song Shooting
-
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ఆస్ట్రేలియాలో ఆటా పాటా
ఆస్ట్రేలియా వెళ్లింది ‘రాబిన్‌హుడ్’ టీమ్. ‘భీష్మ’ (2020) వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్–దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. నితిన్, శ్రీలీల కాంబినేషన్లో ఓ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.మెల్బోర్న్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్‌తో పాటు కొంత టాకీపార్టు చిత్రీకరణ కూడా ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. -
థాయ్‌లాండ్‌లో పాట
హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ థాయ్‌లాండ్‌లో చిందేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై అక్కడ ఓ పాటని చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ మూవీ ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్‌ని థాయ్‌లాండ్‌లో ప్లాన్ చేశారు కొరటాల శివ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై ఓ సాంగ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్, ఈ నెల 16న ముంబై నుంచి జాన్వీ కపూర్ థాయ్‌లాండ్‌కి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ‘పఠాన్, వార్, ఫైటర్’ వంటి చిత్రాల్లో మంచి స్టెప్స్‌ను కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకి నృత్యరీతులు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు బాస్కో మార్టిస్. హై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరు«ద్. -
జలపాతం వద్ద షూటింగ్ సందడి
నేరడిగొండ(బోథ్): రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద “నీలి నీలి’ అనే పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణకు హీరో నవికేత్, హీరోయిన్ నికితలు హాజరయ్యారు. డైరెక్టర్ బాబీ మాస్టర్, ఎంఎంపీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ చిత్రీకరణ జరిగింది. త్వరలోనే ఇక్కడ సినిమా షూటింగ్ నిర్వహించనున్నట్లు సినిమా బృందం సభ్యులు తెలిపారు. కుంటాల జలపాతంలో ఈ పాట చిత్రీకరణ బాగుంటుందన్నారు. -
వైకుంఠపురములో బుట్టబొమ్మ
‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూ కుంటివే’ అని పాడుతున్నారు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘అల..వైకుంఠపురములో...’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ అనే పాటను అల్లు అర్జున్ , పూజలపై చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ పాట కోసం రంగు రంగల పూలను భారీగా వినియోగిస్తున్నారట. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అర్మాన్మాలిక్ పాడారు. ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. -
ఖుషీ ఖుషీ స్టెప్స్
హైదరాబాద్‌లో స్టెప్స్ వేస్తున్నారు అఖిల్. తనతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా కాలు కదుపుతున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నది సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే పాట అని తెలిసింది. పూజాతో కలసి ఖుషీ ఖుషీగా స్టెప్స్ వేస్తున్నారట అఖిల్. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం దర్శకుడు. -
చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా
షారుక్ ఖాన్ ‘దిల్ సే’లో ‘చయ్య చయ్య చయ్య చల్ చయ్య చయ్య..’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ట్రైన్ సాంగ్స్‌లో ఓ బెస్ట్ సాంగ్‌గా ఆ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పరిగెడుతూనే ఉంది. ఈ పాటకు షారుక్‌తో కలసి బాలీవుడ్ భామ మలైకా అరోరా స్టెప్పులేశారు. ఇటీవలే ఈ సూపర్‌హిట్ సాంగ్ మేకింగ్ వెనక జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను షేర్ చేసుకున్నారు. ‘‘కదిలే ట్రైన్ మీద నిలబడి ఈ పాటకు డ్యాన్స్ చేస్తుంటాను. అది అందరికీ తెలిసిందే. ట్రైన్ కదలికలకు ఒక్కోసారి కిందపడిపోయేదాన్ని. దాంతో మా టీమ్ నేను వేసుకున్న గాగ్రా మీదగా నా నడుము చుట్టూ ఓ తాడుతో నన్ను ట్రైన్‌కి కట్టేశారు. అలా అయితే నేను కిందపడను కదా. తాడు కట్టాక చిత్రీకరణ సవ్యంగా జరిగింది. కానీ పాట పూర్తయ్యాక ఆ తాడు తీసేసినప్పుడు నా నడుము మొత్తం గీసుకుపోయి రక్తంతో నిండిపోయింది. దాంతో సెట్లో అందరూ కంగారుపడిపోయారు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు మలైకా అరోరా. స్క్రీన్ మీద కనువిందు చేయడానికి స్క్రీన్ వెనక స్టార్స్ ఇలాంటి కష్టాలు పడుతుంటారు. -
పాట కోసం రక్తం చిందించాను
‘ఛయ్యా ఛయ్యా’ పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి మలైకా అరోరా. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్ బాలీవుడ్లో రాకెట్లా దూసుకెళ్లిపోయింది. అయితే ఈ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మలైకా. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ‘పాట మొత్తం కదులుతున్న రైలు పైనే చిత్రీకరించారు. గాలి బలంగా వీస్తుండటంతో నేను చాలా సార్లు పట్టుతప్పి పడిపోయాను. దాంతో నేను పడిపోకుండా ఉండటానికి నేను ధరించిన గాగ్రాకి తాడు కట్టి, రైలుకు కట్టేశారు. ఆ తాడు కట్టుకునే డ్యాన్స్ చేశాను. పాట షూటింగ్ అయిపోయాక తాడు విప్పుతుంటే నడుమంతా రక్తమోడుతోంది. తాడు కట్టడం వల్ల రాసుకుపోయి ఇలా జరిగింది. దాంతో సెట్లో ఉన్న వారంతా కంగారుపడిపోయారు’ అని తెలిపారు మలైకా. మణిరత్నం దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘దిల్ సే’ చిత్రంలోని ఈ పాటకు ఫరాఖాన్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో ఫరాఖాన్‌కు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఇప్పటికీ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. -
దిమాక్ ఖరాబ్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పూరిజగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. ‘దిమాక్ ఖరాబ్...’ అనే సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్ వేశారు. మణిశర్మ స్వరకర్త. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సాకేత్, కీర్తన పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలంగాణయాసలో ఉండే ఈ సాంగ్‌లో రామ్ వేసే డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా విధంగా ఉంటాయట. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
దిమాక్ ఖరాబ్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పూరిజగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. ‘దిమాక్ ఖరాబ్...’ అనే సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్ వేశారు. మణిశర్మ స్వరకర్త. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సాకేత్, కీర్తన పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలంగాణయాసలో ఉండే ఈ సాంగ్‌లో రామ్ వేసే డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా విధంగా ఉంటాయట. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వెయ్యి మంది డాన్సర్లతో ‘సైరా’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఓ పాటను భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణలో దాదాపు వెయ్యి మంది డాన్సర్లు, మరో వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ సెట్లో పాట చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ పాటలో చిరుతో పాటు తమన్నా, నయనతార ఇతర నటీనటులు పాల్గొననున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. -
దర్శకుడైన హీరో విక్రమ్!
హీరో విక్రమ్ ఇప్పుడు దర్శకుడి అవతారమెత్తారు. అదేంటి? శుభ్రంగా హీరోగా చేస్తున్నవాడు... ఇలా దర్శకుడయ్యాడేమిటని నివ్వెరపోకండి! ఆ మధ్య చెన్నై నగరాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తి, జనజీవ నాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. జనం కృతనిశ్చయంతో ఆ కష్టాలను అధిగమించారు. చెన్నై నగర వాసుల్లోని స్ఫూర్తిదాయకమైన ఈ సానుకూల అంశాన్ని ప్రతిఫలిస్తూ, విక్రమ్ ఇప్పుడో పాటను వీడియోగా చిత్రీకరిస్తున్నారు. అలా ఈ హీరో తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తారు. ‘ది స్పిరిట్ ఆఫ్ చెన్నై’ (చెన్నై నగర స్ఫూర్తి) అనే ఈ పాట చిత్రీకరణ కూడా సహజంగానే చెన్నై నగరంలోనే చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా వచ్చి ఇందులో నటించారు. ప్రముఖ రచయిత మదన్ కార్కీ (‘బాహుబలి’లో కిల్కి భాష సృష్టికర్త), రాకేశ్, గానా బాల ఈ పాట రాశారు. 20 మందికి పైగా పాడారు. తమిళ హీరో సూర్య, మలయాళ నటుడు నివిన్ పాలీ, కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్, ఇంకా శివకార్తికే యన్, ప్రభుదేవా, ‘జయం’ రవి, జీవా, భరత్, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు వీడియోలో నటించారు. మొత్తానికి, కొన్నేళ్ళ క్రితం మణిరత్నం ‘రావణ్’లో కలసి నటించినప్పటి నుంచి స్నేహితులైన విక్రమ్, అభిషేక్‌లు ఇంతకాలానికి మళ్ళీ కలసి కెమేరా ముందుకు రావడం విశేషమే. -
సాగర తీరంలో బాలయ్య సరాగాలు
సింహా, శ్రీరామరాజ్యం తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవనే చెప్పాలి. బాలయ్య సినిమాకు అన్నీ కుదిరితే.. ఆ సక్సెస్ ప్రభావం బాక్సాఫీస్‌పై చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకు ఆయన గత విజయాలే నిదర్శనాలు. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ‘లెజెండ్’ సినిమా కథ... బాలయ్య అభిమానులు పండగ చేసుకునే రీతిలో చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. మొన్నటివరకూ సాగరతీరంలో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం బాలయ్య, కథానాయిక రాధికా ఆప్టేపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఈ నెల 21 దాకా ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 3 వరకూ జరిగే చిత్రీకరణతో ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. జనవరిలో బాలకృష్ణ, చిత్ర కథానాయికలతో పాటు ఓ గెస్ట్ కథానాయికపై చిత్రీకరించే పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని యూనిట్ వర్గాల భోగట్టా. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.