లక్ష్మీపూర్/ఖేరి : ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హహీజ్ సయీద్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్భంధం నుంచి విడుదల చేయడంతో ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ గ్రామంలో కొందరు వేడులు నిర్వహించుకున్నారు. హహీజ్ సయీద్ విడుదలపై ఉత్తర్ ప్రదేశ్‌లో వేడుకలు నిర్వహించడం దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదంగా మారింది. శివపురి ప్రాంతంలోని బేగంబాగ్ కాలనీలో కొందరు హఫీజ్ సయీద్ విడుదల అనంతరం.. ‘హఫీజ్ సయీద్ జిందాబాద్’... ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ.. ఆకుపచ్చ జెండాలను ఎగురవేశారు. అత్యంత వివాదాస్పదమైన ఈ ఘటన కలెక్టర్ అక్షద్వీప్ దృష్టికి రావడంతో.. పూర్తి ఆధారాలతో విచారణ నిర్వహించాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
శుక్రవారం ప్రార్థనల అనంతరం హఫీజ్ సయీద్‌కు అనుకూలంగా 20-25 మంది యువకులు నినాదాలు చేసినట్లు కత్వాలి పోలీసులకు మొదటి సమాచారం అందింది. అయితే ఈ ఘటన తీవ్రతను మొదట అధికారులు గుర్తించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ అక్షద్వీప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పలు ఇళ్లపై ఎగరేసిన ఆకుపచ్చ జెండాలను అధికారులు తొలగించారు.
హఫీజ్ సయాద్, పాకిస్తాన్‌కు అనుకూలంగా చేసిన నినాదాలు, వేడుకులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లభించిందని.. పోలీసులు ప్రకటించారు. యువకులు చేసిన నినాదాలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై లక్ష్మీపూర్ ఇమామ్ అష్పాఖ్ ఖాద్రీ మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్ విడుదలపై వేడుకలు చేసుకోలేదని చెప్పారు. హహీజ్‌కు అనుకూలంగా నినాదాలు ఎవరూ చేయలేదని కూడా ఆయన ప్రకటించారు. తామంతా జులూస్ ఏ మహమ్మదీ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment