్రమంగా తయారవుతుంది. దీనిని ముఖ చర్మానికి రాసుకుంటే మొటిమలు మాయమవడంతోపాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ♦ బొప్పాయిగుజ్జులో ఒక చెంచా పచ్చిపాలు, తేనె, పసుపు, తులసి ఆకుల చూర్ణం కలుపుకొని ముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు తగ్గుతాయి. ♦ బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అంది యవ్వనంగా కనిపిస్తారు. ♦ నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయను మీ సొంతం చేసుకున్నట్టే. ♦ బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది. కోడిగుడ్డులోని తెల్లసొన కొద్దిగా తీసుకొని ఒకస్పూన్ బొప్పాయి గుజ్జుతో బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక అరగంట సేపు అలానే ఉంచుకొని ఆరిన తర్వాత ముఖాన్ని చన్నీళ్ళతో కడిగేసుకోవాలి. -
చందన చికిత్స
చర్మ సౌందర్యం పెంపొందించడం, ముఖం కాంతివంతంగా మారడానికి ట్రీట్మెంట్లు అన్నీ బ్యూటీపార్లర్‌లోనే సాధ్యమవుతాయన్న అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లను ఇంట్లోనే చేసుకుంటే కాంతులీనే ముఖం మీ సొంతం.ఎర్రచందనం పేస్ట్‌ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటే మంచి గ్లో వస్తుంది.ఎర్రచందనం పౌడర్‌లో కొబ్బరి పాలు కలిపి ఆ పేస్ట్ ముఖానికి రాసుకొని పది నిముషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే ముఖం కాంతివంత మవుతుంది. వెనిగర్, రోజ్‌వాటర్ సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. కొబ్బరి నీళ్లలో పైనాపిల్ జ్యూస్ కలిపి ముఖానికి, మెడకు రాసుకొని పది నిముషాల తరువాత క్లీన్ చేసుకోవాలి.క్యారట్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిముషాల తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసే నీళ్లలో అర కప్పు తేనె కలుపుకొని స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. -
టీ బ్యాగ్స్... చర్మానికి మేలైన పోషణ...
చర్మసౌందర్యానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనుకుంటారు చాలా మంది. కానీ, సమయం లేదనో, తప్పనిసరి అనో హడావిడిగా పనులు ముగించేస్తుంటారు. ఆ తర్వాత తొందరపడ్డామే అనుకుని బాధపడుతుంటారు. చిన్నవే అయినా సౌందర్యపోషణలో తరచూ చేసే కొన్ని తప్పులను ఇలా సవరించుకోవచ్చు.. {Xన్ టీ తాగుదామని తెచ్చుకొని, నచ్చక ఆ బ్యాగ్స్‌ని పడేస్తుంటారా? టీ బ్యాగ్స్‌ని పడేయకుండా ఈ సారి వాటిలో కొన్నింటిని టబ్ నీళ్లలో వేసి, అందులో కాసేపు మీ పాదాలను ఉంచండి. పాదాలు రిలాక్స్ అవుతాయి. మురికి వదిలి, పై చర్మం నునుపుగా మారుతుంది.హెయిర్కలర్ని ఉపయోగిస్తున్నారా? అయితే ముందుగా ప్యాచ్‌టెస్ట్ చేసుకోండి. మీరు ఏ రంగైతే జుట్టుకు వేసుకోవాలనుకుంటున్నారో దానిని కొద్దిగా చెవి వెనుకభాగంలో రాసి చూడండి. 24 గంటల పాటు అలాగే వదిలేయండి. చర్మంపై దురద, దద్దుర్లు లేవంటే మరుసటి రోజు ఆ కలర్ ని నిరభ్యంతరంగా వాడవచ్చు. కలర్ వేసుకున్నాక చర్మసమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఇదో చిన్న టెక్నిక్. రోజులో ఎక్కువ గంటలు లిప్‌స్టిక్‌తో ఉండక తప్పనిసరా? అయితే, లిప్‌స్టిక్ తొలగించిన ప్రతీసారి స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ని దూది ఉండతో తీసుకొని, పెదాలకు సున్నితంగా రాయండి. దీని వల్ల లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదాల చర్మాన్ని దెబ్బతీయకుండా కాపాడుకోవచ్చు. మీ చర్మం మొటిమల వల్ల జిడ్డుగా, మరింత నల్లగా కనపడుతుందా? ఈ సమస్యకు విరుగుడుగా ఫేస్‌వాష్ నుంచి మేకప్ వరకు అన్నీ ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించండి. అలాగే, ప్రతి రోజూ ఉదయాన్నే మగ్ గోరువెచ్చని నీటిలో మూడు - నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖాన్ని శుభ్రపరచండి. చర్మం తరచూ పొడిబారుతోందా? ఆవనూనెను శరీరమర్దనలో ఉపయోగిస్తారు. చర్మం పగుళ్లు, పిగ్మెంటేషన్ వంటివి నివారిస్తుంది. వారానికి ఒకసారి ఆవనూనెతో ముఖాన్ని, దేహాన్ని మర్దన చేసుకుంటే ఒత్తిడి నుంచి రిలీఫ్ కలుగుతుంది. -
మేని మెరుపులకు...
చర్మసౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు చాలా మంది. అయితే కొన్ని సార్లు చర్మాన్ని మెరుగు పెట్టే సౌందర్య ఉత్పాదనలు, ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా హాని జరుగుతుంటుంది. అవగాహన లేమి దీనికి ప్రధాన కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఏమేం చేయకూడదంటే... Right: చర్మం తెల్లగా అవ్వాలని, మృదువుగా అవ్వాలని స్క్రబ్(మార్కెట్లో రకరకాల స్క్రబ్‌లు అందుబాటులో ఉన్నాయి) తో అతిగా రుద్దుతుంటారు. దీని వల్ల చర్మం ఎర్రబడడమే కాకుండా పొడిబారుతుంది. మొటిమలు ఉంటే సమస్య మరింతగా పెరుగుతుంది. Wrong: రెండు వారాలకు ఒకసారి చర్మతత్త్వానికి సరిపడే స్క్రబ్ (మార్కెట్లో లభిస్తుంది) తో 2-3 నిమిషాలు మృదువుగా రుద్ది, శుభ్రపరుచుకోవాలి. మెటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ వాడకూడదు. వేపాకులను రుబ్బి, ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరచాలి. Right: చాలామంది తమ చర్మతత్వానికి సరిపడిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోరు. దీని వల్ల సేదగ్రంథులు మూసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు, పొక్కులు రావడం జరుగుతుంటాయి. Wrong: ఏదైనా కొత్త సౌందర్య ఉత్పత్తిని చర్మానికి ఉపయోగించే ముందు మోచేతిపై లేదా చెవి వెనకాల కొద్దిగా రాసి, 2-3 గంటల సేపు అలాగే ఉంచాలి. ఎరుపు దనం, దద్దుర్లు లేవని నిర్ధారించుకున్నాకే ఆ ఉత్పత్తిని వాడుకోవాలి. అలాగే, మాయిశ్చరైజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ చర్మానికి రాసిన 60 సెకండ్లలో ఇంకిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్‌ను వాడవచ్చు. మొటిమలను గిల్లడం, లోపలి పస్(చీము) తీయడం వంటివి చేస్తే ఆ ప్రాంతంలో మచ్చలు పడే అవకాశం ఉంది. Right: జిడ్డు చర్మం గలవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు రోజులో 2-3 సార్లు ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకోవడం, నిమ్మ గుణాలున్న పేస్ప్యాక్లు వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది. Wrong: చాలామంది దుస్తులు ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు. దుస్తుల మీద స్ప్రే చేయడం వల్ల అందులోని ఫైబర్ లక్షణాలతో కలిసి పెర్ఫ్యూమ్ సువాసన మారే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ తరహా ప్రయోగాలు చర్మానికి హాని కలిగించవచ్చు. Right: వస్త్రధారణకు ముందు దూది ఉండకు స్ప్రే చేసి గొంతు, ముంజేతులు, భుజాల కింద... పెర్ఫ్యూమ్ను అద్దాలి. దీని వల్ల చర్మానికి హాని కలగదు.