ప్రధాని మోదీ హెచ్చరిక
కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు
రాబోయే నెల రోజుల్లో పెద్ద సంఘటన సృష్టించడానికి కుట్ర
కర్ణాటక, మహారాష్ట్రలో మోదీ ఎన్నికల ప్రచారం
బాగల్‌కోట్/షోలాపూర్/సతారా: ఎన్నికల సమరంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక రాజకీయ ప్రత్యర్థులు అడ్డదారులను నమ్ముకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేనివారు కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి, తనపై, బీజేపీ నాయకులపై బురదజల్లుతున్నారని, తద్వారా సమాజంలో అశాంతిని సృష్టించాలన్నదే వారి లక్ష్యమని ఆరోపించారు.
కృత్రిక మేధను దురి్వనియోగం చేస్తున్నారని, టెక్నాలజీని, సోషల్ మీడియాను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అచ్చంగా తన గొంతును పోలిన గొంతుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, తాను అనని మాటలు అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ధారణ కాని, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, ఇది నిజంగా ప్రమాదకరమైన ధోరణి అన్నారు.
ఇలాంటి ఫేక్ వీడియోలపై పోలీసులకు గానీ, బీజేపీకి గానీ ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు పనులు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. తప్పుడు సమాచారంతో ఇతరులను అప్రతిష్టపాలు చేయడం మన చట్టం అనుమతించదని తేలి్చచెప్పారు. సోమవారం కర్ణాటకలోని బాగల్‌కోట్, మహారాష్ట్రలోని షోలార్‌పూర్, సతారాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు.
రాబోయే నెల రోజుల్లో దేశంలో ఒక పెద్ద సంఘటన సృష్టించడానికి శత్రువులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపించారు. సామాజిక అశాంతి, అల్లకల్లోలం రేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకొనే అవకాశం ఉందని అన్నారు. తాను చాలా సీరియస్‌గా ఈ ఆరోపణలు చేస్తున్నానని చెప్పారు. ఫేక్ వీడియోల నుంచి మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఫేక్ వీడియోలను తెలిసీ తెలియక సోషల్ మీడియాలో షేర్ చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
రిజర్వేషన్ల రక్షణకు ఎంత దూరమైనా వెళ్తా..
దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు బీజేపీ వెంట నడుస్తుండడంతో మైనారీ్టలను మచి్చక చేసుకోవడానికి కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల ను నమ్ముకుందని, అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోనని స్పష్టం చేశారు. దళి తులు, ఆదివాసీ, ఓబీసీల రిజర్వేషన్లను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఈ మేరకు వారికి గ్యారంటీ ఇస్తున్నానని మో దీ వివరించారు. టెక్నాలజీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్ హబ్‌గా మారిందని ఎద్దేవా చేశా రు. ట్యాంకర్ మాఫియా ప్రజలను దోచుకుంటోందని, ఇందులో కమీషన్లు కాంగ్రెస్ నేతలకు చేరుతున్నాయని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment