థాయ్‌లాండ్‌లో పాట | NTR and Janhvi Kapoor Romantic Song Shooting in Thailand | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో పాట

Published Mon, Jun 24 2024 6:11 AM | Last Updated on Mon, Jun 24 2024 6:11 AM

NTR and Janhvi Kapoor Romantic Song Shooting in Thailand

హీరో ఎన్టీఆర్, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ థాయ్‌లాండ్‌లో చిందేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై అక్కడ ఓ పాటని చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. ‘జనతా గ్యారేజ్‌’(2016) వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ మూవీ ద్వారా జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 ‘దేవర’ కీలక షెడ్యూల్‌ని థాయ్‌లాండ్‌లో ప్లాన్‌ చేశారు కొరటాల శివ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై ఓ సాంగ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ఈ నెల 17న హైదరాబాద్‌ నుంచి ఎన్టీఆర్, ఈ నెల 16న ముంబై నుంచి జాన్వీ కపూర్‌ థాయ్‌లాండ్‌కి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరిపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.

 ‘పఠాన్, వార్, ఫైటర్‌’ వంటి చిత్రాల్లో మంచి స్టెప్స్‌ను కంపోజ్‌ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ ఈ పాటకి నృత్యరీతులు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు బాస్కో మార్టిస్‌.  హై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరు«ద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement