surgical strikes
-
ప్రశాంత కశ్మీర్‌కు మార్గం
జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదం, రాళ్లదాడులు, హర్తాళ్లు, సరిహద్దుల్లో అలజడి వగైరాలు లేకుండా ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదమ్‌పూర్ ర్యాలీలో ఎంతో ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటనను బహుశా విపక్షాలు కూడా స్వాగతిస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుల్వామాలో సైనికులపై ఉగ్రవాద దాడి, ఆ వెనువెంటనే పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం సాగించిన సర్జికల్ దాడులు విపక్షాలకు దేశంలో అప్పటివరకూ కొద్దో గొప్పో ఉందనుకున్న అనుకూలతలను ఆవిరిచేశాయి. బీజేపీకి భారీ మెజారిటీని అందించాయి. కనుక ఈసారి అంతా సవ్యంగా ముగియాలని అవి కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఆ మాటెలావున్నా మోదీ చెప్పిన స్థాయిలో ఉగ్రవాదం బెడద సమసిపోయిందనుకోలేము. ఆ ఉదంతాల సంఖ్య గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే అయినా అడపా దడపా వారి ఆగడాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. నిరుడు డిసెంబర్లో పూంచ్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడిన ఉదంతంలో నలుగురు జవాన్లు మరణించటమైనా, మరుసటి నెలలో అదేప్రాంతంలో సైనికులపై జరిగిన దాడి యత్నమైనా, శ్రీనగర్‌లో ఫిబ్రవరిలో ఒక పంజాబీ పౌరుణ్ణి కాల్చిచంపటమైనా మరింత అప్రమత్తత అవసరమన్న సంకేతాలిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయటమైనా, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమైనా అక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాయన్నది వాస్తవం. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. లోక్‌సభ ఎన్నికలకంటే అసెంబ్లీ ఎన్నికలకే జమ్మూ, కశ్మీర్లో ఎప్పుడూ అధిక ప్రాధాన్యత వుండేది. అయితే మారిన పరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో పట్టు సంపాదిస్తేనే భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం సాధ్యమవుతుందని ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కొత్తగా రంగంలోకొచ్చిన గులాంనబీ పార్టీ డీపీఏపీ భావిస్తున్నాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ పార్లమెంటులో తమ సంఖ్యను పెంచుకోవటానికి ఎంతో కొంత దోహదపడుతుందన్నదృష్టితో వున్నాయి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ది విషాద స్థితి. అంతక్రితం గెల్చుకున్న జమ్మూ, లద్దాఖ్‌లు రెండూ ఆ సార్వత్రిక ఎన్నికల్లో చేజారాయి. ఆ రెండూ బీజేపీ పరమయ్యాయి. కానీ మారిన పరిణామాలు లద్దాఖ్‌లో ఆ పార్టీకి ఆశలు పుట్టిస్తున్నాయి. ఉపాధి లేమి, హిల్ కౌన్సిళ్లను నీరుగార్చటం, పర్యావరణాన్ని దెబ్బతీసేలా సాగుతున్న కార్పొరేట్ సంస్థల భూదాహం లద్దాఖ్ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించాయి. దానికితోడు చైనానుంచి ముప్పువుండొచ్చన్న ఆందోళనతో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లద్దాఖ్‌ను చేరుస్తామన్న హామీనుంచి బీజేపీ వెనక్కి తగ్గింది. అలా చేరిస్తే ఆదివాసీ ప్రాంతాలకు కార్యనిర్వాహక, శాసన, న్యాయ, ఆర్థిక రంగాల్లో స్వయం నిర్ణయాధికారం లభిస్తుంది. తమ ప్రాంతాల్లోని అడవులు, నదులు, వ్యవసాయం, గ్రామపాలన, వారసత్వ ఆస్తి, వివాహం, విడాకులు, సంప్రదాయాలు తదితరఅంశాల్లో చట్టాలు చేసుకునే అధికారం వుంటుంది. పొరుగున చైనా వున్న నేపథ్యంలో ఇది సమస్యాత్మకం కావొచ్చని ఆలస్యంగా గ్రహించటంతో బీజేపీకి ఎటూ పాలుబోవటం లేదన్నది వాస్తవం. అక్కడి ఉద్యమాల పర్యవసానంగా లే ప్రాంతంలో ఆధిపత్యంవున్న బుద్ధిస్ట్లకూ, కార్గిల్‌లో పైచేయిగా వున్న ముస్లింవర్గాలకూ మధ్య సంప్రదాయ సరిహద్దులు చెరిగిపోయాయి. ఫలితంగా ఇటీవల జరిగిన 26 స్థానాల హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి రెండు మాత్రమే దక్కాయి. కనుక బీజేపీ సంకల్పం నెరవేరటం అంత సులభం కాదు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఇటీవల సమష్టిగా అడుగులేసినట్టు కనబడిన ఈ రెండు పార్టీలూ ఎన్నికలు వచ్చేసరికి దూరం జరిగాయి. గతంలో ఒప్పందాలకు కట్టుబడి వుండటం అలవాటులేని పీడీపీతో పొత్తు అసాధ్యమన్నది నేషనల్ కాన్ఫరెన్స్ వాదన. చిత్రమేమంటే ఎప్పుడూ ‘మరింత స్వయంప్రతిపత్తి’, జమ్మూ, కశ్మీర్లో శాంతి స్థాపన చర్చలు ప్రధాన ఎజెండాగా చేసుకునే ఆ పార్టీలకు మారిన పరిస్థితుల్లో ఆ అంశాల ప్రస్తావనకే అవకాశం లేకుండా పోయింది. డీపీఏపీ ఎత్తుగడలే ఈ పార్టీలను కలవరపరుస్తున్నాయి. ఆజాద్ తాను బలంగావున్న ఉదంపూర్–దోడా నియోజకవర్గాన్ని వదిలి అనంత్‌నాగ్–రాజౌరికి ఆయన వలస రావటం వెనక ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయాలన్న వ్యూహం వున్నదని వాటి అనుమానం. ఉన్న ఆరు లోక్‌సభ స్థానాలకూ అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించటం జమ్మూ, కశ్మీర్ వర్తమాన స్థితికి అద్దం పడుతుంది. అయిదేళ్లుగా నిద్రాణమైనట్టున్న ఈ ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత కదలిక వచ్చింది. ఇప్పుడు లభించే ఓట్ల శాతాన్నిబట్టి భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానం ఏమిటన్నది తేలిపోతుందని బీజేపీ గట్టిగా భావిస్తోంది. మిలిటెంట్ల స్వరం ఈసారి మూగబోయిందన్నది వాస్తవం. అయితే రాష్ట్రంలో హిందూ సీఎంవుండాలన్న బీజేపీ ఆశ నెరవేరాలంటే ఉగ్రవాదాన్ని అణిచేయటం ఒక్కటే చాలదు. అందుకు అభివృద్ధికి బాటలు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు పెంచటం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగపరిచే దిశగా చర్యలు తీసుకోవటం, మానవహక్కులకు ప్రాధాన్యతనీయటం తప్పనిసరి. సరిహద్దు ఆవల పాకిస్తాన్, చైనాలు వున్నాయన్న స్పృహతో మెలిగి, సున్నితంగా వ్యవహరించటం నేర్చుకుంటే ఆ ప్రాంత ప్రజల హృదయాలు గెల్చుకోవటం సులభమవుతుంది. -
Javed Akhtar: పాక్ గడ్డపై స్పీచ్‌తో సర్జికల్ స్ట్రైక్
ప్రముఖ సినీ గేయ రచయిత, ఉర్దూ కవి జావేద్ అక్తర్.. తాజాగా పాకిస్తాన్ గడ్డపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. ముంబై 26/11 దాడులకు కారకులైన ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఈ పరిణామం భారతీయుల గుండెల్లో చేదు నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. దిగ్గజ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ సంస్మరణార్థం కిందటి వారం లాహోర్(పాక్)లో ఓ కార్యక్రమం జరిగింది. దానికి జావేద్ అక్తర్ హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడున్న ఆడియొన్స్‌లో కొందరు ఆయనకు పలు ప్రశ్నలకు సంధించారు. మీరు పాకిస్తాన్‌కు ఎన్నోసార్లు వచ్చారు. మరి మీకు వెనక్కి వెళ్లాక.. మీ ప్రజలకు పాక్ వాళ్లు మంచోళ్లు అని, బాంబులు పేల్చే రకం మాత్రమే కాదు.. పూలమాలతో ప్రేమను కూడా కురిపిస్తారని అక్కడి ప్రజలకు మీరు ఎప్పుడైనా చెప్పారా? అని జావేద్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన.. ఇక్కడి ఎవరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు.ఇరు దేశాల ప్రజల ద్వేషం దేనిని పరిష్కరించదు. ఇక్కడ ఇరు దేశాల మధ్య వాతావరణం ఉత్కంఠభరితంగా మాత్రమే ఉంది. ముంబై ప్రజలమైన మేం.. ఉగ్రవాద దాడులను కళ్లారా చూశాం. దాడికి పాల్పడ్డవాళ్లు ఎక్కడో నార్వే నుంచో, ఈజిప్ట్ నుంచో రాలేదు. వాళ్లు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు భారతీయుల కోపానికి అర్థం ఉంది. దానిపై మీరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు అని కుండబద్ధలు కొట్టారాయన. वाह! शानदार @Javedakhtarjadu बहुत खूब... 👏🙌👏#JavedAkhtarInPakistan pic.twitter.com/snbXKCKmGf — Dr. Syed Rizwan Ahmed (@Dr_RizwanAhmed) February 21, 2023 అంతేకాదు.. పాక్ దిగ్గజాలకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్లో స్వాగతం లభించలేదని ఆయన ఎత్తిచూపారు. ఉదాహరణకు.. ఫైజ్ సాబ్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన్ని ప్రముఖ సందర్శకుడిగా భావించింది భారత్. అదంతా అంతటా ప్రసారం అయ్యింది కూడా. అలాగే భారత్‌లో నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, మెహ్దీ హాసన్‌లకు గౌరవ సూచికంగా పెద్ద ఎత్తున్న వేడుకలను అక్కడ(భారత్) నిర్వహించాం. మరి మీరు(పాక్) లతా మంగేష్కర్ కోసం ఏదైనా వేడుక నిర్వహించగలిగారా? అని నిలదీయడంతో.. అక్కడున్నవాళ్లంతా చప్పళ్లు చరిచారు. Jab main Javed saab ki poetry sunti hoon toh lagta tha yeh kaise Maa Swarsati ji ki in pe itni kripa hai, lekin dekho kuch toh sachchai hoti hai insaan mein tabhi toh khudai hoti hai unke saath mein … Jai Hind @Javedakhtarjadu saab… 🇮🇳 Ghar mein ghuss ke maara .. ha ha 🇮🇳🇮🇳 https://t.co/1di4xtt6QF — Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023 జావేద్ అక్తర్ పాక్ ప్రసంగం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై చాలామంది అభినందనలు కురిపిస్తున్నారు. ఇక జావేద్ అక్తర్ వ్యాఖ్యలు మాటల తుటాలని.. పాక్ గడ్డపై ఆయన చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక జావేద్‌పై ప్రశంసలు గుప్పించిన వాళ్లలో ప్రముఖ నటి కంగనా రౌత్ కూడా ఉన్నారు. -
వాటికీ ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఉగ్రదాడి, సర్జిక్ స్ట్రైక్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామ ఉగ్రదాడిలో సుమారు 40 మంది భ్రదతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. "పుల్వామ ఉగ్రవాదానికి కేంద్రం, పైగా అక్కడ ప్రతి కారుని కూడా తనిఖీ చేస్తారు. అలాంటప్పుడూ రాంగ్‌సైడ్ నుంచి వచ్చిన స్కార్పియో కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. అప్పుడే కదా ఈ స్కారిపియో కారు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని ఢీ కొనడంతో అంతమంది జవాన్లు చనిపోయారు" అంటూ కేంద్రంపై విరుచకుపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సరైనా సమాధానం ఇవ్వలేదన్నారు. అదీగాక పార్లమెంటులో బహిరంగంగా ప్రధాని మోదీ పదేపదే సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడతారంటూ విమర్శించారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌తో ఇంతమందిని చంపాం అని ఏవో ప్రగాల్పాలు చెబుతుంటారని మండిపడ్డారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు సరైనా ఆధారాలను అందించలేకపోయిందంటూ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ జమ్మూలోని భారత్ జోడోయాత్రలో రాహుల్‌తో కలసి ఈ విషయాలు గురించి మాట్లాడారు. అంతేగాదు 300 కిలోల ఆర్డిఎక్స్ ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో సుమారు18 మంది సైనికులు మరణించారు. దీంతో 2016లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించింది.అయితే కాంగ్రెస్ పార్టీ పుల్వామా దాడి, వైమానిక దాడుల గురించి బీజేపీ కొంతకాలం వరకు ప్రశ్నలు సంధించింది. ఐతే బీజేపీ మన సైన్యాన్నే అనుమానిస్తున్నారా? అని గట్టి కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. पुलवामा हादसे में आतंकवादी के पास ३०० किलो RDX कहॉं से आई? देवेंद्र सिंह डीएसपी आतंकवादियों के साथ पकड़ा गया लेकिन फिर क्यों छोड़ दिया गया? पाकिस्तान व भारत के प्रधानमंत्री के मैत्री संबंधों पर भी हम जानना चाहते हैं। pic.twitter.com/1wVbJEDPIC — digvijaya singh (@digvijaya_28) January 23, 2023 (చదవండి: వీడియో: అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి: మరోసారి స్పష్టం చేసిన రాహుల్ గాంధీ) -
చైనా, పాక్ భాష
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చైనా వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అరుణాచల్‌లోని తవాంగ్‌లో భారత జవాన్లను చైనా సైనికులు కొట్టారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ నిరంతరం చైనా, పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉంటారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. శనివారం నడ్డా మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను కాంగ్రెస్ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులపై గతంలో రాహుల్ సందేహాలు వ్యక్తం చేశారని, ఇవన్నీ చూస్తుంటే ఆయనకున్న దేశభక్తి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలతో సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. పార్టీని ఖర్గే తన నియంత్రణలోకి తీసుకొని రాహుల్‌ని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఆ దేశ భాష రాహుల్ మాట్లాడుతూ ఉంటారని ఆరోపించారు. ఆర్మీపై రాహుల్‌కు నమ్మకం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. -
ఇమ్రాన్‌ఖాన్‌ను ఆధారాలు కోరవచ్చు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: పాకిస్తాన్‌పై సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సీఎం కేసీఆర్ ఆధారాలు కోరడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలుగా అభినందన్ వర్ధమాన్ పరాక్రమం, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ఫ్లై జోన్‌ను నిషేధించిన పాకిస్తాన్ చర్యలు సరిపోవా అని నిలదీశారు. ఇవీ చాలకపోతే కేసీఆర్ నేరుగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆధారాలు కోరవచ్చని చురకలంటించారు. కేసీఆర్ బాధ్యతారహితంగా చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన టుక్డే.. టుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్‌తో చేరినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్పందనలేని గుణానికి, బాధ్యతారాహిత్యానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విడిగా ఓ ప్రకటనలోనూ ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఈ తీరును వారు ఎన్నటికీ క్షమించరన్నారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: కేంద్ర మంత్రులు ఠాకూర్, గిరిరాజ్ సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. సైనికుల ధీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడటం ఆయన మానసిక వైఫల్యాన్ని సూచిస్తోందన్నారు. పాక్ సైనికులపైనే కేసీఆర్‌కు ఎక్కువ నమ్మకం ఉన్నట్లుందని అనురాగ్ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు కావాలంటే నేరుగా పాక్‌నే కోరాలని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సవాల్ సూచించారు. దేశం క్షమించదు: అసోం సీఎం సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అవమానిస్తే దేశం క్షమించదని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై సైన్యం చూపిన వీడియో ఆధారాలు కేసీఆర్‌కు చాలవా అని ఆయన ప్రశ్నించారు. సైన్యంపై దాడి చేయాలని, దుష్ప్రచారం చేయాలని ఎందుకు తహతహలాడుతున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ సైన్యంపై అవిశ్వాసం చూపరాదని విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. -
‘డియర్ కేసీఆర్ గారూ’.. అంటూనే కౌంటర్
సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ఆధారాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే వ్యవహారం డర్టీ పాలిటిక్స్‌కు తెర తీసింది. రాహుల్ గాంధీకి మద్ధతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. బీజేపీని, రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఇవాళ అవతలి నుంచి సీఎం కేసీఆర్‌కు కౌంటర్ పడింది. రాహుల్ లాగే తాను కూడా కేంద్రాన్ని అదే డిమాండ్ చేస్తున్నానని... సర్జికల్ స్ట్రయిక్స్‌కు ఆధారాలు చూపాలని అడుగుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డియర్ కేసీఆర్ గారూ, మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌కు వీడియోగ్రాఫిక్ సాక్ష్యం. అయినప్పటికీ మీరు మా సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు. సైనికులను అవమానిస్తున్నారు. మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. మన సైన్యాన్ని అవమానిస్తే నవ భారతదేశం సహించదు అంటూ కూ యాప్‌లో పోస్ట్ చేశాడాయన. Koo App Dear KCR garu, here is the videographic evidence of the surgical strike by our brave army. In spite of this you question the valor of our Armed forces and insult them. Why are you so desperate to attack and malign our Army? New India will not tolerate insults against our Army. View attached media content - Himanta Biswa Sarma (@himantabiswa) 14 Feb 2022 పుల్వామా దాడి వార్షికోత్సవం సందర్భంగా సర్జికల్ స్ట్రయిక్స్ ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయని హిమంత అంటున్నారు. నెహ్రూ కుటుంబం తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో వారు సైన్యానికి ద్రోహం చేసేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సైన్యం పట్ల తనకు ఎంతో విధేయత ఉందని, జీవితకాలమంతా తనను విమర్శించినా పట్టించుకోబోనని తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీని ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని.. ఆయన(రాహుల్) రాజీవ్ కు పుట్టారనే ఆధారాలను బీజేపీ ఎప్పుడైనా అడిగిందా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు నేతలు.. హిమంతపై నిప్పులు చెరగ్గా.. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు. హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సైతం బీజేపీని డిమాండ్ చేశారు కేసీఆర్. -
'సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్‌లో బిపిన్ రావత్ పాత్ర మరువలేం'
సాక్షి, హైదరాబాద్: బిపిన్ రావత్‌లోని కృషి, పట్టుదలే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని రావత్ స్నేహితుడు కల్నల్ పి.వి. దుర్గాప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బిపిన్‌రావత్‌తో 20 ఏళ్ల పాటు కలిసి పనిచేశాను. ఆయన అందరితో కలసిపోయే స్వభావం కలవాడు. మూడు రక్షణ విభాగాలను ఒకే తాటిపై తీసుకురావడంలో బిపిన్ రావత్ పాత్ర మరువలేనిది. రావత్ కుటుంబం మొత్తం దేశానికి సేవ చేసిన వారే. ఇద్దరం కలిసి ఒకే రెజిమెంట్‌లో పనిచేశాం. దేశ సరిహద్దుల సమస్యలను ఎదుర్కొనడంలో వ్యూహాలు రచించేవారు. అనేక కీలకమైన ఆపరేషన్లలో రావత్ ముందుండి నడిపించేవాడు. సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్‌లో రావత్ పాత్ర మరవలేము. రావత్ కుటుంబంతో మాకు మంచి పరిచయం ఉంది. రావత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుందిగల్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చినప్పుడు చివరిసారిగా కలిశాము. రావత్ మరణం దేశానికి తీరని లోటు. వ్యక్తిగతంగా జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుపుతారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు ఉంటాయి' అని కల్నల్ పి.వి. దుర్గాప్రసాద్ అన్నారు చదవండి: (Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు) -
‘చర్చించే రోజులు పోయాయ్, దెబ్బకు దెబ్బ తీస్తాం’.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాశ్మీర్లో పాకిస్తాన్ తమ దాడులను ఆపకపోతే మరిన్ని సర్జికల్ దాడులు చేస్తామని హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. తాము దాడులను సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయి. పాక్ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. గోవాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి వెళ్లిన అమిత్ షా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో సర్జికల్ స్ట్రైక్ ఓ చారిత్రాత్మక ఘటన. దాని ద్వారా భారత సరిహద్దులను ఎవరూ చెరపాలన్న చూసిన వారికి ఇదే గతి పడుతుందని తెలిసేలా చేశాం. గతంలో చర్చించే వాళ్లం, కానీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసే సమయమని’ షా అన్నారు. కాగా భారత్‌లో ఉరీ, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా 2016 సెప్టెంబర్‌లో పాకిస్తాన్లో భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో అనేక ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. ఉరీ దాడి జరిగిన 11 రోజుల తర్వాత 2016 సెప్టెంబర్ 29 న సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. చదవండి: Birth Day Celebrations : కళ్లు చెదిరే వేడుక..ఇలా కూడా చేస్తారా? -
పాకిస్తాన్లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్
టెహ్రాన్: పాకిస్తాన్ భూభాగంలో మంగళవారం రాత్రి తాము సర్జికైల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జైష్ ఉల్–అదల్ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. వారిని సురక్షితంగా ఇరాన్‌కు చేర్చామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్ అయిన జైష్ ఉల్–అదల్ 2018 అక్టోబర్ 16న 12 మంది ఐఆర్జీసీ గార్డులను అపహరించింది. పాక్–ఇరాన్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్ స్ట్రైక్స్‌తో ఇరాన్ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది. ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్–అదల్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్‌లోని బలూచ్ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది. -
అభినందన్ నన్ను మెచ్చుకున్నారు: పాక్ వ్యక్తి
ఇస్లామాబాద్: తాను చేసిన టీ తాగి.. భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ తనను ప్రశంసించారని పాకిస్తాన్‌కు చెందిన అన్వర్ అలీ అన్నాడు. రుచికరమైన టీ ఇచ్చినందుకు తనకు ధన్యవాదాలు కూడా తెలిపారని పేర్కొన్నాడు. వైమానిక దాడుల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అభినందన్ నుంచి భారత సైన్యానికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ముఖం నిండా రక్తంతో ఉన్న అభినందన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అంతర్జాతీయంగా.. చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో పాక్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో అభినందన్ టీ తాగుతూ.. కాస్త ప్రశాంతమైన వదనంతో కనిపించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.(పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ) కాగా ఇదంతా జరిగి గురువారం నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరు.. అభినందన్‌కు టీ ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న అన్వర్ అలీతో మాట్లాడాడు. ‘‘శత్రుసైన్యానికి చెందిన పైలట్’’కు మర్యాద చేయడాన్ని ఎలా భావిస్తున్నారని సదరు జర్నలిస్టు అతడి అడుగగా... ‘‘ ఆయన మా అతిథి. టీ తాగి బాగుందని చెప్పారు’’అని పేర్కొన్నాడు. అభినందన్‌కు ఆనాడు అందించిన కప్, సాసర్ను ఈ సందర్భంగా అందరికీ చూపించాడు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ భూభాగంలో దిగిన ఆయన.. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన అభినందన్‌ను.. వీరచక్ర శౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. This gentleman Anwar Ali made tea for Indian Air Force Pilot Wing Commander #abhinandan he told me “woh mehman tha” no bad words pic.twitter.com/KNby8Q2XpQ — Hamid Mir (@HamidMirPAK) February 26, 2020 -
సర్జికల్ స్ట్రైక్ 3.0
-
‘ఎన్నికలొస్తే సర్జికల్ స్ట్రైకులొస్తాయ్’
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలొచ్చినప్పుడే.. సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైకులొస్తున్నాయని.. వాస్తవ సమస్యలను మరుగుపరిచేందుకే బీజేపీ సైనికులను అడ్డుపెట్టుకుని ఆటలాడుతోందని కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, హరియాణా ఎన్నికలకు ఒక్కరోజు ముందే ఈ దాడులు బయటకు రావడం వెనుక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్స్ కనిపించడం మోదీ ప్రభుత్వంలో సర్వసాధారణమైందని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి మాత్రం భారత సైనికుల ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. సైనికుల ధైర్యాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. -
‘బాలాకోట్ తర్వాత పాక్ ఆ దుస్సాహసం చేయలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ ఎన్నడూ వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)ను దాటలేదని ఐఏఎఫ్ చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా పేర్కొన్నారు. భారత వైమానిక దళం తన సైనిక ఆశయం నెరవేర్చడంలో విజయవంతమవగా, పాకిస్తాన్ విఫలమైందని స్పష్టం చేశారు. పాక్ యుద్ధ విమానాలు ఎల్ఓసీని అతిక్రమించలేదని తెలిపారు. మన సైనిక స్ధావరాలపై దాడులు తలపెట్టాలన్న పాకిస్తాన్ కుట్ర ఫలించలేదని చెప్పారు. వారు (పాక్) మన గగనతలంలోకి రాలేదని అదే మన విజయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడం వారి సమస్యని, మన ఆర్థిక వ్యవస్ధకు విమాన ట్రాఫిక్ కీలకమని ఎయిర్‌ఫోర్స్ ఇప్పటివరకూ పౌరవిమాన ట్రాఫిక్‌ను నిలువరించలేదని ఆయన గుర్తుచేశారు. పాక్‌తో ఉద్రిక్తతల ప్రభావం పౌర విమానయానంపై పడకుండా వ్యవహరించామని చెప్పారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. -
‘సర్జికల్ స్ర్టైక్స్‌తోనే చెక్’
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, హింసలపై విద్య ద్వారా పోరాడాల్సిన అవసరం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ దురాచారాలను నిర్మూలించేందుకు ఉపాధ్యాయులు, విద్యా శాఖాధికారులు వాటిపై మెరుపు దాడులు చేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల అధిపతులు, ఉపాధ్యాయులు, తనిఖీ అధికారుల శిక్షణా కార్యక్రమంలో సిసోడియా మాట్లాడుతూ చిన్నారుల్లో సంతోషం నింపడం, వారు సమాజంలో ఇతరుల సంతోషానికి కారణం కావడమే విద్య అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. వార్తాపత్రికల్లో ఎన్నో అంశాలు మనల్ని బాధకు గురిచేస్తాయని, వాటిపై సైన్యం సర్జికల్ స్ర్టైక్స్ చేయలేదని, మీరే ఆ పనిచేయాలని ఉద్భోదించారు. వార్తాపత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కే ఈ దురాచారాలపై ఉపాధ్యాయులు, విద్యా శాఖాధికారలు మెరుపు దాడులు చేయాలని సూచించారు. -
సర్జికల్ స్ట్రైక్స్: బాంబ్ పేల్చిన ఆర్మీ టాప్ కమాండర్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ విషయమై ఆర్మీ నార్తన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రణ్‌బీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉడీ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగానే భారత ఆర్మీ తొలిసారి 2016 సెప్టెంబర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ తొలిసారి తామే నిర్వహించామని బీజేపీ చెప్పుకుంటుండగా... ఆ వాదనను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో భారత ఆర్మీ ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టు కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తమ హయాంలో ఎప్పుడెప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో తేదీలతో సహా వెల్లడించారు. తమ హయాంలో సర్జికల్ దాడులు జరిగినా.. వాటి క్రెడిట్ ఎప్పుడూ తీసుకోలేదని, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, వాజపేయి ఈ దాడులపై ఎన్నడూ విలేకరుల సమావేశం నిర్వహించి.. తమదే ఘనత చెప్పుకోలేదని ఆయన బీజేపీని దుయ్యబట్టారు. అయితే, మోదీ హయాంలోనే తొలిసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని ధ్రువీకరిస్తూ ఆర్మీ టాప్ కమాండర్ వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. 2016 సెప్టెంబర్ 18న ఉడీలోని భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపి.. 18మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా పదిరోజుల అనంతరం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించింది. -
‘బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలియదు’
చంఢీగడ్ : బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బాలాకోట్ ఉగ్రదాడుల గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సన్నీ డియోల్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సన్నీ డియోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలకోట్లో భారత వాయుసేన జరిపిన వైమానిక దాడుల గురించి తనకు ఎక్కువగా తెలియదన్నారు. అంతేకాక భారత్ - పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు గురించి కూడా తనకు అంతగా అవగాహన లేదన్నారు. కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్లు సన్నీ డియోల్ తెలిపారు. గురుదాస్‌పూర్ నుంచి మీరు విజయం సాధిస్తారా అని ప్రశ్నించగా.. ఏమో.. ప్రస్తుతానికి ఏం చెప్పలేనన్నారు సన్నీ డియోల్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రశంసల వర్షం కురిపించారు సన్నీ డియోల్. గత ఐదేళ్లుగా నరేంద్ర మోదీ దేశానికి చాలా సేవ చేశారని పొగిడారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తాను మోదీ ప్రజాదరణ మీద ఆధారపడనని స్పష్టం చేశారు సన్నీ డియోల్. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే.. తాను కూడా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటానని సన్నీ డియోల్ పేర్కొన్నారు. -
సర్జికల్ దాడులు.. కాంగ్రెస్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ అంశంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. కొన్ని రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. యూపీఏ హయాంలో ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే యూపీఏ హయాంలో ఒక్కసారి కూడా సర్జికల్ దాడులు జరగలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమాధానంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి 2004 నుంచి 2014 మధ్యలో జరిగిన మెరుపుదాడులకు సంబంధించిన వివరాలు అందించాల్సిందిగా ఆర్టీఐని ఆశ్రయించాడు. ఇందుకు సమాధానంగా కేంద్ర మంత్రిత్వ శాఖ 2004 నుంచి 2014 మధ్యలో ఒక్క సారి కూడా మెరుపు దాడులు జరగలేదని పేర్కొంది. ప్రస్తుతం తమ దగ్గర 2016, సెప్టెంబర్‌లో యూరి సెక్టార్లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. -
‘త్రివిధ దళాలను ఆయన ఆస్తి అనుకుంటున్నారు’
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో కూడా ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను మోదీ ఖండించారు. బహుశా వారు వీడియో గేమ్‌లో సర్జికల్ దాడులు చేసి ఉంటారని మోదీ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండి పడ్డారు. ‘సైన్యం మోదీ తన సొంత ఆస్తి కాదు. కానీ త్రివిధ దళాలలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలను మోదీ తన ఆస్తిగా భావిస్తున్నార’ని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘సర్జికల్ దాడులు చేసింది మోదీ కాదు.. ఆర్మీ. యూపీఏ కూడా సర్జికల్ దాడులు చేసిందంటే మోదీ.. అవి నిజం కావు.. వీడియో గేమ్ అని ఎగతాళి చేశారు. అలా మాట్లాడి ఆయన ఆర్మీని కూడా అవమానించార’ని పేర్కొన్నారు. అంతేకాక ‘జనరల్ విక్రమ్ సింగ్ చెప్పింది నిజం. 2008 - 2014 వరకు యూపీఏ ప్రభుత్వం ఆరు సార్లు సర్జికల్ దాడులు చేసింది. అంతేకాక అవి ఏ రోజున జరిగాయనే వివరాలను కూడా అందజేశాం. అయితే వీటిని మా పార్టీ ఓట్ల కోసం వాడుకోవడం లేద’న్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందన్నారు రాహుల్. మోదీ పెద్ద నోట్లు రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి ఏమైనవని రాహుల్ ప్రశ్నించారు. ఉద్యోగుల గురించి కానీ, రైతుల గురించి కానీ మోదీ ఏమీ మాట్లాడడం లేదన్నారు. చౌకీదార్ చోర్‌హై అన్న వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు రాహుల్ అంగీకరించారు. కానీ ఆ వ్యాఖ్యల పట్ల బీజేపీకి ఎన్నటికి క్షమాపణలు చెప్పబోనన్నారు. చౌకీదార్ చోర్ హై అన్నది కాంగ్రెస్ నినాదంగా పనిచేస్తుందన్నారు. మసూద్ అజర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కానీ గతంలో అతన్ని ఎవరు విడిచి పెట్టారని రాహుల్ ప్రశ్నించారు. -
వారి దాడులు కాగితాలపైనే
జైపూర్/సికార్/హిందౌన్ సిటీ: కాంగ్రెస్ హయాంలో సర్జికల్ దాడులు కేవలం కాగితాలపైనే జరిగాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి వెళ్లి దాడులు జరిపాయన్న ఆ పార్టీ నేతల ప్రకటనలపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. శుక్రవారం ప్రధాని రాజస్తాన్‌లోని జైపూర్, సికార్, హిందౌన్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మా ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు ప్రకటించగానే కాంగ్రెస్ ఖండించింది. ఆ తర్వాత వ్యతిరేకించింది. ఇప్పుడు నేను కూడా అంటోంది (మీ టూ)’ అని తెలిపారు. ‘యూపీఏ జమానాలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు ఆ పార్టీ నేత(రాహుల్) ప్రకటించారు. ఇప్పుడేమో మరొక నేత దానిని ఆరుసార్లకు పెంచారు. ఈ ఎన్నికలు పూర్తయ్యేలోగా ఈ సంఖ్య 600కు చేరుకుంటుంది. కాగితాలపైనే చేసిన ఈ దాడులతో ఫలితమేంటి? కాంగ్రెస్ అబద్ధాలు మాత్రమే చెబుతుంది’ అని అన్నారు. మై ఆప్కా ‘అభినందన్’ కర్తా హూ మీ అందరికీ శుభాకాంక్షలు (మై ఆప్కా ‘అభినందన్’ కర్తా హూ) అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ‘ఇలా అని నేను అనగానే కాంగ్రెస్ వాళ్లు...ఐఏఎఫ్ పైలెట్ అభినందన్ పేరును ప్రస్తావించి ప్రధాని మోదీ నిబంధనావళిని అతిక్రమించారంటూ ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేస్తారు. ఆపై వాళ్ల నేత సుప్రీంకోర్టుకు వెళతారు. దీంతో కోర్టు ఒక వారంలోగా ఈ విషయాన్ని పరిష్కరించండంటూ ఈసీని కోరుతుంది. మోదీ నిబంధనలను ఉల్లంఘించలేదని, ప్రజలకు అభివాదం చేశారని ఈసీ స్పష్టం చేస్తుంది. వెంటనే కాంగ్రెస్ మీడియాను పిలిచి నన్ను విమర్శిస్తుంది’ అని వ్యంగ్యంగా అన్నారు. ‘అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినందుకు సంతోషపడాల్సింది పోయి.. ఎన్నికల సమయంలో ఇలా జరిగినందుకు కాంగ్రెస్ విచారంతో ఉంది. ఐరాస అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్నీ ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. అలా ప్రకటించడానికి ముందుగా మేడమ్(సోనియా గాంధీ), నామ్‌దార్(రాహుల్)లను ఐరాస సంప్రదించాలని కాంగ్రెస్ అనుకుంటోందా’ అని ప్రధాని ప్రశ్నించారు. 125 రోజుల్లో దేశమంతా.. న్యూఢిల్లీ: డిసెంబర్ 25 నుంచి మే 1 మధ్య 125 రోజుల్లో మోదీ దేశం మొత్తాన్నీ చుట్టేశారు. ఆయన వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ఎన్నికల ప్రచారం కోసం మోదీ ఈ 125 రోజుల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, జామ్‌నగర్ నుంచి సిల్చార్ వరకు దేశం నలుదిక్కులా పర్యటిస్తూ శాస్త్రవేత్తలు, రైతులు తదితరులతో మాట్లాడారని వెబ్సైట్ పేర్కొంది. ప్రజలకు హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని సత్వరమే నెరవేర్చేందుకు కృషి చేశారంది. ప్రధానమంత్రి రైతు గౌరవనిధి తదితర పథకాలను ఉదాహరణలుగా చూపింది. -
మా సర్జికల్ దాడులివీ..
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించిన కాంగ్రెస్ అందుకు సంబంధించిన జాబితాను బహిర్గతం చేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని, కానీ ఏనాడు వాటిని రాజకీయాల కోసం వినియోగించుకోలేదని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా గురువారం మీడియా సమావేశంలో జాబితాను వెల్లడించారు. 2008 జూన్ 19న పూంచ్‌లోని భట్టల్ సెక్టార్ ప్రాంతంలో, 2011 ఆగస్టు 30–సెప్టెంబర్ 1 తేదీల్లో కేల్లో నీలమ్ నదీ ప్రాంతంలోని శార్దా సెక్టార్లో, 2013 జనవరి 6న సవన్ పత్ర చెక్‌పోస్ట్ వద్ద, 2013 జూలై 27–28 తేదీల్లో నజపిర్ సెక్టార్లో, 2013 ఆగస్టు 6న నీలమ్ లోయ ప్రాంతంలో, మరొకటి 2013 డిసెంబర్ 23న చేపట్టినట్లు తెలిపారు. అలాగే వాజ్‌పేయ్ ప్రభుత్వంలోనూ రెండు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు వెల్లడించారు. 2000 జనవరి 21న నీలమ్ నది ప్రాంతంలోని నదలా ఎన్క్లేవ్, 2003 సెప్టెంబర్ 18న పూంచ్‌లోని బార్హో సెక్టార్లో దాడులు చేసినట్లు తెలిపారు. మన్మోహన్ ఇంటర్వ్యూ తర్వాత... యూపీఏ హయాంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. -
నాయకుల ‘అవాక్కులు’!
నిబంధనలంటే భయభక్తులు లేవు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని లేదా అంటారని బెరుకు లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికల సంఘం వేయి కళ్లతో నిఘా పెట్టి ఉంచుతుందని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే చర్యలు తీసుకునే ప్రమాదమున్నదన్న భీతి అసలే లేదు. ప్రచార సభల్లో వివిధ పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు ప్రజలను దిగ్భ్రాంతిపరుస్తున్నాయి. వీళ్ల నోళ్లకు తాళం వేసేవారెవరూ లేరా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఈ జాబితా లోకెక్కే నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వరసగా రెండు రోజులు వివిధ సభల్లో పాల్గొని చేసిన ప్రకటనలు ఆయన స్థాయిని మాత్రమే కాదు... మన ఎన్నికల సంఘం సమర్థతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మన సైన్యాన్ని ఆయన ‘మోదీ సేన’గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వృత్తిపరమైన నైపుణ్యంలోనూ, అంకిత భావంలోనూ ప్రపంచంలోనే మన సైన్యానికి పేరుంది. దాన్ని రాజకీయ సంకుచిత చట్రంలో ఇరి కించాలని చూడటం దిగజారుడుతనమే అవుతుంది. తాము వచ్చాకే ఉగ్రవాదులతో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. కానీ సైన్యం నిర్వహించిన దాడుల్ని సొంత ఖాతాలో వేసుకోవాలని చూడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటి దాడులు గత ప్రభుత్వాల హయాంలో కూడా జరిగాయని లోగడ సైన్యంలో పనిచేసినవారు చెబుతున్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించడానికి ఏ శక్తులైనా ప్రయత్నించినప్పుడు, వారి ఆనుపానులు తెలుసుకుని తగిన వ్యూహాన్ని రూపొందించుకుని దాడులు చేయడం సైన్యానికి సర్వసాధారణం. కానీ దాన్ని మోదీ సేనగా అభివర్ణించి, వారు చేసిన పని తమ ఘనతగా చెప్పుకోవడం అభ్యంతరకం. మన సైన్యం ఫొటోలను వాడుకోవడం, దాని ప్రస్తావన తీసుకురావడం నిబంధనల ఉల్లంఘన కిందికొస్తుందని ఎన్నికల సంఘం గత నెల 17న స్పష్టంగా చెప్పింది. కానీ యోగి ఆదిత్యనాథ్‌కు ఇవేమీ పట్టలేదు. అంతకు ముందురోజు గ్రేటర్ నోయిడాలోని బిసారా(దాద్రి) గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో సైతం ఆయన ఇలాంటి విపరీత వ్యాఖ్యలే చేశారు. బిసారా నాలుగేళ్లక్రితం ఉన్మాద మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన అఖ్లాక్ స్వగ్రామం. ‘ఇక్కడేం జరిగిందో గుర్తులేనిదెవరికి? మన భావోద్వేగాలను అణిచేయడానికి అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించిందో మరిచిపోగలమా?’ అంటూ ఆ సభలో ఆయన ప్రసంగించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందో లేదో ఆరా తీయడం... అది జరగకపోతే అందుకు ఉన్న అవరోధాలను తొలగించడం ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. సమాజ్‌వాదీ సర్కారు అణిచేయడానికి ప్రయత్నించిన ఆ భావోద్వేగాలేమిటో యోగి వివరించలేదుగానీ...అఖ్లాక్ కుటుంబానికి జరిగిన అన్యాయమైతే చాలా తీవ్రమైనది. తండ్రిపై ఉన్మాద మూక దాడిచేస్తున్నప్పుడు అఖ్లాక్ చిన్న కుమారుడు అడ్డు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ మూక అతనిపై సైతం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వైద్య చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు. ఆ గ్రామంలో తాము ఏకాకులమని, తమనెవరూ రక్షించబోరని గుర్తించి ఆ కుటుంబం వేరేచోటకు వలసపోయింది. ఆ దాడికి కారకులైనవారిని వెనువెంటనే అరెస్టు చేసి, వారిపై పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి శిక్షపడేలా చేయాల్సిన సమాజ్‌వాదీ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైంది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ కేసులోని నిందితులను కాపాడు తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అవి కేవలం ఆరోపణలు కాదు... నిజాలన్నట్టుగా యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించిన ఆ సభలో అఖ్లాక్ కేసు ప్రధాన నిందితుడు విశాల్ సింగ్ రాణా, మరో 15మంది పాల్గొన్నారు. వారిపై హత్య, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులున్నాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆ కేసులో ఇంకా అభియోగాలే నమోదు కాలేదు. ఇది జరగకపోగా ఎన్నికలసభలో ఆ కేసులోని నిందితులకు మద్దతిచ్చే విధంగా ముఖ్యమంత్రే మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. ఒకవేళ ఆ కేసులో నిందితులుగా ఉన్నవారు అమాయకులని, అన్యాయంగా కేసులు పెట్టారని అనుకుంటే అసలు నిందితులెవరో ఈపాటికి యోగి సర్కారు వెలికితీయాల్సింది. ఆ సంగతినీ తేల్చకుండా, నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోకుండా ‘ఇక్కడ భావోద్వేగాలు అణిచేయడానికి ప్రయత్నించార’ంటూ మాట్లాడటం వల్ల ఎవరికి ఉప యోగం? మరి కుటుంబ పెద్దను కోల్పోయి, సొంత ఊరును విడిచి దిక్కులేని పక్షుల్లా ఎటో పోవా ల్సివచ్చిన అఖ్లాక్ కుటుంబానికి జరిగిన అన్యాయం మాటేమిటి? ఒక్క యోగి ఆదిత్యనాథ్ మాత్రమే కాదు, రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కావడం అవసరమని భావిస్తున్నారని ఒక సభలో చెప్పారు. గవర్నర్ పదవి రాజ్యాంగపరమైనది. దాన్ని అధిష్టించినవారికి కొన్ని పరిధులు, పరి మితులు ఉంటాయి. ముఖ్యమంత్రిగా, ఎంపీగా సుదీర్ఘకాలం సేవలందించిన కల్యాణ్‌సింగ్‌కు ఈమాత్రం తెలియదనుకోలేము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన స్థాయి దిగజార్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. జనాన్ని బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకుల వ్యాఖ్యలపై ఫిర్యాదులందినప్పుడు ఎన్నికల సంఘం స్పందించి నోటీసులు జారీ చేస్తోంది. కల్యాణ్‌సింగ్ వ్యాఖ్యల్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దృష్టికి తీసుకురావాలని అది నిర్ణ యించిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే మరింత కఠినమైన చర్యలు తీసు కునేందుకు అవసరమైన అధికారాలను ఎన్నికల సంఘానికి కల్పిస్తే తప్ప వీటిని పూర్తిగా అరి కట్టడం సాధ్యం కాదు. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? పార్టీలన్నీ ఈ విషయంలో కలిసి వస్తాయా? అది జరిగేవరకూ యోగి, కల్యాణ్‌సింగ్, చంద్రబాబు లాంటివారు ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉంటారు. -
భూమి.. ఆకాశం.. అంతరిక్షం
మీరట్/న్యూఢిల్లీ/అఖ్నూర్/డెహ్రాడూన్: శత్రుదేశాలపై భూ, గగనతలం, అంతరిక్షంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం తెగువ చూపిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ఎన్డీయే ప్రభుత్వానికి మరోసారి ఓటేయాలని నిర్ణయించుకున్నారన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్ పరీక్ష విజయవంతం కావడంపై స్పందిస్తూ.. శత్రుదేశాల నుంచి భారత్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు థియేటర్ సెట్‌కు, ఏ–శాట్‌కు తేడా తెలియడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం యూపీ, ఉత్తరాఖండ్, కశ్మీర్లో పర్యటించిన మోదీ, విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలముందు పెడతాం.. భారత్‌ను దొంగదెబ్బ తీస్తున్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు ఎన్డీయే ప్రభుత్వం ధైర్యంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘దమ్మున్న బీజేపీ ప్రభుత్వానికి, కళంకితులైన ప్రతిపక్షాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే మా రిపోర్టు కార్డును ప్రజల ముందు ఉంచడంతో పాటు గత 60 ఏళ్లలో ప్రతిపక్షాలు ఏం చేశాయన్న విషయమై నిలదీస్తాం’ అని వెల్లడించారు. రాçహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్)పై స్పందిస్తూ..‘పేద ప్రజల చేత కనీసం బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించలేనివాళ్లు ఇప్పుడు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోకి నగదును జమచేస్తామని హామీ ఇస్తున్నారు. అంతకంటే వాళ్లేం చేయగలరు?’ అని వ్యాఖ్యానించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో ఇచ్చిన గరీబీ హటావో(పేదరికాన్ని తరిమేద్దాం) నినాదాన్ని తాను చిన్నప్పటి నుంచి వింటున్నాననీ, కానీ దేశంలో పేదరికం తగ్గకపోగా పేదలు నిరుపేదలుగా మారారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే పేదరికం దానంతట అదే అంతమైపోతుందని వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసమే ‘రఫేల్’ ఆలస్యం.. తనపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్లో ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ నేతల ప్రసంగాలను పాకిస్తాన్లో ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కాంగ్రెస్ ప్రతిస్పందన నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. మోదీపై వ్యతిరేకత వీళ్లను గుడ్డివాళ్లను చేసేసింది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసేవారితో కాంగ్రెస్ జతకడుతోంది. 2008లో ఉగ్రవాది తర్వాత కూడా కాంగ్రెస్ నేతల రక్తం మరగలేదు....’ అని మండిపడ్డారు. అనంతరం ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో మాట్లాడుతూ.. కమీషన్లపై కన్నేసిన కాంగ్రెస్ దేశభద్రతను పణంగా పెట్టి రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలును ఆలస్యం చేసిందని మోదీ ఆరోపించారు. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్ ప్రసుత్తం కోర్టులో నిజాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడన్నారు. ఆరోగ్యానికి మంచిది కాదు.. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–ఆర్ఎల్డీ–బీఎస్పీలు మహాకల్తీ కూటమిగా తయారయ్యాయని విమర్శించారు. ‘ఈ మూడు పార్టీల పేర్లలోని తొలి అక్షరాన్ని తీసుకుంటే సరాబ్(షరాబ్–మద్యం)అని అర్థం వస్తుంది. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ మహాకల్తీ కూటమి పాలనలో ఉగ్రవాదం దేశమంతటా విస్తరించింది. యూపీలో చేతులు కలిపిన ఎస్పీ–బీఎస్పీలు ‘ఒకరి తర్వాత మరొకరం యూపీని దోచేద్దాం’ అనే నినాదంతో వెళ్తున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించారు’ అని ప్రధాని తెలిపారు. బాలాకోట్ ఉగ్రస్థావరంపై దాడికి సంబంధించి సాక్ష్యాలు చూపాలన్న విపక్షాల విమర్శలపై స్పందిస్తూ..‘మనకు సాక్ష్యాలు కావాలా? లేక భారతమాత పుత్రుడు కావాలా? సాక్ష్యాలు చూపాలంటూ ఈ భారతమాత బిడ్డ(మోదీ)ను కొందరు సవాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. సరాబ్, షరాబ్కు తేడా తెలియదా? తమను మద్యంతో పోల్చడంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ప్రధాని మోదీ విద్వేషపు మత్తులో మాట్లాడుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఆయనకు సరాబ్ (ఎండమావి), షరాబ్(మద్యం)కు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను మద్యంతో పోల్చడం ద్వారా మోదీ పేదలను అవమానించారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలనీ, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా మోదీ తన స్థాయిని దిగజార్చుకున్నారని పేర్కొన్నారు. -
సర్జికల్ స్ట్రయిక్స్.. ఓట్లు కురిపిస్తుందని బీజేపీ ఆశ
రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ చేతిలో ఓటమి.. మందకొడిగా ఆర్థిక వ్యవస్థ.. పతాకస్థాయికి నిరుద్యోగం.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇలాంటి పరిస్థితిని ఏ పార్టీ కూడా కోరుకోదు. సీన్ కట్ చేస్తే... పుల్వామా ఉగ్రదాడి.. అందుకు ప్రతిగా భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్.. భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చేలా మారిపోయాయా? అయితే.. ఓటర్లను వర్గాలుగా వేరు చేసే ఇలాంటి అంశాలకు రెండువైపులా పదునే అన్నది విశ్లేషకుల అంచనా!! సర్జికల్ స్ట్రైక్స్‌కు కొన్ని రోజుల ముందు ఓ ప్రముఖ దినపత్రిక ఓ సర్వే నిర్వహించింది. అందులో తేలిందేమిటంటే బీజేపీ భవిష్యత్తు ఏమంత గొప్పగా లేదూ అని! గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటుందని ఆ పత్రిక అంచనా వేసింది కూడా. అయితే రెండు వారాలు గడిచాయో లేదో.. పుల్వామాదాడి జరగడం.. అందుకు ప్రతిగా భారత వాయుసేన పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుపోయి బాలాకోట్‌పై బాంబులు కురిపించడంతో పరిస్థితి మొత్తం తారుమారైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు బాలాకోట్ దాడికి సంబంధించిన రుజువులు కోరడంతో పరిస్థితి బీజేపీకి మరింత అనుకూలంగా మారింది. దశాబ్దాలుగా కశ్మీర్ అంశంపై ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెప్పగలిగిన వాడు మోదీ ఒక్కడే అన్న అభిప్రాయం ఒక వర్గంలో బలపడగా.. ఇవన్నీ గిమ్మిక్కులేనని నమ్మేవాళ్లు ఇంకో వర్గంలో చేరిపోయారు. ఈ రకమైన పోలరైజేషన్ కారణంగా ఓటేసే సమయానికి సామాన్యుడు ఇతర వాటన్నింటినీ పక్కనబెట్టి దేశ భద్రత అంశంవైపే మొగ్గు చూపుతాడని నిపుణులు చెబుతారు. జాతీయవాదం బీజేపీకి అనుకూలం? ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరించి మెజార్టీ ప్రజలను తమకనుకూలంగా తిప్పుకునేందుకు జాతీయ వాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దుల్లో సైనికులు మరణిస్తుంటే మీరు అలా చేస్తారా? ఇలా చేస్తారా? అని తన సోషల్ మీడియా సైన్యంతో ప్రతిపక్షాలపై ఈ జాతీయవాదులు ఓ స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. జాతీయ వాదమన్న అంశాన్ని ముందుంచడం ద్వారా మోదీ ప్రతిపక్షాల కంటే రెండు అడుగులు ముందు ఉన్నారని, మోదీ ప్రసంగాల్లో హిందుత్వం కంటే, జాతీయ వాద భావజాలమే ఎక్కువగా ఉండటం ఈ వ్యూహంలో భాగమే కావచ్చునని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైనిక చర్యలతో నష్టమూ లేకపోలేదు బాలాకోట్ దాడుల వల్ల ఎన్నికల్లో అధికార పార్టీకి లాభం చేకూరడంతోపాటు నష్టం కూడా జరిగే అవకాశముంది. భారతదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఇలాంటి సైనిక చర్యల వల్ల అధికారంలో ఉన్న పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత 1993లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడం.. మరోవైపు గోద్రా మారణకాండ తరువాత 2002లో అసెంబ్లీ రద్దు తరువాత జరిగిన ఎన్నికల్లో మోదీ మళ్లీ విజయం సాధించడం.. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్ల శాతం పెరగడాన్ని చూస్తే.. పోలరైజేషన్ అన్నది ఆ పార్టీకి అనుకూలంగా మారిందని తెలుస్తుంది. అయితే బాబ్రీ ఘటన తరువాతి యూపీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు జట్టుకట్టడం వల్ల బీజేపీ అధికారం కోల్పోయింది. మొత్తమ్మీద ఒక అంశం ఆధారంగా ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోవడం అధికార పార్టీకి లాభమా? నష్టమా అనేది చెప్పడం కష్టం. బాలాకోట్ దాడి ఘటనల తరువాత.. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత జరిగిన రెండు ఒపీనియన్ పోల్స్‌లోనూ భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సంస్థ చేసిన సర్వేలో బీజేపీకి గత ఎన్నికల కంటే దాదాపు 50 సీట్లు తగ్గుతాయని చెప్పడం.. సీవోటర్ ఒపీనియన్ పోల్‌లో 15 సీట్ల తగ్గుదల మాత్రమే నమోదు రావడం ఇక్కడ చెప్పుకోవాలి. -
పాక్‌తో యుద్ధం జరుగుతుందా!
సాక్షి, న్యూఢిల్లీ : 1971 తర్వాత భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా కూడా పాక్‌స్థాన్ భూభాగంలోకి భారత వైమానిక దళాలు చొచ్చుకుపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం నాడు భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తూఖ్వా రాష్ట్రంలోనికి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. ఎదురుదాడికి సిద్ధమైన పాకిస్థాన్ యుద్ధ విమానాలు బుధవారం భారత సరిహద్దులోకి దూసుకురాగా భారత వైమానికి దళం గట్టిగా ప్రతిఘటించి ఓ పాక్ యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. మిగతా పాక్ విమానాలు వెనక్కి తిరిగి పోయాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్ని ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? అన్న చర్చ పలు వర్గాల్లో మొదలైంది. (‘యుద్ధం వస్తే గట్టిగా నిలబడండి’) ‘2016లో భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. అప్పుడు కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఆ పరిస్థితులు యుద్ధానికి దారితీయలేదు. ఇప్పుడు భారత వైమానిక దళం రెండోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. కాకపోతే ఈసారి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాంబులు కురిపించింది. ఇది ప్రస్తుతానికి ప్రతీకాత్మక దాడి మాత్రమే. దాడి గురించి భారత్ చెప్పే కథనానికి, పాక్ చెప్పే కథనానికి మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని, దాదాపు 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని భారత దళం చెబుతుండగా, భారత విమానాలు ఖాళీ ప్రదేశంలో బాంబులను కురిపించాయని, ఆనవాళ్లు ఇదిగో! అంటూ పాక్ దళం శకలాలను చూపిస్తోంది. ఏదేమైనా పరస్పర దాడులు కొన్ని రోజులు కొనసాగవచ్చు. (సైనికేతర, ముందస్తు దాడి చేశాం) ఇది నాన్ మిలటరీ ప్రీఎంప్టీవ్ దాడులుగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారంటేనే యుద్ధానికి కాలుదువ్వడం కాదనేది అర్థం. తాము పాక్ సైనికులు లేదా పౌరులు లక్ష్యంగా దాడి చేయలేదని, ఉగ్రవాదుల లక్ష్యంగా దాడి చేశామని చెప్పడమే ఈ మాటల ఉద్దేశం. భారత్‌పై ఉగ్రదాడి జరిగినందుకు, మరిన్ని జరుగుతాయని తెల్సినందునే ఈ దాడి జరిపామని కూడా భారత వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సమాజానికి సర్ది చెప్పడం కోసం భారత వర్గాలు ఇలా మాట్లాడుతుండవచ్చు. ఒక్కసారి పాక్ సరిహద్దు రేఖను ఉల్లంఘించి లోపలకి పోయామంటే చాలు, పాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లే. దీనిపై ఏ దేశం ఎలా స్పందిస్తుందో భారత్‌కు ప్రస్తుతం అనవసరం. ఏ దేశమైనా తమ రాజకీయాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే స్పందిస్తాయి. 2016లో మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్ భారత వైమానిక దళం జరిపిన తర్వాత సరిహద్దులో పాక్ సైనికుల కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు మరింత పెరగవచ్చు! ఆవేశంతోనే ఉద్రేకంతోనో ఇరు దేశాల్లోని కొంత మంది యుద్ధాన్ని కోరుకోవచ్చు. ఒక్కసారి యుద్ధం మొదలయితే అది పరిమితంగా జరుగుతుందా? పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్నది చెప్పలేం. యుద్ధం అంటే ఇరువర్గాలకు అపార నష్టం. అందుకని ఇరువర్గాల సైనికులు కూడా యుద్ధాన్ని కోరుకోరు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా, లేదా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. మరి కొన్ని రోజులు గడిస్తే స్పష్టత రావచ్చు!’ (ఢిల్లీలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అభిప్రాయాల సారాంశం ఇది) -
చెల్లెమ్మా.. ఇదిగో ప్రతీకారం!
చెల్లెమ్మా! ఇదిగో ప్రతీకారం నీ సింధూరాన్ని చెరిపిన దుర్మార్గులను పన్నెండవ రోజు వేకువ సింధూరం కనపడకముందే పిండప్రదానానికి ముష్కరుల రక్తప్రదానం చేశాము ఎరుపెక్కిన నీ కన్నీటి కళ్లకు ప్రతీకారంగా ఆకాశాన్ని ఆ దుర్మార్గుల రక్తంతో దిద్దాము నీ గుండెఘోష చల్లారకముందే వెయ్యికిలోల బాంబులు వాళ్ల విషకడుపులో కుక్కాము నువ్వు పోగొట్టుకున్నదానిని తిరిగి తేలేము కానీ ఈ దేశం... నీ దేశం అని.. మేమంతా నీ కుటుంబమని... నువ్వు అనాథవు కావని.. నీ కన్నీరు వృథా కాదని... నీ భర్త త్యాగం వ్యర్థం కాదని... దేశమంతా ఒక్కటై.. నీతో ఒక్కటై గర్జించింది... చెల్లెమ్మా! ఇదిగో ప్రతీకారం! బ్రేవో ఇండియా. – రజనీకాంత్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు పెద్ద సెల్యూట్. జైహింద్. – ప్రభాస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జయహో. – సల్మాన్ ఖాన్ మన దేశం సరైన సమాధానం ఇచ్చింది. ఎయిర్‌ఫోర్స్‌కు నా సెల్యూట్.– ఎన్టీఆర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. జైహింద్ – రామ్‌చరణ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్... మీకు సెల్యూట్ చేస్తున్నాం. దేశం గర్వించే రోజు ఇది.–అఖిల్ అక్కినేని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సెల్యూట్ చేస్తున్నా. – సోనాక్షి సిన్హా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి దేశం యావత్తూ సెల్యూట్ చేస్తోంది.– రకుల్ ప్రీత్ టెర్రరిస్ట్ క్యాంపులను సమూలంగా నాశనం చేసిన మన 12 మంది సైనికులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆ హీరోలను చూసి దేశం గర్విస్తుంది. వారి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను – కమల్‌హాసన్ మా చెంప మీద కొడితే మరో చెంప చూపించబోము. దాని బదులు మీ కాలర్‌ను పట్టుకొని చితకబాదేస్తాం. అందుకే.. మాతో పెట్టుకోవాలంటే మరోసారి ఆలోచించండి. – చేతన్ భగత్ ఉగ్రవాదులను హతమార్చడం అంటే భవిష్యత్‌లో ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడటమే. సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలను భస్మీపటలం చేసిన భారత వైమానిక దళానికి సెల్యూట్ చేస్తున్నా.– ప్రీతీజింతా టెర్రరిస్టు శిబిరాలపై దాడులు చేసిన మన భారతీయ వైమానిక దళ వీరులను చూసి గర్వపడుతున్నా. అందర్ ఘుస్కే మారో (చొచ్చుకెళ్ళి హతమార్చండి) – అక్షయ్ కుమార్ యాద్ రహే నామ్ నమక్ ఔర్ నిషాన్ మర్చిపోవద్దంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కీ, నాయకుడూ సుప్రీం కమాండర్ అయిన ప్రధాని నరేంద్రమోదీకి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్ సర్జికల్ స్ట్రైక్స్ 2, టెర్రరిజాన్ని అంతం చేయాలి.– సెలీనా జైట్లీ భారత వైమానిక సైన్యం నాకు గర్వకారణం. సాహసోపేత చర్యకి సెల్యూట్ చేస్తున్నా. – తమన్నా జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాను – అభిషేక్ బచన్ భారత సైన్యం మాకు గర్వకారణం. ఇండియా స్టైక్ బ్యాక్. జైహింద్ – సోనూ సూద్ తీవ్రవాదంపై భారత సైన్యం దాడికి హ్యాట్సాఫ్. ప్రతి భారతీయుడూ గర్వపడతారు. – కిదాంబి శ్రీకాంత్ మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ధైర్య సాహసాలు చూపించిన ఫైలెట్స్కు సెల్యూట్. – మహేశ్‌బాబు ‘ద బాయ్స్ హావ్ ప్లేడ్ రియల్లీ వెల్’ (మన వాళ్ళు బ్రçహ్మాండంగా ఆడారు) ‘మీరు (పాక్) మారండి లేదంటే మేమే మారుస్తాం’ – వీరేంద్ర సెహ్వాగ్ మంచితనాన్ని చేతకానితనంగా ఎప్పుడూ ఊహించుకో కూడదు. మన ఎయిర్ ఫోర్స్‌కు సెల్యూట్ చేస్తున్నాను. – సచిన్ టెండుల్కర్ టెర్రరిజానికి అవసరమైన మెసేజ్ పంపింది మన ఎయిర్‌ఫోర్స్. బ్రేవో ఎయిర్ ఫోర్స్. గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై హింద్. – అజింక్యా రెహానే భారత వైమానిక దళ గొప్పతనానికి సెల్యూట్ చేస్తున్నా.– మహమ్మద్ కైఫ్ ఇండియా స్ట్రైక్ బ్యాక్, భారత వైమానిక దళానికి బిగ్ సెల్యూట్.– సైనా నెహ్వల్ ఆçహ్లాదకరమైన శుభోదయం. మన సైన్యం దిటవు గుండెలకు జయహో. – పరేష్ రావెల్ ఇండియా తిరిగి కొట్టింది. తిప్పి కొట్టింది. జై హింద్ ఐఏఎఫ్. – గౌతం గంభీర్ సమయానుకూలంగా స్పందించిన భారతీయ వైమానికదళ ధీరుల సాహసచర్యకు నా సెల్యూట్. – శిఖర్ దావన్ సాహో సర్జికల్ స్ట్రైక్స్... ప్రధాని మోడీకి సెల్యూట్ చేయడం ప్రారంభించడానికి ఇదే మంచి రోజు. – అనుపమ్ ఖేర్ మన ఎయిర్‌ఫోర్స్‌ను చూసి ఎంతో గర్విస్తున్నాను. సెల్యూట్ ఐఏఎఫ్. జైహింద్.– యువరాజ్ సింగ్ మన వైమానిక దళాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. సెల్యూట్ ఐఏఫ్. జై హింద్. – మాధురీ దీక్షిత్ -
దేశం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదు
-
మెరుపుదాడులపై స్పందించిన చైనా
బీజింగ్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత్ మెరుపు దాడులు నిర్వహించి వందలాది ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై చైనా స్పందించింది. పాక్‌లోని జైషే అతిపెద్ద ఉగ్రవాద శిబిరంపై భారత్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు మంగళవారం ఉదయం వేయి కేజీల బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కాగా పుల్వామా దాడి నేపథ్యంలో నెలకొన్న పరిస్ధితిపై చైనా వ్యాఖ్యానిస్తూ భారత్, పాక్‌లు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ అంతర్జాతీయ సహకారం ద్వారా ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని చైనా కోరింది. జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌ను తోసిపుచ్చిన చైనా తాజాగా మెరుపు దాడులపైనా తనదైన శైలిలో స్పందించింది. దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ రెండూ కీలక దేశాలని, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలు దక్షిణాసియా ప్రాంతంలో పరస్పర సహకరానికి, ఈ ప్రాంతంలో శాంతి, సుస్ధిరతకు దారితీస్తాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధ లు కంగ్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్‌లు మరింత సంయమనంతో వ్యవహరిస్తూ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి పలు చర్యలు చేపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
దేశం కోసం ఎందాకైనా..
సాక్షి, న్యూఢిల్లీ : దేశం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని, దేశం తమ చేతుల్లో పదిలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ తలవంచుకునేలా తామన్నెడూ వ్యవహరించబోమని అన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేపట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం రాజస్ధాన్‌లోని చురులో ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్ర దాడులు జరిగినా అవి మన దేశ పురోగతిని, పయనాన్ని ఆపలేవని స్పష్టం చేశారు. రాజస్తాన్, చురులో ఇప్పటివరకూ రైతులకు ఒక్క రూపాయి సొమ్ము కూడా ముట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ లబ్ధిదారులైన రైతుల పేర్లను పంపలేదని, వారు కేంద్రంతో సహకరించడం లేదని రాజస్ధాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రానున్న పదేళ్లలో రైతుల ఖాతాల్లో రూ 7.5 లక్షల కోట్లు జమచేస్తామని చెప్పుకొచ్చారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు వేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని, రైతులకు కేంద్రం సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోరాదని కోరారు. భారత్‌లో దృఢమైన సర్కార్ అవసరమని, భారత్‌ను నూతన శిఖరాలకు తీసుకువెళ్లేందుకు మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఇది అమర జవాన్లకు ఘనమైన నివాళి
-
కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్‌కు సర్జికల్ స్ర్టైక్స్ హీరో నేతృత్వం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ భద్రతపై కాంగ్రెస్ ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌కు లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా (రిటైర్డ్) నేతృత్వం వహించనున్నారు. హుడా సారథ్యంలోనే 2016లో భారత సైన్యం మెరుపు దాడులను నిర్వహించడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏర్పాటు చేసే ఈ టాస్క్‌ఫోర్స్ ఎంపిక చేసిన నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం భద్రతపై దార్శనిక పత్రాన్ని సమర్పిస్తుంది. జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే క్రమంలో చేపట్టాల్సిన చర్యలపై పలువురు పోలీస్, సైనిక ఉన్నతాధికారులతో కలిసి లెఫ్టినెంట్ జనరల్ హుడా విస్తృత సంప్రదింపులు జరుపుతారు. నెలరోజుల వ్యవధిలో ఆయన జాతీయ భద్రతపై నివేదికను పార్టీకి సమర్పిస్తారు. -
కశ్మీర్లో ప్లెబిసైట్ సంగతేంటి?
చెన్నై: జమ్మూకశ్మీర్‌లో ఇంకా ప్లెబిసైట్(ప్రజాభిప్రాయ సేకరణ) ఎందుకు నిర్వహించలేదని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రశ్నించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులను క్రీడా ప్రముఖుల తరహాలో కీర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఎన్నడూ ఆ దారిలో నడవకూడదని అభిప్రాయపడ్డారు. చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కమల్.. సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడి సహా పలు అంశాలపై యువతీయువకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ..‘ప్రతీఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు చేపట్టాల్సిన ప్లెబిసైట్‌ను కశ్మీర్లో ఇంకా ఎందుకు చేపట్టలేదు? ఎందుకు భయపడుతున్నారు? మన దేశం 1947లో రెండు ముక్కలుగా విడిపోయింది. ఎవరితో ఉంటారో జమ్మూకశ్మీర్ ప్రజలను మీరు(ప్రభుత్వం)ఇంకోసారి ఎందుకు అడగరు? రాజకీయ నాయకులు ఈ పని చెయ్యరు’ అని తెలిపారు. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ‘సాధారణగా ఎవరిౖనా రక్తస్రావమైతే తొలుత దాన్ని ఆపాలి. ఆ తర్వాతే సర్జరీకి(సర్జికల్ స్ట్రైక్స్‌కు) ఏర్పాట్లు చేసుకోవాలి. ఆజాద్ కశ్మీర్(పీవోకే)లో రైళ్లపై జీహాదిస్టుల పోస్టర్లు దర్శనమిస్తుంటాయి. ఉగ్రవాదులను ప్రముఖ క్రీడాకారుల తరహాలో అక్కడ కీర్తిస్తుంటారు. ఇలాంటి మూర్ఖపు చర్యలను భారత్ పునరావృతం చేయకూడదు. ఎందుకంటే పాక్ కంటే భారత్ చాలా మెరుగైన దేశం’ అని అన్నారు. ‘మీ తల్లిదండ్రులు ఆర్మీలో చేరొద్దని సూచిస్తే వారికి ఒకటే చెప్పండి. ప్రతిఏటా ఆర్మీలో కంటే తమిళనాడులో రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నారు. అర్హులైనవారు చాలా ఉన్నతస్థానాలకు వెళ్లవచ్చు. కానీ ఆర్మీలో చేరాలన్న ధైర్యం మీకు ఉందా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. రాజకీయ నేతలు సక్రమంగా ప్రవర్తిస్తే సరిహద్దులో సైనికులు చనిపోవాల్సిన అవసరమే ఉండదు’ అని అన్నారు. -
‘ఇది ముమ్మాటికీ పాకిస్తాన్ పనే’
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దాడికి పాల్పడిన ఉగ్రమూకలకు దీటుగా బదులివ్వాలనే డిమాండ్ పెల్లుబుకుతోంది. మరోవైపు ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని సుస్పష్టంగా వెల్లడవుతోందని 2016లో పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన సర్జికల్ స్ర్టైక్స్‌ను పర్యవేక్షించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హుడా తేల్చిచెప్పారు. .పాకిస్తాన్ పుల్వామా దాడిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు మరింత నిలకడతో కూడిన దీర్ఘకాలిక విధానం అవసరమని హుడా అభిప్రాయపడ్డారు. కాగా పుల్వామా దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించమని, దీనిపై చర్యలు చేపట్టే స్వేచ్ఛ భారత సైన్యానికి ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునే తేదీ, సమయాన్నివారే నిర్ధారించాలని ఆయన సూచించారు. -
కాంగ్రెస్ సర్జికల్ దాడులకు ఒప్పుకోలేదు : నటుడు
ముంబై : 26 / 11 దాడులు జరిగిన తర్వాత ఆర్మీ సర్జికల్ దాడులు చేయాలని భావించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదన్నారు నటుడు పరేష్ రావల్. ప్రస్తుతం ఆయన ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘26 / 11 దాడుల అనంతరం ఆర్మీ సర్జికల్ దాడులు చేయాలని భావించింది. కానీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. మన ఆర్మీకి మద్దతు తెలపడానికి బదులు కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ గురించి ఆలోచించింది. ఆ సమయంలో మన సైనిక శక్తి గురించి జనాల్లో సందేహాలు తలెత్తాయి’ అన్నారు. అయితే ఆ సందేహాలకు మోదీ సమాధానాలు చెప్పారన్నారు పరేష్. ‘మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్జికల్ దాడులకు ఆమోదం తెలిపారు. మనకు చాలా బలమైన సైనిక వ్యవస్థ ఉంది. కానీ మన దేశంలోని రాజకీయ వ్యవస్థ వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తుతుంటాయి. కానీ మన సైనిక శక్తి సామర్థ్యాల గురించి తెలియజేయడమే కాక, పాక్ చేసే వక్ర పనులకు సరైన సమాధానం చెప్పడం చాలా అవసరం’ అన్నారు. అంతేకాక యురి సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఇదొక పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. సైన్యం సర్జికల్ దాడులకు ఎలా సన్నద్దమయ్యిందనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం’ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య దార్ యురి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రొన్ని స్క్రూవాలా బేనర్‌పై ఆర్ఎస్వీపీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్, యామీ గౌతమ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
ప్రజాస్వామ్య సంస్థలను అవమానించింది
చెన్నై: భారత ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన ఆర్మీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఎన్నికల ముందు అనుమానాలు రేకెత్తించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తారనీ, తీరా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సంతోషంగా స్వీకరిస్తారని ఎద్దేవా చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగ్, ఆర్మీలను అవమానించారు.. భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణాలను ప్రస్తావిస్తూ.. ‘కాంగ్రెస్ నేతలకు ఎన్నికల సంఘం(ఈసీ), ఈవీఎంలతోనే సమస్య అని మీరు అనుకుంటూ ఉంటే ఒక్కక్షణం ఆగండి. వాళ్లు ఆర్మీ, కాగ్ సహా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకంగా ఉన్న ప్రతీ సంస్థను అవమానించారు. రఫేల్ ఫైటర్ జెట్ల కేసులో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇవ్వకపోవడంతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ బెదిరింపులకు లొంగకుండా నిజాయితీగా వ్యవహరించినందుకు గతంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే(జస్టిస్ దీపక్ మిశ్రా) అభిశంసన ద్వారా తొలగించేందుకు యత్నించారు’ అని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలనీ, కాంగ్రెస్ నైజాన్ని బయటపెట్టాలని ఓ బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇచ్చారు. ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల వ్యవహారశైలి.. పిల్లాడు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ త ప్పంతా అతను చదువుకున్న స్కూలు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు, పరీక్షల నిర్వాహకుడిదే అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను భారత్ క్షమించదు.. భారత ప్రజాస్వామ్యం ఉనికికి గతంలోనూ ఓసారి(1975 ఎమర్జెన్సీ పాలన) ప్రమాదం ఎదురైనప్పటికీ, ప్రజలు దాన్ని కాపాడుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. ‘బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ అప్పటికీ, ఇప్పటికీ మారలేదని వివరించాలి. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తిరగబడటంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు మరింత జిత్తులమారిగా తయారయ్యారు. కానీ ప్రజాస్వా్యమ్యంతో ఆటలాడితే భారత్ ఈసారి కాంగ్రెస్‌ను క్షమించదు’ అని అన్నారు. -
‘మోదీ బండారం బట్టబయలు’
సాక్షి, న్యూఢిల్లీ: సర్జికల్ దాడులపై లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) డీఎస్ హుడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించింది. సర్జికల్ దాడులను రాజకీయంగా వాడుకున్నారని, అతిగా ప్రచారం చేశారని హుడా వ్యాఖ్యానించారు. 2016, సెప్టెంబర్ 29న భారత భద్రతా బలగాలు సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోని తీవ్రవాద తండాలపై ఆకస్మిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్ దాడులు జరిగినప్పుడు ఆర్మీ నార్త్ కమాండ్ చీఫ్‌గా ఆయన ఉన్నారు. కాగా, ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో హుడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హుడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన నిజమైన సైనికుడిలా మాట్లాడారని ప్రశంసించారు. సర్జికల్ దాడులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్న వారు ఏమాత్రం సిగ్గుపడటం లేదని పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. ‘ నిజమైన సైనికుడిలా మాట్లాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. మన సైన్యాన్ని సొంత ఆస్తిలా వాడుకునేందుకు మిస్టర్ 36 మాత్రం ఏమాత్రం సిగ్గుపడటం లేదు. సర్జికల్ దాడులను ఆయన రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. రఫేల్ ఒప్పందంలో అక్రమాలకు పాల్పడి అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లు లబ్ది చేకూర్చార’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. Spoken like a true soldier General. India is so proud of you. Mr 36 has absolutely no shame in using our military as a personal asset. He used the surgical strikes for political capital and the Rafale deal to increase Anil Ambani’s real capital by 30,000 Cr. #SurgicalStrike https://t.co/IotXWBsIih — Rahul Gandhi (@RahulGandhi) 8 December 2018 సర్జికల్ దాడులను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ప్రధాని మోదీ బండారాన్ని బయటపెట్టినందుకు కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జెవాలా కూడా హుడాకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల త్యాగాలను రాజకీయాల కోసం వాడుకోవడం తగదన్నారు. దేశ భద్రతను ప్రమాదంలో పడేసిన మోదీ దోషి అని ట్వీట్ చేశారు. తన స్వార్థం కోసం వ్యూహాత్మక ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. Thank you Lt.Gen.Hooda for exposing the petty politicisation by PM Modi! No one can use the valour & sacrifice of our brave soldiers to score cheap political points Modiji is squarely guilty of compromising National Security & Strategic Interests by unwarranted chest thumping! pic.twitter.com/VjrUxS3alC — Randeep Singh Surjewala (@rssurjewala) 8 December 2018 -
ఎన్నికలప్పుడే ఆలయాల సందర్శన
బన్సుర్/జైపూర్: కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినప్పుడే ఆలయాల సందర్శనకు వెళతారని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలు ఆలయాలు సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మిగతా సమయాల్లో వాళ్లు ఆ చుట్టుపక్కల కూడా కనిపించరు. ఆలయాలు, గోవులు ఆ పార్టీకి ఎన్నికల ప్రచారాంశాలు కావొచ్చు. కానీ బీజేపీకి అవి సాంస్కృతిక జీవనంలో అంతర్భాగం’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అవసరమైతే పాకిస్తాన్‌కు సాయం చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ‘నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఒక్కటే చెబుతున్నా. అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదులపై అమెరికా సాయంతో పోరాడుతోంది. పాక్‌లో ఉగ్రవాదులపై ఒంటరిగా పోరాడలేమని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం భావిస్తే భారత్ సాయం కోరవచ్చు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య కశ్మీర్ అన్నది సమస్యే కాదనీ, అది భారత్‌లో అంతర్భాగమని రాజ్‌నాథ్ పునరుద్ఘా టించారు. సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలోనూ జరిగాయని కాంగ్రెస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని దేశప్రజలకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? సైన్యం అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ఉంటే ప్రజలకు తెలిసేది కాదా? ఈ ఆపరేషన్‌ను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎవరికి భయపడ్డారు?’ అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని అల్లాహ్ ఓడిస్తాడన్న ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘మతం, కులం ఆధారంగా చేసే రాజకీయాలపై మాకు నమ్మకం లేదు’ అని అన్నారు. -
యుద్ధానికి వెళ్లే జవాన్లు కెమెరాలు పట్టుకెళ్తారా..?
-
సర్జికల్స్ స్టైక్స్ రెండోసారి జరిగాయా?
-
సంక్రాంతికి సర్జికల్ స్ట్రయిక్స్
2016 సెప్టెంబర్ 18 తెల్లవారుజామున యూరీ పట్టణంలో బేస్ క్యాంప్ నిర్వహిస్తున్న భారతీయ సైనికులపై ఉగ్రవాదులు ఓ మెరపుదాడి చేశారు. దీంతో 19మంది జవాన్లు మరణించారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత భారత సైన్యం పాకిస్తాన్‌పై (పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ప్రాంతంలో) సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంఘటనల ఆధారంగా హిందీలో ‘యూరీ: ది సర్జికల్ స్ట్రయిక్స్’ అనే సినిమా రూపొందుతోంది. విక్కీ కౌశల్, పరేశ్ రావెల్, యామీ గౌతమ్ ముఖ్య తారలుగా నటించారు. ఆదిత్యా థార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏడాది జనవరి 11న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రాజీ, మన్మర్జియాన్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న విక్కీ కౌశల్ ఇందులో మెయిన్‌లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా చాలా ఉద్వేగభరింతగా ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
సర్జికల్ స్ట్రైక్స్‌పై మరో వీడియో
-
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ : తాజా వీడియో
సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు(సర్జికల్ స్ట్రైక్స్) జరిపింది. తోటి సైనికుల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన నాలుగు ‘టెర్రర్ లాంచ్ పాడ్’లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను నరేంద్ర మోదీ ప్రభుత్వం గత జూన్‌లో బహిర్గతం చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగి శుక్రవారం(సెప్టెంబరు 29)కి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా గురువారం మరో వీడియోను విడుదల చేసింది. సత్తా చాటిన భారత సైన్యం.. కశ్మీర్ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా సత్తా చాటారు. 2016 సెప్టెంబర్ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన నాలుగు వీడియోలున్నాయి. ప్రణాళికలో ఆయనదే కీలక పాత్ర.. జమ్మూ రీజియన్‌లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భద్రతను పర్యవేక్షించే 15 దళాలకు అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రాజేంద్ర నింబోర్కర్ వ్యవహరించారు. సర్జికల్ దాడులకు ప్రణాళిక రచించడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన నింబోర్కర్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించే క్రమంలో పాటించిన జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చారు. చిరుతలు చేసిన పరోక్ష సాయం! ‘దాడులకు సంబంధించిన ప్రణాళిక రచించే విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాం. ప్రణాళిక అమలు పరిచేందుకు.. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ మాకు ఒక వారం సమయం ఇచ్చారు. దాడులు చేయడానికి ఒకరోజు ముందు మాత్రమే మా దళంతో లక్ష్యిత ప్రాంతం గురించి చెప్పాను. ప్రణాళిక అమలుపరిచే క్రమంలో నియంత్రణ రేఖ అవతలి గ్రామాల్లోని కుక్కలు సైన్యాన్ని చూసి మొరిగే అవకాశం ఉంది. అదే జరిగితే వాటి అరుపులకు శత్రు దళాలు అప్రమత్తమవుతాయి. ఇందుకు పరిష్కార మార్గం కనుగొనటానికి నా పాత అనుభవం పనికివచ్చింది. చిరుతలకు కుక్కలు భయపడుతాయనే విషయాన్ని నౌషేరా సెక్టార్లో బ్రిగేడ్ కమాండర్‌గా ఉన్న సమయంలో నేను గమనించాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మా సైనికులు చిరుత మల, మూత్రాలను చల్లుకుంటూ వెళ్లారు. అలా శత్రు మూకలు అప్రమత్తం కాకుండా జాగ్రత్తపడ్డాం’ అంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. -
కేంద్రానికి షాకిచ్చిన అలీఘడ్ యూనివర్సిటీ..!
లక్నో: దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 29వ తేదీన ‘సర్జికల్ దాడుల దినోత్సవం’ను జరపాల్సిందిగా ఆదేశిస్తూ ‘యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్’ తాజాగా జారీ చేసిన సర్కులర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై యూపీలో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సర్జికల్ దాడుల దినోత్సవంను తాము వ్యతిరేకిస్తున్నామని ఎమ్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మషుష్కర్ అహ్మద్ ఉస్మానీ తెలిపారు. భారత సైన్యం దాడులు చేయడం ఇదే తొలిసారి కాదని... ఇంతకు ముందు కూడా అనేక సందర్భల్లో దాడులు నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాలు ఇలా ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ఆయన పేర్కోన్నారు. దేశభక్తిని చాటిచెప్పేందుకు ప్రతీ ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పుడు ఈ దినోత్సవాలు ఎందుకని ఉస్మానీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్ దాడుల దినోత్సవం జరుపుకోవాలి అనుకుంటే, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని అన్నారు. కాగా యూనివర్శిటీలతో ఎలాంటి సంప్రతింపులు లేకుండానే యూజీసీ ఏకపక్షంగా జారీ చేసిన ఈ సర్కులర్‌ను విద్యార్థులు, అధ్యాపకులు పలువురు తప్పుపడుతున్నారు. -
పరువుకు పాడెకట్టిన ‘యూజీసీ’
సాక్షి, న్యూఢిల్లీ : ‘విశ్వవిద్యాలయాల్లో బోధన, పరీక్షలు, పరిశోధనల ప్రమాణాలను కొనసాగించడమే కాకుండా వాటిని పెంచేందుకు, అలాగే యూనివర్శిటీ విద్య ప్రోత్సహానికి దోహదపడుతాయని భావించిన చర్యలను ఎప్పటికప్పుడు యూనివర్శిటీలు లేదా సంబంధిత సంస్థలతో సంప్రతింపులు జరపడం ద్వారా అమలు చేయడం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సాధారణ విధులు’ అని 1956 నాటి చట్టం నిర్దేశిస్తోంది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 29వ తేదీన ‘సర్జికల్ దాడుల దినోత్సవం’ను జరపాల్సిందిగా ఆదేశిస్తూ ‘యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్’ తాజాగా ఓ సర్కులర్ జారీ చేసింది. విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సర్కులర్‌కు యూజీసీ విధులకు ఎలాంటి సంబంధం లేదు. విద్యా, బోధన, పరిశోధనకు సంబంధించిన ఏ అంశం ఇందులో లేదు. పైగా యూనివర్శిటీలతో ఎలాంటి సంప్రతింపులు లేకుండానే యూజీసీ ఏకపక్షంగా ఈ సర్కులర్‌ను జారీ చేసింది. ఇప్పుడే కాదు, గత నాలుగేళ్లుగా సంస్థ ప్రమాణాలను, పరువును పణంగా పెట్టి, తనకు అస్సలు సంబంధంలేని వ్యవహారాలకు సంబంధించి సర్కులర్లను జారీ చేసింది. ‘స్వచ్ఛ భారత అభియాన్’లో పాల్గొన్న విద్యార్థులకు విద్యా ప్రమాణాలకిచ్చే అవార్డులు ఇవ్వాలని యూనివర్శిటీలను ఆదేశిస్తూ, ఐక్యతా పరుగులో పాల్గొనాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిస్తూ, యూనివర్శిటీ ఆవరణలో భారత సైనిక ధైర్య సాహసాలను ప్రతిబింబించే గోడలను ఏర్పాటు చేయాలంటూ యూజీసీ పలు సర్కులర్లను జారీ చేసింది. ఇలా తనకు సంబంధంలేని వ్యవహారాల్లో తలదూర్చి ఉన్న మెదడు కాస్త యూజీసీ పోగొట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎంఫిల్, పీహెచ్డీ, టీచింగ్ పోస్టుల రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను తరచూ మారుస్తూ విద్యార్థుల లోకంలో గందరగోళం సృష్టించడమే కాకుండా తాను గందరగోళంలో పడిపోయింది. ఫలితంగా దేశంలోని అన్ని యూనివర్శిటీల్లో వేలాది టీచింగ్ పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. సరైన లైబ్రరీలు, లాబరేటరీలు లేక యూనివర్శిటీలు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోవాల్సిన యూజీసీ ఈ యాత్రలో పాల్గొనండీ, ఆ యాత్రలో పాల్గొనండంటూ సర్కులర్ల మీద సర్కులర్లు జారీ చేస్తోంది. రెండేళ్ల క్రితం పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి భారత సైన్యం జరిపిన ‘సర్జికల్ స్ట్రైక్స్’కు ఇప్పుడు, అంటే ఇంత ఆలస్యంగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో?! ఇవేవి విద్యకు సంబంధించిన సర్కులర్లు కాకపోవడం వల్ల వీటిని పట్టించుకోవాల్సిన అవసరమే యూనివర్శిటీలకు లేదు. అయితే గ్రాంటుల కోసం యూజీసీ మీద ఆధారపడాలి కనుక యూజీసీ ఆదేశాలనుగానీ సూచనలనుగానీ తిరస్కరించే పరిస్థితుల్లో యూనివర్శీటీలు ఉండకపోవచ్చు. కానీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లు ఇలాంటి సర్కులర్లను ప్రశ్నించవచ్చు. యూజీసీ గత నాలుగేళ్లుగా తన స్వయం ప్రతిపత్తిని, పరువును పణంగా పెట్టి కేంద్రంలోని పాలక ప్రభుత్వానికి ఓ కొరియర్‌గా పనిచేస్తున్నా ఒక్క వీసీ అంటే ఒక్క వీసీ ప్రశ్నించడం లేదంటే ఎంత సిగ్గు చేటో! -
సర్జికల్ స్ట్రయిక్స్ సంబరాలు : యూజీసీ ఆదేశం
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రయిక్స్ మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మాటువేసిన తీవ్ర వాదులను మట్టుబెడుతూ.. భారత సైన్యం జరిపిన లక్షిత దాడులు. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి.భారత సైన్యం జరిపిన ఈ దాడులతో పాక్ ఒక్కసారిగా భయభ్రాంతురాలైంది. భారత త్రివిధ (సైన్యం, నావికా, వైమానిక) దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఒళ్లు గగుర్పుటించే వీడియోలు కూడా బయటకి వచ్చాయి. సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన తర్వాత భారత సైన్యాన్ని వెల్లువెత్తిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. మరో వారం రోజులకు భారత సైన్యం జరిపిన ఈ సర్జికల్ స్ట్రయిక్స్‌కు రెండేళ్ల పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు సెప్టెంబర్ 29వ తేదీని సర్జికల్ స్ట్రయిక్స్ దినోత్సవంగా జరుపుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా సాయుధ దళాల త్యాగాల గురించి మాజీ సైనికాధికారులతో చర్చా కార్యక్రమాలు, ప్రత్యేక కవాతులు, సాయుధ దళాలకు తమ మద్దతు తెలుపుతూ డిజిటల్ లేదా చేతిరాత గ్రీటింగ్ కార్డులను పంపడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఎన్సీసీ యూనిట్లు కూడా సెప్టెంబర్ 29న ప్రత్యేక పరేడ్లను నిర్వహించనున్నాయి. ఎన్సీసీ కమాండర్లు కూడా సరిహద్దు రక్షణ గురించి ప్రసంగించనున్నారు. అలాగే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రత్యేక మల్టీమీడియా ఎగ్జిబిషన్లో నిర్వహించనున్నట్లు యూజీసీ తెలిపింది. దీంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ముఖ్య పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించే అవకాశం ఉందని, వీటిని విద్యార్థులు, అధ్యాపకులు సందర్శించాలని ఉపకులపతులకు గురువారం రాసిన లేఖలో యూజీసీ వెల్లడించింది. -
సర్జికల్ దాడుల్లో చిరుత మూత్రం..!
పుణే: సర్జికల్ స్ట్రైక్స్ (సునిశిత దాడులు)కు చిరుత మూత్రానికి సంబంధం ఏంటి? అంటే సంబంధం ఉంది. 2016 సెప్టెంబర్‌లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పీవోకేలో 1సైన్యం జరిపిన సర్జికల్ దాడుల్లో అత్యాధునిక ఆయుధాలతోపాటు చిరుత మలమూత్రాలను కూడా భారత సైన్యం వినియోగించిందట! పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేసే సమయంలో సైన్యం కదలికలను చూసి కుక్కలు మొరగకుండా ఉండేందుకు చిరుత మల మూత్రాలను చల్లారట. ఈ విషయాన్ని లెఫ్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) రాజేంద్ర నింభోర్కర్ వెల్లడించారు. జమ్మూ రీజియన్‌లో ఎల్వోసీ వెంబడి భద్రతను పర్యవేక్షించే 15 దళాలకు అధిపతిగా ఈయన విధులు నిర్వర్తించారు. సర్జికల్ దాడులకు ప్రణాళిక రచించడంలో కీలక పాత్ర పోషించారు. పుణేలో థోర్లే బాజీరావ్ పీష్వా ప్రతిష్టాన్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎల్వోసీ అవతలి గ్రామాల్లోని కుక్కలు సైన్యాన్ని చూసి మొరిగే అవకాశం ఉంది. అదే జరిగితే వాటి అరుపులకు శత్రు దళాలు అప్రమత్తమవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మా సైనికులు చిరుత మల, మూత్రాలను చల్లుకుంటూ వెళ్లారు. చిరుతలకు కుక్కలు భయపడుతాయనే విషయాన్ని నౌషేరా సెక్టార్లో బ్రిగేడ్ కమాండర్‌గా ఉన్న సమయంలో నేను గమనించాను’’ అని వివరించారు. ‘‘దాడులకు సంబంధించిన ప్రణాళిక రచించే విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాం. ప్రణాళిక అమలు పరచేందుకు.. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ మాకు ఒక వారం సమయం ఇచ్చారు. దాడులు చేయడానికి ఒకరోజు ముందు మాత్రమే మా దళంతో లకి‡్ష్యత ప్రాంతాన్ని గురించి చెప్పాను’’ అని నాటి సంగతులను వెల్లడించారు. -
దేశ ప్రజలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్: జిగ్నేష్
గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీపై దళిత ఉద్యమ నేత గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని విమర్శల వర్షం కురిపించారు. 125 కోట్ల దేశ ప్రజలపై ప్రాణాంతకమైన సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 2016 నవంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత జవాన్లు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోలను పలు ఛానల్స్ ఇటీవల ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మేవాని మంగళవారం గుజరాత్‌లోని తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం వాద్గామ్‌లో మీడియాతో మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మోదీ ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వకుండా దేశ యువతపై సర్జికల్ దాడులు చేశారని వ్యాఖ్యానించారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండితలు చేస్తామన్న మోదీ ఆ హామీ గాలికొదిలేశారని మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన మేవాని.. వాద్గామ్ నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. -
‘ఏ క్షణంలోనైనా లాహోర్‌లోకి ప్రవేశిస్తాం’
నాగ్‌పూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశిస్తుందని, అందుకు కేంద్రం గతంలో చేసిన సర్జికల్ దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. భారత్‌లో ప్రస్తుత పరిస్థితి-స్థితిగతులపై మాట్లాడుతూ.. 300 మంది ఉగ్రవాదులను ఏరివేశామంటూ దాయాది పాక్‌ను హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండగా కేవలం మూడు, నాలుగు పర్యాలు చేసిన కీలక దాడుల్లోనే ఈ ఘటన సాధించామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ.. ఆర్మీకి, ఎన్ఐఏ నిఘా విభాగాలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఉగ్రవాదులను ఏరివేస్తూ పాక్‌ను దెబ్బతీసినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిందన్నారు. లాహోర్‌లో ఎప్పుడైనా మేం కాలుపెట్టగలమని తెలపడమే సర్జికల్ దాడుల సారాంశమని అభిప్రాయపడ్డారు. అఖండ భారతాన్ని పునర్నిర్మించాలని తాము కలలు కంటున్నామని.. నాగ్‌పూర్, లాహోర్లలో సొంత నివాసాలు కట్టుకోవాలనుందని మనసులో మాట బయటపెట్టారు. తుదిశ్వాస విడిచేవరకూ అఖండ భారత నిర్మాణం కోసం ఆరెస్సెస్ పని చేస్తుందన్నారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ల భావజాలంతో నవ భారతం నిర్మితమౌతుందని ఇంద్రేష్ కుమార్ వివరించారు. (వైరల్ : భారత్ సర్జికల్ స్ట్రైక్స్ వీడియో..!) -
సర్జికల్ ఫైట్
-
సర్జికల్ దాడులకు వీడియో సాక్ష్యం..!
న్యూఢిల్లీ : దాదాపు రెండేళ్ల క్రితం (దాదాపు 636 రోజుల కిందట) పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) వీడియోలు తాజాగా విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన ‘టెర్రర్ లాంచ్ఫాడ్’లను ధ్వంసం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టుగా భావిస్తున్నారు. కశ్మీర్ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి జొరపడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను మట్టుపెట్టారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా తమ సత్తా చాటారు. 2016 సెప్టెంబర్ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన నాలుగు వీడియోలున్నాయి. ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్న విపక్షాలు... 2016లో జరిగిన దాడులను ఓటుబ్యాంక్‌గా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వం తాజాగా వీడియోలు విడుదల చేసిందని కాంగ్రెస్ విమర్శించింది.సర్జికల్ స్ట్రయిక్స్ నుంచి ఓట్లరూపంలో ప్రయోజనం పొందాలని చూస్తోందని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. గతంలో సర్జికల్ స్ట్రయిక్స్‌కు మద్దతు తెలిపిన ఎన్డీఏ మిత్రపక్షం జేడీ(యూ) కూడా అప్పటి మెరుపుదాడులతో ఏమి సాధించారని ప్రశ్నించింది. ఇప్పుడు వీడియోలు బయటపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మాజీ మంత్రి అరుణ్‌శౌరీ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోపై కాంగ్రెస్ స్పందన పాకిస్తాన్ టెర్రరిస్టులను ప్రోత్సహించేదిగా ఉందంటూ కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ విరుచుకుపడ్డారు. అసలప్పుడేం జరిగింది ? పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఎంచుకున్న ఉగ్రవాద లక్ష్యాల గురించి వివరించే పటంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. దాడిలో పాల్గొన్న సైనికులకు అమర్చిన కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ) ద్వారా ఉగ్రవాద శిబిరాలపై దాడులను చిత్రీకరించారు. దాడులకు ముందు, ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా తెలిసేలా రికార్డ్ చేశారు. ఈ కెమెరాల ద్వారా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి, ఆ తర్వాత రాకెట్ లాంఛర్లు, యాంటీ బంకర్ మిసైల్స్‌ని ప్రయోగించి పాక్ టెర్రర్ బంకర్లు ధ్వంసం చేయడాన్ని మొదటి వీడియోలో చిత్రీకరించారు. రెండు నిముషాల వ్యవధిలోనే రెండో లక్ష్యంపై దాడి చేయడాన్ని యూఏవీల ద్వారా రికార్డ్ చేశారు. మరో 20 సెకన్ల వ్యవధిలోనే జరిపిన దాడిలో ఉగ్రవాదుల బంకర్ ధ్వంసం కావడాన్ని కెమెరాల్లో బంధించారు. ఈ విధంగా మొత్తం 8 దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతం కావడం కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. జమ్ము,కశ్మీర్ సరిహద్దులోని ఆధీనరేఖ (ఎల్ఓసీ)కు కొన్ని కి.మీ లోపలికి వెళ్లి పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు నెలమట్టం చేయడానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఈ స్థావరాల్లో తీవ్రవాదులు, సైనికులు కలగలిసి స్వేచ్ఛగా తిరగడం ఈ వీడియోల్లో రికార్డయింది. దాడి జరిగిన తేదీ, సమయం కూడా వీడియోల్లో స్పష్టంగా నమోదైంది. గతంలోనూ ‘సర్జికల్ స్ట్రయిక్స్’... గత రెండుదశాబ్దాల్లో పలు సందర్భాల్లో మెరుపుదాడులు జరిగాయని కాంగ్రెస్ నేత సుర్జేవాలా వెల్లడించారు. ఆ జాబితా ఇదే... –2000 జనవరి 21న నీలం నది వ్యాప్తంగా నడాలా ఎన్‌క్లేవ్‌లో... –2003 సెప్టెంబర్ 18న ఫూంచ్‌లోని బారా సెక్టర్లో... –2008 జూన్ 19న ఫూంచ్‌లోని భట్టల్ సెక్టర్లో... –2011 సెప్టెంబర్ 1న నీలంనది లోయలోని కెల్ (శారద సెక్టర్) ప్రాంతంలో... –2013 జనవరి 6న సావన్ పత్ర చెక్‌పోస్ట్... –2013 జులై 27–28 తేదీల్లో నజాపిర్ సెక్టర్లో... –2013 ఆగస్టు 6న నీలం లోయలో... –2014 జనవరి 14న మరో మెరుపు దాడి జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. -
అత్యాచారాలు సిగ్గుచేటు
లండన్: చిన్నారులపై అత్యాచారాలు సిగ్గుచేటని, దీనిపై రాజకీయాలు తగవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రిని కాదని, 125 కోట్ల మంది భారతీయులకు సేవకుడినని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్న ప్రధాని.. భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్కోణం మారిందన్నారు. భారత్ శాంతికాముక దేశమే కానీ.. దేశ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే ఉపేక్షించబోమంటూ పాక్‌పై గతంలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేశారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన లండన్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ హాల్, వెస్ట్ మినిస్టర్ వేదికగా తన అభిప్రాయాలను ‘భారత్ కీ బాత్.. సబ్ కే సాథ్’ పేరుతో స్థానిక భారతీయులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ ప్రసూన్ జోషి ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర పైగా సాగింది. ఈ సందర్భంగా పలువురికి మోదీ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే.. భారత్‌లో చిన్నారులపై అత్యాచారాలపై.. రేప్ అనేది దారుణం. ఆందోళనకరం. దాన్ని ఎలా అంగీకరిస్తాం? మన బిడ్డలపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు. ఈ దారుణాలకు పాల్పడే వారు కూడా ఒక తల్లి బిడ్డలే. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలు అత్యంత బాధాకరం. చిన్న బాలికపై అత్యాచారం జరిగినపుడు చాలా బాధనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. కానీ మీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఇన్ని జరిగాయి. మా ప్రభుత్వంలో తక్కువ జరిగాయని చెప్పవచ్చా. వయసొచ్చిన కూతురు సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వస్తే తల్లిదండ్రుల్లో ఆందోళన నాకు తెలుసు. విమర్శలపై..: విమర్శలను స్వాగతిస్తాను. వాటికి మాటలతో సమాధానం ఇవ్వాలనుకోను. తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటాను. నేను చరిత్రలో నిలిచిపోవాలనుకోవడం లేదు. నా విధిని సక్రమంగా నిర్వర్తిస్తే చాలనుకుంటున్నాను. నోట్ల రద్దుపై..: నోట్ల రద్దు చారిత్రక నిర్ణయం. నిజాయితీ, పారదర్శకత కోసం ప్రజలు కొంతవరకు త్యాగం చేస్తారని నేను విశ్వసించాను. బలహీనతలపై..: నేను సామాన్యుడినే. అందరిలో ఉండే బలహీనతలు నాకూ ఉన్నాయి. సామాన్య స్థాయి నుంచే వచ్చాను. నాకు గొప్పగొప్ప నానమ్మలు, తాతయ్యలు లేరు. నేను కష్టపడతాను. ఈ విషయాన్ని నా దేశ ప్రజలు కూడా నమ్ముతారు. అధికారంలోకి వచ్చాక..: గత ప్రభుత్వాలతో పోలిస్తే అభివృద్ధి దిశగా దేశం దూసుకుపోతోంది. అధికారమిచ్చాం, అవకాశమిచ్చాం.. ఎందుకు చేసి చూపించరని ప్రజలు ప్రశ్నించటమే నాకు సంతోషాన్నిస్తుంది. ప్రజలకు నా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇదే సంకేతం. 125 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. ఓ చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావటమే.. భారత ప్రజాస్వామ్యం గొప్పదనం. నేను రాయల్ ప్యాలెస్‌కు అతిథిగా రావటం 125 కోట్లమంది భారతీయుల సంకల్పమే. ప్రజాఉద్యమంలా అభివృద్ధి: అభివృద్ధి కూడా స్వాతంత్య్రోద్యమం లాంటిదే. ప్రజలందరూ అభివృద్ధిపై తమ ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. అభివృద్ధి మన బాధ్యత. దేశం నాది, ఈ ప్రభుత్వం నాదనే భావన పెంచుకోవాలి అప్పుడు అభివృద్ధి ప్రజా ఉద్యమంలా దూసుకెళ్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకుంటే మరుగుదోడ్ల నిర్మాణం కార్యక్రమం విజయవంతం కాకపోయేది. రైల్వే సబ్సిడీని 4 లక్షల మంది సీనియర్ సిటిజన్లు, ఎల్పీజీ సబ్సిడీని 1.25 కోట్ల మంది పౌరులు స్వచ్ఛందంగా వదులుకోవటమే దేశంలో ప్రజా భాగస్వామ్యానికి తార్కాణం. సర్జికల్ స్ట్రైక్‌పై.. యూఎన్ శాంతిపరిరక్షక దళాల్లో ఎక్కువ భాగస్వామ్యం భారత్‌దే. అలాంటి శాంతికాముక దేశమైన భారత్.. పొరుగున్న పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. నా దేశ ప్రజలను చంపేస్తూ.. వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మా జవాన్ల తలలు నరుకుతున్నా నేను ఓపికగా ఉండలేకపోయాను. ఏ భాషలో చెబితే అవతలి వారికి అర్థమవుతుందో అలా చెప్పాను. సర్జికల్ స్ట్రైక్స్‌తో నా సైనికులు చేసిన పనికి నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఈ విషయంపై ముందు పాకిస్తాన్ మిలటరీకి సమాచారం ఇచ్చాకే భారత్‌లోనూ, మిగతా ప్రపంచానికి వెల్లడించాం. పేదరికంపై.. నేను పుస్తకాలు చదివి పేదరికం అంటే ఏంటో తెలుసుకోలేదు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ విషయంలో రాజకీయం సరికాదు. రాజకీయం వేరు, పేదల జీవితంలో మార్పు తీసుకురావాలనే నా సమాజ నీతి వేరు. 70 ఏళ్ల తర్వాత 18వేల గ్రామాలకు విద్యుత్ లేకపోవటం దారుణం కాదా? మా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. సౌభాగ్య పథకం ద్వారా 4కోట్ల కుటుంబాలకు (ఇళ్లకు) వెలుగునిచ్చాం. కొండలు, లోయలు, ఉగ్రవాద, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ ఇచ్చాం. 3 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలయ్యాయి. ‘గరీబీ హఠావో’ నినాదంతో తొలగిపోదు. ఆ దిశగా పనిచేయాలి. ఆయుష్మాన్ భారత్ పిల్లలకు సరైన విద్య, యువతకు ఉపాధి, అసహాయులకు సరైన వైద్యం అందించటమే మా ప్రభుత్వ లక్ష్యం. దీనికోసమే పనిచేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ కేర్‌గా పిలిస్తే నాకు అభ్యంతరమేం లేదు. సమగ్ర వ్యూహంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశాం. తొలిగా దేశవ్యాప్తంగా 2 లక్షల వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతాం. పేదల కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. జెనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చాం. స్టెంట్ల ధరలు తగ్గించాం. పిల్లల ఆరోగ్యం కోసం గర్భిణులకు 26వారాల ప్రసూతి సెలవులిస్తున్నాం. ఇదే నా జీవితం సీఎంగా ఉన్నప్పుడు నాకు వచ్చిన కానుకలను వేలం వేసి.. ఈ డబ్బును బాలిక విద్యకు వెచ్చించాను. ఈ మొత్తం 100 కోట్లకు పైమాటే. రాజకీయ జీవితంలో ఉన్నందున రెండు దశాబ్దాలుగా రోజూ విమర్శలు నాకు అలవాటైపోయాయి. ఎవరిపైనా ఆధారపడకుండా.. నవ్వుతూ, ఆహ్లాదంగా ఉంటూ ప్రాణాలు పోవాలి. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు యోగ, ధ్యానం చేస్తాను. యువతకూడా యోగపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంతర్గత ఆరోగ్యానికి అదే అసలైన శక్తినిస్తుంది. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, డయానా! ప్రధాని మోదీ ప్రసంగించిన లండన్‌లోని సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు గతంలో ఆ వేదికపై నుంచి ఉపన్యాసాలిచ్చారు. 1912 అక్టోబరులో ఈ వేదికను ప్రారంభించారు. అప్పట్లో ఇది మెథడిస్ట్ సెంట్రల్ హాల్ పేరుతో చర్చి, సమావేశ మందిరంగా ఉండేది. అప్పట్లో అనేక రకాల సమావేశాలకు, వేడుకలకు, చర్చలకు వేదికగా ఉండేది. 1946లో తొట్టతొలి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగింది కూడా సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్‌లోనే. 1931లో భారత స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు గాంధీ యూకేలో పర్యటించి ఇక్కడే ప్రసంగించారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, బౌద్ధమత గురువు దలైలామా, యువరాణి డయానా తదితరులు ఈ వేదికపై నుంచి ప్రసంగించిన వారిలో అత్యంత ప్రముఖులు. బసవేశ్వరుడికి పుష్పాంజలి ప్రధాని మోదీ బుధవారం థేమ్స్ నది ఒడ్డున అల్బర్ట్ ఎంబ్యాంక్మెంట్ గార్డెన్‌లోని 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. లండన్‌లోని బసవేశ్వర ఫౌండేషన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కర్ణాటకలో లింగాయత్‌లు, వీరశైవులకు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ హోదా కల్పిస్తూ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో మోదీ బసవేశ్వరుడికి నివాళులర్పించటం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే స్నేహం..బలమైన బంధం! భారత్–యూకే ద్వైపాక్షిక బంధాలపై మోదీ, థెరిసా మే లండన్: బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం)తో సంబంధం లేకుండా భారత–యూకే సంబంధాలు మునుపటిలాగే బలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సుకోసం లండన్ చేరుకున్న మోదీ.. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత పురోగతితో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బుధవారం ఉదయం 10, డౌనింగ్ స్ట్రీట్ (బ్రిటన్ ప్రభుత్వ కార్యాలయం)లో జరిగిన ఈ సమావేశంలో.. నేరస్తుల అప్పగింత, న్యాయపరమైన అంశాలు, రక్షణ, భద్రతాపరమైన అంశాలు, పరస్పర మిలటరీ సహకారంతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆన్లైన్ ఉగ్రవాదం తదితర అంశాల్లో కలిసి పనిచేసేందుకు నిర్ణయించినట్లు ఇరుదేశాధినేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక బంధాలకు కొత్త నిర్వచనం పలికేలా చర్చలు జరిగాయి. భారత్–యూకే సంబంధాల్లోని బహుముఖ అంశాలపై వీరిద్దరు విస్తృతంగా చర్చించారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా భారత్–యూకే సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని మోదీ తెలిపారన్నారు. చోగమ్ సదస్సుకోసం మంగళవారం రాత్రి ప్రధాని లండన్ చేరుకున్న మోదీకి ఆ దేశ విదేశాంగ మంత్రి బోరిస్ స్వాగతం పలికారు. కాగా, బ్రిటన్ యువరాజు చార్లెస్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా సైన్స్ మ్యూజియంను మోదీ సందర్శించారు. భారత్–బ్రిటన్ కొత్త వాణిజ్య భాగస్వామ్యం మోదీ పర్యటనను పురస్కరించుకుని బ్రిటిష్ ప్రభుత్వం బుధవారం కొత్త భారత్–యూకే వాణిజ్య భాగస్వామ్య పథకాన్ని ప్రకటించింది. ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా బ్రిటన్‌లో భారత్ పెట్టే బిలియన్ పౌండ్ల (రూ.9,340 కోట్లు) పెట్టుబడితో 5,750 కొత్త ఉద్యోగాలు వస్తాయని యూకే అంతర్జాతీయ వాణిజ్య విభాగం వెల్లడించింది. దీని లెక్కల ప్రకారం భారత్, బ్రిటన్ మధ్య వస్తు, సేవల రూపంలో 2017లో 18 బిలియన్ పౌండ్ల వ్యాపారం జరిగింది. 2016తో పోలిస్తే ఇది 15% పెరిగింది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఎలిజబెత్ రాణితో మోదీ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్న నిరసనకారులు -
భారత్‌కు పాకిస్తాన్ వార్నింగ్
శ్రీనగర్, జమ్మూకశ్మీర్ : మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్‌కు పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. శనివారం కశ్మీర్లో గల సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన భారతీయ ఆర్మీ.. పాకిస్తాన్‌కు చెందిన జైషే ఈ మొహమ్మద్(జేఈఎమ్) అనే ఉగ్ర సంస్థకు ఈ దాడితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనపై ఆందోళన చెందుతున్న పాకిస్తాన్ మరోసారి భారత్ నిర్దేశిత దాడులకు(సర్జికల్ స్ట్రైక్స్) దిగుతుందేమోనని భయపడుతోంది. జేఈఎమ్‌కు సుంజువాన్ క్యాంపుపై దాడికి సంబంధం ఉందన్న భారత మిలటరీ ప్రకటనపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత అధికారులు కావాలనే జేఈఎమ్‌ను ఈ దాడిలోకి లాగుతున్నారని ఆరోపించింది. సరైన విచారణ జరపకుండా బాధ్యతారాహిత్యంతో ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న భారత్‌ను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. కాగా, సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై జరిగిన ముష్కరుల దాడిలో ఐదుగురు జవాన్లు అమరవీరులు అయ్యారు. మరో జవాను తండ్రి కూడా ప్రాణాలు విడిచారు. పది మంది జవానుల కుటుంబీకులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. సోమవారం శ్రీనగర్‌లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడికి జరిగిన యత్నాన్ని భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. -
పాక్ బద్ధ శత్రువు.. ఒప్పందాలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : యూరీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చి ఆరోపణలు గుప్పించింది. అదంతా ఓ పెద్ద డ్రామాగా అభివర్ణిస్తోంది. పుల్వామా ఎన్కౌంటర్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇప్పుడు జరిగిన పుల్వామా ఎన్కౌంటర్ అదంతా డ్రామాగా తేల్చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కట్టిడి చేసేందుకు ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ సత్ఫలితాలను ఇవ్వటం లేదు. పైగా పాకిస్థాన్ బద్ధ శత్రువంటూ ఓ వైపు ప్రకటనలు ఇస్తూ.. మరోవైపు వారితో చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు? బీజేపీ హయాంలో దేశ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు’’ అంటూ దీక్షిత్ పేర్కొన్నారు. కాగా, అవంతిపూర్ సెంటర్ ట్రైనింగ్ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారేమోనన్న అనుమానంతో తనిఖీలు చేపట్టినట్లు సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. -
మళ్లీ..మళ్లీ.. అదే చేస్తాం!?
సాక్షి, లక్నో: కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నపాకిస్తాన్‌పై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పదేపదే పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది.. వీటికి భారత్ దీటుగానే బదులిస్తుంది.. అంతేకాక సర్జికల్ స్ట్రయిక్స్ మళ్లీమళ్లీ చేస్తామంటూ పాకిస్తాన్‌ను యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇదిలావుండగా.. బుధవారం నాడు భారత భద్రతా బలగాలు.. నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కొంతకాలంగా నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది భారత భద్రతాబలగాలు.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. దాదాపు ఐదున్నర గంటల పాటు భద్రతాబలగాలు సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. -
సర్జికల్ స్ట్రైక్స్... ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పుణే : ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వెంబడి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ప్రయత్నం మరోసారి చేయకపోవటమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సరిహద్దు రేఖ వెంబడి మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయకూడదనే భావిస్తున్నాం. ఎందుకంటే అందులో కొత్తదనం ఏం ఉండబోదు కాబట్టి. ఒకవేళ మేం సర్‌ప్రైజ్‌లే ఇవ్వాలనుకుంటే కొత్తరకంగా ఉపాయం వేసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే అవతలివాళ్లు ఊహించని విధంగా.. సర్జికల్ స్ట్రైక్స్ కంటే మరింత సమర్థవంతంగా ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. 2015లో మయన్మార్, 2016లో పీఓకే వెంబడి నిర్వహించిన సునిశిత దాడుల ఆపరేషన్ల గురించి, ఆయా సందర్భాల గురించి వివరించిన ఆయన.. ప్రస్తుతం ఉత్తర, తూర్పు సరిహద్దులో ఉన్న పరిస్థితులు, బలగాల మోహరింపు మొదలైన అంశాల కూలంకశంగా వివరించారు. శుక్రవారం పుణేలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
సర్జికల్ స్ట్రయిక్స్ మేం రెడీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం అనుమతిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ దనోవ్ గురువారం ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు. మరోదఫా సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే ఐఏఎఫ్ పూర్తిస్థాయిలో భాగం పంచుకుంటుందని ఆయన తెలిపారు. ఎటువంటి పోరాటంలో పాల్గొనేందుకైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని.. ఆయన ప్రకటించారు. -
'సర్జికల్ దాడులు మోదీ సాహసోపేత నిర్ణయం'
న్యూఢిల్లీ : భారత్ 2015లో ఒకసారి, 2016లో ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని భారత ఆర్మీ మాజీ చీఫ్ అధికారి జనరల్ దల్బీర్ సింగ్ చెప్పారు. ఈ రెండు దాడుల్లో కూడా ఘనమైన విజయం సొంతం చేసుకుందని, భారత్ ప్రతిష్ట అమాంతం పెరిగిందని తెలిపారు. 2015 జూన్ నెలలో తొలుత మ్యాన్మార్లో, 2016 సెప్టెంబర్ నెలలో పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి విజయవంతంగా సర్జికల్ దాడులు చేసినట్లు వివరించారు. 'ఈ రెండు సర్జికల్ దాడులతో భారత ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగింది. మన సైనికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ రెండు దాడులు విజయవంతం అయ్యాయి. ఇది ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం. ఆ సర్జికల్ దాడుల తర్వాత ఎలాంటి సంఘటన చర్చించుకోదగినది లేదు' అని ఆయన తెలిపారు. -
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్..
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులపై విరుచుకుపడింది. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన 70మంది పారా కమాండోల బృందం ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు ఈ దాడి నిర్వహించింది. లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా టెర్రర్ క్యాంప్స్ను ధ్వంసంచేసింది. ఈ మెరుపుదాడుల్లో ఎన్ఎస్సీఎన్-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది. మన కమాండోలకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. జవాన్లపై నాగాలు దాడికి దిగడంతో.. వారిని నిలువరించే క్రమంలోనే మెరుపుదాడులు చేసినట్టు సైనికవర్గాలు వెల్లడించాయి. ఎస్ఎస్ ఖప్లాంగ్ నేతృత్వంలో ఏర్పడిన ఎన్ఎస్సీఎన్-కే తిరుగుబాటుదళం.. నాగాల్యాండ్, మణిపూర్‌ల్లో మన జవాన్లపై వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ తరహా మెరుపుదాడులు నిర్వహించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఇండో మయన్మార్ సరిహద్దుల్లో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం గమనార్హం. -
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్.. ఈసారి టార్గెట్ నాగా టెర్రర్!
-
అవసరమైతే.. మళ్లీ సర్జికల్ స్ర్టైక్స్
న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద అవసరమైతే మళ్లీ సర్జికల్ స్ర్టైక్స్ చేపడతామని నార్తర్న్ కమాండెంట్.. లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్బు ప్రకటించారు. చైనా, పాకిస్తాన్లతో ఏకకాలంలో అయిన యుద్ధం చేసే సత్తా భారత్‌కు ఉందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించి రోజు గడవకుందే.. అన్బు ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం. నియంత్రణ రేఖ అనేది ఒక ఊహాత్మక గీత.. అవసరమైన సమయంలో దానిని దాటేందుకు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద సర్జికల్ స్ర్టయిక్స్ చేయాల్సివస్తే.. అందుకు సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సరిహద్దు రేఖ వద్ద గతంలోకన్నా ఇప్పుడు లాంచింగ్ పాడ్స్, టెర్రరిస్ట్ క్యాంప్స్ అధికంగా ఏర్పడ్డాయని చెప్పారు. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదుల ప్రయత్నిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు ఎప్పడూ సిద్ధంగా ఉంటాయని చెప్పారు. -
ఆ అవమానకర ప్రశ్నే ‘సర్జికల్’కు కారణం
పణాజి: మయన్మార్ సరిహద్దు వెంట ఉగ్రవాదులను ఏరివేసిన తరువాత ఎదురైన ఓ అవమానకరమైన ప్రశ్నే సర్జికల్ దాడులకు దారితీసిందని మాజీ రక్షణ మంత్రి , గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం తెలిపారు. 2015, జూన్ 4న ఈశాన్య ప్రాంత మిలిటెంట్ గ్రూప్ ఎన్ఎస్సీఎన్–కే మణిపూర్‌లో భారత ఆర్మీ వాహనంపై మెరుపుదాడికి దిగి 18 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి నాలుగు రోజుల తరువాత అంటే జూన్ 8న మయన్మార్ సరిహద్దులో ఆర్మీ జరిపిన దాడిలో సుమారు 80 మంది మిలిటెంట్లు మరణించారు. ఆ తరువాత జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో... పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా అలాంటి ఆపరేషన్ నిర్వహించే సత్తా భారత ఆర్మీకి ఉందా? అని యాంకర్ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను అడగడం తనలో ఆలోచనలు రేకెత్తించిందని పరీకర్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 29న పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులకు 15 నెలల ముందు అంటే 2015 జూన్ 9 నుంచే ప్రణాళికలు రచించామని పేర్కొన్నారు. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అధునాతన రాడార్‌తో పాక్ ఆర్మీ ఫైరింగ్ యూనిట్లను గుర్తించి ధ్వంసం చేశామని తెలిపారు. -
సర్జికల్ స్ట్రైక్స్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి!
న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్జికల్ స్ట్రైక్స్ కన్నా ఎంతో మెరుగైన ప్రత్యామ్నాయాలు తమ వద్ద ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ‘సులువైన ఏకపక్ష యుద్ధాన్ని చేయడం ద్వారా ప్రతిఫలాన్ని పొందాలని పాక్ భావిస్తోంది. కానీ మా వద్ద (సర్జికల్ స్ట్రైక్స్ కన్నా) మెరుగైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మన సైన్యం ఆటవికమైనది కాదు. తలలు నరికి తీసుకురావాలని నేను కోరుకోను. మనది చాలా క్రమశిక్షణతో కూడిన దళం’ అని రావత్ మీడియాతో చెప్పారు. గత నెల 1న పాక్ జవాన్లు ఇద్దరు భారత సైనికుల తల నరికిన ఘటనను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయెద్ సలహుద్దీన్ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంపై స్పందిస్తూ.. ‘అతన్ని పాకిస్థాన్ కట్టడి చేస్తుందా? లేదా అన్నది చూడాలి. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నాడే అతను ప్రతిరోజూ ఆందోళనల కోసం క్యాలెండర్ జారీచేశాడు’ అని రావత్ అన్నారు. లష్కరే తోయిబా స్థాపకుడు, ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్‌పై అమెరికా నజరానా ప్రకటించినప్పటికీ.. పాకిస్థాన్ అతన్ని కట్టడి చేయని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
'లాహోర్‌లో మన త్రివర్ణ పతాకం ఎగరాలి'
భారతసైన్యం నియంత్రణ రేఖ వెంబడి చేసిన దాడులను పలు రాజకీయ పార్టీలు ప్రశంసించాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే ఇటీవలి కాలంలో కొంత దూరంగా కూడా ఉంటున్న శివసేన సైతం ఈ విషయంలో సైన్యానికి అండగా నిలిచింది. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారంటూ శివసేన ప్రతినిధి అరవింద్ సావంత్ ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఆగేందుకు సమయం లేదని, లాహరో వెళ్లి మరీ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని ఆయన అన్నారు. అంటే ఒక రకంగా పాకిస్తాన్‌ను ఆక్రమించాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రతినిధి ఆర్ఎస్ సుర్జేవాలా కూడా సైన్యం చర్యలను ప్రశంసలలో ముంచెత్తారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ శిబిరాలను ధ్వంసం చేయడంలో భారత సైన్యం చూపించిన అసమాన ధైర్య సాహసాలకు సెల్యూట్ అని ఆయన అన్నారు. ఈ శిబిరాల వల్లే పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు భారత భూభాగంలో ప్రవేశిస్తున్నారని ఆయన చెప్పారు. మే 9వ తేదీన, తర్వాత మళ్లీ 20, 21 తేదీలలో నిర్వహించిన ఈ దాడుల్లో ప్రధానంగా రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, ఆటోమేటెడ్ గ్రనేడ్ లాంచర్లు, రికోయిలెస్ గన్లు ఉపయోగించినట్లు భారత సైన్యం తెలిపింది. కౌంటర్ టెర్రరిజం వ్యూహంలో భాగంగా నియంత్రణ రేఖను పూర్తిగా డామినేట్ చేస్తోందని, ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడే ప్రాంతాలను మనం టార్గెట్ చేసుకున్నామని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అశోక్ నరులా చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు తగ్గాలని, తద్వారా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిస్తే అక్కడి యువత మీద దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయని ఆయన అన్నారు. -
మళ్లీ 'సర్జికల్' తరహా దాడులు.. పాక్ కకావికలు
-
మళ్లీ 'సర్జికల్' తరహా దాడులు.. పాక్ కకావికలు
భారత సైన్యం మళ్లీ పాకిస్తాన్ మీద విరుచుకుపడింది. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులు చేసింది. ఈనెల 20, 21 తేదీలలో జరిపిన ఈ దాడుల వివరాలను సైన్యం తాజాగా ప్రకటించింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని నౌషేరా ప్రాంతం సమీపంలో ఉన్న పాకిస్తాన్ శిబిరాలపై భారత భద్రతా దళాలు ముమ్మరంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ ప్రాంతం మొత్తం భారత సైన్యం ఆధీనంలోనే ఉందని, తమకు జమ్ము కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే ముఖ్యమని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కొండ ప్రాంతంలో ఉన్న పాకిస్తానీ బంకర్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలను కూడా సైన్యం బయటపెట్టింది. పాకిస్తాన్ సైన్యం చొరబాట్లను ప్రోత్సహిస్తూ వాటికి అండగా ఉంటోందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అశోక్ నరులా చెప్పారు. కొండల్లో ఉన్న మంచు కరుగుతూ భారతదేశం వైపు రావడానికి మార్గాలు తెరుచుకోవడంతో ఈ ప్రాంతంలో చొరబాట్లు పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నాయని, అందుకే భారత సైన్యం ముందుగా చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. -
కక్కించే వరకూ నిద్రపోను
-
కక్కించే వరకూ నిద్రపోను
దోపిడీతో ప్రజల భవిష్యత్‌ను నాశనం చేసిన వారికి బుద్ధి చెప్పండి ► సర్జికల్ దాడులను ప్రశ్నించడమంటే.. సైన్యాన్ని అవమానించడమే.. ► ఉత్తరాఖండ్ ప్రచారంలో కాంగ్రెస్‌పై మండిపడ్డ ప్రధాని మోదీ శ్రీనగర్/పితోరాగఢ్: దేశాన్ని దోచుకున్న వారి నుంచి వారు దోచుకున్న మొత్తం కక్కించే వరకూ తాను నిద్రపోనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన వారికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సర్జికల్ దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడమంటే దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సైనిక దళాలను కించపరచడమే అని మండిపడ్డారు. సర్జికల్ దాడులు మిలిటరీ చరిత్రలోనే గొప్ప సంఘటన అని, దీనిపై ప్రపంచంలోని వివిధ మిలిటరీ ఏజెన్సీలు అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. రాజకీయాలు చేయాలనుకుంటే.. మోదీపై దాడి చేయాలనుకుంటే చేసుకోండి కానీ.. దేశం కోసం త్యాగాలు చేసిన మిలిటరీ, సైనికుల పరాక్రమంపై అనుమానాలు వ్యక్తం చేయడం తగదని హితవు పలికారు. ‘‘70 ఏళ్ల పాటు దేశాన్ని దోపిడీ చేసిన వారి టైమ్ ఇప్పుడు ఆఖరికి వచ్చింది. దేశాన్ని దోపిడీ చేసిన దానిని తిరిగి చెల్లించేలా చేస్తానని హామీ ఇస్తున్నా. ఈ పని పూర్తయ్యే వరకూ నేను నిద్రపోను. దోపిడీదారులను ప్రశాంతంగా నిద్రపోనివ్వను’’ అని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి... దేవభూమి ప్రతిష్టను దెబ్బతీసి దోపిడీ భూమిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీతో చేతులు కలిపి ప్రజలపై ఆకృత్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ భవిష్యత్తును దెబ్బ తీసిన వారికి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పి.. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలేవీ అక్రమాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు పంపాలని కోరారు. 40 ఏళ్ల పాటు ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అంశంపై మొద్దునిద్రపోయి.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమను ప్రశ్నిస్తోందని ఎద్దేవా చేశారు. రూ.12,500 కోట్లు వ్యయమయ్యే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ పథకానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తే.. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.6,500 కోట్లను సైనికులకు చెల్లించిందని గుర్తుచేశారు. 3 నెలల పర్యటనల వివరాలు కోరిన మోదీ న్యూఢిల్లీ: గత మూడు నెలల్లో జరిపిన పర్యటనల వివరాలు ఇవ్వాలని సహచర మంత్రుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో సోమవారంలోపు నివేదిక ఇవ్వాలని మంత్రులకు ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, పెద్ద నోట్ల రద్దుపై మంత్రులు ఏ మేరకు ప్రచారం చేశారో తెలుసుకునేందుకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మంత్రులు ఒక వేళ ఎలాంటి పర్యటనలు చేయకుంటే ఢిల్లీలో కార్యాలయానికి హాజరైనట్లు నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దుకు అనుకూలంగా నియోజకవర్గాల్లో మంత్రులు ఏ మేరకు ప్రచారం చేశారో తెలుసుకునేందుకు, క్షేత్రస్థాయి విధుల నిర్వహణసమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని పీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. -
అన్ని రంగాల్లో విఫలం
ప్రభుత్వంపై పార్లమెంటులో విపక్షం దాడి ► నోట్ల రద్దుపై ప్రధాని క్షమాపణకు డిమాండ్ ► విపక్షాలతో గొంతు కలిపిన శివసేన న్యూఢిల్లీ: ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విపక్షం సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దాడి చేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తెలిపే తీర్మానంపై లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగిన చర్చలో నోట్ల రద్దు, సర్జికల్ దాడులు తదితరాలపై కాంగ్రె స్, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర విపక్షాలు విరుచుకుపడ్డాయి. నోట్ల రద్దుతో సాధించాలనుకున్న అవినీతి నిర్మూలన వంటి లక్ష్యాలేవీ నెరవేరలేదని, అవినీతిపరులే లాభపడ్డారని పేర్కొన్నాయి. అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన కూడా వీటితో గొంతు కలిపింది. లోక్‌సభలో విపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే గంటన్నరపాటు ప్రసంగించి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అన్ని వర్గాల ప్రజలను సమస్యల్లోకి నెట్టిన నోట్ల రద్దుపై ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. ఆ సమయంలో ప్రధాని సభలోనే ఉన్నా రు. సభకు హాజరైన కాంగ్రెస్ చీఫ్ సోనియా.. ఖర్గే ప్రసంగిస్తున్నపుడు ఆయనకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ కనిపించారు. ఈ ఆరోపణలు నిరాధారమని ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యాయని, నోట్ల రద్దు నిర్ణయంపై దేశం మొత్తం ప్రధాని వెంట ఉందని మంత్రి మహేశ్ శర్మ అన్నారు. రాజ్యసభలో: నోట్ల రద్దుతో సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రాజ్యసభలో కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ధ్వజమెత్తారు. ప్రణాళికా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. అందుకే మోదీ పీఎం అయ్యారు: ఖర్గే ‘పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారంటే అందుకు కారణం కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడినందువల్లే. రాజ్యాంగాన్ని పరిరక్షించింది మేమే’ అని ఖర్గే పేర్కొన్నారు. తన 60 ఏళ్ల పాలనతో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, అభివృద్ధి అంతా మోదీ హయాంలోనే జరిగిందని బీజేపీ పదేపదే అనడంపై ఆయన స్పందించా రు. ఇందిర ఎమర్జెన్సీని విధిం చారని బీజేపీ సభ్యులు చెప్పగా, సోని యా వెంటనే స్పందిస్తూ.. ‘ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ ఉంది’ అని అన్నారు. -
యూపీలో బీజేపీ వ్యూహం ఇదీ..!
ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ప్రచారపర్వం బాగా వేడెక్కింది. బీజేపీ అగ్రనాయకులంతా ప్రచార రంగంలోకి దూకారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు పెద్దనోట్ల రద్దును ప్రధాన ఆయుధాలుగా ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదం, అవినీతిపై మోదీ ప్రభుత్వం చేసిన పోరాటంగా పెద్ద నోట్ల రద్దును బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనాయకులంతా ఉత్తరప్రదేశ్ మీదే దృష్టిపెట్టారు. సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి సర్జికల్ స్ట్రైక్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయని చెబుతున్నారు. ఈ రెండు అంశాలు ప్రజల్లోకి కూడా బాగానే వెళ్లాయని పరిశీలకులు అంటున్నారు. మీరట్, అలీగఢ్ నియోజకవర్గాల్లో జరిగిన భారీ ర్యాలీలలో ప్రధాని మోదీ, మథుర, అమ్రోహాలలో అమిత్ షా, ఆగ్రాలో రాజ్‌నాథ్ సింగ్ ప్రచారపర్వాన్ని పూర్తిచేశారు. ప్రధాని మోదీ తన ఎన్నికల ర్యాలీలలో పెద్దనోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ అంశాలను ప్రస్తావించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో.. పెద్దనోట్ల రద్దుపై మొదట్లో ఉన్నంత వ్యతిరేకత తర్వాత లేదని.. ఇప్పుడా అంశం ప్రజల్లోకి బాగానే వెళ్లిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా సామాన్యులు దీన్ని బాగా స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అంచనా. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ రెండు అంశాలను గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అయితే సర్జికల్ స్ట్రైక్స్ గురించి చాలా గట్టిగా చెబుతున్నారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరగవని తాము చెప్పలేమని కూడా ఆయన టీవీ ఇంటర్వ్యూలలో అంటున్నారు. గోవాలో ఎన్నికలు ముగిశాయి కాబట్టి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా యూపీ ప్రచారపర్వంలోకి దిగుతారని, బీజేపీ నాయకులు చెబుతున్నారు. మోదీ సభలకు జనం భారీగానే వస్తున్నా, స్థానిక నాయకులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మోదీ సభలను మరీ ఎక్కువగా షెడ్యూలు చేయకుండా ఆపారు. స్థానికంగా ఉండే నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. దానివల్ల ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని పార్టీ మేనేజర్లు అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ప్రతి దశకు సంబంధించి మూడు నాలుగు ర్యాలీలలో మాత్రమే మోదీ పాల్గొంటారు. తొలి దశ ఎన్నికలు ఈనెల 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో త్వరలో ఆగ్రాలో ఒక ర్యాలీ నిర్వహిస్తారు. -
‘యూపీఏ జమానాలో 3 సర్జికల్ దాడులు’
ముంబై: యూపీఏ పాలనా కాలంలో 2009–13 మధ్య మూడు సర్జికల్ దాడులు జరిగాయని కానీ ప్రభుత్వం వాటిని బయటికి రానీయలేదని మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆర్మీ చర్యలతో ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ ప్రభుత్వం ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేస్తోందన్నారు. మహారాష్ట్రలో త్వరలో జరగబోయే 25 జిల్లా పరిషత్ ఎన్నికలకు ఆయన శనివారం ఉస్మానాబాద్ జిల్లాలో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు వల్ల రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. -
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
నోట్లరద్దు ప్రభుత్వ వైఫల్యమన్న ఆజాద్ ► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చ న్యూఢిల్లీ: నల్లధనంపై పోరాటం కోసం కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం పూర్తి వైఫల్యమని, దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని రాజ్యసభలో విపక్షాలు విమర్శించాయి. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి నోట్లరద్దును మెచ్చుకున్నారు. కానీ.. దేశంలో అవినీతి, నల్లధనం, ఉగ్రవాదాన్ని ఆపటంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. మోదీ సర్కారు దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది. 2016 సంవత్సరం ప్రజలకు మానసిక ఒత్తిడిని, మాంద్యాన్ని, వెనుకబాటుతనాన్ని, కుంగుబాటును మిగిల్చింది’ అని విమర్శించారు. నోట్లరద్దు అమలుకోసం 135 సర్క్యులర్లు విడుదల చేసినా.. ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం కలిగించేలా మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ‘నవంబర్ 8న మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేనా రైతు సంక్షేమమంటే?’ అని ఆజాద్ ప్రశ్నించారు. ‘మేం సర్జికల్ దాడులను సమర్థిస్తాం. ప్రభుత్వం మరిన్ని సర్జికల్ దాడులు చేసినా మా మద్దతుంటుంది. కానీ ఈ దాడుల్లో ఎంతమంది పోయారని ప్రశ్నిస్తే మమ్మల్ని దేశద్రోహులంటున్నారు’ అని తెలిపారు. అటు సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు పలు పక్షాలు కూడా నోట్లరద్దు విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అంతకుముందు న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. యూపీఏ అవినీతినుంచి భారత్ రూపాంతరం చెందుతోందన్నారు. -
నోట్ల రద్దు, సర్జికల్ దాడులు భేష్!
-
నోట్ల రద్దు, సర్జికల్ దాడులు భేష్!
అవినీతి, నల్లధనంపై కేంద్రం సాహసోపేత నిర్ణయం ► సంయుక్త పార్లమెంటు భేటీలో రాష్ట్రపతి ప్రశంస ► ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలన్న ప్రణబ్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, సర్జికల్ దాడులతో పాటు పలు ప్రభుత్వ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్హాల్లో ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను, సమాజంలో మార్పుకోసం తెచ్చిన పథకాలను అభినందించారు. ‘దేశం ఎదుర్కొంటున్న అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం వంటి అంశాలపై దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది’ అని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు.. ఉగ్రవాద చొరబాట్లపై సర్జికల్‌దాడులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. దీన్ని విజయవంతంగా అమలుచేసిన సైన్యం ధైర్య సాహసాలను ప్రణబ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ► లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకమేర్పడుతుంది. దీంతోపాటు అత్యవసర సేవలకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలనే అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్టీలకు నిధులివ్వటం ద్వారా ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకూ ఆస్కారం ఉంటుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ► నాలుగు దశాబ్దాలుగా భారత్‌కు సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరులో భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. భారత్‌లో విధ్వంసానికి ప్రయత్నించిన చొరబాటుదారులకు సరైన సమాధానమిచ్చేలా వారి స్థావరాలపై సెప్టెంబర్ 29న భారత ఆర్మీ సర్జికల్‌దాడులు చేపట్టింది. ఈ దాడులను విజయవంతంగా పూర్తిచేయటంలో భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలు అభినందనీయం. ► బలమైన భారత స్థూల ఆర్థిక విధానాల వల్ల సుస్థిర అభివృద్ధికి వేదిక ఏర్పడింది. దీనివల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఓ వెలుగుదివ్వెలా మారింది. ఈ దిశగా నల్ల ధనాన్ని, పన్ను ఎగవేతను అరికట్టేందుకు తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం భేష్. కేంద్రం నిర్ణయాల కారణంగా 2014 నుంచి ద్రవ్బోల్బణం రేటు, చెల్లింపులు, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు వంటివి మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ► డిసెంబర్ 30న ప్రధాని ప్రారంభించిన భీమ్ యాప్ చాలా ప్రాచుర్యం (జనవరి 15 వరకు 1.1 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు) పొందింది. త్వరలో ఆవిష్కరించనున్న ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ చెల్లింపు వ్యవస్థ దేశంలో సాంకేతిక విప్లవానికి బాటలు వేయనుంది. ► యువతే మన దేశానికి బలం. ఈ యువత నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా 50 భారత–అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలను కేంద్రం ప్రారంభించింది. కేంద్రం రూ.6 వేల కోట్లతో చేపట్టిన పథకాల వల్ల 1.1 కోట్ల ఉద్యోగాల కల్పన జరగనుంది. ► భవిష్యత్ భారతం కోసం అత్యాధునిక మౌలికవసతుల కల్పన ప్రభుత్వ ధ్యేయం. సాగరమాల, గ్రామీణ భారతంలో వెలుగులు తీసుకురావటం, స్మార్ట్ సిటీలు, హైవేలు, రైల్వేలు, గ్యాస్ పైప్లైన్లు, ఐ–వేల (కంప్యూటర్ అనుసంధానం) వంటి పలు అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి. మావోయిస్టులప్రభావం ఉన్న 44 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకోసం 5వేల కి.మీ. రోడ్లు వేస్తున్నారు. మౌలికవసతుల కల్పన కోసం ఇప్పటికే రూ. లక్షకోట్ల విలువైన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ►దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే యత్నంలో ఈశాన్య రాష్ట్రాలను కేంద్రం ‘అష్టలక్ష్మి’గా భావిస్తోంది. ఆగ్నేయాసియాతో భారత్‌ను కలిపే ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలోనే కేంద్ర మాజీ మంత్రి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఎంపీ ఈ.అహ్మద్ (78) గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహి యా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పార్లమెంట్ సైడ్‌లైన్స్ ⇒ రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగంలో పెద్ద నోట్లరద్దు, సర్జికల్ దాడులను ప్రస్తావించినప్పుడు అధికార ఎన్డీఏ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేయగా, విపక్ష సభ్యులు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ⇒ గతంలో ఉమ్మడి సమావేశాలకు పార్లమెంట్ సెంట్రల్‌హాల్ నిండి, అదనపు కుర్చీలు వినియోగించేవారు. చాలా మంది ఎంపీలు నిలబడి రాష్ట్రపతి ప్రసంగాన్ని వినేవారు. మంగళవారం మాత్రం అనేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ⇒ ఈసారి సభ్యుల హాజరు కూడా తక్కువగా నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సమావేశాలకు హాజరుకాలేదు. ⇒ గంట సేపు రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సమయంలో పలువురు ఎంపీలు తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. ⇒మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడలు బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో కలసి మొదటి వరుసలో కూర్చున్నారు. ⇒ రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులు సభ నుంచి వెళ్తుంటే రాహుల్ గాంధీ మాత్రం మల్లికార్జున ఖర్గే, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్లువాలియాతో సంభాషిస్తూ కనిపించారు. -
పది పాక్ తలలు నరికి బదులివ్వాలన్నారుగా..
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ దాడిని త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమర వీరులైన సైనికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. హేమ్ రాజ్ కుటుంబంతో సహా సర్జికల్ దాడిని నిలదీస్తున్నాయి. ఓట్ల కోసం సర్జికల్ దాడుల వంటివి ఉపయోగించరాదని హేమ్ రాజ్ కుటుంబం పేర్కొంది. 2013 జనవరిలో పాక్ ఉగ్రవాదులు సైనికుడు అయినటువంటి హేమ్రాజ్ తలను నరికేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురా జిల్లాలో శేర్‌నగర్ హేమ్రాజ్ గ్రామం. అతడి తల్లి తాజాగా స్పందిస్తూ ‘సర్జికల్ దాడులు జరిగినట్లు ఎక్కడ ఆధారాలు? హేమ్ రాజ్ తల నరికిన చంపిన వ్యక్తిని చంపేశామని భారత సైన్యం చెప్పుకుంది. కానీ అది ప్రభుత్వం వర్షన్మాత్రమే. హేమ్ రాజ్కోసం ఇది అసలు బదులు తీర్చుకోవడమే కాదు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి భారతీయ సైనికుడికి ఒక్కో పాకిస్థానీ తలను ఇలా మొత్తం పది తలలతో బదులు తీర్చుకోవాలని సుష్మా స్వరాజ్ తెలిపారు. మధురలో శేర్‌నగర్ ప్రాంతానికి చెందిన సైనికుడు బబ్ల్యూ సింగ్ అనే వీర సైనికుడి భార్య కూడా ఘటుగా స్పందించారు. అసలు సర్జికల్ దాడులు ఎక్కడ జరిపిందని, ప్రభుత్వం మాత్రం వారంతా చనిపోయారని చెప్పిందని.. నిజంగా సర్జికల్ దాడులు జరిగాక కూడా వారు మళ్లీ ఎందుకు దాడులు చేస్తూనే ఉన్నారని ఆమె ప్రశ్నించింది. ఇలా చాలా మంది సర్జికల్ దాడులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
నోట్లరద్దే మన ప్రచారాస్త్రం!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా ► సర్జికల్ దాడులు, నోట్లరద్దు చారిత్రక నిర్ణయాలని ప్రశంస ► ఐదు రాష్ట్రాల్లో విజయం సాధిస్తామంటూ ధీమా సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోట్లరద్దే ప్రధాన ప్రచారాస్త్రమని.. దీని వల్ల జరిగే మేలును సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. కోజికోడ్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ భేటీ తర్వాత మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన, చరిత్రాత్మక నిర్ణయాలు చేపట్టిందని చెప్పారు. పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలకు ప్రజలు, ప్రత్యేకించి పేదలు మద్దతు పలికారన్నారు. ఇవే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్రా్తలన్నారు. నోట్ల రద్దు వల్ల పన్నుకట్టేవారి సంఖ్య పెరగటంతో.. ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరిగి.. పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. ఇదే విషయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తే మరోసారి భారత్ భారీ చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ కార్యవర్గ సమావేశం వివరాలను కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కొద్దిరోజులపాటు ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సహనంగా మద్దతు తెలిపారని.. దీని వల్ల దేశవ్యాప్తంగా నగదురహిత లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు. వారం రోజుల క్రితం ప్రధాని విడుదల చేసిన ‘భీమ్’ యాప్‌ను 70 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. 5 రాష్ట్రాలలో ఎన్నికలను అమిత్ షా ప్రస్తావిస్తూ పార్టీకి కార్యకర్తలు, నాయకులే బలమని.. ఈ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏ మార్పుకోసమైతే మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు ప్రజలు మద్దతిచ్చారో.. ఆ మార్పును గమనిస్తున్నందున రాష్ట్రాల్లోనూ బీజేపీకి పట్టంగడతారన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం, పార్టీలకు అందే నిధులపై పారదర్శకతపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగాల్సిన ఆవశ్యతపై సమావేశంలో చర్చించినట్లు జవదేకర్ వెల్లడించారు. మమతది రాజకీయ అసహనం విపక్షాలు.. ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న రాజకీయ తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొని ప్రజాస్వామ్య సంస్థలపై గౌరవాన్ని మంటగలిపాయని తీర్మానంలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వ దుష్పరిపాలనలో రాజకీయ కార్యకలాపాలు దుర్భరమయ్యాయని, బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడులతో అధికార పార్టీ ప్రదర్శిస్తున్న రాజకీయ అసహనం స్పష్టమైందని, పశ్చిమ బెంగాల్, కేరళల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని తీర్మానంలో ప్రస్తావించారు. కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో మత, రాజకీయ హింసతో నష్టపోయిన ప్రజలకు కార్యవర్గం సానుభూతి ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో పార్టీ అధికారాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఏర్పడిందని, 5 రాష్ట్రాలలో తీర్పు బీజేపీ అనుకూలంగా సాధించేందుకు కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చింది. -
పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్: ఆర్మీ చీఫ్
- టెర్రరిస్టు స్థావరాలపై దాడి ‘మన హక్కు’ - ఏక్షణంలోనైనా మెరుపు దాడికి సిద్ధమన్న జనరల్ బిపిన్ రావత్ న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్లపై మెరుపుదాడి చేసిన విధంగా మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పారు. భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించే ఉగ్రవాదుల పీచమణచడం ‘మన హక్కు’ అని ఆయన పునరుద్ఘాటించారు. తద్వారా ఉగ్రవాద సంస్థలకు, వారికి సహకరిస్తోన్న పాకిస్థాన్ సైన్యానికి పరోక్ష హెచ్చరికలు చేశారు. అవసరంమైన క్షణంలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి వెలసిన ఉగ్రస్థావరాలపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగుతామని మంగళవారం రాత్రి ఓ జాతీయ చానెల్‌కు ఇంటర్వ్యూలో ఆర్మీచీఫ్ వెల్లడించారు. (పీఓకేలో భారత కమాండోల మెరుపు దాడి) సెప్టెంరబ్ 29నాటి సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహకర్తల్లో ఒకరైన రావత్.. ఆర్మీ డిప్యూటీ చీఫ్ హోదాలో నాటి దాడుల ఆపరేషన్‌ను స్వయంగా పరిశీలించారు. పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా నిర్వహించిన తొలి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన పలు విషయాలనూ జనరల్ రావత్ వెల్లడించారు. ‘పాక్ సైన్యం నుంచి శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి సిద్దంగా ఉన్న ఏడు లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేశాం. ఇందుకోసం బృహత్ప్రణాళిక రచించించి పకడ్బందీగా అమలుచేశాం. మన సైనికుల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూనే భీకర దాడులు చేపట్టాం. అది రియల్‌టైమ్ ఆపరేషన్ కాబట్టి బేస్ క్యాంపుల నుంచి ఆదేశాల జారీ కూడా అంతే త్వరగా జారీ అయ్యాయి. ఎల్వోసీ నుంచి 2కిలోమీటర్ల దూరంలోని స్థావరాలపై దాడులుచేసి మనవాళ్లు సూర్యోదయానికల్లా తిరిగి వచ్చేశారు. ఆపరేషన్ మొత్తాన్ని డ్రోన్ కెమెరాలతో రికార్డుచేశాం’ అని ఆర్మీ చీఫ్ వివరించారు. భారత సైన్యానికి 29వ చీఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ గత వారమే బాధ్యతలు చేపట్టడం, సీనియర్లను పక్కనపెట్టి పెద్ద పోస్టుకు రావత్‌ను ఎంపిక చేయడంపై వివాదం చెలరేగడం తెలిసిందే. (చదవండి: ఆర్మీ చీఫ్ నియామకంపై వివాదం) దీనిపై విలేకరి అడిగిన ప్రశ్నకు, ‘ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యక్తిగా నేనైనా, మరొకరైనా ప్రభావితం చేయలేరు. ఒకవేళ అలా జరిగితే ఎవరికివారు కోరుకున్న పదవులు దక్కించుకుంటారు కదా!’అని జనరల్ రావత్ బదులిచ్చారు. ఆర్మీ చీఫ్ పదవికి చేపట్టేందుకు అర్హులై ఉండి కూడా రావత్ నియామకంతో ఆ అవకాశాన్ని కోల్పోయిన ఇద్దరు సీనియర్ అధికారులను (లెఫ్టినెంట్ జనరల్ ప్రవీన్ బక్షి(ఈస్ట్రన్ కమాండ్ చీఫ్), లెఫ్టినెంట్ జనరల్ పి.ఎం. హరీజ్(సదరన్ కమాండ్ చీఫ్)) ఉద్దేశంచి మాట్లాడుతూ.. ‘మేమంతా కలిసే ఎదిగాం. ఒకే కంచం, ఒకే మంచం అన్న చందంగా వారితో నాకు స్నేహం ఉంది. వారిద్దరూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోగలరు’అని జనరల్ రావత్ పేర్కొన్నారు. -
సంచలన ప్రకటనలతో మోదీ దూసుకుపోయారు
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలిచింది ఎవరూ అంటే? ప్రధాని నరేంద్రమోదీనేనట. ఉగ్రవాదంపై పోరుకు నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పటి నుంచి దేశ ప్రజలందరిన్నీ ఆశ్చర్యపరుస్తూ పెద్ద నోట్ల రద్దు చేయడం వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సంచలనాలే. ఈ సంచలన ప్రకటనలతో 2016లో ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో ప్రధాని మోదీనే నిలిచారని వెల్లడైంది. డీమోనిటైజేషన్: బ్లాక్‌మనీపై సర్జికల్ స్టైక్ చేస్తూ నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాలతో వార్తల్లో హెడ్‌లైన్స్‌గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఎక్కువగా నిలిచాయి. ఒక్క పత్రికలు, టెలివిజన్లకే పరిమితం కాకుండా, ప్రధాని మోదీ నిర్ణయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ నిర్ణయాలతో త్వరలో జరుగబోతున్న కీలకమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీకి సవాల్‌గా మారనున్నాయట. సర్జికల్ స్ట్రైక్ : నియంత్రణ రేఖ దాటి పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ జరిపిన నిర్దేశిత దాడి(సర్జికల్ స్ట్రైక్) ఒక్కసారిగా సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధవాతావరణమే నెలకొనే పరిస్థితి వచ్చింది. ఉడి ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆర్మీ ఈ నిర్దేశిత దాడులు చేసింది. ఈ దాడుల్లో 30 నుంచి 40 ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. సెప్టెంబర్ 29న ప్రెస్‌కు ఈ విషయాన్ని వెల్లడించేంత వరకు ఈ విషయం గురించి, ఇటు మన దేశానికి కాని అటు పాకిస్తాన్‌కు తెలియనే లేదు. దాడులు జరిపిన తర్వాత రోజు ఉదయం భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. సర్జికల్ స్ట్రైక్, డీమోనిటైజేషన్ అనంతరం 2016లో మేజర్ ఈవెంట్లగా నిలిచిన మరికొన్ని అంశాలు: 19వ ఇస్లామాబాద్ సార్క్ కాన్ఫరెన్స్: టెర్రరిజానికి మద్దతిస్తుందనే కారణంతో ఇస్లామాబాద్‌లో నిర్వహించే 19వ సార్క్ సమావేశాలను భారత్ బాయ్ కాట్ చేసింది. భారత్ నిర్ణయానికి మద్దతుగా బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గానిస్తాన్లు నిలిచాయి. ఆ దేశాలు కూడా ఆ సమావేశాన్ని బాయ్ కాట్ చేశాయి. అమెరికా ఎన్నికల డిబేట్స్ : 2016లో జరిగిన మరో అత్యంత కీలకమైన ఈవెంట్ అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అనూహ్య భరితంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయ కెరటం ఎగురవేశారు. ప్రత్యర్థుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, ప్రత్యారోపణలతో ఈ ఎన్నికల ప్రక్రియ ఘట్టం ముగిసింది. ఏడాది కాలంగా సాగిన ఈ ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని సర్వేలే అంచనావేయలేదు. సర్వేలన్నీ హిల్లరీ క్లింటన్ నామ స్మరణం చేశాయి. కానీ హిల్లరీకి షాకిస్తూ ట్రంప్ విజయం సాధించారు. సమాజ్‌వాద్ పార్టీలో రచ్చ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మొదటి ఫ్యామిలీగా ఉన్న సమాజ్‌వాద్ పార్టీ ఇంట రాజకీయ సంక్షోభం నెలకొనడం 2016లో ఓ మేజర్ ఈవెంట్. అబ్బాయి, సీఎం అభిలేష్ యాదవ్, బాబాయి శివ్‌పాల్ యాదవ్‌లకు మధ్య చెలరేగిన ఈ చిచ్చు ఇప్పటికీ ఆరనే లేదు. పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ వారిద్దరి మధ్య గొడవను సర్దుమణిగేలా చేసినా.. సీట్ల పంపకం విషయంలో మళ్లీ భగ్గుమంటోంది. రతన్ టాటా వర్సస్ సైరస్ మిస్త్రీ.... 24 అక్టోబర్న దేశీయ కార్పొరేట్ చరిత్రలో అనుకోని ఓ సంఘటన జరిగింది. టాటా గ్రూప్ చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తొలగిస్తున్నట్టు బోర్డు నిర్ణయించింది. బోర్డు రూంలో నెలకొన్న ఈ వివాదం కోర్టుల దాకా వెళ్లింది. ఆ తర్వాత గ్రూప్ కంపెనీలన్నింటి నుంచి మిస్త్రీని బయటికి గెంటేయడం, మిస్త్రీకి మద్దతుగా నిలిచిన నస్లీ వాడియాకు టాటా చెప్పడం వెనువెంటనే జరిగిపోయాయి. కానీ ఈ వివాదం కార్పొరేట్ చరిత్రనే కుదిపేసింది. ఎంతో ప్రతిష్ట కల్గిన టాటా గ్రూప్ ప్రతిష్టను వీధికీడ్చింది. కావేరి జలాల వివాదం: వందేళ్లకు పైగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం మళ్లీ భగ్గుమంది. తమిళనాడుకి కావేరి నదీ జలాలను విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలతో కర్ణాటక రైతులు నిరసనలు ప్రారంభించారు. అనంతరం ఇరు రాష్ట్రాలు నిరసనలతో అట్టుడికిపోయాయి. శాంసంగ్ నోట్ 7 సంక్షోభం: ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నోట్ 7 శాంసంగ్‌ను నష్టాల్లో ముంచెత్తింది. అనుకోకుండా ఈ ఫోన్లు పేలడం ప్రారంభించాయి. పేలుళ్ల ప్రభావిత ఫోన్లను రీప్లేస్ చేసినప్పటికీ, ఈ ఘటనలు మాత్రం ఆగలేదు. దీంతో ఎంతో కాలంగా మంచి పేరును సంపాదించిన శాంసంగ్, ఇరక్కాటంలో పడింది. ఇదే ఆపిల్ ఐఫోన్7కు అవకాశంగా మారింది. స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఫోన్ల రీకాలే అతిపెద్ద రీకాల్. -
అంతిమ లక్ష్యం పాకిస్తాన్‌పై యుద్ధమేనా?
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల ప్రధానాధికారి (ఆర్మీచీఫ్)గా లెఫ్ట్‌నెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను నియమించడం వెనక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంతర్యం ఏమిటీ? ఆయనకన్నా ఇద్దరు సీనియర్ అధికారులను కాదని ఆయన్నే ఎందుకు ఎంపిక చేశారు? ఆర్మీ చీఫ్ నియామకాల్లో అనాదిగా వస్తున్న భారత సంప్రదాయాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది? ఇప్పుడు ఇటు సైనిక వర్గాలను, అటు రాజకీయ వర్గాలను ప్రధానంగా తొలుస్తున్న ప్రశ్నలివి. డిసెంబర్ 31వ తేదీన ప్రస్తుత ఆర్మీచీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రవీణ్ భక్షీ లాంటి సీనియర్ అధికారులను కాదని బిపిన్ రావత్‌ను నియమించాలని మోదీ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం నిర్ణయించడం తెల్సిందే. దీనిపై సైనిక వర్గాలు, కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. సీనియరీటీనే ప్రాతిపదికగా తీసుకొని ఆర్మీచీఫ్లను నియమిస్తున్న 33 ఏళ్లలో సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడం ఇది రెండోసారి మాత్రమే. మొదటిసారి ఎప్పుడు? 1983లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సైన్యంలో సీనియర్ అధికారి అయిన లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్కే సిన్హాను కాదని, ఏఎస్. వైద్యను నియమించింది. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి దేశంలో రెండోసారి సంప్రదాయాన్ని ఉల్లంఘించింది. కొత్త ఆర్మీ చీఫ్‌గా రావత్‌ను ఎంపిక చేయడంలో ప్రధాని మోదీతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముఖ్యపాత్ర పోషించారు. అందరి దృష్టిని ఆకర్షించిన రావత్... ఒకనాడు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణాయాన్ని తన పార్టీయే తప్పు పట్టిన విషయం తెల్సికూడా మోదీ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారు. దీనికి జవాబు తెలసుకోవాలంటే కొంత వెనక్కి వెళ్లాలి. పాకిస్తాన్ భూభాగంలోకి సెప్టెంబర్ 29వ తేదీన భారత ప్రత్యేక సైనిక దళాలు దూసుకెళ్లి టెర్రరిస్టు శిబిరాలపై సర్జికల్ దాడులు జరపడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న రోజులవి. నవంబర్ నెలలో నేషనల్ డిఫెన్స్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి బిపిన్ రావత్ హాజరయ్యారు. ఆ రోజు సైనిక సీనియర్ అధికారుల కోసం ఏర్పాటు చేసిన విందులో అందరి దృష్టి రావత్‌పై పడింది. సర్జికల్ దాడులను తీవ్రంగా సమర్థించిన ఆయన జరిగిన తీరుపట్ల కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న టెర్రరిస్టుల నిర్మూలనకు ఇంతకన్నా తీవ్రమైన దాడులు చేయాలని, పాకిస్తాన్‌లోని అబాటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైనికులు హతమార్చిన స్థాయిలో పాక్ భూభాగంపై భారత్ సైనిక దళాలు దాడులు జరపాలంటూ ఆయన గట్టిగా వాదించారు. టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలించే వరకు ఇలాంటి దాడులను కొనసాగించాల్సిందేనని కూడా చెప్పారు. అజిత్ దోవల్‌తో దోస్తీ ఎలా? గతేడాది జూన్ నెలలో మైన్మార్ భూభాగంలోకి చొచ్చుకుపోయి నాగా తిరుగుబాటుదారులను హతమార్చిన ప్రత్యేక దళాలకు కమాండర్‌గా వ్యవహరించడం ద్వారా రావత్ ప్రముఖంగా వార్తల్లోకి వచ్చారు. మణిపూర్‌లోని దోగ్ర సైనిక పటాలంపై నాగా తీవ్రవాదులు దాడి జరిపి 18 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకోవడంతో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక దళాల ప్రతీకార దాడి జరిగింది. ఆ సంఘటన ద్వారా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు రావత్ వ్యక్తిగతంగా దగ్గరయ్యారు. సర్జికల్ దాడులపై చేసిన వ్యాఖ్యల ద్వారా మరింత ఆకర్షించారు. అనుభవం కూడా ముఖ్యమనే.... గడచిన మూడు దశాబ్దాలలో చైనా, పాక్ సరిహద్దుల్లో సైనిక ఆపరేషన్లు నిర్వహించడంలో అపార అనుభవం కలిగిన రావత్‌కు తిరుగుబాటు దారులను, టెర్రరిస్టులను సమర్థంగా ఎదుర్కోవడంలోనూ అనుభవం ఉంది. సైనిక ఆపరేషన్లలో దూకుడు స్వభావం ప్రదర్శించే రావత్ ప్రజా, రాజకీయ సంబంధాల్లో సమన్వయం, సమతౌల్యం పాటిస్తారన్న పేరుంది. కాంగోలోని ఐక్యరాజ్యసమితి సైనిక దళాల్లో కమాండెంట్‌గా పనిచేసిన రావత్ తన దూకుడు స్వభావాన్ని 2008లో లండన్ నుంచి వెలువడుతున్న టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన నియమనిబంధనలు లోబడి సైనిక ఆపరేషన్లు నిర్వహించాల్సి రావడం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. కొన్ని లక్ష్యాలను సాధించాలంటే కొన్ని సంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. అసలు కారణం ఏమిటంటే.... పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రావత్ దూకుడు స్వభావం నచ్చిందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లయితే టెర్రరిస్టుల ఏరివేత లక్ష్యంతో పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరిన్ని సర్జికల్ దాడులు జరపాలన్నది మోదీ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ఆ వర్గాలు అంటున్నాయి. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడానికి పాక్‌ను బూచిగా చూపించి, అవసరమైతే యుద్ధం కూడా చేయాలన్నది మోదీ అభిమతమని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. --- (సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం) -
ఇంకెంత మంది సైనికులు మరణించాలి?
న్యూఢిల్లీ: ‘దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో టెర్రరిస్టులకు, మిలిటెంట్లకు నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మన దేశ సరిహద్దులన్నీ పూర్తిగా సురక్షితం’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నవంబర్ 27వ తేదీ నాడు వ్యాఖ్యానించారు. ‘ఒక్కసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు కూడా భారత్‌లోకి అడుగు పెట్టేందుకు సాహసించరు’ అని 2014, ఏప్రిల్ నెలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ భూభాగంలోకి మన సైనికులు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు సూపర్‌గా చేశారని ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కిందిస్థాయి నుంచి పైస్థాయి నాయకత్వం వరకు చంకలు గుద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ నేడు నిజమే అయితే మంగళవారం నాడు జమ్మూకు సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రోటాలోని భద్రతా బలగాల స్థావరంపై సరిహద్దులు దాటి వచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు? సర్జికల్ దాడులతోపాటు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేవలం ప్రచార అస్త్రాలుగానే మిగిలిపోతున్నాయా? నగ్రోటాలో భద్రతా బలగాల స్థావరంపై సైనిక దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఒక్క నెలలోనే 11 మంది మరణించగా, గడిచిన మూడు నెలల్లో టెర్రరిస్టుల దాడులకు 40 మంది సైనికులు మరణించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌తో మొదలైన ఈ దాడులు పఠాన్‌కోట్, ఊడికి విస్తరించి, ఇప్పుడు నగ్రోటాకు పాకాయి. ఈ అన్ని దాడులు సూచిస్తున్న ఓ కామన్ పాయింట్నన్నా కేంద్ర ప్రభుత్వం పట్టుకుందా? అదే సైనికులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు దాడులను నిర్వహించడం. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.... నగ్రోటాలోని 16వ పటాలానికి కమాండింగ్ జనరల్ ఆఫీసర్‌గా గత అక్టోబర్ నెలలోనే బాధ్యతలు స్వీకరించిన లెఫ్ట్‌నెంట్ జనరల్ ఏకే శర్మకు వారం రోజుల క్రితమే పటాలంపై పెద్ద దాడి జరగబోతోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందట. వాస్తవానికి రెండో సిక్కు రిజిమెంట్ బెటాలియన్‌కు చెందిన శర్మకు తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అపారమైన అనుభవం ఉందట. అందుకనే ఈకొత్త విధులు అప్పగించారట. అయినా ఆయన తనకందిన సమాచారం ప్రకారం తన కిందిస్థాయి అధికారులందరికి అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారట. అయినా అన్ని చోట్ల లోపాలు.... నగ్రోట స్థావరంలోకి వచ్చిన తమిళ పటాలంకు అసలు ఆయుధాలే ఇవ్వలేదట. భోజన శాలకు సమీపంలో టెంటుల్లో పడుకున్న సైనికుల వద్ద ఎదురు కాల్పులు జరపడానికి ఆయుధాలే లేవట. ఎదురుకాల్పుల్లో చనిపోయింది ముగ్గురు ఉగ్రవాదులని, మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకుపోయారని కొందరు అధికారులు చెబుతుండగా, మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు చనిపోయారని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఎందుకీ సమన్వయ లోపం, లోపాలకు ఎవరు బాధ్యలు? పక్కా ప్రణాళిక ఎప్పుడు? పఠాన్‌కోట్ నుంచి ఊడి వరకు టెర్రరిస్టులు దాడులు జరిపినా, 40 మంది వీరులు మరణించినా పాలకులు ఎందుకు మేల్కోవడం లేదు? ఇలాంటి దాడులు పునరావతం కాకుండా పక్కా ప్రణాళికను ఎందుకు రచించడం లేదు ? సైన్యానికి, ప్రభుత్వానికే కాకుండా, ప్రభుత్వం పెద్దల మధ్యనే సమన్వయలోపం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పఠాన్‌కోట్ దాడిలో ఆరుగురు టెర్రరిస్టులు మరణించారని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించగా, ప్రభుత్వం నలుగురే దాడి చేశారని, ఆ నలుగురు మరణించారని నవంబర్ 29న పార్లమెంట్లో ప్రకటించింది. పాలకులు కేవలం ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, చిత్తశుద్ధితో పక్కావ్యూహంతో ముందుకు వెళ్లనంతా కాలం మన సైనిక వీరులు అన్యాయంగా మరణిస్తూనే ఉంటారు. పాలకులు నివాళులర్పించడం మినహా చేయగలిగిందీ ఏమీ ఉండదు. -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
సర్జికల్ స్ట్రైక్స్ చేసినా.. వారు తగ్గడం లేదు!
ఉడి ఉగ్రఘటన అనంతరం తీవ్రవాదులను ఏరివేయడానికి నియంత్రణ రేఖ వెంబడి పాక్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ ఈ దాడులు చేసినప్పటికీ తీవ్రవాదులు భయపడటం లేదని మాజీ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. తీవ్రవాదులను అణచివేయడానికి భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ విఫలమైనట్టు ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగ, నగ్రోటాలో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ఒక మేజర్ సహా ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై మండిపడ్డారు. ''తీవ్రవాదుల బుల్లెట్లకు మన ఏడుగురు వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌పై కేంద్రం అవలంభించే విధానాన్ని కచ్చితంగా వివరించాల్సినవసరం ఉంది'' అని ఒమ్మర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటికీ, తీవ్రవాదులు తగ్గడం లేదని, మన జవాన్లను బలిగొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేయలేకపోయారని బీజేపీపై ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నగ్రోటా ఉగ్రదాడిలో చనిపోయిన ఆఫీసర్, జవాన్ల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు
భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ షాక్ నుంచి పాకిస్థాన్ ఇంతవరకు కోలుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు మన సైనికులకు బలం ఉన్నా దాన్ని ప్రదర్శించలేకపోయేవారని.. కానీ పాకిస్థాన్ మన సైనికుల ప్రతాపం చూసిందని ఆయన అన్నారు. పంజాబ్‌లోని భటిండాలో ఎయిమ్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియంత్రణ రేఖ వెంబడి 250 కిలోమీటర్ల పొడవున మన సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ షాక్ నుంచి ఆ దేశం ఇంకా కోలుకోలేదన్నారు. పెషావర్‌లో ఉగ్రవాదులు ఒక పాఠశాలపై దాడి చేసి, అక్కడి పిల్లలను హతమారిస్తే భారతదేశంలోని 125 కోట్ల మంది పౌరులు శ్రద్ధాంజలి ఘటించారని, ప్రతి భారతీయుడు కూడా పాకిస్థానీల బాధను తమ బాధగా భావించారని చెప్పారు. పాక్ ప్రజలు తమ పాలకులను భారతదేశంపై పోరాటం ఆపి.. నల్లధనంపైన, అవినీతిపైన పోరాడాల్సిందిగా చెప్పాలని సూచించారు. పాకిస్థానీ ప్రజలు కూడా పేదరికం నుంచి విముక్తి కోరుకుంటున్నారని, కానీ అక్కడి రాజకీయ నాయకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అక్కడ అలాంటి పరిస్థితిని కల్పించారని అన్నారు.