
బరువు తగ్గేందుకు ఎంతో ప్రయాస, కృషి అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే. రోజువారీ ఎక్సర్‌సైజులు, తక్కువ క్యాలరీలుండే ఆహారం తీసుకోవడం.. ఇతర పద్ధతులు అనుసరిస్తాం. ఇవే కాకుండా బరువుతగ్గడానికి డిటాక్స్ డ్రింక్స్ కూడా ఎంతో తోడ్పడతాయని మీకు తెలుసా! మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో డిటాక్స్ డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి.
అలాగే శరీర బరువును నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. కేవలం వంటింట్లో దొరికే పదార్ధాలతోనే ఈ డ్రింక్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. బరువు నియంత్రించడానికి జీరా వాటర్ లాంటివి ప్రయత్నించినట్లే, బెల్లం-నిమ్మరసంతో తయారు చేసిన ఈ స్పెషల్ డ్రింక్‌ను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
బెల్లం-నిమ్మతో ఆరోగ్య లాభాలు
నిమ్మ రసం బరువుతగ్గించడంలో కీలప పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. అయితే దీనికి కొత్తగా బెల్లం జోడిస్తే చేకూరే లాభాలు మాత్రం చాలా మందికి తెలియదు. నిమ్మలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని, చర్మ స్వభావాన్ని, జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. అలాగే గుండె పనీతీరును క్రమబద్ధీకరించి, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
ముఖ్యంగా బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే స్వీట్స్ తయారీలో విరివిగా ఉపయోగించే బెల్లం కూడా బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. బెల్లం చేకూర్చే లాభాలు అన్నీఇన్నీకాదండోయ్! ఇమ్యునిటీని పెంచడానికి, శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మాత్రమేకాకుండా బరువును నియంత్రించడంలోనూ బెల్లం బెస్టే!! కాబట్టి బరువును అదుపులో ఉంచడంలో బెల్లం, నిమ్మ రెండూ ఉపయోగపడతాయన్నమాట.
బెల్లం - నిమ్మ వాటర్ ఏ విధంగా తయారు చేయాలంటే..
మొదటిగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లుపోసి చిన్న బెల్లం ముక్కను వేసి, బెల్లం కరిగిపోయేంతవరకూ మరిగించాలి. చల్లబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకుంటే బెల్లం - నిమ్మ వాటర్ రెడీ అయిపోయినట్టే. ప్రతి ఉదయం క్రమంతప్పకుండా ఈ డ్రింక్ తాగితే మీ బరువు నిస్సందేహంగా తరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
చదవండి : Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే...
Comments
Please login to add a commentAdd a comment