‘దేవర’ చలో వైజాగ్‌ | Devara movie next schedule starts in Vizag | Sakshi
Sakshi News home page

‘దేవర’ చలో వైజాగ్‌

Published Mon, May 6 2024 1:57 AM | Last Updated on Mon, May 6 2024 4:48 AM

Devara movie next schedule starts in Vizag

వైజాగ్‌ వెళ్లనున్నారట ‘దేవర’ టీమ్‌. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. జాన్వీకపూర్‌ హీరోయి న్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్‌ అలీఖా న్ , టామ్‌ షైన్‌ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ వైజాగ్‌లో ్రపారంభం కానుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అయితే ఈ షెడ్యూల్‌లో తొలుత ఎన్టీఆర్‌ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తారట మేకర్స్‌.

 ప్రస్తుతం ముంబైలో హిందీ చిత్రం ‘వార్‌ 2’తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఆ సినిమా తాజా షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ‘దేవర’ సెట్స్‌లో ఎన్టీఆర్‌ జాయి న్  అవుతారట. కల్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement