ప్రతీకాత్మక చిత్రం
ఎండ, కాలుష్యం వల్ల శరీర ఆరోగ్యంతోపాటు చర్మానికి చాలా నష్టం వాటిల్లుతుందని మీకు తెలుసా? చర్మం ఆరోగ్యంగా, తాజాగా మెరవడానికి మానసిక ఆరోగ్యంతోపాటు, ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఐతే మీ రోజువారీ ఆహార అలవాట్లతో చర్మం సహజంగా కాంతులీనాలంటే ఈ కొద్దిపాటి మార్పులు అవసరం అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా..
బీట్ రూట్
బీట్ రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మృతకణాల స్థానంలో కొత్తవి నిలపడంలో, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో, పిగ్మెంటేషన్ తొలగింపులో బీట్ రూట్ రసం కీలకంగా వ్యవహరిస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడమేకాకుండా శరీరంలో రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరచి, చర్మం మెరిసేలా చేస్తుంది. శరీరంలో హానికారక టాక్సిన్స్‌ను తొలగించి మీ ముఖం మీద ఆరోగ్యకరమైన కాంతి నిలిచిఉండేలా ప్రేరేపిస్తుంది.
పెరుగు
చర్మ సంబంధిత సమస్యలకు పెరుగు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో లాక్టిక్ ఆమ్లం, జింక్, విటమిన్ ‘బి’, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు ఆహారంలో భాగంగా తీసుకుంటే మీ చర్మ కాంతి మరింత మెరుపులీనుతుంది.
చదవండి: Period Pain Relief: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి..
పసుపుకలిపిన పాలు
ప్రాచీనకాలం నుంచే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఇది ఆచరణలో ఉంది. పసుపుకలిపిన పాలు ప్రతిరోజూ తాగడం వల్ల ముఖంపై పేరుకుపోయిన సన్‌టాన్ తొలగించి, చర్మానికి సహజమైనమెరుపును అందిస్తుంది కూడా.
పాలకూర
పాలకూరలో విటమిన్లు, మినరల్స్ నిండుగా ఉంటాయి. చర్మంపై మచ్చలను తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండాచేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.
నిమ్మ
‘సి, బి’ విటమిన్లు, పాస్ఫరస్ నిమ్మలో పుష్కలంగా ఉంటాయి. సహజమైన చర్మకాంతికి ఇది చక్కని పోషకం. నిమ్మలోని సహజ ఆమ్లాలు మృతకణాలను తొలగించి, వయసు పెరిగేకొద్ది చర్మంపై ఏర్పడే ముడతలను నివారిస్తుంది.
అవిసెగింజలు
ఒమేగా -3 ఆమ్లాలు అధికంగా ఉండే అవిసె గింజలు మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, తేమగా ఉండేలా చేస్తుంది. అవిసె గింజలు నేరుగా తిన్నా లేదా వంటలలో వాడినా ఏ విధంగా తీసుకున్నా మీ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
దానిమ్మగింజలు
దానిమ్మపండు గింజలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి ఉపకరిస్తాయి. వృద్ధాప్య ఛాయలనుంచి రక్షణ కల్పించడమేకాకుండా సూర్య రశ్మి వల్ల దెబ్బతిన్న చర్మానికి చికిత్సనందిస్తుంది. దానిమ్మను జ్యూస్ రూపంలో తాగొచ్చు లేదా గింజలను నేరుగా తిన్నా ఫలితం ఉంటుంది.
ఈ ఆహార అలవాట్లతో మీ చర్మం కాంతులీనుతుందనేది నిపుణులు మాట.
చదవండి: 7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలిస్తే షాక్!!
Comments
Please login to add a commentAdd a comment