World Childrens Day
-
చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి: సీఎం జగన్
-
చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: నేడు బాలల దినోత్సవం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2022 -
బాలలు భళా.. తమదైన మార్క్‌తో సత్తా చాటారు..
ర్యాంకుల కోసం పరుగెత్తడం. ఒకరితో ఒకరు పోటీ పడటమే చదువుల లక్ష్యంగా మారిన ప్రస్తుత తరుణంలో ఎంతోమంది చిన్నారులు చదువుతో పాటు నచ్చిన రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. వైవిధ్యంగా, విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సినిమాలు, సంగీతం, ఆటలు.. ఇలా ఏ రంగమైనా సరే సృజనాత్మకతను సమున్నతంగా ఆవిష్కరిస్తున్నారు. వీరి సృజనకు తల్లిదండ్రులు పట్టం కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో వైవిధ్యాన్ని, సృజనాత్మకతను చాటుతున్న నగరంలోని కొందరు చిన్నారులపై కథనం.. నటన అద్భుతం.. ‘అక్షర’ సంగీతం.. ఆటమిక్ ఎనర్జీ సైంటిస్ట్ చంద్రశేఖర్, ఆశాలత దంపతుల రెండో కూతురు అక్షర. రాజన్న, బాహుబలి వంటి చిత్రాల్లో తన అద్భుత గాత్రంతో అలరించిన అమృతవర్షిణి చెల్లెలు. ఇప్పుడు బేగంపేట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది అక్షర. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ మేటి బాల నటిగా ప్రశంసలనందుకొంటోంది. సర్దార్ గబ్బర్‌సింగ్, స్పైడర్, బ్రహ్మోత్సవం, సర్కారువారి పాట, భాగమతి వంటి 25కు పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘అహ నా పెళ్లంట’ అనే ఓ మ్యూజికల్ ఆల్బమ్‌ను కూడా సొంతంగా రూపొందించింది. ఎన్సీసీలోనూ సత్తా చాటుకుంటోంది. ‘సినిమాలో నటించడం అభిరుచి మాత్రమే. డాక్టర్ కావాలనేదే నా ఆశయం’ అంటోంది అక్షర. నగరానికి చెందిన కపిల్, చాణక్య, విశ్వతేజ అనే బాలురు ‘అచీవర్’ అనే ఓ బాలల చిత్రంలో నటించారు. ఇటీవల కాలంలో విడుదలవుతున్న సినిమాల్లో పిల్లలకు నచ్చే ఎలాంటి ఇతివృత్తాలు లేకపోవడంతో దర్శకుడు తల్లాడ సాయికృష్ణ ఈ సినిమాను రూపొందించారు. చదువుకొనే వయసులోనే సామాజిక సేవను కూడా ఒక అభిరుచిగా, బాధ్యతగా భావించే ముగ్గురు పిల్లలు ప్రశాంతమైన హైదరాబాద్‌లో ఓ ఉగ్రవాద ముఠా బాంబు పేలుడుకు చేసిన కుట్రను అడ్డుకుంటారు. ఉగ్రవాదులు స్కూల్లో, ఆలయంలో, మార్కెట్లో పేల్చేందుకు సిద్ధం చేసిన బాంబులను తమకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరీ్వర్యం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. బాలల చిత్రాల పోటీల కోసం పంపించనున్నట్లు సాయికృష్ణ తెలిపారు. ఫుట్‌బాల్‌తో ‘స్నేహం’ షేక్‌పేట్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న పొన్నాపల్లి స్నేహ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా రాణిస్తోంది. ఐసీఎస్ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన ఈ చిన్నారి జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సంగీతంలోనూ ప్రావీణ్యం సంపాదించింది. ‘నాన్న సారథి టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ‘ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఇష్టాన్ని గమనించిన అమ్మా, నాన్న నన్ను ప్రోత్సహించారు. అక్క శ్వేత బాగా పాడుతోంది. నేను మాత్రం ఫుట్‌బాల్ ఆటలోనే మరిన్ని విజయాలను సాధించాలని నిర్ణయించుకున్నాను’ అని వివరించింది స్నేహ. -
అందమైన బాల్యం ..వెట్టిచాకిరీలో
సాక్షి, హైదరాబాద్: మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే .. అవి తమకే’ అని మురిసిపోయేదే బాల్యం. గతించిన అందమైన బాల్యం మళ్లీ తిరిగొస్తే బావుండు అని అనుకోని వారెవరైనా ఉంటారా అందుకే నా సర్వస్వం నీకిచ్చేస్తా... నా బాల్యం నాకు ఇచ్చెయ్యరూ' అన్నారు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత డా. సి నారాయణరెడ్డి కానీ ప్రస్తుత సమాజంలో బాల్యం ఎందరికో భారం. పురిటి కళ్లు తెరవక ముందే ముళ్ళ పొదల్లో బావురుమంటోంది. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్బంగా స్పెషల్ వీడియో. -
మోదీజీ.. మా విముక్తి కోసం...సర్జికల్ స్ట్రైక్స్ చేయండి!
ప్రధానిని కోరనున్న బాలలు కోల్‌కతా: ఉగ్రవాదుల పనిపట్టేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్‌తో జాతి గర్వపడేలా చేసిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత నల్ల కుబేరుల ఆటకట్టించేందుకు పెద్దనోట్లను రద్దు చేసి మరోసారి ప్రశంసలందుకున్నారు. దీంతో తమ గోడును ఏకంగా ప్రధానికే వినిపించాలని, అదే తరహా సర్జికల్ స్ట్రైక్స్‌తో తమకు విముక్తి కల్పించాలని కోరుతూ బాలలు మోదీని కలవనున్నారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీన కొంతమంది పిల్లలు ప్రధానిని కలుస్తారని, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూళన కోసం సర్జికల్ స్ట్రైక్స్ జరపాలంటూ కోరతారని వైశాక్షి విశ్వాస్ తెలిపారు. బాల్యవివాహాల వల్ల ఎంతోమంది పిల్లలు పదోతరగతి కూడా పూర్తి కాకుండానే బడి మానేస్తున్నారని, బాలకార్మికులుగా ఎంతోమంది పిల్లల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘చైల్డ్ చాంపియన్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న ఆమె ఈ ఆదివారం పిల్లలతో కలిసి ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.