Fee payment
-
కార్లకు ‘టోల్’ పాస్‌లు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్ గేట్ ఫీజుల చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కొత్త విధివిధానాలను రూపొందించింది. ప్రధానంగా ప్రైవేటు కార్ల యజమానులకు టోల్ ఫీజుల పాస్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేటు కార్ల యజమానులకు సౌలభ్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అన్ లిమిటెడ్ యూసేజ్ (అపరివిుత వినియోగం) ప్రాతిపదికన టోల్ ఫీజు పాస్‌లను రెండు కేటగిరీలుగా జారీ చేసే ముసాయిదాను ఎన్హెచ్ఏఐ తాజాగా ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం ద్వారానే పాస్‌ల విధానాన్ని అమల్లోకి తెస్తారు. వార్షిక టోల్ ఫీజు పాస్, లైఫ్‌టైమ్ పాస్ (15ఏళ్లు)లను అందుబాటులోకి తేనుంది. వార్షిక పాస్ రూ.3 వేలు, లైఫ్‌టైమ్ (15ఏళ్లు) పాస్‌ను రూ.30 వేలుగా నిర్ణయించింది. వార్షిక పాస్ తీసుకుంటే జాతీయ రహదారులపై టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏడాదిలో ఎన్ని సారై్లనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇక లైఫ్‌టైమ్ పాస్ తీసుకుంటే ఆ వాహన జీవిత కాలం అంటే గరిష్టంగా 15ఏళ్ల పాటు టోల్ ఫీజు చెల్లించకుండా జాతీయ రహదారులపై ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం టోల్ గేట్లకు సమీపంలో ఉన్న గ్రామాల వారికి ఆ ఒక్క టోల్ గేటు వరకు పాస్‌ల విధానాన్ని అమలు చేస్తోంది. అందుకోసం ఆ గ్రామాల ప్రజలు తమ అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పిస్తే నెలకు రూ.340 పాస్‌ను జారీ చేస్తోంది. అంటే ఏడాదికి రూ.4,080 అవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఏడాదిపాటు టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి రూ.3 వేలకే పాస్ అన్నది అత్యంత సమంజసమైనదిగా ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి. 2023–24లో టోల్‌ఫీజుల రూపంలో రూ.55వేల కోట్లు వసూలయ్యాయి. వాటిలో ప్రైవేటు కార్ల వాటా రూ.8 వేల కోట్లు మాత్రమే. కాబట్టి ప్రైవేటు కార్లకు వార్షిక, లైఫ్‌టైమ్ టోల్ ఫీజు పాస్‌ల జారీతో రాబడిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించదని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. టోల్ ఫీజుల పాస్‌ల జారీ కోసం ఎన్హెచ్ఏఐ రూపొందించిన ముసాయిదాపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. -
‘నారాయణ’ ఫీ‘జులుం’కి విద్యార్థి బలి..
అనంతపురం ఎడ్యుకేషన్/సాక్షి, అమరావతి: నారాయణ కళాశాలల ధన దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఫీజులు చెల్లించకపోతే కళాశాలలోకి అనుమతించకుండా గంటల తరబడి బయటే నిలబెట్టడంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆ తర్వాత కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురువారం అనంతపురంలో చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన చరణ్ అనంతపురం నగర శివారు సోములదొడ్డి సమీపంలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం గురువారం చరణ్‌ను తన సోదరుడు కళాశాలలో విడిచిపెట్టాడు. ఈ సమయంలో ఫీజు బకాయి మొత్తం చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. చరణ్ సోదరుడు సర్దిచెప్పి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో.. మూడో అంతస్తులోని తరగతి గదిలో ఉన్న చరణ్ అధ్యాపకుడి ముందునుంచే ఒక్కసారిగా బయటకొచ్చి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం చరణ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. రక్తమోడిన ప్రాంతమంతా ఎవరూ రాకుండానే హడావుడిగా శుభ్రం చేసేశారు. కాలేజీ యాజమాన్యం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపా«ద్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్, నగర అధ్యక్షుడు కైలాష్‌తో పాటు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్ద ఆందోళన చేశారు. అలాగే, ఈ ఘటనపై విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేసింది. -
‘రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు?.. రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, చంద్రబాబు హయాంలో మళ్ళీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు.వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మళ్లీ ప్రైవేటు కాలేజీల వేధింపులు పెరిగాయి. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే బయటకు నెట్టేస్తున్నాయి. శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక విద్యార్థిని బయటకు నెట్టింది. తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశాడు. విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నాం. మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?. రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?.ఫీజుల మానిటరింగ్ కమిటీ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఫీజుల పేరుతో వేధింపులనేవే జరగలేదు. చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో నారాయణ సంస్థ సిబ్బందిని నియమించటం సిగ్గుచేటు. ఫీజుల గురించి వేధిస్తే వైఎస్సార్సీపీ హయాంలో బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయటం లేదు?. విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి.కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలపై విచారణ జరపాలి. ఆ సంస్థలు పుస్తకాల ఫీజే రూ.18వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.50ల ఐడీ కార్డుకు రూ.400 వసూలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ చర్యలపై ఉద్యమిస్తాం. నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లోని సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వటం లేదు. పని భారంతో వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తూ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వటం లేదు’ అని ఆరోపించారు. -
ఉపాధి కల్పనలో గేమ్ ఛేంజర్!
మన సంప్రదాయ విద్యావ్యవస్థ తయారు చేస్తున్న విద్యావంతులు నైపుణ్యాల లేమితో కునారిల్లుతున్నారు. ఒకవైపు ఏటికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే... మరోవైపు పరిశ్రమలు నైపుణ్యం గలవారు దొరక్క సమస్యల నెదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని స్థాపించింది. విద్యా సంస్థలు– పరిశ్రమల సమన్వయం ఆధారంగా ఇది పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. మొత్తం మీద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కాని లాంటి దార్శనిక సంస్థ ఇది. భారతదేశం ఇప్పుడు ఓ పరివర్తన దశలో ఉంది. నవ నవోన్మేషంతో ఉరకలెత్తే యువత అభివృద్ధిలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఒకపక్క ఉంటే... నిరు ద్యోగం మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఉండటం, నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల కోసం కర్మాగారాలు సమస్యలను ఎదుర్కో వడం ఇంకో పక్కన ఉన్నాయి. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ’ని స్థాపించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ సవాలును ఎదు ర్కొనేందుకు సిద్ధమైంది. దేశంలో మునుపెన్నడూ లేని చందంగా విద్య, ఉపాధుల మధ్య వారధిగా నిలవడంతోపాటు... రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కానిలాంటి దార్శనిక సంస్థ ఇది. నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను అందించి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ వర్సిటీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఎందుకంటే... ఇక్కడ పరిశ్రమలే తమకు అవసరమైన నైపు ణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి కార్మికులుగా, ఉద్యోగులుగా, ఇంజ నీర్లుగా ఉద్యోగాలిస్తాయి.దేశంలో ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులు అవు తున్నారు. పట్టభద్రుల్లో 47 శాతం మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేని కారణంగా ఉద్యోగార్హత లేదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ఏటా రెండు లక్షల మంది ఇంజినీర్లు, మరో రెండు లక్షల మంది సాధారణ డిగ్రీలు, ఐటీఐ, డిప్లోమా కోర్సులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తు సంప్రదాయ విద్యా వ్యవస్థలో సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా ఈ వ్యవస్థ నుంచి బయ టకు వచ్చేవారికి నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడం కష్టసాధ్య మవుతోంది. పాతబడిపోయిన పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ ట్రెయినింగ్ తక్కువగా ఉండటం, సాఫ్ట్ స్కిల్స్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి... నైపుణ్యాల కొరతను ఎక్కువ చేశాయి. ఐటీ, ఉత్పాదన, ఆరోగ్య రంగం, సంప్రదాయేతర విద్యుత్తు... ఇలా ఏ రంగం తీసు కున్నా చాలామంది తాజా పట్టభద్రుల్లో నైపుణ్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఓ విచిత్రమైన ద్వైదీభావం ఏర్పడుతోంది. విద్యార్థులేమో ఉద్యోగాల కోసం... పరిశ్రమల వారేమో శిక్షణ, తగిన నైపుణ్యాలున్న వారి కోసం నిత్యం వెతుకుతూనే ఉన్న పరిస్థితి ఉంది. అందుకే నైపుణ్యాలే కేంద్ర బిందువుగా ఉండే విద్యా వ్యవస్థలోభాగంగా పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను ప్రోదిచేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీ దేశంలోనే మొట్ట మొదటిది మాత్రమే కాదు, విప్లవాత్మకమైంది కూడా. నిరుద్యోగ యువత సాధికారత కోసం ఉద్దే శించింది. వివిధ రంగాల్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఆధునిక టెక్నాలజీలను నిజ జీవిత పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా ట్రెయినింగ్ ఇస్తారు. తద్వారా విద్యార్థులు కేవలం పట్టభద్రుల్లా కాకుండా... అసలైన వృత్తి నిపుణుల్లా తయారవుతారు. విద్యా సంస్థలు, పరిశ్రమల సమన్వయం ఆధారంగానే ఈ వర్సిటీ పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. అది కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల వంటి అత్యాధునిక టెక్నాలజీరంగాల్లో! పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా బోధనాంశాలను రూపొందించడం వల్ల తెలంగాణ విద్యార్థులకు డిమాండ్ పెరుగుతుంది. మంచి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. వీరంతా ఉద్యోగాల్లో స్థిరపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించిన వారవుతారు. ఈ ఏడాది నవంబరు 4న ఏడు కోర్సులతో అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే తయారీ, సేవా రంగాలకు చెందిన 18 అంశాల్లో కోర్సులు ఉంటాయి. వర్సిటీ నిర్మాణం కోసం ముచ్చెర్ల వద్ద ‘నెట్‌జీరో సిటీ’లో 150 ఎకరాల స్థలం కేటాయించాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 200 కోట్లతో వర్సిటీ నిర్మాణాన్ని చేపట్టింది. దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు కూడా. ఆనంద్ మహింద్రా నాయకత్వం, దార్శనికతలు ఈ విశ్వవిద్యాలయాన్ని నైపుణ్యాభివృద్ధి విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాయనడంలో సందేహం లేదు. మరో పక్క రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐల ఆధునికీకరణ కూడా చేపట్టాం. అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ సెంటర్లుగా వీటిని ఇప్పటికే అప్ గ్రేడ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇకపై ఈ సెంటర్లు స్కిల్స్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్నిఅందిస్తూ... ప్రస్తుతం పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణఅందిస్తాయి. ఈ ఆధునికీకరణ కారణంగా నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణలో ఒక సమగ్రమైన ప్రతిభావంతుల వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పరిశ్రమలు కూడా పాలుపంచు కునేలా చేస్తున్నాం. తద్వారా వారు తమకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చుకునే వీలేర్పడుతుంది. అంటే పరిశ్రమలే తమకు అవసర మైన మానవ వనరులను తయారు చేసుకుంటాయన్నమాట. ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సుల ద్వారా పరిశ్రమల అవసరాల న్నింటినీ వర్సిటీ తీరుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వం వంటి సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఇస్తుండటం వల్ల పరిశ్రమలకు అన్ని నైపుణ్యాలున్న మానవ వనరులు లభిస్తాయి. యువత సొంతంగా పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రోత్సహించేందుకు కూడా ఈ వర్సిటీ చర్యలు తీసుకుంటుంది. ఉపాధి అవకాశాల్లో గేమ్ ఛేంజర్స్కిల్స్ యూనివర్సిటీ ఉద్యోగ ప్రపంచంపై చూపే ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ చేయలేం. ఆధునిక నైపుణ్య శిక్షణకు వాస్తవిక విద్య కూడా తోడవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ఇదో మేలిమి సాధనంగా మారనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు లక్షల్లో ఉంటే ఖాళీలు వేలల్లో మాత్రమే ఉంటా యన్నది తెలిసిన విషయమే. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు ఉన్న అవకాశం 0.1 నుంచి ఒక శాతం మాత్రమే అన్నమాట. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాల అవసరాన్ని ఈ అంకెలే చెబు తున్నాయి. ప్రైవేట్ రంగంలో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగ అవ కాశాలు మెండు. అందుకే తెలంగాణ ప్రభుత్వపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికి ఒక మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పడం! స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సులు రెండు వేల మందితో మొద లవుతాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య పదివేలకు చేరుతుంది. క్రమంగా ఇది 30 వేలకు చేరుతుంది. యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్త య్యేంత వరకు గచ్చిబౌలిలోని ‘ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ఇండియా’ (ఈఎస్సీఐ), హైటెక్ సిటీలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ ప్రాంగణాల్లో ప్రస్తుతం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వర్సిటీ ఫీజుల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారందరికీ ఫీజుల్లో రాయితీ ఉంటుంది. వర్సిటీ కార్యకలాపాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇది ప్రారంభమే కాదు... ఉపాధి విప్లవానికి రాచబాట!- వ్యాసకర్త తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి- దుద్దిళ్ల శ్రీధర్ బాబు -
ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!
అక్షరాల రూ.4.27 లక్షలు. ఇదేదో వార్షికవేతనం అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎడ్యుకేషన్ ఫీజు. ‘అందులో ఏముంది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో అంత అవుతుంది కదా’ అంటారా. ఇది కేవలం ఒకటో తరగతిలో చేరడానికి కావాల్సిన ఫీజు. అవును.. మీరు విన్నది నిజమే. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో తన కూతురు ఒకటో తరగతి స్కూల్ ఫీజును రాషబ్ జైన్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దాంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది.‘నా కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1లో చేరుతుంది. అందుకోసం మా నగరంలో ప్రముఖ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించాం. ఆ స్కూల్ ఫీజు చూసి షాకయ్యాను. ఇతర స్కూళ్లలోనూ సుమారు ఇదే తరహా ఫీజు ఉంది. ఈ స్కూల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు: రూ.2,000, అడ్మిషన్ ఫీజు: రూ.40,000, కాషన్ మనీ (వాపసు): రూ.5,000, వార్షిక పాఠశాల ఫీజు: రూ.2,52,000, బస్ ఛార్జీలు: రూ.1,08,000, పుస్తకాలు, యూనిఫాం: రూ.20,000, మొత్తం రూ.4,27,000! ఇది భారతదేశంలో నాణ్యమైన విద్య ధర. మీరు ఏటా రూ.20 లక్షలు సంపాదించినా దీన్ని భరించలేరేమో’‘మీరు నెలకు 2000 డాలర్లు(రూ.1.68 లక్షలు) సంపాదిస్తే అందులో ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్డు పన్ను, టోల్ ట్యాక్స్, ఫ్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్, ల్యాండ్ రిజిస్ట్రీ ఛార్జీలు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. దానికితోడు టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రీమియంలు, వృద్ధాప్య పెన్షన్ కోసం పీఎఫ్, ఎన్పీఎస్ చెల్లించాలి. రూ.20 లక్షల ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేరు. ఎలాంటి ఉచితాలు లేదా రుణ మాఫీలు పొందలేరు. అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఫుడ్, బట్టలు, అద్దె, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు.. దేనిపై ఖర్చు చేయాలో నిర్ణయించుకోండి’ అంటూ పోస్ట్ చేశారు.Good education is a luxury - which middle class can not affordMy daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.- Registration Charges: ₹2,000-… pic.twitter.com/TvLql7mhOZ— RJ - Rishabh Jain (@rishsamjain) November 17, 2024ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..ఈ పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫీజు ఇలాగే కొనసాగితే 12 సంవత్సరాలలో దాదాపు రూ.కోటి-1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉటుంది. మధ్యతరగతి వారు ఇంత అధిక ఫీజులను భరించలేరు. ఇది తీవ్రమైన సమస్య. దీనిపై ప్రభుత్వ నియంత్రణ అవసరం’ అని రిప్లై ఇస్తున్నారు. -
28 నుంచి పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. 2024–25లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చేనెల 11 వరకు ఫీజు చెల్లించాలని ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ నామినల్ రోల్స్‌ను సైతం ఈ తేదీల్లోనే సమర్పించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 18 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.500 లేట్ ఫీజుతో నవంబర్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఫీజును bse.ap.gov.inలో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శిక్షణ, ఉపాధిపై వర్క్షాప్సాక్షి, అమరావతి: యువతకు శిక్షణ ఇచ్చి, మెరుగైన ఉపాధి అందించేలా ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడాప్) కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఎనిమిది సెక్టార్ల వారితో సీడాప్ కార్యాలయంలో శుక్రవారం యువతకు శిక్షణ, ఉపాధిపై వర్క్‌షాప్ జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించే వారికి స్కిల్డ్ యువతను అందిస్తామని ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి తెలిపారు. -
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల కట్టడి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, వాటి నిర్వహణ తీరును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పడిపోవడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం–2020 అమలు వల్ల జరిగే ప్రయోజనాలు, సవాళ్లను సమగ్రంగా విశ్లేషించాలని సూచించింది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపు దిశగా సరికొత్త మార్గాన్వేషణ చేయాల్సిన అవసరాన్ని విద్యాశాఖ ముందుంచింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం విద్యారంగంలో సంస్కరణలపై బుధవారం సమగ్రంగా చర్చించింది. సబ్æ కమిటీ సభ్యురాలు మంత్రి సీతక్క ఈ సమీక్షలో పాల్గొన్నారు. కోచింగ్ కేంద్రాలపై నియంత్రణ పలు రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలపై నియంత్రణ అవసరమని, అభ్యర్థుల భద్రత, ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను కోరారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచితే, పేదలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లరని, ఈ దిశగా ఎక్కడ లోపం ఉందో అన్వేíÙంచాలని మంత్రి అధికారులకు సూచించారు. మానవ వనరులు వృ«థా అవ్వకుండా అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను విలీనం చేసే అంశంపై అధ్యయనం చేయాలని విద్యాశాఖకు మంత్రి వర్గ ఉప సంఘం సూచించింది. ప్రమాణాలు తగ్గడంపై ఆందోళన రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు తగ్గడంపై ఉప సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా ప్రమాణా ల్లో రాష్ట్రం 34వ స్థానంలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సుల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. మాసబ్‌ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశాలను 5, 6 తరగతుల పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు ఎందుకు వెళ్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. -
ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫీజు పెంపు
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ రాష్ట్రాల వారీగా ప్రారంభమయ్యింది. జాతీయ స్థాయిలో ఆగస్టు 14న ఇది ప్రారంభం కానుంది. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేయాలంటే భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.పంజాబ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ కోర్సు ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. అడ్మిషన్లను నియంత్రించేందుకే మెడికల్ ఫీజులను ఐదు శాతం మేరకు పెంచినట్లు అధికారిక నోటిఫికేషన్లో తెలియజేశారు.బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో 1,550 సీట్లలో ప్రవేశాలు ఉంటాయని, వీటిలో 750 సీట్లు రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీలలో, 800 సీట్లు మైనారిటీ రాష్ట్రాల్లోని నాలుగు ప్రైవేట్, రెండు మెడికల్ ఇన్స్టిట్యూట్లలో ఉన్నాయనిమెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ తెలిపింది. పంజాబ్‌లో ఇప్పటికే నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం అమృత్సర్, ఫరీద్కోట్, పటియాలా, మొహాలీలలోని నాలుగు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజును రూ.9.50 లక్షలకు పెంచారు. గతంలో ఇక్కడ ఫీజు రూ.9.05 లక్షలుగా ఉండేది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని అన్ని మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఎంబీబీఎస్ కోర్సుకు గతంలో రూ.55.28 లక్షలుగా ఉన్న పూర్తి ఫీజును రూ.58.02 లక్షలు చేశారు. కాగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ కోటాలోని ఎంబీబీఎస్ సీట్ల ఫీజు గతంలో రూ.21.48 లక్షలుగా ఉండగా, దానిని ఇప్పుటు రూ.22.54 లక్షలకు పెంచారు. -
బీబీఏ, బీసీఏ కోర్సు కనీస ఫీజు రూ.18 వేలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏడాదికి కనీస ఫీజును రూ.18 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుమారు 35 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ డిగ్రీ కోర్సులు తొలిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గరిష్ట ఫీజు రూ.30 వేలుగా నిర్ణయించారు. వాస్తవానికి బీబీఏ, బీసీఏ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి రావడంతో డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాగా, రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ రెండు సార్లు వాయిదా పడింది. అయితే ఏఐసీటీఈ బీబీఏ, బీసీఏ కోర్సులు కోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్ కళాశాలలు అనుమతివ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తొలిసారిగా ఫీజులు నిర్ణయించడంలో డిగ్రీ అడ్మిషన్లు అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. గురువారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకుంటున్నారు. 5వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించగా.. 6వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. 10వ తేదీన డిగ్రీ సీట్లు కేటాయింపు చేపట్టి 12వ తేదీ తరగతులు ప్రారంభించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 16వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 1.63 లక్షల దరఖాస్తులు ఏపీలోని డిగ్రీ కోర్సుల్లో మొత్తం 3.50 లక్షల సీట్లుండగా.. ఏటా 50 శాతం లోపు సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ ఏడాది 1.63 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల బీబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్ పెరగడంతోనే ఇంజనీరింగ్ కాలేజీలు సైతం ఈ కోర్సులను ప్రవేశపెట్టడం గమనార్హం. వీటితో పాటు మొత్తం డిగ్రీ కాలేజీల్లో దాదాపు 800 కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
Supreme Court: లాయర్లుగా ఎన్రోల్కు అంత ఫీజా?
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేందుకు లాయర్లుగా ఎన్రోల్చేసుంటున్న న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు(ఎస్బీసీ) భారీ స్థాయిలో ఫీజులు వసూలుచేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం ఎస్సీ–ఎస్టీ కేటగిరీ లా పట్టభద్రుల నుంచి రూ.125 ఫీజు, జనరల్ కేటగిరీ నుంచి రూ.750 మించి వసూలుచేయకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఎస్బీసీలు వసూలుచేస్తున్న విపరీతమైన ఫీజుల కారణంగా అణగారిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాల పేద, మధ్యతరగతి లా పట్టభద్రులు న్యాయవృత్తిలోకి రాలేని పరిస్థితి నెలకొంటోందని, వారు ఈ వృత్తిలో భాగస్వాములయ్యే అవకాశాలు తగ్గిపోతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరిచింది. -
గురుకులాల్లో ఫీ‘జులుం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ఇకపై చదువు‘కొనా’ల్సిందే. గత విద్యా సంవత్సరం వరకు ఉచిత విద్యను అందించిన ఈ కళాశాలల్లో ప్రతి కోర్సుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫీజులు ఖరారు చేసింది. సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినుల నుంచి కోర్సును బట్టి రూ.4 వేల నుంచి రూ.14 వేల వరకు ఫీజులు వసూలు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. గత నెలలోనే జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఇప్పుడు బయటకు రావడంతో విద్యార్థి సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కళాశాలలకు, హాస్టళ్లకు ఎలాంటి ఫీజులు లేకుండా విద్యార్థినులు చదువుకున్నారు. అలాంటిది ఇప్పుడు భారీగా ఫీజులు చెల్లించమనడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి ఫీజుల పిడుగు..సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కేటగిరీ కింద ఏడేళ్ల క్రితం రెండు మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో ఒకటి కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కంచికచర్లలోనూ, మరొకటి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో కలికిరిలోనూ ఏర్పాటు చేశారు. ఎస్సీ మహిళలకు డిగ్రీ స్థాయిలో ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో విద్యతో పాటు హాస్టల్ సదుపాయాన్ని ప్రభుత్వమే సమకూరుస్తోంది. విద్యార్థినుల నెత్తిన ఫీజుల బండ: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలకు గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులను విడుదల చేసేవారు. రెండు కళాశాలల్లో సుమారు 600 మంది చదువుకుంటున్నారు. కంచికచర్ల కళాశాలలో బీకామ్ (జనరల్) కోర్సుకు రూ.4,225, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)కు రూ.14,172 ఫీజు నిర్ణయించగా, కలికిరిలో బీకామ్ (జనరల్)కు రూ.5,400, బీకామ్ (సీఏ)కి రూ.10,845, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)కు రూ.11,045గా ఖరారు చేశారు. ఫీజుల వసూలు నిలిపివేయాలి: ఎస్ఎఫ్ఐ గురుకుల డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థులు ఫీజులు చెల్లించాలంటూ ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు రెట్టింపు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజును రెట్టింపునకు మించి పెంచింది. ప్రస్తుతం 710 డాలర్లు (రూ.59,255)గా ఉన్న ఫీజును 1,600 డాలర్లు (రూ.1.33 లక్షల)కు పెంచింది. పెంచిన ఫీజులు అమలవుతాయని జూలైæ ఒకటో తేదీ నుంచి తెలిపింది. దీని ప్రభావం ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై పడనుంది. ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయులది రెండో స్థానం. 2023 ఆగస్ట్ నాటికి 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నట్లు కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ తెలిపింది. ఇకపై విదేశీ విద్యార్థులు బ్రిటన్ వంటి దేశాలను ఎంచుకోవచ్చంటున్నారు. కునే బ్రిటన్‌లో స్టూడెంట్ వీసా ఫీజు 900 డాలర్లు(రూ.75 వేలు)గా ఉంది. -
ఎంబీబీఎస్ ఫీజు నాలుగున్నరేళ్లకే తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఎంబీ బీఎస్ ఫీజును ఐదేళ్లకు కాకుండా నాలుగున్నరేళ్లకే తీసుకోవాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రైవేట్ కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీచేసింది. ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నర ఏళ్లు మాత్రమేనని, అందుకు తగ్గట్టుగానే ఫీజు తీసుకోవాలని సూచించింది. కొన్ని కాలేజీలు ఐదేళ్లకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి స్పష్టతను ఇస్తున్నామని తెలిపింది. ఉదాహరణకు కోర్సు ఫీజు ఏడాదికి రూ. 14.5 లక్షలు అనుకుంటే, మొత్తం నాలుగున్నర ఏళ్లకు కలిపి రూ. 65.25 లక్షలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తాన్ని ఐదు ఇన్స్టాల్మెంట్లలో విద్యార్థుల నుంచి తీసుకోవాలని, ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు రూ. 13.05 లక్షలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. దీనివల్ల ఆరు నెలలు అదనంగా వసూలు చేస్తున్న ఫీజుల భారం విద్యార్థులపై పడదని తెలిపింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజును ఐదు సమాన వాయిదాలలో వసూలు చేయాలని, మేనేజ్మెంట్లు ముందుగా ఫీజును వసూలు చేయరాదని కమిటీ సిఫార్సు చేసింది. అంటే ఎంబీబీఎస్ విద్యార్థుల వద్ద కోర్సు మొత్తానికి ఒకేసారి ఫీజు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఫీజు రెగ్యులేటరీ కమిటీ హెచ్చరించింది. ఏ యేడాది ఫీజును ఆ ఏడాది మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, ప్రతీ ఏడాది టీఏఎఫ్ఆర్సీ ఇలా ఆదేశాలు ఇస్తున్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లెక్కచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2024కి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం వరకు 3,46,324 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో 2,62,981 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 82,258 మంది ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్–ఫార్మా విభాగాలకు కలిపి మరో 1,085 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ దరఖాస్తులు రాలేదు. గతేడాదితో పోలిస్తే ఇప్పటివరకు దాదాపు 8 వేలకు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో సుమారు 24 వేలకు పైగా అధికంగా దరఖాస్తులు అందాయి. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, రూ.1,000తో మే 5 వరకు, రూ.5 వేలతో మే 10 వరకు, రూ.10 వేలతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగొచ్చని చెబుతున్నారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు మే 4 నుంచి 6 వరకు గ్రీవెన్స్‌ను నిర్వహించనున్నారు. మే 16 నుంచి ఈఏపీసెట్ ఏపీ ఈఏపీసెట్‌ను మే 16 నుంచి నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మే 16, 17 తేదీల్లో, ఇంజనీరింగ్ విభాగంలో మే 18 నుంచి 22 వరకు ప్రవేశపరీక్షలు నిర్వహించడానికి ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. సంబంధిత తేదీల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలను నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను మే 7 నాటికి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ చర్యలతోనే దరఖాస్తుల పెరుగుదల.. ఉన్నత విద్యారంగంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచి్చన విప్లవాత్మక సంస్కరణలు, అనేక సంక్షేమ పథకాల వల్లే ఈఏపీసెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.35 వేల వరకు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్ ఉండేది. అది కూడా అరకొరగా కొంతమందికే అందేది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా కళాశాల ఫీజు ఎంత ఉన్నా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. అంతేకాకుండా విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.20 వేల వరకు సహాయాన్ని అందిస్తోంది. మరోవైపు విద్యార్థులు అత్యున్నత నైపుణ్యాలు సంతరించుకునేలా పరిశ్రమల అనుసంధానంతో వారికి ఇంటర్న్‌షిప్, శిక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. వీటన్నిటి ఫలితంగా గత విద్యా సంవత్సరంలో ఒక్క సాంకేతిక విద్యా రంగంలోనే 1.20 లక్షలకు పైగా విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వూ్యల్లో అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రైవేట్ వర్సిటీల్లోనూ పేదలకు సీట్లు.. గత రెండేళ్లుగా ఈఏపీసెట్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఓవైపు కళాశాలల ఫీజులు ఎంత ఉన్నా పూర్తిగా ప్రభుత్వమే ఫీజురీయింబర్స్‌మెంట్ కింద భరిస్తోంది. ఇంకోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లోనే కాకుండా విట్, ఎస్ఆర్ఎం లాంటి ప్రైవేట్ వర్సిటీల్లోని సీట్లను కూడా ఈఏపీసెట్‌లో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు ప్రభుత్వం కేటాయిస్తోంది. విట్, ఎస్‌ఆర్‌ఎంల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వం తన కోటాలో భర్తీ చేస్తోంది. ఈ వర్సిటీల్లో చేరాలంటే ఒక్కో విద్యార్థి ఏడాదికి రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించాలి్సందే. అలాంటిది పేద విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ప్రభుత్వమే ఈ సంస్థల్లోనూ ఫీజులు భరిస్తోంది. దీంతో ఈఏపీసెట్‌కు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. -
18 నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ గుర్తించాలని సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు. -
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం (2023–24) ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియెట్ విద్యా మండలి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే మార్చిలో జరిగే బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు నిర్ణీత గడువులోగా విద్యార్థులు తమ తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ మంగళవారం తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 30వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ♦ మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకటి, రెండో ఏడాది ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. ♦ ఇంటర్మీడియెట్ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1,100, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి. ♦ ఇప్పటికే ఇంటర్మీడియెట్ పాసై ఇంప్రూవ్మెంట్ రాసేవారు రెండేళ్లకు ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,240, సైన్స్ విద్యార్థులు రూ.1,440 చెల్లించాల్సి ఉంటుంది. -
వివేక్‌తో విందుకు ఫీజు 50 వేల డాలర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి మాట్లాడుకుంటూ విందారగించాలనుకుంటున్నారా? అలాగైతే సుమారు రూ.42 లక్షలు చెల్లిస్తే చాలు..! సిలికాన్ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు కొన్ని వివేక్కి ఎన్నికల ప్రచార నిధులను సేకరించి పెట్టేందుకు ఈ నెల 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి. ఇందులో వివేక్‌తోపాటు పాల్గొనాలనుకునే వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని రూ.41.47 లక్షలు (50 వేల డాలర్లు)గా ఖరారు చేశారు. విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఇన్వెస్టర్, సోషల్ కేపిటల్ సంస్థ సీఈవో చమత్ నివాసంలో ఈ విందు జరగనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో అగ్రస్థానంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి నిలిచిన విషయం తెలిసిందే. -
ఎక్కువ ఫీజులు కట్టేస్తే మార్కులు వచ్చేయవు..ఆ స్కిల్..
సుబ్బారావు, సుమిత్రలకు ఆనంద్, అంజలి పిల్లలు. ఆనంద్ చిన్నప్పటి నుంచీ బాగా చదువుకునేవాడు. కానీ అంజలి ఎంత చదివినా మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ ఆమె గురించి ఆందోళన పడుతుండేవారు. బెటర్ స్కూల్, బెటర్ మెటీరియల్స్, బెస్ట్ ట్యూషన్ ్స పెట్టించినా ఫలితం లేకపోయింది. పదో తరగతి ఎలాగోలా గట్టెక్కింది. లక్షల ఫీజు కట్టి హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. మొదటిసారి పేరెంట్స్‌కి, ఊరికి దూరంగా హాస్టల్లో ఉండటం వల్ల దిగులుగా ఉండేది. దానికి తోడు మార్కులు సరిగా రాకపోవడంతో క్లాసులో అందరిముందూ అవమానంగా మాట్లాడేవారు. దాంతో మరింత కుంగిపోయింది. ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఫోన్ చేస్తే.. ఇంటికి వచ్చేస్తానంటూ ఏడుస్తోంది. ఎలాగోలా రెండేళ్లు సర్దుకోమ్మా అని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థంకాక, లెక్చరర్ సలహా మేరకు కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. అంజలితో మాట్లాడుతున్నప్పుడు చాలా చురుకైన పిల్ల అని అర్థమైంది. బాగా బొమ్మలు వేస్తుంది, పాటలు పాడుతుంది, నాట్యం చేస్తుంది. మార్కులు మాత్రం రావు. దాంతో ‘పనికిమాలిన కళలన్నీ బానే ఉన్నాయి, చదువు మాత్రం రాదు’ అంటూ విమర్శలు. ‘నేను అందరికంటే ఎక్కువసేపు చదువుతా సర్, అయినా గుర్తుండవు. ఏం చేయాలో అర్థం కావడంలేదు’ అని బాధపడుతూ చెప్పింది అంజలి. తెలివితేటలున్నా వాటిని మార్కులుగా మార్చుకునేందుకు అవసరమైన స్టడీస్కిల్స్ లేకపోవడమే ఆమె సమస్యని అర్థమైంది. స్టడీస్కిల్స్ లేకపోతే కష్టం, నష్టం.. స్టడీస్కిల్స్ లేని విద్యార్థులు ఏకాగ్రతతో వినలేరు, చదవలేరు. చదివినా గుర్తుండదు. దాంతో వాయిదా వేస్తుంటారు. సిలబస్ పేరుకుపోతుంది. ఫలితంగా పరీక్షల ముందు ఒత్తిడి పెరుగుతుంది. పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. భయం, ఆందోళన, ఒత్తిడి కలగలిసి పెర్ఫార్మెన్స్ ని దెబ్బతీస్తాయి. మార్కులు తక్కువ వస్తాయి. దాంతో ‘ఎంత చదివినా ఇంతే, నా మొహానికి మార్కులు రావు’ అనే భావన స్థిరపడిపోతుంది. ఆ నెగెటివ్ సైకిల్లో పడ్డారంటే నిరాశ, నిస్పృహలతో చదువు అటకెక్కుతుంది. విజయానికి పునాది అకడమిక్స్‌లో విజయం సాధించాలంటే స్టడీస్కిల్స్ పునాదిగా పనిచేస్తాయి. క్లాసులో చెప్పింది శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, చదవడం, గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ స్టడీస్కిల్స్ కిందకు వస్తాయి. ఇవి సహజంగా వస్తాయని, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని చాలామంది పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ భావిస్తుంటారు. కానీ ఇవన్నీ ‘స్కిల్స్’.. అంటే ప్రయత్నంతో నేర్చుకోవాల్సినవని గుర్తించాలి. స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు.. స్టడీస్కిల్స్ పుట్టుకతో రావు. కాలక్రమేణా కొందరికి సహజంగా రావచ్చు. అలాంటివారికే మార్కులు, ర్యాంకులు వస్తాయి. అలాగని మిగతావారు నిరాశ పడాల్సిన అవసరంలేదు. కాస్తంత ప్రయత్నం చేస్తే ఎవరైనా స్టడీస్కిల్స్ నేర్చుకోవచ్చు. కోరుకున్న మార్కులు, ర్యాంకులు సాధించవచ్చు. అందుకోసం కొన్ని టిప్స్.. స్టడీస్కిల్స్లో అతి ముఖ్యమైనది ఎఫెక్టివ్ లిజనింగ్. క్లాసులో శ్రద్ధగా వింటే.. మీరు 70శాతం సబ్జెక్ట్ నేర్చుకున్నట్లే. అందుకే శ్రద్ధగా వినడం ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవడం మీ మెంటల్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది. బాగా విశ్రాంతి తీసుకున్న మనసు మెరుగ్గా పని చేస్తుంది. అందువల్ల తగినంత నిద్ర, సమతుల ఆహారం, సరిపడా శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి. శరీరం యాక్టివ్‌గా ఉంటే మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. ఎఫెక్టివ్ స్టడీ అనేది ఎఫెక్టివ్ ప్లానింగ్‌తో మొదలవుతుంది. మీరు నేర్చుకోవాల్సిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. ప్రతి అంశానికి సరిపడా సమయం కేటాయించాలి. ఫోకస్ కొనసాగించడానికి మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. చదవడమంటే పుస్తకం ముందేసుకుని కూర్చోవడం కాదు. అందులోని కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవడం, ప్రాసెసింగ్ చేయడం, ఇంకొకరికి బోధించడం. ఇలా చేయడం ద్వారా మీ అవగాహన, జ్ఞాపకశక్తి బలోపేతమవుతాయి. క్లాసులో చెప్పిన ప్రతి అక్షరం నోట్సులో రాసుకునే అలవాటును వదిలేయండి. బదులుగా ముఖ్య అంశాలను మాత్రమే నోట్ చేసుకునే సెలక్టివ్ నోట్ టేకింగ్ ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ సారాంశాన్ని గ్రహించి కీలక అంశాలను మీ సొంత మాటల్లో రాసుకోండి. ఆడియో, వీడియో, ఫ్లాష్ కార్డ్‌లు ఉపయోగించండి. సులువుగా నేర్చుకోగలుగుతారు. పరీక్షల్లో ఇచ్చిన టైమ్‌లో సమాధానాలు రాయడం అత్యంత ముఖ్యమైన విషయం. అందువల్ల పోమోడోరో టెక్నిక్ వంటి వాటిని ఉపయోగించి ఫోకస్డ్గా చదవడం, రాయడం నేర్చుకోండి. ఏ విషయంలోనైనా మీకు సమస్య ఎదురైతే పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. (చదవండి: హలో బ్రదర్ సినిమా మాదిరి కవల సిస్టర్స్ !..ఊహాతీతమైన ఓ మిస్టరీ గాథ) -
సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: చదువు పట్ల ఆసక్తి ఉండి.. బడికి వెళ్లి చదువుకోలేనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ల్లో చేరే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే పరీక్ష ఫీజులను కూడా వీటిలోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే వారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇక నుంచి ఎవరైనా.. ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తమ పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు వాటికి సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపులు వంటి సేవలను తమ దగ్గరలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పొందొచ్చు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ)ల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరింది. ఈ సేవల టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయిందని.. వచ్చే వారంలో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అధికారికంగా మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. తప్పనున్న ఇబ్బందులు.. కాగా, ఓపెన్ స్కూల్ ద్వారా ప్రవేశాలు పొందాలంటే ఇప్పటివరకు అధికారిక వెబ్సైట్ మాత్రమే అందుబాటులో ఉంది. సొంతంగా ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్, వెబ్ వినియోగంలో అవగాహన ఉన్నవారు ఇంట్లో నుంచే ప్రవేశాలు పొందేవారు. నెట్ సదుపాయం, అవగాహన లేకపోతే తమ ప్రాంతంలో లేదంటే, సమీప çపట్టణంలో నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు ప్రవేశపెడుతుండటంతో ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. మరోవైపు.. 14 ఏళ్ల లోపు బడి ఈడు పిల్లలు ఎవరైనా పాఠశాలలకు వెళ్లని పరిస్థితి ఉంటే.. అలాంటి వారందరినీ ఆయా ప్రాంత గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. వారందరినీ వంద శాతం బడుల్లో చేర్పించేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. అలాగే వివిధ కారణాలతో బడి వయసు ఉన్నవారు, బడులకు వెళ్లలేని వారితోపాటు 17 ఏళ్లు దాటిన వయోజనులు ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్ చదువుకునే అవకాశాన్ని సచివాలయాల ద్వారా అందిస్తోంది. ఏటా నవంబర్‌నెలాఖరు దాకా అడ్మిషన్లు.. ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఏటా నవంబరు నెలాఖరు వరకు కొనసాగుతోందని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి “సాక్షి’కి తెలిపారు. ప్రవేశాలకు పేర్ల నమోదు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఎక్కువగా చేసుకుంటారని వెల్లడించారు. ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదివే వారి కోసం ఈ ఏడాది నుంచి అధికారిక వెబ్సైట్లో ఆయా తరగతుల ఆన్లైన్ పాఠాల బోధన వీడియోలను ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సార్వత్రిక విద్య అంటే.. మన దేశంలో కనీసం ఇంటర్‌గా గుర్తించిన నేపథ్యంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఎంత మంది ఇంటర్‌లోపు చదువుకున్న వారు ఉన్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంటర్‌లోపు చదివిన వారందరినీ ఓపెన్ స్కూల్ ద్వారానైనా చదువుకునేలా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందన్నారు. -
భూటాన్ వెళ్లేవారికి శుభవార్త! ఆ ఫీజు సగానికి తగ్గింపు
హిమాలయ పర్యాటక దేశమైన భూటాన్ తమ దేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. తమ దేశంలో పర్యటించే టూరిస్టులకు విధించే డైలీ ఫీజును సగానికి తగ్గించింది. ఇప్పటి వరకు 200 డాలర్లు (రూ.16,500) ఉన్న డైలీ ఫీజును 100 డాలర్లు (రూ.8,250)లకు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. "సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు" పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఈ డైలీ ఫీజును గత సంవత్సరం సెప్టెంబర్‌లో 65 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు పెంచింది భూటాన్. ఈ మొత్తాన్ని కాలుష్య నివారణకు వెచ్చించనున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు తగ్గించిన డైలీ ఫీజు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్నేళ్ల ముందు వరకూ బయటి దేశాలతో సంబంధాలు లేకుండా భూటాన్ 1974లో తొలిసారిగా 300 మంది పర్యాటకులను తమ దేశ సందర్శనకు అనుమతించింది. 2019లో ఈ సంఖ్య 3,15,600కి పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15.1 శాతం పెరిగింది. పర్యాటకుల రద్దీని పెద్దగా ఇష్టపడని భూటాన్.. తమ దేశంలోని శిఖరాల పవిత్రతను కాపాడేందుకు పర్వతారోహణను నిషేధించింది. సందర్శన ఫీజు వసూలు కారణంగా ఆ దేశంలో పర్యటించేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే 3 బిలియన్ డాలర్లున్న తమ ఆర్థిక వ్యవస్థ మరింత పెంచుకోవాలని భావిస్తున్న భూటాన్ ఇందుకోసం పర్యాటక రంగం నుంచి వస్తున్న 5 శాతం ఆదాయాన్ని 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ప్రధానంగా బౌద్ధ దేశమైన భూటాన్‌లో అనేక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డైలీ ఫీజును సగానికి తగ్గించడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దోర్జీ ధ్రాధుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జూన్‌లోనే పర్యాటకుల బస రుసుములపై ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కానీ ఆశించినస్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగలేదు. గత జనవరి నుంచి 56,000 మందికిపైగా పర్యాటకులు భూటాన్‌ను సందర్శించారని, ఇందులో దాదాపు 42,000 మంది భారతీయులే ఉన్నారని ధ్రాధుల్ చెప్పారు. -
నాణ్యమైన చదువులు, స్మార్ట్క్లాస్లు, ఐఐటీల పేరిట.. ఫీజుల మోత..
మహబూబ్‌నగర్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు అడ్డు, అదుపు లేకుండాపోతోంది. నాణ్యమైన చదువులు, స్మార్ట్క్లాస్లు, ఐఐటీల పేరిట తల్లిదండ్రులను మభ్యపెట్టి.. ఎల్కేజీ, యూకేజీల నుంచే ఫీజుల మోత మోగిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుని తక్కువలో తక్కువ రూ.20 వేల నుంచి మొదలుకొని రూ.లక్ష వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున ఫీజులు వసూలు సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం తమ కేమి సంబంధం లేదనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ప్రతిఏటా పెరుగుదల.. వాస్తవానికి ఫీజుల పెంపు వ్యవహారం పాఠశాల సొసైటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కమిటీ సమన్వయంతో ప్రతి సంవత్సరం పెంచాల్సిన ఫీజులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలోని ఏ పాఠశాలలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఎన్నో రెట్ల ఫీజులు పెంచుకుంటున్నారు. ఎల్కేజీ నుంచి ఎస్సెస్సీ వరకు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన కొన్ని పాఠశాలల్లో 6 నుంచి 7వ తరగతి వరకు రూ.40– 50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక 8, 9, 10వ తరగతుల వారికి రూ.50– 70 వేలకుపైగా రాబడుతున్నారు. వీటిలో కొన్ని పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తూ ప్రతి సంవత్సరం అదనంగా రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. రెండు చేతులా సంపాదన.. విద్యార్థికి ఫీజుల చెల్లింపు ఒక ఎత్తయితే.. పుస్తకాలు, నోట్‌బుక్స్, టై, బెల్టులు, షూ, యూనిఫాంలు, రికార్డులు, బస్సు ఫీజుల వంటివి మరో ఎత్తు అవుతున్నాయి. బయటి నుంచి విద్యార్థులు ఏం కొన్నా.. వాటిని అనుమతించని పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందులో ముఖ్యంగా 6– 8వ తరగతుల పుస్తకాల కోసం రూ.6,500 తీసుకుంటున్నారు. ఇందులో ఐఐటీ వంటి ప్రత్యేక సంస్థల కరిక్యూలం ఉన్న పుస్తకాలకు రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. నోట్‌పుస్తకాలు ఏకంగా పాఠశాల పేరు మీదనే ముద్రిస్తున్నారు. యూనిఫాం రూ.2,800, షూ, బెల్టులు రూ.1,200, బస్సు ఫీజు రూ.15– 18 వేల వరకు వసూలు చేస్తున్నారు. చాలా వరకు పాఠశాలల్లోనే అమ్ముతుండగా.. కొన్ని మాత్రం తెలిసిన బుక్సెంటర్ల ద్వారా విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. -
త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కసరత్తు పూర్తి చేసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫీజులను సవరించనుంది. ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సహా ఇతర కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏడాదికోసారి 5 శాతం చొప్పున సవరించాలన్న నిర్ణయాన్ని మార్పు చేశారు. ఆ ప్రకారం ఈ సారి తప్పనిసరిగా ఫీజుల సవరణ జరుగుతుందని హెల్త్ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రైవేటు కాలేజీ ల్లో మెడికల్ కోర్సుల ఫీజులు రూ. లక్షల్లో ఉండగా త్వర లో అంతకు మించి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో మెడికల్ కాలేజీకి ఒక్కో ఫీజు... ఇప్పటివరకు రాష్ట్రంలో మెడికల్ కోర్సుల ఫీజులు ఒకే రీతిన ఉన్నాయి. ఇకపై ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉండనుంది. ఆ ప్రకారమే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సహా ఇతర వైద్య కోర్సుల ఫీజులుంటాయి. అందుకు అనుగుణంగానే కాలేజీలవారీగా ఆడిట్ రిపోర్టులను టీఏఎఫ్ఆర్సీ తీసుకుంది. వాటి ఆధారంగానే ఫీజుల సవరణ చేయనుంది. ఇందులో కాలేజీల నిర్వహణ ఖర్చులు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, ల్యాబ్‌ల నిర్వహణ తదితర పూర్తిస్థాయి సమాచారం సేకరించారు. ఈ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఒక రకంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మరో రకంగా ఉంటాయి. ఈ దిశగా కాలేజీవారీగా ఆడిట్ నివేదికలు పరిశీలించిన టీఏఎఫ్ఆర్సీ ఫీజుల సవరణపై ఒక అంచనాకు వచ్చింది. కాలేజీలవారీగా ఫీజుల పెంపు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచినట్లు తెలిసింది. దీంతో ఫీజుల పెంపు వ్యవహారంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొన్ని కాలేజీల్లో 20 శాతం వరకు పెరిగే అవకాశం.. ప్రస్తుతమున్న ఫీజులను కొన్ని కాలేజీలు 20 శాతం వరకు పెంచాలని కోరగా మరికొన్ని 10 శాతం, కొన్ని 5 శాతం, ఇంకొన్ని యథాతథంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఏ–కేటగిరీ (కన్వినర్) ఫీజు రూ. 60 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలుగా ఉంది. ఇక సీ–కేటగిరీ (ఎన్ఆర్ఐ) అడ్మిషన్ ఫీజు బీ–కేటగిరీకి రెట్టింపు అంటే రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకొనే వీలుంది. ఇక పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 7.5 లక్షలు, బీ–కేటగిరీ రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల చొప్పున ఉన్నాయి. బీడీఎస్ కోర్సులకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 45 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 4.2 లక్షలు, ఇక సీ–కేటగిరీ ఫీజు బీ–కేటగిరీ కంటే రెట్టింపు వసూలు చేసుకోవచ్చు. వాటితోపాటు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా కాలేజీలవారీగా భిన్నంగా ఉన్నాయి. -
వీసా దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాకు వచ్చే వారి టూరిస్ట్, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. విజిటర్ వీసాలు, నాన్ పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజును ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అదేవిధంగా, తాత్కాలిక వృత్తిదారులు(టెంపరరీ వర్కర్స్)కిచ్చే కొన్ని రకాల నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజు ప్రస్తుతం ఉన్న 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు పెరుగుతుందని తెలిపింది. ప్రత్యేక వృత్తినిపుణు(స్పెషలిజం ఆక్యుపేషన్)లకు ఫీజును 315 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం మే 30వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కాన్సులర్ సేవల ఫీజుల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. -
వైద్య విద్య మరింత ఖరీదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య మరింత ఖరీదు కాబోతోంది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ కోర్సుల ఫీజులు భారీగా ఉండగా, మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు అటు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తూనే.. ఇటు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి సైతం విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2023–24 నుంచి 2025–26 మధ్య కాలానికి సంబంధించి ఫీజుల నిర్థారణపై కసరత్తు మొదలుపెట్టిన టీఏఎఫ్ఆర్సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోగా మెడికల్ కాలేజీల వారీగా ప్రస్తుతం ఫీజులు, పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది. కేటగిరీల వారీగా ఫీజులు మెడికల్ కోర్సులకు సంబంధించి ఫీజులు ఒక్కో కేటగిరీలో ఒక్కో రకంగా ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో స్థిరమైన ఫీజులుండగా.. ప్రైవేటు కాలేజీల్లో మాత్రం ఏ, బీ, సీ కేటగిరీల్లో భిన్నమైన ఫీజులు తీసుకుంటున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కేటగిరీ ‘ఏ’ (కన్వీనర్ కోటా) అడ్మిషన్‌కు వార్షిక ఫీజు రూ.60వేలు ఉండగా.. కేటగిరీ ‘బీ’ (మేనేజ్మెంట్ కోటా)కి రూ.11.5 లక్షల నుంచి రూ.14.5 లక్షల వరకు ఉంది. ఇక కేటగిరీ ‘సీ’ (ఎన్నారై కోటా) అడ్మిషన్ ఫీజు రూ.25 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు ఉంది. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కేటగిరీ ‘ఏ’కు రూ.7.5లక్షలు, కేటగిరీ ‘బీ’కి రూ.28 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఫీజు ఉంది. బీడీఎస్ కోర్సులకు కేటగిరీ ‘ఏ’లో రూ.45 వేలు, కేటగిరీ ‘బీ’లో రూ.4.2 లక్షలు ఉండగా.. కేటగిరీ ‘సీ’లో రూ.ఎనిమిదిన్నర లక్షల వరకు ఉంది. వీటితోపాటు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా కాలేజీల వారీగా భిన్నంగా ఉన్నాయి. ఆడిట్ రిపోర్టులే కీలకం యూజీ, పీజీ మెడికల్ కోర్సుల ఫీజు పెంపునకు కాలేజీల ఆడిట్ రిపోర్టులే కీలకం కానున్నాయి. టీఏఎఫ్ఆర్సీ తాజాగా ప్రతి కాలేజీ ఆడిట్ రిపోర్టును సమర్పించాలని సూచించింది. ఇందులో కాలేజీల నిర్వహణ ఖర్చులు మొదలు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, ల్యాబ్‌ల నిర్వహణ, ఇతర వ్యయాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. ఈ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఒకరకంగా ఉంటే పట్టణ ప్రాంతాల కాలేజీల్లో మరోరకంగా ఉంటాయి. దీంతో కాలేజీ వారీగా ఆడిట్ నివేదికలను పరిశీలించాక ఫీజుల పెంపుపై టీఏఎఫ్ఆర్సీ ఒక అంచనాకు వస్తుంది. ఆ మేరకు ఫీజులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆమోదిస్తే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. -
హెచ్1బీ వీసా ఫీజుల బాదుడు !
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు సహా అన్ని ఇమిగ్రేషన్ ఫీజుల మోత మోగించేందుకు అమెరికా సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రచురించింది. 460 డాలర్లుగా ఉన్న హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను ఏకంగా 780 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలొస్తున్నాయి. మిగతా ఫీజులూ దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ–1 దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఒక్కసారిగా 229 శాతం పెంపు అన్నమాట. ఎల్–1 ధరను 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచేయనున్నారు. అంటే ఏకంగా 332 శాతం పెరుగుదల. హెచ్–2బీ దరఖాస్తుల ధర 460 డాలర్ల నుంచి ఒకేసారి 1,080 డాలర్లకు చేరుకోనుంది. అయితే, ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని మార్చి ఏడో తేదీలోపు వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్ సేవల ఫీజును రద్దుచేస్తామని ప్రతిపాదించింది. 2016 ఏడాది నుంచి ఇప్పటివరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. వీసా ఎదురుచూపులు తగ్గించేందుకు కృషి భారత్‌లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు. -
ఫీజుల దందా.. విద్యాసంస్థలకు ఏపీహెచ్ఈఆర్ఎంసీ వార్నింగ్
సాక్షి, అమరావతి: విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలను ఏపీ ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) హెచ్చరించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు కమిషన్ మెంబర్ సెక్రటరీ, సీఈవో డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి లేఖ రాశారు. యాజమాన్యాలు ఎక్కువ ఫీజు వసూలు చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేయడం సహా పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కమిషన్‌కు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి విద్యాసంస్థ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను అందరికి కనిపించేలా విద్యాసంస్థల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని సూచించారు. నిర్దేశించిన ఫీజు కన్నా అధికంగా వసూలు చేస్తే ఏపీహెచ్ఈఆర్ఎంసీ 2019, ఏపీ విద్యాసంస్థల (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ)–1983 చట్టాల్లోని నిబంధనలను అనుసరించి శిక్షార్హులవుతారని హెచ్చరించారు. కోర్సు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యాసంస్థలు అట్టిపెట్టుకోరాదని పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కమిషన్ ఆకస్మిక తనిఖీలు చేసి విద్యార్థులతో మాట్లాడుతుందని, ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తమదృష్టికి వస్తే ఆయా విద్యాసంస్థలకు పెనాల్టీ విధించడంతోపాటు సమస్య తీవ్రతను బట్టి అఫిలియేషన్‌ను రద్దుచేయడానికి సిఫార్సు చేస్తామని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే? -
అంతంత ఫీజులు సామాన్యుడు ఎలా భరించగలడు?
జైపూర్: పౌరులకు ఉచిత న్యాయసేవను అందిస్తున్న దేశాల్లో మనది ఒకటి. అలాంటి దేశంలో కేసుల కోసం లక్షల నుంచి కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్న న్యాయవాదులు ఉంటున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యల చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు. దేశంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగకుండా ప్రముఖ న్యాయవాదులు వసూలు చేస్తున్న అధిక లీగల్ ఫీజులపై ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జైపూర్‌లో జరిగిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్లో మంత్రి రిజిజు మాట్లాడుతూ.. “డబ్బున్నవాళ్లు బడా లాయర్లను నియమించుకుంటారు. అంతెందుకు సుప్రీంకోర్టులో ఉన్న కొందరు న్యాయవాదుల ఫీజులను సామాన్యులు భరించలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో వాదన కోసం రూ.10-15 లక్షలు వసూలు చేస్తే.. అసలు సామాన్యుడు ఎలా చెల్లించగలడు?. పేదలకు న్యాయం ఎలా అందుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా! అని న్యాయశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. జూలై 18, సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 71 వాడుకలో లేని చట్టాలను రద్దు చేస్తామని న్యాయ మంత్రి వెల్లడించారు. आज जयपुर में राष्ट्रीय विधिक सेवा प्राधिकरण की 18वी अखिल भारतीय बैठक के उद्घाटन समारोह में भाग लेंगे। pic.twitter.com/ADBCN4a9zo — Kiren Rijiju (@KirenRijiju) July 16, 2022 ఇక న్యాయ సేవల సమావేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా హాజరయ్యారు. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా జరిగిన ప్రచారంపైనా గెహ్లట్ స్పందించారు. “సస్పెండ్ చేయబడిన బిజెపి los నూపుర్ శర్మ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులపై దుష్ప్రచారం ప్రారంభించడం చాలా ఆందోళన కలిగించే విషయం” అని ఆయన అన్నారు. పనిలో పనిగా బీజేపీపై విరుచుకుపడిన గెహ్లాట్.. హార్స్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. “దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నా(రాజస్థాన్) ప్రభుత్వం ఎలా మనుగడ సాగించిందనేది ఆశ్చర్యం కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. -
అందని ‘ఉపకారం’!
నల్లగొండ జిల్లా మర్రిగూడెంకు చెందిన మణికేశవ్ ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రఖ్యాత కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనలియర్ చదువుతున్నాడు. కన్వీనర్ కోటాలో సీటు సాధించిన ఇతనికి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజు నిధులు ఇవ్వకపోవడంతో యాజమాన్యం తీవ్ర ఒత్తిడి చేసింది. రెండు, మూడో సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో మణికేశవ్ తండ్రి నరసింహారావు రూ.1.20 లక్షలు అప్పు చేసి ట్యూషన్ ఫీజు చెల్లించారు. తర్వాతే మణికేశవ్ సెమిస్టర్ పరీక్షలు రాశాడు. తండ్రి తెచ్చిన అప్పుకు 4 నెలల నుంచి వడ్డీ పెరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు. ఇది ఒక్క మణికేశవ్ పరిస్థితి మాత్రమే కాదు.. చాలా కాలేజీల్లో యాజమాన్యాలు ఇదే తరహాలో విద్యార్థుల నుంచి వ్యక్తిగతంగా ఫీజులు కట్టించుకుంటున్నాయి. కళాశాల నిర్వహణ భారమవుతోందని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉపకార వేతన నిధులు విడుదల కాక, రీయింబర్స్మెంట్ నిధులు సైతం ఏళ్లుగా నిలిచిపోవడంతో బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. 2019–20 నుంచి 2020–21, 2021–22 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు మొత్తంగా రూ.3,271.15 కోట్లు ఉన్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. సంక్షేమ శాఖలు దరఖాస్తులను పరిశీలించి బడ్జెట్ అంచనాలను రూపొందించి బిల్లులను ఖాజానా శాఖకు సమర్పిస్తాయి. ఈ క్రమంలో ఈ సంవత్సర దరఖాస్తుల పరిశీలన పూర్తయితే డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని సంక్షేమ శాఖలు చెబుతున్నాయి. బకాయిలు అంతకంతకు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పడం.. నిధుల విడుదలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో ఏటా చేయాల్సిన చెల్లింపులు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా ఈ పథకాలకు నిధులను ప్రభుత్వం పెద్దగా విడుదల చేయలేదు. దీంతో బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి. 2019–20, 2020–21 వార్షిక సంవత్సరాలకు సంక్షేమ శాఖలు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి చాలా కాలమైంది. ఇక 2021–22 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది మార్చి 31 వరకు జరిగింది. కొన్ని రకాల కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఈనెల 21 వరకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ దరఖాస్తుల స్వీకరణ పూర్తయితే 2021–22 ఏడాది డిమాండ్‌పై స్పష్టత వస్తుంది. విద్యార్థులు సతమతం.. ‘ఫీజు’చెల్లింపులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని, కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం కుదరదని.. ఇలా కాలేజీ యాజమాన్యాలు రకరకాల నిబంధనలు పెడుతున్నాయి. చదువు కొనసాగాలంటే ఫీజు చెల్లించాలనే డిమాండ్ పెడుతున్న యాజమాన్యాలు.. ‘ఫీజు’రాకుంటే కాలేజీ నిర్వహణ భారమవుతుందని విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కాలేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు అప్పు చేసి ఎంతో కొంత ఫీజు చెల్లించి బతిమాలుకుంటున్న సంఘటనలు కాలేజీల్లో కనిపిస్తున్నాయి. నిర్వహణ భారంగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో సరిపడా ప్రభుత్వ కాలేజీలు లేకపోవడంతో పేదలు ప్రైవేట్ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు మినహాయిస్తే.. ఇతర ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే తీసుకుంటున్నారు. చాలామంది పేదలు ‘ఫీజు’పథకం ద్వారా అందే సాయాన్నే నమ్ముకుని చదువుతున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పథకంపై ఆధారపడిన కాలేజీల నిర్వహణ మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను పూర్తిస్థాయిలో విడుదల చేస్తేనే కాలేజీల నిర్వహణ సక్రమంగా సాగుతుంది. –గౌరి సతీశ్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేట్ కాలేజీల సంఘం సింహభాగం బీసీ విద్యార్థులవే.. ప్రస్తుతమున్న బకాయిల్లో అత్యధికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించినవే. ఈ శాఖ ద్వారా బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుండగా.. ఈబీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటివరకున్న మొత్తం బకాయిల్లో ఈ విద్యార్థులవే సింహభాగం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) నుంచి నిధులు సర్దుబాటు చేస్తున్నా.. బీసీ విద్యార్థులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. -
బ్యాంకాక్ టూర్ వెళ్తున్నారా? మీకో ముఖ్యగమనిక
కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్న రంగం పర్యాటకం. ట్రావెల్ బ్యాన్, కఠిన ఆంక్షల కారణంగా లెక్కకు అందని నష్టం వాటిల్లింది ఈ రంగానికి. ముఖ్యంగా లక్షల మంది ఉపాధి లేకుండా పోయారు. మరోవైపు టూరిజం ఆకర్షణగా ఉన్న ప్రాంతాలు.. ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో థాయ్‌లాండ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. థాయ్‌లాండ్‌కు టూర్ మీద వెళ్లే వాళ్లు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు 300 బహ్త్(9 డాలర్లు-మన కరెన్సీలో 665 రూ.) టూరిస్ట్ ఎంట్రీ ఫీజును ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎంట్రీ ఫీజును సందర్శన ప్రాంతాల అభివృద్ధి కోసం, అలాగే సందర్శకుల ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎంట్రీ ఫీజు నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే విమాన ప్రయాణికుల విషయంలో.. ఈ ఫీజును విమాన ఛార్జీలకు ఏప్రిల్ నుంచి జత చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇతర మార్గాల గుండా వచ్చే సందర్శకుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ ఫీజు.. చాలాదేశాల్లో వసూలు చేస్తున్న టూరిస్ట్ ఫీజుకు సమానంగానే ఉందని, కానీ, సందర్శకులకు కలిగే ప్రయోజనాలు మాత్రం అదనంగా ఉంటున్నాయని లెక్కలతో సహా చెప్తోంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. ఒకవైపు ప్రపంచం అంతా ఒమిక్రాన్, కరోనా కేసుల భయంతో ఆంక్షలు విధిస్తుంటే.. థాయ్‌లాండ్ మాత్రం టూరిస్టులకు వెల్కమ్ చెప్తోంది. భారత్ నుంచి రాజధాని బ్యాంకాక్‌కు ఎక్కువ మంది క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దెబ్బతిన్న థాయ్ టూరిజాన్ని.. తిరిగి నిలదొక్కుకునేలా చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టూరిజం ఎంట్రీ ఫీజు విధించింది. ప్రస్తుతం యాభై లక్షల మంది సందర్శకులు వస్తారని థాయ్ ప్రభుత్వం భావిస్తోంది. యూరప్, అమెరికాల నుంచి రెగ్యులర్ టూరిస్టుల తాకిడి ఉందని ప్రకటించుకుంది. మరోవైపు భారత్, చైనా గనుక తమ ప్రజలకు సడలింపులు ఇస్తే.. ఆ సంఖ్య 90 లక్షలకు చేరుతుందని భావిస్తోంది. ఒకవేళ భూమార్గం సరిహద్దులు గనుక తెరిస్తే.. ఆ సంఖ్య కోటి యాభై లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది. చదవండి: మహీంద్రా గ్రూప్స్ సంచలన నిర్ణయం -
విద్యార్థులు బలిపశువులు కారాదు!
సాంకేతిక సమస్య కారణంగా గడువుతేదీ లోపు ఫీజు చెల్లించలేకపోయిన ఒక దళిత విద్యార్థికి తప్పకుండా సీటు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దంటూ సుప్రీంకోర్టు అసాధారణ వ్యాఖ్య చేయడం గమనార్హం. విద్యార్థి భవిష్యత్తు విషయంలో శిలాసదృశంగా ఉండొద్దని, కాస్త మానవీయ దృష్టితో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం హితవు చెప్పింది. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం నుంచి కోర్సు ముగింపు వరకు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొం టున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఈ తీర్పు ఒక ఆశా కిరణమై నిలిచింది. ఉన్నత విద్యను ఆశించి, అష్టకష్టాలు పడి సీటు సాధించి, ఉద్యోగ జీవితంలో కూడా వివక్ష పాలవుతున్న వెనుకబడిన వర్గాల పిల్లలకు... ప్రిన్స్, అతడి తండ్రి సాగించిన పోరాటం నిజంగానే స్ఫూర్తిదాయకం అవుతుంది. పద్దెనిమిదేళ్ల దళిత కుర్రాడు ప్రిన్స్ జైబీర్ సింగ్‌కి 48 గంటలలోపు బాంబే ఐఐటీలో ప్రవేశం కల్పించాలని, సుప్రీంకోర్టు ఇటీవలే అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిష్ఠా త్మక ఐఐటీలో చేరడానికి ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఈ విద్యార్థి గడువుతేదీ లోగా ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతడికి ప్రవేశార్హత లేదని అధికారులు ప్రకటించారు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక సాంకేతిక తప్పిదానికి ఆ కుర్రాడి భవిష్యత్తు పట్ల అమానవీయ దృష్టితో వ్యవహరించడం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ సమస్య మానవీయ కోణానికి సంబంధించింది కాబట్టి నియమనిబంధనలను శిలాసదృశంగా పాటించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున ఆ విద్యార్థికి ప్రవేశం కల్పించడం చెడు పరిణామాలకు దారి తీస్తుందని బాంబే ఐఐటీ అధికారులు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాను చేయని తప్పుకు ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దని, ఒక యువకుడి భావి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో వీలైనంత సహాయం చేసి అతడికి మేలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో భారత పీడిత ప్రజానీకంలో మన న్యాయవ్యవస్థ కాస్త ఆశలు నిలిపినట్లయింది. ఐఐటీ బాంబేలో తన స్థానంకోసం ప్రిన్స్ అనే పేరున్న ఈ దళిత కుర్రాడు చేసిన పోరాటం కానీ, ఈ క్రమంలో తాను సాధించిన విజయం కానీ సాధారణమైంది కాదు. ఇది ఇజ్రాయెల్ జానపద గాథల్లో గోలియెత్ని ఓడించిన గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన డేవిడ్‌ను తలపించింది. ఒక దళిత కుర్రాడు అందులోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రిన్స్ అనే పేరు పెట్టుకోవడం అసాధారణమే అని చెప్పాలి. ప్రిన్స్ అంటే ఇంగ్లిష్‌లో ‘ఎదుగుతున్న పాలకుడు’ అని అర్థం. అన్యాయానికి మూలం ఇదా? బాంబే ఐఐటీకి చెందిన జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీలోని అధికారులు ప్రిన్స్ అనే పేరు కల ఈ కుర్రాడి దళిత మూలాలను అనుమానించి ఉండవచ్చు. కానీ నిర్దేశించిన సమయంలోనే ఈ కుర్రాడి సోదరి ఐఐటీ పోర్టల్‌లో అవసరమైన అన్ని పత్రాలనూ అప్లోడ్ చేసిన తర్వాత పీజు కట్టడానికి ప్రయత్నించింది. కానీ వెబ్సైట్ పనిచేయ లేదు. దాంతో ప్రిన్స్ స్వయంగా మరోసారి ప్రయత్నించగా మళ్లీ అతడి ప్రయత్నం తిరస్కరణకు గురైంది. మన సంస్థాగత పునాదిలో ఆన్లైన్ అడ్మిషన్లను కూడా పక్షపాత దృష్టితో వేధించడానికి ఉపయోగిస్తారన్నది తెలిసిందే. భారతదేశంలో చివరకు ఇంటర్నెట్ కూడా దళిత వ్యతిరేక పాశుపతాస్త్రంగా మారిపోవడం విచారకరం. ఆ కుర్రాడు, ఉమ్మడి సీట్ కేటాయింపు విభాగం పనిచేస్తున్న పశ్చిమబెంగాల్ లోని ఐఐటీ ఖర్గపూర్కి సాధారణ కానిస్టేబుల్ అయిన తండ్రితో కలిసి వెళ్ళాడు. ఫీజు కడతానని చెప్పినా అతడిని చేర్చుకోవడానికి అధికారులు తిరస్కరించారు. గడువుతేదీ ముగిసిందని కారణం చెప్పారు. దీంతో అతడు బాంబే హైకోర్టు తలుపులు తట్టాడు. అక్కడా అతడి పిటిషన్‌ని కొట్టేశారు. చివరకు అతడు సుప్రీకోర్టుకు వెళ్లాడు. ఆ కుర్రాడిని ఐఐటీలో చేర్చుకోవలసిందిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వై.డి. చంద్రచూడ్, ఏఎస్ బోపన్న సంచలనాత్మక ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన దళిత కానిస్టేబుల్ కుమారుడు అనేక స్థాయిల్లో పోరాటం సల్పి చిట్టచివరకు ఐఐటీ బాంబేలో చేరగలగడం ఆధునిక ఏకలవ్య గాథను తలపిస్తుంది. సమర్థుడైన విలుకాడు అయినందుకు తన బొటనవేలును కోల్పోవలసి వచ్చిన ఏకలవ్యుడు శస్త్రచికిత్స సహా యంతో తిరిగి తన బొటనవేలును పొందగలిగాడు. ఇప్పుడు ఈ దళిత కుర్రాడు ప్రిన్స్, ఐఐటీ సీటు కోసం పడిన తపనకు సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయం జరిగింది. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి తీవ్రంగా ఘర్షిస్తూ, అంతిమంగా సీట్లు చేజిక్కించుకుంటున్న, రిజర్వేషన్ హక్కు కలిగిన యువత పడుతున్న తపనలో, ఘర్షణలో ఇది ఒంటరి ఘటన కాదు. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఐఐటీ మద్రాస్‌లో జనరల్ కేట గిరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఓబీసీలకు చెందిన యువకుడు విపిన్ పి. వీటిల్.. మద్రాస్ ఐఐటీ నుంచి వివిధరకాల వివక్షల పాలబడి తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్యాకల్టీ అతడి కులనేపథ్యాన్ని కనిపెట్టి, అవమానించడం, వేధించడం మొదలెట్టింది. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని అధికారులకు విపిన్ రాసిన ఉత్తరాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కులతత్వం ఎంతగా పేరుకుపోయిందో స్పష్టం చేశాయి. ప్రస్తుత సందర్భానికి వస్తే మన దళిత ప్రిన్స్ ప్రవేశం కోసం చేసిన పోరాటంతోనే రిజర్వుడ్ అభ్యర్థుల పోరాటం ముగిసిపోలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో చేరడం ఒకెత్తు కాగా, వీటిలో చదువు కొనసాగించడం మరొక ఎత్తు. వీరు క్యాంపస్‌లలోనే ఉంటున్నందువల్ల వివక్ష ఈ సంస్థల్లో ఒక నిరంతర సమస్యగా ఉంటుంది. ఇలా చెబితే అతిశయోక్తి కావచ్చు. ఆరెస్సెస్ శక్తులు మైనారిటీలను భారతీయేతరులుగా వ్యవహరిస్తున్నట్లుగా... దళితులు, ఓబీసీలు, గిరిజనుల పిల్లలను ఘనత వహించిన మన ఐఐటీలు భారతీయేతరులుగా చూస్తున్నాయి. ఈ విద్యా సంస్థలనుంచి రిజర్వేషన్లను తొలగించాలని వీరు అనేకసార్లు విద్యామంత్రికి పలు ఉత్తరాలు రాశారు. కానీ వారనుకున్నది జరిగితే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం కంటే మించిన పెద్ద పోరాటాన్ని దేశం ఎదుర్కోవలిసి వస్తుందని వీరు గ్రహించడం లేదు. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం విషయంలో నిరాకరణకు గురైన విద్యార్థులకు ప్రిన్స్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం కానుంది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన నా వంటి తొలితరం రిజర్వేషన్ విద్యార్థులకు, ఆపై ప్యాకల్టీగా మారినవారికి... గడువు తేదీలు, చివరి క్షణంలో మార్కుల కోతలు, రిజర్వేషన్ సంఖ్యలు వంటివాటిని ఎలా తారుమారు చేయగలరో స్పష్టంగా తెలుసు. ఒక విద్యార్థిగా చేరి, కోర్సు పూర్తి చేసుకునే తరుణంలో, విద్యార్థులకు ఏ గ్రేడ్ని ఇవ్వాలి అనే అంశాన్ని కూడా వీరు తారుమారు చేయగలరు. చదువు పూర్తయ్యాక ఉద్యోగ జీవితం కూడా వెనుకబడిన వర్గాల యువతకు రోజువారీ పోరాటంగా మారిపోతుంది. ఒక వైపు పోటీపడలేకపోవడం, మరోవైపు మోతాదుకు మించి పోటీపడటం అనేవి రిజర్వేషన్ విద్యార్థులను వెంటాడతాయి. మద్రాస్ ఐఐటీకి చెందిన విపిన్ తాను రెండో కారణం వల్ల వివక్షకు గురయ్యానని చెప్పారు. తన విభాగంలోని దళిత్/ఓబీసీ ఫ్యాకల్టీ సభ్యుడి కంటే ఎక్కువ సమర్థతను ప్రదర్శించడమే తన పట్ల వివక్షకు కారణమైందట. ఈ ఉన్నత విద్యాసంస్థల్లో ఏకలవ్యుల బొటనవేళ్లను నరికేసే ద్రోణాచార్యులూ ఉన్నారు. అలాగే వీటిలో చేరిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువత జీవిత ప్రక్రియనే నరికేసే ద్రోణాచార్యులు కూడా ఉన్నారు. గ్రామీణ భారత్ నుంచి తొలి తరం విద్యా నేపథ్యం కలిగిన వారిలో చాలామంది విద్యార్థులు ఇలాంటి వివక్షకు గురైనప్పుడు విద్యాసంస్థలనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ చదువు ముగించి తన కానిస్టేబుల్ తండ్రి కంటే ఉన్నతదశకు ఎదిగితే గొప్ప ఆదర్శంగా మారతాడు. విద్యాసంస్థలను టీచర్ల ద్వారా మాత్రమే సంస్కరించవచ్చు. అయితే ఇలాంటి విద్యాసంస్థల్లోని టీచర్లు ద్రోణాచార్యులను తమ ఆదర్శ గురువులుగా చేసుకున్నంతకాలం, వీరు జాతి మొత్తానికి పెను నష్టం కలిగించగలరు. ఈ విద్యా సంస్థలు గురునానక్ని తమకు ఆదర్శంగా తీసుకుంటే, సాంకేతిక అభివృద్ధిలో చైనానే సవాలు చేసే రీతిలో ఇవి దేశాన్ని మార్చివేయగలవు. ఈ సందర్భంగా ప్రిన్స్, ఆయన తండ్రి మనందరి అభినందనలకు అర్హులు. కంచె ఐలయ్య షెపర్డ్, ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
శృతి మించిన ప్రైవేట్ ఫీ‘జులుం’
ప్రైవేటు ఉద్యోగి అయిన వెంకటేశ్ లాక్‌డౌన్‌తో తన ఉద్యోగం కోల్పోయారు. 8 నెలలుగా అప్పులు చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ సమయంలో ఓ కార్పొరేట్ స్కూల్లో 10వ తరగతి చదివే అతని కొడుకు ధీరజ్ ఫీజును క్లియర్ చేయాలంటూ యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరిగింది. రూ. 70 వేలుగా నిర్ణయించిన ఫీజులో గతంలోనే రూ. 35 వేలు చెల్లించినా, ఇప్పుడు మిగతా మొత్తం చెల్లిస్తేనే పరీక్ష ఫీజును తీసుకుంటామంటూ లంకె పెట్టింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక వెంకటేష్ అప్పుల వేటలో పడ్డారు. శ్రీనివాస్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. తన కొడుకు శ్రీవత్సను ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్న శ్రీవత్స ఫీజు రూ. 1.5 లక్షలు. గత జూలైలోనే రూ. 70 వేలు చెల్లించారు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల గత ఆగస్టులో శ్రీనివాస్‌ను ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు ఆయన కుమారుడి ట్యూషన్ ఫీజు మొత్తం క్లియర్ చేస్తేనే వార్షిక పరీక్ష ఫీజు తీసుకుంటామని సదరు యాజమాన్యం మెలిక పెట్టింది. దీంతో శ్రీనివాస్ అప్పు కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఇది కేవలం వీరిద్దరి సమస్యే కాదు.. రాష్ట్రంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన లక్షల మంది అనుభవిస్తున్న క్షోభ. పిల్లల ఫీజుల కోసం అనేక తంటాలు పడాల్సి వస్తోంది. పరీక్షలు ముగిశాక టీసీ తీసుకునే సమయం లోపల.. ఫీజులు ఎలాగోలా చెల్లిస్తామంటున్నా యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మొత్తం ట్యూషన్ ఫీజులు చెల్లిస్తేనే వారి పిల్లల పరీక్ష ఫీజులను తీసుకొని బోర్డుకు పంపిస్తామంటూ తెగేసి చెబుతుండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని బడా ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం తల్లిదండ్రులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇదివరకెన్నడూ లేని అసాధారణ పరిస్థితి కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించి కొంత వెసులుబాటు కల్పిం చాల్సింది పోయి... నిర్దయగా వ్యవహరిస్తు న్నాయి. ఈ విద్యాసంవత్సరం ఎక్కువకాలం ఆన్లైన్ క్లాసులతోనే గడిచిపోయింది కాబట్టి... నిర్వహణభారం పెద్దగా లేనందున ఫీజులనైనా ఎంతోకొంత తగ్గించాలని పేరెంట్స్ కోరుతున్నా యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. పూర్తి జీతాలు చెల్లించరు రాష్ట్రంలో 1,586 ప్రైవేటు జూనియర్ కాలేజీలుంటే అందులో కార్పొరేట్‌వే 700 పైగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 10 వేలకు పైగా ఉంటే అందులో 4 వేల వరకు బడా ప్రైవేటు స్కూళ్లు, మరో 2 వేల వరకు కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. కాలేజీల్లో క్యాంపస్, బ్రాంచీని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.85 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక స్కూళ్లలోనూ రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడిన క్రమంలో 75 శాతం సిబ్బందిని తొలగించి 25 శాతం సిబ్బందితోనే కొనసాగిస్తున్నాయి. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం ప్రత్యక్ష బోధన ప్రారంభం కావడం, పరీక్ష ఫీజుల చెల్లింపు సమయం రావడంతో తమ ప్రతాపం చూపుతున్నాయి. మూడు నెలల ప్రత్యక్ష బోధన పేరుతో తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ పూర్తి ఫీజులను వసూలు చేస్తున్నా.. ఆ 25 శాతం మంది సిబ్బందికైనా పూర్తి వేతనాలను చెల్లించడం లేదు. ఇక కొన్ని పాఠశాలలైతే ఫీజులను పెంచి మరీ వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అడ్డగోలు ఫీజు వసూళ్లపై వందల సంఖ్యలో ఫిర్యాదులు బడా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఇటు పాఠశాల విద్యా శాఖకు, అటు ఇంటర్మీడియట్ బోర్డుకు రోజుకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటివరకు అందించిన ఫిర్యాదుల సంఖ్య వందల్లోనే ఉన్నట్లు తెలిసింది. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం కేవలం ట్యూషన్ ఫీజులను మాత్రమే తీసుకోవాలన్న నిబంధనల అమలును పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖకు అందిన ఫిర్యాదుల్లో కొన్ని... రమేష్‌రెడ్డి అనే విద్యార్థి ఏకోల్ కిడ్స్ స్కూల్లో పీపీ–2 చదువుతున్నాడు. సదరు యాజమాన్యం ఆ విద్యార్థికి రూ. 37,500 ట్యూషన్ ఫీజుగా, రూ. 6,500 స్టూడెంట్ కిట్ ఫీజుగా నిర్ణయించింది. మొత్తం రూ. 44 వేలు చెల్లించాలని చెప్పింది. జూన్‌లో ఆన్లైన్ తరగతులను యాజమాన్యం ప్రారంభించింది. ఆ తరువాత మూడు టర్మ్‌లలో రూ. 32 వేలు చెల్లించారు. మిగతా రూ. 12 వేలు కూడా చెల్లించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. తల్లిదండ్రులు మాత్రం తాము ట్యూషన్ ఫీజులో కట్టాల్సిన మిగతా మొత్తాన్నే చెల్లిస్తామని, స్టూడెంట్ కిట్ రూ. 6,500 చెల్లించమని తెలిపారు. దీంతో ఆ విద్యార్థికి ఆన్లైన్ తరగతులను కట్ చేశారు. ఈ విషయాన్ని తాము ప్రశ్నించినందుకు తమ కుమారుడి టీసీ తీసుకొని వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారని, అదీ మిగతా రూ. 12 వేలు చెల్లిస్తేనే ఇస్తామంటూ ఇబ్బందులు పెడుతున్నారని రమేష్‌రెడ్డి తల్లి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సెస్ ఎస్సెన్ స్కూల్లో ఎల్కేజీ చదివే విద్యార్థికి రూ. 18 వేలు చెల్లించాలని, లేదంటే తమ స్కూల్ నుంచి విద్యార్థిని తొలగిస్తామని బెదిరిస్తోందంటూ విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. వారంలో మూడు ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించారని, అందుకు సంవత్సరం మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆ విద్యార్థి తండ్రి సజ్జద్ విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. వనస్థలిపురంలోని నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి రూ. 1,00,500 చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని ఆ విద్యార్థి తరపున సురేష్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 3 నెలల ప్రత్యక్ష బోధనకు అంత ఫీజు ఎలా చెల్లించాలని వాపోయారు. ఫీజులు కొంతశాతం తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మా పాప పదో తరగతి చదువుతోంది. 9వ తరగతిలో ట్యూషన్ ఫీజు రూ.40 వేల చొప్పున వసూలు చేయగా... ఈసారి పదోతరగతికి రూ.45 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. స్కూళ్లు తెరవకున్నా అదనంగా రూ.5 వేలు పెంచేశారు. ఇప్పటికే 30 వేలు ఫీజు చెల్లించాం. తగ్గించాలని కోరినప్పటికీ పూర్తి ఫీజు చెల్లించాలని, లేకుంటే తరగతులకు అనుమతించమని తేల్చిచెబుతున్నారు. జనవరి వరకు స్కూల్లో తరగతులు నిర్వహించనందున ఫీజు తగ్గించాలని కోరితే ఆన్లైన్ క్లాసులు చెప్పామంటున్నారు. రెండ్రోజుల క్రితం మరో రూ.5వేలు చెల్లించా. పరీక్షలప్పుడు ఒత్తిడి చేసే అవకాశం ఉంది. పైసా తగ్గించకుండా దబాయిస్తున్నారు. ఫీజులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి కొంత శాతం తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలి. – సీహెచ్ లక్ష్మి, పదోతరగతి విద్యార్థిని తల్లి, ఎల్బీ నగర్ పది నెలలుగా సగం జీతమే... లాక్డౌన్ నుంచి ఇప్పటివరకు నాకు సగం జీతమే అందుతోంది. కానీ పని ఒత్తిడి మాత్రం మరింత పెరిగింది. ఆన్లైన్ క్లాసుల సమయంలో ప్రత్యేకంగా ఫోను, బోర్డు, స్టడీ మెటీరియల్ సొంత ఖర్చులతో కొనుగోలు చేశా. ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ఇంటర్నెట్ ప్యాకేజీకి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేశా. స్కూల్ నడిచే రోజులతో పోలిస్తే ఇంకా అదనంగా పనిచేశా. పని ఒత్తిడి పెరిగినప్పటికీ వేతనం మాత్రం సగమే ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మా స్కూల్లో దాదాపు 80 శాతం టీచర్లను తొలగించగా... ఒకరిద్దరమే మిగిలాం. ఈనెల ఒకటో తేదీ నుంచి స్కూల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో పూర్తి వేతనం ఇవ్వాలని కోరగా... 60 శాతం మాత్రమే ఇవ్వగలమని మేనేజ్మెంట్ చెప్పింది. ప్రత్యామ్నాయం లేనందున తప్పని పరిస్థితిలో ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. – డి.నర్సింగ్‌రావు, కార్పొరేట్ స్కూల్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, చైతన్యపురి కమిషనర్ దృష్టికి తీసుకెళతాం పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థుల ట్యూషన్ ఫీజులను చెల్లిస్తేనే పరీక్షల ఫీజులను తీసుకుంటామని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చింది. దీనిపై పాఠశాల విద్యా కమిషనర్‌తో చర్చిస్తాం. ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. – ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి కచ్చితమైన ఫిర్యాదులు వస్తే చర్యలు ట్యూషన్ ఫీజులకు, పరీక్ష ఫీజుకు లింకు పెట్టవద్దని ఆదేశాలు జారీ చేశాం. ముందుగా విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి పరీక్షలు రాసేందుకు ఇబ్బంది రాకుండా పరీక్ష ఫీజులను తీసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించాం. ఎవరైనా ట్యూషన్ ఫీజుకు, పరీక్ష ఫీజుకు లింకు పెట్టినట్లు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడతాం. జనరల్ ఫిర్యాదులు వచ్చాయి. కానీ కచ్చితమైన ఫిర్యాదులు చేయలేదు. అలా వస్తే చర్యలు చేపడతాం. – ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ -
విద్యార్థులందరికి రూ.11 వేలు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కూడా అలానే వ్యాప్తి చేందుతుంది. ఇంటర్నెట్లో కనిపించే ప్రతిదీ నిజమని నమ్మితే.. బొక్కబోర్లా పడతాం. ఇలా వైరలయ్యే న్యూస్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత నమ్మాలి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఒకటి తెగ వైరలవుతోంది. దాని సారంశం ఏంటంటే.. కేంద్రం విద్యార్థులందరికి 11 వేల రూపాయల స్కాలర్షిప్ అందిస్తుంది. స్కూలు, కాలేజీ స్టూడెంట్స్ ఫీజులు చెల్లించడం కోసం ఈ స్కాలర్షిప్ను ఇవ్వనుందనే వార్త కొద్ది రోజులుగా తెగ వైరలవుతోంది. అన్‌లాక్ 4.0లో భాగంగా విద్యాసంస్థలు తెరిచారు. అయితే చాలా మంది విద్యార్థులు ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. కనుక తమకు సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. వారి విన్నపం మేరకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 11 వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వనుంది అని. (చదవండి: మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ . లక్ష : ఈ వార్త నిజమేనా!) అయితే ఇది ఫేక్ న్యూస్.. కేంద్రం ఇలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఈ ఫేక్ న్యూస్‌ని తొలగించడేమ కాక విద్యార్థులందరికి కేంద్రం 11 వేల రూపాయలు ఇస్తుందంటూ ఓ వెబ్సైట్లో వచ్చిన ఈ వార్త నిజం కాదు. ఆ వెబ్సైట్ కూడా నిజం కాదు. కేంద్రం ఇలాంటి ప్రకటన చేయలేదు అని ట్వీట్ చేసింది. ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్లో ఈ ఫ్యాక్ట్ చెక్ ఆర్మ్‌ని ప్రారంభించింది. దీని లక్ష్యం “వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తించడం.. ప్రజలను హెచ్చరించడం’’. दावा:- एक वेबसाइट पर दावा किया जा रहा है कि कोरोना महामारी के चलते केंद्र सरकार स्कूल और कॉलेजों के सभी छात्रों को उनकी फीस भरने के लिए 11,000 रुपए प्रदान कर रही है।#PIBFactCheck:- यह वेबसाइट फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है। pic.twitter.com/kcD1jO8jZm — PIB Fact Check (@PIBFactCheck) September 22, 2020 -
ఫీజు వసూలు చేస్తేనే వేతనం
నవీన్‌కుమార్ పదేళ్లుగా ఎల్బీనగర్లోని ఓ కార్పొరేట్ స్కూల్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ అనంతరం విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నాడు. విద్యార్థుల నుంచి టర్మ్‌ఫీజు వసూలు చేస్తేనే వేతనం ఇస్తామని యాజమాన్యం టార్గెట్ పెట్టింది. దీంతో నవీన్‌కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పైసా కూడా కట్టలేమని తల్లిదండ్రులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా నవీన్‌కుమార్‌కు 3 నెలలుగా యాజమాన్యం వేతనం ఇవ్వట్లేదు. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లంతా ఇప్పుడిలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా వేతనాలందక సతమతమవుతున్నారు. వాస్తవానికి ప్రతి నెలా తొలి వారంలో అందే వేతనం.. జూలై నుంచి అందట్లేదు. జూన్, జూలై, ఆగస్టు నెలల వేతనాల గురించి యాజమాన్యాలను అడిగితే.. నిర్దేశించిన ఫీజు వసూలు టార్గెట్ పూర్తి చేయనందున ఇవ్వబోమని చెబుతున్నాయి. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు ఆన్లైన్ పాఠాల బోధనతో పాటు ఫీజు వసూలు బాధ్యతను కూడా అప్పగించాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తేనే నెలవారీ వేతనం చెల్లిస్తామని అంటున్నాయి. అయితే, కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పుడు ఫీజులు చెల్లించలేమని అంటున్నాయి. దీంతో టీచర్లకు వేతనాలందడం గగనమైపోయింది. పని పెరిగినా జీతం నిల్ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు 22 వేల వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు 2 లక్షల మంది బోధన సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సమాంతరంగా నడుస్తున్న ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. లాక్డౌన్, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు జూన్ ఒకటి నుంచే పూర్తిస్థాయిలో ఆన్లైన్లో బోధనను ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులే కీలకంగా వ్యవహరిస్తూ విద్యార్థులను సమన్వయç ³రుస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా పనిచేస్తున్నా.. వేతనానికి మాత్రం నోచుకోవట్లేదు. ప్రతి క్లాస్ టీచర్‌కు టార్గెట్ ప్రైవేట్ స్కూళ్లలో ప్రతి తరగతికి ఒక టీచర్‌ను బాధ్యుడిగా ఉంచుతూ తరగతులు నడిపిస్తారు. ఆ తరగతి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే బాధ్యతను యాజమాన్యాలు ఈ క్లాస్ టీచర్లకే అప్పగించింది. జూన్ నుంచే తరగతులు ప్రారంభం కావడంతో మూడు నెలల ఫీజులు వసూలు చేయాలని, ఫస్ట్ టర్మ్ ఫీజులు వసూలు చేసిన వారికే నెలవారీ వేతనమిస్తామనే నిబంధన పెట్టాయి. ఈ టార్గెట్‌లో దాదాపు 70శాతం మంది టీచర్లు నూరు శాతం లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం బడులన్నీ మూసి ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు తెరవరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఈ క్రమంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేస్తే.. స్కూళ్లు తెరిచాకే చెల్లిస్తామనే బదులొస్తోంది. లాక్డౌన్ కారణంగా నిరుద్యోగం పెరగడం, చిన్నాచితకా వ్యాపారాలు దెబ్బతినడంతో ఇప్పుడు ఫీజులు చెల్లించలేమని చాలామంది చెబుతున్నారు. దీంతో యాజమాన్యాలు టీచర్ల వేతనాలకు ఎసరు పెడుతున్నాయి. ‘కార్పొరేట్’లో ఇచ్చేది సగం జీతమే.. ఇక, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు లక్ష్యాన్ని పూర్తిచేస్తే సగం జీతంతోనే సరిపెడుతున్నారు. ఆన్లైన్ తరగతులు బోధిస్తూ, ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ సగం జీతం ఇవ్వడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. సగం జీతం ఇవ్వడాన్ని బోధన, బోధనేతర సిబ్బంది తప్పుబడుతున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినా.. స్పందన కరువైంది. -
ఆన్లైన్ క్లాస్.. ట్రాన్స్పోర్ట్, యాక్టివిటీస్, స్నాక్స్ ఫీజు
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో పలు ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టాయి. అయితే.. ఈ –క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సహా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముందుగా వసూలు చేసే తొలి త్రైమాసిక ఫీజులో ట్యూషన్ ఫీజు మినహా ఇతరాలను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజుల్లో కోతలతో పాఠశాలల నిర్వహణ కష్టతరమవుతుందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతుండడం గమనార్హం. తల్లిదండ్రుల వాదన ఇదీ.. ప్రస్తుతం నగరంలో ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగిస్తున్న పలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ బోధిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు సహా, ఇతర యాక్టివిటీస్, ఫుడ్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అంటే ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి వార్షిక ఫీజు లక్ష రూపాయలు అయితే.. ఇందులోనే ట్యూషన్, యాక్టివిటీస్, ఫుడ్, స్నాక్స్, ట్రాన్స్ పోర్ట్ తదితర ఫీజులు కలిపి ఉంటాయి. ఈ లక్ష రూపాయలను నాలుగు త్రైమాసికాల్లో రూ.25 వేల చొప్పున విడతలవారీగా వసూలు చేయడం పాఠశాలల ఆనవాయితీ. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్, ఫుడ్, స్నాక్స్, యాక్టివిటీస్ లేకుండా కేవలం ఆన్లైన్ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి త్రైమాసికంలో వసూలు చేసే రూ.25 వేలలో సుమారు 50 శాతం మినహాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ కలకలం నేపథ్యంలో తిరిగి పాఠశాలలను ఎప్పుడు తెరుస్తారో స్పష్టత లేని నేపథ్యంలో పూర్తిస్థాయిలో పాఠశాలలు పనిచేసే పరిస్థితి లేదు. తిరిగి స్కూల్స్ పునః ప్రారంభమైన సమయంలో మిగితా త్రైమాసిక ఫీజులను పాత పద్ధతిలో వసూలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పలు పాఠశాలలు ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధించాయని.. ఇతర నిర్వహణ ఖర్చులు అంతగా ఉండవని.. ఈ నేపథ్యంలోనే తొలి త్రైమాసిక ఫీజులను తగ్గించాలని కోరుతున్నారు. పాఠశాలల వాదన ఇలా.. విద్యార్థుల నుంచి తాము వసూలు చేసే ఫీజుల్లో రాయితీ ప్రకటిస్తే తాము తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుల వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు, వాహనాల మరమ్మతులు, వాటి ఈఎంఐలు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది జీతభత్యాలు తడిసి మోపడవుతున్న నేపథ్యంలో ఫీజుల్లో రాయితీలు ఇవ్వలేమని చెబుతుండడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయమే కీలకం.. విద్యార్థుల తల్లిండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ తక్షణం రంగంలోకి దిగి ఫీజుల వివాదాన్ని పరిష్కరించాలని ఉభయ పక్షాలు కోరుతుండడం గమనార్హం. -
ఫీజులపై దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యాసంస్థల్లో ఫీజుల నిర్ణయానికి దరఖాస్తు గడువును మరో 2వారాలు పొడిగించారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సభ్య కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మార్చి 14వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టు తెలిపారు. మెడికల్‌లో యూజీ, పీజీ, సూపర్ స్పెషాల్టీ, డెంటల్‌లో యూజీ, పీజీ, ఆయుష్, నర్సింగ్‌లో యూజీ, పీజీ, డిప్లొమో, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రోగ్రాములు నిర్వహించే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థలు ఈ గడువులోగా తమ సమాచారాన్ని aphermc.ap.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాజశేఖర్‌రెడ్డి సూచించారు. -
వసూళ్లు ‘ప్రాక్టికల్’!
సాక్షి, అమరావతి: ల్యాబ్‌లు ఉండవు.. ప్రయోగాలు అసలే కనిపించవు.. చాలామంది విద్యార్థులు కనీసం ప్రాజెక్టు రికార్డులు కూడా రాయరు.. సిబ్బందితోనే ఆ పనీ చేయించేస్తున్నారు.. ఇదీ రాష్ట్రంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లోని ప్రాక్టికల్స్ పరిస్థితి. పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లను మేనేజ్ చేస్తూ తమ పిల్లలకు అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను జరిపేందుకు బోర్డు షెడ్యూల్ ప్రకటించినా ఏ కార్పొరేట్ కాలేజీలోనూ ల్యాబ్‌లు లేకపోవడంతో ప్రయోగాల జాడేలేదు. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై కనీస పరిజ్ఞానం, నైపుణ్యాలు కూడా ఉండడంలేదు. ఎంపీసీలో 60.. బైపీసీలో 120 మార్కులకు.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇందుకు బోర్డు నిబంధనల ప్రకారం వారానికి రెండు పీరియడ్లు కేటాయించాలి. ఎంపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బైపీసీ విద్యార్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో ప్రయోగాలు చేయాలి. ఎంపీసీలో 60కి, బైపీసీలో 120 మార్కులకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. సబ్జెక్టుల వారీగా ఎలాగంటే.. ⇒ కెమిస్ట్రీలో 30 మార్కులకుగాను సాల్ట్ అనాలసిస్, వేల్యూమెట్రిక్ అనాలసిస్, ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రయోగాలతో పాటు ప్రాజెక్టు వర్కు, వైవా–వాయిస్, రికార్డులు రాయాలి. ⇒ ఫిజిక్స్‌లో 20 ప్రయోగాలు ఉంటాయి. టాబ్లర్ కాలమ్, వేల్యూస్, కాలిక్యులేషన్, ప్రికాషన్ గ్రాఫ్, వైవా–వాయిస్, రికార్డులు ఉంటాయి. ⇒ ఇక జువాలజీలో ఇంతకుముందు డిసెక్షన్లు (క్రిమికీటకాలను కోయడం) ఉండేవి. ఇప్పుడు మొత్తం రాత పరీక్ష పెడుతున్నారు. ⇒ బోటనీలో సెక్షన్ కటింగ్, క్రోమోటోగ్రఫీ ప్రయోగాలు చేయాలి. జంబ్లింగ్ విధానం అమలుచేయాలి కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి ఎగ్జామినర్లను ప్రలోభాలకు గురిచేసి తమ విద్యార్థులకు మార్కులు వేయించుకుంటున్నారు. ఈ పద్ధతి మారాలంటే ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్‌ను తప్పనిసరిగా చేయించాలి. అలాగే, ఈ పరీక్షలను జంబ్లింగ్ విధానంలోనే జరపాలి. విద్యార్థులతో పాటు ఎగ్జామినర్లకు కూడా జంబ్లింగ్ విధానంలోనే సెంటర్లు కేటాయించాలి.– రవి, ప్రధాన కార్యదర్శి,ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం తూతూమంత్రంగా డెమోలు ప్రభుత్వ కాలేజీల్లో టైమ్ టేబుల్ ప్రకారం ప్రయోగాలు చేయిస్తుండగా.. ప్రైవేటు కాలేజీలలో ఆ ఊసే ఉండడంలేదు. రెండో ఏడాది పరీక్షలకు కొద్దిరోజులు ముందు మాత్రమే తూతూమంత్రంగా తరగతి గదిలోనే డెమోలు చూపిస్తూ బోధిస్తున్నారు. ఇక రికార్డుల విషయానికొస్తే.. విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని వారి పేరిట తమ సంస్థలోని జూనియర్ లెక్చరర్లు, స్టడీ అవర్ టీచర్లతో పాత రికార్డులను చూసి రాయిస్తున్నాయి. -
నిరీక్షణ ఉండదిక..
టోల్ రుసుము చెల్లించడానికి ఇకపై వాహనం నిలిపి వరసలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. రుసుము చెల్లించే సమయంలో ఇకపై చిల్లర సమస్య కూడా ఎదురు కాదు. చేతికి వచ్చిన నలిగిన, చిరిగిన నోట్ల గురించి టోల్ ఆపరేటర్లతో గొడవ పడాల్సిన పనీ ఉండదు. రాకపోకలకు తీసుకున్న రశీదు తిరుగు ప్రయాణంలో కన్పించకపోతే ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. టోల్ గేటు వద్దకు వాహనం వచ్చిందా.. సెకన్ల వ్యవధిలో స్కానింగ్ పూర్తయిందా.. క్షణాల్లోనే మీ బ్యాంకు ఖాతా నుంచి రుసుము టోల్ ఖాతాకు బదిలీ అయిందా. టోల్ గేటు తొలగిందా.. వెళ్లామా.. ఇంతే... ఇక టోల్ గేట్ల వద్ద అమలు కానున్న ఫాస్టాగ్ పద్దతి ఇదే. సాక్షి, ఒంగోలు: జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్గేట్ల వద్ద డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఫాస్టాగ్ సేవలు అమలుకానున్నాయి. మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద, టంగుటూరు వద్ద గల టోల్గేట్ల వద్ద గరిష్ట సమయాల్లో పదుల సంఖ్యలో వాహనాలు టోల్ రుసుం చెల్లించడానికి బారులు తీరుతున్నాయి. ఇలాంటి సమస్య ప్రకాశంలోనే కాదు. జాతీయ రహదారులపై మొత్తంగా ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రయాణంలో కాలహరణం టోల్ వద్ద రుసుం చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యమే. ఈ విషయంపై జాతీయ రహదారుల విభాగం అధికారులు అధ్యయనం చేస్తే సగటున ఒక్కొక్క వాహనానికి కనీసం 15 సెకనులకు తగ్గకుండా రుసుం చెల్లింపునకు సమయం పడ్తుంది. గరిష్టంగా అర్థనిముషం సమయం పడ్తున్నట్లుగా గుర్తించారు. జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. టోల్ రుసుం చెల్లింపుల్లో జరుగుతున్న అధిక సమయం వల్ల ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావమే చూపుతోంది. దీనిని నివారించడానికి టోల్గేట్ల వద్ద నిరీక్షణ సమయాన్ని కుదించడానికి ‘ఫాస్టాగ్’ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు. జాతీయ రహదారుల అధీకృత సంస్థ ఉన్నతాధికారుల బృందం మంగళవారం మంగళగిరి వద్ద గల కాజా టోల్‌గేటు వద్ద నుంచి జిల్లాలో బొల్లాపల్లి, టంగుటూరు, కావలి వద్ద గల ముసునూరు టోల్గేట్ల వద్ద జరుగుతున్న లావాదేవీలు పరిశీలించనుంది. అక్కడ వాహనదారులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం నెల్లూరులోని నాయ్ కార్యాలయంలో ఫాస్టాగ్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్న అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. నగదు రహిత లావాదేవీలే ప్రాధాన్యం నగదు రహిత లావాదేవీలు బాగా పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోనూ ఈ లావాదేవీలు బాగా పెరిగాయి. ఆటోమొబైల్, మాల్ సెంటర్లు, షాపింగ్, వస్త్ర దుకాణాలతో పాటు ఆన్లైన్ బుకింగ్‌ల లావాదేవీలు బాగా పెరిగాయి. గత ఏడాది కేవలం 18 శాతంగానే నగదు రహిత లావాదేవీలు ఉంటే, ఇప్పుడు 42 శాతంగా లావాదేవీలు పెరిగాయి. చిల్లర వర్తకుల వద్ద ఇప్పుడిప్పుడే నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయి. రానున్న కొద్ది నెలల వ్యవధిలోనే డిజిటల్ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీల శాతం మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టోల్గేట్ల వద్ద రోజులో భారీగానే నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేలకు పైగా వాహనాలు టోల్గేట్ల వద్ద నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం వసూలవుతున్న నగదు బ్యాంకుల్లో తిరిగి కట్టడం, తిరిగి ఇతర లావాదేవీలకు డ్రా చేయడం వంటివి ఇక క్రమంగా తగ్గించనున్నారు. దీనికి గాను నవంబర్ నెలాఖరు డెడ్‌లైన్. డిసెంబర్ ఒకటి నుంచి నగదు రహిత లావాదేవీలు టోల్గేట్ల వద్ద అమలు కానున్నాయి. ఫాస్టాగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ ఒకటి నుంచి ఒక్కలైనులోనే అనుమతి.. డిసెంబర్ ఒకటో తేది నుంచి బొల్లాపల్లి, టంగుటూరు టోల్ గేట్ల వద్ద ఒక్క లైనులోనే మాన్యువల్ చెల్లింపులకు అనుమతిస్తారు. ఇక 12 లైన్లలోనూ ఫాస్టాగ్ సేవలే అందుబాటులో ఉంటాయి. విజయవాడకు వెళ్లే మార్గంలో ఒకటో లైను, నెల్లూరు మార్గంలో 14వ లైనులోనే మాన్యువల్‌గా రుసుం తీసుకుంటారు. కొద్ది నెలల తర్వాత ఈ ఒక్క లైనును తొలగించి ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులను అనుమతిస్తారు. అన్ని టోల్గేట్ల వద్ద ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఃమై ఫాస్టాగ్ యాప్’ డౌన్లోడు చేసుకోవాలి. టోల్గేట్ల వద్ద, బ్యాంకుల్లో వారి ఖాతాలకు అనుసంధానించి ట్యాగ్‌లను జారీ చేస్తున్నారు. ముందుగా ట్యాగ్ తీసుకొనే వారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలి. వాహనంపై ట్యాగ్ అతికించుకోవాలి. వాహనం టోల్‌గేటు వద్దకు రాగానే స్కానర్లు వాహనం అద్దంపై ఉన్న ట్యాగ్‌ను స్కాన్ చేసి బ్యాంకు ఖాతా నుంచి రుసుం డ్రా చేసి టోల్ ఖాతాకు జమచేస్తుంది. సంక్షిప్త సమాచారం ద్వారా ఎంత మొత్తంలో కట్ అయిందో వివరాలు సెల్‌ఫోన్‌కు వివరాలు వస్తాయి. ఇప్పటి వరకు ఒంగోలు–విజయవాడ వెళ్లేవారు బొల్లాపల్లి టోల్‌గేటు వద్ద ఒక వైపునకు రూ.140, రాకపోకలకైతే 24 గంటల వ్యవధిలో రూ.210 చెల్లిస్తున్నారు.అంటే రూ70 వరకు రాయితీ వస్తుంది. ఇప్పుడు ఫాస్టాగ్‌లో ఒక వైపు రూ.140 కట్ అవుతుంది. తిరుగు ప్రయాణం అదే వాహనం 24 గంటల వ్యవధిలోపు వస్తే రూ.210కి సరిపడా అంటే రూ.70 మాత్రమే కట్ అవుతుంది. కొన్ని టోల్గేట్ల వద్ద రాకపోకలకు ఇలాంటి సౌకర్యం అందుబాటులో ఉంది. కొన్నింటికి ఒక వైపే తీసుకుంటున్నారు.అలాంటి టోల్గేట్ల వద్ద ఈ సౌకర్యం వర్తించదు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్లపై డిసెంబర్ ఒకటి నుంచి ఈ ఫాస్టాగ్ వ్యవస్ధ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఫాస్టాగ్ సేవలు ప్రారంభించారు. జిల్లాలోనూ ఫాస్టాగ్ ట్రయల్ రన్ జరుగుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. వాహన చోదకులు ఒక సారి నమోదు చేసుకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డును జారీ చేస్తారు. ఈ కార్డును వాహనం అద్దంపై అతికించుకొని సంభందిత లైన్లో వెళ్లినప్పుడు రుసుం ఆటోమ్యాటిక్‌గా కట్ అవుతుంది. వాహనదారులకు సంక్షిప్త సమాచారం ద్వారా కట్ అయిన మొత్తం వివరాలు వస్తాయి. సులభతరం కానున్న రుసుం చెల్లింపు.. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుం వసూలు చేసే విధానం రానున్న రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ, కాలహరణం నివారించడం వంటి సౌకర్యాలు కలగనున్నాయి. రాత్రి వేళల్లో టోల్ గేట్ల వద్ద వాహనాన్ని నిలిపి రుసుం చెల్లించాలి్సన అవసరం ఉండదు. జాతీయ రహదారుల అనంతరం రాష్ట్ర రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఈ విధానమే అమలు చేయనున్నారని అధికారులు అంటున్నారు. -
పతనమవుతున్న ఉన్నత విద్యా సంస్థలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘విద్యా ఓ ప్రాథమిక హక్కు, కాసులకు కల్పించే ప్రత్యేక సదుపాయం కాదు’. అందుకని ప్రతి పౌరుడికి అందుబాటులోకి విద్యను తీసుక రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. పైగా ఢిల్లీలోని ప్రతిష్టాకరమైన జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల హాస్టల్ ఫీజులను అమాంతం 999 శాతం పెంచింది. దీంతో ఆగ్రహోదగ్రులైన యూనివర్శిటీ విద్యార్థులు సమర శంఖం పూరించడంతో దద్దరిల్లిన కేంద్ర మానవ వనరుల శాఖ కార్యాలయం దిగివచ్చింది. పెంపు ప్రతిపాదనలను భారీగా తగ్గించింది. అయినా అవి ఇప్పటికీ విద్యార్థులకు భారమే అవుతాయి. తగ్గించిన ప్రతిపాదనల మేరకు హాస్టల్ గదులకు నెలకు రెండు కేటగిరీల (దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువ) కింద 300, 150 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర సౌకర్యాలకు అదనంగా మరో 800 రూపాయలు చెల్లించాలి. ఇప్పటి వరకు హాస్టల్ గదుల అద్దె నెలకు 20, 10 రూపాయలు మాత్రమే ఉండింది. అదనపు చార్జీలు ఇంతకుముందు లేవు. భారత ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశ్వసించే సామాజిక సమానత్వం, లౌకికవాదం, శాస్త్రీయ దక్పథం, అంతర్జాతీయ అవగాహన ఆశయాలకు అనుగుణంగా ఈ జెఎన్యూ యూనివర్శిటీని 1966లో ప్రారంభించారు. అందుకని అన్నింటిలో నామ మాత్రపు చార్జీలనే కొనసాగిస్తూ వచ్చారు. ఆశయాలకు అనుగుణంగానే కుల మతాలు, వర్గాలు, ప్రాంతీయ తత్వాలకు దూరంగా సామాజిక–ఆర్థిక సమానత్వమే ప్రాతిపదికగా యూనివర్శిటీ ఎదుగుతూ వచ్చింది. సమాజంలో ఎక్కడా ఏ అలజడి జరిగినా దాని ప్రతి ధ్వని జేఎన్‌యూలో వినిపిస్తుంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు దీని ప్రతిష్ట మసక బారుతోంది. పడిపోతున్న యూనివర్శిటీల గ్లోబల్ ర్యాంకులు 2014 సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా దేశంలోని అన్ని ప్రతిష్టాత్మక జాతీయ యూనివర్శిటీల ర్యాంకులు పడిపోతున్నాయి. 2014లో భారత జాతీయ యూనివర్శిటీకి 328 గ్లోబల్ ర్యాంకు ఉండగా, అది 2015 నాటికి 341, 2016 నాటికి 354, 2017 నాటికి 397, 2018 నాటికి 420వ ర్యాంకుకు పడిపోయింది. దేశంలో ఏటేటా విద్యా రంగానికి ఆర్థిక కేటాయింపులు తగ్గిపోవడం, ఖాళీ అవుతున్న ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయక పోవడం ప్రధాన కారణాలు. విద్యారంగం పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014–2015 సంవత్సరానికి జీడీపీలో 4.14 శాతం నిధులను కేటాయించగా, అవి 2019–2020 సంవత్సరానికి 3.4 శాతానికి పడిపోయాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 2018, జూలై నాటికి 5,606 ప్రొఫెసర్ల పోస్టులు, అంటే 33 శాతం, ఐఐటీల్లో 2,802 పోస్టులు, అంటే 34 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ 2018, జూలై 23వ తేదీన లోక్‌సభకు తెలియజేశారు. ఆ పోస్టుల భర్తీకి కేంద్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక విద్యా సంస్థలను ఆ రాముడే కాపాడాలి. -
ఫీజు పెంపుపై కొద్దిగా వెనక్కి
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయంపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వెనక్కి తగ్గింది. ఎలాంటి స్కాలర్షిప్ తీసుకోని పేద(బీపీఎల్) విద్యార్థులకు హాస్టల్ ఫీజు పెంపును తాత్కాలికంగా రద్దుచేసింది. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపస్ వెలుపల ఈసీ సమావేశమైంది. ఈ నిర్ణయాన్ని కంటితుడుపు చర్యగా పేర్కొన్న విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించాయి. వర్సిటీ సర్వీస్ చార్జి రూ.1,700 పెంచడంతోపాటు వన్‌టైమ్ మెస్ సెక్యూరిటీ ఫీజును రూ.5,500 నుంచి రూ.12,000 వేలకు పెంచింది. బీపీఎల్‌యేతర విద్యార్థులకు ఉపశమనం కలిగించలేదు. -
ఈ చదువులు ‘కొన’లేం!
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కళాశాలల్లో విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న అదనపు ఫీజులకు అడ్డుకట్ట వేయాలంటే విద్యార్థులకు అందుబాటులో వర్సిటీ అధికారుల ఫోన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లు ఉంచాలి. మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, వర్సిటీలో ఫిర్యాదుల పెట్టెను అందుబాటులోకి తీసుకు రావాలి. దీంతో పాటు ఫిర్యాదు చేసిన విద్యార్థుల పేర్లను బయట పెట్టవద్దనే అభిప్రాయాలను పలువురు విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో: పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీ చదువులు భారమయ్యాయి. ఆయా కళాశాలలు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎఎఫ్ఆర్సీ) నిబంధనల మేరకు కాకుండా విద్యార్ధుల నుంచి అదనపు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఎంసెంట్ కౌన్సెలింగ్‌కు ముందు విద్యార్థుల తల్లిదండ్రులకు అరచేతిలో వైకుంఠం చూపించి, టీఎఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులకు అదనంగా ఒక్క రూపాయి తీసుకోబోమని నమ్మించి.. తమ కళాశాలలో అన్ని వసతులతో పాటు, క్యాంపస్ ఇంటర్వ్యూలు అధికంగా ఉంటాయని వల వేస్తున్నారు. కౌన్సెలింగ్ ముగిసి కాలేజీలో చేరాక ఇంజనీరింగ్ కళాశాలలు తమ అసలు రంగు బయటపెడుతున్నాయి. ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, యూనివర్సిటీ ఫీజు, స్కాలర్షిప్ అప్లికేషన్ ఫీజు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు.. ఇలా వివిధ పేర్లతో విద్యార్థుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. దీనివల్ల చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు వారి తల్లిందడ్రులపై మోయలేని భారం పడుతోంది. ఒక్కసారి కళాశాలలో చేరా ఇష్టం ఉన్నా లేకపోయినా యాజమాన్యాలు అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితి. అదనపు ఫీజులు కట్టలేక చేరిన కళాశాలను వదిలి వేరే కళాశాలకు మార్పు చేయించుకోవాలనుకున్నా సవాలక్ష కొర్రీలు ఉండడంతో గత్యంతరం లేక అదే కళాశాలల్లో అదనపు భారం మోస్తూ చదువాల్సి వస్తోంది. ఫీజుల నియంత్రణ టీఎఎఫ్ఆర్సీదే.. ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కళాశాలల్లో ఫీజుల పెంపు నిర్ణయాధికారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎఎఫ్ఆర్సీ)దేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ ప్రతి మూడేళ్లకు ఓసారి ఫీజులను ఖరారు చేస్తుంది. గతంలో కమిటీ నిర్ణయించిన ధరలను సవాల్ చేస్తూ చాలా కళాశాలలు కోర్టులను ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఫీజుల పెంపు విషయం పూర్తిగా టీఎఎఫ్ఆర్సీదేనని తేల్చడంతో కళాశాలలు తప్పని పరిస్థితుల్లో కమిటీ నిబంధనలను పాటిస్తున్నాయి. కానీ రూటు మార్చి అదనపు దోపిడీకి తెరలేపుతున్నాయి. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఆదేశాల మేరకు ఒక ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజు రూ.లక్ష అనుకుంటే, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా రూ.35 వేలు చెల్లిస్తుంది. మిగతా రూ.65 వేలు కట్టడానికి విద్యార్థి తల్లిదండ్రులు ముందే ఒప్పుకుంటారు. దాంతో ఎన్ని ఇబ్బందులు పడైనా చెల్లిస్తారు. కానీ చాలా కళాశాలల యాజమాన్యాలు జేఎన్టీయూహెచ్ నిర్ణయించిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నాయి. కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ ప్రైవేటు, అనుబంధ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపై ఉంటుంది. అనుబంధ కళాశాలల్లో మౌలిక వసతులు ఏ మేరకు కల్పిస్తున్నారనే దాన్ని వర్సిటీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ 80 శాతానికి పైగా కళాశాలలకు నిబంధనల ప్రకారం విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించడం లేదనే విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికీ వీటిపై చర్యలు తీసుకోవడం లేదు. మొక్కుబడిగా నిజ నిర్థారణ కమిటీ పర్యటన మినహా అనుబంధ కళాశాలల్లో వర్సిటీ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. -
నారాయణలో ఫీ'జులుం'
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/తిరుపతి ఎడ్యుకేషన్ : నారాయణ కళాశాలల్లో ఫీజుల జులుం మరోసారి వెలుగు చూసింది. విజయవాడలో ఫీజు కోసం ఒత్తిడి చేయడంతో అవమానంగా భావించిన ఓ విద్యార్థి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోబోగా, తిరుపతిలో ఫీజు బకాయి విషయంలో ప్రిన్సిపాల్ తనపై దాడి చేశాడంటూ ఓ విద్యార్థి తండ్రి ఆందోళనకు దిగాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం మెట్టగూడెంకు చెందిన కల్యాణం సునీత తన కుమారుడితో కలిసి మొగల్రాజపురంలో నివాసముంటోంది. స్థానికంగా ఉన్న నారాయణ ఒలంపియాడ్ క్యాంపస్‌లో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఏడాదికి ఫీజు రూ.85 వేలు చెల్లించాల్సి ఉంది. ఫీజులో ఐదువేలతో పాటు యూనిఫామ్, పుస్తకాల కోసం మరో రూ.16 వేలు చెల్లించింది. మిగిలిన రూ.80 వేలలో 60 శాతం మొత్తాన్ని డిసెంబర్ లోపు చెల్లిస్తానని ఆమె యాజమాన్యానికి వివరించింది. బాబుకు అడ్మిషన్ నెంబర్ ఇస్తే పరీక్షలకు హాజరవుతాడని బతిమలాడింది. అయితే మొత్తం ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ నంబర్ ఇస్తామని మొండికేశారు. ఈ నేపథ్యంలో పిల్లవాడు నలుగురిలో ఇబ్బందులు పడటంతో ఆమె తీవ్రంగా మానసిక సంఘర్షణకు గురైంది. సోమవారం సాయంత్రం ప్రకాశం బ్యారేజీ 51వ కానా వద్ద నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. పాదచారులు ఆమెను అడ్డుకుని స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారమందించారు. ఆమెను స్టేషన్‌కు తరలించి సీఐ కాశీవిశ్వనాథ్ కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుపతిలో ఫీజు బకాయి వివాదం తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ పట్టణంలోని గాంధీ రోడ్డులోని నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో చదివాడు. ఈ ఏడాది డే స్కాలర్‌గా గాంధీ రోడ్డులోని కళాశాలలో చేరాడు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి రూ. 15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంది. దీంతో బకాయి ఫీజు చెల్లించాలంటూ సోమవారం నితిన్‌ను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించేసింది. కుమారుడిని వెంటబెట్టుకుని కళాశాలకు వచ్చిన గోవిందరెడ్డి, ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ తనపై దాడి చేశాడంటూ గోవిందరెడ్డి కళాశాల ఎదుటే ఆందోళనకు దిగాడు. మొదటి ఏడాది ఫీజు బకాయి చెల్లించకపోవడంతో తండ్రిని తీసుకురావాలని నితిన్‌ను ఇంటికి పంపించిన విషయం వాస్తవమేనని, గోవిందరెడ్డిపై తాము దాడి చేయలేదని ప్రిన్సిపాల్ వివరించారు. పోలీసులు ఇరువర్గాలను విచారించి, ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పడంతో విద్యార్థి తండ్రి ఆందోళన విరమించాడు. -
జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థలో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ డీఈఓ రేణుక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వుల ప్రకారం జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 100 శాతం ఫీజు రాయితీ పొందనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాటిటైట్ న్యూస్ చానల్స్ స్టాఫ్ రిపోర్టర్స్ అసోషియన్కు డీఈఓ ఈ ఉత్తర్వులను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని డీవైఈఓలు, ఎమ్ఈఓలు తక్షణమే ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థ జర్నలిస్టుల పిల్లలకు ఈ మేరకు రాయితీ కల్పించాలన్నారు. -
ఫీజుల నియంత్రణ అధికారం నిపుణుల కమిటీదే
-
చదువు‘కొనాల్సిందే’!
‘అనంత’.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లా. రెక్కలు ముక్కలు చేసుకున్నా పొట్ట నిండటమే గగనం. అలాంటిది చదువు ‘కొనాలంటే’ సాధ్యమయ్యేపనేనా? అయినా చాలా మంది తల్లిదండ్రులు తమలా కాకుండా పిల్లలను ప్రయోజకులను చేయాలని అప్పులు చేసి చదివిస్తున్నారు. ఇలాంటి వారికి చేయూతనివ్వాల్సిన ఎస్కేయూ యాజమాన్యం.. ఫీ‘జులుం’ ప్రదర్శిస్తోంది. ప్రైవేటు కళాశాలల ఒత్తిడితో డిగ్రీ ఫీజులను రెండింతలు పెంచేసింది. నిరుపేదలకు ‘డిగ్రీ’ విద్యనూ దూరం చేసింది. ప్రభుత్వం మాత్రం పెంచిన ఫీజుల మేరకు రీయింబర్స్మెంట్ ఇస్తుందా? ఇచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్ రాని విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్కేయూ అనంతపురం: ఎస్కేయూ.. ఇక్కడ నిబంధనలన్నీ హుష్‌కాకి.. ఎవరికిష్టమొచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. నిబంధనలు తుంగలో తొక్కేస్తారు. ఎవరికో లాభం చేకూర్చేందుకు ఎందరినో ఇబ్బంది పెడతారు. తాజాగా డిగ్రీ ఫీజులు రెండింతలు పెంచి విద్యార్థులను కన్నీరు పెట్టిస్తున్నారు. సరైన మౌలిక సదుపాయాలు లేకుండానే ఏళ్లుగా కళాశాలలు నిర్వహిస్తున్నా... యాజమాన్యాలకు కనీసం నోటీసులు కూడా జారీ చేయని ఎస్కేయూ ఉన్నతాధికారులు...అదే ‘ప్రైవేటు’ కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గారు. డిగ్రీ ఫీజును రెండింతలు పెంచేసి వారికి భారీగా లబ్ధి చేకూర్చారు. రాయలసీమలో ఎక్కడాలేని విధంగా.. పొరుగునే ఉన్న రాయలసీమ వర్సిటీ, యోగి వేమన వర్సిటీలో డిగ్రీ కోర్సుకు గతేడాది ఫీజులనే ఖరారు చేశారు. బీఏ, బీకాం కోర్సులకు ఏడాదికి రూ.9 వేలు, బీఎస్సీకి రూ.11 వేలు మాత్రమేవసూలు చేస్తున్నారు. కానీ ఎస్కేయూలో మాత్రం ఫీజులు రెట్టింపు చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో ఉండే అనుబంధ డిగ్రీ కళాశాల స్థాయిలో ఎస్కేయూ అనుబంధ ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజులు ఖరారు చేశారు. కళాశాలలకు నిబంధనలు పట్టవా? వర్సిటీకి అనుబంధ డిగ్రీ కళాశాల ఏర్పాటైతే... మొదటి 5 సంవత్సరాల వరకూ అద్దె భవనాల్లో నిర్వహించుకోవచ్చనీ, ఆ తర్వాత సొంత భవనాల్లో కళాశాల నిర్వహించాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అయినప్పటికీ జిల్లాలోని 20 శాతం కళాశాలలు ఏళ్లుగా అద్దెభవనాల్లోనే నడుస్తున్నా... ఎస్కేయూ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. ‘ప్రైవేటు’ కళాశాలలకు నిబంధనలు సడలించిన ఎస్కేయూ యాజమాన్యం...విద్యార్థుల ఫీజుల దగ్గరి వచ్చే సరికి మాత్రం నిబంధనల పేరుతో రెట్టింపు చేసింది. దీంతో నిరుపేద విద్యార్థులకు డిగ్రీ చదువు భారంగా మారగా...ప్రైవేటు అనుబంధ డిగ్రీ కళాశాలలకు భారీగా లబ్ధి చేకూరుతోంది. ఈ వ్యవహారంలో వర్సిటీలోని ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అడ్డుగోలు నిర్ణయాలు డిగ్రీ కోర్సులో ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులను ఒకే దఫా 10 శాతానికి మించి పెంచడానికి వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఏకంగా ఫీజులు రెట్టింపు చేశారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోల్చుకుని ఫీజులు పెంచాలని కళాశాలల అసోసియేషన్ చెప్పినట్లు.. ఎస్కేయూ ఉన్నతాధికారులు వెంటనే ఆమోదం తెలిపి .. అమలు చేసేశారు. ఫీజులు ఎంత పెంచినా రీయింబర్స్మెంట్ అందుతుందనే ఉద్దేశంతో పెంచేశారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ రాని విద్యార్థుల పరిస్థితి గురించి మాత్రం పట్టించుకోలేదు. బీటెక్ కోర్సు స్థాయిలో ఎస్కేయూ డిగ్రీ కోర్సులకు ఫీజులు నిర్ణయించినా...ఆ స్థాయిలో విద్యాప్రమాణాలు ఉన్నాయా..? కళాశాలల్లో మౌలిక సదుపాయాలున్నాయా..? అని పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తుగా వసూలు ఏటా డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య 60 వేలుగా ఉంటోంది. గతేడాది వరకు ఒక్కో విద్యార్థి ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు ఫీజును చెల్లించాలని ఎస్కేయూ నిర్ణయించింది. తాజా అకడమిక్ విద్యాసంవత్సరం (2018–19) నుంచి ఏడాదికి కోర్సు ఫీజు మొత్తాన్ని బీఏకు రూ.9 వేల నుంచి రూ.15,840, బీకాంకు రూ. 18,720, బీఎస్సీకి రూ.11 వేల నుంచి రూ.18,720 పెంచారు. ఇంతటితో అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆగలేదు. రూ.18 వేలకు అదనంగా రూ.6 వేల మేర అడ్మిషన్ ఫీజును నిర్ధారించి ఏకంగా రూ.24 వేలు ఫీజును నిర్ణయించారు. ఈ మొత్తాన్ని అడ్మిషన్ ముందస్తుగా చెల్లించాలని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ‘రీయింబర్స్మెంట్’ నిబంధనలకు విరుద్ధం కుటుంబ ఆర్థిక పరిస్థితి విద్యార్థి ఉన్నత చదువులకు అవరోధం కాకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముందస్తుగా ఫీజులు వసూలు చేయకూడదని జీఓ నంబర్–18ను జారీ చేశారు. అలా వ్యవహరిస్తే ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని అప్పట్లో హెచ్చరించారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా ఫీజులు పెంచేయడమే కాకుండా ప్రభుత్వం ఆ మేరకు ఫీజు రీయింబర్స్ ఇస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి పూర్తి మొత్తంలో ఫీజులు కట్టించుకుంటున్నాయి. వాస్తవానికి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇదే తరహాలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నప్పటికీ, ముందస్తుగా నయాపైసా కూడా కట్టించుకోలేదు. కానీ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు మాత్రం యథేచ్ఛగా నిబంధనలను విస్మరిస్తున్నాయి. రెండింతలు పెంచారు డిగ్రీ ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రెండింతలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెంచిన ఫీజుల మేర ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ముందస్తుగా ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని తెలిసినా కళాశాలల యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. వర్సిటీ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. –సుజాత, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని -
ప్రైవేటు ఫీజులుం
శ్రీకాకుళం: జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు పరీక్ష ఫీజుల పేరుతో దోపిడీకి తెరతేశాయి. ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకం కావడంతో తల్లిదండ్రులు కూడా ఆయా పాఠశాలల యాజమాన్యాలు చెప్పినంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. వీరి బలహీనతను గుర్తించిన యాజమాన్యాలు పదో తరగతి పరీక్ష ఫీజులను తమకు అనుకూలంగా మలచుకొని తల్లిదండ్రుల జేబులను గుల్లచేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు ఎనిమిది నుంచి పది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125 లు మాత్రమే కాగా, పలు పాఠశాలలు వెయ్యి రూపాయలు నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. పరీక్ష ఫీజు మొత్తం ఎంతో తెలియని తల్లిదండ్రులు వారు అడిగినంత ఇచ్చేస్తున్నారు. కొందరు తెలిసిన వారు మాత్రం అంత మొత్తం ఎందుకని అడిగినప్పుడు పరీక్షల సమయంలో సహకరించేందుకు విద్యాశాఖలోని పలువురికి చెల్లింపులు జరపాల్సి ఉంటుందని చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా మౌనం వహించడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరంలో ప్రారంభంలో ట్యూషన్ ఫీజుతో పాటు, పుస్తకాలు, యూనిఫాం అంటూ వేల రూపాయల్లో వసూళ్లు చేసిన కొన్ని యాజమాన్యాలు వార్షికోత్సవాల ను సైతం విద్యార్థుల నుంచి వసూళ్లు చేసే నిర్వహిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఫీజు దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
పది పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూలు
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న ప్రైవేటు స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు ఓ విద్యార్థి. పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి రూ. 125 ఇచ్చారు. కుదరదని వారి నుంచి రూ. 400 వసూలు చేశారు. ఈ అదనపు ఫీజు వసూలుపై వారు తర్వాత డీఈఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోతున్నారు నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో బుధవారపేటకు చెందిన చిరుద్యోగి కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్ష ఫీజు కట్టేందుకు వచ్చిన ఈ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.1000 వసూలు చేశారు. ఫీజు 125 రూపాయలే కదా అని అడగగా ఫీజుతో పాటు అన్ని రకాల ఖర్చులుంటాయని స్కూల్ హెచ్ఎం సమాధానం చెప్పినట్లు తెలిపారు. జిల్లాలో ఈ రెండు స్కూళ్లలోనే కాదు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా పదోతరగతి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. కర్నూలు సిటీ: వచ్చే ఏడాది మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాలు అదనంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా, జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిర్ణీత ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పినా వారు ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అదనపు వసూళ్లపై అడిగేవారేరీ? జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 934 ఉన్నాయి. ఇందులో 431 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో పబ్లిక్ పరీక్షలకు సుమారు 30 వేల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వారి తల్లిదండ్రులు పరీక్షల ఫీజు రూ. 125 చెల్లించేందుకు స్కూళ్లకు వెళ్లితే అదనంగా డిమాండ్ చేస్తున్నారు. తాము నిర్ణీత పరీక్ష ఫీజులు మాత్రమే చెల్లిస్తామని చెబితే అధికారులకు ఇచ్చుకోవాల్సి ఉంటుందని ఆయా స్కూళ్ల హెచ్ఎంలు వాదిస్తున్నారు. అడిగిన మేరకు ఇవ్వని తల్లదండ్రుల పిల్లలకు ఏదో ఓ సాకు పెట్టి తోటి విద్యార్థుల ముందు అవమానాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కొంత మంది పేరెంట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు చూస్తాం...చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే వసూలు చేయాలి పదవ తరగతి పరీక్షలకు విద్యాశాఖ నిర్ణయించిన రూ.125 మాత్రమే అన్ని పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేయాలి. అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నగరంలోని ఓ స్కూల్లో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటాం. అదనపు ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి. – తహెరా సుల్తానా, డీఈఓ -
పరిష్కారమయ్యేనా..?
కరీంనగర్ కార్పొరేషన్: స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం బద్దకిస్తోంది. దరఖాస్తులు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా దరఖాస్తుదారుల నుంచి స్పందన కనిపించడం లేదు. 2016 నవంబర్‌లో స్థలాల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. రూ.10 వేల డీడీలను చెల్లించి 4368 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 6 నెలల గడువు విధించింది. అయినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు గడువును పొడిగిస్తూ సుమారు రెండేళ్ల కాలం ఎదురుచూసింది. చివరిగా మరో అక్టోబర్ 30 వరకు గడువును పొడిగించింది. రెండేళ్ల కాలంలో కేవలం 56 శాతం మాత్రమే దరఖాస్తులు పరిష్కారానికి నోచుకున్నాయి. అక్టోబర్ 31 వరకు గడువు ఉండగా దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పందన కనబడుటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు చివరిసారిగా ఇచ్చిన గడువును దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకుంటే బల్దియాల కాసుల పంట పండనుంది. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా రూ.30.26 కోట్ల ఆదాయం రాగా, మొత్తం దరఖాస్తులు పరిష్కారమైతే మరో రూ.20 కోట్ల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. అయితే గడువు ఎన్నిసార్లు పొడిగించినా దరఖాస్తుదారుల్లో ఉత్సాహం కనబడడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు చూపించిన ఉత్సాహం పరిష్కరించుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే చివరిసారిగా పెంచిన గడువుతో మొత్తం దరఖాస్తులు పరిష్కారం అవుతాయనే ఆశాభావం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. దరఖాస్తులన్నీ పరిష్కారానికి నోచుకుంటే బల్దియాకు కాసులపంట పండనుంది. స్పందన అంతంతే.. కరీంనగర్ నగరపాలక సంస్థలో స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. పలుమార్లు గడువు పొడిగించడంతోపాటు రెండు పర్యాయాలు బల్దియాలో ఎల్ఆర్ఎస్ మేళాను ఏర్పాటు చేశారు. ప్రతి దరఖాస్తుదారుడికి మూడు సార్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గడువులోపు మొత్తం దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం అనుమానంగానే మారింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకుంటే వీఎల్టీ కట్టాల్సి వస్తుండడంతో కొంత మంది దరఖాస్తుల పరిష్కారానికి రావడం లేదు. మరికొంత మంది దరఖాస్తుల పరిష్కారానికి ఫీజులు చెల్లించినప్పటికీ సరైన పత్రాలు సమర్పించకపోవడంతో దరఖాస్తులను అధికారులు పరిష్కరించడంలేదు. పరిష్కారంలోనూ ఇబ్బందులే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఫీజులు చెల్లించుకునే వరకే హడావిడి చేసిన అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చే విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు ఆ దిశగా వేగం పెంచడం లేదు. వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటుండడంతో దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం వేచి చూడలేక ఎలాంటి అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారు. ఇలా ఆలస్యం అక్రమాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దరఖాస్తుదారులను చైతన్యపరుస్తాం నగరపాలక సంస్థ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి దరఖాస్తుదారులకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. దరఖాస్తులు పరిష్కరించుకునే విధంగా చైతన్యపర్చి పరిష్కరించుకునే విధంగా చర్యలు చేపడ్తాం. – రవీందర్‌సింగ్, నగర మేయర్ -
ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. వ్యయాల ఆధారంగా వాసవి కాలేజీలో ఫీజును ఏడాదికి రూ.1.60 లక్షలుగా, శ్రీనిధి ఫీజును ఏడాదికి రూ.1.37 లక్షలుగా ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ఫీజుల ఖరారు విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం సమర్ధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు కు రూ.91వేలను ఫీజుగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఎఫ్ఆర్సీ) నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ శ్రీనిధి కాలే జీ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఫీజును రూ.97వేలుగా ఖరారు చేయడం పై వాసవి కాలేజీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు టీఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజుల ను తప్పుపట్టింది. ఆ కళాశాలల వ్యయాలను ఆధారంగా చేసుకుని ఫీజులను ఖరారు చేయాల్సిన అవసరం ఉందంది. వాసవి కాలేజీ ఫీజును రూ.1.60 లక్షలుగా, శ్రీనిధి ఫీజును రూ. 1.37 లక్షలుగా ఖరారు చేయాలని టీఎఫ్‌ఆర్‌సీని ఆదేశించారు. ఈ ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల సుదీర్ఘ విచారణ జరిపింది. నిర్దిష్ట కాల వ్యవధి లోపు ఫీజులను ఖరారు చేయకపోవడంపై విచారణ సందర్భంగా ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అనంతరం తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తన తీర్పును వెలువరించింది. -
ఫీజులు పెంచొద్దు
మణికొండ: కళాశాలలో చేరే సమయంలో పేర్కొన్న ఫీజులనే చెల్లిస్తాం తప్ప పెంచిన ఫీజులను చెల్లించే ప్రసక్తే లేదని విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన బాటపట్టారు. రెండు రోజుల పాటు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా యాజమాన్యం దిగిరాకపోవటంతో గురువారం ఏకంగా పరీక్షలను సైతం బహిష్కరించి రోడ్డెక్కారు. గండిపేట మండల కేంద్రంలో ఉన్న చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి రూ.1.20 లక్షల ఫీజు తీసుకుంటామని యాజమాన్యం అప్పట్లో పేర్కొంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల విషయంపై తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తూ కొన్ని కళాశాలల వారు కోర్టును ఆశ్రయించారు. దాంతో రాష్ట్ర హైకోర్టు కళాశాలల్లో అదనపు సౌకర్యాలు ఉన్న పలు కళాశాలలకు అదనపు ఫీజు వసూలు చేసుకునే వీలు కల్పించింది. దాంతో గత సంవత్సరం నుంచి విద్యార్థుల వద్ద రూ.1.20 లక్షలకు బదులుగా కోర్టు సూచించిన విదంగా రూ.2లక్షలు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో సీట్లు పొందిన ఎ కేటగిరీ విద్యార్థుల నుంచి యథావిధిగానే ఫీజు వసూలు చేస్తామని సర్క్యులర్ జారీచేయడంతో అప్పట్లో విద్యార్థులు శాంతించారు. ఈ సంవత్సరం నుంచి యాజమాన్యం, ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు పొందిన బి కేటగిరీ విద్యార్థుల నుంచి పెంచిన ఫీజలు చెల్లించాలని నిర్ణయించారు. ఆ విషయం తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళన బాటపట్టారు. కళాశాల ప్రాంగణంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫీజుల చెల్లింపు విషయంలో ప్రశ్నించిన ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ కొట్టడంతో పాటు మరో నలుగురు విద్యార్థుల దుస్తులు విప్పి బంధించారని విద్యార్థులు ఆరోపించారు. -
ఫీజు పెంపు జీవోపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ వైద్య కళాశాలల్లోని సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీజులు పెంచుతూ జారీ అయిన జీవో 78 అమలును 2 వారాలు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫార్సుల్లేకుండా ఫీజులు పెంచడం చెల్లదంటూ వైద్య విద్యార్థి అనిల్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 14న వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసిన జీవో 78 ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ మెడికల్ కాలేజీల్లో ఫీజును రూ.25 లక్షలకు పెంచడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రమణియన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. జీవో జారీ విషయం గోప్యంగా ఉంచారని, చెప్పాపెట్టకుండా ఫీజును భారీగా పెంచేశారని, ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీకి సంబంధం లేకుండా చట్ట వ్యతిరేకంగా ఫీజు పెంచారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ ఆరోపణలపై వివరణలతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. -
సీబీఐటీ కళాశాలలో రగడ
-
తాత్కాలికంగా ఛార్జీలు ఎత్తివేసిన ఎస్బీఐ
తిరువనంతపురం : వరద బీభత్సంతో కొట్టుమిట్టాడుతున్న కేరళ రాష్ట్రానికి, ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా ఆపన్న హస్తం అందించింది. ఆ రాష్ట్రంలో తాత్కాలికంగా అన్ని బ్యాంకింగ్ లావాదేవీల ఛార్జీలను, ఫీజులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. వరద సహాయ చర్యల కోసం మంజూరు చేసే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులకు కూడా ఈ మాఫీ వర్తించనుంది. డూప్లికేట్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లు, ఈఎంఐ లావాదేవీలపై ఆలస్యపు పేమెంట్ ఫీజులను ఎస్బీఐ రద్దు చేసింది. రెమిటెన్స్‌లపై వచ్చే అన్ని ఛార్జీలను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి మరలించనున్నట్టు పేర్కొంది. దీనిలోనే ఇతర బ్యాంక్‌ల నుంచే వచ్చే ఎన్ఈఎఫ్టీ/ఆర్టీజీఎస్ రెమిటెన్స్‌లు ఉండనున్నాయి. ఏమైనా ఛార్జీలను విధిస్తే వాటిని రీఫండ్ చేయనున్నట్టు ప్రకటించింది. సహాయ చర్యల్లో భాగంగా ఎవరైతే తమ వ్యక్తిగత డాక్యుమెంట్లను కోల్పోతారో, వారు కేవలం ఫోటోగ్రాఫ్, సంతకం, వేలిముద్రతోనే చిన్న అకౌంట్లను తెరిచేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏటీఎంలను, బ్రాంచ్‌లను వెంటనే తెరిచేలా చర్యలు చేపడతామని ఎస్బీఐ తెలిపింది. అంతేకాక కేరళలో వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందించడం కోసం ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఎస్బీఐ రూ.2 కోట్లను అందిస్తోంది. తన 2.7 లక్షల ఉద్యోగులు కూడా తమ వంతు సహాయ సహకారం అందించేందుకు ఎస్బీఐ ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించి, సీఎండీఆర్ఎఫ్కు విరాళంగా ఇస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. -
క్లర్క్ ఔదార్యం.. 45 మంది జీవితాల్లో వెలుగు
బెంగళూరు : ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పద’ని నానుడి. కానీ నేటి కాలంలో అన్నదానం కన్నా విద్యాదానమే గొప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పూట భోజనం పెట్టి కడుపు నింపే కన్నా జీవితాంతం కడుపు నింపుకునేందుకు కావాల్సిన ఉపాధిని చూపే, విద్యను దానం చేస్తే వారికి మాత్రమే కాక మరో పది మందికి కూడా సాయం చేసిన వారు అవుతారు. కానీ ఇందుకోసం ముందుకు వచ్చేవారు చాలా అరుదు. కోట్ల కొద్ది సంపద ఉన్న వారు కూడా ఇలాంటి సాయం చేయడానికి ముందుకు రారు. కానీ కర్ణాటక కలబుర్గి పట్టణానికి చెందిన ఒక గుమస్తా ఇలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వచ్చే జీతం కొంచమే అయినా దానితోనే 45 మంది పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. వివరాల ప్రకారం.. కలబుర్గి, మక్తాంపురాకు చెందిన బసవరాజ్ స్థానిక మండల్ పరిషత్ హై స్కూల్లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. బసవరాజ్ కుమార్తె ధనేశ్వరి అనారోగ్య కారణాల వల్ల ఏడాది క్రితం మరణించింది. దాంతో కూతురు జ్ఞాపకార్థం ఓ 45 మంది ఆడపిల్లలకు పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు బసవరాజ్. ఈ విషయం గురించి ఫాతిమా అనే విద్యార్ధి చెబుతూ ‘మేము చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్లం. పాఠశాల ఫీజు చెల్లించడం మాకు చాలా కష్టం. కానీ బసవరాజ్ సార్ మా కష్టాన్ని తొలగించారు. ఇందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సార్ చేస్తున్న సాయం చూసి ఆయన కూతురు ఆత్మ ఎంతో సంతోషిస్తుంటుంది’ అని తెలిపారు. -
ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయ్
హైదరాబాద్: కవాడిగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప విద్యార్థుల బాగోగులు చూసే మేనేజెంట్లు లేవని మండిపడ్డారు. ఫీజు కట్టలేదని యాజమాన్యం, స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి రెండింటి మధ్య పిల్లలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు యాజమాన్యాలకు వంత పాడుతున్నారని ఆరోపించారు. యాజమాన్యాల దగ్గర పోలీసులు డబ్బులు దండుకుని..కేసులను తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పారు. స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉండటం లేదని, ఇందులో బాలికల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. చేతగాని ప్రభుత్వం, స్కూళ్లల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని, ఫీజులు ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కవాడీగూడ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వాన్నపరిస్థితి నెలకొందని వెల్లడించారు. నగరంలో జరిగేది ఒకటి కేంద్ర ప్రభుత్వానికి మునిసిపల్ శాఖ మంత్రి ఇచ్చే నివేదిక మరోలా ఉందని మండిపడ్డారు. ప్రైవేట్ యాజమాన్యాల ఆగడాలు అరికట్టకపోతే పేరెంట్స్ అసోసియేషన్ తరుపున రాబోయే రోజున మరింత ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
ఇంజనీరింగ్ ఫీజు.. అందినంత గుంజు
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థికి సీటొచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పోగా మిగతా మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించాడు. కాలేజీలో చేరేందుకు వెళ్లినపుడు మరో రూ. 16 వేలు చెల్లించాలని, అవి చెల్లిస్తేనే బస్ పాస్‌కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పింది. అంత ఫీజు ఎందుకని అడిగితే యూనివర్సిటీ ఫీజు రూ. 2,500, ఎన్బీఏ ఫీజు రూ. 3 వేలు, ప్లేస్మెంట్ ఫీజు రూ. 5 వేలు, లైబ్రరీ, ల్యాబ్ ఫీజు రూ. 5,500 అంటూ వివరించింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ విద్యార్థి అప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వివేక్ (పేరు మార్చాం) బీటెక్ చదువుతున్నాడు. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి 75% హాజరు ఉండాలి. కానీ అనారోగ్యం వల్ల కాలేజీకి రాలేకపోయాడు. మొత్తంగా 65 శాతమే హాజరు ఉంది. హాజరు 65–75 శాతం మధ్య ఉంటే వర్సిటీ నిబంధనల ప్రకారం రూ. 300 వరకు మాత్ర మే కండోనేషన్ ఫీజు వసూలు చేయాలి. కానీ రూ. 10 వేలు చెల్లించాలని ఆ విద్యార్థికి యాజమాన్యం చెప్పింది. మరోసారి హాజరు తగ్గితే తమకు ఇష్టమైన చర్యలు చేపట్టొచ్చని బాండ్ పేపరుపై రాయించుకుంది. సాక్షి, హైదరాబాద్ : ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రాష్ట్రంలోని అనేక కాలేజీలు ప్రత్యేక ఫీజుల దందాకు దిగాయి. రకరకాల కారణాలతో విద్యార్థుల నుంచి అడ్డగోలు వసూళ్లకు తెరలేపాయి. కొత్తగా కాలేజీల్లో చేరిన విద్యార్థుల నుంచి పాత విద్యార్థుల వరకు భారీగా పిండుకుంటున్నాయి. రకరకాల ఫీజులంటూ.. కాలేజీల్లో ల్యాబ్, లైబ్రరీ తదితర ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఎందుకని అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా చెల్లించాల్సిందేనని చెబుతున్నాయి. వాస్తవంగా కాలేజీల్లో చేరే విద్యార్థుల నుంచి యూనివర్సిటీ ఫీజు, ల్యాబ్, లైబ్రరీ ఫీజుల రూపంలో రూ. 5,500 (అందులో రూ. 1,000 రిఫండబుల్) తీసుకోవచ్చు. ఎన్బీఏ గుర్తింపు పొందిన కోర్సులో విద్యార్థి చేరితే మరో రూ. 3 వేలు వసూలు చేయొచ్చు. కానీ కాలేజీలు మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి రూ. 15 వేలకు పైగా వసూలు చేస్తున్నాయి. ఎన్బీఏ గుర్తింపు పొందిన కోర్సులయితే అన్నీ కలిపి రూ. 20 వేల వరకు తీసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఎన్బీఏ గుర్తింపు పొందిన కోర్సులు లేని కాలేజీలూ ఆ ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నాయి. ల్యాబ్, లైబ్రరీకి రూ. 5,500 ఎందుకు? ఫీజుల నియంత్రణ కమిటీ ఖరారు చేసిన ఫీజుల ప్రకారం.. ఒక్కో విద్యార్థి నుంచి అడ్మిషన్/రిజిస్ట్రేషన్/గుర్తింపు ఫీజు కింద (వన్‌టైమ్) రూ. 2 వేలు, విద్యార్థులకు స్పెషల్ సర్వీసుకు రూ. 1,000, కామన్ సర్వీసెస్‌కు రూ. 1,500, లైబ్రరీ కాషన్ డిపాజిట్ రూ. 500 (రిఫండబుల్), ల్యాబ్ కాషన్ డిపాజిట్ రూ. 500 (రిఫండబుల్) కలిపి మొత్తంగా రూ. 5,500కు మించి వసూలు చేయకూడదు. కానీ యాజమాన్యాలు మాత్రం ప్లేస్మెంట్ ఫీజు కింద రూ. 5 వేలు, లైబ్రరీ ఫీజుగా రూ. 5,500 చెల్లించాలని చెబుతున్నాయి. వాటికి అదనంగా యూనివర్సిటీ ఫీజు, ఎన్బీఏ ఫీజు అంటూ దండుకుంటున్నాయి. ప్లేస్మెంట్ ఫీజు తప్పనిసరా? కాలేజీలకు ఫీజులు నిర్ధారించినపుడు ప్లేస్మెంట్ ఫీజు కింద ఏటా రూ. 125 చొప్పున చెల్లించాలని ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిబంధనల్లో పేర్కొంది. ఆ ప్రకారం నాలుగేళ్లకు రూ. 600 మాత్రమే అవుతుంది. కానీ రూ. వేలల్లో చెల్లించాలని యాజమాన్యాలు చెబుతుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్బీఏ గుర్తింపు కాలేజీలెన్ని? రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల్లో 97 వేలు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలు 50లోపే ఉన్నాయి. కానీ ఎన్బీఏ గుర్తింపు లేకున్నా కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. -
హైకోర్టు ఆదేశిస్తేగానీ స్పందించరా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు ఎలా ఉండాలన్న విధివిధానాలపై హైకోర్టు ఆదేశిస్తేగానీ కమిటీ స్పందించదా అని ప్రశ్నించింది. కమిటీ తీరు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది. రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు వివాదంపై దాఖలైన వ్యాజ్యాలను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 2016–17 నుంచి 18–19 వరకు మూడేళ్ల విద్యాసంవత్సరానికి గాను ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.97 వేలుగా కమిటీ సిఫార్సు చేసింది. ఇలా చేయడాన్ని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఆ కాలేజీల ట్యూషన్ ఫీజు రూ.1.37 లక్షలు, రూ.1.60 లక్షలుగా చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్ ఒక్కరే ఫీజుల్ని నిర్ణయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మిగిలిన కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారని, సమావేశాల మినిట్స్ పరిశీలిస్తే డొల్లతనం బట్టబయలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాలపై తీర్పును తర్వాత వెలువరిస్తామని ధర్మాసనం ప్రకటించింది. -
యూనివర్సిటీలకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్సిటీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ, ప్రవేటు యూనివర్సిటీలు ఏకపక్షంగా ఫీజలు పెంచకూడదంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తమిళనాడులోని అన్నమలై యూనివర్సిటీకి చెందిన ఎమ్‌బీబీఎస్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం ఆదివారం విచారించింది. రుసుముల నియంత్రణ కమిటీని సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపొద్దని తీర్పులో పేర్కొంది. 2013-14 విద్యా సంవత్సరంలో అన్నమలై యూనివర్సిటీ ఏడాదికి 5.54 లక్షలు ఫీజు పెంచడంతో ఎమ్‌బీబీఎస్, బీడీఎస్ విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం 2003లో రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. ప్రతి రాష్ట్రం సొంతగా ఫీజుల నియంత్రణ కమిటీని కలిగి ఉండాలని, ఆ కమిటీని సంప్రదించి మాత్రమే ఫీజులు పెంచాలని 2003లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచించింది. 1992 చట్టం ప్రకారం మరో రెండు వారాల్లో యూనివర్సిటీ బ్యాలెన్స్ షీట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్‌బీబీఎస్‌కు 12,290, బీడీఎస్ కోర్సుకు 10,290 వసూలు చేయాలని పేర్కొంది. -
ఎస్సీ విద్యార్థుల ఫీజు గడువును పెంచండి
న్యూఢిల్లీ: పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందుకునే ఎస్సీ విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువును పెంచేలా ఆయా విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజుతో పాటు ఉపకార వేతనం నగదు జమఅయ్యేంత వరకూ ఈ గడువును పెంచాలని కోరింది.. ఫీజు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయన్న కారణంతో పలు విద్యాసంస్థలు ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. బ్యాంక్ ఖాతాలో ఫీజు డిపాజిట్ కాగానే వెంటనే చెల్లిస్తామని విద్యార్థుల నుంచి కాలేజీలు హమీపత్రం తీసుకోవాలని సూచించింది. -
ఫీజుల ‘దడ’ఖాస్తు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ దరఖాస్తు సగటు నిరుద్యోగికి చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తుకు భారీ మొత్తంలో ఫీజు నిర్ధారించడంతో అభ్యర్థి చేతి చమురు వదులుతోంది. ఎలాంటి ఆదాయ వనరు లేని నిరుద్యోగి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషస్ జారీ చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. దరఖాస్తు ఫీజును రూ.1,200 నిర్ధారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు రూ.600 చొప్పున ఖరారు చేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ సగటున ఓ దరఖాస్తుకు రూ.200 ఫీజు నిర్ధారించిందని, అందుకు 6 రెట్లు పెంచడం సరికాదంటున్నారు. పీజీటీ, టీజీటీ కలిపి రూ. 2,400 సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2,932 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో టీజీటీ పోస్టులు 960, పీజీటీ పోస్టులు 1,972 ఉన్నాయి. వీటికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో రూ. 1,200 దరఖాస్తు ఫీజు చూసిన అభ్యర్థులు అవాక్కయ్యారు. పీజీటీ, టీజీటీ అర్హత ఉన్న జనరల్ అభ్యర్థి దరఖాస్తుకు రూ. 2,400 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. సర్కారు బడ్జెట్ ఇవ్వకపోవడంతో.. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ జాప్యమవుతుండటంతో త్వరగా భర్తీ చేసేందుకు బోర్డును ఏర్పాటు చేశారు. కానీ బోర్డు నిర్వహణకు సర్కారు నిధులివ్వకుండా.. ఉద్యోగాలకు వచ్చే దరఖాస్తు ఫీజుతోనే పరీక్షల నిర్వహణ, నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసింది. 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్దేశించిన ఫీజు అభ్యర్థులను నిలువునా దోచేయడమే. ఆ ఫీజుతో 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, కోచింగ్‌లంటూ రూ. వేలల్లో ఖర్చు చేస్తున్న నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా వసూలు చేయడం సరికాదు. ఫీజు తగ్గించి.. టీఎస్పీఎస్సీ మాదిరిగా రూ. 200 చొప్పున తీసుకుంటే బాగుంటుంది. – పల్రెడ్డి అనూష, అభ్యర్థి -
ఫీజు కట్టలేదని నర్సరీ విద్యార్థులను..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలకు ఉపక్రమించినా ప్రైవేట్ పాఠశాలల దోపిడి మాత్రం ఆగడం లేదు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలను అతిక్రమిస్తూనే ఉన్నాయి. పైగా సకాలంలో ఫీజులు చెల్లించడంలేదని దాష్టీకానికి పాల్పడుతున్నాయి. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఇంటికి పంపేయడం, తరగతి గదిలోకి అనుమతించకపోవడం, గదిలో బంధించడం లాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటననే ఒకటి చోటు చేసుకుంది. ఫీజు చెల్లించలేదని దాదాపు 59మంది నర్సరీ విద్యార్థులను బేస్మెంట్లో బంధించింది ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం. ఢిల్లీకి చెందిన రబియా గర్ల్స్ పబ్లిక్ స్కూల్లో ఫీజు చెల్లింలేదని 59 నర్సరీ విద్యార్థులను పాఠశాల బేస్మెంట్లో బంధించి తాళం వేశారు. దాదాపు ఐదు గంట తర్వాత విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని తమ పిల్లను గది నుంచి విడిపించారు. అనంతరం యాజమాన్యంపై విరుచుపడ్డారు. చిన్న పిల్లలనే మానవత్వం లేకుండా కిటికీలు లేని చీకటి గదిలో బంధించారని మండిపడ్డారు. పాఠశాల యాజమాన్యంపై ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫీజు విషయాన్ని తమకు తెలియజేయలేదని ఆరోపించారు. తమ పిల్లల ఫీజులు అడ్వాన్స్‌గా చెల్లించినా కూడా గదిలో బంధించారని కొంతమంది తల్లిదండ్రులు ఫిర్యాదులో తెలిపారు. వెంటిలేటర్లు, ఫ్యాన్లులేని గదిలో చిన్న పిల్లలను బంధించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొ నర్సరీ విద్యార్థికి దాదాపు రూ.2500 నుంచి రూ.2900 వరకూ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా పాఠశాల యాజమాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. పాఠశాల నిబంధనల మేరకే విద్యార్థులను తరగతి గదిలోని అనుమతించలేదని తేల్చిచెప్పింది. వారిని చీకటి గదిలో బంధించలేదని, ఆట గదిలో ఉంచామని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
కోచింగ్ పేరుతో దోపిడీ!
సాక్షి, కామారెడ్డి: ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడుతాయనగానే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హడావుడి మొదలవుతుంది. అందమైన బ్రోచర్లు ముద్రించి నిరుద్యోగులను ఆకర్శించే ప్రయత్నం చేస్తారు. తమ దగ్గర అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారంటూ నమ్మిస్తారు. వీరి ప్రచారాన్ని చూసి కోచింగ్ సెంటర్లలో చేరిన నిరుద్యోగులు.. సెంటర్లలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కోచింగ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి కనీస నియమాలు కూడా పాటించడం లేదు. అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పుకుని కోచింగ్ సెంటర్లను ఇష్టారాజ్యంగా నడుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో నడుస్తున్న వాటిలో ఏ ఒక్కటి కూడా నిబంధనల ప్రకారం కొనసాగడం లేదు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో కోచింగ్‌లో చేరిన నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టారాజ్యంగా.. జిల్లా కేంద్రంలో నడస్తున్న కోచింగ్ సెంటర్ల లో యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గతంలో ఉపాధ్యాయ నియామకాల కోసం టెట్, డీఎస్సీ అని ప్రకటనలు రావడంతోనే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ కార్యాలయాల దుమ్ముదులిపారు. రెండు మూడేళ్ల కాలంలో కామారెడ్డి పట్టణంలో టెట్, డీఎస్సీ పేరుతో క్లాసులు నిర్వహించి రూ. కోట్లల్లో వసూలు చేశారు. ఇప్పుడు వీఆర్వో, పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షల కోసం కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నోటిఫికేషన్లు వెలువడితే చాలు.. కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. పోటీని తట్టుకుని ఉద్యోగం సాధించాలంటే కోచింగ్ తీసుకోవలసిందేనన్న భావనతో కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. సెంటర్ల నిర్వాహకులు షార్ట్‌టర్మ్ కోచింగ్‌ల కోసం రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మెటీరియల్ కోసం అదనంగా డబ్బులు గుంజుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా... కోచింగ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ నుంచి అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ జిల్లా కేంద్రంలో ఏ ఒక్కదానికి సరైన అనుమతులు లేవని తెలుస్తోంది. కోచింగ్ సెంటర్లలో కూర్చోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేవు. వెంటిలేషన్, టాయ్‌లెట్స్, తాగునీటి సౌకర్యం.. ఇలా ఏ వసతీ కల్పించడం లేదు. విద్యాశాఖ నుంచి అనుమతులు పొందిన తర్వాతనే తరగతులు నిర్వహించాల్సి ఉన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. అర్హతలు లేని వారే బోధకులు కోచింగ్ సెంటర్లలో ఆయా అంశాలకు సంబంధించి పట్టభద్రులు బోధించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నడుస్తున్న సెంటర్లలో అర్హతలు లేనివారే ఎక్కువగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. కేంద్రాల్లో బోధకులు, వారి విద్యార్హతల జాబితాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. పూర్తిగా నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులను ప్రారంభించే సమయంలో గొప్పలు చెప్పిన యాజమాన్యాలు.. తరువాత వాటి ఊసెత్తడం లేదు. కోచింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సెంటర్ల నిర్వాహకులు అధికారులను మేనేజ్ చేసుకుంటున్నారని, దీంతో వారు వీటివైపు చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లను నడిపిస్తున్న వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
బిగ్‌బాస్‌కు షాక్
సాక్షి, చెన్నై: తమిళ బిగ్ బాస్ షోకు సినీ కార్మిక సంఘం ఫెఫ్సీ (ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) షాకిచ్చింది. షోకు పనిచేసే కార్మికులలో 75 శాతం మంది ఫెఫ్సీ సభ్యులై ఉండాలన్న నిబంధనను షో నిర్వహకులు ఉల్లంగించారని ఆరోపించింది. కార్మికులను మోసం చేస్తున్నారని వెంటనే చర్చలు తీసుకోకుంటే బిగ్ బాస్ షోను బహిష్కరిస్తామని హెచ్చిరించింది. అంతేకాదు బిగ్‌బాస్‌కు యాంకర్ గా పనిచేస్తున్న కమల్ హాసన్‌ను కూడా ఫెఫ్సీ హెచ్చరించింది. చెన్నైలో జరిగిన సమావేశంలో ఫెఫ్సీ అద్యక్షుడు ఆర్కే సెల్వమణి ఈ మేరకు ఆదేశాలను జారీచేశారు. సినీ ఇండస్ట్రీలోని 24 క్రాప్ట్ ల సమాహారమే ఫెఫ్సీ. ఈ సంఘం సూచనల మేరకు సినీ సంఘాలన్ని కూడా పనిచేస్తుంటాయి. బిగ్ బాస్ షోకు తమిళ చిత్రసీమకు చెందిన 75 శాతం కార్మికులను వినియోగించాలనే ఒప్పందం ఉంది. తొలి సీజన్ సమయంలో కూడా నిర్వహకులు నిబంధనలు ఉల్లంగించటంతో ఫెఫ్సీ, కమల్ కలుగచేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇప్పుడు రెండో సీజన్‌కు కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు ఫెఫ్సీ ఆదేశాలను మరోసారి బేఖాతరు చేశారు. దీంతో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో రెండురోజుల్లో ఫెఫ్సీ కార్మికులకు 75 శాతం పని కల్పించికపోతే బిగ్ బాస్ ను నిషేదిస్తామని, నటుడు కమల్ హాసన్ పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పేద విద్యార్థులపై ఫీజు పిడుగు
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికైన నిరుపేద విద్యార్థులకు ఫీజుల కష్టం వచ్చిపడింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ఒక్కసారిగా ఫీజులు పెంచటం వారికి శాపంగా మారింది. గతేడాదితో పోలిస్తే రూ.5 వేల ఫీజు పెంచుతూ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) నిర్ణయం తీసుకుంది. దీంతో ఫీజులు చెల్లించలేక అడ్మిషన్ కౌన్సెలింగ్‌కు సైతం హాజరుకాలేని దీన స్థితిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు దిక్కులు చూస్తున్నారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ కోర్సుకు ఆర్జీయూకేటీ ఎంపిక చేసింది. సెలెక్టయిన విద్యార్థులకు కాల్ లెటర్లు పంపింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే రూ.5,000 ఫీజును అదనంగా వడ్డిస్తున్నట్లు ఫీజుల వివరాలను అందులో పొందుపరిచింది. యూనివర్సిటీ నిర్వాకాన్ని చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజులను తగ్గించకుండా, పెంచిన తీరు విమర్శల పాలవుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లోనూ కోత ఫీజు పెంపు కారణాన్ని యూనివర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేసింది. కోర్సుకు నిర్దేశించిన ఫీజును రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయడం లేదని, అందులో కోత పెడుతోందని పేర్కొంది. దీంతో అంత మేరకు విద్యార్థులే భరించాలంటూ షరతు విధించింది. ట్రిపుల్‌ఐటీలో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు యూనివర్సిటీ నిర్దేశించిన ప్రకారం రూ.40,700 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.40,200 చెల్లించాలి. ఇందులో రూ.36 వేలు ట్యూషన్ ఫీజు కాగా, మిగతావి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, కాషన్ డిపాజిట్. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అర్హులైన వారందరికీ రూ.36 వేల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా యూనివర్సిటీకి చెల్లించాలి. కానీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆ ఫీజును తమకు చెల్లించటం లేదని, సగటున అర్హులైన ఒక్కొక్కరికి రూ.30 వేలు మాత్రమే ఇస్తోందని కాల్ లెటర్లో ప్రస్తావించింది. అందుకే మిగిలిన వ్యత్యాసంలో రూ.5 వేలు విద్యార్థులే భరించాలనే నిబంధనను విధించింది. అడ్మిషన్ పొందేటప్పుడే ఈ ఫీజును చెల్లించాలని స్పష్టం చేసింది. చిల్లిగవ్వ లేదు: ట్రిపుల్ఐటీకి ఎంపికైన ధరణి రాయికల్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని ధరణి ట్రిపుల్ఐటీకి ఎంపికైంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ధరణి.. 10 జీపీఏ సాధించి టాపర్‌గా నిలిచింది. ధరణి తండ్రి రామగిరి నరేశ్ దర్జీ పని చేస్తుండగా.. తల్లి పద్మ బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంతకాలంగా బీడీల కంపెనీ తరచూ బంద్ ఉంటుండంతో తల్లి ఉపాధి కోల్పోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. ‘ఈనెల 21న అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉంది. రూ.9,700 చెల్లించాలట. నిరుడు రూ.4,700 ఫీజు కడితే చేర్చుకున్నారు. అదనంగా రూ.5 వేలు ఫీజు పెంచారు. ఇప్పుడు ఫీజు కట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి’ అంటూ ధరణి కన్నీటి పర్యంతమైంది. రాష్ట్రం నుంచి 1,200 మంది విద్యార్థులు ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యారు. వీరిలో 90 శాతం మంది నిరుపేదలే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అదనంగా విధించిన ఫీజును భరించాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. -
చదువు..బరువు
ప్రైవేటు పాఠశాలలు తమ అత్యాçశతో.. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్నాయి. ఓవైపు ఫీజులు.. మరోవైపు పుస్తకాల దందా సాగిస్తున్నారు. ఇదంతా.. ఒక ఎత్తైతే.. ప్రభుత్వ సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధనను తుంగలో తొక్కేస్తూ సొంత సిలబస్‌ను పిల్లలపై రుద్దుతున్నారు. దీని వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో నష్టం వాటిల్లే ప్రమాదముంది. తెలంగాణ రాష్ట్రంలో సొంత సిలబస్‌తో నడుపుతున్న పాఠశాలలపై విద్యాశాఖాధికారులు దాడులు చేస్తుండగా.. మన జిల్లాలో మాత్రం కార్యాలయం కదలకుండానే ఆ శాఖాధికారులు నిద్దరోతున్నారు. విద్యార్థి పాఠశాల జీవితం అయోమయంలోకి నెడుతోంది. విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తుండటంతో.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు స్కూళ్లు.. సొంత నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల జీవితాల్ని ఇరుకున పడేస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలు విధించినా.. అవి క్షేత్ర స్థాయిలో అమలు చెయ్యకపోవడంతో.. ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో పిల్లలు అర్హత కోల్పోయే ప్రమాదముంది. సాక్షి, విశాఖపట్నం : దేశంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు హోంవర్కు ఇవ్వడాన్ని నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. సీబీఎస్ఈ పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. దీంతోపాటు పుస్తకాల మోతను కూడా తగ్గించాలని ఆదేశించింది. ఎన్సీఈఆర్టీ నిర్దేశించిన మేరకు ఒకటి, రెండో తరగతుల విద్యార్థులకు లాంగ్వేజ్, మేథమేటిక్స్, మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు లాంగ్వేజ్, ఎన్విరాన్మెంట్ సైన్సెస్, మేథమేటిక్స్ మినహాయించి ఇతర ఏ సబ్జెక్టులను ప్రవేశపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణమే సూచించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల వెలువరించిన తీర్పులో నిర్దేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల క్రమంలోనే స్కూల్ బ్యాగ్‌ల బరువును తగ్గించేందుకు ‘చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ పాలసీ’ని రూపొందించేలా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. తమ ఆదేశాలను ఉల్లంఘించే ప్రయత్నం జరిగితే తీవ్రమైన చర్యలుంటాయని కోర్టు హెచ్చరించింది. ఇదో పుస్తక వ్యాపారం తల్లిదండ్రుల నుంచి ఎంత మేర పిండుకోవాలని ప్రైవేట్ స్కూళ్లు ఆలోచిస్తున్నాయి. అందిన కాడికి దోచుకునేందుకు అనేక ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న స్కూళ్లు.. తాజాగా పుస్తక వ్యాపారానికి తెరతీశారు. సాధారణంగా.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించిన ఒకటో తరగతికి సంబంధించిన ఒక పుస్తకం రూ.10 నుంచి రూ.40 లోపు ఉంటుంది. అలాగే రెండో తరగతికి సంబంధించిన ఒక్కో పుస్తకం కేవలం రూ.20 నుంచి 50 రూపాయలుంటుంది. ఈ తక్కువ ధరలతో పుస్తకాలు అమ్మితే లాభం వచ్చే అవకాశం ఉండదు. అందుకే చాలా పాఠశాలలు కొత్త ఎత్తుగడను వేస్తున్నాయి. పుస్తక ముద్రణ సంస్థతో ముందుగానే మాట్లాడుకొని. తయారీకి అయ్యే ఖర్చు కంటే మూడు రెట్ల ధరను ముద్రించేస్తున్నాయి. దీంతో ఏ స్కూళ్లో చదువుతున్నారో అదే స్కూల్ పుస్తకాలు కొనాలనే నిబంధనతో తల్లిదండ్రుల చేతి చమురు వదులుతోంది. ఒకటో తరగతి పుస్తకాలు కొనాలంటే.. రూ.3వేల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ సిలబస్ ప్రకారం బోధన జరిగితే.. కేవలం వెయ్యి రూపాయలతో తేలిపోతుంది. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు గుణాత్మక బోధన చెయ్యాల్సి ఉంటుంది. ఈ తరగతులు చదువుతున్న చిన్నారులను పరిసరాలతో మమేకం చేస్తూ విద్య బోధించాలే తప్ప పుస్తకాలు, హోం వర్క్‌లు ఉండకూడదు. కానీ ఏ ప్రైవేట్ స్కూల్లోనూ ఈ నిబంధనలు పాటించకుండా పసిమనసులతో పుస్తక వికృత క్రీడను ఆడుతున్నారు. ఏవేవో పుస్తకాలు తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుంటూ ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలచుకుంటున్నాయి. ఎల్కేజీ విద్యార్థులకు అవసరం లేని పుస్తకాల్ని సైతం అధిక ధరలకు అంటగడుతున్నారు. ఓనమాలు దిద్దాల్సిన ఎల్కేజీ విద్యార్థికి కంప్యూటర్, జీకే, ఎన్విరాన్మెంట్ సైన్స్ పుస్తకాలు కొనుగోలు చేయిస్తుండటం గమనార్హం. ఇవి కూడా ఒక్కో పుస్తకం రూ.70 నుంచి 150 రూపాయల వరకూ ఉంటోంది. స్థాయికి మించిన పుస్తకాలు కొనుగోలు చేయించేస్తున్నారు. చిన్న మెదడుకు చిన్న విద్య అనే సూత్రాన్ని పాటించాలని విద్యా నిపుణులు చెబుతున్నా.. అవన్నీ పెడచెవిన పెట్టేస్తూ.. తల్లిదండ్రుల నుంచి ఎంత గుంజుకోవాలో లెక్కలు వేసుకుంటున్నారు. సైన్స్, సోషల్ పాఠాలు సాధారణంగా రెండో తరగతి నుంచి ఒంటబడతాయి. వాటిపై అప్పుడే చిన్నారులకు అవగాహన వస్తుంది. కానీ.. ఎల్కేజీలోనే విద్యార్థులకు సైన్స్ బోధిస్తున్నారు. అవి వారికి అర్థం కాకపోయినా.. బట్టీ విధానం ద్వారానే నేర్పిస్తూ.. వారిలోని మేధో సంపత్తిని ఆదిలోనే నిర్వీర్యం చేసేస్తున్నారు. -
పోలీస్ పోస్ట్.. ఏజు, ఫీజు ఎఫెక్ట్
సిద్దిపేటటౌన్ : విద్యార్థుల బలిదానాలు, త్యాగాల పునాదుల మీద నిర్మితమైన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రం వస్తే లక్షకు పైగా ఉద్యోగాలు మన బిడ్డలకు వస్తాయని చెప్పిన మాటలు నమ్మిన వారి ఆశలు అడియాసలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం వచ్చాక 2015 డిసెంబర్ 31న ప్రభుత్వం 9 వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తమ విలువైన సమయాన్ని కోల్పోయిన నిరుద్యోగులకు ఊరట కలిగించే విధంగా నిర్ణీత వయస్సులో కొంత సడలింపు నిచ్చింది ప్రభుత్వం. దీంతో కొంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాయి. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో 18 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో అంతే మొత్తంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. కానీ ప్రభుత్వం నిర్ణీత వయస్సులో సడలింపు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా మంది నష్టపోవాల్సి వస్తుంది. గత నోటిఫికేషన్లో భర్తీ చేసిన పోస్టుల కంటే ఈ సారి రెట్టింపు సంఖ్యలో భర్తీ చేయనున్న నేపథ్యంలో వయస్సు సడలింపు ఇస్తే ఎక్కువ మంది నిరుద్యోగులకు మేలు కలగనుంది. అలాగే, ఉద్యోగాలను విభాగాల వారీగా ప్రయారిటీ ఇచ్చి దరఖాస్తు చేసుకునే విధానానికి స్వస్తి చెప్పి కొత్తగా పోస్టు ప్రకారం ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు రూ.800 చెల్లించాల్సి వస్తుంది. మొత్తం 8 రకాల విభాగాలకు అభ్యర్థి దరఖాస్తు చేసుకోవాలంటే రూ.6400 చెల్లించాలి. ఇది పేద విద్యార్థులకు భారమే. గత నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులకు అన్నింటికీ కలిపి రూ.400 అయ్యేవి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.200 ఫీజు చెల్లించేవారు. స్పష్టత లేని నోటిఫికేషన్ వయసు, ఫీజు విషయంలో గతంలో మాదిరి అవకాశం ఇవ్వాలని ఉద్యోగార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన నోటిఫికేషన్ సమగ్రంగా లేదని, ఏ అంశంపై పూర్తి క్లారిటీ లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సివిల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఏఆర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే మొదట చెల్లించిన రూ.800 తోడు మరో రూ. 800 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన ఫీజులతో అభ్యర్థి ఏ జాబ్ అయితే తనకు వస్తుందని నమ్మకం ఉంటుందో ఆ జాబ్‌కే దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల స్పెషల్ ఫోర్స్ జాబ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి దానికంటే మెరుగైన సివిల్ జాబ్‌కు కావాల్సిన మెరిట్ సాధించినా ఆ స్పెషల్ ఫోర్స్ జాబ్‌లోనే జాయిన్ కావాలి. దీనివల్ల అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుంది. వయోపరిమితి పెంచి, ఫీజులు తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నిరుద్యోగులకు అన్యాయం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో వయోపరిమితి తగ్గించి నిరుద్యోగులకు అన్యాయం చేసింది. వయో పరిమితిలో సడలింపు ఇవ్వకుండా, మరోవైపు దరఖాస్తు రుసుం పెంచి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. ఈసారి ఉద్యోగం సాధించాలనే ఆశయంతో శిక్షణ తీసుకుంటున్నా. వయోపరిమితి పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. – సురేష్, నిరుద్యోగి నిరుద్యోగులకు మేలు చేయాలి చాలా కాలం తర్వాత విడుదల చేసిన నోటిఫికేషన్లో వయోపరిమితి తగ్గించడంతో నాలాంటి చాలా మంది నిరుద్యోగులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఇన్ని రోజులు ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతున్నా. ప్రభుత్వం రిలీజ్ నోటిఫికేషన్ చూడగానే ఇన్ని రోజులు పడిన కష్టం వృథా అయ్యింది. ప్రభుత్వం నిరుద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలి. – వెంకటేష్ ప్రసాద్, నిరుద్యోగి వయోపరిమితి పెంచాలి తాజా నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులకు అవకాశం లభించదు. దీనివల్ల డిగ్రీలు, పీజీలు చదివిన వారికి సరిపడా పోస్టులు ప్రభుత్వం విడుదల చేసే సరికి వారికి మరింత వయస్సు పెరిగి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కాకుండా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి వయోపరిమితి పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. – టి.రవి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫీజులు తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు ఫీజును పెంచడం సరికాదు. దీని వల్ల పేద విద్యార్థులు నష్టపోతారు. పెంచిన ఫీజులను తగ్గించకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం. – శ్రీకాంత్,పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి -
‘ఇంజనీరింగ్’ వసూళ్లు...!
శ్రీధర్ ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి. తన కుమారుడికి హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్య కోటా సీటు కోసం వెళితే.. ఏకంగా రూ.7 లక్షలు చెప్పారు. ప్రభుత్వోద్యోగి అయిన రవీందర్ కుమార్తెకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు. దీంతో ఘట్కేసర్ సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీకి వెళితే.. కంప్యూటర్ సైన్స్ యాజమాన్య కోటా సీటు కోసం రూ.15 లక్షలు అడిగారు. మంచి కాలేజీ కదా అని.. రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించి సీటు కన్ఫర్మ్ చేయించుకున్నారు. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ఇంజ నీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కొనసాగుతున్న దందా ఇది. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కూడా ప్రారంభం కాకముందే కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను అమ్మేసు కుంటున్నాయి. భర్తీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. ప్రముఖ కాలేజీలైతే రేట్లను మరింతగా పెంచేశాయి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ పిల్లలను ఎలాగైనా మంచి కాలేజీల్లో చదివించాలన్న ఉద్దేశంతో అప్పులు చేసైనా అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు. కాలేజీని బట్టి వసూళ్లు.. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 92,184 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో మైనారిటీ కాలేజీలు, కాలేజీల కన్సార్షియం సొంతంగా భర్తీ చేసుకునే సీట్లుపోగా.. 87,900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 61,511 (యూనివర్సిటీ కాలేజీల్లోని 3,055 సీట్లు కాకుండా) సీట్ల (70 శాతం)ను భర్తీ చేయనుండగా... యాజమాన్య కోటా (15 శాతం), ఎన్నారై/ఎన్ఆర్ స్పాన్సర్డ్ (15 శాతం) కోటాల కింద 26,389 సీట్ల (30 శాతం)ను భర్తీ చేస్తారు. అయితే మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరే విద్యార్థులు ఎక్కువగా పేరున్న కాలేజీలనే ఎంచుకుంటారు. దీంతో పలు కాలేజీలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకున్న చాలా కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా వసూళ్ల దందాకు దిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ సీటు కోసం ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.10 లక్షల వరకు డొనేషన్ డిమాండ్ చేస్తుండగా.. టాప్ కాలేజీలు రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఐటీ, ఈసీఈ కోర్సులకు కాలేజీని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.. ఈఈఈ, సివిల్తోపాటు ఇతర బ్రాంచీలకు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మెరిట్‌కు స్థానమేదీ? యాజమాన్య కోటాలోని 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల మెరిట్ ఆధారంగా.. మిగతా 15 శాతాన్ని ఎన్నారైలకు, వారు స్పాన్సర్ చేసిన వారికి ఇవ్వాలి. దరఖాస్తు చేసుకున్న వారిలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్ మార్కుల మెరిట్ సీట్లు భర్తీ చేయాలి. కానీ ఇదేదీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. యాజమాన్య కోటా సీట్ల కోసం కాలేజీకి వచ్చిన దరఖాస్తులను వెబ్సైట్లో పెట్టాలి. ఉన్నత విద్యా మండలికూడా ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి.. ఆయా కాలేజీలకు పంపాలి. మొత్తంగా మెరిట్ కలిగిన వారికి సీట్లు వచ్చేలా చూడాలి. కానీ ఉన్నత విద్యా మండలిగానీ, సాంకేతిక విద్యాశాఖగానీ దీనిని పట్టించుకోకపోతుండటంతో.. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లు అమ్ముకుంటున్నాయి. గతేడాది కొన్ని టాప్ కాలేజీల్లో ఏకంగా 80వేలకు పైన ర్యాంకులు వచ్చిన వారికి కూడా సీట్లివ్వడమే దీనికి నిదర్శనం. ఆ ‘ఇద్దరి’తో పెరిగిన రేట్లు! ఏఐసీటీఈ 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన 100కుపైగా కాలేజీలకు తొలుత అనుమతి నిరాకరించింది. వాటి యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో.. ఏఐసీటీఈతో మాట్లాడి అనుమతులు ఇప్పించింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి, ఓ మంత్రి పీఏ తాము చెప్పిన వారికి యాజమాన్య కోటా సీట్లు ఇవ్వాలని ఆయా కాలేజీలతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో వారు చెప్పిన మేరకు డొనేషన్ లేకుండా 10 సీట్లు ఇవ్వాల్సి వస్తోందని.. అందువల్లే ఈసారి డొనేషన్లను పెంచాల్సి వచ్చిందని, లేకుంటే కన్వీనర్ కోటా ఫీజుతో కాలేజీలు ఎలా నడపాలంటూ కాలేజీలు ఎదురు ప్రశ్నిస్తున్నాయని అధికారులే చెబుతుండటం గమనార్హం. -
0.5 శాతానికి ఈపీఎఫ్‌వో పరిపాలనా రుసుము
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు కంపెనీల యజమానులు చెల్లించే పరిపాలనా రుసుము 0.5 శాతానికి తగ్గింది. దీంతో అన్ని కంపెనీలకూ కలిపి ఏటా మొత్తంగా 900 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గనుంది. ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనంలో 0.65 శాతాన్ని పరిపాలనా రుసుము కింద కంపెనీలు ఇప్పటివరకు ఈపీఎఫ్‌వోకు చెల్లించేవి. వచ్చే నెల నుంచి ఈ రుసుమును 0.15 శాతం తగ్గించి 0.5 శాతంగా ఉండేలా ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య పెరుగుతున్నందున తమ పరిపాలనా ఖర్చులకు అవసరమైన వాటికన్నా ఎక్కువ నిధులే వస్తున్నాయనీ, ఈ కారణంగానే చార్జీలను తగ్గిస్తున్నట్లు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. -
ఈసారీ 60 అడుగులే..
ఖైరతాబాద్: ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతిని 60 అడుగుల ఎత్తులోనే తయారు చేస్తామని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. సర్వేశాం ఏకాదశి సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ ప్రాంగణంలో మహాగణపతి తయారీ పనులకు కర్ర పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శుక్రవారం గణపతి నక్షత్రం కావడం విశేషమ ని విఠలశర్మ సిద్ధాంతి తెలిపారు. వ రుసగా 64వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ఖైరతాబాద్ మహాగణపతి పనులను ఏకాదశి రోజు భూమి, కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గురువారం ఆయన చెప్పారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 13న రానుందన్నారు. భక్తుల కోరిక మేరకే.. ఖైరతాబాద్ మహాగణపతిని భక్తుల కోరిక మేరకు 60 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా తయారు చేయాలని నిర్ణయించామని సుదర్శన్ తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో తయారుచేయడం వల్ల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు అవకాశం ఉండదని, వినాయక పూజల సందర్భంగా 300– 500 కేజీల బరువున్న పూల మాలలను వేయాల్సి వస్తుంది. అంత బరువు వేయడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల కోరిక మేరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, న్యాచురల్ రంగులను ఉపయోగించి మహాగణపతిని తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మట్టితో చేస్తామని చెప్పినా.. అలా చేయలేకపోతున్నామని ఆయన తెలిపారు. మహాగణపతి తయారీ పనుల్లో భాగంగా కర్రపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బల్వంతరావు, హన్మంతరావు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. -
‘ప్రైవేటు ఫీజులపై ఉత్తర్వులివ్వాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపే ఉత్తర్వులు జారీ చేస్తే అడ్మిషన్ల ప్రక్రియలో ఇబ్బందులుండవని పేర్కొంది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి లక్ష్మయ్య సోమవా రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు స్కూళ్లలో విక్రయించే పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం మార్కెట్ ధరలకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేద పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థి
ముదిగుబ్బ: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా సీనియర్ ఇంటర్ విద్యార్థి సప్లిమెంటరీ పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోపు చెల్లించలేకపోయాడు. ఎనుములవారిపల్లికి చెందిన హేమంత్ కుమార్ ముదిగుబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో కాపీలు కొడుతూ మాల్‌ప్రాక్టీస్ కింద బుక్ అయ్యాడు. అనంతరం సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఆ విద్యార్థికి ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. అనుమతి పత్రాన్ని కళాశాలకు ఏప్రిల్ 16న పంపారు. ప్రిన్సిపల్ వాటిని గమనించకుండా విద్యార్థికి అనుమతి పత్రాన్ని మే 12న అందజేసి అనంతపురం ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించాడు. తీరా ఫీజు కట్టడానికి వెళ్లితే గడువు అయిపోయిందని వెనక్కు పంపారు. ఈ నెల 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రిన్సిపల్ కారణంగా ఏడాది విలువైన సమయం కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థి వాపోతున్నాడు. -
చెప్పు కట్టు
సిల్క్ దారాలతో గాజులను చుట్టి అందంగా అలంకరించడం తెలిసిందే కదా! అలాగే పాత శాండల్స్ని, చెప్పులను ముఖ్యంగా స్లిప్పర్స్‌ని కొత్తగా మార్చేయవచ్చు. వేసవి కాలం పాదాలకు చెమట, రబ్బర్ మూలంగా దురద వంటి సమస్యల నుంచి కూడా ఈ పద్ధతి వల్ల తప్పించుకోవచ్చు. అంతెందుకు ఇంటికి మాత్రమే పరిమితమైన స్లిప్పర్స్‌ని ఇలా దారాలతో చుట్టేసి బయటకు కూడా వేసుకెళ్లవచ్చు. కావల్సినవి ∙రబ్బర్ శాండల్స్ స్వెటర్ అల్లికకు ఉపయోగించే రంగు రంగు నూలు దారాలు గ్లూ (చివర్లను అతికించడానికి) ఇలా మొదలెట్టాలి.. శాండల్స్ (0 ఫొటో) స్టెప్ 1: నచ్చిన రంగు దారాన్ని తీసుకోవాలి. స్టెప్ 2: చెప్పుల స్ట్రాప్ పైన, కింది భాగాల్లో గ్లూని పూయాలి. (కొద్ది కొద్దిగా గ్లూ వాడుతూ, దారాన్ని ఉపయోగించాలి) స్టెప్ 3: దారాన్ని ముందుగా స్ట్రాప్ కిందిభాగంలో అతికిస్తూ పైనుంచి తీయాలి. గ్లూ ని ఉపయోగిస్తూ దారాన్ని స్ట్రాప్ చుట్టూ తిప్పుతూ సెట్ చేయాలి. ఎంపిక చేసుకున్న మరో రంగు దారంతో ఇలాగే చుట్టాలి. రెండో వైపు స్ట్రాప్‌ని కూడా పై విధంగా చుట్టి, గ్లూతో చివరలను అతికించాలి. దారాలన్నీ సెట్ అయ్యాయా లేదా సరిచూసుకోవాలి. స్లిప్పర్ స్ట్రాప్స్, బ్యాగ్ హ్యాండిల్స్‌ని ఇలా రంగు రంగు నూలు దారాలతో చుట్టేసి కొత్తగా మార్చేయవచ్చు. వేసవికి సౌకర్యంతో పాటు స్టైల్‌గానూ ఉంటాయి. ప్లాస్టిక్ పువ్వులను కుట్టి మరింత అందాన్ని తీసుకురావచ్చు. -
ఫీజులుంపై బిట్స్ పిలానీ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : బిట్స్ పిలానీ విద్యార్థులు ఫీజుల పెంపునకు నిరసనగా హైదరాబాద్, గోవా, పిలానీ క్యాంపస్‌ల్లో మూకుమ్మడి నిరసనలకు దిగారు. 2018-19 సంవత్సరానికి పెంచిన ఫీజులను తక్షణమే ఉపసంహరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 2011 నుంచి బిట్స్ పిలానీ మూడు క్యాంపస్‌ల్లో ఫీజులను రెట్టింపు చేశారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో ఫీజును ఏకంగా 56 శాతం పెంచిన విద్యాసంస్థ అధికారులు ఆ తర్వాత మరింతగా పెంచారని చెప్పారు. 2011లో రూ 62.400గా ఉన్న ఫీజులు 2017 నాటికి ఏకంగా రూ 1,30,000కు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత, రాబోయే బ్యాచ్‌లకు బిట్స్‌లో విద్య ఖరీదైన వ్యవహారంగా మారిందని విద్యార్ధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత బిట్స్ పిలానీలో 3000 మంది విద్యార్ధులు ఆదివారం శాంతియుత నిరసనలకు దిగగా, వెనువెంటనే గోవా, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్ధులు సైతం వారికి జతకలిశారు. మరోవైపు ‘రోల్‌బ్యాక్‌బిట్స్‌పిలానీఫీహైక్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలోనూ విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేశారు. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం ట్విటర్లో వైరల్ అవుతోంది. ఇక ఫీజులు భరించలేకపోతే డ్రాప్ అవుట్ అవండి అంటూ బిట్స్ పిలానీ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ సర్కార్ ప్రకటన చేశారనే వార్తలపై పలువురు విద్యార్ధులు భగ్గుమంటున్నారు. భారీగా ఫీజులు పెంచడంపై మండిపడుతున్న విద్యార్ధులు ఆన్లైన్ పిటిషన్‌ను కూడా నెట్లో పొందుపరిచారు. బిట్స్ పిలానీ అధికారులు మాత్రం ఇంతజరుగుతున్నా ఇప్పటివరకూ నోరుమెదపలేదు. -
అడ్మిషన్ వద్దనుకుంటే ఫీజు వెనక్కివ్వాలి
న్యూఢిల్లీ: విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకున్నప్పుడు వారు కట్టిన ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉన్నత విద్యా కళాశాలలు తిరిగి వెనక్కు ఇవ్వాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. లేకపోతే కళాశాలల గుర్తింపు, అనుమతులను రద్దు చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లకు సూచనలు చేశామనీ, విద్యార్థులను వేధించే కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని అధికారి వెల్లడించారు. ఈ నిబంధనలు డీమ్డ్ వర్సిటీలుసహా ఏఐసీటీఈ, యూజీసీ నియంత్రణలో ఉండే అన్ని కళాశాలలకు వర్తిస్తాయన్నారు. -
చదువు'కొనే' టైమొచ్చింది..!
స్వప్న 9వ తరగతి చదువుతోంది. ఆమె చదువుకు సంబంధించి తండ్రి రమేష్‌కు ఒక అంచనా ఉంది. ఏ తరగతికి వస్తే ఎంతవుతుందన్నది ముందే లెక్కలు వేసుకున్నాడు. దానికి తగ్గట్టే రకరకాలుగా పొదుపు చేస్తున్నాడు. కాకపోతే ఉన్నట్టుండి రమేష్‌కు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయింది. హైదరాబాద్‌లో ఇంటికి దగ్గర్లో ఉన్న మంచి ప్రయివేటు స్కూల్లో చేర్పించడానికి వెళ్లాడు. ఆ ఫీజులు చూసి మతిపోయింది. తను వేసుకున్న బడ్జెట్ తలకిందులయిందని అర్థమైపోయింది. ఇక 9వ తరగతికే ఇలా ఉంటే... టెన్త్, ఇంటర్ సంగతో..? ఆ తరవాత ఒకవేళ ఫారిన్‌కు పంపి చదివించాలనుకుంటే అప్పటి పరిస్థితో..? సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: చదువంటే ఇపుడు మాటలు కాదు. ఈ పరిస్థితి రమేష్ ఒక్కడిదే కూడా కాదు. టౌన్ నుంచి సిటీలకు బదిలీ అయిన వారిది మాత్రమే కాదు కూడా. నానాటికీ విద్యా వ్యయాలు పెరుగుతుండటంతో మధ్య తరగతి అందరిదీ దాదాపుగా ఇదే పరిస్థితి. పిల్లల్ని అనుకున్న స్థాయిలో చదివించలేకపోతున్నారు కూడా. ఇక విదేశీ చదువుల సంగతి సరేసరి. కాబట్టి పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకునే వారికి నెలవారీ నామమాత్రపు పొదుపు, మదుపులతో లాభం లేదు. విద్యా రుణాలు ఉన్నప్పటికీ వీటిలో గరిష్ఠ పరిమితి అనేది ఉండనే ఉంది. అంతకుమించి చేసే వ్యయాలకు సొంతంగా నిధులు సర్దుబాటు చేసుకోవాల్సిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అవసరాలను పిల్లలు చిన్న వయసులో ఉండగానే గుర్తించాలి. అందుకు తగ్గ ప్రణాళిక వేసుకోవాలి. ఆ మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే ఖరీదైన విద్యను సొంతం చేసుకునే ఆర్థిక వనరులు సమకూరుతాయి. అందుకోసం ఏం చేయొచ్చో ఒకసారి చూద్దాం... ఎంత మేర కావాలి? పిల్లల చదువు కోసం ఎంత నిధి కావాలన్న కచ్చితమైన అంచనా కష్టమే. అయితే, ఇందుకో మార్గం ఉంది. ప్రస్తుతం ఫలానా విద్యకు ఎంత మేర ఖర్చవుతుందో తెలుసుకుని దాన్ని ద్రవ్యోల్బణం కాలిక్యులేటర్‌తో లెక్కించడమే. లేదా వీలైనన్ని వనరులను పక్కన పెట్టడం చేయాలి. ఉదాహరణకు మీ పాప లేదా బాబు వయసు రెండేళ్లు అనుకోండి. వీరికి 23 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకు డబ్బులు అవసరం అనుకుంటే... మాస్టర్స్ డిగ్రీకి ఇప్పుడు సగటున రూ.15 లక్షలు అయితే, వారు ఆ వయసుకు వచ్చే సరికి రూ.62 లక్షలు అవసరం అవుతాయి. 7 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన లెక్క ఇది. అందుకే లక్ష్యానికి అవసరమైన మొత్తం ఎంతో ఓ అంచనాకు వస్తే దానికి తగినట్టు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఎండోమెంట్ ప్లాన్లు కూడా... ఎండోమెంట్ బీమా ప్లాన్లు మరో ఎంపిక. అయితే, ఇవి చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం రూపొందించినవి. పెట్టుబడి అవకాశంతో పాటు తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండేలా బీమా రక్షణనిస్తాయి. చిన్నారుల కోసం ఉద్దేశించిన పథకాలు అయినప్పటికీ వారికి ఇందులో బీమా ఉండదు. వారికి ఆధారమైన తల్లిదండ్రులకు ఇందులో బీమా ఉంటుంది. ప్రజాభవిష్యనిధి ఉండనే ఉంది... 15 ఏళ్ల కాలవ్యవధితో కూడిన పీపీఎఫ్ కూడా చక్కని సాధనమే. ఇందులో వార్షికంగా రూ.1,50,000 వరకూ పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఇందులో పెట్టుబడులకు, రాబడులకు కూడా పన్ను లేదు. వైవిధ్యం తప్పనిసరి... పిల్లల విద్య కోసం ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకున్న తర్వాత వివిధ సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత రిస్క్ ఆధారంగా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. రాబడులు ఏ స్థాయిలో కోరుకుంటున్నారు..? ఎంత మేర రిస్క్ భరించగలరు? ఎంత కాలంలో ఎంత మేర సమకూరాలి? ఇత్యాది అంశాల ఆధారంగా వేటికి ఎంత మేర కేటాయింపులు అన్నవి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీ పిల్లల ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ కోసం అయితే వివిధ కాల వ్యవధుల్లో గడువు తీరే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కాల వ్యవధిలో సరిపడేంత మొత్తం సమకూరాలంటే వచ్చే రాబడుల ఆధారంగా ప్రతి నెలా ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయమవుతుంది. పక్కా ప్రణాళికతో భవిష్యత్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన వచ్చు. మ్యూచువల్ ఫండ్స్ మంచివే... చిన్నారుల ఉన్నత విద్య కోసం చాలా వ్యవధి ఉంటుంది. అందుకోసం అధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలను ఎంచుకోవాలి. అవి మెరుగైన రాబడులను ఇస్తాయి. 15–20 ఏళ్ల కాలంలో మార్కెట్లలో ఆటుపోట్లను ఎదుర్కొని మరీ మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను ఎంచుకోవడం ఒక మార్గం. సిప్ ద్వారా 5–7 ఏళ్ల కాలంలో మోస్తరు రాబడులకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయా పథకాల్లోని పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా రిస్క్ తగ్గించుకోవడంతోపాటు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు వీలుంటుంది. అయితే తాజాగా అమల్లోకి వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను పరిగణనలోకి తీసుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన ఒకరిద్దరు కుమార్తెలున్నవారు వారి వయసు గనక 10 ఏళ్లలోపు ఉంటే ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈక్విటీతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వ పథకమిది. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కాంపౌండింగ్ ప్రయోజనంతో కుమార్తె ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ఏటా కనీసం రూ.1,000 గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాదిలో ఎన్ని సార్లయినా ఈ పరిమితికి లోబడి డిపాజిట్లు చేయొచ్చు. ప్రతి నెలా 10వ తేదీలోపు డిపాజిట్ చేస్తే దానిపై ఆ నెలకు వడ్డీ లభిస్తుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు చిన్నారుల పేరిటే ఖాతాలు తెరవగలం. దత్తత తీసుకున్న కుమార్తెలయినా పర్వాలేదు. ఖాతా తెరిచాక 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ఠంగా ఖాతా తెరిచాక 21 ఏళ్ల పాటు లేదా అమ్మాయికి 18 ఏళ్లు నిండి వివాహం అయ్యేంతవరకు ఖాతా మనుగడలో ఉంటుంది. 18 ఏళ్లు నిండినా లేక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినా ఆ అవసరాల కోసం అప్పటి ఖాతా విలువలో 50 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అర్హత అవుతుంది. ఈ పథకంలో ప్రారంభంలో 9.2 శాతం వడ్డీ రేటు ఉండగా ప్రస్తుతం 8.1 శాతానికి తగ్గింది. అయినప్పటికీ బ్యాంకు వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువే. ప్రతీ త్రైమాసికానికీ ఈ పథకంపై వడ్డీరేటును కేంద్రం సమీక్షిస్తుంటుంది. బాలికల బంగారు భవిత దృష్ట్యా వారి పేరిట పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మిగిలిన పథకాల కంటే దీన్లో కొంచెం అధిక వడ్డీ రేటును కొనసాగించాలన్నది కేంద్రం విధానం. ఇక ఈ పథకంలో చేసే పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలూ ఉన్నాయి. ఏటా రూ.1.5 లక్షల పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. పెట్టుబడులపై వచ్చే వడ్డీకి, కాల వ్యవధి తీరాక చేతికందే మొత్తానికి పన్ను లేదు. -
‘ఫెఫ్సీతో ఒప్పందం అవసరం’
తమిళసినిమా: దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి నిర్మాతల మండలికి మధ్య ఒప్పందం అవసరం అని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ సమ్మె కారణంగా సినీ కార్మికులకు రూ.50 కోట్లు నష్టం వాటిల్లిందని అన్నారు. 50 ఏళ్ల సినీ చరిత్రలో 50 రోజుల పాటు సమ్మె కొనసాగడం, తమిళ ఉగాదికి కూడా కొత్త చిత్రాలు విడుదల కాకపోవడం ఇదే ప్రప్రథమం అని పేర్కొన్నారు. ఎట్టకేలకు చర్చల ద్వారా పరిష్కారం లభించి సమ్మె విరమణ కావడం సంతోషం అని, ఇందుకు ప్రభుత్వానికి, నిర్మాతల మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఫెఫ్సీలో మొత్తం 22 శాఖలున్నాయన్నారు. అందులో 12 శాఖలు ఒప్పందం విధానంలోనూ, 10 శాఖలు రోజూవారి వేతనాల విధానంలోనూ కొనసాగుతున్నాయని తెలిపారు. ఇకపై నిర్మాతల మండలిలో ఫెఫ్సీకి చెందిన 12 శాఖలకు చెందిన వారికి ఎంత పారితోషకం, ఎన్ని రోజులు షూటింగ్ అన్న అంశాల గురించి ఒప్పందం చేసుకుని నిర్మాతల మండలి నిర్వాహకుల సంతకాలతో కూడిన ఆ పత్రాలు ఫెఫ్సీకి అందిన తరువాతే టెక్నీషియన్స్ షూటింగ్‌కు వెళతారని చెప్పారు. అదే విధంగా రోజూవారి వేతనాల కార్మికులకు ఆ రోజు షూటింగ్ ముగిసిన వెంటనే చెల్లించాలని అన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి తెలిపారు. -
ఆన్లైన్ ద్వారానే పీసీఐకి ఫీజు చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు వార్తాపత్రికలు, ఏజెన్సీలు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని పీసీఐ సూచించింది. ఆ మొత్తాన్ని Sabpaisa& Allbank Qwikcollect లింకు ద్వారా అలహాబాద్ బ్యాంకు అకౌంటు నంబర్‌కు చెల్లించాలని పేర్కొంది. ఆన్లైన్ లింకు, ఇతర చెల్లింపు వివరాలను http://presscouncil.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి వార్తా పత్రికకు శాశ్వత యూనిక్ ఐడీని కేటాయిస్తామని, దాని ద్వారా చెల్లింపులు జరపాలని పేర్కొంది. ఆఫ్‌లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలను వెంటనే నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. -
బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలి’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దేశంలో ఎక్కడ ఉన్నత విద్యను అభ్యసించినా పూర్తి ఫీజులను చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విధానం ఒకేలా ఉండేదన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు ఒకలా, బీసీలకు ఇంకోలా ఫీజు విధానాలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు నిబంధన లేకుండా ఫీజులు చెల్లిస్తూ, బీసీ విద్యార్థులకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. దీనిపై తక్షణమే సీఎం జోక్యం చేసుకుని పదివేల ర్యాంకు నిబంధన ఎత్తేయాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
తిరిగి ఇవ్వరా..!
సాక్షి,సిటీబ్యూరో: భూ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న స్థలాల్లో తిరస్కరణకు గురైన భూముల రుసుం తిరిగి రాబట్టుకునేందుకు పేదలు అగచాట్లు పడుతున్నారు. భూ క్రమబద్ధీకరణ దరఖాస్తుదారుల్లో తిరస్కరణకు గురైన స్థలాల యజమానులు దాదాపు రూ.21.53 కోట్లు చెల్లించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో అనధికార ఇళ్ల భూములను క్రమబద్ధీకరించేకునేందుకు అప్పులు చేసి మరీ దరఖాస్తు చేసుకున్న పేదల ఆశలు అడియాసలయ్యాయి. దరఖాస్తుదారులు తాము చెల్లించిన రుసుం కోసం ఏడాదిగా తహసీల్దార్ అఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఖాజానా నింపుకునేందుకు అక్రమిత స్ధలాల క్రమబద్ధీకరణ పేరుతో పెద్ద ఎత్తున ఆదాయం పెంచుకున్నా.. తిరస్కరణ గురైన వాటి రుసుం మాత్రం వెనక్కి ఇచ్చేందుకు అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పేదల నుంచి తహసీల్దార్లపై ఒత్తిళ్లు రావడంతో జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసి మిన్నకుండి పోయింది. ఇదీ పరిస్థితి ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీవో 59 కింద ఆక్రమిత ఇళ్ల భూ క్రమబద్ధీకణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పేదలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 6172 దరఖాస్తులు రాగా, అందులో 809 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరో 873 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు మార్కెట్ ధర ప్రకారం 125 గజాలకు 10 శాతం, 125 గజాలకు మించితే 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా యంత్రాంగం భూ క్రమబద్ధీకరణ ద్వారా రూ. 100 కోట్ల ఆదాయం రావచ్చునని అంచనా వేయగా, దానికి మించి రూ.153 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. అందులో తిరస్కరణకు గురైన స్ధలాలకు సంబధించిన రుసుం రూ.21.53 కోట్లపైనే, భూములు క్రమబద్ధీకరించని కారణంగా ఆయా మొత్తాలను దరఖాస్తుదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఖాజానాలో జమచేయడంతో చెల్లింపులు అంత సులభం కాదు. ఇందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు తిరస్కరణ స్థలాల రుసుం చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న పాఠమా
ప్రతి పొద్దూ ఇలా ఉండాలి. కాంతిమంతంగా.అజ్ఞానాన్ని పారద్రోలేలా. ధనిక, పేద.. అందరికీ.. ‘వెన్నెల’ సమానం అనేలా! సికింద్రాబాద్ ఆల్వాల్‌లోని వెంకటాపురంలో ఉంది ఆ పాఠశాల. పాఠశాల బయట బోర్డుపై బోధివృక్షం, దానికి పైగా అర్ధచంద్రాకారంలో ‘మహాబోధి విద్యాలయ’ అనే పేరు, దాని కింద స్కూల్‌ని స్థాపించిన సంవత్సరం (1992) ఉంటుంది.బోధివృక్షం ఆ పాఠశాల గుర్తు. అంబేడ్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ఆ పాఠశాలను నడుపుతోంది. సమాజంలో మహిళ స్థానం ఎలా ఉండాలని అంబేడ్కర్ ఆశించారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంటుంది మహాబోధి విద్యాలయలో. అంబేడ్కర్ ఒక సందర్భంలో ‘ఒక సమాజాన్ని అంచనా వేయాలంటే ముందుగా ఆ సమాజంలో మహిళలు సాధించిన అభ్యున్నతిని చూడాలి. వారి పురోగమనం మీదనే సమాజం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది’ అన్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ బోధన జరుగుతోంది. ఈ పాఠశాలలో బోధనా సిబ్బంది అంతా మహిళలే. మొత్తం 27 మందిలో ప్రిన్సిపాల్, పిఈటీ టీచర్, వాచ్‌మన్... ఈ ముగ్గురు మాత్రమే మగవాళ్లు. మిగిలిన 24 మంది మహిళలే. సహనమూర్తులు కనుకనే ఈ పాఠశాలలోని విద్యార్థులలో ఎక్కువ మంది అల్పాదాయ వర్గాల వాళ్లే. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన కుటుంబ స్థితి. వీరిలో సింగిల్ పేరెంట్ సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకోవడంతో తల్లి కష్టపడి పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో పరిపూర్ణమైన కుటుంబంలో ఉండే భరోసాపూరిత వాతావరణం ఉండదు. ఆ ప్రభావం పెరిగే పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. అంచేత ఆ పిల్లలకు వాళ్ల ఇంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పాలి. ఒకవేళ ఒక విద్యార్థి హోమ్‌వర్క్ చేయకపోతే కారణాన్ని కనుక్కోవాలి. తల్లితోపాటు పనికి వెళ్లడం, నీళ్లు పట్టుకోవడానికి వెళ్లి ఆ పని పూర్తయ్యే సరికి కాలనీలో కరెంట్ పోవడం.. ఇలాంటివెన్నో కారణాలు ఉంటాయి. అవేవీ కాకపోతే ఆ రోజు రాత్రి వాళ్ల నాన్న మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టడం, పిల్లల్ని కొట్టినంత పని చేసి బెదరగొట్టడం వంటిది జరిగి ఉంటుంది. అలాంటి పిల్లల్ని హోమ్‌వర్క్ చేయలేదనే కారణంగా కఠినంగా శిక్షిస్తే ఇక స్కూలుకి కూడా దూరమై, వీధుల్లో తిరగడానికి వెళ్లడమే కాకుండా, వాళ్ల వంటి పిల్లల్నే వెతుక్కుని ఆకతాయితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అలాంటివారు స్కూలుకి వెళ్లమని ఎంత ఒత్తిడి చేసినా వెళ్లనని మొండికేస్తారు, పద్నాలుగు, పదిహేనేళ్లు వచ్చేసరికి తల్లికి ఎదురు తిరగడం కూడా అలవాటవుతుంది. ఇన్ని ఉంటాయి. ‘‘వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పాలంటే అంత సహనం ఉండేది మహిళలకే’’ అంటారు స్కూలు నిర్వాహకురాలు వెన్నెల. మూడవ బిడ్డకు సగమే ఫీజు ‘‘సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉండే పిల్లలతోపాటు అమ్మమ్మ, నాయనమ్మ సంరక్షణలో ఉండే పిల్లలు కూడా ఉంటారు. వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ సంగతి కూడా టీచర్‌కు తెలిసి ఉంటే విద్యార్థి పట్ల చూపించే ఆదరణ వేరుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే టీచర్ తల్లిలా పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని చదువు చెప్పాలి’’ అంటున్నారు వెన్నెల. ‘‘అలాగే ఇద్దరు పిల్లలను పెంచి, పోషించి, చదివించడానికి ఈ రోజుల్లో తల్లిదండ్రులు తలకిందులవుతున్నారు. అలాంటిది మూడవ బిడ్డను చదివించడమంటే వాళ్లు తలకు మించిన భారంగానే ఉంటుంది. దాంతో ముగ్గురిలో ఒకరిని చదువు మాన్పించి పనుల్లో పెట్టేస్తుంటారు. ముగ్గురిలో ఎవరో ఒకరు చదువును నష్టపోతుంటారిలా. అందుకే మూడవ బిడ్డకు ఫీజులో సగం రాయితీ ఇవ్వాలనుకున్నాం. ఈ రాయితీ వర్తించాలంటే మొదటి ఇద్దరినీ చదివిస్తూ ఉండాలి. పెద్దవాళ్లను చదువు మాన్పించి పనికి పంపిస్తున్న వాళ్లకు ఈ రాయితీ వర్తించదనే కండిషన్ కూడా పెట్టాం. బాలికలకు ప్రాధ్యానం ‘‘ఈ పాతికేళ్లలో పది వేలకు పైగా విద్యార్థులు మా స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్లారు. వారిలో దాదాపు ఐదు వేల మంది బాలికలు ఉండడం మాకు గర్వంగా అనిపించే విషయం. మా స్టూడెంట్స్ ఇళ్లలో అబ్బాయిని స్కూలుకి పంపించి, అమ్మాయిని ఇంట్లో పనులకు ఆపిన కుటుంబం ఒక్కటీ లేకుండా చూడగలిగామనేది మహిళగా నాకు పెద్ద సంతృప్తి. మా నాన్న (విప్లవ గాయకుడు గద్దర్) ఈ స్కూల్ స్థాపించిన ఉద్దేశం నెరవేరుస్తున్నాననే సంతోషం కూడా. మా స్కూల్ స్టాఫ్ అంతా అదే భావాలతో పని చేస్తుండడంతోనే ఇది సాధ్యమైంది’’ అని వివరించారు వెన్నెల. ఆదర్శాన్ని వల్లించడం కాకుండా ఆచరణలో చూపిస్తోంది మహాబోధి విద్యాలయ. ఇంట్లో పరిస్థితులు సరిగా లేని పిల్లల్ని హోమ్‌వర్క్ చేయలేదనే కారణంగా కఠినంగా శిక్షిస్తే ఇక స్కూలుకి కూడా దూరమై, ఆకతాయితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిని చక్కదిద్ది దారిలో పెట్టే సహనం మహిళా టీచర్లకు మాత్రమే ఉంటుంది. – వెన్నెల, స్కూలు నిర్వాహకురాలు – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సిద్దవ్వ
‘‘అమ్మా! ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనియ్యరట్నే?’’ తల్లి జడ అల్లి, రిబ్బన్ ఇస్తే దాంతో ఆ జడను జతచేసుకుంటూ చెప్పింది ఎనిమిదో తరగతి చదువుతున్న రేణుక. ‘‘బాపమ్మకు పింఛన్ రానీ... కడ్దాం’’ అంటూ విసురుగా బిడ్డను కుడికి తిప్పి అటు వైపు తల దువ్వి ఇంకో జడకోసం పాయలు తీయసాగింది భూలక్ష్మి. పక్కింట్లోంచీ మాటలు వినపడుతున్నాయి. ‘‘అమ్మా.. ఎన్ని రోజుల్సంది అడుగుతున్నా.. బూట్లుగావల్నని? షెర్కు పనికివోతే ఇస్తా.. మిరపకాయలు తెంపవోతే ఇస్తా.. బెండకాయ ఇర్వవోతే ఇస్తా అని నాల్గు నెల్ల నుంచి అంటున్నవ్. యే కాలంకి ఆ కాలం బోతనే ఉంది పైసల్లెవ్.. బూట్లు లెవ్. రాజుగాడు గొన్నడు.. మహేందర్గాడు తెచ్చుకున్నడు.. నన్ను ఎక్రిస్తున్రే....’’మారాం చేస్తున్నాడు ఇంటర్ ఫస్టియర్లోఉన్న కొడుకు. ‘‘చింతపండు వొల్వవోతా కదా.. ఆ పైసల్ రాంగనే ఇస్తా...’’ బోర్లించిన సత్తు పళ్లెం మీద జొన్నరొట్టెను ఒత్తుతూ అంది సరోజ.‘‘నాకిప్పడే గావాలేపో. బాపమ్మను అడిగియ్యి!’’ జిద్దుతో కాళ్లను నేలకేసి తంతూ అన్నాడు. రొట్టెను పెనం మీద వేస్తూ ‘‘బాపమ్మ తాన ఏడుంటయ్? అక్క ఫోన్ జేసింది. చిన్ను గాడి పుట్టెంట్రుకలు వెట్టుకుంటున్రట. బట్టలు.. మాసం బంగారం కట్నంబెట్టాలే. యేడ్నుంచయితయ్ అన్ని? గా పైసల కోసమే ఎవరి కాళ్లువట్టుకొవాల్నో తెల్వక సస్తున్నా’’ తనలో తను అనుకుంటూ కొడుక్కీ చెప్పింది సరోజ. ‘‘నాకు దెల్వదు.. నీ యవ్వ.. ఈ నెలగన్క పైసలియ్యకపోతే సూడు.. ఇంట్లకెంచి ఎల్లిపోతా’’ అదే జిద్దు, అదే మొండితనంతో కొడుకు. పైన రేకుల వేడి.. పొయ్యి వేడి.. తన నిస్సహాయత మీద కోపం..అన్నీ నెత్తికెక్కి పిండిచేతిని దులుపుకొని, నుదుటి మీద పడ్డ జుట్టును మణికట్టుతో వెనక్కి తోసుకుంటూ లేచింది ‘‘ఏందిరా బాడ్కో.. లెస్స మాట్లాడుతున్నవ్? ఇంట్లకెంచి వోతవా?’’ అంటూ గది మూలకు చూడసాగింది చీపురు కోసం. తల్లి ఆవేశం తెలిసిన కొడుకు నిమిషంలో బయటపడ్డాడు. అయినా తగ్గని అమ్మ.. చీపురు తీసుకొని వాకిట్లోకి పరిగెత్తింది కొడుకు వెనకాలే.. ‘‘నీయయ్య ఏమన్న ఈడ గడ్డ దాషివెట్టి పోయిండనుకుంటున్నావ్రా? బూట్లులెవ్.. గీట్లు లెవ్.. మల్లగనక ఆ పేరెత్తినవో పాత బూటుతో కొడ్తా ఏందనుకుంటున్నవో బిడ్డా’’ తప్పించుకుని పోతున్న కొడుకు వేగాన్ని అందుకోలేక స్వరాన్నిపెంచింది సరోజ. ఆ రెండిళ్లకు కలిపి ఒక్కటిగా ఉన్న వాకిట్లో కూర్చునుంది సిద్దవ్వ. రెండిళ్ల మాటలూ ఆమె చెవినపడ్డాయి. చాచుకుని ఉన్న కుడికాలును చూసుకుంది. మోకాలి కింద పాత గుడ్డతో గట్టిగా కట్టుకట్టి ఉంది. ఆ దెబ్బ తగిలి దాదాపు మూడు నెల్లవుతోంది. కాస్త వంగింది కుడిచేత్తో కట్టు ఉన్న చోటును రుద్దుకుందామని. నొప్పి ప్రాణం తీసింది. ‘‘అవ్వా....’’ అని మూలుగుతూ మళ్లీ అరుగుకు వెన్నును వాల్చింది. ‘ఈ నెలన్నా దవ్ఖాన్ల సూపించుకోవాలే అనుకున్న..’ మనసులో సణుక్కుంటూ నిస్సహాయంగా అరుగు అంచుకు తల ఆనించింది. అనుభవించిన జీవితం మెదిలింది. ఈ ఇంటికొచ్చినప్పుడు తొమ్మిదేండ్ల పిల్ల. పెండ్లంటే ఆటలెక్కనే అన్కుంది. అటెన్క నాలుగేండ్లకు పెద్దమనిషి అయింది. పద్నాలుగేండ్లకు మల్లేష్, పదహారేండ్లకు బాల్‌రాజు, ఆ యేడాదికే పద్మ... పదిహేడేండ్లకే ముగ్గురు పిల్లలు. మధ్యల ఇంక రెండు కడుపులు వొయినయ్. ‘‘ఛల్.. గీ ఊళ్లె పనిజేస్తనా’’ అని పెనిమిటి.. కొన్నొద్దులు బొంబైల, ఇంకొన్నొద్దులు మస్కట్ల ఉండి పైసల్ దేలేగాని అప్పులైతే జేసిండు మస్తుగా. అన్నోంకల అప్పు వుట్టుడు బంద్ అయినంక ఊర్లేనే ఉండుడు సురు వెట్టుండు. అప్పు ముట్టజేషె తందుకు ఉన్న రెండెక్రాలు అమ్ము కుంటిమి. పద్మ పెండ్లికి మల్లా అప్పే. సోల్ది వెట్టంగా వెట్టంగా కూలికి వోవుడు మొదలువెట్టిండు మొగడు. కొడుకులు చేతికొచ్చినంకైతే పురాగా పని బందేవెట్టిండు. పరాకత్ తాగుడే. తాగతందుకు పైసల్ లేకపోతేనే పని. కొడుకులతో సరిసమానంగా మొగోడిలెక్క ఎంత కష్టవడ్డది? పెండ్లిలు, నీల్లాటలు.. ఎన్ని జేసింది? భూపాల్‌రెడ్డి దొర పొలంల పెనిమిటి, ఇద్దరు పిల్లలు గల్సి బాయి దవ్వుతుంటే మట్టిపెళ్లలు ఇరిగి మీదవడ్డయ్. మొగడైతే ఆడిదాడ్నే పానం ఇడ్శే. పీన్గును దీస్కొని అందరం గల్సి భూపాల్‌రెడ్డి దొర ఇంటికాడికి వోతిమి. పైసల కోసం. ‘‘ఆడు తాగి సచ్చిపోయిండు. నేనెందుకు దండుగ్గడ్తా? ఉల్టా నా పేరే బద్నాం.. ఫలానా దొరకోసం బాయి దవ్వుతుంటే సచ్చిపోయిండని. మల్లా నా పొలంల పనికెవరొస్తరే?’’ అని గాయ్జేసి.. లొల్లివెట్టి రూపాయి ఇయ్యలే. పోస్ట్‌మార్టమ్‌ల తాగి సచ్చిపోయిండనే అచ్చిందట. ‘‘అవ్మల్లా.. కాయకష్టంజేషెటోళ్లు తాగకుండా ఎట్ల పనిజేస్తరు?’’అని పీన్గును బొందవెట్టినంక కల్లు గుడ్షె కాడ గూసోని భూపాల్‌రెడ్డి దొరను తిట్టిండ్రు తనోల్లంతా. ‘‘వారీ.. గా దొర ముంగట నోరువెగ్లకుండా.. కల్లు ముంతను జూస్కోని ఎంత ఎగిర్తే ఏమొస్తదిరా?’’ అన్నది. ‘‘యే.. లంగగాడ్దికొడుకే అడు! మనమేం జెప్పినా ఇనడే..!’’ అనుకుంట తన నోరే మూపిచ్చిరి. గదే బాయిల చిన్నోడి నెత్తికి దెబ్బతగిలి.. మెంటల్ అయిండు. మీది మీది దెబ్బలతో పెద్దోడు బయటవడ్డడు. గా పొద్దు ఇంకా యాదికున్నది. షిన్నోడు పనికివోనన్నా.. గుంజుకపోయిండు పెద్దోడు. ‘‘పానం బాగలేదు రానే..’’ అన్నా ఇన్లే. మక్కగట్క తిని గట్ల మంచమ్మీద ఒరిగిండో లేదో.. గుంజ్కపొయిరి అయ్యా, కొడుకు గల్సి. పండి.. పండి షిన్నోడు సూత పాయే. గిన్నేండ్లలో.. అంటే ఎన్నేండ్లుంటయ్? గానాడు దేనికోసమో సర్కారోళ్లు అడిగితే డెబ్భై మీదనే ఉంటయ్ అని జెప్పింది. ఆడ్నే ఉన్న కోమటోళ్ల సావిత్రమ్మ.. ‘‘ఊకో సిద్దవ్వ.. పెండ్లిజేసుకొని నేను ఈ ఊరికొచ్చినప్పడు షిన్నపిల్లవు. మీ అత్తతో బాసండ్లు తోమతందుకు రాకపోతుంటివా మా ఇంటికి? అరవై ఉంటయేమో గంతే’’ అన్నది. గంతేనా? ఏమో తియ్. అరవై ఏండ్లకు నెత్తి నెరుస్తదా? దవడలు కూడా ఊషిపోయే. కింది పండ్లూ వదులైనయ్. నడుమైతే భూమేవట్టే. పెయ్యంతా ముడుతలే. షేతులైతే ఇకారం గొడ్తున్నయ్. ముందుగల్లనే నల్లటి మనిషి... ఇంకా నల్లగా! పాపం.. బాపనోల్ల ఆయి ఊకే అంటుండే.. ‘‘సిద్దీ.. నల్లగుంటవ్ కాని.. మస్తు కళ ఉంటదే నీ మొఖంల’’ అని. ఆల్లింట్లున్న సిమెంట్ కుండీలల్ల నీళ్లు నింపతందుకు గట్లంటుందేమో అనుకునేది. ఆ లోతు నుయ్యిల కెంచి బొక్కెనేసి నీళ్లు షేదుతుంటే దమ్ము ఎగవోతుండే. మా ఆడివిల్ల అననే అనే.. ‘‘బాపనోల్లింట్ల నీళ్లు షేది షేది అంగిపోయినవ్ అదినా.. అని. అయినా తాను జేషిన కష్టం ముందు పాపం.. గా ఆయికి షేదిచ్చిన నీళ్లెన్ని? గివన్నీగాదు గని.. మొగడు, కొడుకులు సచ్చిపోయినప్పుడు రెక్కలు ఇర్గిపోయి.. యెన్ను çవడిపోయినట్టయింది. ఇగ మల్లా లెవ్వలే. కాలం లేదు. ఉన్నోళ్లు సుత పొలాలను పిలాట్లు జేసుకున్నరు. పనులు బంద్ అయ్నయ్. కరువు పని ముసలోల్లకు ఇడ్శిపెట్టి.. బలమున్నోల్లంతా పట్నం దారివట్టిండ్రు. పెద్దోడు గూడా గా దారిపొంటనేవాయే. ఏ పనిదొరికితే గా పని జేసుడు వెట్టిండు. గొన్నొద్దులు చౌకీదార్ లెక్కగూడా ఉన్నడు. దొంగతనం మోపి ఎల్లగొట్టిండ్రు. మస్తు బాధవడ్డడు. ‘‘అమ్మా.. నేను దొంగతనం జెయ్యలేదే’’ అని ఏడ్శిండు కొడుకు. ఆఖిరికొస్తే డ్రైనేజీలు దీసే పనిదొరికిచ్చుకున్నడు. ఎనిమిదినెల్లు జేసిండేమో.. మోర్లదంతా నోట్లకు, ముక్కులకు వొయ్యి ఏదో ఇన్సిపెక్షనటా.. అదొచ్చి సచ్చిపోయిండు పట్నంల. అందరం రోడ్డు మీదవడ్డం. పెద్దోడికి ఒక బిడ్డ, కొడుకు. చిన్నోడికి ఇద్దరు బిడ్డలే. ఇందిరమ్మ పథకంలొచ్చిన ఇల్లమ్మితే పెద్దోడి బిడ్డ పెండ్లాయే. దానికి పదిహేను నిండంగనే పెండ్లి జేస్తిమి. మిగిలినోల్లు సదూతుండ్రు. పద్మకు పెండ్లి జేసి తోలిచ్చినమంటే ఇగామెను అర్సుకున్నదే లేదు. అడగకడగక అడ్గింది బిడ్డ.. ‘‘అమ్మా... నా బిడ్డకు కమ్మల్గున్నాలు జేపిస్తవానే’’ అని. గదిగూడ అడగకపోవునేమో.. సముర్థాడింది. ఆల్ల యారాండ్ల పిల్లలకు అమ్మమ్మలు మస్తు బంగారం వెట్టిండ్రట. నలుగుట్ల దీసేసినట్టు ఉండద్దని అడిగినట్టుంది. అదీ బీడీలు జేస్తది. అన్ని పైసలు ఇంట్లియ్యకుండ... ఇన్ని దాషిపెట్టుకుంటది. గట్ల దాసుకున్న దాంట్లెకు కొన్ని గలుపుమన్నది గంతే. గవ్విటితో బిడ్డకు కమ్మల్గున్నాలు కొనిచ్చి అమ్మమ్మ వెట్టిందని జెప్తా అన్నది బిడ్డ. తానిచ్చుడేమోగానీ.. కాపోల్ల గంగారం పొలంల పనికివొయ్యి కాలుజారివడితే సూడొచ్చింది. దాసుకున్న పైసలల్ల నుంచి తనకే గొన్నిచ్చిపాయే... దవ్ఖాన్ల సూపిచ్చుకో అని. దవ్ఖాన్లకు ఏడవాయే? ‘‘నిన్ను సూడతందకొచ్చెటోల్లకు షికెన్లు వెట్టి, కల్లు తాపిచ్చుడికే ఉన్న పైలు వొడుస్తున్నయ్’’ అని పద్మిచ్చిన పైసల్ దీస్కుంది పెద్ద కోడలు. గా నెలల పెద్ద కోడలి దగ్గరుండె. షెరొక్క నెల వంచుకుంటుడ్రు గదా! ‘‘ఏందే సిద్ది పంచుకునుడు? నువ్వేమన్నా కాయకష్టం జేస్తలేవా? సక్కగ నీది నువ్వు ఉండక?’’ అన్నది మల్లవ్వ. మొగదిక్కులేని ఆడోళ్లం. ముగ్గురం మూడు సోట్ల ఎందుకని.. ఆల్లిద్దరి దగ్గర్నే కాలం ఎల్లదీస్తుంది. ఓల్లదగ్గరుంటే ఆల్లకు గా నెల ఫించన్ ఇయ్యాలే. కూలీ చేసిన పైసలెమన్నుంటే బిడ్డ కోసమని వెడ్తుండే. కాలు కదలకుండయినప్పటి కెంచి కూలీగూడా లేదు. సిద్దవ్వకు తెలియకుండానే కన్నీళ్లొస్తున్నాయి. థూ.. ఏం బతుకు పాడైంది? సోయి దెల్షినప్పటినుంచీ కష్టాలే. ఎన్నడన్న సుఖవడ్డదా? కడుపు నిండ తిండి దిన్నదా? బిడ్డ నోరు ఇడ్శి అడిగింది.. ఉల్టా దాన్ దగ్గరున్నయే ఇచ్చే. ఎంత సిగ్గుషరం లేని జన్మిది? ఒక్కసారిగా కాలు సులుక్కుమని పొడిచినట్టవడంతో ఆ కాలును కొంచెం వెనక్కి మడవడానికి ప్రయత్నించి నొప్పి పెరగడంతో వెంటనే మళ్లీ చాపింది. ‘‘ఈ కాలొకటి.. సావనియ్యది.. బత్కనియ్యది’’ అనుకుంది వేదనగా. ‘‘ఏమత్తా.. పుర్సత్గా గూకున్నవ్? కచ్చీరుకాడికి వోవా?’’ జొన్నెరొట్టె, ఉల్లిగడ్డ కారం ఉన్న పళ్లేన్ని తెచ్చి సిద్దవ్వ ముందు పెడ్తూ అంది పెద్ద కోడలు. మొహం మీద తిరుగుతున్న ఈగను తోలడానికి కుడిచేతిని అటూఇటూ ఆడిస్తూ పళ్లెం వంక చూసింది సిద్దవ్వ. ఫించనొచ్చే దినం వంతు మార్తది. ఏం మర్శినా గిది మాత్రం మర్వరు కోడండ్లు. చిన్న కోడలు అన్న మాట గుర్తొచ్చింది. ‘‘అత్తా.. అచ్చే నెల సుత నాతాన్నే ఉండు. ఊకే వాకిట్ల దేక్కుంట ఆ ఇంటికి ఈ ఇంటికేం తిర్గుతవ్ గని’’ అని. తన మీద పావురంతో గాదు. ఆ నెలల బిడ్డ ఫీజు గట్టాలే.. పిల్లగాండ్లు పెద్దోలయిండ్రు. బాత్రూమ్కు ఉట్టి తడ్కనే ఉన్నది. తల్పువెట్టియ్యాలనే ఆలోశ్న జేస్తుంది. ఎక్వతక్వలకు ఫించన్ పైసలు సగవెడ్తది. అయినా ఈ నెల సూత తనను షిన్నదే ఉంచుకుంటే పెద్దది ఊకుంటదా? గుంజి గూట్లెవెట్టది? అనుకుంటూ జొన్నరొట్టె తినసాగింది. ‘‘ఏమయ్యా... లిస్ట్ తయారైందా?’’ అడిగాడు సెక్షన్ హెడ్ యూడీసీని. ‘‘సర్.. రామ్మోహన్ దగ్గరుంది’’ అని చెప్పి రామ్మోహన్ దగ్గరకు వచ్చాడు యూడీసీ. ‘‘రామ్మోహన్.. లిస్ట్ తయారైందా?’’ అడిగాడు యూడీసీ. ‘‘ఫోర్‌డేస్ అవుతుంది సర్..రెడీ అయ్యి’’ చెప్పాడు ఎల్డీసీ రామ్మోహన్. ‘‘ఎంత మంది ఉండొచ్చు...’’ మళ్లీ యూడీసీ. ‘‘అయిదూర్లలో పన్నెండు మంది ఉన్నారు సర్. అంతా డెబ్భై ఏళ్ల పైబడ్డ వాళ్లే’’ చెప్పాడు సిన్సియర్‌గా రామ్మోహన్. యూడీసీ మొహంలో చిరునవ్వు. ‘‘గుడ్! సర్ సంతోష పడ్తాడు. వచ్చే నెలలో కూడా చూడూ..’’ అంటూ వెళ్లిపోయాడు యూడీసీ. రామ్మోహన్ మెదడులో ఇద్దరున్నారు. ఆ ఇద్దరి పేర్లను వయా యూడీసీ సెక్షన్హెడ్కు చేరకుండా జాగ్రత్తపడ్తున్నాడు. స్వామి ఒక కార్యం అప్పజెప్పినప్పుడు స్వకార్యమూ చూసుకోవాలని గవర్నమెంట్జాబ్లో చేరిన కొత్తలోనే నేర్చుకున్నాడు. అదీగాక వాటా తనకు ఉంటదో ఉండదో? ఉన్నా.. ఎంతుంటుందో? అందుకే జాగ్రత్తపడ్డాడు. యూడీసీ కూడా ఆ జాగ్రత్తలోనే ఉన్నట్టున్నాడు. అంతగా పట్టుపడితే ఒక్కరి పేరు చెప్తాడు. ఆ నెలవి నిన్ననే వీఆర్ఓలకు అప్పగించేశాడు కూడా! నిశ్చింతగా ఇంకో ఫైల్ ఓపెన్ చేశాడు రామ్మోహన్. మధ్యాహ్నం పన్నెండు దాటింది. మార్చి ఎండ చుర్రుమంటోంది. ‘గింత తిని ఎల్లేసరికి గీయాల్లాయే..’ రెండు అరచేతులను నేల మీద పెట్టి బలాన్ని కూడదీసుకుని డేక్కుంటు వెళ్తూ అనుకుంది సిద్దవ్వ. మధ్యలో ఆగి తల నిటారుగా పెట్టి ఎండ తగలకుండా కుడి చేతిని నుదురుకు అడ్డం పెట్టుకుని దారి చూసుకుంది. ‘ఇంకా మాలెస్స దూరమే ఉన్నదుల్లా...’ అనుకుంటూ మళ్లీ డేకడం మొదలుపెట్టింది. ‘‘గింత ఎండపూట ఎల్లినవేందే?’’ ఏదో పనిమీద నుంచి ఇంటికెళ్తూ అడిగాడు గూండ్ల భూమేశ్.. ఎదురుపడ్డ సిద్దవ్వను.‘‘గ్యారకొట్టిందాంక పంచాయతీ అపీస్లకు పెంట మీది గిర్దావర్ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) రాడు! ఇంత కడుపు సల్లవడగొట్కొని ఎల్లేసరికి గీయాల్ల ఆయే.. ఏంజేతు’’ మూలుగుతూ బదులిచ్చింది.‘‘పంచాయతీ ఆఫీస్‌ల ఏం పనే నీకు?’’ అని అంతలోకే గుర్తొచ్చిన వాడల్లే ‘‘అగో.. ఇయ్యాల ఫించనా.. ఏందీ?’’ అడిగాడు. ‘‘అవ్!’’ నిలబడి ఉన్న భూమేష్ వైపు ఇందాకటిలాగే తల పైకెత్తి నుదురుకి చెయ్యి అడ్డంపెట్టుకొని మాట్లాడసాగింది. ‘‘రా మల్ల.. నేను కొండవోవాల్నా..?’’ భూమేశ్. ‘‘ఎట్ల దొల్కపోతావ్.. సైకిల్ సూత లేనట్టుందిగద కొడ్కా..?’’ వెళ్లడానికి సిద్ధమవుతూ అడిగింది.‘‘ఎత్కపోతా రాయే అవ్వా..’’ అని నవ్వుతూ సిద్దవ్వను అమాంతం రెండు చేతులతో పైకి లేపి పరుగుపెట్టాడు భూమేశ్. పదిహేను నిమిషాల్లో ఆమెను పంచాయితీ ఆఫీస్‌లో దింపి నీళ్లతో ఆయసాన్ని తీర్చుకున్నాడు. డేక్కుంటూ వెళ్లి వరుసలో కూర్చుంది సిద్దవ్వ. దెబ్బ తగిలిన కాలు తన ఉనికిని మర్చిపోనివ్వట్లేదు. కాలు కాదు మిన్ను విరిగినా బాధ్యత తప్పదు. క్యూలో పెన్షన్ తీసుకునేవాళ్లు కదులుతున్నకొద్దీ సిద్దవ్వ ముందుకు డేకుతోంది. కాలు నొప్పి విపరీతంగా ఉంది. తట్టుకోలేకపోతోంది. కళ్లను గట్టిగా మూసుకుంది బాధను భరిస్తున్నట్టు. పెన్షన్ పంచుతున్న వ్యక్తి గొంతు గట్టిగా వినపడేసరికి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది సిద్దవ్వ. ‘‘యాదమ్మా.. నీ వేలిముద్ర మ్యాచ్ అయితలే.. రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు పో!’’ అన్నాడు అసిస్టెంట్. ‘‘ఏందీ.. అయితే పైసలియ్యవా?’’ అన్నది యాదమ్మ.‘‘వేలిముద్ర కరెక్ట్‌గా లేకపోతే పైసలెట్లిస్తరు? వీయ్యార్వో సారు కొలువూడ్తది’’ అని జాబితాలో తర్వాత ఉన్న పేరు పిలవసాగాడు. ‘‘ఓ సారూ.. ముందుగల్ల నా లెక్క జెప్పి తర్వాత ఇంకొకొల్లన్ బిలువ్’’ అన్నది బెదురు లేకుండా.‘‘ఏం దబాయిస్తున్నవా? వీయ్యార్వో సారు తానకు పో.. చెప్తడు’’ బెదిరిస్తున్నట్టుగా అసిస్టెంట్.‘‘పోకడ మస్తే ఉందిరో’’ అంటూ కాస్త ముందుకు జరిగింది.‘‘ఏమన్నవే ముసల్దానా? నాకు పోకడ్నా?’’ అంటూ కూర్చున్నవాడు ఒక్కసారిగా లేచాడు ఆవేశంతో. ‘‘ఏ సారూ.. మాటలు మంచిగరానియ్. నా అసుంటి తల్లి లేదా?’’ అంది యాదమ్మ గాయపడ్డదానిలా. ‘‘ఛీ.. నీ అసుంటి తల్లా? నా తల్లి నీ లెక్కెందుకుంటది?’’ అంటూ ఆమెతో పోట్లాటకు దిగాడు. అక్కడున్న వాళ్లంతా బెదిరిపోయారు. ఆ గొడవ.. కొంచెం దూరంలో సర్పంచ్‌తో రాజకీయాలు మాట్లాడుతున్న వీఆర్వో చెవిన పడటంతో గబగబా అక్కడికి వచ్చాడు అతను. ‘‘ఏయ్.. సునీల్.. ఏందయ్యా లొల్లి? ఏమైంది?’’ గద్దించాడు అసిస్టెంట్‌ను. ‘‘సూడుండ్రి సర్.. వేలిముద్ర సరిగ వడ్తలేదు.. రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు పో అని మర్యాదగా జెప్తుంటే ఇనకుండా పోకడగాడు.. గీకడగాడు అంటుంది’’ ఫిర్యాదు చేశాడు అసిస్టెంట్.‘‘ఏందమ్మా?’’ అన్నాడు యాదమ్మ వైపు తిరుగుతూ వీఆర్వో. ‘‘అవ్ సారూ.. నెల కిందట.. అంతకు మునుపూ గిదే యేలు.. గిదే ముద్ర గదా.. గప్పుడు కరెక్ట్గవడ్డది.. గిప్పడు పడకుండవోతదా? లేక నేనేమన్నా కొత్తేలుతో అచ్చిన్నా?’’ యాదమ్మ బాధలో వెటకారం ధ్వనించింది. ‘‘అదే వేలు యాదమ్మా.. రోజురోజుకి ముసలైతున్నవ్గదా.. గీతలర్గి పోయినయేమో..’’ అన్నాడు వీఆర్వో నింపాదిగా, పళ్లమధ్యలో ఇరుక్కున్న వక్కపొడిని టూత్‌పిక్‌తో తీసుకుంటూ. ‘‘గట్లెట్లా? గట్ల అర్గుతయ్ అని నేను యేడ ఇన్లే. సాచ్ఛం ఉంటే సూపియ్ సారూ..’’ అదే కడుపుమంట యాదమ్మ గొంతులో.‘‘గవన్నీ రేపు ఎమ్మార్వో ఆఫీస్‌ల అడుగు పో..’’ నిర్లక్ష్యంగా చెప్పి ‘‘ఏయ్.. సునీల్! నువ్వు కానియ్! మూడూర్ల పంచాయతీ ఇది. లైను కూడా బాగానే ఉన్నట్టుంది. తొందర్గ కానియ్’’ అంటూ వరాండాలోంచి పంచాయతీ ఆఫీస్ గదిలోకి వెళ్లాడు వీఆర్వో. ఆ అవమానానికి యాదమ్మ మనసు చివుక్కుమన్నది. ‘‘మీ మొదలారా.. మీకు గత్తర్లులెవ్వ.. నాయంగా మాకొచ్చే పైసల్ని మింగుతుండ్రు గదా! మీ ఇండ్లండ్లకెంచి వెడ్తున్నట్టే జేస్తుండ్రు.. మీ పోకట్లకగ్గివెట్టా! పోతా.. ఎమ్మార్వో తాన్కే గాదు..ఆల్ల తాత కాడిగ్గూడా వోతా! మీ పనిజెప్తా!’’ కోపం, బాధ, ఉక్రోషం, ఏడుపు అన్నీ ఉన్నాయి ఆ అరుపులో. ‘‘ఏయ్ సునీల్! గా ఒర్రుడేంది? ఈడికెంచి ముందామెను పంపియ్!’’ యాదమ్మ మాటలకు చిరాకుపడుతూ వీఆర్వో. ‘‘సార్’’ అని జవాబిచ్చి.. ‘‘ఏ యాదమ్మ..గీడ లొల్లివెట్టక్.. రేపు ఎమ్మార్వో తాన వెట్కపో.. నడువ్’’తరిమాడు అసిస్టెంట్.‘‘పెడ్త పెడ్తా.. మీ సంగతి జూస్తా’’ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ ‘‘ఓ ఎల్లక్కా.. సిద్దవ్వా.. మీక్కూడా గీ గతేవట్టిస్తరు సూడుండ్రి... రేపు నాతో ఎమ్మార్వో ఆఫీస్‌కి రాండ్రే. గీల్లంతా లంగల్.. దొంగలు.. మన ఎయ్యి రూపాయలగ్గూడా ఆశవడే కుక్కలు.. గీ కొడుకులు. సూడుండ్రే మీగ్గూడా మొండి షెయ్యే జూపిస్తరు’’ అని లైన్లో ఉన్న వాళ్లను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పంచాయతీ కాంపౌండ్ దాటింది యాదమ్మ. అక్కడున్న అందరి మనసూ బరువెక్కింది. సిద్దవ్వకైతే చేతులు రావట్లేదు ముందుకు జరగడానికి. భయం జొచ్చింది. యాదమ్మ ఇంటి సంగతి తనకెర్కే. వయసుమీదున్నప్పుడే మొగుడు వొయిండు. పిలగాండ్లిద్దరు ఎడ్డోల్లే. మగబాయి లెక్క అన్నిటికీ తానే. ఫించన్ దప్ప ఏం లేదు. పొద్దుగూకేటాల్ల కాపోల్లిండ్లల్ల అన్నం అడుక్కచ్చుకుంటది. ఎప్పుడెప్పుడన్నా సాకిలిండ్లల్ల పనుంటే విలుస్తరు. పోతది. గంతే.ఇప్పుడెట్లుల్లా.. ‘‘సూడుండ్రే.. మీగ్గూడా మొండి షెయ్యే...’’ యాదమ్మ మాటలు చెవుల్లో తిరుగుతున్నయ్. ‘‘సిద్దవ్వా... ఓ సిద్దవ్వా..’’ ఆ పిలుపుతో వర్తమానంలోకి వచ్చి.. అసిస్టెంట్ వైపు చూసిందిసిద్దవ్వ. ‘‘ఏం జూస్తవ్... ముందుకు రా’’ ఈసడింపు అసిస్టెంట్ గొంతులో. చేతుల ఆసరాతో ముందుకు జరిగింది. ‘‘హూ...’’ చిరాగ్గా నిట్టూరుస్తూ.. ‘‘పెంటయ్యా... గీమెను జెర కుర్చీల కూసోవెట్టు’’ అక్కడే ఉన్న పంచాయతీ ప్యూన్‌కు చెప్పాడు అసిస్టెంట్. ‘‘సారూ..’’ అంటూ వచ్చి సిద్దవ్వ రెండు చంకల కింద చేతులతో ఆమెను లేపి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు పెంటయ్య. ఒక్కసారిగా కాళ్లు కిందకి వేళ్లాడటంతో దెబ్బతిన్న కాలు జువ్వుమని లాగి కంపించసాగింది. ఆ నొప్పికి విలవిల్లాడింది ఆమె. పంటికింద బాధను నొక్కేసి బయోమెట్రిక్ మెషీన్ మీద వేలు పెట్టింది ముద్ర కోసం. ‘ఫెయిల్’ అంటూ మొరాయించింది మెషీన్. ‘‘ఉహ్హూ.. మల్లా వెట్టు’’ తిరస్కారం అసిస్టెంట్ గొంతులో.కంపిస్తున్న కాలు మోకాలిని ఎడమచేత్తో అదిమిపట్టుకుంటూ కుడిచేయి బొటనవేలును మళ్లీ మెషీన్ మీద పెట్టింది. అదే శబ్దం ఫెయిల్ అంటూ. ‘‘సిద్దవ్వ గిదే లాస్ట్ చాన్స్. సరిగ్గా పెట్టు’’ హెచ్చరిక. ‘‘అట్లనే సారూ..’’ కంపిస్తున్న స్వరం, చేయితో బొటన వేలిని ఉంచింది. ఫె.. యి.. ల్.‘‘సిద్దవ్వా.. నీ వేలిముద్రను గూడా రిసీవ్ చేస్కుంట లేదు. ఎమ్మార్వో ఆఫీస్‌కు పో రేపు’’ అంటూ తర్వాత పేరు పిలిచాడు అసిస్టెంట్ సునీల్. వెన్నులో వణుకు సిద్దవ్వకు. అంటే.. ఎయ్యి రూపాయలు రావిప్పుడు. ఫించన్ లేకుండా ఇంటికివోతే..? దిగులు.. గుబులు ముసురుకున్నాయ్. పొద్దున రొట్టె తినంగా.. దబ్బదబ్బ చిన్నకోడలు బయటకచ్చి.. ‘‘ఈ నెల సుత అత్తమ్మ నాదగ్గర్నే ఉంటది’’ అన్నది పెద్దకోడలికి ఇనవడేటట్టు. గంతే.. ఉరుక్కుంట బయటకచ్చింది పెద్దకోడలు ‘‘ఏందే ఉండేది’’ అనుకుంట. ‘‘ నెల నీ తాన.. నెల నా తాన అన్నప్పుడు లెక్క గట్లనే ఉండనియ్’’’ బెదిరిచ్చింది.‘‘ఏంది లెక్కపత్రం? మస్తు మాట్లాడుతున్నవ్. ఉంటది. నా తాన్నే ఉంటది. నీకేమైతుంది?’’ ‘‘నాకేమైతుందా?’’ ‘‘అవ్..’’ ‘‘ఏందే అవ్...’’ మాటామాటా వెంచుకుని సిగెంట్రుకలు వట్టుకుండ్రు. ఫించన్ కోసం తనను పంచుకున్నోళ్లు... ఇయ్యాల అది లేకుంట వోతే ఇంట్లెకి రానిస్తరా?రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు తనను ఓల్లు గొండవోవాలే? పైసల్ దప్ప గివన్ని ఆల్లకు పడ్తయా? ఏం అవుసరం ఆల్లకు? ఎట్లనన్న జేసి పైసలు దేవాలే.. ఆల్ల షేతులల్ల వొయ్యాలే! ఆల్లు మాత్రం ఏం జేస్తరు? బతుకులిట్ల గాలిపాయే.. అనుకుంటూ పెంటయ్య వైపు చూసింది.అర్థమైన పెంటయ్య ఆమెను కిందికి దించాడు. చేతులు నేల మీద పెడితే బలం రావట్లేదు. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగట్లేదు. మెదడులో యాదమ్మ మాటలే.. సూడుండ్రే మీగ్గూడా మొండి షెయ్యే... సూడుండ్రే మీగ్గూడా మొండి...సూడుండ్రే మీగ్గూడా.. సూడుండ్రే... సూడుం...