'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్నారు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో బాలకృష్ణతో వెంకటేష్ ఒక వేదికపై మెరిశారు. సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్న వెంకీ తన జీవితంలో బాగా డిస్ట్రబ్ అయిన సమయంలో 'అరుణాచలం' ఆలయాన్ని సందర్శించాక ఏం జరిగిందో పంచుకున్నారు.
అరుణాచలం ఆలయం సందర్శించిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్ ఇలా పంచుకున్నారు. 'ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను. ఈ క్రమంలో చాలామందిని కలిశాను. ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్ట్రబ్ అయ్యాను కూడా. ఫైనల్లీ అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్ ఎనర్జీ ఎంటో అక్కడే తెలుస్తోంది.
నేను అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నున్ను డిస్ట్రబ్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే. ఎక్కడ దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలానే నేను అన్నది మర్చిపోయి , ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము ' అని ఆయన భక్తితో ఎమోషనల్‌గా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అరుణాచలం గుడి గురించి ఈ విషయం తెలుసా..?
తమిళనాడులో తిరువణ్ణామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన అరుణాచలేశ్వరాలయం ఉంటుంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్లు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు... ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు. పంచ భూత పవిత్ర స్థలాల్లో ఒకటిగానూ ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగానూ పేరుంది. అరుణాచలంలో పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు వెళ్తారు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడకు భక్తులు భారీగా చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment