రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్, ఇన్‌స్పెక్షన్ ఫీజును ఇంటర్మీడియెట్ బోర్డు తగ్గించింది.
మే 5 వరకు దరఖాస్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్, ఇన్‌స్పెక్షన్ ఫీజును ఇంటర్మీడియెట్ బోర్డు తగ్గించింది. గతంలో మూడింతలు పెంచిన ఫీజును రెండింతలకు పరిమితం చేసింది. జనరల్ కాలేజీలతోపాటు ఒకేషనల్ కాలేజీల ఫీజులనూ తగ్గించింది. ప్రతి కాలేజీ అఫిలియేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని కాలేజీలకు విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకునే వీలు ఉండదని పేర్కొంది.
ఈసారి విద్యార్థుల ప్రవేశాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ నంబరు తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపింది. ఆధార్ నంబర్ లేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించింది. కాలేజీ యాజమాన్యాలు ఈ నెల 5 వరకు లేకుండా అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఈ నెల 8 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.