ఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియెట్ ప్రథమ సంవత్సరం(ఎంపీసీ) చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాకకు చెందిన యోగ నందిని (16) ఖమ్మంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతూ కాలేజీ హాస్టల్‌లోనే ఉంటోంది.
ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా సంక్రాంతి సెలవులకు వెళ్లి చాన్నాళ్ల తర్వాత కాలేజీకి తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఆపై మళ్లీ ఇంటికి వెళ్లగా గురువారమే హాస్టల్‌కు చేరుకుంది. శుక్రవారం ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరైన నందిని ఆపై రెగ్యులర్ తరగతులకు కూడా వెళ్లింది. మధ్యలో తన ఆరోగ్యం బాగాలేదని హాస్టల్ గదికి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతోంది.
అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, నందిని మృతి సమాచారం తెలుసుకుని వచ్చిన ఆమె తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, యోగనందిని కుడి చేతికి సర్జరీ కావడం, ఆ బాధతో పరీక్షలు రాయలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment