selfie video
-
‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’
శ్రీకాకుళం, సాక్షి: టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కూనరవితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్ తెలిపారు. ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే దాడి, బెదిరింపుల విషయాన్ని బయటపెట్టారు. ‘‘ఎమ్మెల్యే కూనరవి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నానని దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జిల్లా ప్రభు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. దెబ్బలు తగిలినా రిపోర్టు నార్మల్ అని ఇచ్చారు. పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు రవి కూమార్ స్కెచ్ వేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. నాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వీడియోలో తెలిపారు. -
నా మొహం ఎలా చూపించను
శ్రీరాంపూర్: జీవితంలో సక్సెస్ కావాలి..డబ్బు సంపాదించాలి.. కుటుంబ సభ్యులను ఉన్నత స్థితిలో ఉంచాలంటూ ఆ యువకుడు ఎన్నో కలలు క న్నాడు. మొదట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి లా భాలు బాగానే వచ్చాయి. ఆ తర్వాత తెలిసిన వారి వద్ద, లోన్‌యాప్‌లలో అప్పు చేసి పెట్టిన పెట్టుబడు లు ఆవిరయ్యాయి. మూడేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నా కలిసి రావడం లేదని.. లోన్‌యాప్‌ల వేధింపులు తాళలేక.. ఉరేసుకొని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో శనివారం వెలుగులోకి వచి్చంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌కు చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రుతి, 9 నెల ల కుమారుడు ఉన్నారు. భార్య కొడుకుతో కలిసి రాఖీ పండుగకు ఊరెళ్లింది. దీంతో ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు వైరు తో ఉరేసుకున్నాడు. ఇంటి సమీపంలోనే తల్లిదండ్రులు ఉంటారు. శనివారం ఉదయం శ్రీకాంత్ తమ్ముడు సాయికుమార్ ఇంటికొచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో బలవంతంగా త లుపులు తెరిచి చూడగా, ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి.సెల్ఫీ వీడియో తీసుకొని.. శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నేను ఒక కొడుకుగా, అన్నగా, భర్త గా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను. లైఫ్‌లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. సక్సెస్ కాకపోగా, లోన్‌యాప్స్‌లో లోన్ తీశాను. బయట కూడా అప్పు తీసుకొచ్చాను. ఇంట్లో వారిని గొప్ప గా ఉంచాలి. మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్లో డబ్బులన్నీ పెట్టా. ట్రేడింగ్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. మాఫ్రెండ్ వాళ్ల అన్న దగ్గరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నా. మా డాడీ దగ్గర రూ.2 లక్షలు అట్లనే వేర్వేరు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా. అన్నీ పోగొట్టుకున్నా. నాకు చాలా అప్పులున్నాయ్. దానికి తోడు ఈ లోన్‌యాప్స్. ప్రతి నెలా ఈఎంఐలు కచి్చతంగా కట్టేసిన. ఈ నెలొక్కటే కట్టలేదు. ఏడెనిమిది యాప్‌ల దాకా కట్ట లేదు. ఫోన్లలో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వస్తామని వేధించారు. కుటుంబ సభ్యుల వద్ద మొహం చూపెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నా ను’ అని ఆ వీడియోలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య
యశవంతపుర: భర్త వేధింపులను తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం బెంగళూరు బ్యాడరహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఆంధ్రహళ్లికి చెందిన మానస (25)కు ఆరేళ్ల క్రితం దిలీప్‌తో పెళ్లి కాగా, వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఏడాదిన్నరగా దిలీప్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిపై ఇంట్లో రోజూ గొడవ జరిగేది. దీనికి తోడు దిలీప్ మానసను వేధించేవాడు. దీంతో విరక్తి చెందిన ఆమె సెల్ఫీ వీడియో తీసుకుని, ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు బ్యాడరహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దిలీప్ని అరెస్టు చేశారు. -
విషాదం: రైలు కిందపడి యువదంపతుల ఆత్మహత్య
సాక్షి,నిజామాబాద్ జిల్లా: రైలు కిందపడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పోతంగల్ మండలం హెగ్డోలి వాసులు అనిల్ (28), శైలజ (24)గా పోలీసులు గుర్తించారు. బంధువుల దుష్ప్రచారం భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపారు. వీరికి ఏడాదిన్నర క్రితం పెళ్లయింది.ఈ వీడియోను ఆత్మహత్యకు ముందు కోటగిరి ఎస్.ఐ సందీప్‌కి పంపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపుర్ శివారులో రైల్వే ట్రాక్‌పై దంపుతులిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో చెప్పి బయటికొచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పురుగుల మందు తాగి.. సెల్ఫీ వీడియో తీసుకుని..
మేడ్చల్ రూరల్: పురుగుల మందు తాగడంతో పాటు హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అగ్రికల్చర్ విద్యార్థి ఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలో చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి హరినాథ్ మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలోని అగ్రికల్చర్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్లో ఉంటున్నాడు. మూడు రోజులుగా కళాశాలలో తోటి విద్యార్థుల మధ్య గొడవల కారణంగా మనస్తాపం చెందిన హరినాథ్ బుధవారం హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నాడు. అనంతరం తాను ఉంటున్న హాస్టల్ భవనం పైఅంతస్తుకు వెళ్లి పక్కనే ఉన్న సాయి బాలాజీ హాస్టల్ భవనంపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నంచాడు. భవనంపై నుంచి దూకుతున్న క్రమంలో విద్యుత్ తీగలపై పడి.. అనంతరం కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. హరినాథ్‌ను చికిత్స నిమిత్తం 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సారీ మామా.. ఆత్మహత్య యత్నానికి ముందు హరినాథ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అరే మామా.. (ఫ్రెండ్స్నుద్దేశించి) సారీ మామా తట్టుకోలే కపోతున్నాను. ఓ ఇద్దరు విద్యార్థుల పేర్లు ప్రస్తావించి వారిని వదిలిపెట్టవద్దని కోరాడు. మామా.. మా అమ్మ తట్టుకోలేదు. త్వరగా వచ్చేయ్ మామా... ప్లీజ్ మామా.. ఏడుపోస్తుంది మామా.. అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో మిత్రులకు పంపినట్లు సమాచారం. గత మూడు రోజులుగా విద్యార్థుల మధ్య వాగ్వాదం కారణంగా సున్నితమైన మనస్తత్వం కలిగిన హరినాథ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హరినాథ్ తన వీడియోలో తెలిపిన విద్యార్థుల పేర్లు, కారణాలపై ఆరా తీసున్నారు. -
కాళహస్తిలో సెల్ఫీ వీడియో.. టీడీపీ నేతపై ఆగ్రహం
తిరుపతి, సాక్షి: తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో సెల్ఫీ వీడియో ద్వారా ఆలయ ట్రస్ట్ ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ దర్శనానికి వెళ్ళే సమయంలో సెల్ ఫోన్ వాడకం నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఆ నిబంధనల్ని బొజ్జల ఉల్లంఘించారు. ఆలయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. ఆలయంలో పురాతమైన భాగం తొలగింపు.. ఆ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొజ్జల. పైగా గోడ కూలడాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆంజురు తారక శ్రీనివాసులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో బొజ్జలపై చట్టపరమైన చర్యలు కు సిద్దం అవుతున్నారు. ఆలయ చైర్మన్ వివరణ ఇది.. ఆలయంలో కూల్చివేత అంటూ టీడీపీ నేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంపై శ్రీకాళహస్తి ఆలయం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందించారు. ఆలయంలో మృత్యుంజయ లింగం ఆనుకుని ఉన్న గదిని గతంలో ప్రసాదాలు తయారీ సరుకుల గోడౌన్ గా వినియోగించేవారు. 1956 లో దేవస్థానం ట్రస్టీ సహకారం తో దీన్ని నిర్మాణం చేశారు. శిథిలావస్థలో ఉన్న దీన్ని కూల్చి వేయాలని ప్రస్తుత పాలక మండలి 2022 ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశం లో 7వ అంశంగా చేర్చారు. దానిలో భాగంగా పాడుబడిన ఈ గదిని తొలగింపు చర్యలు చేపట్టారు -
తప్పు చేయకపోతే గగ్గోలెందుకు?
సాక్షి, అమరావతి : ‘అవినీతికి పాల్పడకపోతే చంద్రబాబుకు భయమెందుకు? అనేక కేసుల్లో జరిగే తరహాలోనే ఈ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఏదో జరిగిపోతున్నట్టు గగ్గోలు ఎందుకు? విచారణకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చు’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. స్కిల్ స్కామ్‌లో సీఐడీ పోలీసులు పక్కా సాక్ష్యాధారాలతోనే దర్యాప్తు చేస్తున్నారని, రూ.241 కోట్ల ప్రజాధనం అక్రమంగా మళ్లించినట్టు స్పష్టమవుతోందని చెప్పారు. కస్టోడియల్ కస్టడీలో విచారిస్తే నిజ నిర్ధారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తన చేతికి ఆ రిమాండ్ రిపోర్టు అందినందున, ఇందులో నిజా నిజాలు, క్రెడిబులిటీ చెప్పదల్చుకున్నానని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. క్లియర్ ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి.. ♦ ఎంతో మంది నాయకులు క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. కొంత మందికి శిక్షలు పడ్డాయి. నిర్దోషులు హానరబుల్ (గౌరవం)గా బయటకొచ్చారు. కానీ ఎక్కడా జరగని విధంగా ఇక్కడే ఏదో జరిగిపోయినట్టు చంద్రబాబు కేసు విషయంలో కొంత మంది గగ్గోలు పెడుతున్నారు. ఆయన అరెస్టు సరైనదే అని కొందరు సమర్థిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.241 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కేసులో ఈ నెల 9న సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ♦ ప్రభుత్వ డబ్బు (ప్రజాధనం) బోగస్ ఇన్వాయిస్ల ద్వారా టెక్నాలజీ పార్ట్నర్స్కు, ఇతరులకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఆ సిక్స్ క్లస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. వారికి ఇచ్చిన డబ్బుకు లెక్కలేదు. దానికి జీఎస్టీ కట్టలేదని జీఎస్టీ అథారిటీ వారు కూడా ఎంక్వైరీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ వాళ్లూ విచారించారు. తర్వాత ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత.. దీనికి సంబంధించి కొన్ని కీ నోట్ ఫైల్స్ మిస్ అయ్యాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారు. ♦ 141 మంది సాకు‡్ష్యలను కూడా విచారించి ఆధారాలు సేకరించారు. ఆ డబ్బు ఎవరి అకౌంట్లో పడింది.. నిధులు ఎలా దారి మళ్లాయి.. షెల్ కంపెనీల ద్వారా తిరిగి వీళ్ల వద్దకు ఆ డబ్బు ఎలా వచ్చింది.. ఇవన్నీ మరింత స్పష్టంగా విచారించడానికే చంద్రబాబును అరెస్టు చేశారు. నేరం చేయకపోతే భయమెందుకు? ♦ చంద్రబాబు ఏ రకమైన నేరం (ఫ్రాడ్) చేయకపోతే, నిధులు దుర్వినియోగం చేయకపోతే, నిబంధనలు ఉల్లంఘించకపోతే, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కిందకు రాకపోతే, అది 409 కిందకు రాకపోతే ఎందుకు భయపడుతున్నట్లు? నిధులు అక్రమంగా మళ్లింపు(సైఫెన్) అని తెలుస్తోంది. ఆ డబ్బు దుర్వినియోగం అయినట్టు తేటతెల్లమైంది. సీఐడీ పోలీసులు రికార్డును బట్టే ముందుకెళ్తున్నారు. ♦ ఇది సరికాదనుకున్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది.. జరిగిందిదీ అని ఆ ఆరు షెల్ కంపెనీలు వచ్చి చెప్పడం లేదు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రైవేటు కెపాసిటీతో ఏదైనా లెటర్ ఇచ్చి ఉండొచ్చు. అండర్ స్టాండింగ్ ఉండొచ్చు. కానీ దాంతో మా కంపెనీకి ఏ సంబంధం లేదని సిమన్స్ ఇండస్ట్రీ వాళ్లు చెబుతున్నారు. డిజైన్ టెక్ ప్రైవేట్ కంపెనీ కూడా మాకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. షెల్ కంపెనీలు కూడా వాస్తవ సమాధానం చెప్పడం లేదు. ఇంత మందికి శిక్షణ ఇచ్చామని, ఇన్ని పరికరాలు కొన్నామని బెయిల్ పిటిషన్లలో ఎందుకు చెప్పలేదు? ♦ ఇంత క్లియర్‌గా కేసు ఉంటే ఏదో ఘోరం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం విచిత్రం అనిపిస్తోంది. ఆయన సత్యవంతుడని నిరూపించుకుంటే రేపు పరువు నష్టం దావా వేయొచ్చు. ఇలా గగ్గోలు పెట్టడం అనవసరం. ఇంత కంటే పూర్తి ఆధారాలతో కూడిన(ఫుల్ ఫ్రూఫ్) కేసు నేను చూడలేదు. అనుమానాలకు తావులేదు. గవర్నర్ అనుమతి అవసరం లేదు ♦ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ ప్రకారం గవర్నర్ అనుమతి కావాలనే వాదన జరుగుతోంది. సెక్షన్ 17ఎ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 2018లో ఫోర్స్‌లోకి వచ్చింది. అంతకు ముందు జరిగిన నేరాలకు అది వర్తించదు. కాబట్టి అవి అంతకంటే ముందు నేరాలు కాబట్టి 17ఎ లో గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది వర్తించదు. అచ్చెన్నాయుడు కేసులో ఇది డిసైడ్ అయ్యింది. ♦ అరెస్టు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇవన్నీ విచారణలో భాగమే. దాదాపు 141 మంది సాకు‡్ష్యలను విచారించారు. ఏడుగురిపై రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. తర్వాత అత్యంత ఎక్కువ సమాచారం సేకరించారు. దర్యాప్తునకు సహకరించడ లేదు. అంతకు ముందు చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు విదేశాలకు వెళ్లిపోయాడు. వాళ్లిద్దరూ సహకరించడం లేదు. తర్వాత కొన్ని నోట్ ఫైల్స్ మిస్సింగ్. షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనం వీరికి చేరిందనేది నిర్ధారణ కావాలంటే అరెస్ట్ చేసి విచారిస్తేనే నిజానిజాలు బయటపడతాయి. -
తల్లి కొట్టిందని బాలుడి ఆత్మహత్య
కోనరావుపేట (వేములవాడ): ‘‘ఊర్లో బతుకబుద్ధి అవు తలే. వేరేవాళ్లు చెప్పే మాటలకు బాధనిపిస్తోంది. అమ్మా.. నన్ను కొట్టినందుకు బాధలేదు. చెల్లిని మంచిగా చూసుకో. ఈ పేదబతుకు నాకొద్దు. చెల్లెకు మంచిగా పెళ్లి చేయండి. అమ్మా.. అన్నా.. బావా.. డాడీ.. నేను వెళ్తున్నా..’’అని ఓ బాలుడు స్నేహితుడికి సెల్ఫీ వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లంలోని కమ్మరిపేటతండాలో ఈ ఘటన జరిగింది. కమ్మ రిపేటతండా (వట్టిమల్ల)కు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతులకు దినేశ్, దీప్తి అనే పిల్లలు ఉన్నారు. దినేశ్ (17) గతేడాది వరకు కోనరావుపేట మండలంలోని ధర్మా రం హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి వరకు చదువుకు న్నాడు. ఈ ఏడాది చదువు ఆపేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఓ దుకాణంలో సిగరెట్ ప్యాకెట్ దొంగిలించాడని దుకాణం యజమా ని దినేశ్ తల్లిదండ్రులకు చెప్పగా.. తల్లి కోపంతో దినేశ్‌ను కొట్టింది. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు దినేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. స్నేహితుల దగ్గరికి వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు వరినాట్లు వేసేందుకు పొలానికి వెళ్లారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో.. గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన దినేశ్, తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితునికి పంపాడు. అయితే అతను పాఠశాలకు వెళ్లిపోగా.. సెల్‌ఫోన్‌ను అతని తండ్రి తీసుకెళ్లాడు. రాత్రి పది గంటలకు స్నేహితుడి తండ్రి ఇంటికొచ్చాక వీడియో చూసి వెంటనే దినేశ్ తల్లిదండ్రులకు చెప్పాడు. అందరూ కలసి దినేశ్ కోసం అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వట్టిమల్ల శివారు అటవీ ప్రాంతంలో దినేశ్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కోనరావుపేట ఎస్సై రమాకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుని మృతికి దుకాణం యజమాని మాలోత్ కాంతి కారణమని మృతుని తండ్రి రాజు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గా పిల్ల ఘోరంగా మోసం చేసింది.. ఉండలేక పోతున్న..
శంకర్పల్లి/చేవెళ్ల: ‘ప్రేమించిన అమ్మా యి విడిచిపెట్టి పోయింది.గా పిల్ల నన్ను ఘోరంగా మోసం చేసింది. ఇక నేను ఉండలేక పోతున్న’ అంటూ అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థి సెల్ఫీ వీడియో ద్వారా తన సోదరుడికి సమాచారం అందించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్‌కు చెందిన కురువ మహేశ్(21) నగరంలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఓ అమ్మాయి తో ప్రేమ విఫలమై ఇద్దరి మధ్య అగాధం పెరిగింది. ఏం జరిగిందో కానీ ప్రియురాలు తనను విడిచిపెట్టిపోయిందని తీవ్ర మనస్తాపం చెందాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. చివరికి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపైకి వెళ్లి సెల్ఫీ వీడియో ద్వారా అన్నకు ఈ విషయం చెప్పాడు. ఇక తాను ఉండలేనని, అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలి.. ఇక పోతా అంటూ గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల మొండెం రెండు ముక్కలై మృతదేహం ఛిద్రమైంది. అతని వద్ద మల్లారెడ్డి యూనివర్సిటీ ఐడీ కార్డు ఉంది. ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు అర్ధంతరంగా తనువు చాలించటంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. ఈ జీవితం వ్యర్థం
షాద్‌నగర్: ‘మూడు రోజులు అవుతుంది.. శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. నువ్వు లేని జీవితం వ్యర్థం.. ఇక చనిపోతున్నా’ అంటూ ఓ భర్త సెల్ఫీ వీడియో తీసుకుంటూ అన్నంలో గుళికల మందు కలుపుకొని తిని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కొండన్నగూడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కొండన్నగూడ గ్రామానికి చెందిన కందనోళ్ల రాజేష్ (35)కు అదే గ్రామానికి చెందిన శ్వేతతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా షాద్‌నగర్‌లోని రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజేష్ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భార్య శ్వేత పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో.. భార్య తిరిగి రావడం లేదన్న మనస్తాపంతో రాజేష్ శుక్రవారం రాత్రి గుళికల మందు ప్యాకెట్ తీసుకొని కొండన్నగూడ గ్రామ శివారులోని తమ పొలానికి వెళ్లాడు. ‘నీతో గొడవ పడినా అర్ధరాత్రి వచ్చి అయినా నీతో మాట్లాడేవాడిని.. మూడు రోజుల నుంచి ఒంటరిగా ఉన్నా.. ఒంటరిగానే తిరుగుతున్నా.. నా కన్నతల్లికంటే నీవే ఎక్కువ కదా.. నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయావు.. నీవు లేని జీవితం వ్యర్థం.. ఇక చనిపోతున్నా.. నా భార్య నా వల్ల ఇబ్బందులు పడింది.. ఆమెపై కేసులు పెట్టొద్దు.. నా చావుకు నేనే కారణం..’ అంటూ చివరిసారిగా సెల్ఫీ వీడియో తీసుకొన్నాడు. తండ్రి నారాయణగౌడ్ సమాధి వద్ద అన్నంలో గుళికల మందు కలుపుకొని తిని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. సీఐ ప్రతాప్‌లింగం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకుని..
-
‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో యువకుడు సాయి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. యువతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్ డే రోజున చనిపోతున్నానని సూసైడ్‌కు ముందు వీడియోలో తెలిపాడు. యువతి, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సెల్ఫీ వీడియో కలకలం సృష్టించడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా.. -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వారి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తన సహచరులతో పంచుకున్నారు. (ఇది చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి) నెల్లూరులోని ఓ హోటల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ వీడియోలో చైతన్య వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) -
Vizag: సెల్ఫీ వీడియో కలకలం.. ఆత్మహత్య చేసుకుంటున్నామని..
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నామని ఓ దంపతులు సెల్ఫీవీడియో తీసుకోవడం కలకలం రేపుతోంది. ఈ వీడియోను కొడుక్కి పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక వడ్లపూడి తిరుమల నగర్లో చిత్రాడ వరప్రసాద్(47), మీరా(41) దంపతులు నివాసముంటున్నారు.వర ప్రసాద్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్య మీరాతో కలిసి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘నా కూతురు, కొడుకును జాగ్రత్తగా చూసుకోండి.. మా అత్తను, అమ్మను మంచిగా చూసుకోండి. నా కూతురు అమాయకురాలు. మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని తనను ఏం అనకండి. లక్ష్మి, తమ్ముడు జాగ్రత్త. మామయ్య వాళ్లందరూ ఉన్నారు కదా మిమ్మల్ని చూసుకుంటారు. ఏవరూ ఏమన్నా పట్టించుకోండి. ఇక మేం వెళ్లిపోతున్నాం’ అంటూ కంటతడిపెట్టుకున్నారు. ఈ వీడియోను తమ కుమారుడు కృష్ణ సాయితేజకు పంపించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణ సాయితేజ దువ్వాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాల్వ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగు, మొబైల్ గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎస్ఐ నా భార్యా పిల్లలను దూరం చేశారు.. సెల్ఫీ సూసైడ్ కలకలం..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో సెల్ఫీ సూసైడ్ యత్నం ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ సీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబూరావు వేధింపులు భరించలేకపోతున్నానంటూ క్రాంతికుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. రూ.7 లక్షల రూపాయల నగదు, మూడున్నర తులాల బంగారం తీసుకుని ఎస్ఐ బాబూరావు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సూసైడ్ యత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. భార్యా భర్తల మధ్య విబేధాలు సృష్టించి.. తన భార్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యా పిల్లలకు తనను దూరం చేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు క్రాంతి. న్యాల్ కల్ రోడ్ఖులో ఓ పోలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసే ముందు.. డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగా.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ బాబూరావు అన్న కూతురినే క్రాంతి పెళ్లి చేసుకోగా.. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో ఎస్ఐ బాబూరావు మధ్యవర్తిత్వం చేస్తుండటంతో విషయం ముదిరింది. బాన్సువాడకు చెందిన క్రాంతి నిజామాబాద్‌లోని గాయత్రీనగర్‌లో ఉంటున్నాడు. క్రాంతి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చదవండి: నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్ నోట్ రాసి.. -
15 నిమిషాల సెల్ఫీ వీడియో.. అమ్మాయిని గదిలోకి పంపించి.. షాకింగ్ విషయాలు
రాయదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): తన ఆత్మహత్యకు ఆ ఇద్దరే కారణమంటూ ఓ యువకుడు బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని లాడ్జిలో క్రిమి సంహారక మందు తాగాడు. ఈ ఘటనను సెల్ఫీ వీడియో తీసి తన భార్య, స్నేహితులకు పంపాడు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాయదుర్గం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 15 నిమిషాల నిడివిగల సెల్ఫీ వీడియోలో ఎర్రిస్వామి పేర్కొన్న అంశాలు ఇలా... ఏం జరిగింది? గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన ఎం.ఎర్రిస్వామి, రాయదుర్గం మండలం కెంచానపల్లి నివాసి శ్రుతి దంపతులకు ఐదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమారులున్నారు. రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కలుగోడు పంచాయతీ జె.వెంకటాంపల్లికి చెందిన అనిల్‌కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్‌రెడ్డి పరిచయమయ్యారు. తమకు రూ.3 లక్షలు ఇస్తే రైల్వేలో మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తామని పేర్కొన్నారు. దీంతో తన తల్లి, భార్య బంగారు నగలు తాకట్టు పెట్టి 2021 డిసెంబర్లో రూ.3 లక్షలను ఎర్రిస్వామి అందజేశాడు. నెల రోజులు గడిచిన తర్వాత మరో రూ.2 లక్షలు డిమాండ్ చేయడంతో అప్పు చేసి గత ఏడాది ఫిబ్రవరిలో అందజేశాడు. డ్రగ్స్ అమ్మాలంటూ ఒత్తిడి గత ఏడాది మార్చిలో ఎర్రిస్వామిని అనిల్‌కుమార్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి కలిసి తమకు తెలిసిన వ్యక్తి నాబార్డులో పనిచేస్తున్నాడని, అతనితో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చేశామని నమ్మబలికారు. విధుల్లో భాగంగా కొందరితో డిపాజిట్లు చేయిస్తే రూ.50 లక్షల రుణం కూడా ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చింది కాబట్టి డిన్నర్ చేసుకుందామంటూ గోవాకు పిలుచుకెళ్లారు. అక్కడ ఎర్రిస్వామికి మద్యం తాపి, డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం గదిలోకి అమ్మాయిని పంపి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎర్రిస్వామిని గంజాయి, డ్రగ్స్ అమ్మి డబ్బు తీసుకురావాలంటూ ఒత్తిడి చేశారు. తాము చెప్పినట్లుగా చేయకపోతే అమ్మాయితో గడిపిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ఈ క్రమంలో ఎన్నో మోసపూరిత పనులకు వాడుకున్నారు. వారు చెప్పిన పద్ధతిలోనే ప్రజల నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిచ్చిన తర్వాత తనపై మూడు సార్లు హత్యాయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో దోషిని చేస్తూ కర్ణాటకలోని శిరా, బెంగళూరులో కేసులు నమోదయ్యేలా చేశారు. ఇలా ఇంకొందరు యువకుల జీవితాలు సైతం నాశనం చేశారు. నాలుగు పేజీల సూసైడ్ నోట్ తనను అనిల్‌కుమార్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి వంచన చేసిన తీరును వివరిస్తూ పోలీసులకు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను ఎర్రిస్వామి రాశాడు. తన ఆత్మహత్యకు వారిద్దరే కారణమంటూ అందులో పేర్కొన్నాడు. తన భార్యాపిల్లలను బాగా చూసుకోవాలని తల్లిదండ్రులను, మామను కోరాడు. తన భర్త పంపిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్‌ను చూడగానే శ్రుతి ఒక్కసారిగా నిశ్చేషు్టరాలైంది. ఆయన ఆచూకీ కనుగొని ప్రాణాలు కాపాడాలంటూ రాయదుర్గం అర్బన్ ఎస్ఐ సుమన్‌కు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. ఎర్రిస్వామి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. -
స్నేహితులని హామీ ఉన్నందుకు..చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని..
సాక్షి, బనశంకరి: అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కగ్గలిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరు వాసుదేవనపురలో శివరాజ్ (33) హెయిర్‌సెలూన్ నిర్వహిస్తున్నారు. శివరాజ్ స్నేహితులకు జామీను పడి అప్పు ఇప్పించాడు. దీంతో శివరాజ్ ప్రతివారం వడ్డీ చెల్లించేవాడు. ఇటీవల అధిక వడ్డీ చెల్లించలేదని రేణుకారాధ్య, ధను, వెంకటేశ్ అనే ముగ్గురు శివరాజ్ బైక్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో మానసిక వేధింపులకు గురవుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసిన శివరాజ్ ఈనెల 3న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి భార్య కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. (చదవండి: ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు ) -
భార్యకు సెల్ఫీ వీడియో పంపి..ఆ తర్వాత..
సాక్షి, కణేకల్లు: తన చావుకు ఎవరూ కారణం కాదంటూ భార్యకు వీడియో సందేశాన్ని పంపి భర్త కనిపించకుండా పోయాడు. వివరాలు.. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, జయలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంట బస్టాండ్ ప్రాంతంలో సెల్ఫోన్ల మరమ్మతు దుకాణాన్ని మల్లికార్జున నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన అతను ఈ విషయాన్ని భార్యకు కూడా తెలపలేదు. డాక్టర్ వద్దకు ఒక్కడే వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చేవాడు. మంగళవారం ఉదయం తాను దుకాణానికి వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి బయటకు వచ్చిన అతను.. ద్విచక్ర వాహనంపై మాల్యం – నాగేపల్లి గ్రామాల మధ్య ఉన్న హెచ్చెల్సీ గట్టుకు చేరుకున్నాడు. అనంతరం కాలువ గట్టుపై నిల్చోని తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో జీవితంపై విరక్తితో కాలువలో దూకి చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపాడు. ఆలస్యంగా ఈ సందేశాన్ని గమనించిన భార్య జయలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురైంది. విషయాన్ని వెంటనే కుటుంబసభ్యులకు, బంధువులకు, పోలీసులకు చేరవేయడవంతో అందరూ ఆగమేఘాలపై కాలువ గట్టుకు చేరుకున్నారు. అక్కడ మల్లికార్జున ద్విచక్ర వాహనంతో పాటు సెల్‌ఫోన్, షర్ట్ లభ్యమయ్యాయి. కుటుంబసభ్యులు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం) -
స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల సంసారంలో నిప్పులు పోసుకున్నా
సాక్షి, ఖమ్మం: ‘స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల నేను ఇబ్బందులు పడ్డాను.. సాయి అమ్మను మంచిగా చూసుకో.. అమ్మ మాట విను..’అంటూ మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బింగి వెంకటేశ్వరరావు తన మృతికి కారణాలు వివరిస్తూ సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బింగి వెంకటేశ్వరరావు మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే, మధిరలోని కొందరు ఫైనాన్సర్లతో పాటు పలువురి వద్ద నుంచి మరికొందరికి ఆయన డబ్బు అప్పు ఇప్పించాడు. అయితే, అప్పు తీసుకున్న వారు చెల్లించకపోవడంతో వెంకటేశ్వరరావుపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యాన కొంతకాలం ఆయన సొంతంగా వడ్డీ చెల్లించాడు. ఆతర్వాత చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అత్తగారిల్లయిన ఏపీలోని పెనుగంచిప్రోలు నుంచి మధిరకు రాకపోకలు సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం కందుకూరుకు వచ్చిన వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి పడిపోయాడు. ఈ విషయం పెనుగంచిప్రోలులో ఉన్న భార్యకు తెలియడంతో ఆమె రాత్రి చేరుకుని వచ్చి వెంకటేశ్వరరావు సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈమేరకు బుధవారం ఉదయం ఆమె తన భర్త కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్ తెలిపారు. వైరల్‌గా మారిన వీడియో.. వెంకటేశ్వరరావు మృతికి అనారోగ్యమే కారణమని ఆయన భార్య ఫిర్యాదు చేయగా, బుధవారం సాయంత్రానికి ఆయన తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ‘పలువురి వద్ద డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు ఇచ్చాను. ఇప్పుడు వారు కట్టకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. కొంతకాలంగా సొంతంగా డబ్బు కట్టినా.. ఇక కట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. నన్ను క్షమించు స్వప్నా(భార్య).. పచ్చని కాపురంలో నిప్పులు పోసుకున్నాను.. సాయి(కుమారుడు) అమ్మను మంచిగా చూసుకో’అని చెబుతూ పురుగుల మందు తాగి పడిపోయాడు. సాయంత్రానికి ఈ వీడియో వైరల్‌గా మారగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ వెంకటేశ్వరరావు రికార్డ్ చేసిన వీడియోలో పలువురి పేర్లను ప్రస్తావించినప్పటికీ వారు అప్పు ఇచ్చిన వారా, తీసుకున్న వారా అనేది తెలియరావడం లేదు. -
‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం
గీసుకొండ(వరంగల్ జిల్లా): ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతోపాటు అతడి బంధువుల వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటగండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం.. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం, నసీమా దంపతుల కూతురు నూర్జహాన్ అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు శరత్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్నారు. చదవండి: డీజే ప్రవీణ్‌తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త శరత్‌తోపాటు అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త నూర్జహాన్ను కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా.. వారి తీరు మారలేదు. వారి వేధింపులు భరించలేక నూర్జహాన్ మంగళవారం సాయంత్రం గీసుకొండ మండలం కోటగండి వద్దకు వచ్చి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. క్రిమిసంహారక మందు తాగే ముందు నూర్జహాన్ సెల్ఫోన్లో తన బాధను వీడియో తీసి తెలిసిన వారికి వాట్సాప్‌లో పెట్టింది. ఎక్కడికెళ్లినా న్యాయం జరగలేదు.. ‘నా చావుకు కారణం మాత్రం నా హజ్బెండ్, మా ఆడబిడ్డ, మా బావ, మా అత్తమామలు.. నేను లవ్ మ్యరేజ్ చేసుకున్నా.. క్యాస్టు తక్కువని, కట్నం కోసం కొట్టడంతోపాటు చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు. చాలా పీఎస్‌లకు తిరిగాను. నాకు ఎక్కడా న్యాయం లేదు. ఉమెన్ పీఎస్‌కు వెళ్లినా అక్కడ సీఐ సారు వాళ్లవద్ద మనీ తీసుకుని నాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదు. అందుకే చనిపోతున్నా.. నాలాంటి సిచ్యువేషన్ ఇంకో అమ్మాయికి రాకుండా చూడండి.. ప్లీజ్..’ అని ఒక వీడియోలో .. మరో వీడియోలో ‘అన్నా వినయ్‌రెడ్డి అన్నా థాంక్యూ వెరీమచ్ అన్నా. ఒక చెల్లిగా నాకు సహాయం చేసినందుకు థాంక్యూ అన్నా’ అంటూ మరో వీడియోను నూర్జహాన్ పోస్టు చేసింది. -
‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని
సాక్షి, హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు హర్షిత్(20) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మైసమ్మగూడలోని శ్రీకాంత్‌రెడ్డి హాస్టల్లో ఉంటూ ప్రతి రోజు కాలేజీకి వెళ్లి వస్తుండేవాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్టల్ గదికి చేరుకున్న హర్షిత్ సాయంత్రం 4 గంటల సమయంలో తోటి స్నేహితులు వచ్చే సరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న వారు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా.. ‘చిన్న చిన్న తప్పులు చేశాను.. స్నేహితుల వద్ద అప్పులు కూడా తీసుకున్నాను.. చదువులో సైతం పూర్‌గా ఉన్నాను.. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ సెల్ఫీ వీడియో ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా తండ్రి నారాయణరావు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఫోన్ ఓపెన్ అయితే తెలుస్తుందన్న తండ్రి అనుమానం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా! -
నా భార్య నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది.. భర్త సెల్ఫీ వీడియో కలకలం..
సాక్షి, ఆదిలాబాద్: బలవంతపు పెళ్లిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బోక్కలగూడలో భార్య వేధింపులు తట్టుకోలేక.. ఫిరోజ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి, సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక మహిళ తనను బలవంతంగా పెళ్లి చేసుకుందని.. పైగా తరుచు వేధింపులకు పాల్పడుతుందని, ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చదవండి: హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
హత్య చేసి పారిపోతూ....మృతదేహంతో సెల్ఫీ వీడియో!
చిన్నచిన్న వాటికే పెద్దగా రియాక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుని కటకటాల పాలవుతున్నారు చాలామంది. ఏ చిన్న బాధ, అవమానం కలిగిన అవతలవాళ్లను కడతేర్చాలనేంత ఉద్రేకానికి గురవ్వడం...ఇరు జీవితాలను తెలియకుండానే చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి చేసి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని పంకజ్ అనే వ్యక్తి సురేష్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఐతే పంకజ్ మద్యానికి బానిసై తరచు తాగుతూ ఇంటికి రావడంతో యజమాని సురేష్‌కి చిర్రేత్తుకొచ్చి గట్టిగా చివాట్లు పెడతాడు. ఆ తర్వాత పంకజ్ ఇంటి యజమానికి సురేష్, అతని కొడుకు జగదీష్‌లకు క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగిపోయింది. ఐతే పంకజ్ ఇంటి యజమాని సురేష్ చాలా ఘోరంగా అవమానంగా తిట్టడాని, అందుకే తాను ఇక ఇంట్లో ఉండలేనని కొడుకు జగదీష్‌కి ఫోన్ చేసి చెబుతాడు. అంతేకాదు పంకజ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాడు కూడా. ఐతే జగదీష్‌కి పంకజ్ తీరు మీద అనుమానం వచ్చి తండ్రి సురేష్ ఇంటికి వచ్చి చూస్తాడు. అంతే అక్కడ తండ్రి మృతి చెంది ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ట్రేసింగ్ పరికరాల సాయంతో 250 కి.మీ దూరం వెంబడించి మరీ నిందితుడు పంకజ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో సురేష్‌ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలిపాడు. అంతేకాదు చంపి వెళ్లిపోతూ సురేష్ మృతదేహంతో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంకజ్ వెళ్లిపోతూ తన వెంట సురేష్ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్‌ని కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఐతే నిందితుడు తన మీద అనుమానం రాకుండా అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడూ జగదీష్‌కి వేర్వేరు ప్రదేశాల నుంచి పోన్లు చేస్తూ ఉన్నాడు. ఆ భయమే అతన్ని పోలీసులకు సునాయసంగా చిక్కేలా చేసింది. (చదవండి: రాజస్థాన్ దళిత చిన్నారి మృతి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. నీళ్ల కుండే లేదంట!!) -
సెల్ఫీ వీడియో తీస్తూ రైతు ఆత్మహత్యాయత్నం
కౌడిపల్లి(నర్సాపూర్): సెల్ఫీ వీడియో తీస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువ రైతు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలంకు గ్రామ శివారులోని అటవీభూమి పక్కన సాగుభూమి ఉంది. అందులో వరితోపాటు మిరప పంట సాగు చేశారు. ఇటీవల గ్రామానికి బృహత్ పల్లె ప్రకృతి వనం మంజూరైంది. అటవీశాఖ అధికారులు దీనికోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. శనివారం అక్కడికి వచ్చిన డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రాజమణి, బీట్ అధికారి హరిత.. మిగతా భూమితోపాటు శ్రీశైలం పోడు చేసుకుంటున్న అటవీభూమిని సైతం దున్ని చదును చేయాలని సిబ్బందికి చెప్పారు. దీంతో శ్రీశైలం తమ తాతల కాలం నుంచి పోడు భూమిలో సాగు చేస్తున్నామని.. పంటను నాశనం చేయొద్దని అధికారులను కోరాడు. ఈ నేపథ్యంలో అతను అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పనులను అడ్డుకోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వారు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీశైలం, అటవీశాఖ అధికారులు, సర్పంచ్ కలసి తన పొలంలో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా బాధను తెలిపాడు. ఈ భూమి పోతే తమకు వేరే ఆధారం లేదని రోదిస్తూ పురుగు మందు తాగాడు. వీడియోను చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడిని మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అది అటవీ భూమి.. జింక శ్రీశైలం ఇప్పటికే అటవీ భూమిని ఆక్రమించి వరి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కొత్తగా మరో ఎకరా అటవీభూమి దున్ని మిరప పంట సాగు చేస్తున్నాడు. అటవీ భూమి కావడంతో పల్లెప్రకృతి వనం కోసం చదును చేస్తుండగా అడ్డుకొని ఇష్టానుసారంగా దూషించాడు. భూమికి సంబంధించి ఆధారాలు చూపించలేకపోయాడు. సిబ్బంది పనులకు అడ్డు తగలడంతో వాటిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ కోసం వస్తారన్న ఆందోళనతో శ్రీశైలం పురుగు మందు తాగి ఉండవచ్చు. – రాజమణి, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ, కౌడిపల్లి -
ఫైటర్ జెట్‌తో ప్రధాని విన్యాసాలు.. సెల్ఫీ వీడియో.. నెటిజన్ల ఫైర్!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పైలట్ యూనిఫామ్ ధరించి టైఫూన్ ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్‌లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ దృశ్యాలు సోమవారం విడుదల చేసింది డౌనింగ్ స్ట్రీట్. తన మాస్క్ ధరించి ఫైటర్ జెట్‌ను నడుపుతూ.. తనను అనుసరిస్తూ మరో రెండు విమానాలకు థంబ్స్ అప్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. 'ప్రధాని బోరిస్ జాన్సన్ లింకన్షైర్లోని ఆర్ఏఎఫ్ కానింగ్స్బై నుంచి టైఫూన్ ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లో ఎగురుతున్నారు.' అంటూ వీడియో క్యాప్షన్ ఇచ్చారు. ఐటీవీ ప్రకారం.. గత వారం లింకన్షైర్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) బేస్‌లో టైఫూన్ పైటర్స్ జెట్స్ ప్రదర్శన సందర్భంగా ఈ వీడియో తీశారు. ఈ సందర్భంగా ఆ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన బోరిస్.. కొన్ని విన్యాసాలు చేసేందుకు విమానాన్ని నియంత్రించానంటూ పేర్కొన్నారు. ఫైటర్ జెట్‌లో ప్రయాణంపై వింగ్ కమాండర్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు బోరిస్. మరోవైపు.. ఫైటర్ జెట్‌లో బోరిస్ ప్రయాణించటంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. టాప్ గన్ సినిమాలో టామ్ క్రూజ్ ఫీట్లు చేసేందుకు ప్రయత్నించారని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రధాని ఈ జాయ్‌రైడ్‌లో జాలీగా వెళ్లడానికి, టామ్ క్రూజ్‌లా విన్యాసాలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఎంత ఖర్చయిందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ రైడ్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటని మరొకరు ప్రశ్నించారు. విశ్వాస పరీక్షలో విజయం.. మరోవైపు.. ఇటీవలే ప్రధాని పదవికి రాజీనామా చేసి తాత్కాలిక బాధ్యతల్లో కొనసాగుతున్నారు బోరిస్ జాన్సన్. కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. భారత సంతతి వ్యక్తి, ఆ దేశా మాజీ మంత్రి రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో అధికార కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. ఇదీ చదవండి: Rishi Sunak.. పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్!