Toxins
-
బియ్యం,గోధుమల్లో బలం సగమే, పైగా.. : షాకింగ్ రిపోర్ట్
తిండికి కటకటలాడుతూ ఓడలో ధాన్యం వస్తేనే దేశం ఆకలి తీరే పరిస్థితుల్లో హరిత విప్లవ సాంకేతికత (జిఆర్టి)ల అమలు మన దేశంలో 1960వ దశకంలో ప్రాంరంభమైంది. అధిక దిగుబడినిచ్చే వరి/గోధుమ ఆధునిక వంగడాలు తయారుచేసుకొని వాడుతున్నాం.. నీటి పారుదల, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పంటలు పండిస్తున్నాం.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెల్ల బియ్యం, గోధుమలు అందిస్తున్నది. ఏభయ్యేళు గడచిపోయాక.. వెనక్కి చూస్తే జనం కడుపు నిండుతోంది. కానీ, పోషకలోపం వెంటాడుతోంది. ముందెన్నడూ లేనట్లుగా రోగాలు ముసురుకుంటున్నాయి. దీనికి మూలకారణం ఏమిటో ఓ తాజా అధ్యయనం విడమర్చి చెబుతోంది. ప్రసిద్ధ వంగడాలపైనే అధ్యయనం వరి, గోధుమల్లో పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న నేలల నిపుణుడు డా. సోవన్ దేబనాద్, మరో 11 మంది శాస్త్రవేత్తలతో కలసి విస్తృత పరిశోధనలు చేశారు. డా. సోవన్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసిఎఆర్– సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త. పశ్చిమబెంగాల్లోని ఐసిఎఆర్– బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ, హైదరాబాద్‌లోని ఐసిఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన మరో 11 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1960వ దశకం నుంచి ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు 1,199 వరి, 448 గోధుమ, 417 మొక్కజొన్న, 223 జొన్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన (50 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువగా సాగైన) వంగడాల్లో నుంచి ఒక్కో దశాబ్దానికి 2–4 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా పండించి మరీ అధ్యయనం చేశారు. జయ నుంచి స్వర్ణ సబ్ 1 వరకు.. ఈ విధంగా ఎంపికచేసిన 16 వరి, 18 గోధుమ రకాలను 2018–2020 మధ్యకాలంలో మూడేళ్ల పాటు సాగు చేశారు. ఎంపికైన వరి రకాల్లో 1960ల నాటి జయ, పంకజ్, 1970ల నాటి ఐఆర్8, స్వర్ణ, రాశి, 1980ల నాటి ఐఆర్ 36, క్షితిశ్, సాంబ మసూరి, లలత్, 1990ల నాటి ఐఆర్ 64, ఖందగిరి, రంజిత్, త్రిగుణ, 2000ల నాటి నవీన్, ప్రతిక్ష్య, స్వర్ణ సబ్ 1 వున్నాయి. గోధుమ రకాల్లో 1960ల నాటి సొనాలిక నుంచి 2010లలో విడుదలైన హెచ్డి–3059 రకాలను ఎంపిక చేశారు. 2009లో విడుదలైన స్వర్ణ సబ్ 1 తర్వాత 5 లక్షల హెక్టార్లకు పైగా సాగైన లాండ్మార్క్ వరి వంగడాలు లేక΄ోవటం వల్ల 2010లలో విడుదలైన ఏ వరి వంగడాన్నీ అధ్యయనం చేయలేదని డా. సోవన్ తెలి΄ారు. వరి విత్తనాలను కటక్‌లోని ఎన్ఆర్ఆర్ఐ నుంచి, గోధుమ విత్తనాలను కర్నల్‌లోని ఐఐడబ్లు్యబిఆర్ల నుంచి సేకరించారు. వీటన్నిటినీ ఒకే రకమైన మట్టి మిశ్రమంతో కూడిన ప్రత్యేక కుండీల్లో సాగు చేశారు. అలా పండించిన తెల్ల బియ్యం, గోధుమ పిండిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సరిపోల్చి విశ్లేషించటం ఈ అధ్యయనం లక్ష్యం. 45శాతం తగ్గి పోయిన పోషకాలు మన దేశంలో ప్రజలు రోజువారీ ప్రధాన ఆహారంగా తినే వరి బియ్యం లేదా గోధుమల ద్వారానే రోజుకు అవసరమైన శక్తిలో 50%కి పైగా సమకూరుతుంది. ఈ రెండు ధాన్యాలు గత 50 ఏళ్లలో 45% పోషక విలువలను కోల్పోయినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గత 50 ఏళ్లలో, వరి బియ్యంలో అత్యవసరమైన పోషకాలైన జింక్ 33%, ఇనుము 27% తగ్గిపోయాయి. గోధుమలో జింక్ 30%, ఇనుము 19% తగ్గిపోయాయి. ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే 2040 నాటికి వరి బియ్యం, గోధుమలు తినటానికి పనికిరానంతగా పోషకాలన్నిటినీ కోల్పోతాయని డా. సోవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాలు బాగా తగ్గి΄ోవటంతో పాటు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు చాలా పెద్ద ఎత్తున పోగుపడటం. ఆర్సెనిక్ (పాషాణం) ఏకంగా 1,493 శాతం మేరకు పెరిగిపోయింది. భార ఖనిజాలతో జబ్బులు ఈ అధ్యయనం మనకు తెలియజెప్తున్నదేమిటంటే.. రోజువారీగా ప్రధాన ఆహారంగా మనం తింటున్న తెల్ల అన్నం, గోధుమ రొట్టెల్లో పోషకాలు సగానికి తగ్గటంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే భార ఖనిజాలు మెండుగా చేరాయన్న మాట. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం, కేన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులు పెచ్చుమీరిపోవడానికి వరి, గోధుమల్లో ΄ోషకాలు లోపించటంతో పాటు భార ఖనిజాలు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఫాస్ఫరస్, కాల్షియం, సిలికాన్, వనాడియం వంటి పోషకాలు ఎముకల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తి, పునరుత్పాదక శక్తికి, నరాల బలానికి జింక్ కీలకం. రక్తవృద్ధికి ఇనుము చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ మొత్తంలో తినే ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే నరాల బలహీనత, సంతానలేమి, కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుందని నేచర్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాల్లో నిపుణులు చెబుతున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, బేరియం, స్ట్రాంటియమ్ వంటి విషతుల్య భార ఖనిజాలు ఊపిరితిత్తుల కేన్సర్లు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, హైపర్కెరటోసిస్, కిడ్నీల సమస్యలు, ఎముకల్లో కాల్షియం లోపించటం వంటి జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం మాదిరిగా జొన్న తదితర చిరుధాన్యాలు తినటం తగ్గిపోవటం, వరి, గోధుమల వినియోగం బాగా పెరిగి΄ోవటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990–2016 మధ్యకాలంలో అసాంక్రమిక వ్యాధులు 25% పెరిగి΄ోయాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నివేదికలు చెబుతున్నాయి. బయోఫోర్టిఫైడ్ వంగడాలతో సమస్య తీరేనా? ధాన్యాల్లో పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొదించటంపై ఐసిఏఆర్ పదేళ్ల క్రితం నుంచే పని ప్రారంభించింది. ఇప్పటికి 142 బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించింది. ఇందులో 124 ధాన్యపు పంటలు. వీటిలో 10 వరి, 43 గోధుమ, 20 మొక్కజొన్న, 13 రకాల కొర్ర వంటి చిన్న చిరుధాన్యాలు, 11 సజ్జ రకాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాల లోపాన్ని కొంతమేరకు అధిగమించవచ్చన్నది శాస్త్రవేత్తల మాట. దేశవ్యాప్తంగా 6% సాగు భూమిలో ఈ వంగడాలు సాగవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సాగు భూమిలో పోషకాలు తగ్గిపోయాయి కాబట్టి ఆహారంలో పోషకాలు తగ్గి పోతున్నాయని ఇన్నాళ్లూ అనుకున్నాం. అయితే, వరి, గోధుమ మొక్కలకు నేలలో ఉన్న పోషకాలను తీసుకునే శక్తి కూడా తగ్గిపోయిందని ఇప్పుడు రూఢి అయ్యింది. ఇంతకన్నా ఆందోళన కలిగించే మరో విషయాన్ని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేలలో భార ఖనిజాలు వంటి విషతుల్య పదార్థాలను కంకుల్లోని ధాన్యాలకు చేరకుండా ఆపి వేసే సహజసిద్ధమైన విచక్షణా జ్ఞానం మొక్కలకు ఉంటుంది. అయితే, అధిక దిగుబడుల కోసం తయారు చేసిన ఆధునిక వరి, గోధుమ విత్తనాల బ్రీడింగ్ ప్రక్రియల్లో గత ఏభయ్యేళ్లలో చేసిన కీలక మార్పుల వల్ల ఈ పంటల్లో ఆ తెలివి లోపించింది. అందువల్లే ఇప్పుడు వరి బియ్యం, గోధుమల్లోకి ప్రాణాంతక భార ఖనిజాలు అధిక పాళ్లలో చేరుతున్నాయి. వీటిని తిన్న మనుషులకు పోషకాలు లోపించటం వల్ల మాత్రమే కాదు, భార ఖనిజాల వల్ల కూడా రకరకాల జబ్బులొస్తున్నాయని తేలింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ వైద్య పరిశోధనా మండలి సమన్వయంతో అత్యంత కీలకమైన ఈ అధ్యయనం చేయటం విశేషం. గత నవంబర్‌లో ‘నేచర్’ లో ఈ అధ్యయన పత్రం అచ్చయ్యింది. ఇందులోని వివరాలు సంక్షిప్తంగా.. ► గత ఏభయ్యేళ్లలో 45% మేరకు పోషకాలు కోల్పోయిన వరి, గోధుమలు.. ►2040 నాటికి పూర్తిగా తగ్గే ప్రమాదం.. ►అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల్లో దశాబ్దానికి ఒకటి, రెండు ప్రాచుర్యం ΄పొందిన రకాలపై ఐసిఏఆర్, ఐసిఎంఆర్ సంయుక్త అధ్యయనం ►సాంబ మసూరి, స్వర్ణ సబ్ 1 తదితర 16 రకాల వరి, 18 రకాల ►గోధుమ అధిక దిగుబడి వంగడాలపై అధ్యయనం ►భారఖనిజాల శాతం పెరగటంతో ప్రజారోగ్యానికి ముప్పు ►బయోఫోర్టిఫైడ్ వంగడాలు మేలంటున్న శాస్త్రవేత్తలు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Skin Health: బీట్ రూట్, పెరుగు, పాలకూర, దానిమ్మగింజలు ప్రతిరోజూ తిన్నారంటే..!
ఎండ, కాలుష్యం వల్ల శరీర ఆరోగ్యంతోపాటు చర్మానికి చాలా నష్టం వాటిల్లుతుందని మీకు తెలుసా? చర్మం ఆరోగ్యంగా, తాజాగా మెరవడానికి మానసిక ఆరోగ్యంతోపాటు, ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఐతే మీ రోజువారీ ఆహార అలవాట్లతో చర్మం సహజంగా కాంతులీనాలంటే ఈ కొద్దిపాటి మార్పులు అవసరం అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా.. బీట్ రూట్ బీట్ రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మృతకణాల స్థానంలో కొత్తవి నిలపడంలో, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో, పిగ్మెంటేషన్ తొలగింపులో బీట్ రూట్ రసం కీలకంగా వ్యవహరిస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడమేకాకుండా శరీరంలో రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరచి, చర్మం మెరిసేలా చేస్తుంది. శరీరంలో హానికారక టాక్సిన్స్‌ను తొలగించి మీ ముఖం మీద ఆరోగ్యకరమైన కాంతి నిలిచిఉండేలా ప్రేరేపిస్తుంది. పెరుగు చర్మ సంబంధిత సమస్యలకు పెరుగు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో లాక్టిక్ ఆమ్లం, జింక్, విటమిన్ ‘బి’, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు ఆహారంలో భాగంగా తీసుకుంటే మీ చర్మ కాంతి మరింత మెరుపులీనుతుంది. చదవండి: Period Pain Relief: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి.. పసుపుకలిపిన పాలు ప్రాచీనకాలం నుంచే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఇది ఆచరణలో ఉంది. పసుపుకలిపిన పాలు ప్రతిరోజూ తాగడం వల్ల ముఖంపై పేరుకుపోయిన సన్‌టాన్ తొలగించి, చర్మానికి సహజమైనమెరుపును అందిస్తుంది కూడా. పాలకూర పాలకూరలో విటమిన్లు, మినరల్స్ నిండుగా ఉంటాయి. చర్మంపై మచ్చలను తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండాచేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. నిమ్మ ‘సి, బి’ విటమిన్లు, పాస్ఫరస్ నిమ్మలో పుష్కలంగా ఉంటాయి. సహజమైన చర్మకాంతికి ఇది చక్కని పోషకం. నిమ్మలోని సహజ ఆమ్లాలు మృతకణాలను తొలగించి, వయసు పెరిగేకొద్ది చర్మంపై ఏర్పడే ముడతలను నివారిస్తుంది. అవిసెగింజలు ఒమేగా -3 ఆమ్లాలు అధికంగా ఉండే అవిసె గింజలు మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, తేమగా ఉండేలా చేస్తుంది. అవిసె గింజలు నేరుగా తిన్నా లేదా వంటలలో వాడినా ఏ విధంగా తీసుకున్నా మీ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. దానిమ్మగింజలు దానిమ్మపండు గింజలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి ఉపకరిస్తాయి. వృద్ధాప్య ఛాయలనుంచి రక్షణ కల్పించడమేకాకుండా సూర్య రశ్మి వల్ల దెబ్బతిన్న చర్మానికి చికిత్సనందిస్తుంది. దానిమ్మను జ్యూస్ రూపంలో తాగొచ్చు లేదా గింజలను నేరుగా తిన్నా ఫలితం ఉంటుంది. ఈ ఆహార అలవాట్లతో మీ చర్మం కాంతులీనుతుందనేది నిపుణులు మాట. చదవండి: 7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలిస్తే షాక్!! -
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న విషజ్వరాలు
-
Weight Loss: ఈ జ్యూస్ తాగారంటే మీ బరువు అమాంతంగా ...
బరువు తగ్గేందుకు ఎంతో ప్రయాస, కృషి అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే. రోజువారీ ఎక్సర్సైజులు, తక్కువ క్యాలరీలుండే ఆహారం తీసుకోవడం.. ఇతర పద్ధతులు అనుసరిస్తాం. ఇవే కాకుండా బరువుతగ్గడానికి డిటాక్స్ డ్రింక్స్ కూడా ఎంతో తోడ్పడతాయని మీకు తెలుసా! మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో డిటాక్స్ డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి. అలాగే శరీర బరువును నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. కేవలం వంటింట్లో దొరికే పదార్ధాలతోనే ఈ డ్రింక్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. బరువు నియంత్రించడానికి జీరా వాటర్ లాంటివి ప్రయత్నించినట్లే, బెల్లం-నిమ్మరసంతో తయారు చేసిన ఈ స్పెషల్ డ్రింక్‌ను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం-నిమ్మతో ఆరోగ్య లాభాలు నిమ్మ రసం బరువుతగ్గించడంలో కీలప పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. అయితే దీనికి కొత్తగా బెల్లం జోడిస్తే చేకూరే లాభాలు మాత్రం చాలా మందికి తెలియదు. నిమ్మలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని, చర్మ స్వభావాన్ని, జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. అలాగే గుండె పనీతీరును క్రమబద్ధీకరించి, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే స్వీట్స్ తయారీలో విరివిగా ఉపయోగించే బెల్లం కూడా బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. బెల్లం చేకూర్చే లాభాలు అన్నీఇన్నీకాదండోయ్! ఇమ్యునిటీని పెంచడానికి, శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మాత్రమేకాకుండా బరువును నియంత్రించడంలోనూ బెల్లం బెస్టే!! కాబట్టి బరువును అదుపులో ఉంచడంలో బెల్లం, నిమ్మ రెండూ ఉపయోగపడతాయన్నమాట. బెల్లం - నిమ్మ వాటర్ ఏ విధంగా తయారు చేయాలంటే.. మొదటిగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లుపోసి చిన్న బెల్లం ముక్కను వేసి, బెల్లం కరిగిపోయేంతవరకూ మరిగించాలి. చల్లబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకుంటే బెల్లం - నిమ్మ వాటర్ రెడీ అయిపోయినట్టే. ప్రతి ఉదయం క్రమంతప్పకుండా ఈ డ్రింక్ తాగితే మీ బరువు నిస్సందేహంగా తరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి : Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
మందుబిళ్లలు అనుకుని ఎలుకల మందు తిన్న మహిళ
రేపల్లె రూరల్: సరిగా మతిస్థిమితం లేని మహిళ మందుబిళ్లలనుకుని ఎలుకల నియంత్రణ మందు తీసుకుని మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మండలంలోని చినఅరవపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఫిరోజ్ కథనం మేరకు చినఅరవపల్లి గ్రామానికి చెందిన భూపతి వీరరాఘవయ్య భార్య రాజేశ్వరి (42) కొన్నేళ్లుగా మతి స్థిమితం కోల్పోయింది. దీంతోపాటు ఆమె పక్షవాతంతో బాధపడుతోంది. కోలుకునేందుకు మందులు వాడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మందుబిళ్లలనుకుని ఎలుకలు - పందికొక్కులకు వాడే విషగుళికలు తీసుకుని వాంతులు చేసుకుని ఇంట్లో పడిపోయి ఉంది. గమనించిన స్థానికులు ఆమె కుమారుడు అరవింద్‌కు ఫోన్ చేసి సమాచారం అందించగా రాజేశ్వరిని హుటాహుటిన రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి అంజనాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. -
మగవారి కొంపముంచుతున్న కెమికల్స్, ఇలాగైతే కష్టమే!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మానవజాతిలో ఫలదీకరణ సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతోందా? అవునంటున్నారు షన్నా స్వాన్ అనే ఎన్విరానమెంటల్ ఎమిడమాలజిస్టు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పలు రకాల రసాయనాలు క్రమంగా మగవాళ్లలో వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు, అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. కౌంట్‌డౌన్ పేరిట తాజాగా విడుదల చేసిన పుస్తకం ప్రకారం మనుషుల్లో వీర్యకణాల సంఖ్య 1973తో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం మేర తగ్గిందని, ఇదే తరహా కొనసాగితే 2045 నాటికి స్పెర్మ్‌కౌంట్ జీరోకు చేరవచ్చని చెప్పారు. ఇదే నిజమైతే భవిష్యత్‌లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదని హెచ్చరించారు. ఈ విపత్తుకు కారణమైన రసాయనాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయని, రోజూవారీ ఫుడ్ర్యాపింగ్స్ మొదలు, ప్లాస్టిక్ కంటైనర్ల వరకు వాటర్‌ప్రూఫ్ బట్టల నుంచి రోజూవారీ డియోడరెంట్లు, సబ్బుల వరకు అన్ని చోట్ల ఈ రసాయనాల జాడ ఉందని వివరించారు. వీటిలో పీఎఫ్ఏఎస్గా పిలిచే ఫరెవర్ కెమికల్స్ ఎప్పటికీ ప్రకృతిలో బ్రేక్‌డౌన్ కావని, ఇవి శరీరంలో పర్మినెంట్‌గా ఉంటాయని చెప్పారు. ఇవి శరీరంలో పేరుకుపోయేకొద్దీ హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందన్నారు. కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీయింగ్ పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌పై ఆయాదేశాలు స్పందించే తీరులో వ్యత్యాసాలున్నాయని, కొన్ని దేశాల్లో వీటిని పూర్తిగా నిషేధిస్తే, కొన్ని చోట్ల పరిమితంగా వాడుతున్నారని, కొన్ని చోట్ల ఎలాంటి నియంత్రణా లేదని స్వాన్ వివరించారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా నిషేధించకుండా కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రసాయనాల ప్రభావం మహిళల్లో సైతం ఫెర్టిలిటీపై పెరిగిందని స్వాన్ చెప్పారు. ప్రస్తుత మహిళ తన ముత్తవ్వతో పోలిస్తే 35వ ఏట గర్భం దాల్చే శక్తి తగ్గిందన్నారు. అలాగే ఒక మగవాడి వీర్యకణాలు అతడి తాతతో పోలిస్తే సగమయ్యాయన్నారు. ఇది మానవాళి అంతానికి దారి తీసే విపత్తని చెప్పారు. కేవలం స్పెర్మ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఈ కెమికల్స్ కారణంగా మగవారి అంగ పరిమాణం, వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశాలు మేలుకొని ఈ కెమికల్ గండాన్ని ఎదుర్కోవాలని సూచించారు. -
ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు మృతి
బోట్స్వానా : నీటిలోని సైనోబాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వల్ల ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా ఏనుగులు చనిపోతుండటంపై విచరణ చేపట్టిన దర్యాప్తు సంస్థ ఈ మేరకు షాకింగ్ విషయాలను వెల్లడించింది. సాధారణంగా సైనోబాక్టీరియా అనేది నీటిలో, మట్టిలోనూ ఉండే సూక్షజీవి. వీటి వల్ల ప్రమాదం లేకపోయినా వాతావరణ మార్పుల వల్ల విషతుల్యం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఈ సూక్ష్మజీవులు విషంగా మారాయని, ఈ నీళ్లు తాగడంతో ఏనుగులు చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మే నెల ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా 330 ఏనుగులు చనిపోయినట్లు జాతీయ వన్యప్రాణి, ఉద్యానవనాల డిప్యూటీ డైరెక్టర్ సిరిల్ టావోలో పేర్కొన్నారు. వీటిలో అత్యధికంగా జూలై మాసంలోనే 281 ఏనుగులు చనిపోయినట్లు తెలిపారు. (అరుదైన మగ కప్పల భీకర పోరు ) అయితే మిగతా వన్యప్రాణులకు సైతం ఈ పరిస్థితి ముప్పుగా మారుతుందనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఎందుకంటే ఈ టాక్సాన్స్ వల్ల ఇప్పటివరకు ఏనుగులు మాత్రమే చనిపోయాయి. మిగతా జంతువులన్నీ క్షేమంగానే ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఏనుగల జనాభా అధికంగా ఉండే ఆఫ్రికాలో మూడింట ఒకవంతు ఏనుగులు బోట్స్వానాలో ఉంది. ఇక దక్షిణాఫ్రికాలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. పొరుగున ఉన్న జింబాబ్వేలోని అతిపెద్ద గేమ్ పార్క్ సమీపంలో సుమారు 25 ఏనుగులు చనిపోయాయి. అయితే బొట్స్వానా ఘటనతో దీన్ని లింక్ చేయలేమని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి ఏనుగు మృతదేహాలను పరిశీంచాకే నీటిలోని టాక్సిన్ వల్ల చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఇవి మృత్యువాత పడి ఉండొచ్చేమో అని విక్టోరియా ఫాల్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లోని పశువైద్యుడు క్రిస్ ఫాగ్గిన్ అన్నారు. (ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు) -
మొటిమలు రాకుండా ఉండాలంటే..
న్యూఢిల్లీ : యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను భయపెట్టేది పరీక్షలు కాదు, సిలబస్ కాదు ...మరేంటంటే ‘ఆక్నే’ మన భాషలో చెప్పాలంటే మొటిమలు. అవును చంద్రబింబం లాంటి ముఖారవిందాన్ని పాడు చేయడానికి చిన్న మొటిమ చాలు. అందుకే మొటిమలంటే అంతలా భయపడతారు. మరి ఈ మొటిమలు ఎందుకు వస్తాయి, రాకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఓ సారి చూద్దామా... మొటిమలు అనేవి చర్మ సంబంధిత సమస్య. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నూనే, చనిపోయిన చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల, ఒత్తిడి, హర్మోన్ల మార్పు, మోనోపాజ్ ఇలా రకరకాల కారణాలు. మారుతున్న జీవనశైలి కూడా మొటిమలు రావడానికి కారణం. మొటిమలు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునేముంది మేకప్‌ను పూర్తిగా తొలగించాలి రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం వారు అయితే ఎక్కువ సార్లు శుభ్రంచేసుకోవాలి. మేకప్‌ను తొలగించడానికి అల్కహాల్ రహిత మేకప్ రిమూవరన్ని ఉపయోగించాలి. తర్వాత డీప్ పూర్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మసాలాలకు దూరంగా ఉండాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. నీరు శరీరం నుంచి విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా, తేమగా ఉంటుంది. ప్రతిరోజు యోగా చేయ్యాలి. శ్వాస తీసుకోవడం, శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేయడం వల్ల శరీరమంతా మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా మొటిమలు రాకుండా ఉంటాయి. ముఖాన్ని శుభ్రపర్చుకోవడానికి సబ్బు వాడకూడదు. సబ్బు వాడటం వల్ల ముఖం పొడిబారుతుంది. బాక్టీరియా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండటానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మొటిమలు రాకుండా నివారించవచ్చు. ఆకు కూరలు ఆకుపచ్చ కూరలు బచ్చలి, పాలకూర వంటివి మీ రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ ఆంటీ ఏజింగ్ ఎజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థలో ఉన్న బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. పసుపు మొటిమలను తగ్గించడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపుకు కూడా పసుపును వావడతారు. పసుపును ఆహారంలో తీసుకోవడం వల్ల మొటిమలను కలిగించే బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు నెట్టి వేస్తుంది. క్యారేట్ క్యారేట్లలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రోజువారి ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి. సాల్మన్ వీటిల్లో ఓమేగా3 ఫాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను నివారించడమే కాక నొప్పి, వాపుని తగ్గిస్తుంది. -
గుండె ఆరోగ్యానికి ధ్యానం
గురుబోధ రక్త ప్రసరణ అల్లకల్లోలంగా ఉండటం సరికాదు. అలాగే స్తబ్దుగా ఉండటం కూడా సరికాదు. రక్త ప్రసరణ ్రపశాంతంగా హాయిగా ఉండాలి. అప్పుడే గుండెకు మంచిది. మెడిటేషన్ ఈజ్ డెరైక్ట్‌లీ కనెక్టెడ్ విత్ హార్ట్. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు దేహం టాక్సిన్స్‌ని విడుదల చేస్తుంది. ఈ మలినాలు గుండెకు భారమవుతాయి. ధ్యానంలో ఉన్నప్పుడు మంచి హార్మోన్లన్నీ విడుదలవుతాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ధ్యానం అంటే ప్రేమగా, కరుణగా ఉంటూ దైవాన్ని నీలోకి తీసుకోవడమే. అప్పుడు శరీరంలోని అన్ని అంగాలు స్థిమితంగా సమన్వయంతో పని చేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా గుండె ఆరోగ్యం బ్రహ్మాండంగా మెరుగు పడుతుంది. - స్వామి మైత్రేయ