మాజీ ప్రేయసితో పాట | venkatesh sankranthiki vasthunam song shooting at dehradun mussoorie rishikesh: tollywood | Sakshi
Sakshi News home page

మాజీ ప్రేయసితో పాట

Published Mon, Nov 25 2024 3:35 AM | Last Updated on Mon, Nov 25 2024 3:35 AM

venkatesh sankranthiki vasthunam song shooting at dehradun mussoorie rishikesh: tollywood

హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్‌ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.

ఈ చిత్రంలో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్‌ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement