
పొంగల్ బ్లాక్‌బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఓటీటీలో కంటే ముందుగా టీవీ ఛానల్‌లో రిలీజ్ కానుంది. అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అంటూ ఊరించిన జీ తెలుగు ఫైనల్‌గా టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను వెల్లడించింది. మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానల్‌లో సంక్రాంతికి వస్తున్నాం ప్రసారం కానున్నట్లు ప్రకటించింది.

థియేటర్‌లో రిలీజైన ఏ సినిమా అయినా ముందుగా ఓటీటీ (OTT)లోకి వచ్చేది. నాలుగైదువారాల్లో ఓటీటీలోకి రావడం ఆ తర్వాతే టీవీలోకి రావడం జరిగేది. కానీ తొలిసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ పద్ధతికి చెక్ పెట్టింది. ఓటీటీని కాదని ఏకంగా టీవీలో ముందుగా ప్రసారమవుతూ కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశేషాలు
విక్టరీ వెంకటేశ్ హీరోగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. సినిమాలో బుల్లిరాజు కామెడీకి జనాలు కడుపుబ్బా నవ్వుకున్నారు. జనాల ఆదరణతో ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలపై కాసుల వర్షం కురిపించింది. 2027లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది.
The blockbuster date of #SankranthikiVasthunnam is 𝐌𝐀𝐑𝐂𝐇 𝟏𝐬𝐭 💥🔥
StayTuned to #ZeeTelugu 💥#SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam #FirstTVloVasthunnam #SVonTV #SankrathikiVasthunnamFirstOnTV@VenkyMama @anilravipudi… pic.twitter.com/LUa1F3tkbu— ZEE TELUGU (@ZeeTVTelugu) February 22, 2025
చదవండి: లుక్స్‌తోనే భయపెట్టిన తమన్నా.. ఉత్కంఠంగా ‘ఓదెల 2’ టీజర్
Comments
Please login to add a commentAdd a comment