ఆ వీడియోలు, ఫొటోలను షేర్ చేయొద్దు: ఆర్మీ
పాకిస్థాన్‌కు చెందిన కొన్ని టీవీ చానళ్లు భారత సైనికులు మరణించినట్లుగా ఫేక్ వీడియో క్లిప్పింగులను ప్రసారం చేస్తున్నాయని భారత సైన్యం తెలిపింది. ఇవే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా తిరుగుతున్నాయని, అయితే ఇదంతా బూటకపు ప్రచారం అన్న విషయం స్పష్టంగా తేలిపోయిందని సైన్యం చెప్పింది. అందువల్ల ఎవరి దగ్గరకైనా భారత సైనికులు మరణించినట్లు చూపించే వీడియో క్లిప్‌లు గానీ, ఫొటోలు గానీ వచ్చినా వాటిని షేర్ చేయొద్దని, మీడియాలో ప్రసారం కూడా చేయొద్దని ఆర్మీ వర్గాలు సూచించాయి.
నియంత్రణ రేఖకు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మెరుపుదాడితో ఒక్కసారిగా బిత్తరపోయిన పాక్ సైన్యం.. ఆ తర్వాతి నుంచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారానికి దిగినట్లు తెలుస్తోంది.