fasting
-
బరువు తగ్గడానికి 12-12 రూల్ ..!
బరువు తగ్గడానికి అడపదడపా ఉపవాసం ఒక ప్రసిద్ధమైన పద్ధతిగా మారింది. దీంతో అయితేనే ఈజీగా బరువు తగ్గుతామని చాలామంది ఈ పద్ధతి వైపుకే మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ చెందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి ఈ అడదడప ఉపవాసం ది బెస్ట్ అని కితాబిచ్చారు. ఇది బరువు నిర్వహణ తోపాటు మొత్త ఆరోగ్యానికే మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కొవ్వుని కరిగించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. దీన్ని గనుక ఈ సింపుల్ టెక్నిక్‌లలో చేస్తే తక్షణమే ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అదెలాగో చేసేద్దామా..!.డాక్టర్ సేథి బరువు తగ్గడం కోసం మూడు కీలక చిట్కాలను ఫాలోమని చెప్పారు. అవేంటంటే..నిర్మాణాత్మక ఉపవాస షెడ్యూల్, మంచి డిటాక్స్ పానీయాలు, సమతుల్య ఆహారం తదితరాలు. ఈ మూడింటిని ఎలా చేయాలో డాక్టర్ సేథి చాలా వివరంగా చెప్పారు. 12:12 ఉపవాస షెడ్యూల్:డాక్టర్ సేథి 12:12 అడపాదడపా ఉపవాస షెడ్యూల్‌నే నిర్మాణాత్మక ఉపవాసమని అన్నారు. ఇది అత్యంత తేలికగా నిర్వహించదగిన ప్రక్రియని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా 12 గంటలు ఉపవాసం ఉంటారు, మిగతా 12 గంటలు తినడం వంటివి చేస్తారు. ఈ విధానం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల నిద్రలేమి తాలుక సమస్యలు దూరం అవుతాయని అన్నారు. ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారస్తుందని చెప్పారు. అలాగే ఇంత విరామం కారణంగా జీర్ణక్రియ పునరుద్ధరించడానికి తగినంత సమయం ఉంటుంది. ఉపవాస సమయంలో తీసుకోవాల్సినవి..ఈ పన్నెండు గంటల ఉపవాస సమయంలో కొవ్వుని కరిగించే జ్యూస్‌లు వంటివి తీసుకోవాలి. అంతేతప్ప కూల్‌డ్రింక్‌లు, ఫ్యాట్‌తో కూడిన జ్యూస్‌ల జోలికి వెళ్లకూడదని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ నీరు, ఫెన్నెల్ లేదా తులసి నీరు, చమోమిలే టీ లేదా అల్లం టీ వంటివి తీసుకోవడం మంచిదని చెప్పారు సేథి. ఇవి ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. వివిధ మార్గాల్లో శరీరానికి మద్దుతుని ఇస్తాయి.మిగతా 12 గంటలు తినే భోజనం ఎలా ఉండాలంటే..ఈ సమయంలో సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వు తగ్గేందుకు ప్రోత్సహించేలా అధిక ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టిపెట్టాలి. పనీర్, టోపు, చిక్పీస్, చికెన్, టర్కీ, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం తోపాటు అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్ కలయిక కొవ్వుని తగ్గించడానికి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరానికి ఇంధనంగా మంచి పోషకాలను అందిస్తుంది. చివరగా బరువు తగ్గడంలో ఈ అడపాదడపా ఉపవాసం ప్రభావంతంగా ఉంటుందని క్లినికల్‌గా నిరూపితమైందని నొక్కి చెప్పారు. అయితే ఇక్కడ సరైన విధంగా చేయడంపైనే ఫలితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం(చదవండి: కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!) -
Lal Bhadur Shastri: నాటి ప్రధాని అభ్యర్థనతో దేశమంతా ఉపవాసం
దేశానికి సేవలు అందించిన మహనీయులను స్మరించుకోవడం దేశవాసులుగా మన కర్తవ్యం. ఈరోజు (జనవరి 11) భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి. 1966 జనవరి 11న ఆయన కన్నుమూశారు. ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తిగా శాస్త్రి పేరుగాంచారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం శాస్త్రి 1964, జూన్ 9న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.18 నెలల పాటు దేశ ప్రధానమంత్రిగా కొనసాగిన శాస్త్రి నాయకత్వాన 1965లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాక్ ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో తాష్కెంట్(Tashkent)లో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. ఆ తర్వాత 1966, జనవరి 11న రాత్రి ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి పదవీకాలం చాలా తక్కువ. కానీ అదే సమయంలో ఆయన తన సరళమైన స్వభావం, దృఢ సంకల్ప శక్తి ప్రభావాలను దేశప్రజలకు చాటిచూపారు. క్లిష్ట సమయంలో దేశంలో అధికారాన్ని చేపట్టిన ఆయన పలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు.లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) 1964, జూన్ నుండి 1966, జనవరి వరకు భారత ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో భారతదేశంలో ఆహారధాన్యాల కొరత అధికంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో భారత్ ఆహార ధాన్యాల కోసం అమెరికాపై ఆధారపడింది. ఇంతలో 1965లో పాకిస్తాన్.. భారతదేశంపై దాడికి దిగింది. అయితే పాక్‌కు భారత సైన్యం(Indian Army) తగిన సమాధానం ఇచ్చింది. కానీ మన సైనికులకు తీవ్ర ఆహార సమస్య ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో ప్రధాని శాస్త్రి.. దేశ ప్రజలంతా ఒక ఉపవాసం ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి దేశ ప్రజలంతా అంగీకరించారు. ఆ తదుపరి సంవత్సరాల్లో భారత్ ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: అంబాసిడర్ బాబా.. 35 ఏళ్లుగా కారులోనే సాధన -
దేవుడి పేరుతో ఉపవాసం ఉండండి : పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కొన్నాళ్లుగా యూట్యూబ్ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. పూరి నిర్వహిస్తున్న ఈ పాడ్‌కాస్ట్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. సరికొత్త విషయాలను చెబుతూ తన అభిమానులకు జ్ఞానంతో పాటు కొన్ని విషయాల్లో ధైర్యాన్ని కూడా అందిస్తున్నాడు. తాజాగా ఈ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ‘ఆటోఫజీ’ అనే పదానికి అర్థం వివరిస్తూ దాని వెనుక ఉన్న కథను చెప్పాడు.‘‘ఆటోఫజీ’అనేది ఓ గ్రీకు పదం. ఆటో అంటే సెల్ఫ్ అని, ఫజీ అంటే తినడం అని అర్థం. దీన్నే ఇంగ్లీష్‌లో సెల్ఫ్ ఈటింగ్ అంటారు. ఇది శరీరంలో జరిగే జహన ప్రక్రియ. మన శరీరంలో ఉన్న పనికి రాని, దెబ్బతిన్న కణాలను మన శరీరమే తినేస్తుంది. ఆటోఫజీ(Autophagy) అనేది శరీరంలో జరిగే రీసైక్లింగ్ ప్రక్రియ. మన ఆరోగ్యానికి హానికలిగించే ఏ పదార్థం ఉన్నా, దాన్ని కూడా బయటకు పంపుతుంది. అలాగే, దెబ్బతిన్న ప్రొటీన్లను తీసేస్తుంది. ఈ ఆటోఫజీ వల్ల మన మెటబాలిజం పెరిగి, మరింత శక్తి చేకూరుతుంది. వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌లాంటి రోగాలు రాకుండా చేస్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడే ఈ ఆటోఫజీ సక్రమంగా జరుగుతుంది. హీట్ అండ్ కోల్డ్ థెరపీలోనూ బాగా పనిచేస్తుంది. దీని వల్ల మన జీవన కాలం పెరుగుతుంది. మన ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. అందుకే పెద్దలు ఉపవాసం అలవాటు చేశారు. మీరు కూడా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి, అప్పుడప్పుడు ఉపవాసాలు చేయండి. మీ వ్యాధి నిరోధకశక్తి, మెదడు పనితీరు పెరుగుతుంది. రోజూ వ్యాయామం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది. మన టిష్యులు రిపేర్ అయి, శరీరంలో హీలింగ్ ప్రక్రియ వేగం అవుతుంది. జపాన్‌కు చెందిన యష్నోరి అనే బయాలజిస్ట్ ఈ ఆటోఫజీ గురించి మొదట కనుక్కొన్నాడు. అతడికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఉపవాసాలు, వ్యాయామాలు, చన్నీటి స్నానాల వల్ల ఆటోఫజీ యాక్టివేట్ అయి, ఆరోగ్యంగా ఉంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే, మీ డాక్టర్‌ను సంప్రదించండి’ అని పూరి అన్నారు. ఇక సినిమాల విషయాలకొస్తే..పూరి ఇటీవల తెరకెక్కించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టాయి. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూరి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం పలు కథలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇంటెల్ ఉద్యోగుల కోసం మాజీ సీఈవో ఉపవాసం..
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ ఉద్యోగుల కోసం దాని మాజీ సీఈవో పాట్ గెల్సింగర్ ఉపవాసం ఆచరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులనూ కోరుతున్నారు. ఇంతకీ ఉపవాసం ఎందుకు చేస్తున్నారు.. ఇంటెల్ ఉద్యోగులకు ఏమైంది.. ఈయన ఏం చెప్పారన్నది ఇప్పుడు చూద్దాం..ఇంటెల్ సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ సీఈవో పాట్ గెల్సింగర్.. సంస్థలో పనిచేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగుల శ్రేయస్సు, వారి భవిష్యత్తు కోసం లోతైన ఆందోళనను వ్యక్తం చేస్తూ తాను ఆచరిస్తున్న ప్రార్థన, ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరుకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు."నేను ప్రతి గురువారం 24 గంటలపాటు ప్రార్థన, ఉపవాసం ఆచరిస్తున్నాను. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న లక్ష మంది ఇంటెల్ ఉద్యోగుల కోసం ప్రార్థనలు, ఉపవాసం చేయడంలో నాతో చేరాలని ఈ వారం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంటెల్, దాని సిబ్బంది పరిశ్రమకు, యూఎస్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది" అని గెల్సింగర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురుచిప్ మార్కెట్లో ఇంటెల్ ప్రభ తగ్గిపోవడం, మరోవైపు ఎన్విడియా పుంజుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కంపెనీ బోర్డ్ విశ్వాసాన్ని కోల్పోయిన జెల్సింగర్ ఉద్వాసనకు గురయ్యారు. ఇంటెల్ సంస్థను నడిపించడం తనకు లభించిన జీవితకాల గౌరవమని తన పదవీ విరమణ సందర్భంగా గెల్సింగర్ పేర్కొన్నారు.ఇంటెల్‌లో ఇటీవల గణనీయమైన పునర్వ్యవస్థీకరణ మార్పులు సంభవించాయి. 15% సిబ్బందిని తొలగించింది. 10 బిలియన్ డాలర్ల మేర ఖర్చును తగ్గించుకుంది. కంపెనీ ఇటీవలే ఒక్కో షేరుకు 0.46 డాలర్ల చొప్పున నష్టపోయింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 6.2% క్షీణించి 13.28 బిలియన్ డాలర్లకు తగ్గింది. జెల్సింగర్ నిష్క్రమణ తరువాత డేవిడ్ జిన్స్నర్, మిచెల్ జాన్స్టన్ హోల్తాస్లు తాత్కాలికంగా సహ సీఈవోలుగా నియమితులయ్యారు. శాశ్వత సీఈవో కోసం ఇంటెల్ తీవ్రంగా అన్వేషిస్తోంది.Every Thursday I do a 24 hour prayer and fasting day . This week I'd invite you to join me in praying and fasting for the 100K Intel employees as they navigate this difficult period. Intel and its team is of seminal importance to the future of the industry and US.— Pat Gelsinger (@PGelsinger) December 8, 2024 -
నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ
దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం అనగానే పులిహోర, పాయసంలేదా క్షీరాన్నం గుర్తొస్తాయి. తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది అవతారాల్లో జగన్మాతకు మొక్కుతారు. తొమ్మిది రకాల నైవేద్యాలతో దుర్గాదేవిని పూజిస్తారు. ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ రెండోపూట పండ్లు, ఫలహారాలతో ఉపవాసాలు కూడా చేస్తారు. మరి ఉపవాస సమయంలో రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే సగ్గుబియ్యంతో చేసుకునే కిచిడీ గురించి తెలుసుకుందాం.సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. సగ్గుబియ్యంలో ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి.సగ్గుబియ్యం లేదా సాబుదానా కిచిడీకి కావాల్సిన పదార్థాలుసగ్గుబియ్యం, ఒక కప్పు, ఒక బంగాళదుంప - పెద్దది అయితే ఒకటి, చిన్నవి రెండుపచ్చిమిరపకాయలు నాలుగైదు,నెయ్యి , కొద్దిగా అల్లం ముక్క,ఉప్పు, తయారీసగ్గుబియ్యాన్ని నీటిలో కడిగి, నీళ్లు తీసేసి మూడు గంటలు నానబెట్టాలి.పల్లీలను వేయించి, పొట్టుతీసి, చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.అలాగే బంగాళాదుంపును ఉడికించి పొట్టు తీసి చిన్న ముక్కులుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి కొద్దిగి నెయ్యి వేసుకోవాలి. ఇది వేడెక్కాక జీలకర్ర, అల్లం, పచిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇపుడు ఉడికించిన ఆలూ ముక్కల్ని వేసుకోవాలి. బాగా వేగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి. కొద్ది సేపు వేగాక, రెండు కప్పుల నీళ్లు పోసి సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇపుడు పల్లీల పౌడరు వేసి బాగా కలపాలి. ఒక్కసారి రుచి చూసుకొని కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం చాట్సగ్గుబియ్యం చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సగ్గుబియ్యం, ఉడికించి, తరిగిన బంగాళాదుంప ముక్కలు, టమోటా,కప్పు చట్నీ, ఫాస్టింగ్ రాక్ సాల్ట్, నల్ల మిరియాలు, వేరుశెనగలు, చీజ్ అవసరం.తయారీ ముందుగా సగ్గుబియ్యాన్నినీటిలో గంటసేపు నానబెట్టాలి. తరువాత వేరుశెనగలను వేయించాలి. ఇప్పుడు బంగాళదుంపలను ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి పెరుగు, చట్నీ కలపండి. ఉప్పు, మసాలాలు వేసి బాగా కలపాలి. అంతే సగ్గుబియ్యం చాట్ రెడీ -
శ్రావణమాస ఉపవాసాలు : నీరసం రాకుండా, శక్తి కోసం ఇలా చేయండి!
ఆగస్టు మాసం వచ్చిందంటే పండుగ వాతావరణం వచ్చినట్టే. ఒకవైపు శ్రావణమాస సందడి.మరోవైపు ఆగస్టు 15 స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాలతో దేశభక్తి వెల్లివిరుస్తుంది. అంతేనా ఈ ఆగస్టు మాసంలో రాఖీపండుగ, కృష్ణాష్టమి కూడా కూడా. అలాగే శివుడ్ని కూడా ఆరాధిస్తారు. ముఖ్యంగా పవిత్ర శ్రావణమాసంలో మహిళలు శుక్రవార లక్ష్మీవ్రతం, మంగళవార వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఉపవాసం ఉంటారు. పుజాదికాలు, వంటలు చేయాలంటే శరీరానికి శక్తి కావాలి కదా. ఉపవాస దీక్షకు భంగం కాకుండా, శరీరం బలహీన పడకుండా ఉత్సాహంగా పనిచేసుకునేలా కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం.ఉపవాసంలో శక్తినిచ్చే పానీయాలుఉపవాసం ఉన్నప్పు హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఆకలిగా అనిపించినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతాము. దీన్ని నివారించడానికి ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అయితే సాధారణంగా కాఫీ, టీలతొ ఉపవాసాన్ని ఆచరిస్తారు చాలామంది. తక్షణ శక్తికోసం ఇవి కొంతవరకు ఉపయోగ పడతాయి. కానీ ఖాళీ కడుపుతో కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ ,కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు పనిచేస్తాయి. గ్యాస్ సమస్యలు రాకుండా కడుపులో చల్లగా ఉండేలా చేస్తాయి.మజ్జిగ: ఉపవాసాల సమయంలో మజ్జిగను మించింది మరొకటి ఉండదు. పల్చటి మజ్జిగ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఉపవాస దీక్షకు భంగం అనుకుంటే ఉప్పును మానివేసి,చక్కెర కలుపుకొని తాగవచ్చు.రుచికోసం వేయించిన జీలకర్ర పొడి,పుదీనా, నిమ్మరసం కలిపి తాగొచ్చు. కడుపునకు చల్లదనాన్నిచ్చి, ఉత్సాహంగా ఉంటుంది.నిమ్మరసం: బాగా నీరసం అనిపించినపుడు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి నిమ్మరసం చాలా మంచిది. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తెనె కలుపుకొని తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. కొబ్బరి నీళ్లు: సహజసిద్ధంగా లభించే కొబ్బరి నీరు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పొటాషియం, సోడియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. శక్తినిచ్చి, నీరసం రాకుండా కాపాడుతుంది.పండ్ల రసాలు: ఉపవాసం సమయంలో సీజన్లో దొరికే అన్ని రకాల పండ్లను తినవచ్చు. మరింత శక్తి కావాలనుకుంటే బత్తాయి, యాపిల్, పైనాపిల్,మామిడి పండ్ల రసాలు, మిల్క్ షేక్ తాగవచ్చు. దానిమ్మ, జామ తదితర పండ్లతో సలాడ్‌లా చేసుకొని తినవచ్చు.బాదం పాలు బాదం పాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శ్రావణ మాసంలో వాతావరణంలో బాదం పాలు తాగడం వల్ల తక్షణ శక్తిలభిస్తుంది. వేడి పాలల్లో కొద్దిగా జీడి పప్పు పలుకులు, పంచదార లేదా తేనె,బాదం పొడిని కలుపుకుని తాగాలి. దీంతో పొట్ట నిండుగా ఉండి, మనసుకు ఉత్సాహంగా అనిపిస్తుంది. -
'ఉపవాసం' అంటే.. అసలు అర్థమేంటో తెలుసా!?
ఉపవాసం అంటే పస్తు ఉండటం, నిరాహారంగా ఉండటం అని వాడుక. కానీ ‘ఉప–వాసం’ అనే పదబంధానికి ఆహారంతో సంబంధం కనిపించదు. ‘ఉప’ అంటే ‘సమీపం’, ‘వాసం’ అంటే ‘నివాసం’. కాబట్టి ‘ఉపవాసం’ అంటే దగ్గరగా ఉండటం. దేనికి దగ్గరగా ఉండటం? ఉపవాసం చేసే సాధకుడు దేనికి దగ్గరగా ఉండాలనుకొంటున్నాడో దానికి!ఉదాహరణకు, ఒక భక్తుడు కొంత సమయం పాటు, ఎప్పటికంటే ఎక్కువగా, మనో–వాక్–కాయ–కర్మల ద్వారా తన ఇష్ట దైవానికి సన్నిహితంగా ఉండాలని సాధన చేస్తే, అది ఉపవాస సాధన అవుతుంది. శరీరాన్ని వీలయినంత ఎక్కువ సమయం భగవన్మూర్తికి దగ్గరగా ఉంచుతూ, ఇతర లౌకిక విషయాలకు దూరంగా ఉంచటం శారీరకమైన ఉపవాసం.వాక్కును కొంతకాలం పాటు భగవత్ స్తోత్రాలకూ, భగవద్వి షయమైన చర్చలకూ పరిమితం చేయటం వాక్కుపరమైన ‘ఉపవాసం’. మనసును ఆహార విహారాల లాంటి ఇంద్రియ విషయాల మీదనుంచి కొంతసేపు మళ్ళించి, దైవం మీద నిలిపి ఉంచటం మానసికమైన ఉపవాసం. అలాగే లౌకికమైన పనులకు కొంతకాలం సెలవిచ్చి, ఆ సమ యాన్ని పూజలకూ, ఆరాధనలకూ, అభిషేకాలకూ, వ్రతాలకూ వెచ్చించడం... కర్మల పరంగా దైవానికి సమీపంగా ఉండే ‘ఉపవాసం’.ఈ దేహమూ, ఇంద్రియాలూ, మనస్సు– ఇవే ‘నేను’ అన్న మిధ్యా భావనలో మునిగిపోయి, వీటికి అతీతంగా వెలుగుతుండే ఆత్మజ్యోతి తన అసలు రూపం అని మరిచిపోయిన జీవుడు, కొంతకాలం పాటన్నా దేహేంద్రియ వ్యవహారాలకు దూరంగా, తన స్వ స్వరూపానికి దగ్గరగా వెళ్ళి దానిని గుర్తించేందుకు చేసే సాధన ‘ఉపవాసం’ అని వేదాంతులు వివరణ ఇచ్చారు.మామూలుగా రోజూ తినే ఆహారం మీద నుంచి దృష్టి మళ్ళించేసి, ఒక్కపూట మరేదయినా ఆహారం పుచ్చుకొంటే ఇహానికీ పరానికీ మంచిదన్న భావనతో, దాని మీద దృష్టి పెట్టడం కూడా ‘ఉపవాసమే’. కానీ అది మనో వాక్ కాయ కర్మలన్నిటి ద్వారా, ఆ కొత్త ఆహారానికి ‘సమీపంగా ఉండటం’ మాత్రమే అవుతుంది. – ఎం. మారుతి శాస్త్రి -
కఠినమైన డైట్, జిమ్ చెయ్యలేదు..కేవలం పరాఠాలతో బరువు తగ్గడమా..?
ప్రస్తుతం జీవన విధానంలో బరువు తగ్గడం అనేది అదిపెద్ద సమస్య. ఎన్ని వర్కౌట్లు, వ్యాయామాలు చేసినా బరువు తగ్గక ఇబ్బందిపడుతుంటారు. పాపం వేలకు వేలు జిమ్ సెంటర్లు, ఫిట్నెస్ సెంటర్లకు డబ్బులు తగలేస్తుంటారు. కానీ కొందరూ మాత్రం ఎలాంటి కఠినమైన డైట్లు పాటించరు. శరీరాన్ని కష్టబెట్టేలా వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చెయ్యరు. అయితే వాళ్లు తమ శరీరానికి సరిపడే విధంగా సొంత డైట్ ప్లాన్‌తో భలే వెయిట్ లాస్ అయ్యి అందర్నీ షాక్‌కి గురిచేస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే భారతీ సింగ్. ఏకంగా 91 కిలోలు ఉండే ఆమె అన్ని కిలోల బరువు ఎలా తగ్గిందంటే..సెప్టంబర్ 2021 వరకు భారతి సింగ్ 91 కిలోల బరువు ఉండేది. అయితే తాను ఎలాగైనా.. బరవు తగ్గాలని చాలా గట్టిగా అనుకుంది. పలు ప్రయత్నాలు కూడా చేసింది. అలా అని వ్యాయమాలు వంటివి చేయడం ఆమె వల్ల కాదు. ఏదో రకంగా మితంగా తింటూ తగ్గాలి. అందుకోసం ఉపవాసాలు కూడా చెయ్యలేదు. అందుకని ఆమె అడపదడపా ఉపవాసాన్ని సెలక్ట్ చేసుకుంది. ఈ డైట్ విధానం ప్రకారం.. ఓ నిర్థిష్ట నియమానుసారంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించింది. ఆమె మధ్యాహ్నం 12 గంటలు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఆహారం తీసుకునేది కాదు.ఆమెకు పరాఠాలు, వెన్న అంటే మహా ఇష్టం. ఇంట్లో వండిన భోజనమే తినేది ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆ టైంలో ఫుల్‌గా తనకిష్టమైన ఆహారం తీసుకునేది. ఆ తర్వాత నుంచి రాత్రి ఏడింటి వరకు ఏమీ ముట్టుకునేది కాదు. అయితే ఆహారం తీసుకునే టైంలో మంచి హెల్తీ ఫుడ్‌ని తీసుకునేది. దీంతో ఆమె 15 నుంచి 16 గంటలు రకు ఏమి తీసుకోకుండా ఉండగలిగేది. అలా ఆమె చాలా శ్రద్ధతో ఒకేటైంలో ఆహారం తీసుకునేలా శ్రద్ధ వహించింది. అందువల్ల రాత్రి ఏడింటి తర్వాత ఆమె శరీరం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారం తీసుకునేందుకు ఇష్టపడదు. దీంతో ఆమె ఆకలిని నియంత్రించగలిగింది. తద్వారా భారతి సింగ్ సుమారు 15 కిలోల బరువు తగ్గిపోయింది. ప్రస్తుతం ఆమె బరువు 76 కిలోలు. అడపాదడపా ఉపవాసం అంటే..ఉపవాసానికి, తినడానికి మధ్య చాలాసేపటి వరకు విరామం ఇస్తే దీన్ని అడపాదడపా ఉపవాసం అంటారు. బరువు తగ్గేందుకు, జీవక్రియను మెరుగుపరుచుకునేలా.. ఈజీగా నచ్చిన ఆహారం తీసుకునేలా చేసే సమర్థవంతమైన డైట్ వ్యూహం అని నిపుణుల చెబుతున్నారు. ఈ వ్యూహం ప్రకారం ఎక్కువ సేపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. అదే వీరి ఒంట్లోని కొవ్వుని, కేలరీలను సులభంగా బర్న్ చేస్తుంది. అలాగే ఫుడ్ తీసుకునే సమయంలో మంచి సమతుల్య ఆహారం తప్పనిసరి. ఇక్కడ ఈ డైట్లో బరువు తగ్గడం అనేది సదరు వ్యక్తి అంకితభావం, నిలకడ మనస్తత్వం తదితర వాటి కారణంగా బరువు తగ్గడం జరుగుతుంది.(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
ఢిల్లీ నీటి సంక్షోభం: ‘అప్పటివరకు నిరాహార దీక్ష విరమించను’
ఢిల్లీ: ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజు కొనసాగుతోంది. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే వాటాను విడుదల చేసేవరకు తన నిరహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.‘హర్యానా ప్రభుత్వం ఢిల్లీలోని 28 లక్షల మందికి అవసరమయ్యే నీటిని విడుదల చేసేవరకు నేను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించను. హర్యానా ప్రభుత్వం.. ఢిల్లీకి 613 ఎంజీడీ వాటర్ ఇవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని వారాల నుంచి కేవలం 513 ఎంజీడీ నీటిని మాత్రమే హర్యానా రాష్ట్రం సరాఫరా చేస్తోంది. అన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే నా నిరాహార దీక్ష కూడా విరమించను’అని అతిశీ అన్నారు.గత కొన్ని రోజులు ఢిల్లీ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. యమునా నది వాటర్‌లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను ఇవ్వటం లేదని ఆరోపణలు చేస్తోంది. ఇక.. బుధవారం అతిశీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ నీటి సంక్షోభం విషయంలో జోక్యం చేసుకొని సమస్క పరిష్కరించాలని కోరింది. లేదంటే తాను 21 తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతానని పేర్కొన్నారు. అందులో భాగంగా అతిశీ రెండోరోజు నిరవధిక దీక్ష కొనసాగుతోంది. -
స్పీచ్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఒక్క రోజులో ఏం జరుగుతుంది?
ఊరుకున్నంత ఉత్తమం లేదని మన పెద్దలు అంటుంటారు. అతిగా మాట్లాడటం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తడమే కాకుండా మానసిక శక్తి బలహీనపడుతుంది. కొన్నిసార్లు అతిగా మాట్లాడటం పెద్దపెద్ద వివాదాలకు దారితీస్తుంది. మౌనం వహించడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ షౌనక్ అజింక్యా మౌనం గొప్పదనాన్ని వివరించారు. ఒక రోజంతా నిశ్శబ్దంగా ఉంటే అది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ‘స్పీచ్ ఫాస్టింగ్’ గొంతులోని స్వర తంతువు (వాయిస్ రీడ్స్)లకు విశ్రాంతిని ఇస్తుంది. రోజంతా నిశ్శబ్దంగా ఉంటడం ఒత్తిడిని తగ్గిస్తుంది. అలసటను తొలగిస్తుంది. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది. ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది. రోజంతా మౌనంగా లేదా అధికంగా మాట్లాడకుండా ఉండగలిగితే మానసిక స్వాంతనను పొందుతారు. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినగలుగుతారు. మౌనంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. పలు మతాలలో మౌనవ్రతం అనేది భగవంతుడిని చేరుకునేందుకు ఒక మార్గంగా చెబుతారు. మౌనవ్రతం అంతర్గత బలాన్ని పెంచుతుంది. మనలోని అంతరంగాన్ని అర్థం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. రోజంతా మౌనంగా ఉండటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుందని డాక్టర్ అజింక్య తెలిపారు. స్వర తంతువులు, గొంతు కండరాలు, ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి. అధికసమయం మౌనంగా ఉండటం, గాఢమైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవడమే కాకుండా రక్తపోటు అదుపులో ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. తక్కువగా మాట్లాడటం వల్ల మెదడుకు పదును పెట్టినట్లవువుతుంది. అలాగే పరధ్యానం తొలగి, మరింత ఏకాగ్రత ఏర్పడుతుందని అజింక్య వివరించారు. -
సలార్ హీరో సాహసం.. ఆ సీన్ కోసం ఏకంగా మూడు రోజులు!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యథార్థ సంఘటనలపై బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడుకేరళకు చెందిన ఓ యువకుడు విదేశాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ చిత్రం కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ తీవ్రంగా శ్రమించారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సునీల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలోని నగ్నంగా కనిపించే సన్నివేశం కోసం కఠినమైన ఉపవాసం చేశారని తెలిపారు. దాదాపు మూడు రోజుల పాటు కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారని వెల్లడించారు. ఈ సినిమాపై పృథ్వీరాజ్ అంకితభావం చూపడాన్ని ఆయన కొనియాడారు. పృథ్వీరాజ్‌ను షూట్ జరిగే ప్రదేశానికి కుర్చీలో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు కేవలం 30 ఎంఎల్ వోడ్కా ఎందుకు తాగాడనే విషయాన్ని కూడా సునీల్ వెల్లడించారు. షూట్‌కు ముందు అతని శరీరంలో మిగిలి ఉన్న నీటి నీటి శాతాన్ని బయటకు పంపేందుకు 30 ఎంఎల్ వోడ్కా తీసుకున్నారని తెలిపారు. ఈ సీన్ షాట్‌కు ముందు మేము ఆయనను కుర్చీలో నుంచి లేపాల్సి వచ్చిందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో నజీబ్ అనే వలస కార్మికుడి పాత్రలో పృథ్వీరాజ్ కనిపించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. Wow 👏 For d Naked Scene, Prithviraj was fasting for 3 Days, not even water in last day; before shoot he took 30ML Vodka to drain remaining water frm body. He was carried in a chair to d location. We needed to lift him from the chair before the shot😯 pic.twitter.com/UjY3Kq0Ti9 — Christopher Kanagaraj (@Chrissuccess) April 2, 2024 -
'ఉపవాసం' వల్ల గుండె జబ్బులు వస్తాయా?
'ఉపవాసం' ఆరోగ్యానికి చాలా మంచిదని భావించేవాళ్లం. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటే అధిక కొలస్ట్రాల్ కరిగి, క్యాలరీలు ఖర్చు అవ్వుతాయని చెప్పేవారు. దీనివల్ల ఆరోగ్యం మెరగవుతుందని అనేవారు నిపుణులు. ఈ 'ఉపవాసం' అనేది శరీరంలోని శక్తిని బర్న్ చేసే ఒకలాంటి వ్యాయామమేనని పదేపదే చెప్పేవారు వైద్యులు. అయితే అదంతా సరైనది కాదని వాదిస్తున్నారు యూఎస్ శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో చాలా ఆసక్తికర షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే.. అధిక బరువు సమస్యకు ఉపవాసం అనేది ఒక మంచి ఔషధం లాంటిదనేవారు. భోజన సమయాన్ని ఎనిమిది గంటలకు పరిమితి చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. అంతేగాదు గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 91% పెరుగుతుందన్నారు. చికాగోలోని అమెరికన్ హార్ట్ అసోసీయేషన్ ఈ తాజా పరిశోధనను ప్రచురించింది. ఉపవాసాన్ని మన జీవనశైలిలో భాగం చేసుకుంటే బరువు అదుపులో ఉంటుందని, ఇలా చాలమంది బరువు తగ్గిన దాఖాలాలు కూడా ఉన్నాయని నిరూపితమైన అధ్యయనాల ఫలితాల సంగతేమిటని పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే చికాగో శాస్త్రవేత్తల బృందం యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెందిన నెషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ దాదాపు 20 వేల మంది పెద్దలపై పరిశోధనలు నిర్వహించింది. దాదాపు 12 నుంచి 16 గంటల వరకు అప్పడప్పుడూ ఆహారాన్ని తీసుకోని వారు, తీసుకున్న వారు మద్య ఉన్న వ్యత్యాసాన్ని స్టడీ చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా సగటు వయసు 48 ఏళ్లు. ఇక అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తున్న వారిలో మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల ప్రభావం తక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే నిర్ణిత సమయంలో ఆహారం తీసుకునే వారితో పోల్చగా..కొన్ని గంట సమయానికి ఆహారాన్ని పరిమితం చేసిన వారిలో పలు సమసయలు కనిపించాయన్నారు. వారిలో హృదయ నాళ సమస్యలు ఉత్ఫన్నమయ్యి చనిపోయే అవకాశం ఉన్నట్లు తేలిందన్నారు. ఈ పరిశోధనను శాస్త్రవేత్తలు సుమారు 2003 నుంచి 20019 వరకు చేశారు. ఆయా కాలాల మధ్య చనిపోయిన బాధితుల మరణాల డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ అనేదానిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిఉందని యూకే ప్రోఫెసర్ కీత్ ఫ్రాయిన్ అభిప్రాయపడ్డారు. నిజానికి జీర్ణశయానికి ఒకరోజు విరామం ఇచ్చి.. ఈజీగా క్యాలెరీలను తగ్గించేందుకు ప్రసిద్ధ సాధనం ఈ "ఉపవాసం". అలాంటిది ఆరోగ్యానికి హానికరం అనడం సరైనది కాకపోవచ్చిని అన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేదానిపై మరిన్ని పరిశోధను చేయాల్సి ఉందన్నారు. అలాగే అడపాదడపాగా ఉపవాసం నిజంగా ఆయా వ్యక్తులు చేశారా, వారికి ఇంకేమైన అలవాట్లు ఉన్నాయనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు యూకే ఫ్రొఫెసర్. (చదవండి: డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!) -
రంజాన్ ఉపవాసాలపై డబ్యూహెచ్ఓ మార్గదర్శకాలు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ మాసం. ఈ రంజాన్ మాసం భారత్‌లో మార్చి 12( మంగళవారం) నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవికాలం. ఈ నేపథ్యంలో ఆ ఉపవాసలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే యత్నం చేయమని కోరింది. ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలిన సూచించింది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది కాబట్టి డీ హైడ్రేట్ అయ్యి అలిసిపోకుండా ఉండేలా బలవర్థకమైన ఆహారం తీసుకోమని సూచించింది. తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని సూచించింది. అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్‌తో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దని చెబుతోంది. అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఉత్తమని చెబుతోంది. అలాగే కాస్త వ్యాయామం చేయమని చెబుతోంది. ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని సూచించింది. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండమని ఆరోగ్య సంస్థ కోరింది. ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోమని సూచించింది. (చదవండి: ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!) -
ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. మక్కాలో చంద్రుని దర్శనం ఆధారంగా రంజాన్ మాసం భారత్‌లో ఎప్పుడూ ప్రారంభమవుతుందనేది నిర్ణయిస్తారు ముస్లీం మత పెద్దలు. నెలవంక ఆకారంలో ఉండే చంద్రుడు ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం దర్శనం ఇచ్చింది. కాబట్టి మార్చి 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. అంటే ఈ ఏడాది మన దేశంలో ఇవాళ(మార్చి 12వ తేదీ (మంగళవారం)) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఎలా జరుపుకుంటారంటే.. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసం. ఈ నెలల్లో ముస్లీంలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసకాలంలో వారు రెండు సార్లు ఆహారాన్ని స్వీకరిస్తారు. వాటిని సుహూర్, ఇఫ్తార్‌గా పిలుస్తారు. ఇఫ్తార్ అనేది సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారం. సుహూర్ అంటే తెల్లవారుజామున తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉపవాస దీక్ష విరమించుకునే రోజు సాయంత్రం తమ కుటుంబం\ సభ్యులను బంధువులను పిలచుకుని ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. అంతేగాదు ఈ మాసంలో దాన ధర్మాలు, పేదలకు ఆహారం అందించడం వంటవి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉపవాస సమయాల్లో వ్యత్యాసం.. ఈ ఉపవాస సమయాలు ప్రపంచవ్యాప్తంగా మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి ఉపవాస సమయం వ్యవధి చాలా విభిన్నంగా ఉంటుంది. దక్షిణార్థ గోళంలో సూర్యని వంపు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటంలో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి నార్వేలోని ఓస్లోలో ముస్లింలు దాదాపు 15 గంటల 15 నిమిషాల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అదే లండన్‌లో దాదాపు 14 గంటల 11 నిమిషాల పాటు ఉపవాసం ఉంటారని స్టాటిస్లా నివేదిక పేర్కొంది. ఇక జకర్తాలో ఉపవాసం నిడివి సుమారు 13 గంటల నుంచి 13 నిమిషాలు ఉంటుందని స్టాటిస్లా నివేదిక అంచనా వేసింది. #Ramadan starts on Sunday evening, with the first day of fasting on Monday, March 11 this year. While the number of days of Ramadan are equal for all Muslims observing it around the world, the length of the daily fast is not. — Statista (@StatistaCharts) March 8, 2024 (చదవండి: నేటి నుంచే రంజాన్ మాసం ప్రారంభం!) -
Maha Shivratri: నేడు తినాల్సినవి/తినకూడని ఆహారాలు ఇవే!
మహా శివరాత్రి పర్వదినం కావడంతో అందరూ తమ శక్తి మేరకు ఎంతో కొంత ఉపవాసం ఉంటారు. కొందరూ మధ్యహ్నాం వరకు తినరు మరికొందరూ రోజంతా ఏం తినకుండా రాత్రి జాగరం కూడా చేసి మరసటి రోజు ఉదయం గానీ తినరు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పళ్లు, పాలు వంటివి తీసుకోని ఆ భోళా శంకరుడుని ప్రార్థించొచ్చు. అలాంటి వారు ఈ పర్వదినం రోజు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో చూద్దామా!. సగ్గుబియ్యం: ఇది తక్షణ శక్తి ఇస్తుంది. ఉపవాసం చేసే వాళ్లకు చాలా మంచిది. ఈ సగ్గుబియ్యందో చేసిన జావా లేదా పాలతో చేసే సగ్గుబియ్యం జావా తాగితే మంచిది. ఉపవాసం ఉన్న వాళ్లకు మంచి ఎనర్జీ బూస్టప్‌గా ఉంటుంది. బంగాళ దుంప!: ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఉడక బెట్టుకుని లేదా దానికి సంబంధించిన రెసిపీలు తీసుకుంటే మంచిది. అయితే ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయాలు లేకుండా నచ్చిన రెసిపీ చేసుకుంటే మంచిది పాల సంబంధిత రెసిపీలు.. శివుడికి పాల సంబంధిత పదార్థాలను నైవద్యంగా పెట్టడం జరుగుతంది. అలాంటివి తీసుకుంటే ఉపవాసం ఉన్నవాళ్లు కళ్లు తిరగడం వంటివి తలెత్తవు. పండ్లు, డ్రైఫ్రూట్స్ పండ్లు తినడం మంచిదే కానీ, మరీ సిట్రస్ ఎక్కువగా ఉండే పుల్లటి పండ్లు తినకపోవడమే మంచిది. ఉపవాసం కారణంగా పొట్టలో ఆటోమేటిగ్గా యాసిడ్లు ఫామ్ అవుతాయి. ఇక ఇలాంటి పుల్లటి పళ్లు తీసుకుంటే మరింత గ్యాస్ ఫామ్ అయ్యే ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంది. తీసుకోకూడని పదార్థాలు.. తృణ ధాన్యాలు.. గోధుమలు, అరికెలు, జొన్నలు, సామలు వంటి తృణ ధాన్యాలకు సంబంధించిన పదార్థాలు వినియోగించకూడదు. అలాగే ఎలాంటి పిండి పదార్ధాలు వినియోగించ కూడదు. ఉల్లి, వెల్లుల్లి.. సాధారణంగా ఇలాంటి పర్వదినాల్లో ఉల్లి, వెల్లుల్లి జోలికిపోరు. ఇవి తమో రజో గుణాలను ప్రేరిపిస్తుందని మునులు వీటిని ఇలాంటి పర్వదినంలో త్యజించమని సూచించారు. ఉప్పు ఉప్పు లేని పదార్థాలే తీసుకోవాలి. అదికూడా సైంధవ లవణమైతే వినియోగించొచ్చు. స్సైసీ ఫుడ్స్ మసాలతో కూడిన పదార్థాలు నిషిద్ధం. నాన్ వెజ్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్‌వెజ్ జోలికి పోకూడదు. మహా శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఉపవాసంతో ఆ ముక్కంటి అనుగ్రహం పొందేలా చేసుకునే పవిత్రమైన రోజు. (చదవండి: లావుగా ఉన్నావంటూ భార్యతో సహా బిడ్డను వదిలేశాడు..కానీ ఆమె..!) -
Mahashivratri 2024 : ఒక చైతన్య జాగృతి
చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారు. ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం. ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే బహుళ (రాత్రిగల) చతుర్దశినాడు మాసశివరాత్రిగా జరుపుకుంటారు. పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన∙శివరాత్రినాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ, ప్రదోషవేళ శివుని అభిషేకించి, బిల్వదళాలతో పూజించాలి. అ రోజున శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలం లభిస్తుంది. ఉపవాసం, శివార్చన, జాగరణ.. ఈ మూడూ శివరాత్రినాడు ఆచరించవలసిన విధులు. ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో వసించడం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివసంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం. మహాశివరాత్రినాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మాసశివరాత్రులు/మహాశివరాత్రినాడు రుద్రాభిషేకాలు శివార్చనలు, బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్యఐశ్వర్య ప్రదం. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తిచేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన చేసి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్రవ్రతం అంటారు. సోమవారం ’ఇందుప్రదోషం’ గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్ర వచనం.16 సోమవారాలు నియమ పూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ, శివ రూపమే సనాతనం. ఇదే సకల రూపాలకు మూలం. సాక్షాత్తు శివుడు గుణాతీతుడు. కాలాతీతుడు. నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, పూర్చుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ. గుణనిధి అనే ఒక దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో శివరాత్రినాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు. కొండెక్కుతున్న దీపం వత్తిని కాకతాళీయంగా ఎగదోసి, తన ఉత్తరీయపు కొంగులను చించి వత్తిగా చేసి దానికి జత చేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడచినా శివరాత్రినాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితంగా మరుజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి అపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాథుడి కాశీఖండంలో ఉంది. శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ణి కృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడోజాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు. శివ తత్త్వం శివతత్త్వం ఎవరికీ అంత సులువుగా అర్థమైనది కాదు. శివుని కన్నా పెద్దది గాని, చిన్నది గాని సాటి మరొకటి లేదనేది తత్త్వ సాధకులు మోక్ష సాధకులకు ఆశ్రయించదగ్గ ఏకైక రూపం శివస్వరూపం. శివతత్త్వంలోని నిగూఢమైనటువంటి విషయాలలో ప్రప్రథమమైనవి జ్యోతిర్లింగాలు. శివుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలలో ఉన్నాడని, ఇది శివతత్త్వంలో భాగమేనని జ్యోతిర్లింగమనగా చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు (అనగా జ్ఞానము) ప్రసాదించేది అని జ్యోతిర్లింగాల తత్త్వం తెలియచేస్తుంది. శివతత్త్వంలో మరొకటి లింగాకారం. శివలింగాకారం పై భాగం లింగంగా కింద పానపట్టం యోని రూపంలో ప్రకృతీ పురుషుల ప్రతీకగా ప్రకృతీ పురుషులలో ఒకరు లేనిదే మరొకరు లేరు అని చెప్పేటటువంటి తత్త్వం. శివతత్త్వంలో మరొక తత్త్వం ప్రళయ తత్త్వం. ప్రళయతత్త్వం మూడు విధాలుగా ఉన్నది. రాత్రి సమయంలో నిద్ర ఇది ప్రళయతత్త్వంలో ఒక భాగం (నిద్ర) ప్రాపంచిక మాయ నుండి మరపునిస్తుంది. రెండవది మరణం. ఇది స్థూల శరీరానికి సంబంధించినటువంటి ప్రళయం. మూడవది మహా ప్రళయం. సమస్తం శివునిలో కలసిపోవటం. నాలుగవది త్రిమూర్తితత్త్వం (శివ, విష్ణు, బ్రహ్మ). శివుని నుండి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భవించారనేది శాస్త్రం. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు నడిపించి శివుడు అంతం చేయటం లోకోక్తి. పంచభూతలింగాల తత్త్వం. పంచభూతాలు అనగా అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం. అన్నిటిలోను శివుడున్నాడు అనేటటువంటి తత్త్వం. రుద్రతత్త్వం అంటే శివుడిని పూజించేటటువంటి పద్ధతి. రుద్రంలో మహన్యాసం, నమకం, చమకం అనే విధానం. మహన్యాసం అంటే చేసేది శివుడే, నీవు శివుడవే అని నిర్ధారిస్తుంది. శివతత్త్వంలో శివస్వరూపంలో దాగివున్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. శివరాత్రులు ఐదు రకాలు 1. నిత్యశివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు. 2. పక్ష శివరాత్రి : ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షాలలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం. 3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి : మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్ఠమనదగిన శివరాత్రి. 5. యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన. ఆ రూపంలోనే అంతా! శివుని తలపై గంగ ప్రవాహం ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞానం ప్రసారమవుతుందని సూచిస్తుంది. శివుని తలపై చంద్రుడు భగవంతుడిపై ధ్యాస ఎల్లవేళలా ఉండాలని సూచిస్తుంది. శివునికి మూడో కన్ను చెడును, అజ్ఞాన నాశనాన్ని చూపిస్తుంది. శివుని వద్ద ఉన్న త్రిశూలం జ్ఞానం, కోరిక, అమలు అనేటటువంటి మూడింటి స్వరూపం. శివుని ఢమరుకం వేదగ్రంథాలు వేదస్వరాన్ని తెలియచేసే ఢమరుకం. శివుని మెడపై ఉన్న సర్పం అహం నియంత్రణను సూచిస్తుంది. శివుడు ధరించే రుద్రాక్ష స్వచ్ఛతను, ధరించే మాలలు ఏకాగ్రతనూ సూచిస్తాయి. నడుముకు చుట్టుకునే పులి చర్మం భయం లేనటువంటి తత్త్వాన్ని సూచిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలనూ కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. ‘నిర్ణయసింధు’లోని నారద సంహితలో శివరాత్రి వ్రతవిధానం ఉంది. మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్మనారు, అక్కమహాదేవి, బెజ్జ్ఞ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఆధ్యాత్మికవేత్త. -
ఫాస్టింగ్‌తో బరువు తగ్గడానికి మించిన ఆరోగ్య ప్రయోజనాలు!
బరువు తగ్గాలి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం. తర తరాలుగా భారతీయుల్లో ఉపవాసం కొత్తేమీకాదు. బరువు తగ్గాల నుకునే వారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు ఫాస్టింగ్ చేయడం కూడా చాలా కామన్. అయితే ఎక్కువ కాలం మన దేహాన్ని పస్తు పెట్టడం వల్ల వెయిట్‌లాస్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది తాజా అధ్యయనం. ఆ వివరాలు మీకోసం. ఉపవాసంతో శరీరంలో ఏమి జరుగుతుంది? ఉపవాస సమయంలో, మన శరీరం దాని ఇంధన మూలాన్ని స్వీకరిస్తుంది. సులభంగా యాక్సెస్ చేసే చక్కెరల నుండి బాడీలోని నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. అయితే ఆహారం లేకుండా ఎక్కువ కాలం పాటు ఉంటే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇదే ఈ స్టడిలోని కీలక అంశం. నేచర్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్ పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరశోధన చేశాడు. వారు ఏడు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే తీసుకునేలా చేశారు. అలా వారి రక్తంలో వివిధ ప్రోటీన్ మార్కర్ల స్థాయిలలో మార్పులను నిశితంగా పరిశీలించారు. మూడు రోజుల తర్వాతే మంచి ప్రయోజనం ఊహించినట్లుగానే తొలి రెండు, మూడు రోజుల్లో గ్లూకోజ్ నుండి కొవ్వు ప్రధాన ఇంధన వనరుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. దీంతో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతూ వస్తుంది. మొత్తంగా, వాలంటీర్లు సగటున 5.7 కిలోగ్రాముల కొవ్వు ,లీన్ మాస్ రెండూ తగ్గాయి. అయితే మూడు రోజుల ఉపవాసం తర్వాత వాలంటీర్ల రక్త బయోమార్కర్లలో విభిన్న మార్పులను పరిశోధకులు గమనించారు. మొత్తం బాడీలో కూడా మార్పులొచ్చాయి. ముఖ్యంగా మెదడు కణాల నిర్మాణ ప్రోటీన్లలో మార్పులు ఆసక్తికరంగా నిలిచాయి. దీంతో మూడు రోజుల తరువాత చేసే ఉపవాసంలో మాత్రమే బరువు తగ్గడాన్ని మించి, మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ అధ్యయనంలో తేల్చారు. క్వీన్ మేరీస్ ప్రెసిషన్ హెల్త్ యూనివర్శిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (PHURI) డైరెక్టర్ క్లాడియా లాంగెన్‌బర్గ్ మాట్లాడుతూ, ‘తొలిసారి ఉపవాసం ద్వారా శరీరం అంతా కూడా అతి చిన్న స్థాయిలో కూడా ఏమి జరుగుతుందో చూడగలుగుతున్నామన్నామని ప్రకటించారు. సురక్షితమైన పద్ధతులో ఫాస్టింగ్ చేసినప్పుడు, బరువు తగ్గడం అనేది ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం కూడా బరువు తగ్గడ కంటే అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అయితే చాలాకొద్దిమందిపై చేసిన తమ ప్రయోగంలో అందరిలోనూ ఫలితాలు ఒకేలా ఉన్నాయని, మరి ఎక్కువమందిపై ఈ ప్రయోగం చేసినపుడు ఫలితాలు ఎంటా ఉంటాయనేది పరిశీలించాల్సి ఉందన్నారు. -
నెలకు ఎన్నిసార్లు ఉపవాసం చేస్తే మంచిది?
లంకణం పరమౌషధం అని పెద్దొళ్లు ఊరకే చెప్పలేదు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ప్రయోగకరంగా నిరూపిస్తున్నారు. అమెరికాలోని శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం ప్రకారం..ఉపవాసం ఉంటే శరీరంలో మంట/వాపు తగ్గిస్తుందట. రోగ నిరోధక వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపకుండానే మంట/వాపులను నయం చేయగలదట. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ చేసే మొట్టమొదటి పని మంట/వాపును సృష్టించడం. ఇది ఎక్కువ కాలం ఉంటే గుండెజబ్బులు, కేన్సర్, వంటి అనేక జబ్బులు చుట్టుముడతాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎలుకల నిరోధక వ్యవస్థ కణాలపై అధ్యయనం నిర్వహించింది. ఉపవాసం ఉన్నప్పుడు మంట/వాపులకు కారణమయ్యే మోనోసైట్స్ ఉపవాసంలో నిద్రాణ స్థితికి చేరుకుంటాయని చెబుతున్నారు. మరిన్ని పరిశోధనలతో మంట/వాపులకు మెరుగైన చికిత్స సాధ్యమవుతుందని, ప్రాణాంతక వ్యాధులను నివారించడం సాధ్యమవుతుందని వివరించారు. లంకనం(ఉపవాసం) అంటే తేలిగ్గా ఉండటం, భగవంతునికి సమీపంగా ఉండటం అని అర్థం. మనుసు, దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించినప్పుడు ఆ తాదాత్మ్యతలో ఆకలిదప్పులు తెలియవు. ఏకాగ్రతతో కూడిన ధ్యానం వలన మానసిక దృఢత్వం అధికం అవుతుంది. తాత్కాలిక నిరాహారం వల్ల శరీర కణాలలోని జీవక్రియలు ఉత్తేజితమై,సర్వాంగాలలోనూ చైతన్య ప్రేరణ కలుగుతుంది. ఇదే దీర్ఘాయువునకు పెద్ద పీట. కొందరు గంటలు మొదలుకొని రోజుల వరకు ఉపవాసం చేస్తారు. మరికొందరు మంచినీళ్లు కూడా తాగకుండా కఠోర ఉపవాసం చేస్తారు.వారానికి ఒకసారి లేదా నెలకు రెండు సార్లు ఉపవాసం చేయడం ఉత్తమం. నిజానికి ఫాస్టింగ్‌లో ఏమీ తినకూడదు అన్న నిబంధన ఏమీ లేదు. కాకపోతే కడుపునిండా తింటే నిద్ర రావడం, ప్రకృతి అవసరాల కోసం సమయం కేటాయించడం వంటివి చేస్తుంటాం. వీటన్నింటి కారణంగా దైవచింతనలో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండదు కాబట్టే ఉపవాసం రోజున భోజనం మానేసే సాంప్రదాయం వచ్చింది. అయితే ఉపవాసం వల్ల ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి. కనీసం పగలంతా ఘన పదార్థాలు (వండినవి) తినకుండా కేవలం ద్రవాహారంతో చేసినా జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. రాత్రి స్వల్పంగా తినవచ్చు. ఆయుర్వేదంలో కొన్ని జావలు (సూప్స్) చెప్పారు. (బియ్యప్పిండి, పేలాలు, అటుకులు, కూరగాయలు). వీటిలో పాచక పదార్థాలు (మిరియాల పొడి; వాము జీలకర్ర పొడులు, శొంఠి, పిప్పళ్ల పొడులు) వంటివి తీసుకోవచ్చు. -
‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’
ఈరోజు చారిత్రాత్మక రోజు. నేడు ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2003 తర్వాత ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. టీమ్ ఇండియా విజయం కోసం దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు. నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుతూ మసీదులు, చర్చిలు, దేవాలయాలు, గురుద్వారాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. కంగారూలతో పోరుకు టీమ్ ఇండియా సైన్యం సిద్ధమైంది. గ్రాండ్ ఫైనల్‌ను వీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్టేడియంనకు తరలివస్తున్నారు. భారతదేశంలోని ప్రతిచోటా టీమ్ ఇండియా విజయం కోసం పూజలు చేస్తున్నారు. వారణాసిలోని విశ్వేశ్వరుని మొదలుకొని ఉజ్జయినిలోని మహాకాళీశ్వరుని వరకూ అందరు దేవుళ్లు భారత్ టీమ్‌ను ఆశీర్వదించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌లో పదిమంది యువకులు భారత్ గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టబోమంటూ కఠిన ఉపవాస దీక్షకుదిగారు. శివచౌక్కు చేరుకున్న ఈ యువకులు అక్కడి శివాలయంలో పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ‘భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టుకోబోమని, ఒక వేళ భారత్ పరాజయం పాలయితే ఇక తమ జీవితంలో ఎప్పటికీ క్రికెట్ చూడబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇది కూడా చదవండి: అహ్మదాబాద్‌లో పర్యాటకుల రద్దీ -
ఏమీ తినకుండా 3నెలల పాటు కఠిన ఉపవాసం చేసిన బాలిక
ఉపవాసం అనేది ఒక్కో మతం ఆచారాలను బట్టి, వ్యక్తులను బట్టి ఉంటుంది. ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. అందుకే చాలామంది ఉపవాసం చేయడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా జైన మతానికి చెందిన ఓ బాలిక ఏకంగా 110 రోజుల పాటు కఠిన ఉపవాసం చేసి ఆశ్చర్యపరిచింది. అసలు అన్ని రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఎలా చేయగలిగింది? ఉపవాస దీక్ష వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం. జైనమతంలో ఉపవాస దీక్షను చాలా నిష్టగా చేస్తారు. ఈ క్రమంలో ముంబైలోని జైన కుటుంబానికి చెందిన క్రిష అనే 16 ఏళ్ల అమ్మాయి ఏకంగా 3 నెలల 20 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కఠిన ఉపవాసం చేసింది. మహా మహారుషులు ఇలాంటి తపస్సులు చేయడం చూశాం. కానీ ఇంత చిన్న వయసులో మూడ్నెళ్ల పాటు ఉపవాస దీక్షను చేపట్టడం ఆశ్చర్యమే. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు ముంబై ఘనంగా వేడుకలు నిర్వహించడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగింది అన్న వివరాలను ఆరా తీయగా.. తొమ్మిదేళ్ల వయసు నుంచే క్రిషకు ఉపవాసం చేయడం అలవాటుగా ఉండేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తొలుత 26 రోజుల ఉపవాసం తర్వాత ఆమె 31 రోజుల పాటు ఉపవాసాన్ని పొడిగించింది. ఆ తర్వాత 51 రోజుల పాటు నిరాహార దీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం మరికొన్ని రోజులు పొడిగించుకుంటూ 110 రోజుల పాటు కఠినమైన ఉపవాసాన్ని పూర్తిచేసింది. ఈ క్రమంలో సుమారు 18 కేజీల బరువు తగ్గినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాకపోవడం విశేషం. ఇన్ని రోజుల పాటు క్రిష ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో పాటు తొలి 40 రోజులు యథావిధిగా కాలేజీకి కూడా వెళ్లిందట. అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగిందంటే.. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్య మాత్రమే గోరువెచ్చని నీళ్లను మాత్రమే తాగేది. ఇలా ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లను మాత్రమే తాగుతూ చేసే ఉపవాసాన్ని వాటర్ ఫాస్టింగ్ అంటారు. కేవలం నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కాస్త గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. అంతేకాదు.. మీరు తీసుకునే నీటిలో కాస్త నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని డాక్టర్లు సైతం చెబుతున్నారు. మ్మరసం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడంతోపాటు.. శరీరం నీరసించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. ఇలా మీరు ఉపవాసం పాటిస్తున్న రోజులో 8 నుండి 10 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే మీరు ఇతర ఆహారమేమీ తీసుకోకపోయినా ఎలాంటి సమస్యలూ ఎదురుకావు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించడంతోపాటు, శరీరంలోని వ్యర్థాలూ బయటికి వెళ్లిపోతాయి. ఉపవాసం వాళ్లు చేయకపోవడమే మంచిది ►ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదేపనిగా ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. నీరసం సహా ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ► ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ► మధుమేహం, అసిడిటీ, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉపవాస దీక్షను చేయరాదు. ► ముఖ్యంగా గర్భవతులు కూడా ఉపవాసం చేయకపోవడమే మంచిది. ► వేరేవాళ్లు చేస్తున్నారని మనం కూడా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మన శరీరానికి ఏది సూట్ అవుతుందన్నది చెక్ చేసుకోవాలి. అందుకే ఎక్కువరోజులు ఉపవాసం చేయాలనుకుంటే డాక్టర్ సూచనలతో చేయడమే ఉత్తమం. ఉపవాసం సమయంలో ఏం తినాలి? ఉపవాస సమయంలో మజ్జిగ, పండ్ల రసాలు, లెమన్ వాటన్, కూరగాయల సూప్ వంటి ద్రవాహారాలు తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ, పాలు, పెసరపప్పుతో చేసిన పాయసం వంటివి తీసుకోవాలి. -
ఓటు దొంగలు.. బాబు అండ్‌కో
తాడికొండ: ఎన్నికలు సమీపిస్తుండడంతో బహుజనుల ఓట్లు దోచుకునేందుకు రాష్ట్రంలో బాబు అండ్ కో బ్యాచ్ అడ్డగోలుగా తిరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 1,049వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో శనివారం పలువురు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న పలు పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లు వేయించుకునేందుకు బహుజనులకు వల విసురుతున్నారన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఏం చేశాడో చెప్పి ప్రజల్లోకి రావాలని లేకుంటే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహుజనుల కలలు సాకారం చేస్తుంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, బీజేపీలోని బాబు బంధువు పురందేశ్వరి.. బాబును గద్దెనెక్కించేందుకే ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న చంద్రబాబు.. అన్ని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించేందుకు పావులు కదుపుతున్నాడని చెప్పారు. రిలే నిరాహార దీక్షలో సమితి నాయకులు కారుమూరి పుష్పరాజు, బేతపూడి సాంబయ్య, పులి దాసు, మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో బహుజన నేతలు -
హీరోయిన్లు చేసే ఈ ఉపవాసం గురించి తెలుసా?
‘సిలికాన్ వ్యాలీ ట్రెండ్’గా పేరున్న ‘డోపమైన్ ఫాస్టింగ్’ సాంకేతిక నిపుణులకే పరిమితం కాలేదు. యువతరానికి దగ్గర అవుతోంది. డిజిటల్ ప్రపంచంలో హద్దులు దాటుతున్న ‘ప్లెజర్ కెమికల్’కు నియంత్రణ విధించడానికి ‘డోపమైన్ ఫాస్టింగ్’ అనేది ఒక మార్గం అయింది... చెన్నైకి చెందిన ఇరవై రెండు సంవత్సరాల రుచిత తన ఫ్రెండ్ ద్వారా ‘డోపమైన్ ఫాస్టింగ్’ అనే మాట విన్నది. ‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అనుకుంటూ రంగంలోకి దిగింది. తల్లిదండ్రులకు చెప్పి మారుమూల ప్రాంతంలోని చుట్టాల ఇంటికి వెళ్లింది. ఆ పల్లెలో ఉరుకులు పరుగులు కనిపించవు. రణగొణ ధ్వనులు వినిపించవు. పిట్టపాటను దగ్గరగా వినే అదృష్టం దక్కుతుంది.సెల్‌ఫోన్‌కు సెలవు ఇచ్చి ఆ వారం రోజులు ఒక చెట్టు కింద కూర్చొని నచ్చిన పుస్తకాలు చదువుకుంది.పట్నాకు చెందిన తేజశ్రీకి నాన్‌స్టాప్‌గా మాట్లాడే అలవాటు ఉంది. రానూ రానూ ఆమె అంటే స్నేహితుల్లో తెలియని భయం లాంటిది ఏర్పడింది. పక్కకు తప్పుకోవడం మొదలైంది. ఇది గమనించిన తేజశ్రీ ఆలోచనల్లో పడినప్పుడు ఆమెకు కనిపించిన దారి... డోపమైన్ ఫాస్టింగ్. ఫాస్టింగ్‌లో భాగంగా ఒక వారం రోజుల పాటు అవసరమైతే తప్ప ఒక్కమాట కూడా ఎక్కువ మాట్లాడలేదు తేజశ్రీ!. ఫాస్టింగ్ తరువాత ఆ ఇద్దరి నోటినుంచి వచ్చిన మాట...‘ఇంత అద్భుతమైన ఫలితాన్ని ఊహించలేదు’ఈ ఇద్దరు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా యువతరంలో ఎంతోమంది జపిస్తున్న మంత్రం... డోపమైన్ ఫాస్టింగ్. ‘డోపమైన్ ఫాస్టింగ్’ సిలికాన్ వ్యాలీలో మారుమోగిన ట్రెండ్. సాంకేతిక నిపుణులను బాగా ఆకట్టుకుంది.‘దీనికి ఎలాంటి శాస్త్రీయ పద్దతి పదికా లేదు’ అనే మాట ‘డోపమైన్ ఫాస్టింగ్’ పాపులారిటీని యూత్‌లో తగ్గించలేకపోతోంది. టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలు, పాడ్‌కాస్ట్, మ్యూజిక్ షోలు... డిజిటల్ ప్రపంచంలో వివిధ మార్గాల ద్వారా మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. డిజిటల్ కంటెంట్ నుంచి డివైజ్‌లకు అతిగా అలవాటు పడడం వరకు ప్లెజర్ కెమికల్ అనబడే ‘డోపమైన్’ హద్దులు దాటితే అది దురలవాటుగా మారి సమస్యల్లోకి తీసుకువెళుతుంది. అధిక నిద్ర, అధిక తిండి నుంచి అదే పనిగా సోషల్ మీడియాలో తలదూర్చేవరకు... ఎన్నెన్నో అలవాట్లు డోపమైన్ ప్రతిఫలనాలే. అమెరికన్ సైకియాట్రిస్ట్ అన్నా లెంబ్కే‘డోపమైన్ నేషన్’ పేరుతో పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఆమె రాసిన ఒక మాట...‘మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అవసరమైన దానికంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఒత్తిడి పెరుగుతోంది. సౌకర్యాలు, వస్తువులు పెరిగేకొద్దీ సంతోషం కూడా తగ్గుతుంది’‘డోపమైన్ ఫాస్టింగ్ అంటే తిండికి దూరం కావడం కాదు. ఎవరితో మాట్లాడకపోవడం కాదు. మెదడులో డోపమైన్ విడుదలయ్యేందుకు కారణమయ్యే వాటికి విరామం ఇవ్వడం’ అంటున్నారు నిపుణులు. ‘డోపమైన్ ఫాస్టింగ్’ లక్ష్యం డోపమైన్‌కు దూరం చేయడం కాదు. డోప్మైన్ లోపం వల్ల ఏ సంతోషం లేకుండా జీవితం నిస్సారంగా అనిపించడం, డిప్రెషన్లో కూరుకుపోవడం, చెడు అలవాట్లకు బానిస కావడంలాంటివి కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకే డిజిటల్ ఫాస్టింగ్ అనేది ‘డోపమైన్’ మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా సమన్వయ ధోరణిలో వెళుతుంది. అందుకే ‘డోపమైన్ ఫాస్టింగ్’ మోస్ట్ వవర్ఫుల్ బ్రేక్‌గా పేరు తెచ్చుకుంది.‘సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతరం డోపమైన్ డిటాక్స్పై దృష్టి పెడుతోంది. డోపమైన్ ఫాస్టింగ్ వల్ల వచ్చిన విరామం ద్వారా తమ మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ చూపే ప్రతికూల ప్రభావాన్ని గురించి తెలుసుకోగలుగుతున్నారు’ అంటుంది అన్నా లెంబ్కే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాలీవుడ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో బాగా పాపులర్ అయిన ట్రెండ్.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో భాగంగా 16 గంటల ఫాస్టింగ్ రూల్‌ని అనుసరిస్తూ ఆలియాభట్ బరువు తగ్గింది. వెజిటేరియన్‌గా మారింది. వ్యాయామాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే జాక్వీలైన్ ఫెర్నాండేజ్ ఇంటిర్మిటెంట్ ఫాస్టింగ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. కమెడియన్ భారతిసింగ్ లాక్డౌన్ సమయంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుసరించి పదిహేను కిలోల బరువు తగ్గింది. హీరో వరుణ్ ధావన్ రోజుకు 14-16గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుసరిస్తాడు. -
Ramadan Month: నేటి నుంచి రంజాన్..
సాక్షి, హైదరాబాద్: నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, మూడేళ్లుగా కరోనాతో నగరంలో రంజాన్ సందడి అంతగా కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో రంజాన్ కళ మళ్లీ తిరిగి రానుంది. ఒకవైపు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ..మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి. చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మల్లేపల్లితో, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్లు వెలిశాయి. వ్యాపార సంస్థలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఆదర్శ జీవనానికి రంజాన్ మాసం ప్రేరణ: సీఎం సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంత జీవనం దిశగా ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ఖురాన్ పఠనం, ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, జకాత్, ఫిత్రా వంటి ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత, జీవిత పరమార్థం అవగాహనలోకి వస్తాయని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. -
ఆ పాట అప్పుడు ఫాస్టింగ్లోనే ఉన్నా!
‘‘మన కలలను నెరవేర్చుకునే విషయంలో ఆ పరమశివునిలా ఉగ్రంగా, ఇతరులను క్షమించే విషయంలో ఆయనలా దయతో ఉందాం’’ అంటున్నారు పూజా హెగ్డే. నేడు మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ – ‘‘శివరాత్రికి ఉపవాసం ఉండటం అనేది కొన్నేళ్లుగా పాటిస్తున్నాను. ప్రతి శివరాత్రికి మా నాన్నగారు ఉపవాసం ఉంటారు. నా చిన్నతనం నుంచి ఆయన్ను చూస్తున్నాను కాబట్టి నాన్నని ఫాలో అవ్వా లనుకున్నాను. అలా ఎప్పటినుంచో ఫాస్టింగ్ అలవాటైంది. పైగా నేను పదేళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్నాను. దాంతో నటరాజుడిని కొలిచేదాన్ని. ఆ విధంగా శివుడితో నా అనుబంధం ఎప్పటినుంచో ఉంది. స్కూల్ డేస్ నుంచే శివరాత్రికి ఉపవాసం ఉంటున్నాను. సినిమాల్లోకి వచ్చాక కూడా తప్పనిసరిగా ఆచరిస్తున్నాను. ‘జిగేల్ రాణి..’ (‘రంగస్థలం’ సినిమా) పాట షూట్ అప్పుడు శివరాత్రి వచ్చింది . ఆ షూట్ అప్పుడు ఫాస్టింగ్ ఉన్నాను. నాకు వీలు కుదిరినప్పుడల్లా శివుడి ఆలయాలను సందర్శిస్తుంటాను. కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లాను. ధర్మస్థలి (కర్నాటక), బాబుల్నాథ్ మందిర్ (ముంబై)లకు కూడా వెళ్లాను. ఇక నాకు శివుని పాటల్లో ‘శివ్ తాండవ్ స్త్రోత్రం’ ఇష్టం’’ అన్నారు పూజా హెగ్డే. వారణాసిలో జరిగే గంగా హారతిని మా నాన్నగారు గతంలో చూశారు. మేం కూడా చూస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అలా రెండేళ్ల క్రితం నేను, అమ్మానాన్న, అన్నయ్య వెళ్లాం. హారతి చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి లభించింది. అది మాటల్లో చెప్పలేను. గంగా నదీ తీరాన నిలబడి తిలకించడం ఓ గొప్ప అనుభూతి అయితే, పడవలో కూర్చుని తిలకించడం మరో అనిర్వచనీయమైన అనుభూతి. -
Maha Shivaratri 2023: పాహి పాహి పరమేశ్వరా
సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడని పేరు. అయితేనేం, ఆయన పరమ బోళావాడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. భక్తితో కొలిచే తన భక్తులతోపా పాటు క్రిమికిటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే శివయ్య దర్శనం సర్వ పా పాపహరణం. నేడు మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినాన ఆ శుభకరుడి గురించి చెప్పుకోవడం ఎంతో మంగళప్రదం. మనం ప్రతి నెలలోనూ తెలుగు క్యాలెండర్లలోనూ, పంచాంగాల్లోనూ పండుగలు– పర్వదినాలలో మాస శివరాత్రి అని ఉండటాన్ని చూస్తూంటాం. ఇంతకీ మాస శివరాత్రి అంటే ఏమిటి, మహాశివరాత్రికీ, మాస శివరాత్రికీ గల వ్యత్యాసం ఏమిటో చూద్దాం. ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. వాటన్నింటిలోనూ తలమానికమైనది, మహిమాన్వితమైనది మహాశివరాత్రి. తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందురోజు – రాత్రి చతుర్దశి కలిగి ఉన్న రోజుని జరుపుకోవాలని నిర్ణయ సింధు చెబుతోంది. ‘మహా’ అని ఎక్కడ అనిపించినా అన్నింటికంటే గొప్పదని అర్థం చేసుకోవాలి. శివ పా పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. అందుకే శివరాత్రి నాడు అయ్యకి – అమ్మకి కూడా ఉత్సవం జరుగుతుంది. శివ అంటే మంగళకరమైన అని. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. ఇంతకీ శివరాత్రి ఎందుకని అంతటి పర్వదినమైందో చూద్దాం. క్షీరసాగర మథనంలో అమృతంకంటే ముందు హాలాహలం పుట్టిన విషయం తెలిసిందే. అది ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదం ఉండడంతో దేవదానవులందరు భీతావహులై తమను రక్షించాలంటూ పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో లోక రక్షణార్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళ కంఠుడుగా పేరుపొందాడు. ఈ హాలాహల ప్రభావానికి ఆయన కంఠం నీలంగా మారడంతో నీలకంఠుడయ్యాడు. లోకాలన్నీ ఆ లోకనాయకుడి మూలాన స్థిమితపడిన రోజు పర్వదినం గాక మరేమిటి?అయితే... సంప్రదాయ ప్రియులు జరుపుకునే ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఒకటి రెండు ఐతిహ్యాలున్నాయి. ఆది మధ్యాంత రహితుడు పరమేశ్వరుడు ఆది మధ్యాంత రహితుడనడానికి సంబంధించిన ఈ గాథని చూద్దాం: పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదం గా మారింది. రానురానూ అది మరింతగా పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పో రు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతదూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పా పాతాళందాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజ మేనని సాక్ష్యం ఇవ్వమనిప్రా పాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపో యింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపో యానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు.దాంతో తాను ఓడిపో యానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు. ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. జ్యోతిర్లింగరూపంలో బ్రహ్మకు, విష్ణువుకు తాను కనిపించిన సమయాన్ని లింగోద్భవకాలంగా పరిగణించాలని, ఇకనుంచి మాఘబహుళ చతుర్ధశి శివరాత్రి అనే పేరుతో తన పూజలకు శ్రేష్ఠమైనదిగా వర్థిల్లుతుందని చెప్పా డు. అంతేకాదు, ఆ తిథినాడు తన మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు. శివరాత్రినాడు పా పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపా పాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపో కుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పా పాపా పాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపా పాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రి కి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఉపవాసం ఎలా? శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేషప్రా పాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపా పానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం ‘దగ్గరగా ఉండడం’ అని! భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పా పాటు శరీరంలోప్రా పాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ‘త్రయంబకం యజామహే...‘ అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఇవేవీ చేయ(లే)కపో యినా నిర్మలమైన మనస్సు తో వీలైనన్ని సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, ఆ బోళాశంకరుడుపొంగిపో యి వరాలిస్తాడు. ఆయన రూపం అపురూపం శివుడు నిరాకారుడు. సాకారుడు కూడా. అదే ఆయన ప్రత్యేకత. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపా పాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. రెండు స్వరూపా పాలు శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. జగతః మాతా పితరౌ శివ పార్వతులు తమ కల్యాణ మహోత్సవానికి చక్కగా చిగిర్చే పూచే వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకిచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రివేళ అయితే అది మనకి ఇచ్చింది అని భావించి తెల్లవారుజామున మంచిదనుకున్నారు ఆ తలిదండ్రులు. మల్లెల్నీ మొల్లల్నీ మనకి విడిచి వాసన, రూపసౌందర్యం లేని తుమ్మిపూవుల్ని సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మన పరం చేసి విభూతిని పులుముకున్నారు. ఊరేగింపునకి ఎద్దునీ, అలంకారాలుగా పా పాముల్నీ ... ఇలా జగత్తుకోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ ఆది దంపతుల కల్యాణ మహోత్సవానికి పిల్లలమైన మనం తప్పక హాజరు కావాలి. ఆశీస్సులు అందుకోవాలి. అందుకే ఈ జాగరణం. – డి.వి.ఆర్. -
మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్‌పై ప్రశంసలు
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్తబాస్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ బరువు తగ్గి ఆరోగ్యంగా ఉన్నారట. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా ప్రకటించారు. మస్క్ స్లిమ్ అండ్ ట్రిమ్గా మారిన విషయాన్ని గమనించిన ఒక మహిళా ట్విటర్ యూజర్ ఇదే విషయాన్ని మస్క్‌ను అడిగారు. దీనికి స్పందించిన మస్క్ తన వెయిట్ లాస్ జర్నీని షేర్ చేశారు. కొన్ని నెలల్లోనే 30 పౌండ్స్ (13 కిలోలు) బరువు తగ్గినట్లు ప్రకటించడం విశేషంగా నిలుస్తోంది.(ElonMusk మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ అప్షన్, డెడ్‌లైన్) కీలక ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన, ట్విటర్ బోర్డు రద్దుతోపాటు, వేలాదిమంది ఉద్యోగులపై వేటు, బ్లూటిక్ సబ్స్క్రిప్షన్, ఎక్కువ పనిగంటలు అంటూ ఉద్యోగులపై ఒత్తిడిలాంటి ఆరోపణల మధ్య నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు. ఏకంగా 13 కేజీల బరువు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన నెటిజన్లు ఆయన ఆహార అలవాట్ల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వారికి మస్క్ సమాధానమిస్తూ ఆహార నియమాలు కచ్చితంగా పాటించి బరువు తగ్గినట్లు తెలిపారు. మితంగా ఆహారం తీసుకోవడంతో పాటు, తనకెంతోఇష్టమైన ఆహారాల జోలికి వెళ్లలేదని తెలిపారు. అలాగే టైప్-2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు తీసుకున్నాననీ, ఇట్లా సిస్టమేటిగ్గా వెయిట్ తగ్గినట్టు చెప్పారు. ఇపుడు మరింత యాక్టివ్‌గా, హెల్దీగా ఉన్నానని మస్క్ వెల్లడించారు. ఇదీ చదవండి: త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన You’ve lost a ton of weight, Elon! Keep up the fantastic work! 💯💗 pic.twitter.com/uJhdxWUWqB — ✨Chicago✨ (@chicago_glenn) November 16, 2022 ఆగస్టులో ఒక మంచి స్నేహితుడి సలహామేరకు ఉపవాసం ఉండటం తన ఆరోగ్యానికి మేలు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు తన స్లిమ్ అండ్ ఫిట్ లుక్‌కి కారణమైన యాప్ పేరును వెల్లడించడం విశేషం. "జీరో ఫాస్టింగ్ యాప్ చాలా బాగుంది" అంటూ మస్క్ ట్వీట్ చేశారు. -
46లో అలా.. 64లో ఇలా.. అలా ఎలా?
కొన్ని కొన్ని విషయాలు డాక్టర్లు కాదు.. పేషేంట్లు చెబితేనే బాగా అర్థమవుతాయి. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశారు ఇయాన్ క్లార్క్. ట్విట్టర్లో ఆయన పంచుకున్న అంశాలు .. కచ్చితంగా మనకు ఆరోగ్య రహస్యాలెన్నో చెబుతాయి. నాకప్పుడు 46 ఏళ్లు అధిక బరువుతో బాధ పడ్డాను ఏడాదికి మూడు సార్లు ఏదో ఒక జబ్బు వచ్చేది వీపరీతమైన నిరాశ, నిస్పృహాల్లో మునిగిపోయేవాడిని జుట్టు వేగంగా ఊడిపోయేది నాకిప్పుడు 64 ఏళ్లు ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా ఎలాంటి రోగాలు, జబ్బులు లేవు సంతోషంగా ఉన్నాను నాకు గుండు ఏమాత్రం కనిపించనంతగా పూర్తి స్థాయిలో వెంట్రుకలున్నాయి. అసలేం జరిగింది? ఈ 46 నుంచి 64 ఏళ్ల మధ్య కాలంలో నేను ఏం చేశాను? అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారడానికి నేను పడ్డ కష్టమేంటీ? ముందుగా నేను ఏ డాక్టర్‌ను కలవలేదు. ఎలాంటి మందులు వాడలేదు. అసలు హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోలేదు. నేను చేసిన పనులేంటో మీరే చదవండి. 1. ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు నా ఆరోగ్యం బాగుండడానికి నేను చేసిన మొదటి పని ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు తీసుకోవడం. ఇది వారంలో ఒక రోజు చేసింది కాదు. రోజూ దీన్ని అనుసరించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవద్దనే నియమాన్ని కఠినంగా అనుసరించాను. ల్యాబ్‌ల్లో తయారై బాక్సుల్లో అందంగా ప్యాక్ చేసి కనిపించే భోజనాన్ని పూర్తిగా దూరం పెట్టాను. నా చుట్టున్న మార్కెట్లో, పంట పొలాల్లో నాకు మట్టిలో కనిపించే ఆహార పదార్థాలను ఎంచుకున్నాను. సూపర్ మార్కెట్లో దొరికే వాటి కంటే ఈ పదార్థాల్లో ఎన్నో పోషకాలుంటాయి. 2. మాంచి నిద్ర పోవడం మొదలెట్టాను కచ్చితంగా నిద్ర కోసం సమయాన్ని కేటాయించుకున్నాను. సమయమయిందంటే చాలు.. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఆపేసి నిద్ర పోవడం అలవాటు చేసుకున్నాను. అంతేనా.. రోజులో కూడగా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకున్నాను. దీని వల్ల మనసు ప్రశాంతంగా అనిపించింది. నా మెదడుకు ఎంతో రిలాక్స్ దొరికింది. వయస్సు మీద పడినట్టుగా అనిపించే కారకాలన్నీ దూరమయ్యాయి. అతి ముఖ్యమైన విషయం. నిద్ర రావడానికి టాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. - మీరు పడుకునే చోట ఎలాంటి లైట్లు ఉండకూడదు - రూం టెంపరేచర్ తక్కువగా ఉంటే మంచిది - ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఉండకూడదు. 3. ఉపవాసం ఉపవాసం అతి ముఖ్యమైనది. ఎందుకంటే... మన భోజన షెడ్యూల్‌ను కచ్చితంగా అనుసరించడం.. అంటే ఒకే సమయంలో అల్పహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్ర భోజనం తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం అని ఎందుకంటున్నానంటే.. పడుకునేకంటే చాలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అలాగే అప్పుడప్పుడు చేసే ఉపవాసాల వల్ల శరీరం నుంచి యాంటీ అక్సిడెంట్స్ సులువుగా బయటికి వెళ్లిపోతాయి. ఇవి వెళ్లిపోవడం వల్ల కాన్సర్, అల్జీమర్స్, స్ట్రోక్, గుండె వ్యాధులు లాంటివి రావు. గత కొన్నాళ్లుగా నేను కేవలం రెండు పూటలకు మాత్రమే పరిమితమయ్యాను. అదీ కూడా సేంద్రీయ సాగు ద్వారా పండించిన పంటలనే ఎంచుకుంటున్నాను. ఈ అలవాట్ల వల్ల నా భోజనం ఖర్చు సగానికి సగం తగ్గింది. 4) మెగ్నిషియం సప్లిమెంట్ మన శరీరానికి మెగ్నిషియం చాలా అవసరం. కండరాలు, జాయింట్లు, రోగ నిరోధక శక్తి మెదడు, గుండె, ఇతర ముఖ్య శరీర భాగాలు వీటన్నింటికి మెగ్నిషియం అవసరం. మనం ఎలాంటి భోజనం తీసుకున్నా.. వీటికి సరిపడా మెగ్నిషియం రాదు. సాగులో మనం అనుసరిస్తున్న విధానాలు అలాంటివి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75శాతం మంది మెగ్నిషీయం లోపంతో బాధపడుతున్నారు. అందుకే మెగ్నిషియంను అదనంగా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాను. ఇవీ నేను అనుసరిస్తున్న విధానాలు. అందుకే 46 ఏళ్లలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల కంటే 64 ఏళ్లలో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. -
Fasting: ఉపవాసం ఉంటున్నారా.. మంచిదే... కానీ!
What Are The Amazing Benefits Of Fasting: కార్తీక మాసం వచ్చింది. ఈ మాసంలో చాలామంది పగలంతా ఉపవాసం ఉండి, రాత్రిళ్లు మాత్రం మితాహారం తీసుకుంటారు. కొందరేమో ఈ మాసంలోని కొన్ని ప్రత్యేకమైన తిథులలో లేదా పర్వదినాలలో మాత్రం రోజంతా ఉపవాసం ఉండి, మరునాడు భోజనం చేస్తారు. అయితే ఉపవాసం అనేది కేవలం దైవభక్తితో చేసేది మాత్రమే కాదు... ఉపవాసం వల్ల చాలా లాభాలు ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. లావుగా ఉన్నవారికి ఇది మరీ ఉపయోగ పడుతుంది. రోజంతా ఏది తినక పోవడం వల్ల శరీరంలో ఉన్న క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీనివల్ల బరువు కూడా తక్కువ అవుతారు. అంతేకాదు రక్తంలో చక్కెరను కూడా మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల తగిన క్యాలరీలు పొందవచ్చు. ఉపవాసం వల్ల శరీరం తనని తాను శుభ్రం చేసుకుని కొత్త శక్తి వస్తుందని.. ఆరోగ్యం మెరుగుపడుతుందని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త యోషినోరి ఓఘమి అంటున్నారు. ఆయన ఉపవాసం వల్ల ఏం జరుగుతుందో వివరంగా చెప్పారు. అవేంటో చూద్దాం. ఉపవాసం వల్ల ప్రయోజనాలు ఉపవాసం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలు తమను తాము తినటం లేదా తమను తాము నాశనం చేసుకోవటం వల్ల గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది. తద్వారా కొత్త కణాలు పుడతాయి. దీన్నే వైద్య భాషలో ఆటోఫజీ అంటారట. మనం రోజూ తీసుకునే ఆహారం, జంక్ ఫుడ్ అలా సగం జీర్ణం అయినా.. కొవ్వు రూపంలో పేరుకుపోతూనే ఉంటుంది. సాధారణంగా ఇదంతా డైలీ వ్యాయామం చేస్తే కరిగిపోతుంది అంటారు. కానీ మనకు అంత టైం ఎలాగూ ఉండదు. అందుకే కనీసం ఇలా ఉపవాసం చేయటం వల్ల శరీరంలో పేరుకు పోతూ ఉండే పాడైన, చనిపోయిన కణాలను శరీరం తనంతట తానుగా తొలగించుకుంటుంది. కాబట్టి ఉపవాసం వల్ల ఆరోగ్యపరమైన లాభం పొందవచ్చని జపాన్‌కు చెందిన ‘యోషినోరి ఓషుమి’ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే... ఉపవాసంలో ఉన్నప్పుడు తినటానికి ఆహారం అందుబాటులో లేదని, లేదా ఏం తినకూడదు అనే విషయాన్ని మన శరీరం మెదడుకు తెలుపుతుంది. దాంతో నిల్వ ఉన్న శక్తిని వినియోగించమని మెదడు శరీరాన్ని ఆదేశిస్తుంది. అప్పుడు శరీర కణాలు శక్తి కోసం పాతవి, వయసు మీరినవి అయిన పనికిరాని ప్రొటీన్ల మీద దాడి చేస్తాయట.. ఇలా ఎందుకు జరుగుతుందంటే? ఆహారం శరీరానికి అందనప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి.. దానికి వ్యతిరేకమైనదైన గ్లూకగాన్ విజృంభించటం మొదలు పెడుతుంది. ఈ గ్లూకాగాన్ యాక్టివేట్ అయి శరీరంలో శుభ్రం చేయాల్సిన, నిరర్ధకంగా పడి ఉన్న కణాల మీదకు దృష్టి మళ్లిస్తుంది. ఆ క్రమంలో పాత కణాల స్థానంలో కొత్త శక్తివంతమైన కణాల తయారీ మొదలవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదేపనిగా ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. ఎందుకంటే అసలు మీ శరీరంలో పాడైన కణాలు ఉండకపోతే.. శరీరం ఏం చేస్తుంది ఇక.. శక్తిని అందించలేక డీలా పడిపోతుంది. తద్వారా నీరసం వచ్చి ఇతర అనారోగ్య సమస్యలు దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఉపవాసం కాస్త చూసుకుని చేయడం మంచిది. ఎందులోనూ అతి పనికి రాదన్న సూత్రం ఉపవాస విషయం లోనూ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న వారు ఉపవాసం చేసేముందు డాక్టర్ సలహా తీసుకోవడం, దానిని తట్టుకోగలమా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం మంచిది. చదవండి: చలిలో అనారోగ్యం... నెయ్యితో వైద్యం -
ఉపవాసం చేస్తే ఇన్ని ఉపయోగాలా! బరువు తగ్గొచ్చు.. ఇంకా..
ప్రపంచంలోని దాదాపు అన్ని మానవ సమాజాలు ఆహారానికి విరామమివ్వడాన్ని పుణ్యకార్యంగానే భావిస్తాయి. ప్రాచీన ఆరోగ్య విధానాలైన ఆయుర్వేదం లాంటివి ఉపవాసమంటే ఆరోగ్యానికి సహవాసమని చెబుతున్నాయి. ఇక తెలుగు లోగిళ్లలో ‘‘లంఖణం పరమౌషధం’’ అనేది పెద్దవాళ్ల నోట తరుచూ వినే మాటే! ఇవన్నీ ఆషామాషీగా చెప్పిన కబుర్లు కావని, నిజంగానే ఉపవాసానికి, ఆరోగ్యానికి లంకె ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. ఆకలితో కాలే కడుపుకు అజీర్తి రోగాలు చేరవని, అప్పుడప్పుడు ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) వల్ల ఎనలేని లాభాలని సైంటిస్టులు వివరిస్తున్నారు. పూర్వం రోజుల్లో కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఒకరోజు మొత్తం ఏమీ తినకుండా ఉండేవారు. దీనిద్వారా పుణ్యం, పురుషార్థం రెండూ కలసి వచ్చేవి. కానీ కాలం మారింది. శారీరక శ్రమ తగ్గి, చల్లటి గదుల్లో కూర్చొని పనిచేసే కొలువులు రావడం, వేళాపాళా లేని ఉద్యోగాలు, జంక్‌ఫుడ్ అలవాటై ఉపవాసం మరుగున పడిపోయింది. ఆధునిక జీవన శైలి పుణ్యమా అని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాదుకదా, కనీసం కొన్ని గంటలు కూడా ఆకలికి ఓర్చుకోకుండా ఏదో ఒకటి నమిలే అలవాటు పెరిగింది. ఇలా అదే పనిగా నోటికి, పొట్టకి విశ్రాంతి ఇవ్వకపోవడంతో రకరకాల వ్యాధులూ విజంభిస్తున్నాయి. యుక్త వయసులోనే ఊబకాయం పలకరిస్తోంది. అందుకే అడ్డదిడ్డంగా తిండి తినే బదులు ఓ క్రమపద్ధతి అలవాటు చేసుకోవాలని, దీనికి ఉపవాసాన్నీ జోడించాలని తాజాగా అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగు పడడం, జీవితకాలం పెరగడంలాంటి పలు ప్రయోజనాలున్నాయని తెలిసిందే, కానీ దీనివల్ల మెదడుపై, నరాల చురుకుదనంపై పాజిటివ్ ప్రభావం ఉంటుందని తాజా పరిశోధనలు వివరిస్తున్నాయి. అసలేంటి ఈ ఫాస్టింగ్? ఎందుకు చేయాలి? ఎంతకాలం చేయాలి? ఎవరు చేయాలి? న్యూరోజెనిసిస్ అంటే ఏంటి? తెలుసుకుందాం... న్యూరోజెనిసిస్ అంటే... మెదడులో కొత్త న్యూరాన్లు పుట్టే ప్రక్రియనే సింపుల్‌గా న్యూరోజెనిసిస్ అంటారు. ఇది సాధారణంగా పిండదశలో జరిగే ప్రక్రియ. కానీ పెద్దల మెదడులోని కొన్ని భాగాల్లో ఈ ప్రక్రియ జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. మెదడులోని హిప్పోక్యాంపస్ ప్రాంతం జ్ఞాపకశక్తికి, కదలికలకు కీలకమైన ప్రాంతం. ఇది ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, అవి ఎక్కువ స్థాయిలో విడుదలైతే క్రమంగా ఉన్న న్యూరాన్లు నశించిపోతుంటాయి. ఈ నశింపు ప్రక్రియ వేగవంతమైతే డెమెన్షియా, ఆల్జీమర్స్‌తో పాటు పలు ఇబ్బందులు ఎదురైతాయి. దీనికి అడ్డుకట్ట న్యూరోజెనిసిస్తోనే సాధ్యం. ఎంతకాలం చేయవచ్చు? ►బ్రైన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం ఫాస్టింగ్ ఎంతకాలం చేయాలన్నది మన లక్ష్యాన్ని బట్టి నిర్దేశించుకోవాలి. అంటే న్యూరోజెనిసిస్ను ప్రేరేపించడమే మన లక్ష్యం కనుక దీనిపైనే శ్రద్ధ పెట్టాలి. మన వయసును బట్టి న్యూరోజెనిసిస్ వేగం ఆధారపడిఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచే దీన్ని యాక్టివేట్ చేయగలిగితే పెద్దయ్యేకొద్దీ ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రయోగం ►ఎలుకల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రయోగం జరపగా, 12 గంటలు, 24 గంటలు ఉపవాసం ఉంచిన ఎలుకల్లో తక్కువ న్యూరాన్ల ఉత్పత్తి జరగగా, 16 గంటల ఉపవాసం ఉన్న ఎలుకల్లో న్యూరోజెనిసిస్ చాలా వేగంగా జరిగిందని తేలింది. అసలు ఉపవాసం లేనివాటిలో కొత్త న్యూరాన్ల ఉత్పత్తి ఊసే కనిపించలేదు. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగంటే? ►ఇంటర్మిటెంట్ ఫాస్టింగంటే నిద్ర లేవగానే నోట్లో ఏదో ఒకటి పడేసే అలవాటును దూరం చేసుకోవడమే! దీన్ని పాటించాలనుకున్న రోజున బ్రేక్‌ఫాస్ట్‌కు స్వస్తి పలకాలి. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు తినడం ఆపేయాలి. ఉదయం, రాత్రి తినవద్దన్నామని మిగిలిన సమయమంతా ఎడాపెడా తినేయకూడదు. మధ్యాహ్న భోజనాన్ని వీలయినంత తక్కువగా తీసుకోవాలి. నోటి మరకు విరామం ఇవ్వడం మంచిదే ►మనిషి 16 గంటలు ఉపవాసముంటే బాగా నీరసిస్తాడు కాబట్టి కనీసం 8 గంటల వ్యవధితో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపవాసం వల్ల న్యూరోజెనిసిస్ జరగడంతో పాటు, హద్రోగాలు, మెటబాలిజం సంబంధిత వ్యాధులు దరిచేరవని ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. కొన్నిమార్లు క్రమం తప్పని ఉపవాసం క్యాన్సర్‌ను కూడా అడ్డుకునే అవకాశాలున్నాయన్నది సైంటిస్టుల భావన. సో... నోటి మరకు విరామం ఇవ్వడం మంచిదే కదా! అంత సులభమమేమీ కాదు ►ఈట్ స్టాప్ ఈట్ ఫిట్నెస్ నిపుణుడు బ్రాడ్ పిలాన్ ప్రవేశపెట్టారు. ఇందులో వారంలో ఏవైనా రెండు రోజులు 24 గంటల పాటు ఉపవాసం ఉండాలి. అంటే ఓ రోజు రాత్రి డిన్నర్ చేశాక మరుసటి రోజు రాత్రి డిన్నర్ చేసేంతవరకు ఉపవాసం ఉండాలి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ మధ్య ఉపవాసంగానూ చేసుకోవచ్చు. ఉపవాసం సమయంలో నీళ్లు, కాఫీ, జీరో కేలరీలు ఉండే ఇతర పానీయాలు తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు ఈ పద్ధతి అనుసరించేటట్లయితే ఆహారం తీసుకొనే దశలో మాత్రం సాధారణంగానే భోజనం ఉండాలి. నిజానికి 24గంటల పాటు ఉపవాసం ఉండడం చాలామందికి అంత సులభమైన విషయం కాదు. ►రోజు మార్చి రోజు(ఆల్టర్నేటివ్ డే) విధానంలో వారంలో మూడు రోజులు రోజు మార్చి రోజు ఉపవాసం ఉండాలి. లేదా 500 కేలరీల ఆహారం తీసుకోవాలి. ఇందులో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నప్పటికీ దీన్ని పాటించడం చాలా కష్టం. మరీ ముఖ్యం ఉపవాసం రోజు రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోవడం అంత సులభం కాదు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విధానం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది. మరికొన్ని పద్ధతులు లీన్ గెయిన్స్ ప్రొటోకాల్ పద్ధతి ►లీన్ గెయిన్స్ ప్రొటోకాల్ పద్ధతిలో ఉదయం అల్పాహారం తీసుకోకూడదు. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 8గంటల లోపల రెండు, లేదా మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవచ్చు. అంటే రాత్రి ఎనిమిది నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 16 గంటల పాటు ఉపవాసం ఉండాలి. మహిళలైతే 15గంటలు ఉంటే చాలు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేని వాళ్లకు ఈ పద్ధతి పాటించడం కష్టం. కానీ అల్పహారం ఎగరగొట్టే వాళ్లకు సులభం. అయితే, ఫాస్టింగ్ సమయంలో నీళ్లు, కాఫీ, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు. దీనివల్ల భోజనంపై ధ్యాస కూడా తగ్గుతుంది. ఉపవాసం ముగిశాక తీసుకునే ఆహారం మాత్రం పూర్తి బలవర్థకంగా ఉండాలి. విపరీతంగా జంక్‌ఫుడ్ తినేవారికి, అధికంగా బరువు ఉండే వారికి ఈ విధానంతో ఫలితం ఉండదు. ►ఫాస్ట్ డైట్ పద్దతిలో వారానికి రెండు రోజులు మాత్రం ఉపవాసం ఉండాలి. ఈ రెండు రోజుల్లో మహిళలు 250 కేలరీల చొప్పున, పురుషులు 300 కేలరీల చొప్పున రెండు సార్లు ఆహారం తీసుకోవాలి. అంటే మహిళలు 500 కేలరీలు, పురుషులు 600 కేలరీలకు మించకుండా ఆహారం తీసుకోవాలి. ఈ విధానంలోని సానుకూల ఫలితాలపై ఇప్పటికీ సరైన పరిశోధనలు లేనప్పటికీ చాలామంది 5:2డైట్‌ను అనుసరిస్తున్నారు. ►ది వారియర్ డైట్ పద్ధతిలో రోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు తక్కువ పరిమాణంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తర్వాత సాయంత్రం 4నుంచి 8 గంటల లోపు లార్జ్ మీల్ భుజించాలి. ఇది ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్న విధానం. ►స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్ విధానంలో వారంలో రెండు రోజులు బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్ తీసుకోకూడదు. అయితే, ఏయేరోజు పాటించాలనేది మీ ఇష్టం. ఉదాహరణకు ఏదైనా రోజు ఆకలి లేనప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసి, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సమృద్ధిగా తినాలి. ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పడు ఒక్కోసారి తినడానికి ఏమీ దొరకవు. అలాంటప్పుడు ఈ పద్ధతి అవలంబించుకోవచ్చు. ►ఆరోగ్యానికి మంచిది కదా అని అన్ని రకాలు ట్రై చేయవద్దు. ఉపవాసం శ్రేయస్కరం కావచ్చు కానీ అతి మంచిది కాదు. -డి. శాయి ప్రమోద్ చదవండి: జర జాగ్రత్త!.. ఆహారం.. విరామం.. అతి చేస్తే హానికరం -
‘తిట్టే నోరే కాదు, అతిగా తినే నోరు కూడా ప్రమాదకరమే’
తిట్టే నోరే కాదు, అతిగా తినే నోరు కూడా ప్రమాదకరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కేవలం ఉపవాసం మంచిదనే ఉద్దేశంతో క్రమపద్ధతి లేకుండా చేసే ఉపవాసాలు ఆరోగ్యం కన్నా చేటు ఎక్కువ కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చే కొద్దీ ఉపవాసాలు, తినే తిండి తదితర అంశాలపై సరైన అవగాహన లేక చాలామంది అసంబద్ధ ఆహార అలవాట్లు చేసుకుంటారు. దీంతో వారిలో మానసిక ఒత్తిడి, తమపై తమకు నమ్మకం లేకపొవడం, బలవంతంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, హార్మోన్ల అసమతుల్యత, జన్యువులలో అసంబద్ధ ఉత్పరివర్తనాలు, సమాజంలో కలవలేకపోవడం వంటి దుష్ప్రభావాలు వస్తుంటాయి. అసంబద్ధ ఆహార అలవాట్లు క్రమంగా ఈటింగ్ డిజార్డర్లకు దారితీస్తాయి. వీటివల్ల శారీరకంగా కడుపులో మంట, అజీర్తి, కడుపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సంబంధ సమస్యలతో సతమతమవ్వడం, శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల చర్మం పొడిబారడం, చేతులు, పాదాల గోళ్లు పెళుసుబారడం, జుట్టురాలిపోవడం వంటివి కనిపిస్తాయి. చదవండి: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది! స్త్రీలలో ఈటింగ్ డిజార్డర్ ఉంటే నెలనెల వచ్చే పిరియడ్స్ సక్రమంగా రావు. అనోరెక్సియా నెర్వోసా అనే డిజార్డర్ కారణంగా ఈ వ్యాధి ఉన్న వారు తగినంతగా ఆహారం తినరు. క్యాలరీలను దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఫలితంగా వారు బరువు తగ్గిపోతారు. దీంతో వారు చూడడానికి బక్కపలచగా కనిపిస్తారు. బులిమియా నెర్వోసా కారణంగా ఇది ప్రాణానికి హాని కలిగించే రుగ్మత అని చెప్పవచ్చు. చదవండి: పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి ఈ పరిస్థితి ఉన్న వారు అతిగా తింటారు. తిన్నదానిని అరిగించుకోకుండా వాంతిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల కడుపులో మంట, చేతుల వెనక క్యాలస్ ఏర్పడుతుంది. బింగే ఈటింగ్ డిజార్డర్ వల్ల అతిగా తిని ఇబ్బంది పడుతుంటారు. అంతేగాక తాము ఆహారపు అలవాట్ల గురించి సిగ్గుపడుతుంటారు. ఈ లక్షణాల్లో ఏ కొన్ని ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. మెడిటేషన్, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. -
రంజాన్ ఉపవాసాలు ప్రారంభం
-
ఉపవాసం చేస్తున్నారా? ఇవి పాటిస్తే బెటర్
మహా శివరాత్రి పర్వదినం నాడు భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతునివైపు మనసును తిప్పడం కష్టం. ఉపవాసం ఉండేవారు ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది. దీని కోసం ఏం చేయాలనే దాని గురించి వైద్య నిపుణులు పలు సూచనలు ఇచ్చారు. ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక... ► రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. ► పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి. ► పచ్చికొబ్బరి కోరి సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు. ► గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. ► ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు. ►పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి. ► జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. ► పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. చదవండి: ఆరు రకాల ఉపవాసాలు మంచివట! -
ఆరు రకాల ఉపవాసాలు మంచివట!
‘‘లంఖణం పరమౌషధం’’ అనేది పెద్దవాళ్ల నోట తరుచూ వింటుంటాం! ఇది ఆషామాషీగా చెప్పింది కాదని, నిజంగానే ఉపవాసానికి, ఆరోగ్యానికి లంకె ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వేళకు తిండి తినడం ఎంత ముఖ్యమో అప్పుడప్పుడూ ఉపవాసం ఉండడమూ అంతే శ్రేయస్కరం. అందుకే అప్పుడప్పుడూ కడుపును ఖాళీగా ఉంచుకోమంటుంటారు పెద్దలు, వైద్యులు. భారతీయ సంస్కృతిలో ఉపవాసానికీ చోటుంది. మహాశివరాత్రి, నాగుల చవితి లాంటి కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఒక రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం చాలామందికి అలవాటు. దీని ద్వారా పుణ్యం, పురుషార్థం రెండూ కలసి వస్తాయి. కాలం మారింది. శారీరక శ్రమ తగ్గి, చల్లటి గదుల్లో కూర్చొని పనిచేసే కొలువులు రావడం, వేళాపాళా లేని ఉద్యోగాలు, జంక్‌ఫుడ్ తదితర వాటి వల్ల ఊబకాయుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. దీనివల్ల రకరకాల వ్యాధులూ విజృంభిస్తున్నాయి. అందుకే అడ్డదిడ్డంగా తిండి తినే బదులు ఓ క్రమపద్ధతి అలవాటు చేసుకోవాలని, దీనికి ఉపవాసాన్నీ జోడించాలని తాజాగా అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉపవాసం వల్ల బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, జీవితకాలం పెరగడం జరుగుతాయని అంటున్నాయి. ఈ క్రమంలో ఆరు రకాల ఉపవాసాలు ఆరోగ్యానికి శ్రేష్ఠం అని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఆ ఆరింటి గురించి తెలుసుకుందామిలా. 1) 16/8 పద్ధతి దీన్నే లీన్గెయిన్స్ ప్రొటోకాల్ పద్ధతి అని కూడా అంటారు. ఇందులో ఉదయం అల్పాహారం తీసుకోకూడదు. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 8గంటల లోపల రెండు, లేదా మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవచ్చు. అంటే రాత్రి ఎనిమిది నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 16గంటల పాటు ఉపవాసం ఉండాలి. మహిళలైతే 15గంటలు ఉంటే చాలు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేని వాళ్లకు ఈ పద్ధతి పాటించడం కష్టం. కానీ అల్పహారం ఎగరగొట్టే వాళ్లకు సులభం. అయితే, ఫాస్టింగ్ సమయంలో నీళ్లు, కాఫీ, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు. దీనివల్ల భోజనంపై ధ్యాస కూడా తగ్గుతుంది. ఉపవాసం ముగిశాక తీసుకునే ఆహారం మాత్రం పూర్తి బలవర్థకంగా ఉండాలి. విపరీతంగా జంక్‌ఫుడ్ తినేవారికి, అధికంగా కేలరీలు ఉండే వారికి ఈ విధానంతో ఫలితం ఉండదు. 2) 5:2 డైట్! దీన్నే ఫాస్ట్ డైట్ అని అంటారు. ఇందులో వారానికి ఐదురోజులు సాధారణ ఆహార నియమాలే పాటించాలి. అయితే, రెండు రోజులు మాత్రం ఉపవాసం ఉండాలి. ఈ రెండు రోజుల్లో మహిళలు 250 కేలరీల చొప్పున, పురుషులు 300 కేలరీల చొప్పున రెండు సార్లు ఆహారం తీసుకోవాలి. అంటే మహిళలు 500 కేలరీలు, పురుషులు 600 కేలరీలకు మించకుండా ఆహారం తీసుకోవాలి. ఈ విధానంలోని సానుకూల ఫలితాలపై ఇప్పటికీ సరైన పరిశోధనలు లేనప్పటికీ చాలామంది 5:2డైట్‌ను అనుసరిస్తున్నారు. 3) ఈట్ స్టాప్ ఈట్ కొన్నేళ్లపాటు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ విధానాన్ని ఫిట్నెస్ నిపుణుడు బ్రాడ్ పిలాన్ ప్రవేశపెట్టారు. ఇందులో వారంలో 48గంటల పాటు ఉపవాసం ఉండాలి. అంటే ఓ రోజు రాత్రి డిన్నర్ చేశాక మరుసటి రోజు రాత్రి డిన్నర్ చేసేంతవరకు ఉపవాసం ఉండాలి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ మధ్య ఉపవాసంగానూ చేసుకోవచ్చు. ఉపవాసం సమయంలో నీళ్లు, కాఫీ, జీరో కేలరీలు ఉండే ఇతర పానీయాలు తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు ఈ పద్ధతి అనుసరించేటట్లయితే ఆహారం తీసుకొనే దశలో మాత్రం సాధారణంగానే భోజనం ఉండాలి. నిజానికి 24గంటల పాటు ఉపవాసం ఉండడం చాలామందికి అంత సులభమైన విషయం కాదు. 4) రోజు మార్చి రోజు(ఆల్టర్నేటివ్ డే) ఇందులో వారంలో మూడు రోజులు రోజు మార్చి రోజు ఉపవాసం ఉండాలి. లేదా 500 కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నప్పటికీ దీన్ని పాటించడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఉపవాసం రోజు రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోవడం అంత సులభం కాదు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విధానం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది. 5) ది వారియర్ డైట్ ఇందులో రోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు తక్కువ పరిమాణంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తర్వాత సాయంత్రం 4నుంచి 8గంటల లోపు లార్జ్ మీల్ భుజించాలి. ఇది ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్న విధానం. 6) స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్ ఇందులో వారంలో రెండు రోజులు బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్ తీసుకోకూడదు. అయితే, ఏయేరోజు పాటించాలనేది మీ ఇష్టం. ఉదాహరణకు ఏదైనా రోజు ఆకలి లేనప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసి, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సమృద్ధిగా తినాలి. ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి తినడానికి ఏమీ దొరకవు. అలాంటప్పుడు ఈ పద్ధతి అవలంబించుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని అన్ని రకాలు ట్రై చేయవద్దు. ఏదైనా సరే ఒక విధానం ప్రకారం అనుసరిస్తేనే మేలు. ఉపవాసం శ్రేయస్కరం కావచ్చు కానీ శ్రుతి మించితే ప్రమాదమని గుర్తుపెట్టుకోవాలి. -
కలియుగ ఊర్మిళ : 28 ఏళ్ల ఉపవాసం ముగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఓ మహిళ 28 సంవత్సరాలుగా చేస్తున్న నిరాహార దీక్షకు ముగింపు లభించనుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే 81 సంవత్సరాల మహిళ అయోధ్యలో డిసెంబర్ 6, 1992లో వివాదాస్పద కట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాస దీక్షకు పూనుకున్నారు. అయోధ్యలో రాముడికి మళ్లీ గుడి కట్టిన అనంతరం మాత్రమే ఆహారం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజు ఆమె ఎంతో ఆనందించారు. అమె కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఎంతగా వేడుకున్నా ఆమె తన ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. తాను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించడం తనకు పునర్జన్మ వంటిదని ఆమె అన్నారు. భూమిపూజ అనంతరం అయోధ్యకు వెళ్లి, సరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష విరమిస్తానని ఊర్మిళ స్పష్టంచేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ‘‘శ్రీరాముడు తన భక్తులను ఎప్పటికీ నిరాశ పరచడు. త్రేతాయుగం నాటి శబరి అయినా ఈ యుగం నాటి ఊర్మిళమ్మ (ఊర్మిళ చతుర్వేది) అయినా! అమ్మా, మీ భక్తికి ప్రణమిల్లుతున్నాను. పూర్తి భారతదేశం మీకు వందనాలు అర్పిస్తోంది! జై శ్రీరాం!’’ అని ట్వీట్ చేశారు. -
ఆరు నెలలుగా ఉపవాసం!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): ఒక రోజు కడుపులో మెతుకులు పడకుంటే అల్లాడుతుంటాం. ఆవురావురంటాం.. అలాంటిది ఒకటి కాదు, కాదు రెండు కాదు.. అక్షరాల ఆరు మాసాల నుంచి భోజనం లేకుండా కేవలం పాలతో కాలం వెల్లదీస్తున్నాడు ఆ భక్తుడు. దేవుని(జగదంబా దేవి) భక్తిలో లీనమై ప్రజలకోర్కెలను, వారి కష్టాలను తీర్చుతున్నాడు ఓ ఆధ్యాత్మికుడు. కనిపించేందుకు చిన్న వయస్సే కానీ ఆయనలో దేవుడు ఆవిహించి సత్కర్యాలు చేయిస్తుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే రోజు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి దేవుడి సేవలో నిమగ్నమవుతున్నారు. ప్రతి రోజు మూడు సార్లు హోమం, మహాయజ్ఞం కొనసాగుతోంది. రాళ్లు రప్పలపై భక్తుల ప్రయాణం... కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని లక్మాపూర్ గ్రామానికి ఆనుకుని ఉన్న అభయారణ్యంలో ఆ బాబా తడకలతో తయారు చేసిన ఓ కుటీరాన్ని భక్తుల సాయంతో నిర్మించుకున్నారు. లక్మాపూర్ గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ కుటీరానికి వెళ్లాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. రాళ్లు రప్పల దారిలో వెళ్లాల్సిందే. ప్రస్తుతం సేవాలాల్ దీక్షలో ఉన్న కారణంగా సేవాలాల్ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మూడుసార్లు కొనసాగే మహాయజ్ఞం, హోమం, ఇత్యాది పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడున్న సేవకులు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాశివ రాత్రి నుంచి మహాయజ్ఞం ప్రారంభమైంది. వచ్చే నెలలో జరిగే శ్రీరామ నవమి వరకు పూజలు కొనసాగుతాయి. అసలేం జరిగిందటే! కెరమెరి మండలంలోని లక్మాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ లాలు, కమ్లాబాయి దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు వారిలో చిన్నివాడైన రాథోడ్ ప్రవీణ్‌కు జగదంబాదేవి కలలో వచ్చింది. మీ గ్రామానికి దక్షణాన అడవిలో మర్రి చెట్టు ఉందని, అక్కడికి వెళ్లి ధ్యానించని కోరిన కోర్కెలు తీరుతాయని చెప్పింది. దీంతో అక్టోబర్ 22–2017లో కలలో వచ్చిన చెట్టు ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్లి రోజులుగా ధ్యానం చేపట్టాడు. ఇది తెలుసుకున్న కొందరు యువకులు ఆయనకు ప్రతి రోజు పాలు, నీళ్లను అందించారు. అనంతరం గత 19 నవంబర్ నుంచి పూర్తిగా ఆహారం తినకుండా దైవ లీలాగానంలోనే ఉన్నాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ధ్యానం చేపట్టిన ప్రాంతానికి సమీపంలో రవీందర్, రోహిదాస్, అరవింద్ సహకారంతో తడకలతో కుటీరాన్ని వేర్పాటు చేసుకున్నారు. కొన్ని సౌకర్యాలను అనార్పల్లి సర్పంచ్ రాథోడ్ శేషరావు కల్పిస్తున్నారు. భక్తులకు ప్రవీణ్ ప్రవచనాలు చెబుతున్నాడు. -
ఇలా తింటే వ్యాధులు దూరం..
న్యూయార్క్ : రోజుకు 14 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా మిగిలిన పది గంటల్లో కొద్దిపాటి విరామం ఇస్తూ ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహం, స్ర్టోక్, గుండె జబ్బుల ముప్పు తప్పుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు పది గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం, కొలెస్ర్టాల్ అదుపులో ఉండటం వంటి అదనపు ప్రయోజనాలూ చేకూరతాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. అథ్యయనంలో భాగంగా తాము ఎంపిక చేసుకున్న వారిని 12 వారాల పాటు రోజుకు 14 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోరాదని, మిగిలిన పదిగంటల్లో వారికిష్టమైన సమయంలో ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 12 వారాల అనంతరం అథ్యయనంలో పాల్గొన్న వారి శరీరంలో కొవ్వు నిల్వలు, బీఎంఐ, బరువు మూడు శాతంపైగా తగ్గిన్టు గుర్తించారు. వీరిలో పలువురికి షుగర్ నిల్వలు కూడా తగ్గాయి. మరోవైపు 70 శాతం మంది తాము గతంలో కంటే మెరుగ్గా నిద్రించామని చెప్పుకొచ్చారు. 14 గంటల పాటు ఏమీ తినకుండా పదిగంటల్లో ఆహారం తీసుకునే సమయాన్ని షెడ్యూల్ చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు చెప్పారు. -
కార్తీక మహాపర్వం పున్నమి
కార్తీకమాసంలో ఉన్నవన్నీ పర్వదినాలే. అయితే ఈ పర్వదినాలన్నింటిలోకీ పర్వదినం కార్తీక పున్నమి అని చెప్పవలసి ఉంటుంది. మాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు. పున్నమినాడు చేసేవన్నీ ఒక ఎత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పున్నమికి. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు, సిక్కులకు కూడా విశిష్ట పర్వదినం. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ రోజున స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఇలా చేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే– ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు ఈ రోజు. నేడు ప్రత్యేకంగా చేయవలసినవి: దైవ దర్శనం, దీపారాధన, దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణం పేర్కొంటోంది. అదేవిధంగా అరుణ గిరిపై వెలిగించే కార్తీక దీపం ఎంతో విశిష్టమైనది. కన్నుల పండుగైనదీ. వందల టన్నుల ఆవునెయ్యిలో వేల టన్నుల నూలు వస్త్రాన్ని ముంచి, అరుణగిరి కొండలపై వెలిగించే ఈ దీపం ముందు ఆనాటి పున్నమి వెన్నెల చిన్నబోతుంది. పదిరోజులపాటు వరుసగా పున్నమి వెన్నెలను వెదజల్లుతుంది. -
ఆధ్యాత్మికం ఆరోగ్యం సామాజికం
శివకేశవులకి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో భక్తులంతా భగవన్నామ స్మరణలో మునిగి తేలుతూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఉపవాసం, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే కార్తీకమాసంలో ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ‘ఆశుతోషుడు’ అని పేరు. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు. ఈ మాసంలో ఇవి చేయడం మంచిది: ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం నియమనిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలం చెప్పనలవి కానిది. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు. కార్తీకమాసంలో ప్రతిరోజూ విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం. ఈ మాసమంతా కార్తీకపురాణాన్ని రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం. ఈ మాసంలో ఇవి చేయరాదు తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోవడం, ద్రోహ బుద్ధి, పాపపు ఆలోచనలు, దైవదూషణ, దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించడం, మినుములు తినడం, నలుగుపెట్టుకుని స్నానం చేయడం. వృక్షారాధన విగ్రహారాధన ఏర్పడక ముందు, మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు. మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని పెద్దలకు తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. వినాయక చవితి, క్షీరాబ్ది ద్వాదశి వంటి సందర్భాలలో అయితే వృక్షాలదే ప్రధాన పాత్ర. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట. కార్తీక సోమవారం లేదా మాసంలోని ఏదో ఒకరోజు ఉసిరిచెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండిత సత్కారం చేసి భగవన్నామ స్మరణతో భోజనం చేయడం వల్ల సర్వపాపాలు నశిస్తాయని నమ్మకం. బిల్వపత్రాలతో... తులసి దళాలతో... మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ‘శివేష్ట’ అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే సిరిని తెచ్చే ఫలమని అర్థం. మారేడు పత్రాలు త్రిశిఖలా మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, మోక్షం ప్రాప్తిస్తుందనీ శాస్త్రోక్తి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు తప్పనిసరిగా ఉంటాయి. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వవృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. ఈ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వంటికి మేలు. జబ్బులు రావు. బాహ్య, అంతః కరణాలు శుద్ధిగా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది. గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్ఛతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. వాతావరణంలో ఎక్కడ చెడు ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.ఇన్ని విశిష్టతలున్నాయి కనుకనే శివుడికి మారేడు అంటే ప్రీతి. ఇక విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు. తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుందని, తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవని, ఉదయాన్నే తులసిని దర్శించుకోవడం సకల పాపహరమనీ ప్రతీతి. Mఅయ్యప్ప దీక్ష, సాయి దీక్ష, భవానీ దీక్ష, హనుమద్దీక్ష... ఇలా వివిధ దీక్షలు తీసుకునేవారు, గోవిందమాల, శివమాల... ఇలా వివిధ మాలల ధారణ చేసేవారు సాధారణంగా కార్తీకమాసంలోనే చేయడం సంప్రదాయం. ఇవన్నీ నియమబద్ధ జీవనానికి మార్గదర్శనం చేస్తాయి. శరీరమే కాదు, అంతఃకరణ కూడా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఈ మాసంలో ఆచరించే నియమాలకు సార్థకత. – డి.వరలక్ష్మి కార్తీక మాసంలో సాగే వనభోజనాలు మన సంప్రదాయాలను చాటిచెబుతాయి. ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడమ’ని అమరకోశం చెబుతుంది. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. కార్తీకమాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధ భరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడాని కైనా వనభోజనాలు సరైన సందర్భాలు. అందరూ కుటుంబాలతో వెళ్లడం, చెట్ల కింద రకరకాల వంటలు వండుకుని తినడం ఒక అనుభవం. అయితే... ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజనాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, సామాజికం... ఇలా ఏ కోణంలోంచి చూసినా వన భోజనాలకు సాటి మరో సందర్భం కానరాదు! కార్తీక పురాణంలో కూడా వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది. తులసి పూజ.. తులసి ఇంటి ప్రాంగణంలో ఉండటం ఆ ఇంటి వారి సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తులసి పూజ చేయాలి. ఆవు నెయ్యితో తడిపిన వత్తులతో దీపాలు వెలిగించాలి. తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి, పరమాన్నం నివేదించాలి. అనంతరం 365 వత్తులతో హారతి ఇవ్వాలి. -
భర్త క్షేమం కోరి...
కర్వా చౌత్... ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్ నాడు భర్త ఆయురారో గ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు. హిందీ పరిశ్రమలో ప్రతి ఏడాదీ ఉపవాసం ఆచరించి, పూజలు చేసే తారలు చాలామందే ఉన్నారు. గురువారం కర్వా చౌత్ సందర్భంగా కొందరు తారలు ఉపవాసం ఉన్నారు. తన భార్య జయా బచ్చన్ ఉపవాసం ఉన్న విషయాన్ని అమితాబ్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. గతంలో తామిద్దరూ దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో తాను కనిపించకుండా జయబాధురి కనిపించేట్లు ఫొటో పెట్టి, ‘బెటర్ హాఫ్. మిగతా సగం ఇక్కడ అనవసరం. అందుకే కనిపించడంలేదు’’ అని సరదాగా అన్నారు. అనిల్ కపూర్ తాను పరిగెడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇన్నేళ్లుగా నువ్వు (భార్య సునీతను ఉద్దేశించి) చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలు, ఆచరిస్తున్న ఉపవాసాలే నన్ను వేగంగా పరిగెత్తేలా చేస్తున్నాయి. ప్రతిరోజూ నేను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. హ్యాపీ కర్వా చౌత్’’ అని పేర్కొన్నారు. ‘‘ఉపవాసం కోసం అంతా సిద్ధం చేసుకున్నాను. కొందరు కనిపించని, ఎప్పటికీ కలవని దేవుళ్ల కోసం ఉపవాసం ఉంటారు. కానీ నేను బతికి ఉన్నవాళ్ల కోసం చేస్తుంటాను. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా తల్లిదండ్రులు, నా భర్త, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు రవీనా టాండన్. ఫిట్నెస్కి బాగా ప్రాధాన్యం ఇచ్చే శిల్పా శెట్టి.. ఉపవాసం ఉంటున్న వాళ్ల కోసం ‘లౌకీ కీ ఖీర్’ అనే పోషకాలు ఉన్న స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చెప్పారు. సొరకాయతో ఈ ఖీర్ తయారు చేస్తారు. ప్రతి ఏడాదీ కర్వా చౌత్‌ని బాగా చేసుకుంటారు శిల్పా శెట్టి. ఈ ఏడాది కూడా ఫాస్టింగ్ ఉన్నారు. బార్సిలోనాలో శ్రియ పండగ చేసుకున్నారు. గత ఏడాది మార్చిలో రష్యాకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రీ కొషీవ్ని ఆమె పెళ్లాడారు. ‘‘అందరికీ కర్వా చౌత్ శుభాకాంక్షలు. మా అమ్మగారిని మిస్ అవుతున్నాను. అయితే పండగ సందర్భంగా తను పంపించిన ‘గోటా పట్టి’ చీర కట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రియ. ఇంకా షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ కూడా భర్త కోసం ఉపవాసం ఉన్నారు. ఇలా గురువారం తారల డిజైనర్ శారీస్, నగలతో ఉత్తరాదిన కర్వా చౌత్ సందడి కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే...పండగ సందర్భంగా ‘దబాంగ్ 3’లో సోనాక్షీ సిన్హా లుక్‌ని విడుదల చేశారు. మామూలుగా కర్వా చౌత్ రోజున జల్లెడ లోంచి చంద్రుడ్ని చూస్తారు. ఈ లుక్ కూడా అలానే ఉంది. సో.. సినిమాలో భర్త సల్మాన్ ఖాన్ కోసం సోనాక్షీ కర్వా చౌత్ ఆచరించే సీన్ ఉంటుందన్న మాట. జయా బచ్చన్ ఆండ్రీ, శ్రియ -
యువతి ప్రాణం తీసిన ఫాస్టింగ్
ముంబై : జైన సంప్రదాయం ప్రకారం ఏడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన పాతికేళ్ల జైన్ మహిళ ఏక్తా అశుభాయ్ గల హఠాన్మరణానికి గురయ్యారు. ఏక్తా ఉపవాసదీక్ష కోసం గుజరాత్‌లోని కచ్‌లో నెల కిందట పుట్టింటికి చేరుకున్నారు. ఆగస్ట్ 27న వారం రోజుల పాటు సాగే ఉపవాసదీక్షను ఆమె చేపట్టారు. ఐదు రోజుల తర్వాత ఆమె అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ దీక్షను విరమించి రోజుకు ఒకసారైనా ఆహారం తీసుకోవాలని సూచించగా ఏక్తా నిరాకరించారు. సెప్టెంబర్ 3న ఏక్తా ఆరోగ్యం క్షీణించగా ఆమెకు గ్లూకోజ్ ఎక్కించారు. అప్పటికీ జైన విశ్వాసాల ప్రకారం ఆమె కేవలం బాయిల్డ్ వాటర్‌ను మాత్రమే సేవించేందుకు అంగీకరించారు. అదే రోజు రాత్రి ఆమె గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారని ఏక్తా బంధువులు వెల్లడించారు. -
బంగారంలాంటి ఉపవాసం
‘‘సమాధిలో కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. హాజీసాబ్ కు ఏమీ అర్థంకాక తలపట్టుకుని కూర్చున్నారు. అంతలో ఒక దైవదూత వచ్చి ‘‘హాజీ సాబ్ మీరు చేసిన నమాజులు, సత్కార్యాలేమీ మీ మన్నింపుకోసం సరితూగడం లేదు.’’ అంది.‘‘నా జీవితంలో మూడు సార్లు హజ్ యాత్ర చేశాను గదా’’ అన్నాడు.‘‘అందులో రెండు హజ్లు మీ సొంత డబ్బుతో చేయలేదు. ఒక హజ్ మాత్రం లోపభూయిష్టంగా ఉంది’’ అంది దైవదూత. దైవదూత చెప్పిన ఈ మాటలకు హాజీసాబ్ లో ఆందోళన మరింత ఎక్కువయ్యింది. ‘‘మీ దగ్గర ఉపవాసాలేమైనా ఉన్నాయా?’’ అని దైవదూత ప్రశ్న.‘‘నా దగ్గర మొత్తం నలభైఏళ్ల పాటు పాటించిన ఉపవాసాలున్నాయి’’ అని ఎంతో ఆతృతతో చెప్పారు హాజీసాబ్. దైవదూతఒక్కో ఉపవాసాన్ని పరిశీలనగా చూసింది. 40 ఏళ్లపాటు పాటించిన ఉపవాసాల్లో ఒక్క ఉపవాసమూ లోపరహితంగా లేదని తేలింది.‘ఉపవాసంలో చాడీలు, పరనింద, అబద్ధం మానుకోలేకపోయానని. నలభైఏళ్లపాటు పాటించిన ఉపవాసాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని’ అప్పటికే కుమిలిపోతున్నారు హాజీసాబ్.‘‘హాజీ సాబ్ మీకు శుభాకాంక్షలు..’’ అంటూ దైవదూత సంతోషంగా అభినందనలు అని చెప్పడంతో హాజీసాబ్కు ప్రాణం లేచి వచ్చినట్లయింది.‘‘నా దగ్గర ఉన్న రికార్డును తీక్షణంగా పరిశీలిస్తే మీ కర్మల చిట్టానుంచి బంగారపు ఉపవాసం ఒకటి కనబడింది’’ అంది దైవదూత. ‘‘బంగారపు ఉపవాసమా? నేనెప్పుడూ దాన్ని పాటించలేదే’’ అని హాజీసాబ్ దైవదూత వైపు ఏమీ అర్థం కానట్లు చూశారు.‘మీరు ఏటా రమజాన్‌లో ఒక నిరుపేద ఉపవాసికి ఇఫ్తార్ చేయించే వారు. అదే ఆ బంగారపు ఉపవాసం అనిపించుకుంది’’ అని దైవదూత సమాధానం ఇచ్చింది.ఎంతో ప్రచారంలో ఉన్న ఈ కథ కల్పితమే కావచ్చు. అబద్ధాలు, చాడీలు, దుర్భాషలు, చెడుచూపు, అవినీతి సొమ్ము సంపాదించడం లాంటి వాటిని మానుకోకుండా ఉపవాసాలు పాటించే వారికి ఆకలిదప్పులు తప్ప మరేమీ ప్రాప్తించవని ప్రవక్త (స) పరోక్షంగా హెచ్చరించారు. – ముహమ్మద్ ముజాహిద్ -
పకీరు సేవ.. అల్లాహ్ తోవ
అల్లాకు మనిషిని చేరువ చేసే పుణ్యదినాలుగా రంజాన్ మాసాన్ని ముస్లింలు భావిస్తారు. కఠిన నియమాలతో ఈ మాసంలో చేసే నమాజ్‌లు, ఉపవాస దీక్షలు రెట్టింపు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయని ప్రతి ముస్లిం నమ్మకం. ఈ పుణ్య కార్యంలో పకీరుల (రఫాయిలు) పాత్రకు ప్రాధాన్యత ఉంది. అలసి సొలసిన శరీరాల మత్తు వదిలేలా.. అల్లాహ్ పిలుపును దరిచేర్చేలా.. ముస్లింలను సహరికి సిద్ధం చేసేందుకు తెల్లవారుజామున పకీరుల గానం ఇళ్ల ముందుకు చేరుకుంటుంది. భక్తి గానం ఆనందడోలికల్లో ఓలలాడిస్తుంది. లక్ష్మీపురం (గుంటూరు) : ‘ఉఠో రోజెదారో ఉఠో.. టైం దో బజ్ రహేహై ఉఠో.. సహరికా వక్త్ హోరహాహై. ఉఠో మా బహెనో ఉఠో.. జల్దీసే పకాలో.. సహెరికా ఇన్తెజామ్ కర్లో.. అయ్ మోమినో మాహె రంజాన్ అతా హై ప్యారా.. అల్లాహు.. అల్లాహు’ అంటూ చేతిలో డప్పు (డఫాలి)ను వాయిస్తూ బయలుదేరుతారు (పకీరులు) రిఫాయిలు. అల్లా శక్తిని, తమ భక్తిని ఖవ్వాలీ రూపంలో పాడుతూ వీధివీధి తిరుగుతారు. రాత్రి ఇషా నమాజ్ తర్వాత ప్రత్యేక తరవీ నమాజ్ చదివి ఏ 11 గంటలకో పడుకున్నా ఒంటి గంటకు నిద్రలేస్తారు. పవిత్ర రంజాన్ చంద్ర దర్శనం మొదలుకొని చివరి రోజా వరకు నెలంతా ప్రతి రోజు ఉపవాస దీక్షలకు సిద్ధమయ్యే ముస్లిం సోదరులను మేల్కొలుపుతారు. రంజాన్ నెల ప్రత్యేకత.. రోజా (ఉపవాసం) ప్రాముఖ్యత.. నమాజ్‌ల ప్రాధాన్యం.. దానధర్మాల ప్రతిఫలం తదితర అంశాలను మధురగానం ద్వారా వినిపిస్తారు. గానానికి తగినట్లు డప్పు వాయిస్తూ ముందుకుసాగుతారు. దర్గాల వద్ద ఉంటూ పకీర్లుగా పది మంది చేసిన దానధర్మాలతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాన్ని గడుపుతున్న వీరు రంజాన్ మాసంలో అల్లాహ్ రహ్మత్ (అనుగ్రహం) నేకియా, సవాబ్ (పుణ్యం) పొందేందుకు ఈ పుణ్యకార్యం చేస్తుంటారు. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తున్న కారణంగా ఈ సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా దానధర్మాలు ఇస్తే వాటిని స్వీకరిస్తుంటారు. వీరి సేవలను గుర్తించి పలువురు నగదు, దుస్తులు, ఆహార ధాన్యాల రూపంలో ఇస్తుంటారు. వీరితో పాటు నేటి తరం యువత కూడా అల్లాహ్ పుణ్యం లభిస్తుందని తమదైన రీతిలో నిదురలేపుతున్నారు. రిక్షాలోనో.. సైకిల్‌పైనో.. మైక్ సెట్టు పెట్టుకొని వాటి ద్వారా ఖవ్వాలీ పాటలు పెట్టడం, మైకులో సహెరీ సమయం కావచ్చింది.. ఇక నిదుర నుంచి మేల్కోవాలని చెప్పడం వంటి ఎన్నో పుణ్యకార్యాలు తెల్లవారుజాముల్లో నిర్వహిస్తున్నారు. పోటీపడి నిద్రలేపే జమాత్‌లు.. గానం బాగా వచ్చే కొందరు యువకులు ఒక జమాత్ (గ్రూప్‌గా) ఏర్పడి భక్తి గీతాలు పాడుతూ ముస్లింలు ఉండే ప్రాంతాల్లో తిరుగుతారు. దీంతో వారిని చూసేందుకు చాలా మంది నిద్ర లేస్తున్నారు. పురుషులు ఆ జమాత్‌తో కలిసిపోయి కొన్ని క్షణాలు ఆ ఆనందపు అనుభూతిని అనుభవిస్తారు. ఆ తర్వాత మహిళలు వంటలు వండుకోవడం, పురుషులు ముఖం కడుక్కోడం వంటి దైనందిన కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు. నిదుర లేవకపోతే ఉపవాసంవదులుకునే పరిస్థితి.. రంజాన్ మాసంలో ప్రతి రోజెదార్‌కు సహరి తప్పనిసరి. అందుకోసం వంటావార్పు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సమయానికి నిదురలేచి ఆ వంటలు చేసుకోలేని పక్షంలో ఉపవాసాలు ఉండడం కష్టం. ఈ కారణంగా ఉపవాసాలను వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఐదేళ్లుగా మేల్కొలిపే సేవలో.. 20 ఏళ్లపాటు రంజాన్ మాసంలో సహెరీకి మేల్కొలిపే పని నా తండ్రి సయ్యద్ మదార్షా చేశారు. శారదా కాలనీ ప్రాంతం నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి ముస్లిం ప్రాంతాల్లో తిరుగుతూ సహెరీ కోసం మేల్కొలుపుతూ ఉండేవారు. ఆయన స్థానాన్ని ప్రస్తుతం నేను స్వీకరించాను. చెప్పలేని ఆత్మసంతృప్తి కలుగుతోంది. తెల్లవారుజామున దీక్షలకు సహెరీ భోజనాలు చేయడం తప్పనిసరి. వీటి ఏర్పాట్లు కోసం ప్రతి రోజు అర్ధరాత్రి నేను కూడా 2 గంటల నుంచి నిదురలేచి వంటలు చేసుకోవాలి. గతంలో గడియారాలు, అలారం వంటివి చాలా తక్కువ ఇళ్లలో ఉండేవి. అలాంటి వారి కోసం మాలాంటి వాళ్లు అర్ధరాత్రి నుంచి పట్టణంలో తిరిగి అల్లా రసూల్‌పై ఖవ్వాలీ పాటలు పాడి మేల్కొలిపేవారు. సహెరీ కోసం మేల్కొలిపితే అల్లాహ్ నాకు, నా కుటుంబ సభ్యులకు పుణ్యం ప్రసాదిస్తాడనే కానీ మరొకటి ఆశించి కాదు. – సయ్యద్ సుభాని, పకీరు, శారదా కాలనీ, గుంటూరు -
‘నఫిల్’తో అల్లాహ్ ప్రసన్నత
‘ప్రతి వస్తువుకూ ఏదో ఒక జకాత్ ఉన్నట్లుగానే, శరీరానికీ జకాత్ ఉంది. అదే ’రోజా’ అని మహాప్రవక్త సెలవిచ్చారు. రమజాన్ నుండి రమజాన్ వరకు ప్రతినెలా మూడురోజులు పాటించడం పుణ్యఫలం రీత్యా సదా ఉపవాసాలు పాటించడంతో సమానమని ప్రవక్త మహనీయులు చెప్పారు. అంటే రమజాన్ నెలలో పాటించే 30 రోజాలు కాకుండా ప్రతినెలా మూడురోజులు రోజా పాటించడం ఎంతో పుణ్యప్రదం. శాశ్వతపుణ్యఫలం పొందాలనుకునేవారు నెలకు మూడురోజులు ఉపవాసాలు పాటించే అలవాటు చేసుకోవాలి. ధార్మిక దృష్టికోణంలోనే కాకుండా నెలకు మూడురోజులు ఉపవాసాలు చేయడం ఆరోగ్య పరిరక్షణకూ దివ్య ఔషధంగా ఉపకరిస్తుంది. ఈ విషయం అబూజర్ (ర)కు ఉపదేశిస్తూ..‘నువ్వు నెలకు మూడురోజాలు పాటించాలనుకుంటే .. పదమూడు, పద్నాలుగు, పదిహేను తేదీల్లో పాటించు.’అని చెప్పారు. వీటిని ధార్మిక పరిభాషలో ‘అయ్యామె బైజ్ ’ అంటారు. ఈ తేదీల్లో పాటించడం వీలుకాకపోతే ఎప్పుడైనా పాటించవచ్చు. ఎలాంటి తప్పూ లేదు. ప్రవక్తవారు కూడా నఫిల్ రోజాలను అప్పుడప్పుడూ పాటించేవారు.. అప్పుడప్పుడూ వదిలేసేవారు. అయితే షాబాన్ నెలలో మాత్రం ఆయన అధికంగా నఫిల్ రోజాలు ఆచరించే వారు. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని హదీసుల్లో సూచన ప్రాయంగా చెప్పబడిన ప్రకారం.. ప్రవక్తవారిని ఈవిషయమై అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు. ‘షాబాన్ నెలలో అల్లాహ్ దివ్యసన్నిధిలో దాసుల కర్మలు ప్రవేశ పెట్టబడతాయి. ఆ క్రమంలో నా కర్మలు కూడా ప్రవేశపెట్టబడినప్పుడు రోజా స్థితిలో ఉండాలన్నది నా కోరిక.’ అన్నారు. హజ్రత్ ఆయిషా సిద్దీఖా(ర.అన్ హా)గారి హదీసు ఇలా ఉంది. ‘ప్రవక్తవారు షాబాన్ నెలలో ఇంత అధికంగా రోజాలు ఎందుకు పాటించే వారంటే, సంవత్సరం మొత్తంలో మరణించబోయేవారి జాబితాను ఈనెలలోనే మలకుల్ మౌత్ (ప్రాణాలు తీసే దూత)కు సమర్పించడం జరుగుతుంది. అయితే ఆ దూత ప్రవక్త వారి వద్దకు వచ్చినప్పుడు రోజా స్థితిలో ఉండాలని ఆయన కోరుకునేవారు.’ అంతేగాక, రాబోయే రమజాన్ (షాబాన్ తరువాత రమజాన్ )నెలతో, దాని ప్రత్యేక శుభాలతో సాన్నిహిత్యం, మానసిక, ఆత్మీయ సంబ«ందాన్ని ఏర్పరచుకోవాలన్న ప్రత్యేక శ్రద్ధాసక్తులు కూడా బహుశా దీనికి కారణం కావచ్చు. షాబాన్ రోజాలతో రమజాన్ రోజాలకు ఉన్న సంబంధం ఎలాంటిదంటే, ఫర్జ్ నమాజులకు ముందు చేయబడే నఫిల్ నమాజులకు ఫర్జ్ నమాజులతో ఉన్న సంబంధం లాంటిది. కనుక రాబోయే రమజాన్‌కు స్వాగతం పలకడానికి మనసును మానసికంగా సంసిద్ధం చేసుకోడానికి షాబాన్ నెల నఫిల్ రోజాలు, ఆరాధనలు ఇతోధికంగా దోహదపడతాయి. అందుకని వీలైనంత అధికంగా ఈనెలలో రోజాలు పాటిస్తూ ఆత్మను శరీరాన్ని సంసిద్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. తద్వారా ప్రవక్త వారి ఆచరణా విధానాన్ని పాటించిన వారమై, అల్లాహ్ సామీప్యతను, ప్రేమను పొందగలుగుతాము. అందరికీ రమజానుకు ఘనస్వాగతం పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఉపవాసం.. జాగరణం
ఉపవాసం, జాగరణ.. ఈ రెండూ ఆధ్యాత్మికమైన తృప్తినీ, మనశ్శాంతినీ ఇస్తాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల మేరకు ఓ మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణారోగ్యంగా ఉన్నట్లు. అందుకే మన సంస్కృతి నిర్దేశించిన ఉపవాసం, జాగరణ వంటి నియమాలను పాటిస్తూనే, ఆరోగ్యంపై వాటి ప్రభావం పడకుండా చూసుకోవడం అవసరం. యువతీ యువకులు తాము ఒకింత కఠిన ఉపవాసం చేయవచ్చు. కానీ రోజూ మందులు తీసుకోవాల్సిన పెద్ద వయసువారు మాత్రం కాస్తంత జాగ్రత్త వహించాలి. మరీ కఠినంగా పాటించనంత వరకు ఉపవాసాలు కొంతవరకు ఉపయోగకరమే. ఆరోగ్యదాయకమే. ఉపవాసం సమయంలో ఒంట్లో ఏం జరుగుతుందంటే... సాధారణంగా మనం తీసుకునే ఆహారానికీ, ఆహారానికీ మధ్య కొంత వ్యవధి ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత మళ్లీ ఉదయం తీసుకునే భోజనం వరకు ఉండే వ్యవధి ఎక్కువ కాబట్టే.. మనం ఉదయం తీసుకునే ఆహారాన్ని ‘బ్రేక్ ఫాస్ట్’గా పేర్కొంటారు. అంటే... రాత్రి ఉపవాసాన్ని ‘బ్రేక్’ చేసే ఆహారం అన్నమాట. ఇది రోజూ సాధారణంగా జరిగే ప్రక్రియ. కాబట్టి దీంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ రోజులో సాధారణంగా మనం ఐదు నుంచి ఆరుగంటల వ్యవధిలో భోజనం చేస్తూ ఉంటాం. మన ఒంట్లోని జీవక్రియలకూ, మన పనులకూ అవసరమైన చక్కెరలు అందాలంటే అలా భోజనం చేస్తుంటాం. దాంతో మన దేహం కూడా ఆ ‘సైకిల్’కు అలవాటు పడి ఉంటుంది. మన ఒంట్లోని జీవక్రియలకు అవసరమైన శక్తి చక్కెర నుంచి, ఆ చక్కెరలు మన ఆహారం నుంచి అందుతుంటాయి. మనకు అవసరమైన శక్తి అందకుండానే మళ్లీ యథాతథమైన పనులన్నీ జరగాలంటే.. అందుకు తగినంత శక్తి అందక శరీరం మొరాయిస్తూ ఉంటుంది. దాంతో పాటు ఒంట్లో ఉండాల్సిన చక్కెర మోతాదుల్లో తేడాలు వచ్చినప్పుడు వెంటనే శరీరానికి ఉండాల్సిన సాధారణ రక్తపోటు పడిపోతూ ఉంటుంది. ఒంట్లోని చక్కెరలు బాగా తగ్గిపోయే కండిషన్‌ను ‘హైపోగ్లైసీమియా’ అంటారు. ఫలితంగా సాధారణ రక్తపోటు పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే మెదడుకు, దాంతోపాటు ఒంట్లోని కీలక అవయవాలకు తగినంత రక్తం అందకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఉపవాసం వల్ల ఒంట్లోని సాధారణ పనులకు అవసరమైన శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో మన దేహంలో నిల్వ ఉన్న కొవ్వుల నుంచీ, కొన్ని సందర్భాల్లో కండరాల నుంచి కూడా మన శరీరానికి అవసరమైన శక్తిని తీసుకుంటూ ఉంటుంది. దీనికి అనుగుణంగానే మళ్లీ మనం మన దేహాన్ని రోజువారీ చేసే కఠినమైన శారీరక శ్రమతో కూడిన పనులతో అలసిపోయేలా చేయకూడదు. ఉపవాసం ఉన్న రోజుల్లో అలాంటి పనులు ఏవైనా ఉంటే.. వాటికి తాత్కాలికంగా దూరంగా ఉండటం మేలు చేస్తుంది. ఇక కొందరు నీళ్లు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తుంటారు. మన దేహంలో జరిగే జీవక్రియల్లో మెదడు నుంచి వచ్చే ఆదేశాలన్నీ లవణాల తాలూకు విద్యుదావేశ మూలకాల రూపంలోనే జరుగుతుంటాయి. ఒంట్లో తగినన్ని ఖనిజాలూ, లవణాలూ ఉండి, అవి ద్రవరూపంలోకి మారితేనే అవి ఖనిజలవణాల విద్యుదావేశ మూలకాల రూపంలోకి మారి.. తద్వారా మెదడు నుంచి దేహంలోని రకరకాల అవయవాలకు అవసరమైన ఆదేశాలు అందుతుంటాయి. ఇందుకు తగినన్ని పాళ్లలో ఒంట్లో నీరుండటం ఎంతగానో అవసరం. ఒంట్లో ఉండాల్సిన నీటిపాళ్లు తగ్గితే అది డీహైడ్రేషన్‌కు దారితీసి మెదడు నుంచి ఆయా అవయవాలకు అందాల్సిన ఆదేశాలు అందవు. పైగా ఒక్కోసారి కండరాల్లో ఉండాల్సిన మృదుత్వం తగ్గిపోయి, అవి బిగుసుకుపోతాయి. పై కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ఉపవాసం సమయంలో కేవలం మన ఒంట్లోని కొవ్వులు మాత్రమే దహనం అయ్యేంత మేరకే మనం ఉపవాసం ఉండాలి. ఉపవాస సమయంలో నీరు తీసుకోవడం నిషిద్ధ కాదు కాబట్టి మరీ ఎక్కువగా కాకపోయినా, ఒంట్లోని జీవక్రియలకు అవసరమైనంతగానైనా నీరు తీసుకుంటూ ఉండాలి. షుగర్, హైబీపీ ఉన్నవారికి సూచనలు షుగర్, హైబీపీ వంటి సమస్యలు ఉన్నవారు ఉపవాసానికి ముందుగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని ఎప్పటిలాగే తీసుకుని, అప్పుడే తగినన్ని నీళ్లతో తాము రోజూ వేసుకోవాల్సిన టాబ్లెట్లను తీసుకోవాలి. ఒకవేళ రోజులో ఒక క్రమపద్ధతిలో వేసుకోవాల్సిన మాత్రలేవైనా ఉంటే.. వాటిని తప్పించకూడదు (స్కిప్ చేయకూడదు). నీళ్లతో టాబ్లెట్లు వేసుకోవడం ప్రధానాహారం కాదు కాబట్టి అది పెద్దగా దోషం కాబోదంటూ మనసుకు నచ్చజెప్పుకొని ఆరోగ్యం కోసం విధిగా వేళకు మాత్రలు వాడాలి. జాగరణ కోసం ఈరోజుల్లో రాత్రి చాలా సేపటివరకు మేల్కొని ఉండటం సాధారణమైపోయింది. దాంతో పోలిస్తే.. ఇక జాగరణ పేరిట నిద్రకు దూరంగా ఉండాల్సిన సమయం ఏ ఐదారు గంటలో అదనంగా ఉంటుంది. అయితే కిందటి రాత్రి నిద్రపోలేదు కాబట్టి ఆ మర్నాడు పగలు పడుకోవడాన్ని వీలైనంత వరకు నివారించాలి. ఎందుకంటే ఆ పగటి నిద్ర వల్ల రాత్రికి ఆలస్యంగా నిద్రపట్టడం, అసలే పట్టకపోవడం జరిగి నిద్ర క్రమం తప్పవచ్చు. జాగరణ కోసం ఈ జాగ్రత్త పాటిస్తే మంచిది. డా. సుధీంద్ర ఊటూరిలైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఉపవాసంతో జీవక్రియ మెరుగు
టోక్యో: ఉపవాసం జీవక్రియను మెరుగుపరుస్తుందని తాజా సర్వే పేర్కొంది. కేవలం శరీర బరువు తగ్గడమే కాకుండా అనామ్లజనకాల ఉత్పత్తికి, వృద్ధాప్యానికి దారితీసే లక్షణాలకు చెక్ పెడుతుందని వివరించింది. ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సర్వే నిర్వహించారు. ఉపవాసంవల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని కొనసాగించినట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో తెలిపారు. ఆహారం తీసుకోనప్పుడు శరీరంలో జరుగుతున్న మార్పులు, రసాయనిక చర్యలను నిశితంగా పరిశీలించారు. -
లంఖణం పరమౌషధమే!
ఉపవాసం అద్భుతమైన ఔషధమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. సైన్స్ కూడా దాన్ని ధ్రువీకరించింది. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు కారణమేమిటో స్పష్టం చేస్తోంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల మన కాలేయం, అస్థిపంజర కండరాలపై ప్రభావం పడుతుందని ఇది కాస్తా జీవక్రియల ప్రక్రియను దృఢపరుస్తుందని అంటున్నారు పాలో సాసోన్ కోర్సీ అనే శాస్త్రవేత్త. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్లేషించారు. మారిపోయే శరీర వాతావరణానికి తగినట్టుగా శరీరంలోని గడియారం కొన్ని మార్పులు చేసుకుంటూ శరీర స్థితిని కాపాడుతూ ఉంటుందని.. ఆహారం ఈ గడియారాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు కోర్సీ. నిరాహారం వల్ల ఇందుకు సంబంధించిన జన్యువులు చైతన్యవంతం అవుతున్నాయని అస్థిపంజర కండరాలు వీటిల్లో ఒకటని చెప్పారు. ఎలుకలకు 24 గంటలపాటు ఆహారం ఇవ్వకుండా తాము ఒక ప్రయోగం చేశామని ఈ సమయంలో శరీరం మొత్తమ్మీద ఆక్సిజన్ వినియోగం తక్కువైపోగా.. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ తేడాలు వచ్చాయని ఆహారం తీసుకోగానే పరిస్థితి మొదటికి వచ్చిందని కోర్సీ తెలిపారు. -
ముదురుతున్న తె.యూ వివాదం
సాక్షి, తె.యూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పాతిక రోజులుగా కొనసాగుతున్న అందోళనలు గురువారం విద్యార్థులు నిరవధిక దీక్షలు చేపట్టడంతో మరింత ముదిరాయి. యూనివర్సిటీలో బోధన తరగతులు కొనసాగక విద్యా సంవత్సరం వృథా అవుతోందని ఆరోపిస్తూ మూడు రోజులుగా అందోళనబాట పట్టిన విద్యార్థులు చివరికి ఆమరణ దీక్షలకు దిగారు. చిచ్చురేపిన జీవో నంబరు 11.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల(అకడమిక్ కన్సల్టెంట్లు)కు వేతనాలు పెంపు చేస్తూ జీవో నంబరు 11ను విడుదల చేసింది. అయితే తెయూ వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య తొమ్మిది కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్లుగా ప్రకటించారు. ఆయా కోర్సుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీవో నంబరు 11 ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లించబోమని స్పష్టం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. వర్సిటీలో అన్ని కోర్సులు రెగ్యులర్ కోర్సులుగానే పరిగణించాలని, జీవో నంబరు 11ను కాంట్రాక్టు అధ్యాపకులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ 9 కోర్సుల కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మె బాట పట్టారు. 25 రోజులుగా క్యాంపస్ మెయిన్ గేటు వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని నిరవధిక రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో 9 కోర్సుల్లో పాఠాలు బోధించేవారు లేక తరగతులు కొనసాగడం లేదు. పట్టించుకోని వీసీ, రిజిస్ట్రార్లు.. 25 రోజులుగా రిలేదీక్షలు చేస్తున్నా వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు మొండివైఖరితో సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టు అధ్యాపకులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చర్చల పేరుతో పిలిచి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, 19 రోజులుగా వీసీ యూనివర్సిటీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్ సైతం తన చేతిలో ఏమీ లేదని వీసీ ఎలా చెబితే అలా చేస్తామని చేతులెత్తేశారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా మూడు రోజులుగా విద్యార్థులు నేరుగా అందోళనబాట పట్టారు. వీసీ సాంబయ్య కన్పించడం లేదంటూ కరపత్రాలు ముద్రించి క్యాంపస్ ఆవరణలో అతికించారు. బోధన, బోధనేతర సిబ్బందిని క్యాంపస్‌లోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. గురువారం సైతం బోధన, బోధనేతర సిబ్బందిని విధులకు హాజరు కాకుండా అడ్డుకున్న విద్యార్థులు అల్పాహారం సైతం గేటు వద్దకే తెప్పించుకుని తిన్నారు. ఆమరణ దీక్షలు.. వీసీ, రిజిస్ట్రార్ల నుంచి స్పందన లేకపోవడంతో గురువారం విద్యార్థులు విఘ్నేశ్, వినోద్, అఖిల్, నర్సింలు, శ్రీకాంత్, అశోక్, ప్రశాంత్ ఆమరణ దీక్షలు ప్రారంభించారు. దీక్షా శిబిరంలో విద్యార్థు లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరగతులు జరగకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదని, ఈ నెల 27నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సిలబస్ పూర్తి కాకపోవడంతో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. ఆమరణ దీక్షలకు మద్దతు తెలిపిన విద్యార్థి నాయకులు యెండల ప్రదీప్, క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్ లు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
లంఘనం పరమౌషధం
ధార్మిక సిద్ధాంతాల ప్రకారం మానవ జన్మకు సార్థకత కైవల్యప్రాప్తి. ఈ ఉన్నత సోపానం అధిరోహించటానికి ధర్మార్థకామయుత జీవనయానం అనివార్యం. ఇటువంటి ప్రయాణానికి మూలస్తంభం ఆరోగ్యం అని ఆయుర్వేద వైద్యపితామహుడు చరకుడు చెప్పాడు. (ధర్మార్థ కామ మోక్షాణాం ఆరోగ్యం మూలముత్తమమ్). ఇదే ఆయుర్వేదపు ఉత్పత్తికి, ప్రయోజనానికి మూలకారణం. దీని ప్రధాన భాగాలు రెండు. స్వస్థునికి ఆరోగ్య పరిరక్షణ, రోగులకు వ్యాధి నిర్మూలన. మానసిక శారీరక ఆరోగ్యాలు పరస్పరం అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. దేహచిత్తాలు పటిష్ఠంగా ఉండటానికి మూలాధారం మహాకోష్ఠం. అంటే నోటి నుండి మలమార్గం వరకు విస్తరించి ఉన్న జీర్ణకోశ సంస్థానం. ఇది సక్రమంగా పనిచేయడానికి ఆయువుపట్టు లంఘనం. దీనినే వాడుకభాషలో లంఖణం అంటుంటారు. లంఘనం – ఉపవాసం: లంఘనమంటే తేలికగా ఉండటం అని అర్థం. దీనికి వ్యతిరేకం బరువుగా ఉండటం (గురువు). జీర్ణక్రియ, శోషణ క్రియ, ధాతు పరిణామం, మల విసర్జనం. .. ఈ నాలుగు తేలికగా జరిగినప్పుడే దేహానికి శక్తి, మనసుకి శాంతి. ఆరోగ్యాన్ని పొందుపరచే శోధన చికిత్స (పంచకర్మలు: వమన, విరేచన, నస్య, వస్తి, రక్తమోక్షణం), శమన చికిత్సలు లంఘనంలోకే వస్తాయి. శమన ప్రక్రియలు: దప్పికను అరికట్టడం (పిపాస), గాలిని సేవించటం (మారుత) ఎండను సేవించటం (ఆతప), ఆహార పచన (పాచన) ద్రవ్యాలు సేవించటం, ఉపవాసం, వ్యాయామం. చరక సంహిత సూత్రస్థానం: చతుష్ప్రకారా సంశుద్ధిః‘ పిపాసా మారుత ఆతపౌపాచనాని ఉపవాశశ్చ వ్యాయామశ్చేతి లంఘనః‘‘ ఈ శమన ప్రక్రియల్ని సులభంగా ఆచరించవచ్చు. దీనివల్ల శరీర లాఘవం సిద్ధించి తద్వారా మానసికంగా సత్వగుణ సిద్ధి లభిస్తుంది. చాలా రోగాలకి లంఘనమే నివారణ, చికిత్స ప్రక్రియ కూడా. ఉపవాసం: ఈ పదానికి సమీపంగా ఉండటం అని అర్థం. అంటే భగవంతుని సాన్నిధ్యం. మనసు, దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించినప్పుడు, ఆ తాదాత్మ్యతలో ఆకలిదప్పులు తెలియవు. ఏకాగ్రతతో కూడిన ధ్యానం వలన మానసిక దృఢత్వం అధికం అవుతుంది. తాత్కాలిక నిరాహారం వల్ల శరీర కణాలలోని జీవక్రియలు ఉత్తేజితమై, సర్వాంగాలలోనూ చైతన్య ప్రేరణ కలుగుతుంది. ఇదే దీర్ఘాయువునకు పెద్ద పీట. మానసిక ఆరోగ్యాన్ని పదిలపరచుకోవడం కోసం చెప్పిన దైవవ్యపాశ్రయ చికిత్సలో చరకమహర్షి ఉపవాసాన్ని కూడా చేర్చాడు.(మంత్ర, ఔషధి, మణి, మంగల, బలి, ఉపహార హోమ నియమ ప్రాయశ్చిత్త ఉపవాస స్వస్తి అయన ప్రణిపాత తీర్థగమనాది...) నేటి ఉపవాస సాధన: ఆహారం లభించకపోతే స్టార్వేషన్. ఇది గతి లేని దుర్భర స్థితి. దీని వల్ల దేహచిత్తాలు నిస్సహాయ స్థితికి చేరి, పోషకపదార్థాలు అందక, చిక్కి శల్యమై మరణానికి దారి తీయవచ్చు. ఉద్దేశపూర్వకంగా ఒక ఫలితాన్ని ఆశించి ఆహారాన్ని సేవించకపోవటం ‘ఫాస్టింగ్’. దీనికి సంకల్పదీక్ష ఉంటుంది కనుక ఆరోగ్యప్రదం. దీనిని కొన్ని గంటలు మొదలు కొన్ని రోజుల వరకు చేసే వారున్నారు. ఇది చేసేవారి ఉద్దేశ్యాన్ని బట్టి ఉంటుంది. ఒకరోజు సూర్యోదయం నుండి మరుసటిరోజు సూర్యోదయం వరకు చేసేది ఒకరోజు ఉపవాసంగా పరిగణిస్తారు. కొంతమంది నీరు కూడా తాగకుండా కఠోర ఉపవాసం చేస్తారు. కొందరు ద్రవపదార్థాలు మాత్రమే సేవిస్తారు. కొందరు పండ్లు సేవిస్తారు. మొత్తం మీద వండిన పదార్థాలను తాకకుండా ప్రకృతి దత్తమైన తేలికపాటి ఆహారాన్ని అంగీకరిస్తారు. ఉపవాస విరమణ సందర్భంలో కూడా కొందరు ఈ సూత్రాన్ని పాటిస్తారు. పానీయాలు: నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకురసం, బెల్లపు పానకం, కొంచెం ఉప్పు, నిమ్మ రసం కలిపిన శర్కర నీళ్లు, టీ, కాఫీ మొదలైనవి. ఫలాలు: అరటి, సీతాఫలం, సపోటా, జామి, ద్రాక్ష, కమలా, బత్తాయి, పనస మొదలైనవి. ఇంట్లో తయారు చేసుకునేవి: వడపప్పు (నానబెట్టిన పెసరపప్పులో శర్కర కలుపుతారు) చిమ్మిలి (నువ్వుల పప్పు, బెల్లం కలిపి దంచి, ఉండలుగా చేస్తారు), చలిమిడి (బియ్యాన్ని నానబెట్టి, పంచదారతో కలిపి దంచి ఉండలు చేస్తారు), పాకం చలిమిడి (నానబెట్టిన బియ్యాన్ని పిండి చేసి, శర్కరను కాని, బెల్లాన్ని కాని పాకం పట్టి, ఏలకులు, కొబ్బరి ముక్కలు, కొంచెం నువ్వులు కూడా చేర్చి ఉండలు చేస్తారు), తియ్య దుంపలు, పెండలం మొదలైనవి ఉడకబెట్టి తింటారు. ఇతరములు: ఇడ్లీ, ఉప్మా, దోసెల వంటివి ఉపవాసం ఎప్పుడు చేయాలి: ∙సాంప్రదాయపరంగా ప్రతినెలా పున్నమి ముందు వచ్చే ఏకాదశి (శుద్ధ/శుక్ల ఏకాదశి) రోజున (ఇందులోనే వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి, పెద్ద ఏకాదశి ఇందులోనే ఉంటాయి) ∙కార్తిక పౌర్ణమి, శివరాత్రి, శ్రీరామనవమి, దుర్గా నవరాత్రులు ∙కార్తిక మాసమంతా పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి భుజిస్తారు. దీనిని ఏక భుక్తం లేదా నక్తాలు (నక్త – రాత్రి) అంటారు ∙కొంతమంది పర్వదినాలలో ఉపవాసం ఉంటారు. వైద్య/ఆరోగ్యపరంగా: వారానికి ఒకసారి లేదా నెలకు రెండు సార్లు ఉపవాసం చేయడం ఉత్తమం. కనీసం పగలంతా ఘన పదార్థాలు (వండినవి) తినకుండా కేవలం ద్రవాహారంతో చేసినా జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. రాత్రి స్వల్పంగా తినవచ్చు. ఆయుర్వేదంలో కొన్ని జావలు (సూప్స్) చెప్పారు. (బియ్యప్పిండి, పేలాలు, అటుకులు, కూరగాయలు). వీటిలో పాచక పదార్థాలు (మిరియాల పొడి; వాము జీలకర్ర పొడులు, శొంఠి, పిప్పళ్ల పొడులు) కలుపుకోవచ్చు ∙ఉపవాస సమయంలో వాతదోషం ప్రకోపిస్తుంది. పైన చెప్పిన పదార్థాలన్నీ వాతశ్యామకంగా పనిచేస్తాయి. అటువంటి సామ్యావస్థను అర్థం చేసుకుని పోషక విలువల్ని పరిరక్షించుకుంటూ ఎంతకాలం ఉపవాసం చేసినా ఆరోగ్యకరమే ∙శివువులు, వృద్ధులు కఠోర ఉపవాసాలు చేయకూడదు ∙గర్భిణులు పోషక విలువలున్న ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. రుచి కోసం అధికమాత్రలో ఆహారాన్ని సేవించకూడదు. గుర్తుంచుకోవలసిన సారాంశం:అసలు కారణమెట్టిదిౖయెనగానిఉండవలయును ఉపవాసమొక్కపూటమూడుసార్లైన నెలనెలలోన ముచ్చటగనుకలుగు నారోగ్య దీర్ఘాయు ఫలములచట. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
అట్ల తదియ ఆహార విశిష్టత
భారత దేశంలో ప్రతి జీవన సందర్భాన్ని, ప్రతి ప్రకృతి సందర్భాన్ని పండుగ చేశారు. మానసిక, శారీరక ఆరోగ్యాల కోసం మాత్రమే కాక ఉల్లాసం కోసం ఉత్సాహం కోసం కూడా పండగలను స్థిర పరిచారు. సంస్కృతిని బల పరచడానికి ఇవి అవసరం అని భావించడం వల్లే వాటి కొనసాగింపుపై శ్రద్ధ పెట్టారు. అలాంటి పరంపరలో ఒక భాగమే అట్ల తదియ నోము. ఈ నోమును ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానంతో జరుపుకుంటారు. ఈ నోములో సూర్యోదయానికి ముందే భుజించాలి. దీనిని ఉట్టి కింద ముద్ద అంటారు. అనంతరం రాత్రివరకు జరిగే ఉపవాసంలో రకరకాల ఫలాలు (అరటి, జామ, బత్తాయి, దానిమ్మ మొదలైనవి) సేవించవచ్చు. తాంబూలసేవన చెయ్యొచ్చు. చీకటి పడుతూనే చంద్రమాదేవత (చంద్రుడు) కు పూజ చేసి అనంతరం అట్లను వాయినాలివ్వటం, సేవించటం జరుగుతుంది. కుటుంబపు అలవాట్లను బట్టి అట్లలోకి నంజుకోవడానికి నువ్వుల పప్పు, వేరుసెనగపప్పు వంటి పచ్చళ్లు, తేనె, తిమ్మనం (పాయసం లాంటిది) తయారు చేసుకుంటారు. పగలంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. పైన ప్రస్తావించిన ఆహారపదార్థాలలో కొన్ని ముఖ్యమైన వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్దాం. అరటి పండు: ఈ పండుకు కదళీ, వారణా, మోచా మొదలైన సంస్కృత పర్యాయపదాలు ఉన్నాయి. బొంత అరటి, అమృతపాణి, చక్కెరకేళి మొదలైనవి అరటిపళ్లలో కొన్ని రకాలు. గుణాలు: తియ్యగా రుచికరంగా ఉంటుంది. ఆకలి తీరటానికి మంచి ఫలం. దౌర్బల్యాన్ని, నీరసాన్ని పోగొడుతుంది. కండను పెంచి పుష్టిని కలిగిస్తుంది. వీర్యవర్థకం. నేత్ర, మూత్ర, హృదయ రోగాలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించటానికి, నెత్తురు (హీమోగ్లోబిన్)ను పెంచటానికి ఉపయుక్తం. (మోచఫలం... స్వాదు వృష్యంచ బృంహణం; క్షుత్ తృష్ణా నేత్ర గత హృత్ మేహఘ్నం, రుచి మాంసకృత్) దానిమ్మ: దాడిమ, దంతబీజ, లోహితపుష్ప మొదలైనవి కొన్ని సంస్కృత పర్యాయపదాలు. తియ్యగా ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతాయి. రుచికరం, బలకరం, ఆకలిని పుట్టిస్తాయి. గుండె రోగాలలో చాలా ప్రయోజనకారి. మేధాశక్తిని పెంచుతాయి. రక్త, వీర్య ఓజోవర్థకంగా పనిచేస్తుంది. జ్వరహరం, నోటి పూతల విషయంలో, కంఠ రోగాలలోకు గుణకారి. (దాడిమః.... తృట్ దాహ జ్వరనాశనం; దీపనం, రుచ్యం, మేధా బలావహం, హృత్కంఠ ముఖరోగనాశకం, తర్పణం, శుక్రలమ్) బత్తాయి: దీనినే తియ్య నిమ్మ అని కూడా అంటారు. మధుజంబల, శంఖద్రావీ, శర్కరక మొదలైనవి కొన్ని సంస్కృత పర్యాయపదాలు. అరుచిని, దప్పికను పోగొడుతుంది. వాంతిహరం, బలకరం, దేహపు బరువుని పెంచుతుంది. రక్తదోషాలను హరిస్తుంది. విషాన్ని హరించి, గుండెకు కూడా బలాన్నిస్తుంది. తమలపాకు: నాగవల్లీ, తాంబూల, ఫణివల్లీ, భుజంగలతా మొదలైనవి కొన్ని సంస్కృత పర్యాయపదాలు. వగరు, కారం, చేదులతో కూడిన రుచి కలిగి ఉంటుంది. జీర్ణక్రియను పెంచి, వేడి చేస్తుంది. కఫహరం. నోటి దుర్వాసనను పోగొడుతుంది. బలకరం, కామోద్దీపనం. తమలపాకు రసాన్ని కొంచెం తేనెతో కలిపి సేవిస్తే దగ్గు తగ్గిపోతుంది. కంఠం శుద్ధి అవుతుంది. పోక (వక్క): పూగీ, పూగ, గువాక అనేవి పోక చెట్టుకు పర్యాయపదాలు. పూగీఫల, ఉద్వేగ... పోక కాయకు సంస్కృత నామాలు. పచ్చి పోకకాయ ఆకలిని మందగింప చేస్తుంది. సిరా ధమనులలో అవరోధం కలిగిస్తుంది. ఉడకబెట్టి, ఎండబెట్టి తయారుచేయబడినవి ఆకలిని పెంచి, రుచికరంగా ఉండి, చలవ చేస్తాయి. మోహకరం, కఫపిత్త హరం. ఏది ఏమైనా దీనిని ఎక్కువగా సేవిస్తే హానికరం. మినుములు: దీనిని సంస్కృతంలో మాష అంటారు. జిగురు కలిగి ఉంటాయి. గుర్వాహారం (ఆలస్యంగా జీర్ణమై, శరీరం బరువెక్కిన అనుభూతి కలిగిస్తుంది). బలకర, శుక్రకర, శరీరంలో కొవ్వును, బరువును పెంచుతుంది. మలమూత్రాలను సాఫీగా చేస్తుంది. మూలవ్యాధిని తగ్గిస్తుంది. కడుపులోని పుళ్లను తగ్గించి, నొప్పిని తొలగిస్తుంది. ఆయాసాన్ని పోగొడుతుంది. ముఖ పక్షవాతం (అర్దితవాతం) విషయంలో గుణకారి. బాలింతలలో చనుబాలను వృద్ధి చేస్తుంది. (మాషో... స్రంసన, తర్పణ, బల్యః, శుక్రల, బృంహణః.... గుదకీల, అర్దిత, శ్వాస, ఉదర శూలాని నాశయేత్) గమనిక: నోములో భాగంగా వాయినాలకి చ్చే అట్లను మినప్పిండి, వరిపిండి కలిపి దోసెలా చేస్తారు. ఈ అట్లను రాత్రి చంద్రుడిని చూసిన తరవాత, వ్రతం చేసిన మహిళలు సేవించాలి. తిమ్మనం: అట్లలో నంజుకొనే పచ్చళ్లు ఒక రకమైతే, ఈ తిమ్మనం (పాయసం వంటిది) మరొక రకం. దీని తయారీలో పాలు, శర్కర ప్రధాన ద్రవ్యాలు. మూడవది బియ్యప్పిండి (వరి పిండి). ఏలకులు, పచ్చ కర్పూరం సుగంధ్ర ద్రవ్యాలు. వరిపిండికి బదులు కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పాలగుండ పలుకులు వాడతారు. వాస్తవానికి ఇది అడవి పెండలం అనే దుంపను సుదీర్ఘంగా శుద్ధి చేసి, దానిలోని పీచు పదార్థాన్ని తొలగించి, వేడి నీటిలో ఉడికించి తయారుచేస్తారు. తరవాత పలుకులుగా ఉన్నవాటిని పిండిగా తయారు చేస్తారు. దీనికి వృక్షశాస్త్ర సాంకేతిక నామం డయాస్కోరియా బల్బిఫెరా. ఈ పేరుపై చాలారకాల దుంపలు ఉన్నాయి (తినదగినవి, హాని చేసే తినకూడనివి కూడా). ఈ పిండినే ఈ సందర్భంలో పాలగుండ అంటారు. ఇది దేహానికి చలవ చేసి (శీతలం), అత్యధిక శక్తిని ఇస్తుంది. మంచి పోషకాహారం. ఎసన్షియల్ ఎమైనా యాసిడ్సు, అధికస్థాయి పిండి పదార్థాలు దీంట్లో లభిస్తాయి. అందుకే కొందరు గిరిజనులు ఈ దుంపను ప్రధాన ఆహారంగా వాడతారు. కొన్ని ప్రాంతాలలో పాలు, శర్కరకు బదులు చెరకు రసం ఉపయోగించి తిమ్మనం తయారుచేస్తారు. గుర్తుంచుకోవలసిన సారాంశం... ఫలములన్నియు మిక్కిలి బలకరంబు పోకతాంబూలసేవన ముదకరంబు ఇష్టమైనట్టి మినపట్లు తృప్తి కరము తిరుగులేనిది తెలుగింటి తిమ్మనంబు మధుపాయస ద్రవ్యంబు మనసు దోచు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
ఉపవాసం చేసే వారికోసం ప్రత్యేక ఆహారం
న్యూఢిల్లీ: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్న రైలు ప్రయాణికుల కోసం ‘వ్రత్ కా ఖానా’ పేరిట కొత్త మెనూ సిద్ధంచేసినట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పోరేషన్(ఐఆర్సీటీసీ) తెలిపింది. సాత్వికాహారం అయిన సగ్గుబియ్యం, సైంధవ లవణం, కూరగాయాలతో తయారుచేసిన ఆహారపదార్ధాలను రైల్వే మెనూలో అక్టోబర్ 10 నుంచి 18వ తేదీవరకు రైళ్లలో అందిస్తామని ఐఆర్సీటీసీ వెల్లడించింది. రైళ్లో భోజనం కోసం ఉపవాస దీక్షలో ఉన్న వారు ఇబ్బందిపడకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు అని తెలిపింది. సగ్గుబియ్యం కిచిడి, లస్సీ, తాలి, ఫ్రూట్ చాట్స్‌లనూ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. జర్నీ మొదలవడానికి రెండు గంటలముందుగా పీఎన్ఆర్ నంబర్ సాయంతో కొత్త మెనూలోని ఆయా ఆహారపదార్ధాలను ఠీఠీఠీ.్ఛఛ్చ్టి్ఛటజీnజ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn ద్వారా ఆర్డర్ చేయొచ్చని తెలిపింది. -
ఉపవాసంతో ఆయుష్షు పెరుగుతుంది
అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉండటం శరీరానికి మంచిదని చాలాకాలంగా తెలిసినప్పటికీ ఏ రకమైన మేళ్లు జరుగుతాయన్న అంశంపై మాత్రం పెద్దగా స్పష్టత లేదు. అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని అణువులు మన నాడీ వ్యవస్థకు జరిగే నష్టాన్ని తగ్గిస్తూంటుందని జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధన ఒకటి స్పష్టం చేస్తోంది. ఉపవాసం ఉన్నా, పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా శరీరం చక్కెరలపై ఆధారపడకుండా శరీరంలో ఉండే కొవ్వులను కరిగించడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో శరీరంలో కీటోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో హైడ్రాక్సీబ్యూటరైట్ ఒకటి. ఈ కీటోన్లు కణ జీవితకాలాన్ని పెంచుతాయని డాక్టర్ మింగ్ హుయి ఝౌ చేసిన పరిశోధన చెబుతోంది. హైడ్రాక్సీబ్యూటరేట్ కీటోన్లు విభజన ప్రక్రియ ఆగిపోయిన నాడీ వ్యవస్థ కణాలూ మళ్లీ విభజితమయ్యేలా చేస్తాయని ఫలితంగా వృద్ధాప్య లక్షణాలు తక్కువ అవుతాయని వివరించారు. ఆహారం తీసుకున్నా ఇదే రకమైన ప్రభావం చూపగల పదార్థాన్ని కనుక్కోగలిగితే గుండెజబ్బులతోపాటు అల్జైమర్స్ వంటి జబ్బులను నివారించేందుకు, సమర్థమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని అంచనా. -
అల్లాయే నాకు ఈ అవకాశం ఇచ్చాడు
-
పాప కోసం.. రంజాన్ దీక్ష పక్కన పెట్టాడు
పట్నా : మానవత్వాన్ని మించిన మతం లేదని నిరూపించాడు బిహార్‌కు చెందిన ఓ ముస్లిం. పసిపాప ప్రాణాలు కాపాడటానికి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను పక్కన పెట్టాడు. ఇంతకీ విషయమేమిటంటే.. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆర్మీ జవానుగా పనిచేసే రమేశ్ సింగ్ భార్య ఆర్తీ కుమారి రెండు రోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనారోగ్యంతో జన్మించిన పాప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అర్జెంటుగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే పాపది అరుదైన ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో తమ వద్ద స్టాక్ లేదంటూ ఆస్పత్రి చేతులెత్తేసింది. దీంతో పాప కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పాప పరిస్థితి గురించి ప్రకటన ఇచ్చారు. ఫేస్బుక్లో ప్రకటన చూసిన మహ్మద్ అష్ఫాక్ తనది అదే బ్లడ్ గ్రూప్ కావడంతో రక్తం ఇచ్చేందుకు ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఏదైనా తిన్న తర్వాతే రక్తం ఇవ్వాలంటూ డాక్టర్ సూచించడంతో.. మహ్మద్ అక్కడే భోజనం చేసి కాసేపటి తర్వాత రక్తదానం చేశాడు. అల్లాయే నాకు ఈ అవకాశం ఇచ్చాడు : మహ్మద్ అష్ఫాక్ ‘నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆర్మీ జవాను కూతురు ప్రాణాపాయంలో ఉందని తెలిసినపుడు నాకు చాలా బాధగా అన్పించింది. నా బ్లడ్ గ్రూప్ పాప బ్లడ్ గ్రూప్‌తో సరిపోవడంతో అల్లాయే ఒక నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశం నాకు కల్పించాడని భావించాను. అందుకే పాప ప్రాణాల్ని కాపాడటం కోసం ఒక్కరోజు ఉపవాస దీక్షను విరమించాను. నాకు హిందూ, ముస్లిం అనే తేడాలు ఏమీలేవు. మానవత్వాన్ని మించిన మతం లేదని నేను నమ్ముతానంటున్న’ అష్ఫాక్‌పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
రోజు విడిచి రోజు ఉపవాసంతో మేలే!
అప్పుడప్పుడూ ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజాగా షికాగోలోని ఇల్లినాయి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి రోజు విడిచి రోజు ఉపవాసం చేయడం శరీరంలో మంట/వాపును తగ్గిస్తుందని పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. మంట/వాపు తగ్గితే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని, బరువు కూడా తగ్గవచ్చునని వీరు అంటున్నారు. కొంతమంది కార్యకర్తలను ఇలా రోజు విడిచి రోజు నిరాహారంగా ఉండాల్సిందిగా కోరిన శాస్త్రవేత్తలు పన్నెండు వారాల తరువాత వారి వివరాలు సేకరించారు. అధ్యయనం మొదలయ్యే సమయంతో పోలిస్తే వీరు వారానికి అరకిలో వరకూ బరువు తగ్గినట్లు గుర్తించారు. అయితే ఉపవాసం అంటే.. రోజంతా ఆహారమన్నది తీసుకోకుండా ఉండరు. మిగిలిన రోజులతో పోలిస్తే నాలుగోవంతు ఆహారం ఇంకోలా చెప్పాలంటే 400–600 కేలరీల ఆహారం అందించారు. ఇందులో కూడా 30% కేలరీలు కొవ్వుల ద్వారా 15% ప్రొటీన్లు, మిగిలిన 55% కార్బోహైడ్రేట్ల ద్వారా అందేలా చేశారు. దీంతో కార్యకర్తలకు ఆకలన్నది అనిపించలేదు. మొత్తమ్మీద తేలిందేమిటంటే.. ఈ రకమైన ఉపవాసం వల్ల శరీరంలోని కొవ్వు బాగా కరగడంతోపాటు కండరాల నష్టం తక్కువగా ఉందీ అని. -
రమజాన్ రోజాలు
పవిత్ర రమజాన్ రాకడతో శుభాల పర్వం మొదలయింది. ముస్లిములు ఎంతో ఉత్సాహంతో ఉపవాసదీక్షలు ప్రారంభించారు. భక్తిశ్రధ్ధలతో పవిత్ర ఖురాన్ పారాయణం చేస్తున్నారు. మసీదులన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. చిన్నపిల్లలు సైతం రోజా పాటించడానికి ఉబలాటపడుతున్నారు. దీనిక్కారణం ఏమిటి? అసలు ఉపవాసం ఎందుకుండాలి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దీనికి స్వయంగా దైవమే, ‘ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ అంటున్నాడు. భయభక్తులంటే ఏమిటి? మానవుడి మనస్సు దుష్కర్మలపట్ల ఏవగింపును,అసహ్యతను ప్రకటిస్తూ, సత్కర్మల పట్ల అధికంగా మొగ్గుచూపే ఒకానొక స్థితి. ఈ స్థితిని మానవ ఆంతర్యంలో జనింపజేయడమే ఉపవాసాల అసలు ఉద్దేశం. అందుకని ఉపవాసం పాటించేవారు బాహ్య పరిశుభ్రతతోపాటు, అంతఃశ్శుధ్ధిని కూడా పాటించాలి. ఉపవాసదీక్ష పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం మానుకోనివారు నిజానికి వ్రతం పాటిస్తున్నట్లుకాదు. కేవలం పస్తులుండటంతో సమానం. ముహమ్మద్ ప్రవక్త(స) ఇలాచెప్పారు: ’ఉపవాసదీక్ష పాటించే చాలామందికి, తమ ఉపవాసాలద్వారా, ఆకలిదప్పుల బాధతప్ప మరెలాంటి ప్రయోజనమూ చేకూరదు’. అంటే, ఉపవాస లక్ష్యం మనిషిని ఆకలిదప్పులతో మాడ్చిఉంచడం ఎంతమాత్రం కాదు. దైవాదేశ పాలనలో మరింత రాటుదేలే విధంగా తీర్చిదిద్దడం. దైవవిధేయతా పరిధిని ఏమాత్రం అతిక్రమించకుండా, అన్నిరకాల చెడుల నుంచి సురక్షితంగా ఉంచడం. ఏడాదికొకసారి నెలరోజులపాటు నైతిక విలువలు, దైవాదేశపాలనను అభ్యాసం చేయిం చడం. నెల్లాళ్ళ శిక్షణ అనంతరం మిగతా పదకొండు నెలలకాలం దీని సత్ప్రభావం జీవితాల్లో ప్రసరించే విధంగా ఏర్పాట్లుచేయడం. పవిత్ర రమజాన్‌లో ఏవిధంగా అన్నిరకాల చెడులకు, అవలక్షణాలకు దూరంగా సత్కార్యాల్లో, దానధర్మాల్లో, దైవధ్యానంలో, సమాజ సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంటారో, అలాగే మిగతా కాలమంతా సమాజంలో శాంతి, న్యాయం,ధర్మం పరిఢవిల్లుతూ జీవితం సాఫీగా గడిచిపోవాలని, పరలోక సాఫల్యం సిధ్ధించాలన్నది అసలు ధ్యేయం. ఈ రమజాన్‌లో అటువంటి తర్ఫీదు పొందే భాగ్యం ప్రతి ఒక్కరికీ దక్కాలని మనసారా కోరుకుందాం. (రమజాన్ పర్వదినం ప్రారంభం సందర్భంగా) – యండి.ఉస్మాన్ ఖాన్ -
ఉపవాసం చేసే ఇంకో మేలు...
ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గతంలో పలు పరిశోధనలు రుజువు చేశాయి. తాజాగా మరో మంచి విషయం తెలిసింది. నిరాహారంగా ఉండటం వలన మన పేవుల్లో ఉండే మూలకణాల పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందట. సాధారణంగా పేవుల్లోని ఈ మూలకణాలు తగ్గితే ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి తేరుకోవడం కష్టం. వయసు పెరిగే కొద్దీ ఈ మూలకణాల పునరుత్పత్తి సామర్థ్యం సహజంగానే తగ్గిపోతుంటుంది. అయితే ఉపవాసం చేసినప్పుడు మాత్రం వీటి సంఖ్య గణనీయౖ స్థాయిలో పెరుగుతున్నట్లు గుర్తించామని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జీవశాస్త్రవేత్తలు చెప్పారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కేవలం 24 గంటల ఉపవాసంతోనే మూలకణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగినట్లు తెలిసిందిట. ఉపవాసం ఉన్నప్పుడు కణాలు గ్లూకోజ్ బదులుగా కొవ్వులను ముక్కలుగా చేస్తాయని ఫలితంగా మూలకణాలు చైతన్యవంతమై పునరుత్పత్తి వేగం పుంజుకుంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఓమెర్ ఇల్మాజ్ తెలిపారు. ఈ జీవక్రియను ప్రేరేపించే ఓ మూలకాన్ని తాము గుర్తించామని ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి, కీమోథెరపీ చేయించుకుంటున్న రోగులకూ ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఉపవాసంకు పేవులకు సంబంధించిన చాలా సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యముందని ఇందులో కేన్సర్ కూడా ఒకటని ఇల్మాజ్ వివరించారు. -
ఎంపీల ఆరోగ్యం కుదుట పడాలని..
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆరోగ్యం కుదుట పడాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం వైఎస్ఆర్సీపీ మైనారిటీసెల్ నాయకులు రోజాదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మైనారిటీసెల్ జిల్లా నాయకుడు ఎస్.ఫిరోజ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట మార్చడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి హోదా ఇచ్చే బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పార్టీ మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.జహీర్ అహ్మద్‌ఖాన్, జిల్లా నాయకుడు దొడ్డిపాడు మహబూబ్‌బాషా, మైనారిటీసెల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.ఎ.అహ్మద్, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి నూరుల్లా ఖాద్రి, జగన్ యూత్ ఐకాన్ (పులివెందుల) వ్యవస్థాపకుడు షామీర్ బాష, జావీద్ ఖాన్, దర్గా ముతవల్లి సయ్యద్ దాదాబాష ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. సామూహిక అత్యాచార దుండగులను కఠినంగా శిక్షించాలి ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటీవల యువతిపై సామూహిక అత్యాచారం జరిపిన దుండగులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. అలాగే కతువాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మానవత్వానికి తలవంపులుగా నిలిచే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. -
మా దీక్షలకు ఆటంకం కలిగించాలని టీడీపీ యత్నం
-
బీజేపీ దీక్షపై టీడీపీ కుట్ర..
సాక్షి, విజయవాడ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న నిరాహార దీక్షను అడ్డుకనేందుకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) యత్నిస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. పార్లమెంటు ఉభయ సభలను సజావుగా సాగనీయకుండా అడ్డుపడిన ప్రతిపక్షాల తీరుకు నిరసనగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఎంపీలు దేశవ్యాప్తంగా ఒక రోజు(గురువారం) నిరహార దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై పార్లమెంటును అడ్డుకున్నాయని నరసింహారావు అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. విజయవాడలోని లెనిన్ సెంటర్లో దీక్షకు పోలీసుల అనుమతి కోరగా తిరస్కరించారని చెప్పారు. పార్లమెంటు నిర్వహణలో అడ్డుపడటమే కాక, బీజేపీ శాంతియుతంగా నిరాహార దీక్షకు కూడా టీడీపీ అడ్డుపడుతోందని అన్నారు. బుధవారం లెనిన్ సెంటర్లో సీపీఐ దీక్షకు అనుమతించారని, బీజేపీకి అదే స్థలంలో దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌లో నిరాహార దీక్షకు విజయవాడ కమిషనర్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ తో జత కట్టిన తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నిర్వహణ లో అడ్డు పడడమే కాక, భాజపా చేస్తున్న శాంతియుత నిరాహార దీక్షకు కూడా అడ్డు పడుతోంది. లెనిన్ సెంటర్ లో దీక్షకు ఆఖరి నిమిషం లో అనుమతి నిరాకరించారు, అదే చోట CPI కు నిన్న ధర్నా కు అనుమతించారు. ఇప్పుడు ధర్నా చౌక్ లో దీక్ష. pic.twitter.com/maIhvBXsuW — GVL Narasimha Rao (@GVLNRAO) 12 April 2018 -
పాల ఉత్పత్తితో ఉపవాస లాభాలు!
ఉపవాసముంటే ఆయుష్షు పెరుగుతుందని ఇప్పటికే చాలా ప్రయోగాలు రుజువు చేశాయి. అయితే మనలో చాలామందికి తిండి లేకుండా ఉండటమన్న ఆలోచనే చికాకు కలిగిస్తూంటుంది. ఇలాంటి వారికోసమే అన్నట్లు కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త తీసుకొచ్చారు. పాలతో పాటు కొన్ని ఇతర ఆహార ఉత్పత్తుల్లో ఉండే ఒక పదార్థం ఉపవాసం చేయకపోయినా.. దాంతో వచ్చే ఫలితాలన్నింటినీ ఇస్తుందట. అదెలా? అన్న డౌట్ వస్తోందా? చూసేద్దాం మరి. ఈ పదార్థం పేరు నికొటినోమైడ్ రైబోసైడ్. క్లుప్తంగా ఎన్ఆర్. మార్కెట్లో వాణిజ్య స్థాయిలోనూ లభ్యమయ్యే ఎన్ఆర్ను రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల చొప్పున కొంతమందికి అందించారు. ఆరు వారాలపాటు ఉత్పత్తి మాత్రలు ఇచ్చిన తరువాత ఎన్ఆర్ను ఇవ్వగా.. ఇంకొంతమందికి ముందు ఎన్ఆర్.. ఆ తరువాత ఉత్తుత్తి మాత్రలు ఇచ్చారు. ఆ తరువాత వారి రక్తాన్ని పరిశీలించినప్పుడు ఉపవాసం చేసినప్పుడు జరిగే మార్పులు చాలావరకూ కనిపించినట్లు స్పష్టమైంది. ఎన్ఆర్ తీసుకున్న వారిలో నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ 60 శాతం ఎక్కువగా ఉత్పత్తి అయిందని ఈ రసాయనం సిర్టూయిన్స్ అనే ఎంజైమ్ ఉత్పత్తికి దోహదపడుతుందని తెలిసింది. అంతేకాకుండా ఎన్ఆర్ తీసుకున్న వారిలో కొంతమందికి రక్తపోటు కూడా గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. మరిన్ని పరిశోధనలు చేసిన తరువాత తాము ఈ పదార్థం ప్రభావాన్ని మరింత కచ్చితంగా మదింపు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టెన్స్ తెలిపారు. -
ఫాస్టింగ్‌తో మెదడుకు మేలు
లండన్ : అడపాదడపా ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మేలేనంటూ తాజా అథ్యయనం వెల్లడించింది. ఫాస్టింగ్‌తో మెదడు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తేలింది. అవసరమైన కేలరీల కంటే 40 శాతం తక్కువగా కొవ్వు లేని ఆహారం తీసుకున్న ఎలుకల మెదడు కణాల్లో వాపు (ఇన్ఫ్లమేషన్) తగ్గినట్టు వెల్లడైంది. ఈ తరహా ఆహారం మెదడు కణజాలం పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధన పేర్కొంది. పరిమిత కేలరీలతో కూడిన కొవ్వు రహిత ఆహారం ఇచ్చినప్పుడే ఎలుకల్లో వయసు ప్రభావంతో వచ్చే వాపును తగ్గించగలిగామని అథ్యయనానికి నేతృత్వం వహించిన గ్రొనిజెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ బార్ట్ ఈగెన్ చెప్పారు. వ్యాయామం కంటే కేలరీలను తగ్గించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తమ పరిశోధనలో వెల్లడైందని ఆయన తెలిపారు. మెదడు కణాల వాపు సోరియాసిస్, డిమెన్షియా సహా పలు వ్యాధులకు దారితీస్తుంది. వయసురీత్యా వచ్చే అనర్ధాలను తగ్గించుకుని మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బెర్రీస్, తాజా కూరగాయలు, నట్స్, చేపలు, సముద్ర ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆరాధనలో జాగృతం కావాలి
శివ అంటే మంగళమని అర్థం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం. రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి ముఖ్యమైనది. శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నం చేయాలి. స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివాలయానికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. తర్వాత మళ్ళీ స్నానం, లోపల, బయట అంతా పరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి. ఏమీ తెలియకపోతే ఓం నమశ్శివాయ అని జపిస్తూ ఉండాలి. భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తి పండితులకు, శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. ఉపవాసం: శివరాత్రికి అందరూ ఉపవాసం చేయాలంది శాస్త్రం. పిల్లలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తల స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం భగవంతునికి దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించం కష్టం. జీవారాధన: మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్థాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. మౌనవ్రతం: శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం కాదు. వ్రతంలో మనోవాక్కాయాలు ఏకం కావాలి. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు చదువుతున్న రుద్ర – నమకచమకాలను వినండి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటికి వచ్చాక, కాళ్లూ చేతులూ ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి. అభిషేకం: శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై కాసిని నీరు పోసినా, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. జాగరణ: శివరాత్రి జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. మంత్ర జపం: శివరాత్రి మొత్తం ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం/స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. పంచాక్షరాలు... పంచోపచారాలు మొదటిది విభూతి ధారణ. విభూతి ధారణ ఐశ్వర్యకరమని అంటారు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించడం. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. -
చరిత్రలో ఒక జర్నలిస్టు
వంగభూమిని విభజిస్తున్నట్టు అక్టోబర్ 16, 1905న వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రకటించాడు. శ్వేతజాతి మీద అప్పటికీ నమ్మకంతోనే ఉన్న ఆ కొద్దిమంది భారతీయులు కూడా భగ్గుమన్నారు. వలస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఒక విస్తృత ప్రజా ఉద్యమానికి తొలిసారి జాతి సమాయత్తమైంది. కవులు, కళాకారులు, మేధావులు, మధ్యతరగతి ప్రజలు అంతా ఆ రోజున బెంగాలీలతో పాటు, దేశవ్యాప్తంగా ఉపవాస దీక్ష చేపట్టారు. హిందువులు, ముస్లింలు ఒకరి చేతికి ఒకరు రాఖీలు కట్టుకుని, ఐక్యతను చాటారు. బిపిన్‌చంద్రపాల్, అరవింద్ ఘోష్, చిత్తరంజన్ దాస్ వంటివారితో పాటు కొన్నివేల మంది గంగానదిలో స్నానం చేసి, ప్రభుత్వం వంగదేశ విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేవరకు ఉద్యమం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అన్ని వేల మంది తరలివచ్చిన ఆనాటి ఆ చరిత్రాత్మక ఘట్టంలో ఒక్క వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా కనిపించారు. చిన్న గావంచా కట్టుకుని గంగలో స్నానించి, ఆయన కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడతానని ప్రతిన పూనారు. కానీ, ఆయన తెల్ల జాతీయుడు. ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘ది స్టేట్స్‌మన్’ సహాయ సంపాదకుడు. పేరు బెంజిమన్ గై హార్నిమన్. అనిబీసెంట్‌తో పోల్చుకుంటే, భారత స్వాతంత్య్రోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్రకు చరిత్రలో పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. ఆ మాటకొస్తే చాలామంది భారతీయుల త్యాగం కూడా చరిత్ర పుటలలో కానరాదు. కానీ భారతీయ ఆంగ్ల జర్నలిజం మీద ఆయన వేసిన ముద్ర మాత్రం విశేషమైనది. పోతాన్ జోసెఫ్, సయీద్ హుసేన్, ఆర్కే కరంజియా వంటివారు ఆయనతో కలసి పనిచేశారు. బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్‌షా మెహతా, మోతీలాల్, ఎంఏ జిన్నా, అనిబీసెంట్, సరోజినీ నాయుడు వంటి వారితో ఆయన భుజం భుజం కలిపి భారత స్వాతంత్య్రోద్యమంలో నడిచారు. నాటికీ నేటికీ కూడా ప్రపంచం నివ్వెరపోయే ఘటన– జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ. అది జరిగిన ఐదారు వారాలకు గాని పంజాబ్ నుంచి మిగిలిన భారతదేశానికి వార్త చేరలేదు. నాడు అంత దారుణంగా పత్రికల నోరు నొక్కింది బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి పరిస్థితులలో హార్నిమన్ ఆ ఘోరాన్ని ఇంగ్లండ్‌లోని లేబర్‌పార్టీ పెద్దలకు రహస్యంగా చేరవేసి సంచలనం సృష్టించారు. అందుకు హార్నిమన్(1873–1948) ఇక్కడ చెల్లించిన మూల్యం చిన్నదేమీ కాదు. అందుకే ఆయనను నాటి మహోన్నత స్వాతంత్య్రోద్యమ రథసారథులు మనసారా ‘భారత జాతి మిత్రుడు’ అని పిలుచుకున్నారు. హార్నిమన్ ఇంగ్లండ్‌లోని ఒక ఉన్నత కుటుంబంలో పుట్టారు. ససెక్స్‌లోని డవ్కోర్ట్ ఆయన జన్మస్థలం. తండ్రి విలియం. తల్లి సారా. విలియం బ్రిటిష్ నౌకా దళంలో పెద్ద ఉద్యోగి. పోర్ట్స్మౌత్లోను, మిలటరీ అకాడమీలోను హార్నిమన్ చదువుకున్నారు. హార్నిమన్ మరొక వృత్తేదీ స్వీకరించినట్టు కనిపించదు. 1894లోనే ఆయన పోర్ట్స్మౌత్ నుంచి వెలువడిన ఈవెనింగ్ మెయిల్ పత్రికలో మొదట పనిచేశారు. తరువాత డెయిలీ క్రానికల్, మాంచెస్టర్ గార్డియన్ వంటి విఖ్యాత పత్రికలలో కూడా ఆయన పనిచేశారు. ఆ రోజులలో చాలామంది ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి వచ్చి ఉద్యోగాలు చేసేవారు. ఆ విధంగానే హార్నిమన్ కలకత్తా నుంచి వెలువడే ‘ది స్టేట్స్‌మన్’ పత్రికలో న్యూస్ ఎడిటర్‌గా చేరి, తరువాత సహాయ సంపాదకుడయ్యారు. ఇదంతా 1905కు కొద్దిగా ముందు జరిగింది. ఫిరోజ్‌షా మెహతా బొంబాయి హైకోర్టులో పెద్ద న్యాయవాది. వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. తొలితరం మితవాద కాంగ్రెస్ నాయకులలో అగ్రగణ్యుడు. 1913లో ఆయన స్థాపించినదే ‘బాంబే క్రానికల్’. ఆనాడు ఎంతో ప్రభావం చూపుతున్న ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు దీటుగా ఉండే విధంగా ఒక పత్రికను స్థాపించాలని ఫిరోజ్‌షా గట్టిగా భావించారు. దాని ఫలితమే ‘బాంబే క్రానికల్’ స్థాపన. స్టేట్స్‌మన్ వంటి పెద్ద పత్రిక నుంచి బాంబే క్రానికల్‌కు హార్నిమన్ మారడం వెనుక పెద్ద కథే ఉంది. హార్నిమన్‌ను సంపాదకునిగా నియమించమని గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ కలసి ఫిరోజ్‌షాకు సిఫారసు చేశారు. బెనర్జీ అయితే, ‘నాలాగే మంచి భారతీయుడు’ అని కితాబు కూడా ఇచ్చారు. ఫలితం– బాంబే క్రానికల్ వంటి చరిత్రాత్మక పత్రికకు హార్నిమన్ తొలి సంపాదకుడయ్యారు. ఫిరోజ్‌షా మెహతాతో పాటు ఆ ఇద్దరు కాంగ్రెస్ ప్రముఖులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని హార్నిమన్ వమ్ము చేయలేదు. పత్రికకు ఎంతో పేరు వచ్చింది. దానికి నిదర్శనం– హార్నిమన్ మీద నీచమైన ఆరోపణలు చేసే స్థితికి పోటీ పత్రికలు దిగిపోయాయి. వర్లీ అనేచోట హార్నిమన్ ఒంటరిగా ఉండేవారు. కేరళ నుంచి వచ్చిన ఒక ముస్లిం, తమిళనాడు నుంచి ఒక హిందూ యువకుడు కూడా ఆయన అపార్ట్మెంట్లో ఉండేవారు. బీచ్‌లో వాకింగ్‌కు వెళ్లినప్పుడు తారసపడినవారే వీరు. నిజానికి ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చిన పేద కుటుంబాల పిల్లలు. కానీ దయతో ఇద్దరికి హార్నిమన్ తన అపార్ట్మెంట్లో నీడనిచ్చారు. వీరితో హార్నిమన్ స్వలింగ సంపర్కం కలిగి ఉన్నాడని వదంతులు లేవదీశారు. దీని మీదే హార్నిమన్ పరువునష్టం కేసు వేస్తే, జిన్నా వాదించారు. జిన్నా, ఫిరోజ్‌షా మెహతా, హార్నిమన్ ప్రతి క్రిస్మస్ సెలవులకి పూనాలో కలసి ఉండేవారు. అక్కడ ఫిరోజ్‌షా మెహతాకు సొంత భవనం ఉండేది. హార్నిమన్కూ, భారత స్వాతంత్య్రోద్యమ నేతలకు అంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. హార్నిమన్ హోమ్‌రూల్ లీగ్ ఉపాధ్యక్షుడు. అనిబీసెంట్ అధ్యక్షురాలు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఆయన తన బాంబే క్రానికల్ ద్వారా, బహిరంగ సభల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేశాడు. ఈ చట్టం ఎంత కఠినమైనదో చెప్పడానికి మాటలు చాలవు. ఇలాంటి చట్టాన్ని వ్యతిరేకించినందుకు తమ జాతికి చెందిన వాడైనప్పటికీ హార్నిమన్ వైఖరి ప్రభుత్వానికి మింగుడుపడ లేదు. శ్వేతజాతి అధికారాన్ని ప్రశ్నించినవారు, వ్యతిరేకించినవారు బ్రిటిష్ జాతీయులైనా సరే, ఈస్టిండియా కంపెనీ గానీ, బ్రిటిష్ రాణి పాలన గానీ ఏనాడూ క్షమించలేదు. భారతదేశంలో తొలి పత్రికను (బెంగాల్ గెజెట్) స్థాపించిన జేమ్స్ అగస్టస్ హికీ కంపెనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. ఈయనను హఠాత్తుగా ఇంగ్లండ్ పంపించే శారు. అక్కడ ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సరిగ్గా అదే రీతిలో హార్నిమన్‌ను బాంబే ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఇంగ్లండ్‌కు పార్సెల్ చేసింది. ఏప్రిల్ 13, 1919న అమృతసర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమైన (వైశాఖి ఉత్సవం కోసం) నిరాయుధులైన జనం మీద జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించాడు. 1650 రౌండ్లు కాల్చారు. 379 మంది మరణించినట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఈ వార్త బయటకు రావడానికి కొన్ని నెలలు పట్టింది. హార్నిమన్‌ను ఈ ఉదంతం బాగా కదిలించింది. ఈ దురంతానికి సంబంధించిన ఫొటోలు, కథనం అత్యంత రహస్యంగా ఇంగ్లండ్ పంపించాడు. అక్కడ లేబర్ పార్టీకి అనుకూలమైన డెయిలీ హెరాల్డ్ పత్రికలో అచ్చయ్యేటట్టు చేశాడు. బహుశా ఇది జరిగిన కొద్దిరోజులకే అతడిని పక్కా ప్రణాళికతో బాంబే ప్రెసిడెన్సీ గవర్నర్ జార్జి లాయిడ్ అరెస్ట్ చేయించాడు. అప్పుడే హార్నిమన్ ఒక శస్త్ర చికిత్స చేయించుకుని వర్లీలోని తన అపార్ట్మెంట్లో విశ్రాంతిలో ఉన్నాడు. ఒక అర్ధరాత్రి ఆ అపార్ట్మెంట్ మీద దాడి జరిగింది. బాంబే నగర యాక్టింగ్ పోలీస్ కమిషనర్ (సీఐడీ ఇన్స్పెక్టర్) నాయకత్వంలో ఒక పోలీసు బృందం లోపలికి ప్రవేశించింది. వారి వెంట ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. ఆ వైద్యులు హార్నిమన్‌ను పరీక్షించి తరలించవచ్చునని నిర్ధారించారు. కొద్ది నిమిషాలు సమయం ఇచ్చి, వెంటనే బట్టలు మార్చుకుని రమ్మన్నారు పోలీసులు. అలాగే కావలసిన వస్తువులు సర్దుకోవడానికి కొన్ని నిమిషాలు సమయం ఇచ్చారు. కిందకి తీసుకువెళ్లి అంబులెన్స్‌లో పడుకోబెట్టారు. అక్కడ నుంచి నేరుగా నౌకాశ్రయానికి తీసుకువెళ్లి లండన్ వెళుతున్న తకాడా అనే నౌక ఎక్కించారు. ఈ దారంతా కూడా నిఘా ఏర్పాటయింది. బాంబే నగరంలో ఆనాడు హార్నిమన్కు అంత పలుకుబడి ఉండేది. పైగా ఫిరోజ్‌షా మెహతా మరణించిన తరువాత ‘బాంబే క్రానికల్’ నిర్వహణ బాధ్యత జిన్నా స్వీకరించారు. అది కూడా ప్రభుత్వం భయపడడానికి ఒక కారణం. హార్నిమన్ ఎక్కిన ఓడ బయలు దేరిన సంగతి తెలిసిన తరువాతే గవర్నర్ జార్జి లాయిడ్ ఊపిరి పీల్చుకున్నాడట. మళ్లీ 1929లో ఆయన భారత దేశానికి వచ్చి తిరిగి సేవలు ఆరంభించాడు. తరువాతి కాలంలో ప్రఖ్యాత పత్రికా రచయిత ఆర్కె కరంజియా, హార్నిమన్, దినకర్ నాద్‌కర్ణిలతో కలసి బ్లిట్జ్ పత్రికను ప్రారంభించారు. జలియన్‌వాలా దురంతం మీద హార్నిమన్ ఒక పుస్తకమే రాశారు. దాని పేరు ‘బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది అమృత్సర్ మేసకర్’. ఈ పుస్తకాన్ని 1984లో భారతదేశంలో పునర్ ముద్రించారు కూడా. ఎలాంటి దేశం మీద, ఎలాంటి దుస్థితిలో జీవనం సాగిస్తున్న ప్రజల మీద తెల్ల జాతీయులు దాష్టీకం చేస్తున్నారో, జలియన్‌వాలా బాగ్ కాల్పుల వంటి రాక్షసకృత్యానికి పాల్పడ్డారో ఆయన అందులో ఎంతో అద్భుతంగా వర్ణించారు. పత్రికా రచయితగా, వక్తగా, రాజకీయ కార్యకర్తగా, హక్కుల స్పృహ ఉన్న వ్యక్తిగా హార్నిమన్ తన విశిష్టతను, తన కలం ప్రతిభను ఇందులో దర్శింపచేశారు. ఇలాంటి దారుణం, అంటే జలియన్ వాలా బాగ్ దురంతం వంటిది– మరొకటి ప్రపంచంలో లేదని ఆయన రాశారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్, బెల్జియం దేశాల మీద జర్మనీ సాగించిన అకృత్యాల స్థాయిలోనే జనరల్ డయ్యర్ నాయకత్వంలోని బలగాలు ‘బాగ్’లో రక్తపాతం సృష్టించాయని నిర్మొహమాటంగా చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం తన అధీనంలో ఉన్న వలస దేశాలన్నింటిని మొదటి ప్రపంచ యుద్ధంలోకి దించింది. కానీ ఆ యుద్ధం తరువాత ఆర్థికంగా భారత్ పతనమైన స్థాయిలో మరో దేశమేదీ పతనం కాలేదని కూడా హార్నిమన్ చెప్పారు. భారతీయులు నిరంతరం దారిద్య్రంతో బాధపడుతూ ఉంటారనీ, ఈ స్థాయి దారిద్య్రం మరో చోట ఉండదనీ ఆయన వాపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి అత్యంత ఎక్కువ లాభాలు గడించేది. దోపిడీ సాగించేది. అయినా రాణి ప్రభుత్వం భారతదేశ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఎంత దారుణంగా ఉండేవో, భారతీయుల సంక్షేమానికి ఎంత తక్కువ ఖర్చు చేస్తున్నదో కూడా వివరించాడు. 1927లో ఒక గుమాస్తాకు కలకత్తా, బొంబాయి వంటి నగరాలలో నెలకు ఇస్తున్న జీతం 10 పౌండ్లు. ఒక మిల్లు కార్మికుడికి దక్కుతున్న వేతనం మూడు పౌండ్లు. గని కార్మికులకు ఇంకా తక్కువ. భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకోవడమే కాదు, పౌరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్న సంగతిని కూడా వెల్లడించాడు. రాజనీతి గురించి ప్రపంచానికి నీతులు చెప్పే ఇంగ్లండ్ భారతదేశంలో పత్రికల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో కూడా బహిర్గతం చేశాడు. 1947లో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం అధీనం నుంచి విముక్తమైన గొప్ప దృశ్యాన్ని హార్నిమన్ వీక్షించారు. ఆ మరుసటి సంవత్సరం కన్నుమూశారు. డా. గోపరాజు నారాయణరావు -
ఉపవాసం మేలు గుట్టు తెలిసింది
తరచూ ఉపవాసం ఉండటం వల్ల ఆయువు పెరుగుతుందని వింటుంటాం.. ఇందుకు కారణాలను సశాస్త్రీయంగా హార్వర్డ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లోని మైటోకాండ్రియా నెట్‌వర్క్‌ల చర్యలను మార్చడం ద్వారా ఉపవాసం ఆయువును పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ మైటోకాండ్రియానే కణాలకు అవసరమైన శక్తిని తయారు చేస్తుంది. హార్వర్డ్ శాస్త్రవేత్తలు నులిపురుగులపై ప్రయోగాలు చేశారు. రెండు వారాల పాటే బతికే ఈ నులిపురుగులకు అందే ఆహారాన్ని నియంత్రించినప్పుడు వేర్వేరు కణాల్లోని మైటోకాండ్రియాలు స్థిరంగా ఉండిపోయినట్లు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో మైటోకాండ్రియా ఒక దశ నుంచి ఇంకోదశకు సులువుగా మారేందుకు ఈ ప్రక్రియ వీలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉపవాసం కారణంగా మైటోకాండ్రియా.. ఆక్సిజన్ సాయంతో కొవ్వులను మండించే భాగాలైన పెరాక్సీసోమ్స్ మధ్య సమన్వయం కూడా పెరిగిందని తెలిసింది. -
ఉపవాసం అంటే ఆకలి బాధ తెలుసుకోవడం..!
హరిహరప్రీతికరమైన కార్తికమాసంలో ఉన్నాం మనం. ఈ మాసంలోని రోజులన్నీ పర్వదినాలే. అయితే కార్తీకంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటిస్తే సిరిసంపదలు, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. ఇక్కడ ఉపవాసం అంటే కేవలం కడుపు మాడ్చుకోవడమే కాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు, పాపపు ఆలోచనలు చేయరాదు, దైవదూషణ తగదు. అశ్లీల సంభాషణలలో పాలు పంచుకోరాదు. ఇతరులను ముఖ్యంగా గురువులు, పెద్దలు, పండితులను గేలి చేయరాదు. పరనింద పనికి రాదు. ఆకలి వేస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని సూర్యాస్తమయం కోసం ఎదురు చూడటం కంటే హాయిగా భోజనం చేసి, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ప్రయోజనకరం. ఉపవాసం ఉండలేని వారు, ఉండలేకపోయానే అని బాధపడుతూ కూర్చునేకంటే, మనసులోకి చెడు ఆలోచనలు, ఇతరులకు కీడు తలపెట్టే తలంపులు రానివ్వకుండా చూసుకోవడం ఇంకా మంచిది. మనం ఉపవాసం ఉన్నామంటే, ఇతరుల ఆకలి బాధ తెలుసుకోవడం కోసమే. మన భోజనానికి అయ్యే ఖర్చుతో పేదవాడికి కడుపు నింపడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించడం వల్ల ఉత్తమ గతులు కలుగుతాయి. -
మద్యంపై పోరు ఆగదు
► మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదిక స్పష్టం ► నూతన ఎక్సైజ్‌పాలసీ రద్దుకు డిమాండ్ ► వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ద్వారకానగర్(విశాఖ దక్షిణ): మద్యం మహమ్మారిని సంపూర్ణంగా రూపుమాపే వరకూ తమ పోరు ఆగదని మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ పార్కు వద్ద మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. దీనికి ఉపకరించే విధంగా ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టిందన్నారు. తక్షణం ఈ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలకు, హత్యలు పెరగడానికి కారణం ఈ మద్యమేనన్నారు. దీనిని నియంత్రించాల్సిన ప్రభుత్వం దానిని ప్రోత్సహిస్తుండడం దారుణమన్నారు. ప్రభుత్వం ‘మత్తు’ వదలాలి.. బీర్‌ను హెల్త్ డ్రింక్ మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మున్ముందు మెడిసిన్‌గా ప్రకటిస్తారేమోనని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి ఎద్దేవా చేశారు. మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి, ‘మత్తు’ రాజకీయలకు వ్యతిరేకంగా.. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగానికి, చట్టానికి బద్దులై నడుచుకుంటానని ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర సహయ కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మద్యం బాబులకు అండగా ఉంటున్నారని, గుడి, బడి తేడా లేకుండా బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేయడం బాధకరమన్నారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు దేవీశ్రీ ప్రభుత్వం చేస్తున్న మద్యం విధానాలకు వ్యతిరేకంగా పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. వైఎస్సార్సీపీ నగర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవివర్మ, నగర అధికార ప్రతినిధి ధనలత, 19వ వార్డు అధ్యక్షురాలు బొట్టా స్వర్ణ, కొల్లి రమణమ్మ, శిరిషా, శ్రీదేవి, నగర కార్యదర్శి అలివేణి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య బేగం, ప్రగతిశీల మహిళా సంఘం ఎస్. వెంకటలక్ష్మి, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫాస్టింగ్‌లో మోదీ కంటే తక్కువేమి కాదట
న్యూఢిల్లీ : దసరా నవరాత్రులు సందర్భంగా గత 43 ఏళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న దీక్షలకు తక్కువేమీ కాకుండా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఫాస్టింగ్ చేస్తారట. వచ్చే వారం ఆదిత్యనాథ్ తొమ్మిది రోజుల ఫాస్ట్ నిర్వహించనున్నారు. మార్చి 28 నుంచి చైత్ర నవరాత్రి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన ఈ దీక్షను చేపడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ దీక్ష సమయంలో యోగి ఆదిత్యనాథ్ కేవలం బంగాళదుంపలను, పండ్లను మాత్రమే స్వీకరిస్తారని చెప్పారు. దీక్షా సమయంలో యోగి ఆదిత్యనాథ్ ఎంతో భక్తితో విశేష్ పూజలో పాల్గొంటారని తెలిపారు. సంస్కృత మహావిద్యాలయ స్కాలర్స్ ఈ పూజను నిర్వహిస్తారని యోగి ఆదిత్యనాథ్ కు అతి సన్నిహితుడు చెప్పారు. మంగళవారం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ ఈ పూజ కోసం వచ్చే వారం గోరఖ్ పూర్ వెళ్లనున్నారు. ఆ సమయంలోనే తొమ్మిది రోజుల దీక్షను చేపడుతున్నారు. అక్టోబర్ లో వచ్చే మరో నవరాత్రులకు గోరఖ్ పూర్ మఠ్ లో వివిధ ప్రార్థనలు, ఏకాగ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు. యోగి ఆదిత్యనాథ్ తన గురువు దగ్గర్నుంచి 1984లో ఈ దీక్షను చేపట్టారట. -
విశ్వాసిని అజేయునిగా చేసే ‘లెంట్’
విశ్వాసి... శరీరం– ఆత్మల, సమన్వయ– సమున్నత కలయిక. ఈ రెండూ భిన్న నియమాలతోనే నడిచినా విశ్వాసిలో దేవుని ప్రతినిధిగా ఉన్న ఆత్మే అతనికి దిశానిర్దేశం చేస్తుంది. అందువల్ల రెండింటి మధ్య సమన్వయ సాధనకు ఉపకరించేదే ఈస్టర్ ఆదివారానికి ముందు భస్మ బుధవారంతో ఆరంభమయ్యే 40 రోజుల ఉపవాస ప్రార్థనా దీక్ష. అదే ‘లెంట్’. యేసుప్రభువు కూడా బాప్తిస్మం తీసుకున్న వెంటనే 40 రోజుల ఉపవాస ప్రార్థనా దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కూడా తరచు ఏకాంత ఉపవాస ప్రార్థనలు చేసి దేవునితో తన అనుబంధాన్ని చాటుకున్నారు. ఆహారం అనేది మనిషి ఎంతో ప్రియంగా ఆస్వాదించే లోకపరమైన అంశం. అలాంటి ఆహారాన్ని సేవించకుండా ఉపవాసానికి పూనుకోవడం ద్వారా విశ్వాసి దేవునికి తనకూ గల అనుబంధం ఎంత ప్రగాఢమైనదో రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ఉపవాసానికి ప్రార్థన కూడా తోడైతే ఆ ప్రక్రియలో విశ్వాసి ఒక అజేయమైన శక్తిగా రూపొందుతాడని యేసుక్రీస్తే వెల్లడించాడు (మార్కు 9:29, మత్తయి 17:21). ఉపవాస ప్రార్థనా దీక్షతో ఉపవాసానికి, ప్రార్థనకు కూడా ప్రాధాన్యతనివ్వకపోతే ఆ దీక్షకు అర్థం, విలువ ఉండదు. యూదు నియమావళి ప్రకారం సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకొని, సూర్యాస్తమయం తర్వాత మళ్లీ ఆహారం సేవించే వరకు దాదాపుగా 12 గంటలపాటు చేసేదే ఉపవాసదీక్ష! శరీరంలోని ద్రావిక సమతుల్యం కోసం అవసరమైన మేరకు నీళ్లు తాగడంలో తప్పు లేదు. వృద్ధులు, మధుమేహం ఉన్నవారు ఒకటి లేదా రెండుసార్లు ఏదైనా ఫలరసాన్ని సేవించడమూ నిషిద్ధం కాదు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కూడా అవసరానికి మించి భోంచేయడం అనేది ఆ దీక్ష ఉద్దేశ్యాన్నే చెరుపుతుందన్నది గమనించాలి. ఈ నలభై రోజుల దీక్షలోనూ ఆహారాన్ని సేవించడంలోనే కాదు అన్ని విషయాల్లోనూ మితంగా వ్యవహరించడం ద్వారా దేవుని మనం ఘనపర్చుతామన్నది గుర్తుంచుకోవాలి. మాంసాహారం యూదు సంస్కృతి ప్రకారం నిషిద్ధం కాకున్నా, శరీరాన్ని అదుపు చేసుకునే ఒక ప్రక్రియ గనుక ‘శాకాహారం’ ఆ ధ్యేయ సాధనకు ఉపకరిస్తుందన్నది కొందరు పెద్దల అభిప్రాయం. ఎవరితోనైనా విభేదాలున్నా, గొడవలున్నా వాటిని సరిచేసుకొని వారితో సంబంధాలు పునరుద్ధరించుకోవడం దీక్షాపరులు చేయవలసిన పని. ఈ నలభై రోజులే కాదు... ఆ తర్వాత కూడా చేతనైనంతగా ఇతరులకు, నిర్భాగ్యులకు సాయం చేయడం దేవుడు మెచ్చే సత్కార్యం తోటివారితో మనం ఎంత సఖ్యతతో వ్యవహరిస్తున్నామనేదే దేవునితో మన అనుబంధం ఎంత ప్రగాఢంగా ఉందనడానికి గీటురాయి అని మర్చిపోరాదు. మొత్తం నలభై రోజులూ దీక్ష చేయగలిగితే మంచిది. అలా కాకున్నా మన పరిస్థితుల మేరకు కొన్ని రోజులైనా దీక్షను నిబద్ధతతో చేయడం మంచిది. దీక్షలో ఉన్న దినంలో అత్యధిక భాగాన్ని దైవ వాక్యధ్యానంలో, ప్రార్థనలో గడపలేకపోతే అది ఉపవాస ప్రార్థనా దీక్ష కాదు. ఉపవాస ప్రార్థనా దీక్ష... దేవుని శక్తి మన జీవితంలోనికి ప్రవేశించే గవాక్షాలను తెరిచి విశాలం చేస్తుంది. అలా మనలోకి ప్రవేశించే దేవుని శక్తి మనలో, కుటుంబంలో ఎన్నో అద్భుతకార్యాలు జరిగేందుకు కారణమవుతుంది. దీక్ష రోజున ఆఫీసులో లేదా మీ మీ పనుల్లో నిమగ్నమై ఉన్నా, విరామ సమయాన్ని ప్రార్థనలో, వాక్యపఠనంలో గడపండి, పదిమందికీ సాయం చేయండి. ఉత్తమ శ్రేణికి చెందిన విశ్వాసిగా, పరిణతి చెందండి. అదే ఉపవాస ప్రార్థనా దీక్ష ఉద్దేశ్యం. – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
అందుకోసం ఏఆర్ రెహమాన్ ఉపవాసం
చెన్నై: జల్లికట్టు కోసం పట్టువీడకుండా పోరాడుతున్న తమిళులకు సెలబ్రిటీల సపోర్ట్ దండుగా లభిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ తాజాగా జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న తమిళులకు మద్దతు తెలిపారు. జల్లికట్టు ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం ఉపవాసం చేస్తున్నట్లు ఏఆర్ రహమాన్ వెల్లడించారు. ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ సైతం జల్లికట్టు కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న యువకులకు సెల్యూట్ అంటూ తన మద్దతు ప్రకటించాడు. I'm fasting tomorrow to support the spirit of Tamilnadu! — A.R.Rahman (@arrahman) 19 January 2017 -
నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు
స్టేషన్‌ఘన్‌పూర్(జనగామ): జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలాన్ని వరంగల్ అర్బన్‌లో కలపాలంటూ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మండలంలోని చిన్నపెండ్యాలలో ఉపేందర్‌రావు అనే నాయకుడు గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. పలువురు ప్రజాప్రతినిధులు నచ్చజెప్పినా వినకపోవటంతో శనివారం ఉదయం పోలీసులు ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. -
'ఆరాధన కేసులో ఈ నెల 24లోపు నివేదిక ఇవ్వాలి'
హైదరాబాద్: ఉపవాస దీక్షతో మృతిచెందిన ఆరాధన కేసు వ్యవహారంపై గురువారం లోకయుక్తలో ఫిర్యాదు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యాపారికి ఇటీవలి కాలంలో తరచూ నష్టాలు వస్తుండటంతో.. కుటుంబ సభ్యుల బలవంతంతో ఆయన పదమూడేళ్ల కూతురు ఆరాధన 68 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి డీహైడ్రేషన్‌కు గురై ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అంశంలో జోక్యం చేసుకున్న బాలల హక్కుల సంఘం లోకయుక్తలో ఫిర్యాదు చేసింది. ఆరాధన మృతికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి ఈ నెల 24 లోపు సమగ్ర నివేదికం అందించాలని నార్త్‌జోన్ డీసీపీకి లోకయుక్త ఆదేశాలు జారీ చేసింది. -
ముగిసిన ఉపవాస ప్రార్థనలు
కోదాడ రూరల్: స్థానిక గాంధీనగర్‌లోని దైవస్వరూపి చర్చిలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉపవాస ప్రార్థనలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా గుంటూరు పట్టణానికి చెంది పాస్టర్ డి.యోహాను బైబిల్ సందేశాన్ని వినిపించారు. ఏసుక్రీస్తు అందరికి ప్రభువు అని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మెలగాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గాయకులు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. వర్షాలు కురవాలంటూ, పంటలు బాగా పండాలంటూ ప్రత్యేక ప్రార్థనలు భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ కలపాల సుధాకర్, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. -
ముద్రగడ భార్యకు శ్వాసలో ఇబ్బందులు
కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టయిన 13 మందిని విడుదల చేయాలన్న డిమాండ్లతో గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి బీపీలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ముద్రగడ వియ్యంకుడు సోమేశ్వరరావు తెలిపారు. సోమవారంతో ముద్రగడ దీక్ష 12వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 10 మందికి బెయిల్ లభించగా, వారిలో 8 మంది మాత్రం జైలు నుంచి విడుదలయ్యారు. మరో ముగ్గురికి ఇంకా బెయిల్ రావాల్సి ఉండగా, ఇద్దరు విడుదల కావాల్సి ఉంది. మరోవైపు.. ముద్రగడ భార్య పద్మావతికి ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది అయిందని సోమేశ్వరరావు చెప్పారు. వారిద్దరికీ తక్షణం మెరుగైన చికిత్స అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం 13 మందినీ విడుదల చేసి, వాళ్లను తన కళ్లెదుట చూపిస్తే తప్ప దీక్ష విరమించే ప్రసక్తి లేదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సోమవారం బెయిల్ వచ్చి మిగిలిన వారిని కూడా విడుదల చేస్తే.. ముద్రగడ దంపతులు కిర్లంపూడికి వెళ్లి అక్కడే దీక్ష విరమించే అవకాశం ఉంది. -
మంత్రి నోట.. మళ్లీ అదే మాట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మళ్లీ అలాగే మాట్లాడారు. ముద్రగడ దీక్ష విషయంలో ఆయనను అనుమానించేలా, ఆయన నిజాయితీని అవమానించేలా మంత్రులు మాట్లాడటం తగదని ఒకవైపు కాపు ప్రముఖులు అందరూ చెబుతున్నా.. ఆయన మాత్రం మళ్లీ అదే పద్ధతిలో మాట్లాడారు. పదోరోజు నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కామినేని అన్నారు. మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ముద్రగడ పద్మనాభం దీక్షను ఎద్దేవా చేశాలా వాళ్ల వ్యాఖ్యలు ఉంటున్నాయని దాసరి నారాయణరావు, చిరంజీవి తదితరులు ఇంతకుముందు విమర్శించారు. మంత్రులు ఇలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని కూడా అన్నారు. అయినా మళ్లీ ఇదే తరహా వ్యాఖ్యలు వస్తుండటం గమనార్హం. -
ముద్రగడకు ఏమైనా అయితే..
► ఆ వర్గం మిమ్మల్ని క్షమిస్తుందా ► పద్మనాభం పట్ల అవమానకరంగా మాట్లాడకండి ► వైద్య నివేదికలపై మంత్రుల వ్యంగ్య వ్యాఖ్యలు తగవు ► కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు వద్దు ► వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ హైదరాబాద్ కాపు రిజర్వేషన్ల సాధన, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో 9 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్ల రాష్ట్ర మంత్రులు అవమానకరంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లుగా దీక్ష చేస్తున్నా ఆయన వైద్య నివేదికలు సాధారణంగానే ఉన్నాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఏకంగా అవసరమైతే ముద్రగడను సైతం అరెస్టు చేస్తామంటున్నారని.. వీళ్లంతా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు, అధికారులు ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు దీక్షకు కూర్చున్న రెండు గంటలకే ఆయనను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారని, ఆ సందర్భంలో ఆయన కుటుంబసభ్యుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించారని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయకూడదని హితవు పలికారు. జరగకూడనిది ఏమైనా జరిగితే అసలు ఆ వర్గం మిమ్మల్ని క్షమిస్తుందా అని బొత్స ప్రశ్నించారు. మీకు ఎవరిమీద, ఎందుకు ఈ కక్ష ఉందని నిలదీశారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోమంటే ప్రాంతాల మధ్య, కులాల మధ్య తగువు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీశారు. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ ప్రయోజనాల కోసం చూసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయొద్దని.. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలని, దీన్ని పోలీసు రాజ్యం చేయొద్దని అన్నారు. సమాజంలో ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్లకు ఇవ్వాలని, మీ గౌరవం మీరు పుచ్చుకోవాలని తెలిపారు. 67 సంవత్సరాలున్న ఆయన ప్రాణానికి హాని తలపెట్టకుండా ఆయన పూర్తిగా కోలుకునేలా సమస్యను పరిష్కరించాలన్నారు. అధికారులు ఆ కుటుంబం పట్ల అవమానకరంగా ప్రవర్తించారని, అందుకుగాను ఆ కుటుంబానికి సమాధానం చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. -
నాన్న దీక్ష కొనసాగుతుంది: ముద్రగడ బాలు
తన తండ్రి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షను కొనసాగిస్తారని ఆయన కుమారుడు బాలు మీడియాకు తెలిపారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తన తండ్రి రక్త నమూనాలను పరీక్ష కోసం ఇచ్చారని, ఒక్క సెలైన్ బాటిల్ మాత్రమే ఎక్కించారు తప్ప ఐవీ ఫ్లూయిడ్లు కొనసాగించడం లేదని ఆయన చెప్పారు. తుని ఘటనపై అరెస్టులు ఆపేయాలని, కేసులపై పునఃసమీక్ష జరగాలని పద్మనాభం డిమాండ్ చేస్తున్నారన్నారు. అరెస్టయిన 13 మందిని బెయిల్ మీద విడుదల చేసి, ముద్రగడతో పాటు అందరినీ కిర్లంపూడికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఇది ఎప్పుడు జరుగుతుందనేది ప్రభుత్వం చేతుల్లోనే ఉందని బాలు తెలిపారు. -
ముద్రగడకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం
ఆయన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూల స్పందన తూర్పుగోదావరి కలెక్టర్, విశాఖ రేంజి డీఐజీల వెల్లడి రాజమండ్రి కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభానికి ప్రస్తుతం ఐవీ ఫ్లూయిడ్లు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, విశాఖ రేంజి డీఐజీ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపామని, తుని ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కలెక్టర్ అరుణ్ కుమార్, డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటివరకు తుని ఘటనలో అరెస్టు చేసిన 13 మందికి బెయిల్ ఇప్పించేందుకు ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తోందని అన్నారు. అయితే ఈ విషయమై కాపు జేఏసీ వైపు నుంచి గానీ, ముద్రగడ కుటుంబ సభ్యుల వైపు నుంచి గానీ ఎలాంటి సమాచారం లేదు. -
ముద్రగడ దీక్ష కొనసాగుతుంది: కాపు జేఏసీ
కాపు రిజర్వేషన్ల సాధన కోసం, తుని ఘటనలో అరెస్టయిన వారిని విడిపించాలన్న లక్ష్యతో గత ఏడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తన దీక్షను కొనసాగిస్తారని కాపు జేఏసీ నేతలు తెలిపారు. ఆయన కేవలం తన రక్త నమూనాలు ఇచ్చేందుకు మాత్రమే అంగీకరించారని.. అంతేతప్ప ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు అనుమతించలేదని చెప్పారు. కాగా, అంతకుముందు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి, ఫ్లూయిడ్స్ ఎక్కించుకోడానికి ముద్రగడ పద్మనాభం అంగీకరించారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. కాపునేతలతో చర్చలు సఫలం అవుతాయని ఆశిస్తున్నామని, ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. అయితే.. ఎమ్మెల్యే ఆకుల వ్యాఖ్యలను కాపు జేఏసీ నేతలు ఖండించినట్లయింది. ముద్రగడ పద్మనాభం ఫ్లూయిడ్స్ ఎక్కించుకోడానికి అనుమతించలేదని కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. -
రంజాన్ ప్రారంభం
► మసీదుల్లో ఏర్పాట్లు పూర్తి ►నేటి నుంచి ఉపవాసదీక్షలు ►నెలంతా తరావీహ్ ►పగలు ఉపవాసం.. రాత్రి ప్రత్యేక ప్రార్థనలు సాక్షి, మంచిర్యాల : ముస్లింల పవిత్ర రమజాన్ మాసం ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని మసీదుల్లో... సోమవారం రాత్రి నుంచి ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు(తరావీహ్) ప్రారంభమయ్యాయి. నెల పొడవునా ఇవి కొనసాగుతాయి. నేటి నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతారుు. సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు నెల మొత్తం కఠిన ఉపవాసం, రాత్రి ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింలు అల్లాహ్‌కు దగ్గరవుతారు. ప్రార్థనల కోసం వచ్చే ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు తరావీహ్‌లో ఖురాన్ విని.. పగలు దీక్షలో మంచి కార్యాలు చేయాలని ఇస్లాం ప్రబోధిస్తుంది. ఉపవాస దీక్ష చేపట్టే వారిపై అల్లాహ్ కరుణ ఎల్లవేళలా ఉంటుంది. ‘ బాలిగ్’ అయిన ప్రతి ముస్లిం యువతీ, యువకులు ఈ దీక్షలు చేపట్టడం తప్పనిసరి. ఈ నెలలో.. ఒక పుణ్యకార్యం చేస్తే అల్లాహ్ 70 పుణ్యకార్యాలు చేసినంత పుణ్యం ప్రసాదిస్తారు. ఒక సున్నత్ కార్యం చేపడితే ఒక ఫర్జ్‌కు తగ్గ పుణ్యం లభిస్తుంది. అదే ఒక నఫీల్ కార్యానికి అల్లాహ్ సున్నత్‌కు తగ్గ ప్రతిఫలం అందజేస్తారు. అబద్దాలాడడం.. చాడీలు చెప్పడం.. ఇతరులపై ద్వేషం పెంచుకోవడం.. తగువులాడడం.. ఈ నెలలో నిషిద్ధం. మనిషిలో ఉన్న చెడు అలవాట్లు.. దుర్గుణాలు పారద్రోలేందుకు అల్లాహ్ ఈ నెలను ప్రసాదిస్తారు. ఉపవాస దీక్షలు.. మంచి నడవడికతో మనిషిలో సహనం ఏర్పడుతుంది. సహనాన్ని పాటించిన వ్యక్తికి స్వర్గంలో చోటు కల్పిస్తానని అల్లాహ్ పవిత్ర ఖురాన్లో చెప్పారు. ఈ నెలలో ముస్లింలు ముఖ్యంగా పేదల సంక్షేమంపై దృష్టి సారిస్తారు. అన్న, వస్త్ర.. డబ్బుల వంటి దానధర్మాలు చేపడతారు. దీక్ష విరమణ సమయంలో ఇఫ్తార్ విందులు.. ఉదయం 4గంటల ప్రాంతంలో సహర్ విందులు ఏర్పాటు చేసి అల్లాహ్ కృపకు పాత్రులయ్యేందుకు ముస్లింలు ప్రయత్నిస్తారు. షవ్వాల్(రమజాన్ తర్వాత నెల)కు ఒక రోజు ముందు ముస్లింలు రమజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. -
డయాబెటిస్ కంట్రోల్‌కు డజన్ సూత్రాలు
నేడు ప్రపంచ ఆరోగ్య దినం ఆరోగ్యం ఒక నిధి. పెంచుకోవాల్సిన పెన్నిధి. కానీ మనం జీవితపు రేస్‌లో... మన పరుగెడుతున్న పేస్‌తో అనుకోకుండానే కొన్ని ఆధునికతలను అలవరచుకోవాల్సి వస్తోంది. ఆ ఆధునీకరణతో ఒరిగే అనుకూలతలుంటాయి. జరిగే అనర్థాలుంటాయి. నగరీకరణతో పెరిగే సౌకర్యాలుంటాయి. తరిగే ఆరోగ్యాలూ ఉంటాయి. నగరాల్లో విస్తరిస్తున్న సత్వరాహారంలో సమకూరే రుచి ఉంటుంది. హాని కూడా ఉంటుంది. మేలు పక్కనే క్రీనీడలా కీడు ఉంటుంది. ఆధునీకరణతో అపాయాలు ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నాయి. డయాబెటిస్ రూపంలో అన్ని అవయవాలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆరోగ్య నిధిని కాపాడుకోడానికి కొన్ని మంచి అలవాట్లు పెంచకుంటే ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దిన నినాదమైన ‘బీట్ డయాబెటిస్’ను అనుసరించినట్లవుతుంది. మీకు డయాబెటిస్ ఉందా. అయితే మీకు కొన్ని చిన్న చిన్న సూచనలు. దాంతో పెద్ద పెద్ద ఫలితాలు. తప్పకుండా కనిపించే సాఫల్యాలు. టక్కున అనుసరిస్తూ చిక్కులు తొలగించుకునే తేలిక మార్గాలివి. ఇవి మీకోసం, మిమ్మల్ని డయాబెటిస్ ముప్పు నుంచి దూరం చేయడం కోసం. 1ఫాస్టింగ్ వద్దు... ఫీస్టింగ్ వద్దు... మనం ఆహారం తీసుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సుదీర్ఘకాలం పాటు జీర్ణకోశానికి ఆహారం అందకుండా ఉంచడం మంచిది కాదు. అలాగని ఒకేసారి ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడమూ సరికాదు. అందుకే గుర్తుపెట్టుకోండి. డయాబెటిస్ ఉంటే ఉపవాసాలూ (ఫాస్టింగ్) మంచివి కావు. అలాగని విందుభోజనాలూ (ఫీస్టింగ్) వద్దు. మితంగా ఎక్కువసార్లు తింటూ ఉండటమే మేలు. 2 ఏరోబిక్స్... ఆరోగ్యానికి బ్రిక్స్: ఆరోగ్య నిర్మాణం కోసం అవసరమైన బ్రిక్స్ ఏరోబిక్స్ అని గ్రహిస్తే వ్యాయామం ఆహ్లాదంగా ఉంటుంది. క్రమం తప్పకుండా చేసే వ్యాయామంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మరీ భారం కాకుండా ఉండేవీ, మరీ తేలికపాటివి కాకుండా కాస్తంత శరీరానికి కాస్తంత శ్రమ కలిగేలా ఉండే వ్యాయమాలు మేలు. రోజూ 30 నిమిషాల చొప్పున కనీసం ఐదు రోజులు చాలు. 3 ఒత్తిడితో పొత్తు వద్దు... ఒత్తిడితో చెలిమి అంటే డయాబెటిస్తో కలిమి అని గుర్తుంచుకోండి. అందుకే ధ్యానం, ఆహ్లాదకరమైన సంగీతం, క్రమం తప్పక చేసే యోగా, వీలైతే తాయ్‌చీ వంటి మార్గాలతో ఒత్తిడిని దాన్ని చిత్తు చేయడమే మంచిదని అని గ్రహించండి. మెడిటేషన్ లాంటి రిలాక్సేషన్ మేలు అని జ్ఞాపకముంచుకోండి. 4 పొగ గరళంతో మధుమేహం సిగరెట్స్పైన ఉండే తెల్లటి గుండ్రటి కాగితాన్ని చూడకండి. దాని మాటున నల్లటి పొగాకును చూడండి. మామూలు వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు 30 నుంచి 40 శాతం వరకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆరోగ్యం పొగచూరిపోవడంతో పాటు డయాబెటిస్‌ను పొగ మరింతగా రగిలిస్తుంది జాగ్రత్త. 5 మధువుతోనూ మధుమేహం ఇక ఆల్కహాల్‌తోనూ అంతే ముప్పు. అందుకే పరిమితికి మించిన మధుపానం కూడా మధుమేహాన్ని కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యాన్ని కనిపెట్టుకోండి. 6 రెగ్యులర్ చెక్‌తో చక్కెరకు చెక్ క్రమం తప్పకుండా మన రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను పరీక్షించుకుంటూ ఉండాలి. అవి అదుపులో ఉంటున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండటం వల్ల పెరిగే చక్కెరపాళ్లకూ చెక్ పెట్టవచ్చు. అది స్వయంగా చెక్ చేసుకోవాలి. అలాగే హెచ్‌బీఏ1సీ అనే పరీక్షతో మూడు నెలలకోసారి చేయించుకోవాలి. 7 విటమిన్ డితో డయాబెటిస్‌పై ఢీ మనం తీసుకునే ఆహారంలో విటమిన్-డి ఎక్కువగా ఉంటే అది ఇన్సులిన్ యాక్షన్‌ను మరింత పెంచుతుంది. డయాబెటిన్పై అంకుశం ఉంచుతుంది. అంటే విటమిన్-డి తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను ఢీ కొట్టవచ్చు. రవి నుంచి లభించే ఈ ‘డీ’ విటమిన్ డయాబెటిస్‌కు మాత్రమే కాదు... అన్ని రోగాల పట్ల ‘రవి’డీ! 8 అదే వేళకు అదే డోస్... రోగుల పాలిట హ్యాపీ డేస్: డయాబెటిస్ రోగులు రోజూ మందులు తీసుకోవాల్సిందే. అయితే రోజూ డాక్టర్ సూచించిన మోతాదులోనే క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా అవసరం. వేళకు మందులు తీసుకోవాలి. మిస్ కొట్టడానికి సాకులు మానుకోవాలి. 9 అదనపు బరువు... ఆరోగ్యానికి చెరుపు: ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా పెరుగుతుండే ప్రతి కేజీతో పేచీ వచ్చిపడుతుంది. అది సమస్యను తెచ్చిపెడుతుంటుంది. అందుకే అదనపు బరువు ఆరోగ్యానికి చెరుపు అని గుర్తుంచుకోండి. బరువు తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి. 10 అతి నియంత్రణతో అసలుకే మోసం ఒక్కోసారి మరింత ఎక్కువ నియంత్రణతో పాటిస్తే శరీరంలో అవసరమైన దాని కంటే చక్కెర పాళ్లు మరింత తక్కువకు పడిపోవయచ్చు. నిస్సత్తువగా, నీరసంగా అయిపోవచ్చు. దీన్నే హైపోగ్లైసిమిక్ కండిషన్ అంటారు. ఈ కండిషన్‌కు లోనుకాకుండా చూసుకోవాలి. అసలుకే మోసం రాకుండా చూసుకోవాలి. 11 అన్ని అవయవాలకు అపాయాలు డయాబెటిస్ ఉందంటే అన్ని అవయవాలూ దాని పాలబడే ప్రమాదం ఉంది. చక్కెర ఉందంటే కళ్లు, కిడ్నీలు, నరాలు, పాదాలు ఇలా అన్నింటికీ అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అందుకే మెదడు మొదలుకొని పాదాల వరకూ అన్ని అవయవాల విషయంలో అప్రమత్తత అవసరం. 12 టీకా డయాబెటిస్ ఉందంటే మీ డాక్టర్ చెప్పిన విధంగా ఫ్లూ టీకా తీసుకోండి. ఆ షాట్‌తో నిర్భయంగా ఉండవచ్చు. నిశ్చింతగా మెలగవచ్చు.