సాక్షి, లక్నో: కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నపాకిస్తాన్‌పై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పదేపదే పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది.. వీటికి భారత్ దీటుగానే బదులిస్తుంది.. అంతేకాక సర్జికల్ స్ట్రయిక్స్ మళ్లీమళ్లీ చేస్తామంటూ పాకిస్తాన్‌ను యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇదిలావుండగా.. బుధవారం నాడు భారత భద్రతా బలగాలు.. నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
కొంతకాలంగా నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది భారత భద్రతాబలగాలు.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. దాదాపు ఐదున్నర గంటల పాటు భద్రతాబలగాలు సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment