మోదీజీ.. మా విముక్తి కోసం...సర్జికల్ స్ట్రైక్స్ చేయండి! | kolkata students meet narendra modhi on 20thnov for World Children's Day | Sakshi
Sakshi News home page

మోదీజీ.. మా విముక్తి కోసం...సర్జికల్ స్ట్రైక్స్ చేయండి!

Published Thu, Nov 17 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

మోదీజీ.. మా విముక్తి కోసం...సర్జికల్ స్ట్రైక్స్ చేయండి!

మోదీజీ.. మా విముక్తి కోసం...సర్జికల్ స్ట్రైక్స్ చేయండి!

ప్రధానిని కోరనున్న బాలలు
కోల్‌కతా: ఉగ్రవాదుల పనిపట్టేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్‌తో జాతి గర్వపడేలా చేసిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత నల్ల కుబేరుల ఆటకట్టించేందుకు పెద్దనోట్లను రద్దు చేసి మరోసారి ప్రశంసలందుకున్నారు. దీంతో తమ గోడును ఏకంగా ప్రధానికే వినిపించాలని, అదే తరహా సర్జికల్ స్ట్రైక్స్‌తో తమకు విముక్తి కల్పించాలని కోరుతూ బాలలు మోదీని కలవనున్నారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీన కొంతమంది పిల్లలు ప్రధానిని కలుస్తారని, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూళన కోసం సర్జికల్ స్ట్రైక్స్ జరపాలంటూ కోరతారని వైశాక్షి విశ్వాస్ తెలిపారు.

బాల్యవివాహాల వల్ల ఎంతోమంది పిల్లలు పదోతరగతి కూడా పూర్తి కాకుండానే బడి మానేస్తున్నారని, బాలకార్మికులుగా ఎంతోమంది పిల్లల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘చైల్డ్ చాంపియన్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న ఆమె ఈ ఆదివారం పిల్లలతో కలిసి ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement