
నా చావుకు భార్య, అత్తమామలే కారణం
సెల్ఫీ వీడియోలో వెల్లడి
యువకుడి ఆత్మహత్య
నిర్మల్: ‘నా చావుకు భార్య, అత్తమామలే కారణం.. నా బిడ్డను మా అమ్మకు అప్పగించండి..’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాండ్రపు అంజన్న(26) కాసిపేటకు చెందిన శిరీషను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి వారం రోజుల క్రితం కూతురు జన్మించింది.
దీంతో సోమవారం కూతురిని చూడడానికి అంజన్న కాసిపేటకు వెళ్లగా.. భార్య, అత్తమామలు దూషించారు. దీంతో ఆవేదనకు గురైన అంజన్న ఇంటికి వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు కారకులు అంటూ భార్య, అత్తమామలు, పెద్దమనుషులు పలువురి పేర్లు పేర్కొన్నాడు. రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment