ఫీజు రీయియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్: ఫీజు రీయియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ నెల రోజుల కిందట 866 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని ప్రకటించినా ఇప్పటిదాకా ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోనే పెట్టుకుందని ఆయన విమర్శించారు. హడావిడిగా తెచ్చిన ఫాస్ట్ పథకాన్ని అంతే ఫాస్ట్‌గా ఉపసంహరించుకుందని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఇష్టారాజ్యంగా ఆస్తిపన్ను వసూలు చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. దీనికి నిరసనగా ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు.