devara
-
ఫ్యావరేట్ టైం:బోయ్ ఫ్రెండ్‌తో దేవర బ్యూటీ ఫెస్టివ్ మూడ్ (ఫొటోలు)
-
ఇకపై తెరపై దావూదీ...
దేవర... వర... ‘దేవర’ చిత్రంలో ఈ రెండుపాత్రల్లో అభిమానులకు రెండింతల ఆనందాన్నిచ్చారు ఎన్టీఆర్. అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేని విధంగా డైలాగ్స్ పలికారు. ఫైట్స్‌లో విజృంభించారు... సాంగ్స్‌లో స్టెప్స్ అదరగొట్టారు... ఎమోషనల్ సీన్స్‌లో మనసును తాకారు. ఇలా మొత్తం మీద ఎన్టీఆర్ మరోసారి నటుడిగా విజృంభించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృçష్ణ .కె నిర్మించిన ‘దేవర’ మంచి వసూళ్లు సాధిస్తూ, దూసుకెళుతోంది. దాంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ విశేషాల్లోకి...‘దేవర’ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందు ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే గురువారం ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ జరగాల్సి ఉండగా దేవీ నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్మీట్కు అనుమతి లభించలేకపోవడంతో కుదరలేదు. ఇక హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ సెలబ్రేషన్స్‌లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, నాగవంశీ వంటివారితోపాటు పలువురు పంపిణీదారులుపాల్గొన్నారు. ఆరేళ్లకు సోలోగా... ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోని సిల్వర్ స్క్రీన్‌పై సోలో హీరోగా చూసింది ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018) తర్వాత ‘దేవర’లోనే. ఈ గ్యాప్‌లో ‘ఆర్ఆర్ఆర్’తో తెరపై కనిపించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ మరో హీరో అని తెలిసిందే. ఇక ఆరేళ్లకు ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం కావడం, దేవర–వరగా రెండుపాత్రల్లో ఎన్టీఆర్ కనిపించడం ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అయింది. 7 రోజులకు రూ. 400 కోట్లు ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు.. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా...’, ‘దేవర అడిగినాడంటే... సెప్పినాడని అదే సెప్పినాడంటే...’ అంటూ విడుదలైన డైలాగ్స్, ‘చుట్టమల్లె...’పాట, దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకి తెలుగులో తొలి చిత్రం వంటివన్నీ ‘దేవర’ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను ‘దేవర’ చేరుకున్నాడని చెప్పడానికి వసూళ్లు నిదర్శనం. విడుదలైన ఏడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక పండగ సెలవులు మొదలయ్యాయి కాబట్టి వసూళ్ల దూకుడు ఆగదని ఊహించవచ్చు. దసరా సెలవులు... ‘దేవర’ దూకుడు దసరా పండగ సెలవులు మొదలయ్యాయి. సెలవులు,పోటీలో మరో భారీ చిత్రం లేకపోవడం ‘దేవర’కి కలిసొచ్చే విషయం. ఇంకో వారం దాకా వసూళ్ల దూకుడు ఆగదనే అంచనాలు ఉన్నాయి. పైగా అభిమానులను ఖుషీ చేసేలా శుక్రవారం నుంచి ‘దావూదీ...’పాటను కూడా జోడించారు. ‘దేవర’ విడుదలకు కొన్ని రోజులు ముందు విడుదలైన ఈపాటకు మంచి స్పందన లభించింది. కానీ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే శుక్రవారం నుంచి అన్ని థియేటర్లలో ఈపాట కనిపిస్తోంది. ‘దేవర 2’ ఎప్పుడంటే... ‘దేవర 2’ షూట్‌ను వచ్చే ఏడాది చివర్లో ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. 2026లో ‘దేవర 2’ విడుదలయ్యే చాన్స్ ఉందట. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తారు ఎన్టీఆర్. అలాగే హిందీలో ‘వార్ 2’ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్‌తో చేసే చిత్రం 2026 జనవరిలో విడుదల కానుంది. ఒకవేళ ‘దేవర 2’ కూడా 2026లోనే విడుదలైతే అప్పుడు ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించినట్లు అవుతుంది. అదే జరిగితే 2016 (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) తర్వాత... పదేళ్లకు ఒకే ఏడాది ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించేది 2026లోనే అవుతుంది. -
దేవర మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
Janhvi Kapoor: దేవర మూవీలో జాన్వీ అందాలు నెక్స్ట్ లెవల్ (ఫోటోలు)
-
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆ భయాన్ని గౌరవించాలి: దర్శకుడు కొరటాల శివ
‘‘మనిషికి ధైర్యం అవసరమే కానీ మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాగే మనకు తెలియకుండానే మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. భయమే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. ఈ విషయాన్నే ‘దేవర’లో గట్టిగా చెప్పాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం తొలిభాగం ‘దేవర:పార్టు 1’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కొరటాల శివ చెప్పిన విశేషాలు..⇒ ‘దేవర’ కథను చెప్పినప్పుడు ఎన్టీఆర్‌గారు స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తీగా కల్పిత కథ. ‘దేవర’ కథను ఎన్టీఆర్గారితోనే అనుకున్నా. ఈ సినిమాలోని దేవరపాత్రకు మరొకర్ని అనుకున్నాననే వార్తల్లో నిజం లేదు (ఈ చిత్రంలోని తండ్రీకొడుకులు ‘దేవర’, ‘వర’పాత్రలను ఎన్టీఆర్ చేశారు). చెప్పాలంటే... దేవరపాత్రను మించి వరపాత్ర ఉంటుంది. మాస్ హీరోగా ఎన్టీఆర్‌గారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే ‘దేవర’ కథ రాశాను. ఇక అల్లు అర్జున్‌గారితో నేను అనుకున్న కథ వేరు. ‘దేవర’కు ఆ కథకు ఏమాత్రం సంబంధం లేదు. ⇒పాన్ ఇండియా అనేది నాకు తెలియదు. కానీ ‘దేవర’ పెద్ద కథ. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో మూడు గంటల్లో ‘దేవర’ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాం. ఇదేదో వ్యాపారం కోసమో లేక సంచ లనం కోసమో చేసింది కాదు. ఒక భాగంలో కథ చెప్పలేనప్పుడు రెండు భాగాల్లో చెప్పాలి. అయితే ‘దేవర 3, దేవర 4’ అంటూ ఏమీ లేవు. ⇒ మనిషిలో భయం ఉండాలని ‘దేవర’ సినిమాతో చెప్పాలనుకున్నా. కానీ ఈ భయాన్ని నేను జాన్వీ కపూర్‌లో చూశాను. తన డైలాగ్ పేపర్స్‌ను వారం రోజుల ముందే కావాలని అడిగి మరీ జాన్వీ సాధన చేసేది. తొలి రోజు సెట్స్‌లో జాన్వీ కపూర్ అడుగుపెట్టి డైలాగ్స్ చెప్పగానే ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ అన్నారు. ⇒ఓ సినిమాను ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేసే విషయాల్లో రాజమౌళిగారిలా నాకు మంచి ప్రావీణ్యం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను నిర్మాతలకే వదిలేస్తాను. దర్శకుడిగా నా పనికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరం. టీమ్ అంతా వారి స్పీచ్‌ల స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. చిరంజీవిగారితో నా అనుబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. మేం చేసిన ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘యూ విల్ బౌన్స్ బ్యాక్ శివ’ అని నాకు మెసేజ్ పంపిన తొలి వ్యక్తి చిరంజీవిగారు. అయితే ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలకు మరో అర్థం వచ్చేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్ష బాగా రాయాలనుకుంటాం.ఇదీ అంతే. ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న (2022) విడుదలైంది. వెంటనే మే 19న (2022) ‘దేవర’ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయాలని ఆ పనిలో పడిపోయాను. అయితే ‘దేవర’ షూటింగ్ సముద్రంపై చేయాలి. ఇందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచించుకుని, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లడానికి నాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.సోషల్ మీడియా మాధ్యమం నుంచి నేను బయటకు వచ్చాను. మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లేకపోతే మనం జీవించలేమా? అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. నెగిటివిటీ ఉండొచ్చు... కానీ ద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది మంచిది కాదు. -
భయం అంటే ఏంటో తెలియాలి అంటే దేవర చూడాలా..!
-
ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చాలా బాధాకరం...
-
#Devara : ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ HD (ఫొటోలు)
-
'దేవర' కోసం జాన్వీ ఇలా ముస్తాబు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు (ఫొటోలు)
-
మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్.. కారణం ఇదే!
‘దేవర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు. సో... ఇక తదుపరి చిత్రం షూటింగ్‌తో బిజీ అవుతారనుకోవచ్చు. అయితే ఓ మూడు నెలల తర్వాతే నెక్ట్స్ మూవీ షూట్లో పాల్గొంటారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 21న ఆరంభమవుతుంది. (చదవండి: శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు)అయితే అప్పుడు ఎన్టీఆర్ పాల్గొనరట. ఈ హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారు. 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనరు. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఈ మూడు నెలల సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తారట. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఇదేనా?సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఫుల్ ఫోకస్ ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టేశాడు. కేజీయఫ్, సలార్ మాదిరే ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాగే సలార్ పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ రెండు చిత్రాల మాదిరే ఎన్టీఆర్ మూవీ కూడా కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. -
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
ఏపీలో 'దేవర' అదనపు షోలకు అనుమతి.. టికెట్ ధరలు ఇలా
జనతా గ్యారేజ్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్)దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కడంతో భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. దీంతో సినిమా టికెట్ ధరలతో పాటు స్పెషల్ షోల విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం సంప్రదించింది. దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్ ధరకు అధనంగా ఎంతమేరకు పెంచుకునే వెసులుబాటు ఉందో చెబుతూ ఒక జీవోను రిలీజ్ చేసింది.టికెట్ల రేట్లు ఇలా..'దేవర' విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ మొదటి తరగతి టికెట్స్‌కు రూ. 110, దిగువ తరగతి రూ.60 వరకు పెంచింది. మల్టీప్లెక్స్‌లలో అయితే రూ. 135 చొప్పున పెంచింది. జీఎస్టీతో కలుపుకొనే ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్‌లో దేవర టికెట్ ధర రూ. 225 ఉంటే మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. దేవర ఆయుధ పూజ సాంగ్ లీక్..
-
Devara Movie: సానా పెద్ద కథ సామి అంటే ఇదా..!
-
దేవర ఔట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్?
-
నైజాం నుండే రికార్డ్స్ వేట మొదలుపెట్టనున్న దేవర..
-
దేవర రన్ టైం అడిగిన సందీప్ వంగకి కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్
-
Devara: రిలీజ్ కు ముందే రికార్డులు!
-
చివరి 40 నిమిషాలు అద్బుతమే
-
Janhvi Kapoor: చీరలో అదిరిపోయిన దేవర బ్యూటీ (ఫోటోలు)
-
తిమింగలంపై ఎన్టీఆర్ రైడ్ దేవర కోత.. యూట్యూబ్ మోత..
-
ఎన్టీఆర్ 'దేవర' HD మూవీ స్టిల్స్ (ఫోటోలు)
-
దేవర సాంగ్ మీద భారీ ట్రోలింగ్..
-
ఎన్టీఆర్ 'దేవర' మూవీ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్