బరువు తగ్గాలి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం. తర తరాలుగా భారతీయుల్లో ఉపవాసం కొత్తేమీకాదు. బరువు తగ్గాల నుకునే వారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు ఫాస్టింగ్ చేయడం కూడా చాలా కామన్. అయితే ఎక్కువ కాలం మన దేహాన్ని పస్తు పెట్టడం వల్ల వెయిట్‌లాస్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది తాజా అధ్యయనం. ఆ వివరాలు మీకోసం.
ఉపవాసంతో శరీరంలో ఏమి జరుగుతుంది?
ఉపవాస సమయంలో, మన శరీరం దాని ఇంధన మూలాన్ని స్వీకరిస్తుంది. సులభంగా యాక్సెస్ చేసే చక్కెరల నుండి బాడీలోని నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. అయితే ఆహారం లేకుండా ఎక్కువ కాలం పాటు ఉంటే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇదే ఈ స్టడిలోని కీలక అంశం.
నేచర్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్ పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరశోధన చేశాడు. వారు ఏడు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే తీసుకునేలా చేశారు. అలా వారి రక్తంలో వివిధ ప్రోటీన్ మార్కర్ల స్థాయిలలో మార్పులను నిశితంగా పరిశీలించారు.
మూడు రోజుల తర్వాతే మంచి ప్రయోజనం
ఊహించినట్లుగానే తొలి రెండు, మూడు రోజుల్లో గ్లూకోజ్ నుండి కొవ్వు ప్రధాన ఇంధన వనరుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. దీంతో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతూ వస్తుంది. మొత్తంగా, వాలంటీర్లు సగటున 5.7 కిలోగ్రాముల కొవ్వు ,లీన్ మాస్ రెండూ తగ్గాయి.
అయితే మూడు రోజుల ఉపవాసం తర్వాత వాలంటీర్ల రక్త బయోమార్కర్లలో విభిన్న మార్పులను పరిశోధకులు గమనించారు. మొత్తం బాడీలో కూడా మార్పులొచ్చాయి. ముఖ్యంగా మెదడు కణాల నిర్మాణ ప్రోటీన్లలో మార్పులు ఆసక్తికరంగా నిలిచాయి. దీంతో మూడు రోజుల తరువాత చేసే ఉపవాసంలో మాత్రమే బరువు తగ్గడాన్ని మించి, మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ అధ్యయనంలో తేల్చారు.
క్వీన్ మేరీస్ ప్రెసిషన్ హెల్త్ యూనివర్శిటీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (PHURI) డైరెక్టర్ క్లాడియా లాంగెన్‌బర్గ్ మాట్లాడుతూ, ‘తొలిసారి ఉపవాసం ద్వారా శరీరం అంతా కూడా అతి చిన్న స్థాయిలో కూడా ఏమి జరుగుతుందో చూడగలుగుతున్నామన్నామని ప్రకటించారు. సురక్షితమైన పద్ధతులో ఫాస్టింగ్ చేసినప్పుడు, బరువు తగ్గడం అనేది ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ విధానం కూడా బరువు తగ్గడ కంటే అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అయితే చాలాకొద్దిమందిపై చేసిన తమ ప్రయోగంలో అందరిలోనూ ఫలితాలు ఒకేలా ఉన్నాయని, మరి ఎక్కువమందిపై ఈ ప్రయోగం చేసినపుడు ఫలితాలు ఎంటా ఉంటాయనేది పరిశీలించాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment