మోదీకి చిన్నారి సెల్ఫీ వీడియో | karnataka Student Send Selfie Video To PM Narendra modi over Traffic Problem | Sakshi
Sakshi News home page

మోదీజీ.. రైల్వే గేట్‌ సమస్య పరిష్కరించరూ!

Jun 3 2018 1:27 AM | Updated on Nov 9 2018 5:06 PM

karnataka Student Send Selfie Video To PM Narendra modi over Traffic Problem - Sakshi

బొమ్మనహళ్లి : స్కూల్‌కు వెళ్లి వచ్చే సమయంలో ఎదురవుతున్న ట్రాఫిక్‌ సమస్యను ఓ చిన్నారి వీడియో తీసి ప్రధాని నరేంద్ర మోదీకి పంపింది. బెంగళూరులో ని కోరమంగళ నుంచి సర్జాపుర వెళ్లే మార్గంలో కార్మాలారం వద్ద రైల్వే గేట్‌ ఉంది. రైళ్ల రాకపోకలతో అరగంటపాటు వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెయింట్‌ ప్యాట్రిక్‌ పాఠశాల విద్యార్థి రియాంశి పట్నాయక్‌(6) తండ్రి దీపాంకర్‌ మొబైల్‌లో సమస్యను చిత్రీకరించి.. రైల్వేగేట్‌వద్ద 15 నిమిషాలు ఆగాల్సి వస్తోందని, దీంతో స్కూల్‌కు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యమవుతోందని, ఈ సమస్యను పరిష్కరించాలి మోదీజీ అంటూ రికార్డు చేసింది. ఆమె తండ్రి ఆ వీడియోను ప్రధాని, రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌కు ట్విట్టర్‌ల ద్వారా పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement