fake video clippings
-
అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఐదుగురికి బెయిల్
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలకు కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది.పది వేల పూచీకత్తుతో కూడిన రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు కేసు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని కోరింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు ఐదుగురు వాట్సాప్‌లో వచ్చిన అమిత్ షా మార్ఫింగ్ వీడియోలను కావాలనే ట్విటర్లో పోస్టు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు పోస్టు చేసినట్లు ప్రాథమికంగా తేలినందున ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. -
Narendra Modi: ఫేక్ వీడియోలపై ఉక్కుపాదమే
బాగల్కోట్/షోలాపూర్/సతారా: ఎన్నికల సమరంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక రాజకీయ ప్రత్యర్థులు అడ్డదారులను నమ్ముకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేనివారు కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి, తనపై, బీజేపీ నాయకులపై బురదజల్లుతున్నారని, తద్వారా సమాజంలో అశాంతిని సృష్టించాలన్నదే వారి లక్ష్యమని ఆరోపించారు. కృత్రిక మేధను దురి్వనియోగం చేస్తున్నారని, టెక్నాలజీని, సోషల్ మీడియాను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అచ్చంగా తన గొంతును పోలిన గొంతుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, తాను అనని మాటలు అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ధారణ కాని, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, ఇది నిజంగా ప్రమాదకరమైన ధోరణి అన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలపై పోలీసులకు గానీ, బీజేపీకి గానీ ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు పనులు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. తప్పుడు సమాచారంతో ఇతరులను అప్రతిష్టపాలు చేయడం మన చట్టం అనుమతించదని తేలి్చచెప్పారు. సోమవారం కర్ణాటకలోని బాగల్కోట్, మహారాష్ట్రలోని షోలార్పూర్, సతారాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే నెల రోజుల్లో దేశంలో ఒక పెద్ద సంఘటన సృష్టించడానికి శత్రువులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపించారు. సామాజిక అశాంతి, అల్లకల్లోలం రేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకొనే అవకాశం ఉందని అన్నారు. తాను చాలా సీరియస్‌గా ఈ ఆరోపణలు చేస్తున్నానని చెప్పారు. ఫేక్ వీడియోల నుంచి మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఫేక్ వీడియోలను తెలిసీ తెలియక సోషల్ మీడియాలో షేర్ చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రిజర్వేషన్ల రక్షణకు ఎంత దూరమైనా వెళ్తా.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు బీజేపీ వెంట నడుస్తుండడంతో మైనారీ్టలను మచి్చక చేసుకోవడానికి కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల ను నమ్ముకుందని, అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోనని స్పష్టం చేశారు. దళి తులు, ఆదివాసీ, ఓబీసీల రిజర్వేషన్లను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఈ మేరకు వారికి గ్యారంటీ ఇస్తున్నానని మో దీ వివరించారు. టెక్నాలజీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్ హబ్‌గా మారిందని ఎద్దేవా చేశా రు. ట్యాంకర్ మాఫియా ప్రజలను దోచుకుంటోందని, ఇందులో కమీషన్లు కాంగ్రెస్ నేతలకు చేరుతున్నాయని దుయ్యబట్టారు. -
ఫేక్ వీడియోలపై స్పందించిన ప్రధాని మోదీ
బెంగళూరు: ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు, ఓడిపోతామనుకుంటున్న వాళ్లు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.కర్ణాటకలోని బాగల్కోట్లో సోమవారం(ఏప్రిల్29)జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఫేక్ వీడియోలను గుర్తిస్తే బీజేపీ కార్యకర్తలు ముందుగా వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని మోదీ కోరారు. కాగా,ఐదేళ్ల క్రితం జరిగిన బాలాకోట్ దాడులకు సంబంధించి ప్రధాని కీలక విషయం వెల్లడించారు. దాడుల సమాచారాన్ని ముందుగా పాకిస్థాన్‌కు చెప్పిన తర్వాతే బయటికి వెల్లడించామని తెలిపారు. పాకిస్థాన్‌కు ఈ విషయమై ఫోన్ చేస్తే వాళ్లు తన ఫోన్ తీయలేదన్నారు. పాకిస్థాన్‌కు సమాచారం వెళ్లేవరకు మీడియాకు విషయం వెల్లడించవద్దని ఆర్మీ అధికారులను తాను కోరినట్లు చెప్పారు. తనకు వెనుక నుంచి దాడి చేయడంపై నమ్మకం లేదన్నారు. -
US: ట్రంప్‌ను తెగ తిట్టిన తండ్రి ఆత్మ.. ఏఐ వీడియో వైరల్
వాషింగ్టన్: అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. అధ్యక్ష పదవికి పోటీ పడేవారిని ఎన్నుకునేందుకుగాను రెండు ప్రధాన పార్టీల ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికలు కూడా మొదలయ్యాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల ప్రచారంలో డీప్ ఫేక్ ఆడియో, వీడియోల బెడద అభ్యర్థులకు ఎక్కువైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సృష్టించే ఈ ఫేక్ ఆడియో, వీడియోల ట్రెండ్‌ను తమకు అనుగుణంగా మలుచుకునే నేతలు కూడా లేకపోలేదు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన నిజమైన ఆడియో, వీడియోలను కూడా డీప్ ఫేక్ అని తప్పించుకునే నేతలూ ఉన్నారు. వీరిలో రిపబ్లికన్ పార్టీ ప్రధాని అభ్యర్థి రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుంటారు. అయితే తాజాగా యాంటీ ట్రంప్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి చెందిన లింకన్ ప్రాజెక్ట్ రూపొందించిన ఆసక్తికర ఏఐ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ట్రంప్ నాన్న ఫ్రెడ్ ట్రంప్ ఆత్మ తన కొడుకు డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న అవలక్షణాలన్నింటినీ చెబుతూ తిడుతుంటుంది. ఫ్రెడ్ ట్రంప్ తిడుతుండగా డొనాల్డ్ ట్రంప్ జీవితంలోని పలు సందర్భాలకు చెందిన వీడియో క్లిప్పులు ప్లే అవుతుంటాయి. ‘డొన్నీ(డొనాల్డ్ ట్రంప్) నువు చేసిన వ్యాపారాలన్నీ చెత్త. కనీసం క్యాసినో ఆడి కూడా నువు డబ్బులు సంపాదించలేకపోయావ్. ఎన్నోసార్లు దివాళా తీసిన నిన్ను నేనే బయటపడేశాను. నువ్వు నా పేరు పెట్టుకున్నందుకు నేను సిగ్గు పడుతున్నాను. నువ్వొక బోరింగ్ మనిషివి. ఆడవాళ్లు నిన్ను ఎందుకు వదిలేస్తారో అందరికీ తెలుసు. పోర్న్ స్టార్లకు డబ్బులిస్తావు. నీ పిల్లలు కూడా నిన్ను అసహ్యించుకుంటారు. నేను సృష్టించిన ట్రంప్ బ్రాండ్ నీ వల్ల చెత్తగా మిగిలిపోయింది. అసలు నా కొడుకు ఇంత దారుణంగా ఎలా తయారయ్యాడు. నువ్వు ఇప్పటివరకు జైలుకు వెళ్లకుండా బయట ఉన్నావంటే అది నీ అదృష్టమే. నేను చనిపోయి 30 ఏళ్లయింది. ఇప్పటికీ నిన్ను చూసి సిగ్గు పడుతున్నాను’ అని ఫ్రెడ్ ట్రంప్ ఆత్మ కొడుకు ట్రంప్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఈ వీడియో ఏఐ ద్వారా సృష్టించిందని లింకన్ ప్రాజెక్ట్ బహిరంగంగానే ఒప్పుకుంది. ఈ వీడియో సరికాదని ట్రంప్ ఇప్పటికే ఖండించారు. ఇదీ చదవండి.. పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణం -
ముఖం మార్చేస్తారు!
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆడవారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వీడియో అమెరికాలో కలకలం రేపింది. తరువాత అది నకిలీదని తేలింది. ఓ హాలీవుడ్ హీరోయిన్ పోర్న్ క్లిప్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. అందులో ఉన్నది తాను కాదన్నా ఎవరూ నమ్మలేదు. కానీ, ఆమె చెప్పేది నిజమే. మనకు నచ్చిన సెలబ్రిటీల శరీరానికి సామాన్యుల ముఖాలను అంటించి మురిసిపోయే వీలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ‘డీప్‌ఫేక్’సాఫ్ట్వేర్ సృష్టిస్తోన్న మాయాజాలమిది. ఈ యాప్ వచ్చిన కొత్తలో తమకు ఇష్టమైన హీరో, గాయకులు, రాజకీయ నాయకులను అనుకరిస్తూ.. పలు ఫొటోలు, వీడియోలు సృష్టించి, వాటిని సోషల్ మీడియా వేదికలపై పంచుకునేవారు. వాటికి వచ్చే లైకులు చూసి సంబరపడిపోయేవారు. అక్కడి వరకే పరిమితమైతే సరిపోయేది. కానీ, కొందరు మరో అడుగు ముందుకేసి.. సంచలనం సృష్టించాలని, తమ టీవీ చానళ్లకు రేటింగులను పెంచాలనే దురుద్దేశంతో డీప్‌ఫేక్‌ను వాడుకుని సెలబ్రిటీల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సందేశాలు, అసభ్య వీడియోలు సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. అవి నకిలీవని నిరూపించుకునేందుకు బాధితులు నానా తంటాలు పడుతున్నారు. పలు దేశాల్లో నిషేధం.. టిక్‌టాక్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో డ్యాన్సులు, డబ్‌స్మాష్‌తో భారీ డైలాగులు చెబుతూ చాలామంది సంబరపడిపోతారు కదా! ఈ యాప్ కూడా దాదాపు అలాంటిదే. కాకపోతే.. అడ్వాన్స్డ్ వెర్షన్. ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ, అనుసరించాలనుకున్న ముఖం కవళికలను ఈ సాఫ్ట్వేర్ ముందే పసిగడుతుంది. మీ బాడీకి ఏ సెలబ్రిటీ శరీరమైతే సరిగ్గా సరిపోతుందో సూచిస్తుంది. దాని ప్రకారం.. మీరు ఏదో వీడియోను చేసి, అందులో మీకు నచ్చిన సందేశం ఇచ్చేయాలి. తరువాత మీ ముఖంపై ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది. అలా.. మీకు నచ్చిన ప్రముఖుల ముఖంలో మీ ముఖం ఇమడ్చడం, లేదా మీ ముఖంలో ప్రముఖుల ముఖం అమర్చే ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇది. ముఖ కవళికలను ఎవరూ గుర్తుపట్టనంత స్పష్టంగా, నాణ్యంగా ఫొటోలు, వీడియోలు సృష్టించడం దీని ప్రత్యేకత. ఇంకో విషయమేమిటంటే.. ఇందులో సెలబ్రిటీల గొంతుతోనే వీడియో వస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలోని ప్లేస్టోర్లలో ఈ సాఫ్ట్వేర్లను అందించే యాప్‌లు అనేకం ఉన్నాయి. వీటిలో చాలా యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిషేధించాయి. ఉగ్రవాదులు, సైబర్ నేరగాళ్లు ఈ యాప్‌ల సాయంతో మోసాలు, దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని, వీటిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఆ వీడియోలు, ఫొటోలను షేర్ చేయొద్దు: ఆర్మీ
పాకిస్థాన్‌కు చెందిన కొన్ని టీవీ చానళ్లు భారత సైనికులు మరణించినట్లుగా ఫేక్ వీడియో క్లిప్పింగులను ప్రసారం చేస్తున్నాయని భారత సైన్యం తెలిపింది. ఇవే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా తిరుగుతున్నాయని, అయితే ఇదంతా బూటకపు ప్రచారం అన్న విషయం స్పష్టంగా తేలిపోయిందని సైన్యం చెప్పింది. అందువల్ల ఎవరి దగ్గరకైనా భారత సైనికులు మరణించినట్లు చూపించే వీడియో క్లిప్‌లు గానీ, ఫొటోలు గానీ వచ్చినా వాటిని షేర్ చేయొద్దని, మీడియాలో ప్రసారం కూడా చేయొద్దని ఆర్మీ వర్గాలు సూచించాయి. నియంత్రణ రేఖకు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మెరుపుదాడితో ఒక్కసారిగా బిత్తరపోయిన పాక్ సైన్యం.. ఆ తర్వాతి నుంచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారానికి దిగినట్లు తెలుస్తోంది.